27, ఆగస్టు 2024, మంగళవారం

ఆగష్టు, 27, 2024*🌹 *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🍁 *మంగళవారం*🍁

🌹 *ఆగష్టు, 27, 2024*🌹

     *ధృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*శ్రావణమాసం - కృష్ణపక్షం*


*తిథి   : నవమి* రా 01.33 వరకు ఉపరి *దశమి*

*వారం:మంగళవారం*(భౌమవాసరే)

*నక్షత్రం  : రోహిణి* సా 03.38 వరకు ఉపరి *మృగశిర* 


*యోగం  : హర్షణ* రా 08.31 వరకు ఉపరి *వజ్ర*

*కరణం  : తైతుల* మ 01.52 *గరజి* రా 01.33 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 09.30 - 12.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  :*మ 12.28 - 02.03*

అభిజిత్ కాలం  : *ఉ 11.44 - 12.34*


*వర్జ్యం          : ఉ 07.43-09.18 & రా 09.17-10.54*

*దుర్ముహూర్తం  : ఉ 08.24 - 09.14 రా 11.00 - 11.46*

*రాహు కాలం: మ 03.16 - 04.50*

గుళికకాళం      : *మ 12.09 - 01.43*

యమగండం    : *ఉ 09.01 - 10.35*

సూర్యరాశి : *సింహం*

చంద్రరాశి : *వృషభం*

సూర్యోదయం :*ఉ 05.53* 

సూర్యాస్తమయం :*సా 06.24*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.53 - 08.24*

సంగవ కాలం   :      *08.24 - 10.54*

మధ్యాహ్న కాలం    :*10.54 - 01.24*

అపరాహ్న కాలం: *మ 01.24 - 03.54*

*ఆబ్ధికం తిధి:శ్రావణ బహుళ నవమి*

సాయంకాలం  :  *సా 03.54 - 06.24*

ప్రదోష కాలం  :  *సా 06.24 - 08.42*

నిశీధి కాలం      :*రా 11.46 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

*_గోమాతను 🐄పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీ ఆంజనేయం శిరసా నమామి*


♦️మత్కధావేక్షితా యావత్ 

యావత్ పర్వతసంస్థితి: 

యావచ్చంద్రశ్చసూర్యశ్చ 

తావత్వం సుఖితోభవ 

పశ్చాత్ చతుర్ముఖో 

భూత్వ సృష్ట్యా లోకాన్ 

యధావిధి త్రిలోకవాసిభిస్స్వార్ధం

మత్స్వరూపము పైష్యసి♦️ 


👉లోకములో #రామకధ ఉన్నంత వరకు...

పర్వతాలు సూర్యచంద్రులు

ఉన్నంతవరకు... 

నీవు చిరంజీవిగా ఉండి... 

తర్వాత కల్పంలో

 #భవిష్యత్_బ్రహ్మ వై లోకాలను 

సృష్టించి, పాలించి 

ఆ కల్పాంతంలో 

నా సాయుజ్య ముక్తిని పొందుతావు

అని భావం.


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

పెళ్ళి ముచ్చట్లు :-

 కనుమరుగయిన ఆనాటి పెళ్ళి ముచ్చట్లు :-


పెళ్ళిలో భోజనాలంటే ఒక పెద్ద యఙ్ఞంలా వుండేది, సరదాగానూ వుండేది. భోజనాలకి పిలుపుల దగ్గరనుంచి భోజనాలు కార్యక్రమం పూర్తి కావడం ఒక పెద్ద వేడుక.


పెద్దపెద్ద మండువా లోగిళ్ళుండేవి. మండువాలో ఒక పక్క ఆకులేస్తే ఒక పాతిక మందికి భోజనానికి సరిపడేది. ఇలా నాలుగుపక్కలవేస్తే దగ్గరగా వొక వంద మంది ఒక సారి భోజనం చేయడానికి వీలుండేది. ఇలా వీలు లేక పోతే దొడ్డిలో ఒక పెద్ద పందిరివేసి దానిని గదులుగా కట్టి గాలి వెలుతురు కోసం మనిషి పై ఎత్తు నుంచి ఖాళీగా వదిలేసే వారు. అలా కట్టిన వాటిలో నేల చదును చేసి కళ్ళాపు జల్లి అలికిన మట్టి ఇంటిలా తయారు చేసేవారు. భోజనాలకి కూచోడానికి ఈతాకుగాని, తాటాకు చాపలుగాని వేసేవారు. కింద కూచుని భోజనం చేసేవారు. 


సాధారణంగా అరటి ఆకులు వుపయోగించే వారు. అత్యవసర పరిస్థితులలో అడ్డాకులు వాడేవారు. ఇక్కడ కూడా ఒకసారి వంద మంది పైగా ఒక సారి భోజనాలు చేసేందుకు సావకాశం ఉండేది.


