7, ఫిబ్రవరి 2021, ఆదివారం

విమల ఏకాదశి, షట్తిల ఏకాదశి

 07/02/ 2021 - ఆదివారం - 

విమల ఏకాదశి, షట్తిల ఏకాదశి 


ఈ రోజున స్నానం చేసే నీటిలో నువ్వులు కలుపుకుని చెయ్యాలి...

 నువ్వులను ఆహారంలో స్వీకరించడం, 

మంచినీటిలో నువ్వులను కలుపుకోవడం, 

నువ్వులతో హోమం చెయ్యడం,

నువ్వులతో దేవుని పూజించడం,

నువ్వులను దానం చేయడం చెయ్యాలి - 

ఈ విధంగా ఇది షట్తిల ఏకాదశి అయింది.....


షట్తిల మంటే...

1,తిల స్నానము,  

2,తిల దీపము,  

3,తిలహోమము,  

4,తిలతర్పణము, 

5,తిల భక్షణము, 

6,తిల దానము... 

[ఇది నాకు తెలిసినది.... దీని విధి విధానములు కూడా!?] 



మకర సంక్రాంతి లో షట్తిల విశేషము... అలాగే ఆ పక్షములో వచ్చే ఏకాదశిని షట్తిల ఏకాదశి అని వ్యవహరిస్తారు...



తిలస్నాయీ

తిలోద్వర్తీ

తిలహోమీ

తీలోదకీ

తిలభుక్

తిలదాతా చ

షట్ తిలాః పాపనాశనాః.

🙏✨💖🌷

సుభాషితమ్

 🙏 *శుభోదయమ్* 🙏

🌸 *సుభాషితమ్* 🌸

 

శ్లో|| ఏకో ధర్మః పరం శ్రేయః క్షమైకా శాన్తిరుత్తమా|

విద్యైకా పరమా తృప్తిః అహింసైకా సుఖావహా||


తా|| "ధర్మమొక్కటే పరమశ్రేయస్సును కలిగించును. ఓర్పు ఒక్కటే ఉత్తమమైన శాంతినిస్తుంది. చదువొక్కటే మిక్కిలి తృప్తిని ప్రసాదించును. అహింస ఒక్కటే సుఖాన్ని చేకూర్చును"...... 

🙏💖✨🌷

మొగలిచెర్ల

 *సమస్య..సత్వర పరిష్కారం..*


"ఒకసారి మొగిలిచెర్ల కు వచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధి ని దర్శించాలని చాలా రోజుల నుంచీ అనుకుంటున్నాను..ఎలా రావాలో తెలియదు..మీకు ఫోన్ చేద్దామని ప్రయత్నం చేసిన ప్రతిసారీ..ఏదో ఒక అడ్డంకి రావడం..ఆ సమయానికి ఆ పనిలో మునిగిపోవడం..జరుగుతున్నది..ఈరోజు ఉదయం గట్టిగా నిర్ణయం తీసుకున్నాను..అందుకే నా నిత్యపూజ పూర్తి చేసుకొని..దత్తాత్రేయుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీకు ఫోన్ చేస్తున్నాను..నా పేరు శ్రీవల్లి..మా వారు సాయిరాం గారు..బాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నారు..కొన్ని సమస్యలలో ఉన్నాము..ఆ స్వామివారి సమాధిని దర్శించుకొని గట్టిగా మొక్కుకుంటే..కొంతవరకూ ఫలితం ఉంటుందని అనుకుంటున్నాము..దయచేసి ఎలా రావాలో చెప్పండి.." అని ఆవిడ నాతో ప్రాధేయపడింది..వాళ్ళు వుండే ఊరు కనుక్కుని..అక్కడినుండి మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి రావడానికి రూట్ చెప్పి..గూగుల్ మాప్ లింక్ కూడా వాట్సప్ చేసాను..త్వరలోనే వస్తామని చెప్పింది..


మరో పదిరోజుల తరువాత ఒక మంగళవారం నాటి ఉదయం తొమ్మిది గంటల వేళ నేను స్వామివారి మందిరం లో కూర్చుని ఉండగా..ఇద్దరు వ్యక్తులు..వాళ్ళను చూడగానే దంపతులు తెలుస్తున్నది..లోపలికి వచ్చారు..నన్ను చూసి నేరుగా నా దగ్గరకు వచ్చి.."మీరు ప్రసాద్ గారే కదా..?" అన్నారు..అవును అన్నాను.."నేను శ్రీవల్లిని..పదిరోజుల ముందు మీతో మాట్లాడాను..మావారు సాయిరాం గారు..స్వామివారి దర్శనానికి వచ్చాము..వీలుంటే ఒక రూమ్ ఇప్పించండి..స్నానం చేసి వస్తాము.." అన్నారు..మా సిబ్బందికి చెప్పి రూమ్ కేటాయించాము..మరో గంట తరువాత ఇద్దరూ స్నానాదికాలు ముగించుకొని మందిరం లోకి వచ్చారు..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి,భక్తిగా నమస్కారం చేసుకొని..స్వామివారి ఉత్సవ మూర్తి వద్ద తమ గోత్రనామాలతో అర్చన చేయించుకొని..స్వామివారి సమాధి గది గడప ఇవతలి నుంచే..దాదాపుగా సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా ప్రణమిల్లి ఇవతలికి వచ్చారు..


"మాకు ఒక తీవ్రమైన సమస్య ఎదురైంది..ఏం చేయాలో తెలీక కొట్టుమిట్టాడుతున్నాము..ఒక రకంగా దిక్కుతోచని స్థితిలో ఉన్నాము..మావారు బాంక్ మేనేజర్ గా వున్నారు..తన స్నేహితుడికి సహాయం చేసే ఉద్దేశ్యంతో..అతను పాడుకొన్న చిట్ కు గ్యారెంటీ కోసం సంతకం చేశారు..ఆ స్నేహితుడూ ఈయన తో సమానమైన ఉద్యోగస్తుడే..కొన్ని నెలలు అతను చిట్ వాయిదాలు సక్రమంగా కట్టాడు..ఆ తరువాత ఆర్ధిక ఇబ్బందులు ఎదురై..చిట్ తాలూకు బకాయిలు కట్టలేదు..చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు మా వారి మీద వత్తిడి తెచ్చారు..అంత డబ్బు కట్టే స్తోమత మాకు లేదు..స్నేహితుడు ముఖం చాటేశాడు..కంపెనీ వాళ్ళు కోర్టుకు వెళతామని బెదిరిస్తున్నారు..ఒక బాంక్ మేనేజర్ గా వుండి..కోర్టుకు వెళితే..పరువు పోతుందని బాగా బాధపడుతున్నాము..ఏ దిక్కూ తోచక..ఈ స్వామివారిని వేడుకొందామని వచ్చాము..రెండు రోజులు సెలవు పెట్టాము..ఈరాత్రికి, రేపు రాత్రికి ఇక్కడ నిద్ర చేసి..ఎల్లుండి గురువారం ఉదయం కూడా స్వామివారి సమాధి వద్ద మరొక్కసారి మొక్కుకొని వెళ్లిపోతాము.." అని చెప్పారు..సరే మీ ఇష్టం అన్నాను..


ఆరోజు సాయంత్రం స్వామివారి మందిరం లో 108 ప్రదక్షిణాలు చేశారు..అలాగే ప్రక్కరోజు ఉదయం సాయంత్రం..మళ్లీ గురువారం ఉదయం..వరుసగా మూడురోజులూ 108 సారు మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేశారు..అలా చేయమని మేమెవ్వరమూ చెప్పలేదు..ఆ దంపతులిద్దరూ అనుకోని ఆ విధంగా చేశారు..గురువారం ఉదయం శ్రీ స్వామివారి సమాధి వద్ద మొక్కుకొని..నాతో వెళ్ళొస్తామని చెప్పి వెళ్లిపోయారు..


ఆ తరువాత వచ్చే ఆదివారం ఉదయం..స్వామివారి మందిరం లో భక్తులు ఎక్కువగా వచ్చి వున్నారు..నేనూ మా సిబ్బందీ బాగా పనిలో ఉన్నాము..ఆ సమయం లో ఈ దంపతులు, వారితో పాటు మరో భార్యాభర్తలు వచ్చారు..నన్ను చూసి పలకరింపుగా నవ్వారు..టికెట్ కొనుక్కొని వచ్చారు..నలుగురూ లోపలికి వెళ్లి స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వచ్చారు.."ప్రసాద్ గారూ..సాక్షాత్తు స్వామివారు మా వెనుకే వుండి..మమ్మల్ని రక్షించారు..నేను గ్యారెంటార్ గా ఉన్నది ఇదుగో ఇతనికే..మొన్న శుక్రవారం నాడు ఇతని స్థలం ఒకటి అమ్ముడుపోయింది..చిట్ వాళ్లకు ఆరోజే కొంత సొమ్ము కట్టాడు..నా మీద ఉన్న పెద్ద బరువు దిగిపోయింది..స్వామివారిని మేము వేడుకున్న ఫలితమే ఇది..ఆ మాటే ఇతనికి చెప్పాను..ఆలస్యం చేయకుండా స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి బైలుదేరుతుంటే..వీళ్ళు కూడా వస్తామన్నారు..తీసుకొచ్చాము..ఇంత త్వరగా నేను గట్టున పెడతానని ఊహించలేదు..వత్తిడిలో వున్నప్పుడు..మా స్నేహాన్ని కూడా శంకించాను..కానీ అతని ప్రయత్నాలు అతను చేస్తున్నాడని గ్రహించలేదు..ఏది ఏమైనా..ఇద్దరమూ గట్టున పడ్డాము.." అంటూ చెప్పాడు సాయిరాం..శ్రీవల్లి గారు ఏకంగా కన్నీళ్లే పెట్టుకున్నారు..


