21, జూన్ 2023, బుధవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 97*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️




*పార్ట్ - 97*


♦️వర్ణాశ్రమధర్మములు అన్ని వర్ణములవారికీ అనుసరణీయములు. వాటిని తప్పక పాటించవలెను. 


♦️దండనీతిని స్వపర బేధములు లేకుండా కఠినముగా అమలుపరచవలెను. 


♦️ శతృరాజులు, పరదేశీయులు, స్వదేశమునందలి దేశద్రోహులు, విప్లవకారులు, ప్రభుత్వములను కూలద్రోయుటకు కుట్రలు పన్నువారు వీరిని 'భేదోపాయము' చేతనే లొంగదీసుకొనుట శ్రేయస్కరము. భేదోపాయము ఆచరించుటచేత యుద్ధముల వంటి రక్తపాతములు, జననష్టము నివారించవచ్చును. 


♦️భేదోపాయమును సక్రమముగా అమలుపరచుటకు సమర్థులైన గూఢచార వ్యవస్థను ఏర్పాటు చేసుకొనవలెను. 


♦️సన్మార్గుడైన ప్రభువుతో మిత్రత్వము పాటించి సంధి చేసుకొనవచ్చును సామంతునిగా అంగీకరించవచ్చును. 


♦️దుర్మార్గుడైన పొరుగురాజును ఏమాత్రం ఉపేక్షించరాదు. అట్టి ఉపేక్ష తన రాజ్యమునకు చేటు తెస్తుంది గనక - సామదాన భేద దండోపాయాల ద్వారా దుర్మార్గుడైన రాజును దండించి అక్కడ సన్మార్గుడినొక్కడిని తన ప్రతినిధిగా నియమించాలి. 


♦️చివరగా - రాజుకి ప్రజాసంక్షేమమే ముఖ్యము. ధర్మపరిరక్షణము కర్తవ్యం. కాన ధర్మస్థాపనార్థం రాజు లేక మహామంత్రి యే మార్గాన్ని అనుసరించినా దోషములేదు. తత్పలితము ధర్మపరిరక్షణమే గదా ...... !"


ఇలా చాణక్యుడు అనేక దినముల పాటు తన అర్థశాస్త్రముని కూలంకషముగా చంద్రగుప్తునికి బోధించాడు. అనంతరం...


"వత్సా ! పురాతన మనుధర్మశాస్త్రంలోని కొన్ని ప్రధాన సూత్రములను కాలానుగుతంగా నా అర్థశాస్త్రంలో ప్రస్తావించి అవసరమైన మార్పులు చేశాను. నేటి మార్పులు రేపటి కాలాన్ని బట్టి మరికొన్ని మార్పులకు దారితీయవచ్చు. మార్పు అభిలాషణీయం. అయితే ధర్మము అనునది న్యాయముపై ఆధారపడి ఉన్నది. న్యాయసమ్మతం కాని ధర్మము.... 'అది ఎంతటి ప్రాచీన ధర్మమైనా నా దృష్టిలో అధర్మమే...' ఎందుకంటే న్యాయసమ్మతం కాని, ఆచరణ యోగ్యం కాని ఏ ధర్మాన్నీ ప్రజలు ఆచరించరు. జనులు ఆచరించని ధర్మము వృధా... అంటే ధర్మం యొక్క మూలసూత్రము మారదు. ఏ రూపంలో ఆచరించినా ధర్మము ధర్మమే... అది నిరంకుశముగా నుండకుండా సర్వజనామోదముగా 'మూలసిద్ధాంతం మారకుండా ఆచరణా విధానాన్ని మార్చడమే' నా ఈ అర్థశాస్త్ర సిద్ధాంతము. అన్యాయమునకు గురియైన వానికి న్యాయం చేస్తే చాలదు. న్యాయమే జరిగిందన్న నమ్మకాన్ని కూడా కలిగించాలి. ఇదే నా అర్థశాస్త్ర సారాంశము...." అని వివరించాడు చాణక్యుడు. 


చంద్రగుప్తుడు శిరస్సు వంచి చేతులు జోడించి "కృతజ్ఞుడను ఆచార్యదేవా... అనితర సాధ్యమైన తమ అర్థశాస్త్రమును నాకు ఉపదేశించి నన్ను ధన్యుడిని చేశారు. రేపటినుంచే మీ అర్థశాస్త్రమును మౌర్య సామ్రాజ్యమంతటా అమలు చేయిస్తాను. సత్ఫలితాలు సాధిస్తాను. తమ అభీష్టాన్ని నెరవేరుస్తాను" అని చెప్పాడు శ్రద్ధాభక్తులతో. 


చాణక్యుడు మందహాసం చేసి "ఇప్పుడు మౌర్యసామ్రాజ్యం... మున్ముందు యావత్ భారతావని నీ పాలనలో, అర్థశాస్త్ర సత్ఫలితాలతో సర్వతోముఖాభివృద్ధి గాంచాలి. అదే ...... అదే ..... నా జీవితాశయం" అన్నాడు సాలోచనగా.

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్.* 


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఈ రోజు పద్యము

 197వ రోజు: (సౌమ్య వారము) 21-06-2023

మన మాతృ భాష సేవలో


ఈ రోజు పదము:

అక్క (Elder Sister):  అగ్రజ, అగ్రభువు, అత్తిక, అప్ప, అవంతి, పూర్వజ. 


 ఈ రోజు పద్యము:


తనపై దయ నూల్కొనఁగను 

గొప్ప నేతెంచినను శీల గురుమతులను వం 

దనముగఁ  బూజింపం దగు 

మన మలరగ నిదియ విబుధ మతము కుమారా!


 ఓ కుమారా!  తన మీద దయతో ప్రవర్తించే మంచి ప్రవర్తన కల వారికి నమస్కారము చేసి గౌరవించుట, అవతలి వారి మనస్సు సంతోష పడునట్లుగా నడచుకొనుటయే బుద్ధమంతులు చేయుపని.

రసీదు

 టోల్ ఫ్రీ రసీదు విలువను అర్థం చేసుకోండి మరియు ఉపయోగించండి.

  

టోల్ బూత్ వద్ద దొరికిన 

ఈ రసీదులో ఏమి దాచబడింది మరియు దానిని ఎందుకు భద్రంగా ఉంచాలి? దాని అదనపు ప్రయోజనాలు ఏమిటి?" 

ఈ రోజు తెలుసుకుందాం.