పంక్తులుగా ఆకులేసి, అందరూ కూచున్న తరవాత వడ్డన ప్రారంభించేవారు. భోజనానికి, వడ్డనకి ఒక క్రమం ఉంది. నేటి ప్రోటోకోల్ లాగా! ముందు పప్పు, కూరలు, పచ్చళ్ళు, వూరగాయ, పిండివంటలు అన్నీ అయిన తరవాత అన్నం పెట్టేవారు. వడ్డన ప్రారంభించిన వెంటనే పెట్టినవి తినెయ్యకూడదు. అందరూ ఒక సారి తినడం మొదలు పెట్టాలి. వడ్డన అంతా పూర్తి అయినతరవాత గోవిందనామ స్మరణతో భోజనం ప్రారభమయ్యేది. అసలు సిసలు వడ్డన ఆ తరవాత ప్రారంభమయ్యేది,తినడం ప్రారంభించిన తరవాత. యువకులు యువతులు వడ్డన చేసేవారు. పంచకట్టి ఆపైన తువాలు మొలకి గట్టిగా బిగించేవారు యువకులు. యువతులు పమిట పూర్తిగా వేసుకుని ఆ కొంగు మొలలో దోపుకును వడ్డనకి ఉపక్రమించే వారు. 


వడ్డన సామానుల పేర్లే మరిచిపోతున్నారు,ఇప్పుడు. పులుసు వడ్డించడానికి వాడేపాత్రని గోకర్ణం అనేవారు. మొదటిది పప్పు, ఇది పట్టుకుని ఒకరు, నెయ్యి పట్టుకుని ఒకరూ బయలుదేరేవారు. పప్పు వేసే అతను పప్పండి, మీకండి, పప్పండి, పప్పండి,పప్పండి అని వడిగా అంటు కదిలేవాడు. వెనకాల వచ్చే నెయ్యి తెచ్చినతను నెయ్యండి, నెయ్యండి,నెయ్యండి అంటూ వేసుకుంటూ వెళ్ళేవాడు. ఈ మాటలు గబగబా అంటే మరొక అర్ధం స్ఫురిస్తుంది. అని చూడండి. ఆ తరవాతది కూర. కూర తెచ్చినతను కూరండి, కూరండి, కూరండి అంటూ కావలసిన వాళ్ళకి వేసుకుంటూ వెళ్ళేవాడు. మధ్యలో అన్నం బుట్ట పట్టుకుని ఒకరు వచ్చేవారు. వేడిఅన్నం తాటాకు బుట్టలో పెట్టుకుని, బుట్ట చేతిమీద పెట్టుకుని, కాలకుండా బుట్ట కింద అరటాకు వేసుకుని ఒక హస్తంలాటి దానితో అన్నం వడ్డించేవారు. వీరు అన్నమండి తో ప్రారంభించి, మీకన్నమండి,మీకన్నమండి, మీకన్నమండి అంటూ సాగిపోయేవారు. మీకు+అన్నమండి=మీకన్నమండి అయిపోయింది. ఈ మాటలన్నీ వడిగా అంటేనే ఆ అందం అర్ధం స్ఫురిస్తాయి. పప్పుతో పులుసు వడ్డించేవారు. ఈ పులుసుని పులుసండి నుంచి పులసండి, పులసండి అనుకుంటూ వెళ్ళేవారు. పులసండి కి అర్ధం పులవమని. ఈ మాటలని కొంతమంది యువకులు ఆటపట్టించడానికి కూడా వాడే వారు, గబగబా అంటూ. పప్పుతో కాకుండా పులుసు వేరేగా కలుపుకుని తినేవారు. అప్పుడు నంజుడుకి వుండటానికి వడియాలు, అప్పడాలు వేసేవారు. ఒక కొంటె యువకుడు పంక్తిలో ఒక తాతగారి దగ్గరకెళ్ళి తాతగారు వడియాలు కావాలా అని అడిగేవాడు. ఆయన కావాలంటే ఒక పెద్ద కేక వేసేవాడు! ఒరేయ్ సుబ్బన్నా! ఇక్కడ తాతగారికి వడియాలు కావాలి పట్రా అని. అంటే తాతగారికి పడుచుపెళ్ళాం కావాలంటున్నాడురా అని ఎద్దేవా అన్న మాట. నిజంగా ఇందులో పైకి ఏ విచిత్రమూ లేదు కాని అసలు కొంటె తనం వుంది. తాతగారు కొద్ది ఘటికుడైతే మరొకలా సాగేది. కావాలని వడియాలు తెచ్చినతరవాత ఇదేమిటి ఇవితెచ్చేవూ అనేవాడు. మీరేగా వడియాలుకావలన్నారని అనేవాడు, యువకుడు.అప్పుడు తాతగారు ఒర్నీ! వడియాలంటె పడుచుపెళ్ళాన్ని తెస్తావనుకున్నారా అనేవాడు. మరోలా కూడా సాగేది. ఏమిటీ అన్నారూ అనేవాడు, ముసలాయన. వడియాలుకావాలా అని మళ్ళి అడిగేవాడు, యువకుడు. ఈ తాతగారు ఘటికుడు కనక వడియాలు నాకెందుకూ అనేవాడే కాని వద్దనేవాడు కాదు. తాతా! పెళ్ళిచేసుకుంటావా అంటే పిల్లనిచ్చేవాడెవడురా! అనేవారుకాని వద్దనేవారు కాదు!. అది ఒక సరదా.! వడియాలు నేనేమి చేసుకోనూ అనేవాడు. అంటే నమలడానికి పళ్ళు లేవనీ అర్ధం, పడుచు పెళ్ళాంని నేనేమి చేసుకోనూ అని కూడా అర్ధం వచ్చేది. పోనీ అప్పడాలు కావాలా అంటే, అప్పడాలు ఇప్పటిదాకా నాదగ్గరే వుండాలి, ఎక్కడుందో చూడునాయనా అనేవాడు. ఒకవేళ భార్య పక్కనుంటే అప్పడాలు పక్కనే వుందిగా అనేవాడు. 