"మీ విశ్వాసమే మిమ్మల్ని కాపాడింది.." అన్నాను..ఆరోజు మధ్యాహ్నం ఆ నలుగురూ స్వామివారి వద్ద భోజనం చేసి తిరిగి వెళ్లారు..రాబోయే కార్తీక మాసం లోని ఒక సోమవారం నాడు ఇక్కడికి వచ్చి, స్వామివారికి అభిషేకము చేయించుకొని..ఆరోజు అన్నదానం చేస్తామని చెప్పి వెళ్లారు..


స్వామివారిలీలలు, భక్తుల అనుభవాలు కళ్లారా చూస్తూనే ఉంటాము..కానీ ప్రతిసారీ మాకు కొత్తగానే ఉంటుంది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

6, ఫిబ్రవరి 2021, శనివారం

సంపూర్ణ తిరుమల చరిత్ర - 14**

 **దశిక రాము**


**సంపూర్ణ తిరుమల చరిత్ర - 14**


కర్కటే పూర్వఫల్గున్యాం తులసీ కాననోద్భవం, పాండ్యే విశ్వంభరాం గోదాం 


వందే శ్రీరంగ నాయకీం నీలంగస్తన గిరితటీసుప్త ముద్యోధ్య కృష్ణం పారార్ధ్యం 


స్వం శృతి శత శిరస్సిద్ధ మధ్యావయంతీ స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా 


బలాత్కృత్య భుంక్తే, గోదా తస్యైనమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ


విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరు నందు శ్రీకృష్ణ ఆలయానికి నిత్య పుష్ప కైంకర్య మూర్తి. మూర్తీభవించిన భగవత్స్వరూపులు. తనువూ, మనసు అంతా శ్రీమహావిష్ణువు ధ్యానం తప్ప మరేమీ తెలీనివాడు. రకరకాల పూలమాలలతో శ్రీకృష్ణుని అలంకరించడంలో ఆనందానుభూతిని పొందడంలో దివ్యానురాగ చక్రవర్తి.


అది క్రీస్తుశకం 776వ సంవత్సరం. కర్కట లగ్నం, పుబ్బా నక్షత్రం. ఆ పవిత్ర దినాన, నిత్య హరినామదాసుడు విష్ణుచిత్తుడు ఆలయ ఉద్యానవనంలో ఇంద్ర ధనుస్సును పోలిన పుష్పవనంలో హరినామ సంకీర్తన చేస్తూ, భగవానుని పాదార్చనలో తనువు బాయాలని అర్రులు చాచే పూబాలల సేకరణకై ఉద్యానవనం కలయతిరుగుతున్నాడు. రకరకాల పూమాలల అలంకరణతో వాసుదేవుని దివ్యమంగళ రూపం చూడాలనే తపన విష్ణుచిత్తునిది. అలా తిరుగాడుతున్న విష్ణుచిత్తునకు తులసిమొక్కల చెంత బంగారు వర్ణ రంజితమైన ఒక పసిపాప బోసినవ్వులు విరబూస్తూ పూలామాలికల మధ్య పూబాలిక మాదిరిగా కనిపించింది. పరిసరాలు గమనించాడు. ఎవరూ లేరు. చుట్టుపక్కల విచారించాడు. ఎవరూ తమ బిడ్డ కాదన్నారు. అంతట ఆ పసిడి బాలిక తనవైపే నవ్వులు చిందిస్తూ ఉండటంతో పరవశుండైన విష్ణుచిత్తుడు ఆ బాలిక భగవంతుని అరుగ్రహించిన బిడ్డగా తన భార్యకు అందజేశాడు. సంతాన విహీనులైన ఆ దంపతులకు బాలిక పూమాలిక అయింది. ఎంతో అందంతో, నిత్యసంతోషిణి అయిన ఆ చిన్నారికి కోదై అని నామకరణం చేశారు. ఈమెకు ''చూడిక్కొడుత్త నాచ్చియార్'', ''ఆండాల్'', గోదాదేవి'', ''ఆముక్తమాల్యద'' – అని పేర్లున్నాయి. ఈమె కధనే శ్రీకృష్ణదేవరాయలు ''ఆముక్తమాల్యద'' పేరుతో అమూల్య గ్రంధంగా మలచాడు. ఈమె భూమాత అంశగా జన్మించింది. అల్లారుముద్దుగా ఉన్న గోదాదేవికి విష్ణుచిత్తుడే పంచ సంస్కారాలు చేశాడు.


నారాయణుడీతడు నరులార మీరు శరణనరో మిమ్ము గాచును 


తలచిన చోటను తానే ఉన్నాడు వలెననువారి కైవశమెపుడు 


కొలచెను మూడడుగుల జగమెల్లను కొలచినవారిని చేకొననుండునా 


ఎక్కడ పిలిచిన ఏమి అని పలికి మొక్కిన మన్నించు మునుముగాను 


రక్కసులనణచి రక్షించు జగములు దిక్కని నమ్మిన తిరముగ నేలడా 


చూచిన యందెల్ల చూపును రూపము ఓచిక పొగడిన ఉండునోటను


అన్నట్లు నిరంతరం వాసుదేవుడినే నమ్ముకున్న విష్ణుచిత్తుడు తన నిత్య కైంకర్యమైన పూమాలలు వనమాలికి అందించే విషయంలోనూ అల్లికలోనూ, అలంకరణలోనూ తన కుమార్తె కూడా చిట్టి చిట్టి చేతులతో సహకారం అందించి చిట్టి చిట్టి సేవలు చేసేది. ఆ చిరుసేవయే తండ్రికి మహదానందం కలగాజేసేది. పరవశించి తండ్రి పోయేవాడు ఆ చిన్నారి సేవలకు. ఇలా దినదిన ప్రవర్ధమానంగా అతి సౌందర్య రాశిగా పెరగసాగింది గోదాదేవి. ఈ సుగుణాల రాశిని చూసి విష్ణుచిత్తుడు ఒక వంక పరమానందభరితుడౌతూ మరోవంక ఇంత సద్గుణ సౌందర్యరాశికి ఎవరిని వరునిగా తేవాలి - అని ఆందోళనపడసాగాడు. నిత్యం స్వామి అలంకరణకే కాదు తన అలంకరణలో కూడా ఎనలేని శ్రద్ధ చూపించేది గోదా. యువతులకు ఆ వయసులో అలంకరణపై ధ్యాస ఉండటం సహజమే కదా! పూలమాలలతో రకరకాల అలంకరణలు చేసుకోవాలని తపించేది. కానీ తండ్రి ఆ తోటలోని పూలన్నీ మాధవుని సేవకేనని ఆజ్ఞాపించడంతో ఆ పూలను తాను అలంకరించుకునేందుకు తటపటాయించేది. కానీ తన సౌందర్యాన్ని పూమాలల అలంకారంతో మరింత శోభింపచేసుకోవాలనే తన ఆశను ఎలా తీర్చుకోవాలని ఆలోచించి ఒకరోజు తన తండ్రి మాధవుని అలంకరణకు సిద్ధం చేసుకున్న పూమాలలను తాను ధరించి ఆ తోటలో ఉన్న బావినీటిలో తన అందాన్ని చూసుకుని మురిసిపోయింది. తర్వాత ఆ పూమాలలను యధాస్థానంలో ఉంచి స్వామి సేవకు అందించేది. ఇది గమనించని విష్ణుచిత్తుడు ఆ పూమాలలను పరమ పావనమూర్తికి పరవశంతో అలంకరణకు ఆలయంలో అందించాడు. ఎందుకో ఆనాడు శ్రీకృష్ణుడు ఆ మాలలను ధరించినంతలో మరింత సౌందర్యంగా గోచరించాడు. అంతటా విష్ణుచిత్తుడు గోదాదేవి అందించినందువల్ల వాసుదేవుడు ఆరోజు మరింత సౌందర్యంగా కనిపించాడు అనుకుని ప్రతిరోజూ గోదాదేవిచేత అందుకున్న పూలమాలలానే స్వామికి సమర్పించేవాడు. ఇలా కొంతకాలం గడిచింది.


ఎప్పుడూ కాలం ఒకలాగే ఉండదుకదా! ఎంతో భక్తి పారవశ్యంతో గోదాదేవి చేత అందుకున్న పూమాలలను భట్టనాథునకు ఒకరోజు ఆ పూలమాలల్లో ఒక పొడవాటి వెంట్రుక కనిపించింది. వెంటనే విష్ణుచిత్తుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి అది స్త్రీమూర్తి కేశంగా భావించి తన కుమార్తె గోదాదేవిని ఆ విషయమై విచారించాడు. గోదాదేవి ప్రతిరోజూ తాను చేసే పనిని తెలుసుకున్న విష్ణుచిత్తుడు నిశ్చేష్టుడయ్యాడు. ఎంతో గారాబంగా పెంచుకున్న తన కుమార్తె చేసిన పనికి నొచ్చుకుని ఇకపై అలాంటి తప్పు చేయొద్దని మందలించాడు. అంతేకాదు, నిర్మాల్యమైన ఆ పూలమాలలను స్వామికి నివేదించకుండా ఎంతో విచారంగా ఇంటికి చేరుకొని తన కుమార్తె చేసిన తప్పు క్షమించమని ఆ దేవదేవుని వేడుకుని నిద్రలోకి జారుకున్నాడు.