1. టోల్ రోడ్డులో ప్రయాణిస్తున్నప్పుడు 

మీ కారు అకస్మాత్తుగా చెడిపోతే, మీ కారును లాగడానికి టోల్ కంపెనీ బాధ్యత వహిస్తుంది.


2. ఎక్స్‌ప్రెస్ హైవేలో 

మీ కారులో పెట్రోల్ లేదా బ్యాటరీ అయిపోతే, 

మీ కారును భర్తీ చేయడం మరియు పెట్రోల్ మరియు బాహ్య ఛార్జింగ్‌ను అందించే బాధ్యత టోల్ వసూలు సంస్థపై ఉంటుంది. మీరు కాల్ చేయాలి పది 10 నిమిషాల్లో సహాయం అందుతుంది మరియు 5 నుండి 10 లీటర్ల పెట్రోల్ ఉచితంగా లభిస్తుంది. కారు పంక్చర్ అయినప్పటికీ, మీరు ఈ నంబర్‌ను సంప్రదించడం ద్వారా సహాయం పొందవచ్చు.


3. మీ కారు ప్రమాదంలో చిక్కుకున్నప్పటికీ, మీరు లేదా మీతో పాటు వచ్చే ఎవరైనా మొదటి టోల్ రసీదులో అందించిన ఫోన్ నంబర్‌ను సంప్రదించాలి.


4. కారులో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఎవరికైనా ఆరోగ్యం క్షీణిస్తే, ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో మీకు అంబులెన్స్‌ని తీసుకురావడం టోల్ కంపెనీల బాధ్యత.

  

ఈ సమాచారం పొందిన వారు వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయాలి.

కాకస్య దంతః

 

 కాకస్య దంతః 

పూర్వం ఒక గ్రామంలో వీధి అరుగుమీద ఇద్దరు పండితులు కూర్చొని ఒక విషయాన్ని గురినిచి తర్కించుకుంటున్నారట అదేమిటంటే " కాకస్య దాంతః" అంటే కాకికి దంతాలు వుంటాయని రామశర్మ అనే పండితుడు కాకికి దంతాలు ఉండవని కృష్ణ శర్మ అనే పండితుడు చాలా ఆవేశంతో తర్కిస్తున్నారు.  నారాయణ శర్మ అనే ఒక బ్రాహ్మడు అటువైపునుండి నడుచుకుంటూ  వెళుతున్నాడట. అది వారి కంట పడింది.  అప్పుడు ఆ పండితులు ఇద్దరు నారాయణ శర్మను ఆపి తమ తర్కమును విని సమాధానం చెప్పమన్నారు.  నారాయణ శర్మకు కంఠంలో వెలగకాయ పడ్డట్లు అయ్యింది.  ఎందుకంటె గ్రామంలో  రామ శర్మ, కృష్ణ శర్మ ఇద్దరు కూడా ఉద్దండ పండితులని వేద, మీమాంస, తర్క, న్యాయ, జ్యోతిషాది శాస్త్రాలు కూలంకుషంగా చదివిన దిట్టలని ప్రతితీ కాబట్టి సామాన్యుడైన నారాయణ శర్మ వారి తర్కం విని వారి తగువు తీర్చటం అంటే మాటలా.  అతని పని అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారయ్యింది.. 

కాకి కూడా ఘనాహారం అంటే పప్పులు, గింజలు మనుషులు తిన్నట్లే తింటుంది కాబట్టి కాకులకు తప్పకుండా దంతాలు ఉండి తీరాలిసిందే అని రామ శర్మ తన తర్కాన్ని చెపితే దానికి కృష్ణ శర్మ కాకికి వుండే ముక్కే చాలా చిన్నగా ఉంటుంది అందులో చిన్న నాలుక ఉంటుండి ఇక దంతాలు పెట్టె అంత నోరే లేనప్పుడు ఇక దంతాలు ఉండటానికి అవకాశం ఎక్కడ వున్నది.  నిజానికి కాకికి వున్న ముక్కుతోటె అంటే ఫై ముక్కు మరియు క్రింది ముక్కు మధ్యలో ఆహారాన్ని నమిలి తింటుంది అని కృష్ణ శర్మ వాదించాడు. ఇద్దరి వాదనలు విన్నతరువాట్ ఏమి మాట్లాడాలో   తెలియక తెల్లమొహం వేయవలసివచ్చింది నారాయణ  శర్మ. నిజానికి నారాయణ శర్మ వారిద్దరిలాగా పెద్దగా చదువుకొనక పోయినా కానీ చక్కటి యుక్తిపరుడు, ఎటువంటి సమస్యనయినా సాధించగల సాధకుడు. కొంచం ముందు బెరుకుగా ఉన్నకాని వారిద్దరికీ తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. 

పండితులారా పితృకార్యాలలో కాకులకు అదే వికిర పిండం ఎందుకు పెడతారో ముందు చెప్పండి అప్పుడు మీ సందేహాన్ని నివృత్తి చేయగలను అని వారి మనస్సును ప్రక్కత్రోవ పట్టించే ప్రయత్నం  చేసాడు. అతని ప్రయత్నం కొంత ఫలిచిందనే చెప్పవచ్చు.  కొన్ని సందర్భాలలో బాగా చదువుకున్నాం అనుకునే మేధావులు కూడా కొన్ని చిన్న చిన్న విషయాలు తెలుసుకొని వుండరు. ఇప్పుడు ఆ పండితుల ఇద్దరి పరిస్థితి అట్లానే అయ్యింది. పేలబోయిన వారి ముఖములను కనిపించకుండా తెలివిగా ఇద్దరు మేము అడిగినదానికి నీవు అడిగిన దానికి సంబంధం ఏమిలేదు ముందుగా మా సందేహం తీర్చమని నారాయణ శర్మ ను వత్తిడి చేశారు. 

నారాయణ శర్మ కూడా ఏమి తక్కువ తినలేదు పండితులారా వికిర పిండం తినాలంటే కాకి ఎలా తినాలి.  అందుకే నేను ఆ ప్రశ్నను వేసాను అని అన్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు పండితులు కొంత వెనుకకు తగ్గవలసి వచ్చింది..  మాట మారుస్తూ వాళ్ళు ఇంతకూ నారాయణ శర్మ ఎందుకు ఇటువైపు వచ్చావు అని అన్నారు. అంటే మా గొడవ ఏదో మేము పడేవారం కదా మధ్యలో నీ వల్ల మేమిద్దరం తెలివిలేని వారిగా బయటపడవలసి వస్తున్నదే అన్నట్లుగా వున్నది వారి మాట. 