ఇప్పుడర్ధమైనదనుకుంటాను, అప్పడాలు ( అప్పటి+ ఆలు= అప్పటాలు, అప్పటియాలు, అప్పడాలు అనగా పాత భార్య) వడియాలు అనగా ( వడి+ఆలు= వడియాలు వడి అనగా వేగం, విసురు అని అర్ధాలు, అనగా పడుచు భార్య). ఒక్క మంచినీళ్ళు పోసేవారు మాత్రమే మాట్లాడకుండా ఖాళీ గ్లాసుల్లో మంచినీళ్ళుపోసేవారు. ఇక చివరిది పెరుగు, పెరుగు తెచ్చినవారు పెరుగండి నుంచి పెరగండి నుంచి వడిగా అనడం లో జరగండి దాకా వెళ్ళిపోయేది. అంటే ఇక తిన్నది చాలు లేవండి అన్నట్లుగా.భోజనాల దగ్గరనుంచి అంతా ఒక సారి లేచేవారు, గోవింద నామ స్మరణ చేస్తూ. పంక్తి లో ఎవరేనా తినడంలో వెనక పడితే వారికోసం అందరూ వారి భొజనం పూర్తి అయ్యేదాకా కూచుని వుండేవారు. ఇది వారి పట్ల చూపే గౌరవం. మన వాళ్ళు భోజనాలలో కూడా ఇలాసరదా చూపేవారు. అలా సందడి సందడిగా భోజనాలు ముగిసేవి.


ఇప్పుడు ప్లేట్లు పట్టుకుని క్యూలో నుంచుని కావల్సినవి వేసుకుని/వేయించుకుని కొండొకచో ఒంటి కాలిమీద నిలబడి/ ఎక్కడో ఒకచోట కూచుని భోజనం కానిచ్చేస్తున్నాం మరి.మాధాకోళం బ్రతుకులైపోయాయని ఒక పెద్దాయన వాపోవడం విన్నాము 😃

*శ్రీ కాళహస్తీశ్వర శతకము - 23*

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


      𝕝𝕝 శ్లోకం 𝕝𝕝 


*తరఁగల్‌ పిప్పల పత్త్రముల్‌ మెఱుఁగుటద్దంబుల్‌ మరుద్దీపముల్‌*


*కరికర్ణాంతము లెండమావులతతుల్‌ ఖద్యోతకీటప్రభల్‌*

*సురవీథీలిఖితాక్షరంబు లసువుల్‌ జ్యోత్స్నాపయఃపిండముల్‌*


*సిరులం దేల మదాంధు లౌదురు జనుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 23*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! మనిషి ప్రాణములు నీటి కెరటముల వంటివి, రావిచెట్టు ఆకులవంటివి, మెఱుగు దిద్దిన అద్దములవంటివి, గాలిలోని దీపకళికలవంటివి, ఏనుగు చెవులవంటివి, ఎండమావులవంటివి, మిణుగురుపురుగుల వంటివి, ఆకాశపు అక్షరములవంటివి, వెన్నెలముద్దల వంటివి.... అట్టి అశాశ్వతమైన జీవితములలో సిరులను చూసి జనాలు ఏల మదాంధకారులవుచున్నారు? ప్రభో?*


✍️🌹💐🌷🙏

శ్రీకృష్ణుడు

 శ్రీకృష్ణుడు స్త్రీలోలుడు...

శ్రీకృష్ణుడు అధర్మవాది...

శ్రీకృష్ణుడు మాయలమారి..

శ్రీకృష్ణుడు ...ఎన్నో... ఎన్నెన్నో ఊహలలో అందరికీ అందినవాడు...

శ్రీకృష్ణుని గురించిన పలురకాల ఊహలు అభిప్రాయాలు, నిందలు, శిలాశాసనాలు...

ఎవరి చిత్తానికి వచ్చిన భావనలో వారు ఆ శ్రీకృష్ణుడిని చిత్రించుకున్నారు.

శ్రీకృష్ణ తత్త్వాన్ని అర్థం చేసుకున్న కొందరు ఆయన లీలలను ఆస్వాదించారు

ఆయన అంటే ఏమిటో బోధపరచుకున్నారు... 