అలసటతో నిద్రించిన విష్ణుచిత్తునికి కలలో మహావిష్ణువు వటపత్రశాయిగా ప్రత్యక్షమై ''ఏం భట్టనాథా! ఈరోజు నాకు పూమాలలు సమర్పించలేదేం?'' అని ప్రశ్నించాడు. దానికి ముకుళిత హస్తాలతో వినమ్రతాంజలి ఘటించిన విష్ణుచిత్తుడు ''స్వామీ! ఈరోజు ఘోర తప్పిదం జరిగింది. తమకు సమర్పించవలసిన పూలమాలలు నా కుమార్తె ధరించినందున ఆ నిర్మాల్య మాలలను తమకు సమర్పించ ఇచ్చగించనందున ఆలయానికి తేలేదు, మన్నించండి'' అని వేడుకున్నాడు. అంతట భగవానుడు నవ్వుతూ ''ఓ విప్రుడా! నీకు ఇప్పుడే తెలిసింది. కానీ ఆ బాల ముడిచిన పూలమాలలు చాలాకాలం నుండే నేను అమితానందంతో ధరిస్తున్నాను. అవే నాకు సంతోషాన్ని, ఆనందాన్ని కలగాజేస్తున్నాయి. కనుక నీవు నిర్భీతిగా ఆమె ధరించిన మాలలనే నిత్యం నాకు సమర్పించవచ్చు'' అని ఆనతిచ్చాడు. అంతటా ఉలిక్కిపడి నిద్ర లేచిన విష్ణుచిత్తుడు భగవానుడు ఆదేశించిన విధంగా గోదాదేవి ధరించి ఇచ్చిన మాలలనే ఇకపై ఆలయంలోని వటపత్రశాయికి సమర్పించ సంకల్పించాడు.


ఇదే విషయాన్ని అక్కడి ప్రజలకు తెలియజేసి తన బిడ్డ మహాలక్ష్మి అంశగా ఎంచి నిత్యం ఆమె ధరించి విడిచిన మాలలనే ఆలయస్వామికి సమర్పించసాగాడు. అప్పటినుండి ఆమెను చూడికొడుత్త నాచ్చియార్ అని, ఆముక్తమాల్యద అని పిలవసాగారు. ఇదే పేరుతో శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద గ్రంథాన్ని రచించి ఆంధ్రభోజుడని పేరు తెచ్చుకున్నాడు.


విష్ణు కైంకర్య నిరత అయిన గోదాదేవి అత్యంత భక్తితో, దైవీగుణ సంపన్నయై దివ్య సౌరభంతో జ్ఞాన వైరాగ్యాదులగు విశేష గుణాలతో ఆళ్వారులను మించి వికసింపసాగెను. అందునా పరమపురుషుడైన వటపత్రశాయియే తాను ధరించినప్పుదు ఏ మగువ మాత్రం తన జీవిత సర్వస్వం అర్పించకుండునా?!


ఈవిధంగా తన కుమార్తె పరమాత్ముని పరిష్వంగానికై పరితపిస్తుందని భావించిన విష్ణుచిత్తుడు ''అమ్మా! పూర్వం గోపికలు శ్రీకృష్ణుని పొందగోరి ఒక వ్రతం ఆచరించారు. నీవు కూడా ఆ వరం ఆచరించి పరమాత్మను చేపట్టగలవని చెప్పి ఆనాడు గోపికలు ఆచరించిన ధనుర్మాస వ్రతాన్ని ఉపదేశించాడు. అంతేగాక ఆ వ్రతాన్ని ఎలా చేయాలో విశదీకరించి వ్రత మహిమను కూడా బోధించాడు.


హేమంతే ప్రథమే మాసి నంద ప్రజకుమారికా


చేరుర్హవిష్యం భుంజానా కాత్యాచన్యర్చన వ్రతం


కాత్యాయనీ మాత వ్రతాన్ని చేయ సంకల్పించిన గోదాదేవి ఎముకలు కోరికే చలికాలంలో ఉదయాన్నే చన్నీటితో స్నానం చేసి, ఒంటిపూట భోజనంతో ఆనాడు గోపికలు ఆచరించిన వ్రతాన్ని ఆచరించింది. అంతేకాకుండా ఆ మాసమంతా రోజుకొక గీతాన్ని గానం చేసింది. అలా కూర్చిన ముప్పై పాశురాలనే తిరుప్పావై పేరుతో ప్రసిద్ధిచెందింది. ఇంతేకాకుండా గోదాదేవి నాచ్చియార్ తిరుమొళి అనే 140 గాథలున్న మరొక ప్రబంధాన్ని కూడా రచించింది. ఈమె రచించిన భావనామృన్ని గ్రహించిన మీరాదేవి కూడా హిందీలో ఆ మురహరునిపై విరహగీతాలాపన చేసింది.


నిత్యం మురహరుని ధ్యానంలో మునిగిపోయి నిద్రాహారాలు మరచి కృశించిపోతున్న తన కుమార్తె గోదాదేవిని చూసిన విష్ణుచిత్తుడు ''ఏమ్మా! ఎందుకలా ఉన్నావు? నీవు కోరిన విధంగా ఆ మురహరునికే నిన్ను కట్టబెడతాను. కానీ ఆ మహావిష్ణువు ఈ భువిపై 108 దివ్య తిరుపతుల్లో వెలసియున్నాడు. నీవు కోరిన వానికిచ్చి వివాహం చేయదలచాను'' అని ఆ 108 దివ్య తిరుపతుల వైభవాన్ని అక్కడ వెలసిన శ్రీమహావిష్ణువు దివ్య రూపాన్ని వర్ణించసాగాడు. ఆసాంతం అన్ని గాథలు విన్న గోదాదేవికి శ్రీరంగనాథుని వైభవం గురించి వర్ణిస్తున్నప్పుడు ఆమె ముఖారవిందం వికసించడం చూసి ఆ శ్రీరంగనాథుదే తన గారాలపట్టికి తగిన వరునిగా ఎంచి అతనికే ఇచ్చి వివాహం చేయ నిశ్చయించుకున్నాడు.


ఎగిరి నీ పాదముల చెంత కెట్లు వచ్చి వాలుడునో యన్న యుత్సుకత్వంబు కలడు సాధ్యసాధనమైన పక్షముల జంట హృదయమున కుండి శరీరమునకు లేదు ఓ శ్రీరంగపతీ, ఇంతకాలం ఈవిధంగా నీ కొరకు పరితపించవలె? ఒక్కమారుగా ఎగిరి వచ్చి నీ పాదాంబుజములను చేరవలెనాన్న ఆశ మిక్కిలి అధికమగుచున్నది. అయ్యో నా హృదయమునకు రెక్కలు ఉన్నవి కానీ, నా శరీరమునకు లేవే. ఒక పక్షిగా పుట్టిన నిన్ను క్షణంలో చేరి నీ పరిష్వంగం చేరేదాన్ని కదా'' అని వాపోయింది.


భట్టనాథుని వాక్యాలకు తన హృదయ విపంచి వినీలాకాశంలో పయనించసాగింది. భట్టనాథుని కోరిక మేరకు ఆలయాధికారులు ఈ విషయాన్ని ఆ దేశపు రాజైన వల్లభదేవునికి విన్నవించారు. దానికి ఎంతో సంతోషించిన వల్లభదేవుడు శ్రీవిల్లి పుత్తూరులోని శ్రీకృష్ణ ఆలయ పరిసరాలు సర్వాలంకారాలతో అలంకరించి పెళ్ళి శోభ తెచ్చాడు. మంగళవాద్యాలు, గజ, తురగ పదాతి దళాలతో వల్లభదేవుడు రాచమర్యాదలతో గోదాదేవిని శ్రీరంగం తీసుకుని వచ్చాడు. దారంతా గోదాదేవి రచించిన తిరుప్పావై జనులంతా పఠిస్తుండగా శ్రీరంగంలోని సప్త ప్రాకారాలు వివాహ శోభతో దేదీప్యమానంగా ప్రకాశించసాగాయి. పెళ్ళి పల్లకిలో శ్రీరంగం చేరిన గోదాదేవికి ఘనంగా స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. ఆలయ ప్రాంగణం అంతా ముత్యాలముగ్గులతో, మంగళతోరణాలతో శోభిస్తోంది.


అక్కడి ప్రజలంతా దివ్య ప్రబంధంలోని పాశురాలను మనోహరంగా గానం చేయసాగారు. ఆలయ ప్రాంగణం అంతా శ్రీరంగనాథుని నామస్మరణతో మారుమోగింది. శ్రీవైష్ణవులు దివ్య పాశురాలను గానంచేస్తున్నారు. వందిమాగధులు స్తోత్ర వచనాలు పలుకుతున్నారు. గజాలు, అశ్వాలు ప్రత్యెక అలంకరణతో ఆలయ ప్రాంగణం చేరుకున్నాయి. మంగళవాద్యాలు శ్రావ్యంగా గానం చేస్తున్నాయి. అప్సరసలను పోలిన నృత్యాంగనలు ఆడుతూ పాడుతున్నారు. భట్టనాథులు, వల్లభదేవుడు గోదాదేవి ఉన్న పల్లకికి ఇరువైపులా నడుస్తున్నారు. నగరకాంతలు గోదాదేవిపై మంగళజలములు కురిపించసాగారు. శ్రీరంగనాథుని కూడా నూతన వధువుగా అలంకరించారు. శ్రీమహాలక్ష్మి ఆగమనాభిలాషియైన శ్రీమహావిష్ణువు కూడా అత్యంత శోభతో ప్రకాశించాడు.