నారాయణ శర్మ వారిద్దరిని ఉద్దేశించి పండితులారా మనం ఎన్నో లక్షల జన్మలనుంచి తపిస్తూవుంటే ఆ ఈశ్వరుడు మనకు ఈ జన్మను  ప్రసాదించారు. ఎంతో జ్ఞ్యానం కలిగి వున్నాము ఇప్పుడైనా మనం కళ్ళు తెరువక ఇంకా శుష్క వాదనలతోటి కాలయాపన చేస్తే మన జన్మకు అర్ధం ఏముంది మనకు శంకర భగవతపాదులవారు చక్కగా భజగోవిందాన్ని బోధించారు.  కాబట్టి కాలాన్ని వృధాచేయకుండా చక్కగా పరమేశ్వరుని చేరే మార్గం ఎంచుకోవాలి అని అంటే వారిద్దరికీ కనువిప్పు అయ్యింది. 

నాటి నుండి రామ శర్మ కృష్ణ శర్మ శుష్క సంభాషణలు చేయకుండా చక్కగా సాధన చేతుష్టయాన్ని అవలంబీనించి ముముక్షుకత్వం వైపు పయనించారు. 

కాబట్టి భార్గవశర్మ చెప్పేది ఏమిటంటే ఓ సాధక మిత్రమా మనకు సమయం తక్కువగా వున్నది మోక్షపదం చాలా దూరంగా వున్నది ఈ క్షణం నుంచే మనం సాధన మొదలుపెడితే కానీ మోక్షాన్ని పొందలేము.  తస్మాత్ జాగ్రత్త 

 ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

మీ భార్గవశర్మ

 










భజగోవిందం

 ॐ                 भज गोविन्दं

                    భజగోవిందం 

                 (మోహముద్గరః) 

            BHAJA GOVNDAM   

 

      (श्रीमच्छंकरभगवतः कृतौ 

       శ్రీమచ్ఛంకరభగవత్పాద కృతం 

           BY SRI ADI SANKARA)


                           శ్లోకం :29/31

                   SLOKAM :29/31

                  

ఆదిశంకరుల ఆశీర్వచన మాలిక - 2   


अर्थंमनर्थम् भावय नित्यं,

नास्ति ततः सुखलेशः सत्यम्।

पुत्रादपि धनभजाम् भीतिः,

सर्वत्रैषा विहिता रीतिः॥२९॥

                    ॥भज गोविन्दं॥ 


అర్థమనర్థం భావయ నిత్యం

నాస్తితతః సుఖలేశః సత్యం |

పుత్రాదపి ధన భాజాం భీతి:

సర్వత్రైషా విహితా రీతి: ||29||  

                    ॥భజ గోవిందం॥ 


    డబ్బు దుఃఖాన్ని ఇస్తుందని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. 

    దాని వల్ల కొంచం సుఖం కూడా లేదు అనే మాట సత్యం. 

    ధనవంతునికి తన కుమారుని వల్ల కూడా భయమే. 

    అన్ని చోట్ల డబ్బు యొక్క పద్ధతి ఇంతే. 


అనువాదం 


ధనము గూర్చదు సుఖము, 

               దుఃఖమే మిగులు తుది, 

ధనమూల మిదం జగత్తని ధన 

                      మమితముగ 

గూర్చుకొన, నిజ సంతతియు 

              భయ హేతువగును 

వివర మెరిగి విడువుము 

                   పేరాశ ధనముపై 


    धन अकल्याणकारी है और इससे जरा सा भी सुख नहीं मिल सकता है, 

    ऐसा विचार प्रतिदिन करना चाहिए | 

    धनवान व्यक्ति तो अपने पुत्रों से भी डरते हैं ऐसा सबको पता ही है॥२९॥  


    Keep on thinking that money is cause of all troubles, 

    it cannot give even a bit of happiness. 

    A rich man fears even his own son. 

    This is the law of riches everywhere. 


https://youtu.be/ImWKhB_PMiw 


                          కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

            భద్రాచలం

శ్రీనాధ కవితా వైభవం

 ---శ్రీనాధ కవితా వైభవం!--


శా: " కుక్షి ప్రోద్భవ నిష్ఠుర క్షుధిత దు ష్క్రోధాంధకారంబు నన్ ,

జక్షుల్ రెండును జిమ్మచీఁకటులుగా , సంరంభ శుంభద్గతిన్ ,

బ్రేక్ష ఛ్ఛాత్రులు భీతిఁబొందఁ , గడు నుద్రేకించి ,హట్టంబునన్ ,

బిక్షాపాత్రము రాతిమీఁద శతధా భిన్నంబుఁగా వైచితిన్ .

శ్రీ భీమేశ్వర పురాణము - 2 ఆ: 102 వ పద్యము. కవిసార్వభౌమ శ్రీనాధుడు.


కఠిన పదములకు అర్ధము: కుక్షిప్రోధ్భవ- పొట్టనుం డిపుట్టిన ;నిష్ఠుర: కఠినముగా; క్షుధిత: ఆకలిపీడగలిగిన; దు ష్క్క్రోధ :చెడ్డదియైనకోపమనే

; అంధకారంబునన్: చీకటిచేత ; చక్షుల్ రెండును- రెండుకన్నులును : చిమ్మచీకటులుగా- గాఢాంధకారముకాగా ; సంరంభ-తొందరపాటు చే నేర్పడిన; శుంభద్గతిన్- వేగముతో ; ప్రేక్షత్ -చూచుచున్న ;ఛాత్రులు- శిష్యులు ; భీతిఁబొంద-భయపడగా ; కడునుద్రేకించి- మిక్కిలి నుద్రేకముతో; హట్టంబునన్- వీధిలో (రోడ్డుమీద) భక్షాపాత్రము- బిచ్చమెత్తుకొను గిన్నె (మట్టిగిన్నె) రాతిమీద ; శతధా-నూరుముక్కలుగా:భిన్నంబుగా వైచితిన్-పగులునట్లు నేలకు గొట్టితిని;


భావము: కడుపున నాకలిరేగ నాయాకలి వలన గలిగిన కోపమనే గ్రుడ్డితనమున కన్నులు రెండును మూసుకొనిపోగా(కనులకు చీకటికమ్మ) కడువేగముగా , పరిసరములందున్న 

శిష్యులెల్ల భయమందగా మిక్కిలి యుద్రేకముతో చేతనున్న భిక్షాపాత్రను నూరుముక్కలగునట్లు వీధిలో నేలకు గొట్టితిని; అనిదీని భావము.