          ఏయే వేళల నే సరోజముఖి యేయే లీలలం గోరు దా

        నాయా వేళల నా సరోజముఖి నాయాలీలలం దేల్చి, యే

       చాయం జూచిన దానయై మెలగుచున్సౌఖ్యాబ్ధినోలాడు భో

  గాయత్తుండయి పెక్కురూపముల మాయా కల్పనా చాతురిన్‌. 

                                                                                (పారిజాతాపహరణం ప్ర.ఆ.40)

       ‘‘ ద్వాపర యుగంలో స్త్రీలందరూ శ్రీకృష్ణునే తమ భర్తగా కావాలని కోరుకుంటే ఆ లీలామానుష విగ్రహుడు వారు కోరిన రూపాలలో వారికి దర్శనమిచ్చాడు. ఏ వేళలో ఏ స్త్రీ తనను ఏవిధంగా చూడాలనుకుందో, ఆయా రూపాలలో ప్రత్యక్షమయ్యాడు కృష్ణుడు. ‘తానే అంతటా’ అన్నట్టుగా అందరికీ సౌఖ్యం కల్పించాడు. అనేక రూపాలను ఒకేసారి చూపిన మాయా కల్పనాచతురుడు,’’ అని నంది తిమ్మన పారిజాతాపహరణంలో శ్రీకృష్ణుని ఔన్నత్యాన్ని వర్ణించాడు. 

పారిజాత పుష్పం విషయంలో సత్యభామకు వచ్చిన కోపాన్ని పాద తాడనంతో చూపింది. అది కూడా బ్రహ్మ, ఇంద్రాదుల చేత పూజలందుకునే ఆ జగన్నాథుని మీద ప్రదర్శించింది. అయినా ఆయనకు కించిత్తు కోపం కూడా కలగలేదు. పైగా.. తన కఠిన వక్షస్థలాన్ని తాకిన సత్యభామ లేత పాదం కందిపోయిందేమో చూడమని లాలనగా పలికాదు. ఇతరుల మనసును నొప్పించలేని శ్రీకృష్ణుడు తనను నిందించిన వారిని సైతం క్షమించే గుణం కలవాడు. అంతటా తానే అనే విషయాన్ని నిరూపించడానికే గీత ప్రబోధించాడు. మీరా వంటి భక్తురాలిని తనలో ఐక్యం చేసుకున్నాడు. పెంచిన తల్లి యశోదకు తన ముద్దుముద్దు మాటలతో, చేష్టలతో ఆనందాన్ని కలిగించాడు. కన్నతల్లిదండ్రులయిన దేవకీ వసుదేవులను చెర నుండి విడిపించాడు. కంస సంహారం చేశాడు. చీరలిచ్చి ద్రౌపది మానం కాపాడాడు. అర్జునునికి భగవద్గీత బోధించాడు. కర్మసిద్ధాంతాన్ని జాతికి అందించాడు. ధర్మహాని జరిగిన ప్రతి చోటా ధర్మాన్ని నిలబెట్టాడు. ఎక్కడ ఎప్పుడు తన అవసరం ఉందో అక్కడ అప్పుడు ఆ విధంగా ప్రత్యక్షమయ్యాడు. అందుకే శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. 

                                                                           డా. పురాణపండ వైజయంతి

దేవాలయాలు - పూజలు 23*

 *దేవాలయాలు - పూజలు 23*


6) *తీర్థము* :- తీర్థం అంటేనే తరింపజేసేది అని అర్థము. భగవంతునికి ఆరాధనా పూర్వకంగా పంచామృత స్నాన/ అభిషేక గంగనే (జలము) తీర్థం కాబట్టి ఈ పావనోదకము ప్రభావ మరియు ఔషధ గుణాలు/శక్తులను కల్గి ఉంటుంది. ఈ తీర్థం మహిమాన్విత మంత్ర సంయుక్తం కూడా. స్వీకరించిన వారికి సర్వ శుభాలను అందజేస్తుంది. గత వ్యాసాలలో వివిధ తీర్థముల గురించి తెలుసుకునియున్నాము. మరొకసారి పునశ్చరణ.... *పంచామృత అభిషేక తీర్థం, పానక తీర్థం, జల తీర్థం, కషాయ తీర్థం,తులసి తీర్థం, బిల్వ తీర్థం, పచ్చ కర్పూరం తీర్థం*. తీర్థ సమయంలో ఒక్కొక్క సారి అర్చక స్వాముల వారు పాలు మరియు పెరుగు కూడా అందజేస్తారు. పూజాదికాల అనంతరం తీర్థ గ్రహణ వలన, గ్రహించిన వారిలో ఆరోగ్యపరమైన ప్రయోజనాలతో పాటు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. 