అంతట గోదాదేవి శంతను మండపం నుండి శ్రీరంగవిమానం చేరుకుంది. అక్కడ శేషశాయి అయిన శ్రీరంగని పాదపద్మములను చేరిన గోదాదేవి ఆ రంగానిలో ఐక్యమైంది. ఈ దివ్యదృశ్యాన్ని కాంచిన విష్ణుచిత్తునికి గుండె ద్రవించగా విచారగ్రస్తుదగుట చూసిన శ్రీరంగనాథుడు అశరీరవాణితో ధైర్యం చెప్పి ''శ్రీవిల్లి పుత్తూరులో తనకు నిత్యం పుష్ప కైంకర్యం చేయమని, తన సతి తనను చేరినందున నీవు నిశ్చింతగా ఉండ''మని ఆనతిచ్చాడు. తదుపరి విష్ణుచిత్తుడు శ్రీవిల్లి పుత్తూరు చేరి తన కుమార్తె రచించిన దివ్య ప్రబంధమైన తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొళి నిత్యం గానం చేస్తూ తన 85వ ఏట శ్రీవిష్ణుసాయుజ్యం చేరాడు.


తరువాత శ్రీరంగనాథుని ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా గోదాదేవికి ఒక ఆలయం కట్టించి నిత్యోత్సవాదులతో ఆమె అర్చనకు ఏర్పాటు చేశారు. నాటి నుండి దివ్య దేశాలయిన ప్రతి వైష్ణవాలయాలలో గోదాదేవిని కూడా ప్రతిష్ఠించి అర్చించసాగారు. పన్నిద్దరు ఆళ్వారులలో కనీసం గోదాదేవి, శఠగోపులు, రామానుజులు, తిరుమంగ ఆళ్వారులు గల వైష్ణవాలయాలే దివ్యదేశాలుగా పేర్కొనబడ్డాయి.


క్షీరాబ్ది జిల్కిన శ్రీధవు గోశపు నమ్యగలంకృత చంద్రముఖులు 


చేరి సంప్రార్ధించి స్థిరమైన కోరికల్ పొందిన రీతిగ పుడమియందు 


శ్రీవిల్లి పుత్తూర సిత పద్మ మాలికల్ దాల్చిన భట్టరుతనయద్రవిడ 


భాషను పరమమౌ పద్యమాలికలను ముప్పది సాయంచె నొప్పిదముగ 


భక్తివీనిని పఠియించు భక్తవరులు 


నాల్గు భుజభూధరంబుల పెల్గునత్తి 


యరుణలోచనముల నొప్పు హరి కటాక్ష 


మంది సుఖ సంపదల గాంతు రనవరతము


(ఇంతటితో ఆళ్వారుల చరిత్ర సమాప్తం)


వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి 


దయచేసి షేర్ చేయండి 


స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన నామం " గోవిందా " ... ఎవరు తనని గోవిందా అని పిలుస్తారా అని ఎదురు చూస్తుంటారట స్వామి వారు ... 


కనుక మనం ఆలస్యం చేయక 


అందరం " గోవిందా గోవిందా " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ...


గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా


🙏🙏🙏

సేకరణ

*శ్రీ శివ మహా పురాణం

 **దశిక రాము**


**శ్రీ శివ మహా పురాణం**


26  by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


ఒకనాడు పార్వతీదేవి చెలికత్తెలయిన జయ విజయలు అమ్మవారితో ఒకమాట చెప్పారు. ‘అమ్మా, నంది నిన్నూ వహిస్తాడు, శంకరుడినీ వహిస్తాడు. కానీ ఆయనకు కొంచెం శంకరుని మాల ఔదలదాల్చడంలోనే సంతోషం ఎక్కువ. భ్రుంగీ అంతే. మన మాటే వినేవాడు ఒకడు లేడు. అలాంటి వాడు మనకి ఒకడు ఉంటే బాగుంటుంది. అందుకని నీవు ఒకడిని సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వింటూంటాడు. అలాంటి వాడిని తయారు చెయ్యి. అతడు మన అంతఃపురమును కాపాడడానికి పనికివస్తాడు” అని చెప్పారు. వారి మాటలు విన్న పార్వతీ దేవి అలాగే చేద్దాం అని తన శరీరమునకు ఉన్న మలమును స్నానం చేసేటప్పుడు నలుగు పిండిలా తీసి దానిలోంచి ఒక పిల్లవాడిని తయారు చేసింది. నలుగులోంచి తయారు చేయబడిన పిల్లవాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు. చాలా బాగుండాలని అమ్మవారు సంకల్పం చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. వాడు లేచి కూర్చున్నాడు. అపుడు వానితో నీవు వెళ్లి ద్వారము దగ్గర కూర్చుని ఎవరూ లోపలి రాకుండా నిలుపు’ అంది అపుడు ఆ పిల్లవాడు ద్వారం దగ్గర కూర్చున్నాడు.

ప్రమథగణములలో ముందు నందీశ్వరుడు విజయం చేస్తుండగా శివుడు లోపలి వెళ్ళబోయాడు.ఈ పిల్లవాడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. ముందు శంకరుడు జ్యోక్యం చేసుకోలేదు. అపుడు ప్రమథగణములకు ఆ పిల్లాడికి మధ్య యుద్ధం జరిగింది. ఎవరు సలహా చెప్పారో వాళ్ళే అమంవారి దగ్గరకు వచ్చి అమ్మా పిల్లవాడు యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి నీ శక్తులను పిల్లవాడికి ఇవ్వవలసింది అని చెప్పారు. అమ్మవారు శక్తులను ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమయిన యుద్ధం చేసి ప్రమథగణములనన్నిటిని ఓడించేశాడు. ఇంక అక్కడ నుండి బ్రహ్మ, విష్ణువు కూడా వచ్చేశారు యుద్ధానికి. అయినా ఆ పిల్లవాడు శంకరుడిని లోపలికి పంపించలేదు. అపుడు శంకరుడు చేతిలో త్రిశూలమును పట్టుకుని పిల్లవాని కంఠమునకు గురి పెట్టి విసిరాడు. అపుడు త్రిశూలం ఆ పిల్లవాని కంఠమును ఉత్తరించేసింది. ఆ పిల్లవాడు క్రిందపడి మరణించాడు. తరువాత శంకరుడు లోపలికి వెళ్ళాడు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట కాపలా పెట్టిన పిల్లవాని ప్రస్తావన వచ్చింది. అపుడు శివుడు ఆ పిల్లవానిని త్రిశూల ధారల చేత చంపేశాను అన్నాడు. అపుడు పార్వతీదేవి అయ్యో ఆ పిల్లాడిని నేనే సృష్టించాను – చంపేశారా అని దుఃఖమును పొందింది. ఆవిడ దుఃఖమును ఉపశమింపజేయడానికి దేవతలు అందరూ వచ్చారు. ఆవిడ శంకరుని తన బిడ్డను మరల బ్రతికించమని అడిగింది. అప్పుడు ఆయన తన అనుచరులను పిలిచి మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళి మీకు మొట్టమొదట కనపడిన ప్రాణి ఏదయితే ఉంటుందో దాని తలకాయ తీసుకురండి. ఆ తలకాయ పిల్లవాడికి పెడతాను’ అన్నాడు. వాళ్లకి మొట్టమొదట ఏనుగు కనపడింది. వాళ్ళు దాని తలకాయ పట్టుకొచ్చారు. దానిని ఈ పడిపోయిన పిల్లవాని కంఠమునకు కలిపాడు. ఆ పిల్లవాడు చక్కగా లేచి కూర్చున్నాడు. ఇప్పుడు వానికి శంకరుడెవరో తెలిసి శంకరునికి నమస్కారం చేశాడు. వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తి తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. ఈలోపుగా సుబ్రహ్మణ్య జననం కూడా జరిగిపోయింది. ఈ ఇద్దరి పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతోంది.

ఒకరోజు ఒక యోగ్యమయిన సంబంధం వచ్చింది విశ్వరూప ప్రజాపతి అనే ఆయన తన ఇద్దరు కుమార్తెలయిన సిద్ధిబుద్ధి అనే వాళ్ళను ఇవ్వాలనుకుంటున్నాను అని వచ్చాడు. అపుడు శంకరుడు తన కుమారులను పిలిచి ఎవరు ముందు భూప్రదక్షిణ చేసి వస్తే వారికి ముందుగా పెళ్ళి చేస్తానన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. గణపటిది మూషిక వాహనం. అందుకని ఆయన తల్లిదండ్రులిద్దరికీ ఏడుమార్లు ప్రదక్షిణం చేసి వారిని పత్ర పుష్పములతో పూజ చేశారు. సుబ్రహ్మణ్యుడికి ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు ముందుగా వెళ్ళిపోతున్నట్లు కనపడుతున్నాడు. పార్వతీ పరమేశ్వరునకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేసి ‘నువ్వు చెప్పినటువంటి నియమమును పాటించిన వాడివి కనుక నీకు ముందు వివాహం చేస్తున్నాను అని చెప్పి సిద్ధి బుద్ధిలను గణపతికిచ్చి వివాహం చేశారు. సుబ్రహ్మణ్య స్వామీ వారు క్రౌంచ పర్వతం దగ్గరకు వెళ్ళారు. పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళారు.