వ్యాసుడు కాశీని  వీడివచ్చుటకు గల కారణమును అగస్త్యునకు వివరించు సందర్భము. ఒకరు లోకహితార్ధియై వింధ్యపర్వత గర్వముడుప ( అగస్త్యుడు) కాశిని వీడిరాగా, మరియొకరు (వ్యాసుడు) ఆకలి కాగలేక కాశిని శపింప బూని ,పరమేశ్వరాగ్రహమునకు లోనయి కాశిని వీడవలసివచ్చినది. వీరిరువురి కలయిక ఒక అపూర్వము.ఒక దివ్యసందేశము.


కోపమెంత దుర్గుణమో కదా! దానికి యాకలియు తోడైనది. ఇంకేమున్నది? పుణ్యాలరాశి  కాశిని వ్యాసుడుశపింప బూనినాడు.చివరకు కాశి నుండి బహిష్కరింప బడినాడు. వ్యాసునకు మూజురోజులు భిక్షదొరుక కుండుట పరమేశ్వరుని మాయయే!

కాని యతడద్దానిని తెలిసికొనలేక పోయినాడు.


వ్యాసు డెట్టివాడు? పరమ సంయమి.తపస్వి . విజ్ఙాని, మహఋషి. అట్టియుత్తముడే ఆకలి ,కోపములకు లొంగి పామరుని వలె ప్రవర్తించెను. కారణము? కోపము.కోపమెంతచెడ్డది?. దానిని అందరూ జయింప వలెనని దీని సందేశము.


రామాయణ కావ్యం సుందరకాండలో లంకా దహనానంతరం హనుమంతు డెంతో విచారిస్తాడు. "కోపంతో యెంతపనిచేశాను.లంకంతా కాల్చేశాను. సీతామాత కేమైనా ప్రమాదం కలగలేదుగదా! కోపాన్ని జయించినవారు యెంత ఘనులోగదా! .కోపం చాలా చెడ్డది.దానివల్ల యుక్తాయుక్తములు మరచిపోతాం. కాబట్టి దానికి దూరంగా ఉండాలి అని"- నిజమే

వ్యాసుని కోపావేశాన్ని ,ఆఉద్రేకాన్ని , ఆరౌద్రమూర్తిని ,శ్రీనాధమహాకవి ఈపద్యంలో ఆరభటీ వృత్తితో నిరూపించాడు. కఠిన సమాన పదజాలం, పెద్దపెద్ద సమాసాలు ఆరభటీ వృత్తికి పోషకాలు. ఈవిధంగా ఈపద్యంలో భయానక రసాన్ని పోషించి శ్రీనాధుడు

తన రసోచిత రచనను మనకు చవి చూపాడు.కోపంకూడదని సందేశించాడు.🙏

చిదంబర రహస్యం?

 శుభోదయం👏


చిదంబర రహస్యం?


 పార్ధసారధి అంబాళం వారి సౌజన్యంతో-


(మొదటి భాగం)

"దక్షిణాది దేవాలయాలలో

ఒకప్రత్యేకత సంతరించుకున్న దేవాలయం చిదంబరం.

అది శివాలయం. ఆకాశలింగానికి స్థావరం.అంటే అక్కడ శివలింగం ఉండదు అడ్డుగా ఒకగోడమాత్రమే!

   "ఆద్యంతంఅద్భుతం .నాకోరిక మన్నించి మిత్రులు పార్ధసారధిగారు మనకు అనుగ్రహించారు.ఇది రెండు భాగాలు రోజుకొకటి విడువకుండా చదవండి!భావితరాలకోసం!!


ఇంకమొదలు పెట్టండి.


98.

దాదాపు పదేళ్ల క్రితం, బంధువులు, మిత్రులు అందరం కలిసి దక్షిణదేశ యాత్రకని బయలుదేరాము. అయితే, అది మంచి ఎండాకాలం. ఎక్కువ భాగం గుళ్లు చాలా సువిశాలమైనవి. అక్కడి ఆచారం ప్రకారం షర్ట్, బనియన్ సైతం విప్పేసి లోపలికి నడవాల్సివచ్చేది. మా అందరికీ చక్కటి, ఆనంద దాయకమైన అనుభవం కలిగింది. 


అనేక వైష్ణవ, శైవ దేవాలయాలు దర్శించుకున్నాం. అందులో చిదంబరం దేవాలయం నన్ను బాగా ఆకర్షించింది. ఆ దేవాలయం యొక్క స్థలపురాణం, భౌగోళికంగా దాని విశిష్టత తెలుసుకున్న నాకు ఆశ్చర్యం కలిగింది. అలాంటి అద్భుతమైన దేవాలయం గుఱించి, నాకు తెలిసినంతవఱకు ఈరోజు మీకు తెలియజేస్తాను.  


శివాలయాలకు, వైష్ణ్వాలయాలకు తమిళనాడు పుట్టినిల్లు లాంటిది. ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు పరిపాలించిన చోళులు నిజంగా అభినందనీయులు. సంస్కృత భాషలో చోళము అంటే రాగులనబడే ధాన్యము. రాగులను బాగా పండించేవారు కాబట్టి, వారిని చోళులు అని పిలిచేవారని అంటారు. చివరకు అదే వారి శాశ్వత ఇంటి పేరు, పాలకుల వంశం పేరుగా ఖ్యాతినార్జించింది. 


శివుడి పట్ల తమకు గల అత్యంత భక్తి ప్రపత్తులకు నిదర్శనమే అన్ని దేవాలయాలు. అక్కడ వున్నన్ని విశాలమైన, అద్భుతమైన, అపురూపమైన కళా సంపదతో కూడిన దేవాలయాలు మనకు ఇంకెక్కడా కనబడవు. వారు అపారమైన ధనం వెచ్చించి చరిత్రలో నిలబడిపోయారు. కొందరు "రాజుల సొమ్ము రాళ్ల పాలని" అంటుంటారు.  


