26, జూన్ 2024, బుధవారం

బంకించంద్ర ఛటర్జీ* పుట్టినరోజు

 *జూన్ 26 - పుట్టినరోజు* 


 *వందేమాతరం రచయిత : బంకించంద్ర ఛటర్జీ* 


భారత స్వాతంత్ర్య పోరాటంలో ఉత్తరం నుండి దక్షిణం మరియు తూర్పు నుండి పడమర వరకు ప్రజలను కదిలించిన వందేమాతరం అనే గొప్ప మంత్రాన్ని రచించిన బంకిమ్ చంద్ర ఛటర్జీ జూన్ 26, 1838న పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా కంటల్‌పరా గ్రామంలో జన్మించారు. హుగ్లీలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత, కోల్‌కతా విశ్వవిద్యాలయంలోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు సాహిత్యంపై ఆసక్తి ఉండేది.


చదువు పూర్తయ్యాక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు. ఈ సేవలో చేరిన మొదటి భారతీయుడు. ఉద్యోగంలో ఉండగానే రచనలు రాయడం మొదలుపెట్టాడు. ఇంతకు ముందు ఇంగ్లీషులో రాసేవాడు. అతని ఆంగ్ల నవల 'రాజ్‌మోహన్స్ వైఫ్' కూడా బాగా ప్రాచుర్యం పొందింది; తరువాత అతను తన మాతృభాష బెంగాలీలో రాయడం ప్రారంభించాడు.


అతని మొదటి బెంగాలీ నవల 'దుర్గేష్ నందిని' 1864లో ప్రచురించబడింది. ఇది ఎంతగా పాపులర్ అయిందంటే బెంగాల్ ప్రజలు తమ పిల్లలకు దాని పాత్రల పేర్లను పెట్టడం ప్రారంభించారు. దీని తర్వాత 1866లో ‘కపాల్‌ కుండలా’, 1869లో ‘మృణాళిని’ అనే నవలలు వెలువడ్డాయి. 1872లో అతను 'బంగా దర్శన్' అనే పేపర్‌ను కూడా నడిపేడు ; కానీ 1882లో వెలువడిన ‘ఆనంద్ మఠ్’ అనే నవల ఆయనకు చిరస్థాయిగా నిలిచిపోయింది.


ఆనంద్ మఠంలో, దేశాన్ని మాతృభూమిగా భావించి, దానిని ఆరాధించే యువకుల కథ, దాని కోసం తమ శరీరాన్ని, మనస్సును మరియు సంపదను అంకితం చేసి, తమను తాము 'సంతాన్' అని పిలిచేవారు. ఈ నవలలో వందేమాతరం గీతాన్ని కూడా చేర్చారు. ఇలా పాడుతూనే ఆ యువకులు మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసేవారు. ఈ నవల మార్కెట్‌లోకి వచ్చాక జనాల్లో ఆదరణ బాగా పెరిగింది. ఇది అవసరమైతే దేశం కోసం చనిపోతున్న భావనతో ప్రజల మనస్సులలో నింపింది. అందరి పెదవులపై వందేమాతరం వినిపించింది.


1906లో బ్రిటిష్ వారు బెంగాల్‌ను హిందూ, ముస్లింల ప్రాతిపదికన రెండు భాగాలుగా విభజించేందుకు కుట్ర పన్నారు. దీని వలన ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. ఆగష్టు 7, 1906 న, కోల్‌కతాలోని టౌన్ హాల్‌లో భారీ సమావేశం జరిగింది, ఈ పాట మొదటిసారి పాడబడింది. ఒక నెల తర్వాత, సెప్టెంబర్ 7న, వారణాసిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కూడా పాడారు. దీంతో దాని ప్రతిధ్వనులు దేశమంతటా వ్యాపించాయి. ఆ తర్వాత స్వాతంత్య్రం కోసం జరిగే ప్రతి సభలోనూ, సెమినార్‌లోనూ, ఉద్యమంలోనూ వందేమాతరం లేవనెత్తడం మొదలైంది.