ఇక్కడ మనకు కొన్ని సందేహములు కలగడానికి అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా శంకరుడు ఆ పిల్లవాని తలను తీసివేసి ఉంటే ఏనుగు తల పెట్టడం ఎందుకు? పడిపోయిన తలకాయనే అతికించవచ్చు కదా! అని. పార్వతీ దేవి అనగా పరమ ప్రక్రుతి. పరమ శివుడనగా పరమ పురుషుడు. పరమ ప్రకృతి అంటే పంచ భూతములు. పంచభూతములయందలి కదలిక పరమేశ్వరుడు. అమ్మవారు భూతములన్నిటిని తయారుచేస్తుంది. కానీ లోపల చైతన్యం శివుడు. అంటే శివ సంబంధమయిన ఎరుక లేదు. లోపల ఉన్న చైతన్యము ‘నేను’ అన్నది తెలియదు. పైన ఉన్న శరీరము మూడు గుణముల చేత బంధింపబడి ఉంది. ఈ మూడు గుణములే ప్రకృతి యొక్క మలము. అదే అమ్మవారి శరీరంలోంచి వచ్చిన మలము. ఆ మలముతో పిల్లవాడు తయారు అయాడు. అంటే త్రిగుణములయందు కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఈ తలకు ప్రకృతి తెలుసు శివుడు తెలియదు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శివుడు అని తెలియదు. కాబట్టి ఆయన దానితోనే పోరాటం చేశాడు. శంకరుడు ఆ పిల్లవాని తలను త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలమునకు ఉన్న మూడు త్రిగుణములు, వీటికి ఆధారమైన సత్యము శంకరుని చేతిలో ఉన్న త్రిశూలం. శంకరుడు గుణాతీతుడు. ఎప్పుడయితే శివుడి చేతి త్రిశూలం పిల్లవాని కంఠమునకు తగిలిందో త్రిగుణములకు సంబంధించిన బుద్ధి పోయింది. ఇప్పుడు ‘గజ’ – ఏనుగు తల పెట్టబడింది. ‘గ’ అంటే గతి అంటే కదలడం; ‘జ’ అంటే పుట్టడం. ఇపుడు ఆ పిల్లవానికి ఇందులోంచి పుట్టి ఇందులోకి వెళుతున్నాడో తెలిసిపోయింది. అంటే ఇప్పుడు శివసంబంధం వచ్చేసింది. శివుడు తెలిసిపోయాడు. తెలిసిపోవడం గజముఖం. అందుకని శంకరుడికి నమస్కారం చేశాడు. ఇది మీరు చెయ్యవలసిన ఉపాసనా క్రమమును వినాయకుని మూర్తి ద్వారా లోకమునకు తెలియజెప్పడం. ఏనుగు తల బ్రహ్మాండమును చెప్తే మనిషి శరీరం పిండాండమును చెప్తుంది. బ్రహ్మాండం, పిండాండం రెండింటి యందు పంచభూతములు ఉన్నాయి. రెండూ పంచ భూతములలో నిండి ఉన్నప్పటికీ రెండింటియందు ఉన్నది ఒక్కటే అని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్త్వమసి అర్థమయితే ‘తత్ త్వం అసి’ ‘అదే వాడి ఉన్నాడు’ జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం మనుష్యుడు తల కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. కాబట్టి తత్త్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడాయన వినాయకుడు అయ్యాడు. ‘వి’ అంటే విశిష్టమయిన – అనగా విశిష్టమయిన నాయకుడు అయ్యాడు. మీరు ఆయనను ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని అటువంటి పథంలోకి తీసుకు వెడతాడు. ఆయన విఘ్నములకు నాయకుడు. విఘ్నమును తీసేస్తాడు. మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తాడు.

గణపతి పరబ్రహ్మమై ఉన్నాడు. ఈయనకు సిద్ధిబుద్ధి భార్యలు. ఎవరు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి అనేది ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. గణపతి ఆరాధన చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధి పొందడమే ఆయనకీ సిద్ధి బుద్ధి భార్యలు అయి ఉండడం. ఆ అనుగ్రహం మీయందు ప్రసరింపబడడం. ఏనుగుకు అన్నిటికన్నా ఇష్టమైనది దాని దంతం. కానీ అది నమలడానికి పనికిరాదు. ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే తన దంతమును విరిచేసి దానితో రచన చేశాడు. మనకి ఉన్న వస్తువులను లోకోపకారానికి ఉపయోగించాలి. భారతమును రచించడానికి తన దంతం ఉపయోగ పడితే కొన్ని యుగాలపాటు పంచమ వేదమయిన భారతమును లోకం చదువుకుని ఉద్ధరింపబడుతుంది అని భావించి తన దంతమును విరిచేసి దానితో భారతమును రచన చేశాడు. ‘ఏకదంతం, శూర్పకర్ణం, లంబోదరం’ అని పేర్లు సంపాదించాడు. ఎంతో శాశ్వతమయిన యశస్సు పొందాడు. శివుడు ఎంత సులభుడో వినాయకుడు అంత సులభుడు. ఇరువది ఒక్క గరిక తెచ్చి ఆయన పాదముల మీద వేస్తే చాలు. అన్నీ ఇచ్చేస్తాడు. కొద్దిగా సింధూరమును గండయుగ్మమునాకు రాస్తే చాలు పొంగిపోతాడు. ఏనుగు తల కనపడితే మంగళ ప్రదము. చివరకు కలలోకి ఏనుగు వచ్చినా అది మంగళప్రదమే.

గణపతి స్వరూపంలో చిత్రమయినది ఎలుక. గణపతికి వాహనం ఎలుక. ఎలుక దొంగతనానికి ప్రతీక. మనతో పాటే ఉంటుంది. మన వస్తువులన్నీ ఎత్తుకుపోతూ ఉంటుంది. మన బ్రతుకూ అంతే. విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే మనకి ఆయన పదిమంది హృదయాలను కొల్లగొట్ట గలిగిన దొంగతనమును పొందుతాడు. అనగా ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై చాలామంది హృదయాలను తాను కొల్లగొట్టే దొంగ అవుతాడు. ఇలా మారడానికి ఎలుక విఘ్నేశ్వరుడిని వహించింది. మీరు కూడా అలా వహించడం నేర్చుకోవాలి. పదిమంది ప్రేమను సంపాదించుకోవడం నేర్చుకోవాలి. దీనిని సూచించదానికే ఎలుకను వాహనంగా పెట్టుకున్నాడు. ఎలుక చెవులు పెద్దవిగా ఉంటాయి చేట లాగా. గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొల్లు తీసేసి సారం వైపుకి మనలను నడిపిస్తాడు. పరమభక్తిని ఇస్తాడు. ఆయన ఆయుధమయిన గొడ్డలితో కర్మ పాశములను తెంచి భక్తీ పాశములను వేసి తన వైపుకి లాక్కుంటాడు.

చవితి తిథి ఆయనకు చాలా ఇష్టమైన తిథి. ఆరోజు ఎవరయినా వినాయకుడి గురించి ప్రత్యేకంగా వినినా, చదివినా వారు ఎంతో ప్రయోజనమును పొందుతారు. పరమ భక్తితో స్వామికి నమస్కారం చేసినా ఎవరు కోరుకున్నది వారికి అనుగ్రహిస్తాడు. విద్యార్థికి విద్య వస్తుంది. ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది. కన్యార్థికి కన్య దొరుకుతుంది. పుత్రార్థికి పుత్రుడు పుడతాడు. భోగార్థి అయిన వాడికి భోగములు కలుగుతాయి. మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది. రాజ్యార్థికి రాజ్యం, కీర్తి కావాలనుకున్న వారికి కీర్తి వస్తుంది. ఆరోగ్యం కుదుటపడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్లకి ఆరోగ్యం కలుగుతుంది. ఋణభారంతో ఉన్నవాడికి ఋణం తొలగుతుంది. ఇక్కట్టులలో ఉన్న వాడికి ఇక్కట్టులు తొలగిపోతాయి. గణపతి దర్శనం చేత గణపతి యొక్క అనుగ్రహం చేత గణపతి కథను చదవడం చేత సమస్త శుభములు సమకూడతాయని పెద్దలు మనకు ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి ఆ గజానన స్వరూపము అంత గొప్ప స్వరూపము.


🙏🙏🙏

*శ్రీ శివ మహా పురాణం

 **దశిక రాము**


**శ్రీ శివ మహా పురాణం**


25  by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


నటరాజు


మనకి పరమశివుని స్వరూపము అనేకరకములయిన మూర్తులుగా గోచరిస్తూ ఉంటుంది. పరమ శివునికి అరువది నాలుగు మూర్తులు ఉన్నాయి. శివుని స్వరూపమేమి అని అడిగితె మనకి శివలింగం అనే సమాధానం వస్తుంది. సాధారణంగా శివాలయముల అన్నిటియందు లింగ స్వరూపమే ఉంటుంది. కానీ సాకారంగా పరమశివుడికి పార్వతీదేవికి మూర్తి ఉన్నది. ఈ అరువది నాలుగులో ఒక భాగమును ‘ఘోర స్వరూపములు’ అంటారు. ఇవి సాధారణంగా శిక్షించడానికి వస్తాయి. రెండవది ‘అఘోరరూపములు’. మంగళప్రదంగా ఉంటాయి. అటువంటి మూర్తిని మీరు చూసినప్పుడు మీకు చాలా ఆనందం కలుగుతుంది. మీకు ప్రపంచంలో ఎన్ని రకములయిన విద్యలు ఉన్నాయో ఎన్ని కళలు ఉన్నాయో అంతమందీ కూడా తమ తమ కళలను ప్రదర్శన ప్రారంభం చేసే ముందు నమస్కరించవలసిన మూర్తి ఒకటి లోకంలో ఉంది. దానిని ఆనంద తాండవమూర్తి అంటారు. దానిని మనం ‘నటరాజు’ అని పిలుస్తుంటాం. కానీ శైవాగమం దానిని ‘ఆనంద తాండవ మూర్తి’ అని పిలుస్తుంది. ఆ తాండవం చెయ్యడంలో గొప్ప రహస్యములు కొన్ని ఉంటాయి. ఆనంద తాండవం చేసిన పరమశివుడు ఎవరు ఉన్నారో ఆయనలోంచే సమస్త శాస్త్రములు ఉద్భవించాయి. ఆయనలో నుంచే సమస్తమయిన కళలు వచ్చాయి. ఒక్క శంకరుడు చేసిన తాండవంలోంచి 650 రకాలైన నాట్యములు పుట్టాయి. ఈవేళ ఇప్పటికీ కర్మభూమిలో బ్రతికినవి 108 రకముల నాట్యములు. కూచిపూడి, ఒడిస్సీ, భరతనాట్యము ఇవన్నీ ఆనంద తాండవ మూర్తి అయిన శంకరుని దగ్గరనుంచే వచ్చాయి.