అక్కడి సువిశాలమైన దేవాలయాలను దర్శించుకొని పులకించిపోతాము. ఆ శిల్ప సౌందర్యానికి ముగ్ధులమవుతాము. ఇన్ని వేల యేళ్ళ నుంచి శివనామ స్మరణతో మారు మ్రోగుతున్న  ఆలయాలను దర్శించుకోవడం మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తుంటాము. అవకాశం వున్నవారు తప్పనిసరిగా దర్శించాల్సిన దేవాలయాలవి. 


అలాంటి అనేక శైవ దేవాలయాలలో, పంచ భూత శివ క్షేత్రాలలో, నటరాజ స్వామి వేంచేసి, ఆకాశ క్షేత్రంగా పేరు పొందిన చిదంబరం అతి ముఖ్యమైనది. ఇక్కడ ప్రణవ మంత్రమైన ఓంకారం అనుగుణంగా నటరాజ స్వామి నర్తిస్తారని ప్రతీతి. పంచాక్షరీ సారమైన తన నృత్యం ద్వారా నటరాజ స్వామి "సృష్టి, స్ధితి, లయ, సమ్మోహనం, ముక్తి" అనే ఐదు పారమార్థిక క్రియలను బయట పెడతారంటారు.


ఈ ఆలయానికి నాలుగువైపులా నాలుగు ఉన్నతమైన గోపురాల పైన, 13 అతి పెద్ద రాగి కలశాలతో పాటు, విశాలమైన వాకిళ్లు, అపురూపమైన శిల్ప సంపద, మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ దేవాలయంలో చిత్రాంబళం, పొన్నాంబళం, పెరంబళం, నృత్తసభ, రాజ సభ, అనే ఐదు భాగాలున్నాయి.


చిత్రాంబళంలో నటరాజస్వామి కొలువై వుంటాడు. చిత్రాంబళానికి ముందు భాగాన్ని పొన్నాంబళం అంటారు. ఇక్కడ రోజుకి ఆరుసార్లు స్ఫటిక లింగానికి అభిషేకాలు చేస్తారు. పెరాంబళం అంటే దేవసభ. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అలరారుతుంటాయి. ఒకప్పుడు, నృత్తసభలో స్వామి అపురూపమైన ఊర్ధ్వ తాండవనృత్యం చేశారట. ఇక్కడ స్వామి నృత్యభంగిమ విగ్రహం ప్రతిష్టించబడి వుంది.


రాజ సభ వెయ్యి స్తంబాలతో అలరారుతున్న సుందరమైన మండపం. ఇక్కడే ఆదిశేషుని అవతారమైన పతంజలి మహర్షి, తన శిష్యులకు వ్యాకరణ సూత్రాలను బోధించారట. మార్గశిర మాసంలో పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో తొమ్మిదవ రోజు స్వామిని, ఇతర దేవతలను ఐదు రథాలలో ఊరు ఎరిగిస్తారు (ఊరేగిస్తారు అనకూడదు).


చిత్రాంబళం ప్రాకారం బయట వున్న ప్రత్యేక ఆలయంలో శివ కామ సుందరీదేవి అమ్మవారుంటుంది. ఇక్కడే చిత్తగుప్తుడి (అందరూ అనుకుంటునట్లు చిత్రగుప్తుడు కాదు, చిత్తంలోనివి గుప్తంగా వ్రాసే వాడు) మందిరమున్నది. ఈ ఆలయంలోని శిల్పకళ, చిత్రకళ మనల్ని కట్టిపడేసే విధంగా, చాలా బాగుంటుంది. 


నటరాజ ఆలయంలోని స్వామి మూలాట్టనేశ్వరార్. అర్ధరాత్రి పూజ తర్వాత ఇతర శివ క్షేత్రాలలోని స్వామి శక్తి యావత్తు ఇక్కడి లింగంలోకి వచ్చి లీనమవుతుందట. ఇక్కడి అమ్మవారి పేరు ఉమాదేవి. ముక్కురుని వినాయకర్ విగ్రహం 8 అడుగుల ఎత్తుంటుంది. ఏడు చేతులతో నాట్య భంగిమలో వున్న కర్పగ వినాయకుడుంటాడు.


ఇంకా అనేక దేవీ, దేవతామూర్తుల ఉపాలయాలు, విగ్రహాలు చూడడానికి చాలా బాగుంటాయి. నటరాజ స్వామి ఎదురుగా నిలబడి ఎడమ వైపు తలతిప్పితే వరదరాజ స్వామి కనబడతాడు. ఒకేచోట నుంచుని శివ, కేశవులను దర్శించుకునే అవకాశం బహుశా ఈ ఆలయంలో మాత్రమే వుందేమో.


చిదంబరం దేవాలయ విశేషాలు తెలుసుకున్నాం కదా, మరి, ఆ చిదంబర రహస్యం ఏమిటో తెలుసుకోవాలని వుంది కదా! ఒక్క 24 గంటలు ఆగి, ఆ రహస్యం ఏమిటో రేపు ఉదయం తెలుసుకుందాం.

చి దం బ ర ర హ స్యం!


       (రెండవ భాగం )

99.

నిన్నటి 'చిదంబరం దేవాలయం' గుఱించి తెలియజేసిన విషయాలకు ముఖపుస్తక పాఠకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఎప్పుడో నేను నా డైరీలో వ్రాసుకున్న దేవాలయ వివరాలు మిమ్మల్ని ఇంతగా అలరిస్తాయని, నేనెప్పుడూ ఊహించలేదు. అందరికీ పేరు పేరునా మరొక్కసారి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.


అయితే, నిన్న దేవాలయ బాహ్య పరిస్థితులు తెలుసుకున్నాం. మరి ఆ చిదంబర రహస్యం ఏమిటో తెలుసుకోవాలనే ఆతృతగా వున్నారని నాకు తెలుసు. వివరిస్తాను, దయచేసి చదవండి. గర్భ గుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం వుంది. దానికి ఎప్పుడు తెరవేసి వుంటుంది. అప్పటి ఋషులు, అక్కడ గోడలో ఒక విశిష్టమైన యంత్రం బిగించారని చెప్తారు. 


అది ఏ యంత్రమో ఎవరూ చెప్పలేక పోయారు. దాని పైన దట్టమైన చందనం పూయబడి వుంటుంది. దానిని ఎవరూ తాకడానికి వీలులేదు. ప్రధాన అర్చకుడు మాత్రం రాత్రి వేళ తలుపులు వేసి, యంత్రానికి పూజ చేస్తారు. ఇంకెవరూ పూజ చేయరు సరికదా, పూజా సమయంలో చూడటానికి కూడా అనుమతి ఇవ్వబడదు. 