ఇది చూసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెందింది. బ్రిటిష్ ప్రభుత్వం వందేమాతరం పాడడాన్ని నిషేధించారు. దానిని పాడిన వారు బహిరంగంగా కొరడాలతో కొట్టబడ్డారు; కానీ ఆంక్షలు భావోద్వేగాల ప్రవాహాన్ని ఎప్పుడైనా ఆపగలవా? ఇప్పుడు దాని ప్రతిధ్వనులు భారతదేశ సరిహద్దును దాటి విదేశాలకు చేరుకున్నాయి. విప్లవకారులకు ఈ నవల భగవద్గీత గా మారింది మరియు వందేమాతరం ఒక గొప్ప మంత్రంగా మారింది. ఉరి శిక్ష కైనా సిద్ద పడి ఈ పాట పాడేవారు. ఈ విధంగా, ఈ పాట భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి సాటిలేని కృషి చేసింది.


బంకిం యొక్క దాదాపు అన్ని నవలలలో, దేశం మరియు మతం యొక్క రక్షణకు ప్రాధాన్యత ఇవ్వబడింది. వివిధ విషయాలపై వ్యాసాలు, వ్యంగ్య రచనలు కూడా చేశారు. ఇది బెంగాలీ సాహిత్య శైలిలో సమూల మార్పును తీసుకొచ్చింది. అతను ఏప్రిల్ 8, 1894 న మరణించాడు. స్వాతంత్య్రానంతరం వందేమాతరాన్ని జాతీయగీతంతో సమానంగా పరిగణించి జాతీయగీతానికి గౌరవం ఇచ్చారు.

దూషించును

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *గతశ్రీః గణకాన్ ద్వేష్టి గతాయుశ్చ చికిత్సకాన్*

       *గతశ్రీశ్చ గతాయుశ్చ బ్రాహ్మణాన్ ద్వేష్టి భారత!*


తా𝕝𝕝 ధనముచేతికందనపుడు జ్యోతిష్కుని దూషించును.  ఆయువు మూడినవాడు వైద్యునిదూషింతురు. సంపద నశించినవాడు, ఆయువు మూడినవాడు బ్రహ్మను ద్వేషించును.

జూన్ 26, 2024*🪷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

     🌷 *బుధవారం*🌷

 🪷 *జూన్ 26, 2024*🪷

   *దృగ్గణిత పంచాంగం*                

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠమాసం - కృష్ణ పక్షం*

*తిథి : పంచమి* రా 08.55 వరకు ఉపరి *షష్ఠి*

వారం :*బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం : ధనిష్ఠ* మ 01.05 వరకు ఉపరి *శతభిషం*

*యోగం : విష్కుంబ* ఉ 06.14 *ప్రీతి* రా 03.21 తె వరకు

*కరణం : కౌలువ* ఉ 10.03 *తైతుల* రా 08.55 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 07.00 - 11.00  సా 04.00 - 05.00*

అమృత కాలం :*(27)తె 04.51-06.21* 

అభిజిత్ కాలం :*ఈరోజు లేదు* 

*వర్జ్యం : రా 07.50 - 09.20*

*దుర్ముహుర్తం : ప 11.44 - 12.37*

*రాహు కాలం : మ 12.10 - 01.49*

గుళిక కాలం :*ఉ 10.32 - 12.10*

యమ గండం :*ఉ 07.15 - 08.54*

సూర్యరాశి : *మిధునం*

చంద్రరాశి : *కుంభం*

సూర్యరాశి :*ఉ 05.37*

సూర్యాస్తమయం :*సా 06.44*

*ప్రయాణశూల :‌ ఉత్తరం దిక్కుకు ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.37 - 08.14*

సంగవ కాలం :*08.14 - 10.52*

మధ్యాహ్న కాలం :*10.52 - 01.29*

అపరాహ్న కాలం :*మ 01.29 - 04.06*

*ఆబ్ధికం తిధి: జ్యేష్ఠ బహుళ పంచమి*

సాయంకాలం :*సా 04.06 - 06.44*

ప్రదోష కాలం :*సా 06.44 - 08.54*

నిశీధి కాలం :*రా 11.49 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.10 - 04.54*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*మనమున నిరతము తలచెదఁ వినతముగా నిను కొలుతును వీణాపాణీ*