ఈ ఆనంద తాండవ మూర్తి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ చిత్రమును గీయడం లేదా నిలబెట్టడం చాలా కష్టం. చేతులు కట్టుకుని ఆయన నాట్యమును నలుగురు మాత్రమే చూస్తారు. అందులో ఒకడు నందీశ్వరుడు, రెండవ వాడు భ్రుంగి, మూడవ వాడు పతంజలి, నాల్గవ వాడు వ్యాఘ్రపాదుడు. ఈ తాండవం ఆ స్వరూపంలో అప్పుడు సమస్త లయకారకమై ఉంటుంది. ఈ తాండవం ప్రదోష వేళలో జరుగుతూంటుంది. ఆయన నాట్యము చేత ఈ లోకమునకు రాజయ్యాడు. అందుకే ‘నటరాజు’ అని పిలుస్తుంటాము. ఆయన చేసే నాట్యం మామూలు నాట్యం కాదు. అది మీరు తెలుసుకుంటే చిదంబరంలో కనకసభ దగ్గరకు వెళ్లి అంత పెద్ద ఆనంద మూర్తిని మీరు చూడవచ్చు. అక్కడ ఆ మూర్తిని చూడగానే మీరు ప్రణిపాతం చేసి సాష్టాంగనమస్కారం చేసేస్తారు. అఘోర స్వరూపముల యందు చాలా గొప్ప స్వరూపములలో ఆనందమూర్తి స్వరూపం ఒకటి.

ఆనంద తాండవం చూసే స్థాయి పొందిన వాళ్ళలో మొదటి వాడు నందీశ్వరుడు. ఆయన అయ్యవారికి చాలా గొప్ప భక్తుడు. రెండవ వాడు భ్రుంగి. మూడవ వాడు పతంజలి. ఆదిశేషుని అవతారము. అందుకని ఆయన తల మనుష్యుడిగా ఉంటుంది. మిగిలిన శరీరం పాముగా ఉంటుంది. వ్యాఘ్రపాదుడికి తలకాయ మనుష్యుడిది. పాములు పెద్దపులివి ఉంటాయి. ఈ నలుగురు నిలబడి తాండవం చూస్తూంటారు. ముప్పది మూడు కోట్లమంది దేవతలు అక్కడే ఉంటారు. బ్రహ్మ శ్రీమహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటారు. పతంజలి తప్ప మిగిలిన దేవతలు ఎవరికీ తోచిన వాద్య విశేషణాన్ని వారు వాయిస్తూంటారు. డమరుకం కదలిక చేత ఇన్ని రకములయిన సృష్టి ప్రారంభం అయింది. ఆయన చేతిలో ఉన్న డమరుకం కారణంగా ఈయన సృష్టికర్త అయ్యాడు. పరమేశ్వరుని సృష్టి కదలిక వలన కొత్తగా కొన్ని ప్రాణులు లోకంలోకి వచ్చాయి. ఈ లోకంలోకి కొత్తగా ప్రాణులు రావడం అనే సమస్త కదలికలకు డమరుక సంకేతం. ఇవన్నీ జరుగుతున్నాయి అనడానికి ఆయన కదలికే కారణము. ఈశ్వరుని కదలికకు నర్తనమని పేరు. ఇదే ఆనంద తాండవము. ఆనంద తాండవ మూర్తి చేతిలో కుడివైపు డమరుకం ఉంటుంది. ఎడమచేతి వైపు అగ్నిహోత్రం ఉంది. ప్రపంచంలోని అన్ని వస్తువులు చివరకు భస్మమే అయిపోతాయి. ఈ విషయం లోపల బాగా నాటినట్లయితే వ్యక్తి తప్పుడు పనులు చేయడు. ఏది కాలంలో వచ్చిందో అది కాలమునందు ఉండదు అని మీకు అర్థం అయిపోతే మీ నడవడి యందు మార్పు వచ్చేస్తుంది. నటరాజ స్వామిని పరిశీలించినట్లయితే ఆయన కుడికాలి క్రింద ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈయన కాలుకింద పడుకుని తల ఎత్తి నవ్వుతూ ఉంటాడు. ఏడవడు. మాయను గెలవడమే కుడికాలి కింద రాక్షసుని తొక్కి పట్టడం. ఎడమ కాలు బ్రాహ్మీ స్థితిని సూచిస్తుంది. కుడికాలు మాయను తొక్కితే పైకి లేచేది ఎడమకాలు. అందుకే ఆనంద తాండవ మూర్తి ఎడమకాలు పైకి లేచి ఉంటుంది. నీవు ఊర్ధ్వ ముఖ చలనము చేసి ఈశ్వరుడిని తెలుసుకునే ప్రయత్నం చేసి బ్రాహ్మీభూతుడవై ధ్యానము చేసి ధ్యానమునందు ఆనందమును పొంది ‘నేనుగా ఉండడం’ నీవు నేర్చుకో. నీవు నేనై ఉన్నాను అని తెలుసుకో. దానికి ధ్యానం అవసరం. ఇది చెప్పడానికి ఎడమచెయ్యి పైకి లేచిన ఎడమ పాదమును చూపిస్తుంది. కుడి చేయి అభయ ముద్ర పట్టింది. శివుడు చాలా తేలికయిన వాటిని పుచ్చుకుని పెద్ద శుభ ఫలితములను ఇస్తాడు. ఇది చెప్పడానికే ఆయన అభయముద్రను ప్రదర్శించాడు. పాపమును హరిస్తానని చెప్పాడు. హరించినప్పుడు ఉపాసకుడు క్రమంగా పెరుగుతాడు. పెరిగి ‘శివ’ – అంటే మంగళమును చేరతాడు. ఈ ‘శివ’ నుండి ఆనంద తాండవ మూర్తిలోనికి లయం అయిపోవాలి, తాను ఆనందంగా మారిపోవాలి. అలా మారిపోతుంటే ఇప్పుడు ఆయన దిగంబరుడుగా వచ్చాడు. అంటే శరీర భ్రాంతి లేకపోవడాన్ని ఆనందం అంటారు. ఆత్మస్వరూపి అయిన ఆనంద తాండవ మూర్తియండు సాధకుడు కలిసిపోతే తానె ఆనంద తాండవ మూర్తి అయిపోతాడు. ఆయనకి మరల చావడం అనేది ఉండదు. ఇదే ఆఖరి చావు.

శివుని విశేషములను వేటినీ మీరు సామాన్యముగా తీసుకొనుటకు ఉండవు. మీరు కేవలం ఒక నటరాజ స్వామి వారి మూర్తిని పెట్టుకుని అష్టోత్తరం చేస్తాను, సహస్రం చేస్తాను అంటే మీకు ఈ తత్త్వము ఆవిష్కరింపబడదు. ఇలా చూడాలన్న కోరిక పుట్టడమే చాలా కష్టం. కోరిక పుట్టినా అది నిలబడడం చాలా కష్టం. ఎందుకు అంటే కింద కుడికాలిక్రింద నవ్వుతూ ఒకడు బ్రతికే ఉంటాడు. వాడు ఎప్పుడు లేచి పట్టేసుకుంటాడో మనకి తెలియదు. ఎప్పుడయినా మాయ మళ్ళీ పట్టేస్తుంది. మళ్ళీ కూపంలోకి పడిపోతాడు. ఉదాహరణకు రావణాసురుడు శంకరుని ప్రార్థన చేశాడు. తనకు ఎటువంటి శంకరుని చూడాలని ఉన్నదో వివరిస్తూ స్తోత్రం చేశాడు “జటాటవీ గలజ్జల’ అని. ఇంత స్తోత్రం చేసిన రావణాసురుడు అలా నిలబడ లేకపోయాడు. పరమేశ్వరుని తనతో లంకకు రమ్మన్నాడు. ఏమయిపోయింది ఈ స్తోత్రం. అంటే అంతలో మాయ కమ్మింది. అడగడం కాదు. అడిగినవాడు నిలబడడం కూడా చాలా కష్టం. నిలబడడానికి శివానుగ్రహం ఉండి తీరాలి. శివానుగ్రహం కలిగితే ఆయనే నడిపిస్తాడు. కాబట్టి అటువంటి ఆనంద తాండవ మూర్తి అనుగ్రహం మనకు కలిగి మనుష్యజన్మ ప్రయోజనం నెరవేరేటట్లుగా నిర్హేతుక కృపాకటాక్షవీక్షణముల చేత ఈశ్వరానుగ్రహం మనయందు ప్రసరింపబడాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేద్దాము.