అయితే, ఆసక్తిగల భక్తులు వూజారిని అడిగి 50 రూపాయల టికెట్ సహాయంతో, కొద్ది దూరంగా, కిటికీలోంచి ఆ యంత్ర దర్శనం చేసుకునే వీలుంది. ఆ సమయంలో ద్వారానికి వున్న తెర తొలగించి, హారతి వెలుగులో కొద్ది క్షణాలు మాత్రం ఆ యంత్ర దర్శనానికి అవకాశం కల్పిస్తారు. అప్పుడు అదే గొప్పగా అనిపిస్తుంది.


ఆ యంత్రంపై లీలగా బంగారు బిల్వ పత్రాల మాలలు మనం గమనించవచ్చు. ఆ కొద్ది క్షణాల దర్శనంలో ఎవరి అనుభూతులు వారివి. ఎవరి భక్తి పారవశ్యం వారిది. ఎవరంతకు వాళ్లు కళ్లు మూసుకొని తన్మయత్వంలో వుండిపోతారు. ఇంతకూ, ఆ స్ధలంలో భక్తులు ఏం చూసి వుంటారు? ఇదే ఎవరికీ అంతుచిక్కని దేవ రహస్యం, 'చిదంబర రహస్యం'. 


అయితే విజ్ఞులుమాత్రం ఈ రహస్యం నిరాకారుడైన (ఆకాశతత్వం) దేవదేవుని ఉనికిని సూచిస్తుందనీ, చిత్ + అంబరం, చిదంబరం అంటే జ్ఞానాకాశాన్ని, అనంతాన్ని వెల్లడిస్తుందని చెబుతారు. ఎవరి అంతరంగ భావాలను అనుసరించి వారు, ఆ యా రూపంలో నిరాకారుడైన స్వామిని దర్శించుకుంటారని తెలుస్తుంది.


అక్కడ మాకు, చాలా కాలం క్రిందట lAS అధికారిగా పని చేసి, పదవీ విరమణ పొందిన వయో వృద్ధులు శ్రీ నావల్ పాకం నరసింహన్ గారు పరిచయమయ్యారు. వారు తెలిపిన కొన్ని రహస్యమైన విశేషాలును ఇక్కడ మీకు తెలియజేస్తాను.


కొన్ని వేల యేళ్ల క్రిందట తిరుమూలర్ అనే తమిళ శాస్త్రజ్ఙుడు, ఏదో ఒక రోజు తప్పక చిదంబర దేవాలయం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందనే విషయాన్ని తెలియజేశారట. ఇప్పుడు, పాశ్చాత్య శాస్త్రజ్ఙులు పదేళ్ల సుదీర్ఘ పరిశోధన తర్వాత, వాళ్లు కనిపెట్టిన ఇతర విశేషాలు, ఈ క్రింది విధంగా వున్నాయట.


చిదంబరం ఆకాశ తత్వానికి, కాళేశ్వరం వాయు తత్వానికి, కంచి ఏకాంబరేశ్వరం భూ తత్వానికి చిహ్నం. అదేగాక, ఈ మూడు దేవాలయాలు, గిరిగీసినట్లుగా, ఒకే వరుసలో, భూ రేఖాంశము 79' 70" లో వున్నాయనేది, ఈనాటి ఖగోళ శాస్త్రజ్ఙుల ఊహకందని నగ్నసత్యం. తరువాత శ్రీ రంగం దగ్గర జంబుకేశ్వరం జలతత్వానికి, అరుణాచలేశ్వర దేవాలయం, అగ్ని తత్వానికి చిహ్నాలు. వీటినే మన పెద్దలు పంచ భూతాత్మకమైన ఆలయాలని అన్నారు.


మానవ దేహంలో నవ రంధ్రాల మాదిరి, చిదంబర దేవాలయానికి కూడా తొమ్మిది ద్వారాలున్నాయి. దేవాలయ ఉపరి భాగంలో 21600 బంగారు రేకులతో కప్పబడి వుందట. ఇది శాస్త్రంలో చెప్పినట్లుగా, నిముషానికి 15 ఉచ్ఛ్వాసనిశ్వాసల చొప్పున రోజుకు 15 × 60 × 24 = 21600 సంఖ్యను సూచిస్తుందని చెప్పుకొచ్చారు.


అలాగే, 21,600 బంగారు రేకులను గోపురంపై, 72,000 చిన్న చిన్న బంగారు మేకులతో తాపడం చేశారట, ఇది మన దేహంలోని 72,000 నాడులకు చిహ్నంగా ఏర్పఱిచారని, వారి ద్వారా తెలుసుకుంటుంటే ఆశ్చర్యమనిపించింది.


మానవ శరీరంలో గుండె ఎడమవైపు వున్నట్లు, పొన్నాంబళం కొంచెం ఎడమవైపుగా వుండి, అదే విషయాన్ని సూచిస్తుందని, అక్కడికి చేరాలంటే, పంచాక్షర పడిగా పిలిచే 'శి, వా, య, న, మ' అనే ఐదు మెట్లు ఎక్కవలసి వుంటుందని చెప్పారు.


అక్కడి కనక సభకు నాలుగు స్తంభాలుంటాయి. అవి, మన నాలుగు వేదాలను సూచిస్తాయి. పొన్నాంబళానికి 28 స్తంభాలుంటాయి. ఈ స్తంబాలపైన, 64 + 64 వాట్లుంటాయి (అడ్డ, నిలువు దూలాలు), ఇవి 64 కళలను, మనలో అంతర్లీనంగా వున్న 64 రక్త నాళాలను సూచిస్తాయట. జయహో! మన పూర్వీకుల గొప్పతనం. 


గోపురంపైని కలశాలు, మనలోని శక్తి కేంద్రాలని, అర్ద మంటపానికి వుండే ఆరు స్తంభాలు, ఆరు శాస్త్రాలని, ప్రక్కన మంటపానికున్న 18 స్తంభాలు,18 పురాణాలను సూచిస్తాయని ఉన్మీల నేత్రాలతో ఉదహరించిన నరసింహన్ lAS గారికి కృతజ్ఞతలు.