*అనవరతము నీ స్మరణము వనజభవుని పలుకు కలికి వాణి భగవతీ*


🌷 *ఓం సరస్వత్యై  నమః* 🌷

 🌷🪷🌹🛕🌹🌷🪷🌷🪷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*   

         🌷 *సేకరణ*🌷

      🌹🌷🪷🪷🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌷🌷🌹🌷

 🌹🍃🌿🪷🪷🌿🍃🌹

సీతాఫలం - రామాఫలం

 *(1948 మార్చ్ నెల చందమామలో ప్రచురించిన కథ)*


🌿"సీతాఫలం  - రామాఫలం"🌿

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

 

        అబ్బాయిలు, అమ్మా యిలూ! మీలో అందరికీ సీతాఫలం, రామాఫలం అంటే తెలుసా? యెప్పుడన్నా తిన్నారూ? అందరూ తిని ఉండరనుకుంటాను. నిజమేనా ? పై ఆకారంలో భేదం ఉన్నా లోపల గింజలు, రుచీ , సమానంగానే ఉంటాయి. పేర్లను బట్టి చూస్తే వీటి పుట్టుక లో ఏదో గమ్మత్తు ఉండితీరాలని మీలో తెలివైన వాళ్లబుద్ధికి తడుతుంది. నిజమే, ఆ గమ్మత్తేమిటో కాస్త జాగ్రత్తగా చదవండి తెలుస్తుంది.


శ్రీ రామచంద్రమూర్తి రావణా బ్రహ్మను చంపి, సీతాదేవిని తీసుకుని అయోధ్యకు వచ్చి, పట్టాభిషేకం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందేగా. ఆయన పట్టాభిషేకమౌతుంటే సామంతరాజులూ, బంధువులూ స్నేహితులూ, భక్తులు మొదలయిన వారంతా తలా ఒక కానుక తీసుకువచ్చారు. అందులో వానరరాజు సుగ్రీవుడూ, రాక్షసరాజు విభీషణుడూ, దేవతల రాజు ఇంద్రుడూ కూడా బహుమతులు....అంటే శుభసమయంలో చదివించటానికి, ప్రపంచములో గొప్పవైన వజ్రాలు, మణులు, రత్నాలు ఆదిగాగల అపురూపపు వస్తువులు తీసుకువచ్చారు. ఇక సామంత రాజులు, రాజాధిరాజులూ ఏదో ఒక గొప్ప వస్తువు తీసుకువచ్చారు. ఇంకా భక్తులూ, జ్ఞానులు అందరూ కానుకలు తెచ్చారు.


అందరిలోకీ పరమ భక్తుడెన ఆంజనేయస్వామి పట్టాభిషేకం మూడు రోజులుందనగా మొదలు పెట్టాడు ఆలోచన, ఏమి కానుక సమర్పించుదామా అని. శ్రీ రామచంద్రమూర్తికి పరమ ప్రియమైనదీ, యెవ్వరూ తేనిదీ తీసుకురావాలని ఆయన వూహ. ఏ వస్తువును గురించి ఆలోచించినా యెవరో ఒకరు తేనే తెచ్చారు. ఆంజనేయస్వామికి ఏమీ పాలుపోలేదు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. రేపు ప్రొద్దున పట్టాభిషేకం - అట్టే సమయం లేదు. తెల్లారేలోపుగా ఆ కానుకేదో నిర్నయించి తీసుకు రావాలి. చప్పున యేదో జ్ఞాపకం వచ్చి లేచాడు హనుమాన్. తక్షణం రివ్వుమంటూ బ్రహ్మదేవుని దగ్గరకు పోయి వాలాడు. హనుమంతుడు తొందరగా వేళగాని వేళ హనుమంతుడు రావడం చూచి అదరిపడ్డాడు బ్రహ్మ.  ఏంకొంప మునిగిందో దేముడా అని భయపడి, కుర్చీ వేసి కూర్చోమన్నాడు.


ఉహూ, కూర్చోలేదు హనుమంతుడు. “చాలా తొందర పనిమీద వచ్చాను. రేపు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం. ఆయనకు కానుకగా సమర్పించటానికి సీతాదేవికి, శ్రీరామచంద్రమూర్తికి పరమ ప్రియమైనది సృష్టించి యిస్తేగాని వీలు లేదు. అంతవరకూ నిన్ను వదిలేది లేదు" అన్నాడు.