🙏🙏🙏

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము**


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


భీష్మపర్వం.154


శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత ఉపదేశిస్తున్నాడు, కురుక్షేత్రంలో, మహాసంగ్రామం మొదలయ్యే ముందు.


షష్టాధ్యాయం ధ్యానయోగం.


యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం  విద్ధి పాండవ 

న హ్యసంన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన//   (  6  . 2  )

ఓ పాండుకుమారా !  దేనిని సన్యాసమని విజ్ఞులు అందురో, అదియే యోగము.  అన్ని  సంకల్పములను త్యజించినవాడే  సన్యాసి, అతడే యోగి.  కర్మలను సన్యసించినను వాని సంబంధమైన విషయములను, సంకల్పములను వదలనివారు యోగి కాజాలరు. 


చిత్తస్పందన సంకల్పములు యేర్పడటానికి మూలము. దానికి కారణము  రజోగుణము.  రజోగుణము యోగాభ్యాసం వలన నశించును.  రజోగుణం  నశిస్తే, చిత్త స్పందనలు నశిస్తాయి.  చిత్త స్పందనలు లేకపోతె, సంకల్పాలు కలుగవు.  సంకల్ప త్యాగియే   సన్యాసి.  అతడే యోగి.  కర్మలు చేయకున్న మాత్రమున సన్నాసి కాదు. వాటి గురించి కూడా ఆలోచించకూడదు. 


ప్రశాన్తాత్మా విగతభీ ర్బ్రహ్మచారి వ్రతే స్థిత : 

మన : సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పర : //   ( 6 .14  )

శాంతిపొందిన మనసు కలవాడై, ప్రశాంతచిత్తుడై, దేనికీ భయపడనివాడై బ్రహ్మచారి   జీవితం గడుపుతూ, మనో నిరోధనము చేసి, విషయసుఖములను దూరంగా వుంచి,  నాయందే మనసు లగ్నం చేసినవాడై వుండవలెను.  


యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు 

యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖహా //  ( 6 . 17 )

తగిన ఆహార విహార నియమాలతో, యోగి చెయ్యవలసిన  పనులు మాత్రమే చేస్తూ, శరీరతాపము కలుగజేయని పనులు మాత్రమే చేస్తూ, యెక్కువ సమయం మేల్కొనక, యెక్కువ సమయము నిద్రించక, జాగరూకుడై  వుండువాడే యోగ సిద్ధిని పొంది దుఃఖమునకు దూరమగును.  


యధా దీపో నివాతస్థో   నేఁగతే సోపమాస్మృతా 

యోగినో యత చిత్తస్య యుజ్ఞతో యోగమాత్మన :  //  (6 .19  )

సంయమన చిత్తంతో యోగి తన  ధ్యాసను ఆత్మావలోకనం చేసుకుంటూ ' వాయురహిత ప్రదేశము నందు వుంచబడిన దీపమువలే ,  ఐహిక విషయములకు దూరంగా, చలన రహితుడై ప్రకాశిస్తూ వుండును. 


శనై శ్శనై రుపరమేద్బుద్ధ్యా ధృతి గృహీతయా 

ఆత్మసంస్థం మన: కృత్వా న కించదపి చింతయేత్ //   ( 6  .25  )

ప్రాణవాయువు నిరోధించడమే మనోనిగ్రహానికి మొదటిమెట్టు.  నెమ్మది నెమ్మదిగా ప్రాణవాయు స్పందనలను నిగ్రహించుట ద్వారా, మనోనిగ్రహం సాధించవలెను.  సాత్వికమైన ఆలోచనలతో, ఇంద్రియములను విషయముల నుండి విరమింప జేసి, యోగ బలంతో యితర వ్యాపకాల మీదకు మనోదృష్టి వెళ్లనీయక, ఆత్మస్థానమనే బుద్ధి గుహలో ప్రవేశించి ఆత్మయందు మనస్సును వుంచవలెను.  


యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి      

తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి // ( 6 . 30  )

సర్వభూతములలో నన్ను దర్శించిన వానికి, నాయందు సర్వభూతములను దర్శించిన వానికి, నానుండి దూరమయ్యే ప్రశ్న వుత్పన్నం కాదు.  అనగా, నానుండి అతడు వేరు కాదు.   సమ్యగ్దర్శకుడైన యోగి వేరు, పరమాత్మ వేరు కాదని భావము.  


సప్తమాధ్యాయము  జ్ఞాన విజ్ఞాన యోగము.


మనుష్యాణాం సహస్రేషు   కశ్చిద్యతతి సిద్ధయే 

యతతామపి సిద్ధానాం కశ్చిన్మామ్ వేత్తి తత్త్వత :  //  ( 7 . 3  )

అర్జునా !  వేలకొద్దీ మనుషులలో యెవరో ఒకడు మాత్రమే తత్వజ్ఞాన సిద్ధికోసం ప్రయత్నిస్తాడు.  అలా ప్రయత్నించిన అనేకమంది సిద్ధపురుషులలో, యే ఒక్కరో యదార్ధంగా తత్వజ్ఞాని అగును.  

యోగమును అభ్యసించుట వలన త్త్వజ్ఞాన సిద్ధి కలుగును.   అట్టి జ్ఞాన సిద్ధులు తననుండి   ఆత్మ వేరు గాదని  , యోగసిద్ధిలో  దర్శించి, అదే ఆత్మ అన్ని జీవరాసులలో కలదని తెలుసుకోబడతాడు..  అట్టివాడు, పరమాత్మకన్నా భిన్నం కాదు. 


భూమిరాపో>నలో వాయు:: ఖం మనో బుద్ధిరేవచ 

అహంకార  ఇతీయం  మే భిన్నా ప్రకృతి రష్టధా  //   ( 7 . 4  )

భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు బుద్ధి , అహంకారము అను ఎనిమిది విధములుగా యీ ప్రకృతి విభజించబడి యున్నది.   ఇవి వాటి అంతట అవి యేర్పడలేదు.  ఈశ్వర కల్పితములు,


చతుర్విధా భజంతే మాం జనా : సుకృతినో>ర్జున  

ఆర్తో, జిజ్ఞాసురార్ధార్ధీ జ్ఞానీ చ భరతర్షభ //  ( 7 . 16 ) 

అర్జునా !  భరతవంశ శ్రేష్టా ! ఆర్తులైనవారు, జిజ్ఞాసువులూ, ప్రయోజనం ఆశించేవారు, జ్ఞానులు, అను నాలుగురకాల వారు నన్ను యెల్లప్పుడూ సేవించాలని పరితపిస్తూ వుంటారు.  అది వారి పూర్వజన్మ పుణ్యము వలన యేర్పడిన సాంగత్యము.  


జ్ఞాని ఏకాగ్ర బుద్ధితో యే కోరికలూ లేకుండా నన్ను సేవిస్తాడు.  అతనికి నేను అత్యంత ప్రియుడను.  నాకును అతడు అంత ప్రీతిపాత్రుడే.    పెక్కు జన్మలలో నా గురించి పరితపించి, ఈ సర్వమూ నేనే అను అనుభూతి చెంది జ్ఞాని నన్ను ఆశ్రయించును.  


సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదు : 

ప్రయాణకాలే>పి చ మాం తే విధుర్యుక్తచేతస  :  //   ( 7 . 30 )

అధిభూత, అధి దైవ, అధియజ్ఞములతో కూడిన నన్ను తెలుసుకున్నవారు   వారి అంత్యకాలమున పరమాత్మనగు నాయందే మనసు లగ్నము చేసి, నన్ను చేరుకుందురు.  


అష్టమాధ్యాయము  అక్షర పరబ్రహ్మ యోగము.


ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ 

య : ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిం //  ( 8 . 13  )

ఏకాక్షర మంత్రమగు ఓంకారమును స్మరించుచు నా నామము స్మరించుచు  దేహాన్ని త్యజించువాడు ఉత్తమగతులు చేరతాడు.

యోగబలంతో సహస్రారంలో  ప్రాణం వుంచి, నన్ను తలుచుకుంటూ,ప్రణవ మంత్రం జపించుటకన్నా, ప్రశాంతమరణమేమున్నది ? 

ఓంకార స్మరణలోనే, స్వరం ఊర్ధ్వ స్థాయికి అసంకల్పితంగా వెళ్లే ప్రక్రియ వున్నది.  సహస్రారంలోనికి ప్రాణం తీసుకు వెళ్ళడానికి శ్రేష్టమైన మార్గం ఓంకార స్మరణ.    

 

అగ్నిర్జ్యోతిరహ : శుక్ల : షణ్మాసా  ఉత్తరాయణం

తత్ర ప్రయాతా గచ్చన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనా  :  //  ( 8 . 24 )

అగ్ని జ్యోతి, పగలు, శుక్లపక్షం,ఉత్తరాయణము, ఈ సమయములలో శరీరము త్యజించిన బ్రహ్మజ్ఞానులు ,  దేవయానములో  పయనించి  బ్రహ్మైక్యము   పొందుదురు.  ధూమ సమయములో, రాత్రివేళ, కృష్ణ పక్షంలో, దక్షిణాయనంలో   మరణించినవారు, పితృయానం మార్గంలో ప్రయాణించి,  చంద్రజ్యోతిని దర్శించి, కొంతకాలము తరువాత మరల పుట్టెదరు.