భగవత్ పరమైన కార్యక్రమాలన్నియు నియమ నిష్ఠలతో మరియు నియమాలతో కూడి శాస్త్ర మరియు జ్ఞాన పరంగా ఉంటాయి, *భక్తులు పాటించవలసి ఉంటుంది*. శాస్త్ర మరియు జ్ఞాన పరంగా ఉంటాయి కాబట్టి అవి భక్తులకు హిత కరములే. భక్తులు గమనించాల్సింది *అన్నిటికంటే "భక్తి" ప్రధానం*


*నియమాలు*

1) *సావధానంగా*:- పూజల అనంతరము మాత్రమే తీర్థమును ప్రశాంతంగా, సావధానంగా భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. అవతల పనులున్నాయని అర్చక స్వాముల వారిని ఇబ్బంది పెట్టీ, బలవంత పెట్టీ, పూజ మధ్యలోనే తీర్థము కోరరాదు, పుచ్చుకోరాదు. సాధారణంగా గృహాలలో ఈలా జరుగుతూ ఉంటుంది.

2) తీర్థం తీసుకును నప్పుడు భక్తులు చేతిని గోకర్ణ (గోవు చెవి) ముద్ర వేసి అనగా ఈ ముద్రలో బొటన వేలు చూపుడు వేలును అంతర్ మడతతో నియంత్రిస్తుంది. చివరి మూడు వేళ్ళు మాత్రం ముందుకు సాగి ఉంటాయి. తీర్థము మినప గింజ పరిమాణంలో తీర్థము జాగ్రతగా పుచ్చుకోవాలి.

ఇందుకు శాస్త్ర ప్రమాణం..

*గోకర్ణాకృతి హస్తేన మాష మగ్న జలం పిబేత్* దేవాలయంలో గాని గృహంలో గాని పూజానంతరమే తీర్థం స్వీకరించాలి. *వాయు ముద్ర* లో తీర్థము సాధారణంగా పుచ్చుకోన రాదు, నిషిద్ధము. వాయు ముద్ర అంటే కుడి అరచేతిని మొత్తము వెడల్పుగా చాపడము. అలవాటుగానో, పొరపాటుగానో *వాయు ముద్ర* లో తీర్థం పుచ్చుకుంటే ఆ ప్రభావాలు వేరుగా ఉంటాయి.


3) *తీర్థం ఎన్ని సార్లు*:- దేవాలయంలో అవుతే ఒకసారి మాత్రమే. పూజలు నిర్వహించ బడిన గృహంలో...ఆ గృహంలోనే భోజనం చేసే అవకాశం, అవసరం ఉంటే.. తీర్థం *ఒకేమారు* పుచ్చుకోవాలి. ఆ గృహంలో భోజనం చేసే అవకాశం లేకుంటే తప్పనిసరిగా *మూడు సార్లు* తీర్థం స్వీకరించాలి. తీర్థం మూడు మార్ల విశిష్టత గూడా తెలియజేయ బడినది. *మొదటి* సారి పుచ్చుకున్నపుడు శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది.

*రెండవ సారి* పుచ్చుకున్నప్పుడు న్యాయ మరియు ధర్మ ప్రవర్తనలు అబ్బుతాయి.

*మూడవ సారి* పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం దక్కుతుందని పెద్దల విశ్వాసం.

మూడు సార్లు శ్రద్ధ, భక్తి, నియమ, నిష్ఠలతో తీర్థం పుచ్చుకుంటే భోజనము చేసినంత ఆత్మ నిబ్బరం లభిస్తుందని భక్తుల విశ్వాసము.

4) *ఉపవాస తదనంతరం* 

ఏకాదశి మరియు మిగతా పర్వ దినాల సందర్భంగా... ఉపవాసం ఉన్న మరుసటి ఉదయమే ఒకసారి తీర్థం పుచ్చుకోవాలి. *ఈ చర్య ఉపవాస దీక్ష ఉపసంహరణ (ముగింపు) ను తెలియజేస్తుంది*.

5) *తీర్థం స్వీకరణ* :- 

భక్తులు నుదుట తిలకము, విభూతి, కుంకుమ, చందనము ఇత్యాది మంగళకర లేపనములు లేకుండా తీర్థము స్వీకరించరాదు. 

తీర్థం కుడి చేతితో స్వీకరించాలి. నోటి వెంట శబ్దము కాని *జుఱ్ఱు* మని చప్పుడు రాకూడదు. ఆ వెంటనే తలపై చేతిని అద్దుకో రాదు, తుడుచుకోరాదు. తీర్థము గ్రహించునప్పుడు పై కండువా, ఉత్తరీయము, చేతి రుమాలు, మహిళలు అవుతే చీర చెంగును, బాలికలవుతే ఓణీని గాని హస్తము దిగువన ఉంచి తీర్థము తీసుకొన వలసి ఉన్నది, ఉంటుంది కూడా. తీర్థము ఒక చుక్క కూడా నేలపై పడరాదు. *గమనిక* అర్చక స్వాములు భక్తులకు తీర్థము ఇచ్చినప్పుడు యథాలాపంగా, అన్యమనస్కులై, ఇతరులతో సంభాషించుచూ అశ్రద్దగా *ఉండరాదు* తీర్థము చేతిని నీటితో శుభ్రం గాని అందుబాటులో ఉన్న వస్త్రంతో గాని శుభ్రపర్చాలి. తలకు తీర్థమును అద్ద రాదను నియమానికి పెద్దలు తెలియజేసిన రెండు కారణాలు. మనుష్యులు తలపై బ్రహ్మ దేవుడు పరివేష్టించి ఉండడం. మరియొకటి తీర్థము భక్తులకు అందించిన పిదప అర్చక స్వాముల వారు శఠారిని భక్తులపై తలపై ఉంచి భగవత్ అనుగ్రహము కల్గిస్తారు. శఠారి అంటే భగవత్ పాదములు. తీర్థము పుచ్చుకున్న *ఎంగిలిని* బ్రహ్మ దేవుల వారికి మరియు భగవత్ పాదములకు *అంటించ రాదు*. 