అసాధ్యుడనీ, పట్టినపట్టు విడిచేరకంగాదని, బ్రహ్మకి తెలుసు. అయినా అర్ధరాత్రివేళ యీ కోతి పీడ యేమిటి అనుకున్నాడో ఏమో, బాగా ఆలోచించి అంతకుముoదు సృష్టిలో లేనివి, అతి మధురంగా ఉండేవీ, రెండు పళ్లు సృష్టించి వాటికి సీతాఫలము, రామాఫలము అని పేరు పెట్టి వీటినియివ్వరా నాయనా, మీ రామచంద్రుడు చాలా ఆనందిస్తాడు' అని యిచ్చాడు.


తక్షణం భూలోకానికి వచ్చాడు హనుమాన్.

పట్టాభిషేక సమయమయింది. హనుమాన్ ఎక్కడున్నాడా అని అయోధ్యంతా వెతికిస్తున్నాడు శ్రీ రామచంద్రుడు. యేమైనా కోపమొచ్చి అలిగాడేమో అనుకున్నాడు తనలో, హనుమంతుడంటే పరమ ప్రేమ ఆయనకు. పట్టాభిషేకం జరుగుతున్న సంతోషమే లేదాయన ముఖంలో.


ఇంతలో హనుమంతుడు వచ్చాడంటె వచ్చాడన్నారు అందరు. హనుమంతుడు సరాసరి శ్రీరామచంద్రుడి పాదాలవద్ద వాలి రెండు చేతులతో రెండు ఫలాలూ సీతా రాముల పాదాలవద్ద ఉంచి సీతాఫలము, రామాఫలము అని నమస్కారం చేశాడు.


శ్రీరామచంద్రుడు హనుమంతుడ్ని కౌగలించుకుని మూడు రోజులనుండి కనపడటం లేదు, ఎక్కడున్నా వోయి హనుమాన్?” అని అడిగాడు. హను మంతుడు జరిగిన కధంతా చెప్పాడు.


శ్రీరామునితో కూడా సభంతా ఆశ్చర్య పోయారు, హనుమంతుని భక్తి, శక్తికి. తరువాత ఆ ఫలాలు రెండూ విడదీసి పెద్దలందరికీ పంచి పెట్టారు ప్రసాదంలాగా, అవి తిని వాటి మధురానికి అంతా ఆశ్చర్యపోయి, హనుమంతుడ్ని పొగడుతూ , గింజల్ని జాగ్రత్తగా పాతి పెట్టి మొక్కలు మొలిపించి కాయలు కాయించి అందరికీ సీతారామ ప్రసాదంలాగా పంచి పెట్టారు. శ్రీ రామ చంద్రుడు సీతాదేవీ ఎక్కువగా సంతోషించారు, హనుమంతుని భక్తికి, ప్రతిభకీ ఆ నాటి నుంచీ ఈనాటి వరకూ మనం తింటున్నాం యీ ఫలాలను. హనుమంతుడ్ని ఒక్కసారైనా తలుచుకోము అవి తింటున్నప్పుడు. ఇక నుంచి అవి తింటున్నప్పుడు అవి "సృష్టింపించి భూలోకానికి తెచ్చి అందించిన హనుమంతుడ్ని తలుచుకుంటుండండి సుమా.

పోతన పాత్ర చిత్రణ



పోతన పాత్ర చిత్రణ 


                    ఉ:  కాటుక కంటినీరు  చనుగట్ల పయింబడ  నేలయేడ్చెదో?


                          కైటభ దైత్య మర్దనుని  గాదిలి కోడల!  యోమదంబ! యో


                         హాటకగర్భురాణి!  నిను  నాకటికైఁ గొనిపోయి   యల్ల   క


                         ర్ణాట  కిరాట  కీచకులకమ్మ ;త్రిశుధ్ధిగ  నమ్ము; భారతీ!