మన నటరాజు నృత్యం, భూమండల సంబంధమైన నృత్యంతో పోల్చారట పాశ్చాత్య శాస్త్రజ్ఙులు. ఇప్పుటి శాస్త్రజ్ఙులు చెబుతున్న విషయాలు, వేల సంవత్సరాల క్రిందటనే GPS లేని రోజుల్లో మన ఋషులు విశదపఱచిన విషయం గమనించ ప్రార్థన. 


అందుకే, హిందూత్వం అనేది మతం కాదు, మనల్ని మార్గనిర్దేశం చేసే రహదారి. ఆర్ష సనాతన ఆచార సాంప్రదాయాలన్నీ ఆచరణ యోగ్యమైనవే అని నిరూపితమైనాయి.


చదివినందులకు ధన్యవాదములు!


Very interesting - Can you guess what is common between all these prominent temples.


1. Kedarnath 79.0669°

2. Kalahashti 79.7037°

3. Ekambaranatha- Kanchi 79.7036°

4. Thiruvanamalai 79.0747°

5. Thiruvanaikaval 78.7108

6. Chidambaram Nataraja 79.6954°

7. Rameshwaram 79.3129°

8. Kaleshwaram N-India 79.9067°


If your answer is they all are Shiva temples, you are only partially correct. It is actually the longitude in which these temples are located. They all are located in 79° longitude. 


What is surprising and awesome is that how the architects of these temples many hundreds of kilometers apart came up with these precise locations without GPS or any such gizmo like that. Wow.. 

Hats off to them. See the picture.

చదివినందులకు ధన్యవాదములు 🙏

అతిపెద్ద పగటి రోజు

 👉రేపు అతిపెద్ద పగటి రోజు


👉13 గంటల 7 నిమిషాల పాటు పగలు


👉గుడివాడలో తొలి సూర్యోదయం


నిజమే.. బుధవారం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పగటిపూటను మనం అనుభవించనున్నాం. వినడానికి విడ్డూరంగా ఉన్న జీవ పరిణామ క్రమంలో ఇది నిజమే. సాధారణంగా మనం ప్రతిరోజూ పగటి పూట 8 నుంచి 12 గంటలు అనుభవిస్తాం. అలాంటిది.. జూన్‌ 21వ తేదీ బుధవారం 13 గంటల 7 నిమిషాలు సుదీర్ఘమైన పగటి సమయం ఉంటుంది.

చరిత్రలో అతిపెద్ద పొడవైన రోజులుగా వేసవి కాలాన్ని పేర్కొంటారు. భూమి చిన్నగా ఉండి.. దీర్ఘకాలం భూ భ్రమణంలో వేగం తగ్గుతుందని, ఈ పరిణామ క్రమంలో కొన్నిసార్లు పగటి సమయం ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. 


ఈనెల 21వ తేదీ తెల్లవారుజామున 5.34 గంటలకు సూర్యోదయం మొదలవుతుంది. సాయంత్రం 6.41 గంటలకు సూర్యాస్తమయం జరుగుతుంది.


ఏటా జూన్‌ 20 లేదా 21వ తేదీన లేదా డిసెంబర్‌లో ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయని పరిశీలనలో తేలింది. దక్షణాది అర్థగోళంలో ఉండే యూకే, యూఎస్, రష్యా, కెనడా, భారత్, చైనాలో వేసవి కాలం ముగిస్తే.. అదే సమయంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ, న్యూజిలాండ్‌లో శీతాకాలం ప్రారంభమవుతుండటం ఖగోళ పరిణామ క్రమంలో మరో విశేషం.


👉ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గుడివాడలో

ఈ నెల 21వ తేదీ, 

అలాగే మనదేశంలోని మధ్యప్రదేశ్‌లో ఉన్న ఉజ్జయినిలో తొలి సూర్యోదయం జరుగుతుంది.

ఆంధ్ర రాష్ట్రంలో తొలి సూర్యోదయం కృష్ణాజిల్లాలోని గుడివాడలో సంభవిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో  సెకన్ల తేడాతో సూర్యాస్తమయం జరుగుతుంది. ఇలాంటి పరిణామం 1975లో వచ్చిందని, తిరిగి మళ్లీ 2203వ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

పంచాయతనం

 *పంచాయతనం అంటే.... ?*


ఆదిశంకరుల వారు భారతదేశంలో అనేక అవైదిక మతాలు ఉన్నటువంటి సందర్భంలో వారందరితో వాదించి ఓడించి అందులో చిట్టచివరిగా ఆరు మతాలను స్థాపన చేయడం జరిగింది.


ఆరు మతాలు అంటే మహమ్మదీయ మతము, క్రైస్తవపతము అని కాదు...


గాణా పత్యము, 

శైవము, 

సౌరము, 

వైష్ణవము, 

శాక్తేయము, 

కౌమారము. 

ఈ ఆరింటిని షణ్మతాలు అంటారు.  


*అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే...!*


గణపతి, 

శివుడు, 

విష్ణువు, 

అమ్మవారు, 

సూర్యుడు, 

కార్తికేయుడు...


ఈ ఆరు మతాలను శంకరులు స్థాపించారు కనుక ఆయనను షణ్మతాస్థాపనచార్యుడు అంటారు.


ఎవరైనా సరే ప్రతిరోజు ఇంట్లో గణపతి, అమ్మవారు, విష్ణుమూర్తి, సూర్యనారాయణ, శివుడు ఈ ఐదుగురిని తప్పకుండా పూజించాలి అని శాస్త్రం తెలియజేస్తుంది. 


ఇక కార్తికేయుడు అగ్నిస్వరూపం కనుక అగ్ని ఆరాధన మన సనాతన ధర్మంలో మొదటి నుంచి ఉంది కనుక కార్తికేయునికి అగ్ని ఆరాధనతో సంబంధం ముడి పెట్టడం జరిగింది. 


కార్తికేయుని వదిలివేస్తే ఇక మిగతా 5 దేవతామూర్తులను అందరూ తప్పకుండా ప్రతినిత్యము ఆరాధించి తీరవలసిందే. 


ఈ ఐదు మూర్తులను పంచాయతనము అని అంటారు. 

శివుడు మధ్యలో ఉండి మిగతా మూర్తులు చుట్టూ ఉంటే ....

అంటే ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఈ స్థానంలో ఇతర మూర్తులు ఉండి మధ్యలో శివుడు ఉంటే అది శివపంచాయతనము అవుతుంది. 