6) *తీర్థ విశిష్ట సంప్రదాయము*. సాధారణంగా దేవాలయాలలో/పూజల సంప్రదాయములతో పరిచయమున్న భక్తులు, తీర్థ స్వీకరణ సమయంలో పుచ్చుకునేటప్పుడు మొదటి సారి *కేశవాయ స్వాహా* అని, రెండవ సారి *నారాయణాయ స్వాహా* అని మూడవ సారి *మాధవాయ స్వాహా* అని ఉచ్చరించడం ఆనవాయితి. ఇంకా ఇంకా విశిష్ఠులు పుచ్చుకునే విధానంలో *బ్రహ్మ తీర్థ, దేవ తీర్థ, ఋషి తీర్థ మరియు పితృ తీర్థ* పద్ధతులు పాటిస్తారు.


ధన్యవాదములు

*(సశేషం)*

26, ఆగస్టు 2024, సోమవారం

*శ్రీ కృష్ణాష్టమి

 *శ్రీ కృష్ణాష్టమి సందేశము*


శ్రీ మహా విష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు, లోకంలో అరాచకాలు, దౌర్జన్యాలు, పాపం హద్దు మీరినప్పుడు దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం కోసం శ్రీ కృష్ణ అవతారం ధరించి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించాడు. *శ్రీ కృష్ణ అవతారము యొక్క ప్రధాన ఉద్దేశ్యము ఇదే*. 


శ్రీ కృష్ణుడి అవతార ముఖ్య ఉద్దేశ్యం గ్రహించి మాన్యులు మరియు సామాన్యులు గూడా *ప్రస్తుత పరిస్థితులను గ్రహించి* , దుష్టుల పన్నగాలను సకాలంలో గ్రహించి, వారి *పన్నాగాలను అరికట్టి*, అవసరమైతే శ్రీ కృష్ణ పరమాత్మ లాగా దండించి సనాతన ధర్మ రక్షణకు పూనుకోవాలి. ఈ కలియుగంలో దండన అంటే ఆత్మ రక్షణగా భావిద్దాము. 


*పరిత్రాణాయ సాధునామ్ వినాయాశచ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే*. 

అని చదువుకున్నాము. భగవంతుడు దుష్టులను శిక్షించుటకు శంఖ, చక్ర, గధాయుధములతో ఈ కలియుగంలో ప్రత్యక్షమవుట (వచ్చుట) సాధ్యము కాదు. *భగవాన్ మానుష రూపేణ* అని కూడా చదువుకున్నాము కాబట్టి మానవులే మాధవులైన చందమున ప్రతి వ్యక్తి భగవత్ శక్తిగా రూపొంది దుష్ట శిక్షణ చేయాలి, శిష్టులను రక్షించాలి. *దండించడం అంటే ఆత్మ రక్షణగా భావించాలి*.


ధన్యవాదములు.


*శ్రీ కృష్ణడి లీలా వినోదాలు గ్రోలుతూ తన్మయత్వం అనుభవించే రోజులు కావివి*.

_*శ్రీ గరుత్మంతుడి కధ -13

 _*శ్రీ గరుత్మంతుడి కధ -13 వ భాగం*_

🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎


*వైతరణీ_నది*


వైతరణీ నది చూట్టూ గల నరకలోకం. వైతరణి నది అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో పేర్కొనబడి ఉంది. పాపములు చేసిన వారు చని పోయిన పిమ్మట ఈ నదిని  దాటే వెళ్ళాలి. గరుడ పురాణం ప్రకారం ఈ నది యమ లోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహించును. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గుండా లోనికి వస్తారని ఇందులో పేర్కొన బడింది.


*1_వర్ణన*


ఈ నది అతి భయంకరమైనది, దీనిలో నుండి వెళ్లే సమయములో వచ్చే బాధకు పాపాలన్ని గుర్తుకు వస్తాయని పేర్కొనబడింది. ఈ నది కొన్ని వేల యోజనాలు వెడల్పు కలిగి ఉంది. ఈ నదిలో నీరుకి బదులుగా రక్తము, చీము, ఎముకలు, బురద వలె కనిపించే మాంసము ఉండును. ఈ నదిలో చాలా పెద్ద మొసళ్ళు మరియు మాంసము తినే క్రిములు, జంతువులు, పక్షులు ఉండడము వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం. ఇవే కాక సృష్టిలో ఉండే మాంసాహారులన్ని ఉండును.