                                        --    చాటువు ;


                 ఉ:  కోపము తోడ నీవు  దధి భాండము  భిన్నము  సేయుచున్నచో


                        గోపిక  త్రాటఁగట్టిన  వికుంచిత  సాంజన భాష్ప  తోయ   ధా


                        రా పరిపూర్ణ  వక్త్రముఁ  గరంబులఁ బ్రాముచు  వెచ్చనూర్చుచుం


                      బాపఁడవై  నటించుట  గృపాపర ! నామదిఁ   జోద్యమయ్యెడిన్ ;


                                        భాగ-ప్రథ-స్కం: 181 పద్యం: కుంతి కృష్ణుని స్తుతించుట;


                                          ఆంధ్ర సాహిత్య క్షేత్రాన్నలంకరించిన  కవితల్లజులలో  పాత్ర చిత్రణ విషయమున  కవులందరు నొకయెత్తు. బమ్మెరపోతన యొకయెత్తు. అతడుచిత్రించిన పాత్రలన్నియు  శబ్దచిత్రములే! కానీ,అందుకొన్ని నిశ్చలనములు, మరికొన్ని చలనములు.

ఆపాత్రలు పోతనగారితో మాటగలిపిమాటాడినవే! మనకుగూడ నట్టి మనః పరిణామము గల్గినచో నవిమనతోగూడ మాటాడగలవు.

"పాత్రకు తగిన యాకారము. ఆకారమునకు దగిన ఆహార్యము. ఆహార్యమునకుదగిన వేషము.దానికితగనమాటలు .మాటలకు దగిన చక్కనిపదములకూర్పు. పోతన చిత్రణలోని విశేషములు.


                                        పైరెండుపద్యములలో  మొదటిది పోతన సరస్వతి నోదార్చుట. ధనముపై నాశతో భాగవత గ్రంధమును  నరాంకిత మొనరించునేమోనని యనుమానమంది చదువులతల్లి  దీనవదనయై  కన్నులనీరుగార దేవతార్చనా పీఠమున నున్నపోతనకన్నుల

కగుపించినదట! పోతనయామెరూపమును గాంచి నివ్వెరపోయెను,."  అమ్మా! సరస్వతీమాతా! కాటుక తో దిగజారు కన్నీరు వక్షోజములపై బడగా  నేలనమ్మా  విలపింతువు? ఓహో!  ధనాశతో నిన్నముకొందుననియా నీవిచారము. అటులెన్నటికి జరుగదు. త్రికరణ శధ్ధిగా జెప్పునామాటను నమ్ము. మనుట"-. ఇది నిశ్చలన చిత్రమే! ,ఆజగదంబ కన్నులనీరుగార్చుట. కన్నులకున్న కాటుక కరగి కన్నీట గలసి చనుగట్లపై బడుట. ఆహా! ఏమాచిత్రణము! మనోముకురమున గాంచగల్గినవాని జీవితము ధన్యము.


                                   ఇఁక  రెండవ చిత్రము  చలనము. బాలకృష్ణుని కొంటేపనులను  దలచుకొని  కుంతి కృష్ణుని ప్రస్తుతించుచు నాడిన మాటలు. ఆమాటలవెనుక నార్తియున్నది. అభిమానమున్నది. భక్తియున్నది. ఆప్యాయతను రంగరించి చిత్రించిన యీచిత్రము అపూర్వము.


                                    "కృష్ణా! యేమి చెప్పనయ్యా నాటి ముచ్చటలు. బాల్యమున నీవొకనాడొకగోపిక యింటికేగి. దధి భాండమును కోపముతో  పగులగొడితివి. ఆగోపికయు కోపమున  నిన్ను త్రాటితోగట్టివేయుచో, మొగమొక వంకకు వంచి,కన్నుల కాటుక కన్నీరుగార

దానినంతయు  నిరుచేతులతో  మొగమంతయు పులుముకొనుచు  వేడినిట్టూర్పులను  విడచుచు బాలునివలె నటించుట     నేడుదలచికొనిన  నాకు చోద్యమనిపించునయ్యా! కొంటె కృష్ణయ్యా! యెంత దొంగ నటన! భక్తిపాశములచే గట్టుబడు నీవు సామాన్యమగు త్రాట బంధింపఁబడుట  నటన గాకమరేమి? "- యనిమేనత్తమాటలు.