మధ్యలో అమ్మవారు ఉండి మిగతా మూలలో ఇతర మూర్తులు ఉంటే అది అంబికా పంచాయతనము అంటారు...


మధ్యలో విష్ణుమూర్తి ఉండి చుట్టూ ఇతర మూర్తులు ఉంటే దానిని విష్ణు పంచాయతనము  అంటారు. 


మధ్యలో గణపతి ఉండి చుట్టూ ఇతర దేవతామూర్తులు ఉంటే అది గణపతి పంచాయతనము అవుతుంది.


అదేవిధంగా మధ్యలో సూర్యనారాయణ మూర్తి ఉండి చుట్టూతా ఇతర మూర్తులు ఉంటే అది సూర్యపంచాయతనము అవుతుంది. 


ఎవరు ఏ విధంగానైనా గాని ఈ పంచాయతన పూజను ఆచరించుకోవచ్చు. 


ఇది విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. 

మనము కొన్ని  ఆలయాలకు దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ శివపంచాయతనము మనకు కనబడుతూ ఉంటుంది. 

శివలింగము మధ్యలో ఉండి చుట్టూ మిగతా మూర్తులు ఉండడం గమనించి ఉంటారు. అలాంటి పూజ విశిష్టమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అని శాస్త్రం చెప్తుంది.


నిత్యము ఈ పంచాయతనస్మరణ ఈ పంచాయతన శ్లోకములను పఠించడం చేత ఆ పంచాయతన దేవత ఆరాధన ఫలితము మనకు దక్కుతుంది.

నూటపదహార్లు

 *నూటపదహార్లు.* 


శుభకార్యాలలో చదివింపులకిగాను నూట పదార్లూ-వెయ్యిన్నూటపదహార్లను ఇస్తుంటారుగదా! ఈ నూటపదారుకి ఏమైనా విశిష్ట ఉందంటారా? ప్రశ్నించారు హరిబాబుగారు. అదిగో అందుకే ఈ టపా, అవధరించండి.


భారతీయ సంస్కృతి అంతా ఎప్పుడూ పూర్ణాంకం గురించే చెబుతుంది, శతం,సహస్రం,శత సహస్రం ఇలా, దశాంశంలో. మరీ నూటపాదహారెక్కడనుంచి వచ్చి చేరిందన్నదే ఆలోచన, అదీ తెనుగునాటే, ఈ అలవాటూన్నూ.


తెనుగునాడు మూడు భాగాలుగా విడి ఉండేది పాలనలో. ప్రజలు మాత్రం ఒక చోటినుంచి మరోచోటికి రాకపోకలూ, వలసలూ బాగానే ఉండేవి. ఆ ప్రాంతాలకి పేర్లూ ఉన్నాయి., కోస్తా, రాయలసీమ ( దీన్నే సీడెడ్ జిల్లాలు అంటే వదలిపెట్టబడిన జిల్లాలు, అవి కడప, కర్నూలు,బళ్ళారి, అనంతపురం. తరవాత కాలంలో బళ్ళారిజిల్లా కర్నాటకలో జేరిపోయింది) ఇక మూడవది నైజాం రాష్ట్రం.


కోస్తా ప్రాంతం నిజంగానే కోస్తా! సముద్రపు ఒడ్డు. బ్రిటిష్ వారి ఏలుబడిలో ఉండేది. స్వదేశీ సంస్థానాలుండేవి. ఉర్లాం, బొబ్బిలి,విజయనగరం, పిఠాపురం, పెద్దాపురం, నూజివీడు, వేంకటగిరి ప్రముఖమైన సంస్థానాలు. ఇక నైజాంలో కూడా సంస్థానాలున్నా గద్వాలుకున్నంత పేరు మిగిలినవాటికి లేదు. ఈ సంస్థానాధీశులంతా కవులను పండితులను పోషించేవారు, వార్షికాలూ ఇచ్చేవారు. ఇలా ఇచ్చే వార్షికాలు నూరు రూపాయలుగా ఉండేవి. ఈ మొత్తం నిజాంలో ఉన్న సంస్థానాలవారు పండితులకిస్తే అవి నిజాం హాలీ రూపాయలై ఉండేవి. నైజాం రూపాయల్ని హాలీ రూపాయలనేవారు. కోస్తా రాయలసీమ నుంచి నైజాం వైపు సంస్థానాలకి వెళ్ళిన వారికిచ్చిన నూరు హాలీ రూపాయలు బ్రిటిష్ పరగణాలో కొచ్చేసరికి నూటికి తగ్గేవి. కారణం ఏడు హాలీ రూపాయలు ఆరు బ్రిటిష్ రుపాయలకు మారకం అయేవి కనక. కాలం నడుస్తోంది. అటు సంస్థానాధీశుల లోనూ ఇటు గ్రహీతలలోనూ నూరు రూపాయలు పూర్ణాంకం చేరటం లేదనే వ్యధ ఉండిపోయింది. మార్గం కనపడలేదు.


చివరగా తేలినదేమంటే నూట పదారు హాలీ రూపాయలకి నూరు బ్రిటిష్ రూపాయలొస్తాయి గనక ఇటునుంచి వెళ్ళిన పండితులకు సత్కారంగా నూటపదార్లు ఇవ్వడం మొదలయింది. అక్కడ నూట పదహార్లు పుచ్చుకోవడం అలవాటైనవారు ఇక్కడా కోస్తాలో, రాయలసీమలో నూటపదహార్లు, ఇవ్వడం, పుచ్చుకోవడం అలవాటు చేసుకున్నారు, అప్పటివరకూ ఉన్న అలవాటు పూర్ణాంకానికి బదులుగా. ఇలా నూటపదార్లు - వెయ్యిన్నూటపదహార్లు  అలవాటులో మిగిలిపోయాయి. నేటి కాలానికి అర్ధనూటపదహార్లు కూడా ఉన్నాయి. పెట్టడం పెద్దలనాటినుంచీ లేదుగాని పుచ్చుకోడం పూర్వీకులనుంచీ అలవాటేనన్న సామెతగా.


శతమానం భవతి, శతాయుః…అశీర్వచనం

నూరు సంవత్సరములు ఆయుస్సు కలుగుగాక.

శతం జీవ శరదో వర్ధమానా… ఆశీర్వచనం.

నూరు శరత్తులు వర్ధిల్లుదువుగాక……ఇలా పూర్ణాకం చెప్పడమే మన అలవాటు.


ఇదీ నూటపదహార్ల కథ.