వైతరణీ నదీ వైశాల్యాన్ని మినహాయించి యమపురి 86 వేల ఆమడల దూరంలో ఉంది. ఆమడ అంటే యోజనం. నాలుగు క్రోసుల దూరం ఒక ఆమడ. మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి, ఒక పగలు (మొత్తం ఒక్క రోజు కాలంలో) 247 ఆమడల చొప్పున నడుస్తూ సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వా పద, దుఃఖద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య, బహుభీతి అనే పదహారు పురములను దాటుకుని యమపురికి చేరుతాడు. ఊనషాణ్మాసికం (171 వ రోజు) పిండాలు భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాడట. అక్కడ నుంచే వైతరణి దాటాలి.


గోదానం చేసినవారు పడవలో ఆ వైతరణి దాటగలరుగాని, లేని వారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనపడుతుంది. పాపాత్ముడు అందులో దిగి నడవవలసిందే, ఆ పాపాత్ముని నోట ముల్లు గుచ్చి, చేపను పైకి లాగినట్లు లాగి యమ కింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. శీతాడ్యనగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రథమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరతాడు.


హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయు రూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవము కోసం యమభటులతో యమపురికి చేరువవుతాడు. ప్రారబ్ద కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలసి యమపురి చేరతాడు. శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందట..


*2_దాటడానికి_మార్గాలు*


ఈ నదిని దాటుటకు కొన్ని విభిన్న మార్గాలు గలవు. ఐతే ఒక విషయం గమనించవలసింది ఏమిటంటే కేవలము పాపాలు చెసినవారు మాత్రమే ఈ నది గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అనగా ఏ ఒక్క పాపము చెయ్యని వారు, మంచి కర్మలను చేయువారు ఈ మార్గము అనగా దక్షిణ ద్వారము గుండా రారు, ఇంకా చెప్పాలంటే యమ లోకానికే రారు.


*3_నది_దాటాక*


ఈ నది దాటిన పిమ్మట పాపులు దక్షిణ ద్వారమునకు చేరుకొందురు. అబద్ధమాడిన_వారు_నరకాన్ని_చవి_చూడాల్సిందే


ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దోవలో వైతరణి ఎదురైంది. దోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది. అంతా అంధకారం. మాంసం, నెత్తురు, ఎముకలు, కేశాలు, ప్రేతాల గుంపులు, ముసురుకుంటున్న ఈగలు, క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి. ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు. దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు, భార్య ఈ నరకంలో ఉండటమేమిటి? అన్నాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితమన్నాడు. అశ్వత్థామ హతః అని పెద్దగా అని, కుంజరః అని చిన్నగా పలికి గురువైన ద్రోణుడిని వంచించిన పాపానికి, ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చిందని అన్నాడు. అబద్దమాడిన వారికే నరకం తప్పకపోతే, నరహత్య చేసే వాళ్లకు ఎలాంటి శిక్షలుంటాయో?

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*శ్రీ వినాయక దేవాలయం*

 🕉 *మన గుడి : నెం 421*






⚜ *కర్నాటక  : ఆనెగుద్దె- ఉడిపి* 


⚜ *శ్రీ వినాయక దేవాలయం*



💠 అనెగుద్దె భారతదేశంలోని ఉడిపి జిల్లాలోని కుందాపుర తాలూకాలోని ఒక గ్రామం.  

ఈ గ్రామాన్ని కుంబాషి అని కూడా అంటారు.  ఇది NH 66లో ఉడిపి నుండి కుందాపుర వైపు మార్గంలో ఉంది.


💠 కుంభాసి అనే పేరు ఇక్కడ వధించిన కుంభాసురుడి నుండి ఉద్భవించిందని చెబుతారు.


💠 ఒక పురాణం ప్రకారం, గౌతమ మహర్షి ఇక్కడ తన ఆశ్రమాన్ని కలిగి ఉన్నాడు.  పార్వతీ దేవి సూచనల మేరకు గణపతి మాయా ఆవుతో మారువేషంలో ఇక్కడికి వచ్చాడు.  


💠 భగవంతుడు సిద్ధి వినాయకుడు లేదా సర్వ సిద్ధి ప్రదాయకుడు తన భక్తుల కోరికలను తీర్చి ప్రజల అనేక సమస్యలను పరిష్కరిస్తారని ఆయనను నమ్ముతారు, అందుకే ఈ ప్రదేశాన్ని "ముక్తి స్థలాలు" అని పిలుస్తారు, అంటే "మీరు మోక్షాన్ని పొందగల ప్రదేశం". 

 

💠 చాలా కాలం క్రితం ఈ ప్రాంతం కరువుతో కొట్టుమిట్టాడినప్పుడు, అగస్త్య మహర్షి ఇక్కడకు వచ్చి వానదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞం చేశాడు.  