                                  త్రాటగట్టబడుట , సాంజన భాష్పతోయ సిక్తమైన  మోమును  చేతులతో  పులిమికొనుట. అప్పటి కృష్ణయ్య ఆ యాకారము. ఇవియన్నియు పోతన పాత్రచిత్రణము లోని మెళకువలు.చివరకు అంతవాడ వింతవాడ వైతివే యని యాశ్చర్యమును ప్రకటించుట. యతని రచన లోని చమత్కారము. 


                                                                  ఇదండీ పోతన గారి పాత్ర చిత్రణలోని  గొప్పతనం!


                                                                                                   స్వస్తి!🙏🙏🙏

తిథి అధిష్టాన దేవతలెవరు

 *తిథి అంటే ఏమిటి?*

         *అధిష్టాన దేవతలెవరు?*

               

*తిథి అంటే…  వేద సమయగణితము ప్రకారము చంద్రమాసములో ఒక రోజును తిథి అంటారు.* 


*ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావాస్య , అదే సూర్యచంద్రులు ఒకరికొకరు సమానదూరములో వుంటే పౌర్ణమి అవుతుంది.* 

*శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు.* 


*తిథులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు. రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది.* 


*ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది.*


*(1) చాంద్రమాసంలో మొదటి తిథి పాడ్యమి. పాడ్యానికి అధిదేవత అగ్ని.*

*(2) విధియ > బ్రహ్మ*

*(3) తదియ > గౌరి*

*(4) చవితి > వినాయకుడు*

*(5) పంచమి > నాగరాజు*


*(6) షష్టి > షణ్ముఖుడు*

*(7) సప్తమి > సూర్యుడు*

*(8) అష్టమి > రుద్రుడు*

*(9) నవమి > దుర్గ*

*(10) దశమి > ఆదిశేషుడు*


*(11) ఏకాదశి > యమధర్మరాజు*

*(12) ద్వాదశి > విష్ణు*

*(13) త్రయోదసి > కాముడు లేదా శివుడు*

*(14) చతుర్థశి >  కాళికామాత*

*(15) పౌర్ణమి > చంద్రుడు*

*(16) అమావాస్య > లక్ష్మి*


*ఏదైనా కార్యం తలపెట్టినపుడు ఆ తిథికి సంబంధించిన అధిష్టానదేవుడిని పూజించాలి. పూజకు వీలుకాకపోతే మనసులో స్మరించాలి.*

బంధువు లేదు

 ☝️శ్లోకం 


నాస్తి విద్యాసమో బంధుః

 నాస్తి విద్యాసమో సహృత్ ।

నాస్తి విద్యా సమం విత్తం 

నాస్తి విద్యాసమం సుఖం ॥



భావం: విద్యతో సరితూగ గల బంధువు లేదు. విద్యతో సమానమైన స్నేహితుడు లేదు. విద్యతో సమానమైన ధనమూ లేదు. విద్యతో సరితూగ గల సుఖము లేదు.

పంచాంగం 26.06.2024

 ఈ రోజు పంచాంగం 26.06.2024  Wednesday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస కృష్ణ పక్ష పంచమి తిధి సౌమ్య వాసర: ధనిష్ఠ నక్షత్రం నిష్కంభ తదుపరి ప్రీతి యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పంచమి రాత్రి 08:55 వరకు.

ధనిష్ఠ మధ్యాహ్నం 01:04 వరకు.


సూర్యోదయం : 05:48

సూర్యాస్తమయం : 06:50


వర్జ్యం : రాత్రి 07:50 నుండి 09:20 వరకు.


దుర్ముహూర్తం : పగలు 11:53 నుండి 12:45 వరకు.


అమృతఘడియలు : ఈ రోజు లేదు .


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: పగలు 07:30 నుండి 09:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

శాసన సభ్యులు - సుపరిపాలన 10*

 *శాసన సభ్యులు - సుపరిపాలన 10*


సభ్యులకు నమస్కారములు.