ఆ సమయంలో రాక్షసుడు కుంభాసురుడు యజ్ఞం చేస్తున్న ఋషులను ఇబ్బంది పెట్టి యజ్ఞానికి భంగం కలిగించడానికి ప్రయత్నించాడు.  

ఋషులను రక్షించడానికి గణేశుడు పాండవులలో (వారి ప్రవాస కాలంలో) అత్యంత బలవంతుడు అయిన భీముడిని కత్తితో ఆశీర్వదించాడు, దానిని ఉపయోగించి భీముడు రాక్షసుడిని చంపి యజ్ఞాన్ని పూర్తి చేశాడు. 

అందుకే దీనికి కుంబాశి అని పేరు.  



💠 కన్నడలో “ఆనే” అంటే ఏనుగు మరియు “గుడ్డె” అంటే చిన్న కొండ అని అర్థం.  

ఈ దేవాలయం పూర్వం ఏనుగులు ఎక్కువగా వచ్చే చిన్న కొండలో ఉన్నందున దీనికి ఆనెగుడ్డె/ఆనెగుడ్డె అని పేరు పెట్టారు.  

ఇది తీర కర్ణాటకలోని 7 ముక్తి స్థలాలలో ఒకటి.


💠 ఏనుగు తల గల దేవుడు శ్రీ వినాయకుని నివాసం కనుక ఆనె (ఏనుగు) మరియు గుడ్డె (కొండ) నుండి ఆనెగుడ్డె అనే పేరు వచ్చింది.


💠 గర్భ గృహం లేదా ప్రధాన గర్భగుడిలో వెండి కవచంతో కప్పబడిన నిర్మాణం వంటి భారీ రాతిలో చతుర్బుజ (4 చేతులతో) లో వినాయకుడు ఉన్నాడు. 

రెండు చేతులు "వరద హస్త" వరాలను అందజేస్తున్నాయి మరియు రెండు చేతులు మోక్షాన్ని పొందాలని సూచిస్తున్నాయి. మందిరం చుట్టూ భార్గవ పురాణం నుండి శిల్ప చిత్రణలు ఉన్నాయి.



💠 తులాభారం : 

ఒక వ్యక్తి బరువుతో సమానమైన విలువైన వస్తువులను దేవుడికి సమర్పించే ఆచారం ఈ ఆలయంలో భక్తులు తరచుగా చేస్తారు. 

పెళ్లి, నామకరణం మొదలైన శుభ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి.


💠 ప్రతి చాంద్రమానంలో చౌతి / చతుర్థి (పౌర్ణమి తర్వాత 4వ రోజు) నాడు, ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి.  

సంకష్టం మీద మరియు పూజ గణేశ రథోత్సవంలో కూడా అందించబడుతుంది.


💠 వినాయక చతుర్థి ఇక్కడ చాలా వైభవంగా మరియు వైభవంగా జరుపుకుంటారు.

ఈ ఆలయంలో గణేశ చౌతి ప్రధాన పండుగ.


💠 ప్రతి చాంద్రమానంలోని చౌతి / చతుర్థి నాడు, ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో రథోత్సవం (రథోత్సవ) డిసెంబర్ మొదటి వారంలో జరుగుతుంది.

ఆలయం ప్రసాదంగా మధ్యాహ్న భోజనాన్ని కూడా అందిస్తుంది. 


💠 సమయాలు: 

ఉదయం 5:30 నుండి రాత్రి 8:30 వరకు


💠 ఆనెగుద్దె గ్రామం ఉడిపి జిల్లాలోని కుందాపురానికి దక్షిణంగా 9 కి.మీ దూరంలో ఉంది.  ఆనేగుడ్డె నుండి ఉడిపి దూరం సుమారు 34 కి.మీ.

Panchaag

 


నూరేళ్ల పంట అయిన పెళ్లి

 https://youtu.be/SqnvBocRBLI?si=QGL7iUQMDQgdGrne




శ్రీభారత్ వీక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 🌹 నూరేళ్ల పంట అయిన పెళ్లిని ఈ కాలం పిల్లలు, పెద్దలు ఎలా ఎగతాళి చేస్తున్నారో ఈ ఎపిసోడ్ లో ఎంతో చక్కగా వివరించారు ప్రముఖ రచయిత్రి డా. తిరుమల నీరజ గారు. ఎన్ని జంటలు తమ వివాహ స్వర్ణోత్సవం జరుపుకొంటున్నాయని ప్రశ్నిస్తూ పెళ్లి తంతు దగ్గర్నుంచి వైవాహిక జీవితం గడపడం వరకు అన్ని సందర్భాల్లో గతి తప్పడం వల్లే ఎన్నో అనర్థాలు తలెత్తుతున్నాయంటున్నారు. ఎంతో పవిత్రమైన వివాహ వ్యవస్థను మనం కాపాడుకుంటే ప్రతి పెళ్లి నూరేళ్ల పంటే అవుతుందని చెపుతున్నారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