కొన్ని రాజకీయ  పార్టీలు,  నాయకులు తమకంటూ ప్రచార మాధ్యమాలను (దిన పత్రికలు, దృశ్య, వినికిడి మాధ్యమాలు Tv లను)  నెలకొల్పుకోవడం ఈ మధ్యన సర్వ సాధారణమైనది. తమ తమ  ప్రచార మాధ్యమాల ద్వారా తమ రాజకీయ విధానాలను, సిద్ధాంతాలను, కార్యాచరణను ప్రజా సంక్షేమానికై  ప్రచారం చేసుకుంటే మంచిదే మరియు ప్రజలు హర్షిస్తారు గూడా. కాని, కొన్ని రాజకీయ పార్టీల మరియు  నేతల ప్రచార మాధ్యమాలు వింత మరియు విపరీత ధోరణులు అవలంబించడం ప్రజలు గమనిస్తున్నారు.  కొన్ని ప్రచార మాధ్యమాలు తమకు మద్దతు ఇవ్వని మరియు తమను అనుసరించని పార్టీలపై, నాయకులపై సత్యదూరమైన ఆరోపణలు, అభూత కల్పనలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పు త్రోవ పట్టిస్తున్నాయి. ఎన్నికల కురుక్షేత్రమప్పుడు ఈ మాధ్యమాల జోరు మరీ విపరీతంగా ఉంటుంది. కొన్ని పత్రికల రాజకీయ వార్తలు, వ్రాతలు... చదివే వారికి రోతలుగా భావించే హీన స్థాయిలో ఉంటాయి. రాష్ట్రాలలో, దేశంలో ఉన్న కొందరు పత్రికా మరియు  దృశ్య   మాధ్యమాల బడా అధినేతలు కూడా రాజకీయ నేతలకు, పార్టీలకు వంత పాడడం గూడా ప్రజలు గమనిస్తున్నారు. 


ఇంతటితో సమస్యలు ఆగవు. పాలక మరియు ప్రతిపక్ష పార్టీల పంచన చేరకుండా వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలన్న కుతూహలము, నిజాయితీ కలిగిన వార్తా విలేఖరులపై మరియు  పోటీ పార్టీల పత్రికా విలేఖరులపై దాడులను గూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు.  రాజకీయ పార్టీల మరియు  నాయకుల ఇటువంటి  అనుచిత కృత్యాల వలన సమాజంలో అలజడి, రక్షక భట శాఖ ప్రవేశము జరుగుతూ ఉంటాయి. ఇటువంటి దుశ్చర్యల వలన జర్నలిస్టు సంఘాల నాయకుల ఆందోళనలు, ప్రభుత్వానికి విజ్ఞప్తులు, బహిరంగ సభలు,  ప్రదర్శనలు సమాజానికి కొత్తేమీ కాదు. 


*అవుతే* అందరు శాసన సభ్యులు ప్రచార మాధ్యమాలను నెలకొల్పుకుంటున్నారు అను భావన/విషయము *సత్యదూరము*. ప్రజలు కోరునది, శాసన సభ్యులకు విజ్ఞప్తి చేయునదేమనగా *ఇటువంటి సందర్భాలలో మాన్యులైన శాసన సభ్యులు ఉచితానుచితాలు పాటిస్తూ ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేయాలని.*


*పార్టీలు ఏవైనా, వారి అధినేతలు ఎవరైనా నీతి నిబద్ధత గల శాసన సభ్యులు మేల్కొనాలి, నిజాలను గ్రహించి సమాజపు అభివృద్ధి, భవిష్యత్ గురించి ఆలోచన చేయాలి. పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలను, విలేఖరులపై దాడులను నిరసించాలి, ఆపాలి. ప్రజా స్వామ్మ్యాన్ని కాపాడాలి*. ప్రజలు మూఢులు, మూర్ఖులు కారు. న్యాయ నిర్ణేతలు వారే.  ఏ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించినా, వంత పాడినా స్థానిక నాయకుల సచ్చరిత్ర, స్వభావము, యోగ్యత, నడత, శీలము, మార్గ దర్శకత్వము, నీతి మరియు నిజాయితి గల అభ్యర్థులకే వారి ఓటు. *కావున నాయకులందరూ  సచ్చీలురుగా ఉండాలి*.


ధన్యవాదములు.

(సశేషము)

25, జూన్ 2024, మంగళవారం

Panchaag