ఈ రెండు మార్గములు తెలిసిన యోగి, వేదాధ్యయనము, యజ్ఞకర్మలు, తపస్సు, ధ్యానము, దానములు  వంటి అనేక పుణ్య కార్యములు శాస్త్రోక్తంగా ఆచరించి, దేవయాన మార్గంలో బ్రహ్మైక్యం పొందడానికి కృషి చేస్తాడు., 

**దశిక రాము**


**మహాభారతము**


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


భీష్మపర్వం.155


శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత ఉపదేశిస్తున్నాడు, కురుక్షేత్రంలో, మహాసంగ్రామం మొదలయ్యే ముందు.


నవమాధ్యాయం రాజవిద్యారాజగుహ్య యోగం.


అశ్రద్దధానా : పురుషా ధర్మస్యాస్య పరన్తప 

అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసార వర్త్మని // ( 9 .3 )

ఆత్మజ్ఞాన ధర్మమును విశ్వసించని దేహాభిమానులగు నాస్తికులు మృత్యుమార్గాన సంసారచక్రంలో పునరపి జననం పునరపి మరణం చెందుతూ నానుండి దూరమగుదురు. 


అవజానన్తి మాం మూఢ మానుషీమ్ తనుమాశ్రితం 

పరం భావమజానన్తో మమ భూత మహేశ్వరం // ( 9 . 11 )

సర్వప్రాణులకు అధిదేవతగు నేను మనుష్యరూపములో నున్న పరమేశ్వరుడినని యెరుగక, నన్ను సామాన్య మానవునిగా మూఢజనులు, వివేకహీనులు, అనుకుంటారు.


అహం క్రతురహం యజ్ఞ: స్వధాహమహమౌషధం   

మంత్రో>హమహ మేవాజ్య మహమగ్ని రహం హుతం // ( 9 .16 )

పార్ధా ! నేనే క్రతువును. నేనే యజ్ఞాన్ని. సర్వప్రాణులకు ఆహరం యిచ్చే శక్తిని నేనే. నేనే ఔషధాన్ని. నేనే మంత్రాన్ని. నేనే నెయ్యిని. నేనే అగ్నిని. హోమద్రవ్యాన్ని కూడా నేనే. 


తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి 

ఏవం త్రయీధర్మమనుప్రసన్నా గతాగతం కామకామా లభంతే // ( 9 .21 )

కోరికలు అనేకం కలవారు, యజ్ఞాది కర్మల ద్వారా స్వర్గలోకములోని భోగములను అనుభవించి, పుణ్యము క్షీణించిన, తిరిగి మనుష్యలోకంలో పుడతారు. కేవలం కర్మల వలన పుణ్యం సంపాదించి, మోక్షం పొందజాలరు. యోగనిష్ఠ వలననే బ్రహ్మైక్యం పొందగలరు.   


అనన్యాశ్చిన్తయన్తో మాం ఏ జనా : పర్యుపాసతే 

తేషామ్ నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహామ్యహం. // ( 9 . 22 )

కోరికలను త్యజించినవారు, నన్ను తమకంటే వేరుగా చూడరు. తమఆత్మగా నన్ను సర్వ వేళలా భావిస్తూ ఆరాధిస్తారు. అట్టివారి యోగక్షేమాలను నేను చూసుకునే బాధ్యత వహిస్తాను.  


కిమ్ పునర్బ్రాహ్మణా: పుణ్యా భక్తా రాజర్షయస్తథా

అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం // ( 9 . 33 )

పుణ్యాచారణ కలిగి సదాచారులైన బ్రాహ్మణులూ, భక్తి భావం కలిగిన రాజర్షులు గానీ, నాన్నాశ్రయించి ఉత్తమగతి పొందుదురని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.  

శాశ్వతం కాని, తాత్కాలిక సుఖాన్ని యిచ్చే ఈ మనుష్యలోకంలో జన్మించినందుకు నన్ను భజించి, నన్ను చేరుకునే ప్రయత్నం చెయ్యి.


దశమాధ్యాయం విభూతియోగం.


మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంత: పరస్పరం 

కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తిచ రమన్తిచ // ( 10 . 9 )

చిత్తము నాయందే నిలిపి ఇంద్రియములు నాలో లీనమొనర్చి, జన సమూహములలో నాగురించి బోధిస్తూ, సత్కాలక్షేపంతో , సత్సంగాలతో వుండువారు యెంతో తృప్తిగా ఆనందభరితులై జీవింతురు


అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత : 

అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవచ // ( 10 . 20 )

ఇంద్రియాలను జయించిన ఓ అర్జునా ! అన్ని ప్రాణులలో వుండే ఆత్మను నేనే. సర్వ జీవుల జననము, పెరుగుదల, అంతము అన్నీ నేనే. నా యోగ మహిమచే, ఒకడినే, పెక్కు స్వరూపాలుగా భాసిస్తూ వున్నాను.

ఆదిత్యులలో నేను విష్ణువును. జ్యోతిశ్చక్రమున సూర్యునిగా వున్నది నేనే. దేవతలలో శ్రేష్ఠుడైన మరీచిని నేనే. నక్షత్రములలో చంద్రుడను నేనే. వేదములలో సామవేదము, దేవతలలో ఇంద్రుడు, ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో చైతన్యము నేనే. రుద్రులలో శంకరుడను. యక్షులలో కుబేరుడను. వసువులలో పావకుడను. పర్వతములలో మేరు పర్వతాన్ని.  

పురశ్రేష్ఠులలో బృహస్పతిని, సేనానులలో కుమారస్వామిగా, నీటి సమూహములలో సముద్రునిగా నన్ను యెరుంగుము. మహర్షులలో భృగుడను. అక్షరాలలో ఓంకారాన్ని. యజ్ఞాలలో మానసిక యజ్ఞాన్ని. పర్వతములలో హిమ పర్వతాన్ని. వృక్షములలో రావి చెట్టును. దేవఋషులలో నారదుడను. గంధర్వులలో చిత్రరధుడను. సిద్ధులలో కపిలమునిని. 


గుఱ్ఱములలో అమృతంతో పాటు పుట్టిన ఉచ్చయిశ్రవాన్ని. ఏనుగులలో ఐరావతాన్ని. నరులలో చక్రవర్తిని. ఆయుధములలో వజ్రాయుధాన్ని. గోవులలో కామధేనువును. సంతానకారకుడైన మన్మధుడను కూడా నేనే. నేనే విష సర్పములలో వాసుకిని. నాగులలో అనంతుడిని. జలదేవతలలో వరుణుడను. పితృ దేవతలలో ఆర్యముడను. దిక్పాలకులలో యముడను.  

రాక్షసులలో ప్రహ్లాదుడను. కాల పురుషుడను నేనే. మృగాలలో సింహాన్ని. పక్షులలో గరుడపక్షిని. పవిత్రత కలిగించే సాధనాలలో వాయువును నేను. ఆయుధాలు ధరించే వారిలో రాముడను నేనే. మత్స్యములలో మొసలిని నేను. నదులలో గంగానదిని నేను. విద్యలలో ఆత్మవిద్యను నేను. తర్కం చేసే వాళ్లలో వాదపటిమను నేనే. 

అక్షరములలో ఆకారమును. సమాసములలో ద్వంద్వ సమాసమును. అనంతమగు కాలము కూడా నేనే. అభ్యుదయం, స్త్రీలలో కీర్తిని, సిరిని, వాక్కును, జ్ఞాపక శక్తిని, తెలివిని, ఓర్పును కూడా నేనే. 


ఛందస్సులో గాయతీ ఛందస్సు నేనే. మాసములలో మార్గశీర్ష మాంసమును నేనే. ఋతువులలో వసంత ఋతువును నేనే. అంతెందుకు. స్థావర జంగములలో ఏది కూడా నా అంశలేకుండా మనజాలదు.


అర్జునా ! నా దివ్యవిభూతులు అనంతములు. పైన నేను చెప్పినదంతా, సంక్షిప్తము మాత్రమే. ఎక్కడ సంపద, శక్తి కలిగిన వస్తువుండునో, అక్కడ నా అంశకలదని తెలుసుకొనుము.

 

స్వస.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు


🙏🙏🙏

స్వస.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.


🙏🙏🙏

సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఇరవైనాల్గవ శ్లోక భాష్యం - మొదటి భాగం


జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే

తిరస్కుర్వ-న్నేతత్ స్వమపి వపు-రీశ-స్తిరయతి !

సదా పూర్వః సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివ-

స్తవాఙ్ఞా మలంబ్య క్షణచలితయో ర్భ్రూలతికయోః !!


అమ్మా! నీ లతలవంటి కనుబొమల కదలికనుండి ఆజ్ఞను స్వీకరించి బ్రహ్మ ప్రపంచమును సృష్టించును. విష్ణువు పాలించును. రుద్రుడు సంహరించును. ఈశ్వరుడు వారిని తనలో లయము చేసుకొనుచూ తాను కూడా లయమవుచున్నాడు. సదా అన్న శబ్దము మొదలుగా కలిగిన శివుడు సర్వమును మరల అనుగ్రహించుచున్నాడు.


రెండవశ్లోకంలోనే ఆచార్యులవారు బ్రహ్మవిష్ణు రుద్రుల విధుల గురించి ప్రస్తావించారు. ఇక్కడ కూడా ఆ విషయాన్ని పునః ప్రస్తావిస్తున్నారు. “జగత్సూతే విధాతా బ్రహ్మ ఈ లోకములను పుట్టిస్తున్నాడు". “హరిరవతి” విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు. “రుద్రః నీ క్షపయతి” రుద్రుడు సంహారం చేస్తున్నాడు. ఆచార్యుల నీ వారీ శ్లోకంలో పంచక్రియలలో మిగతా రెండు కార్యములను, చేసే దేవతలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకడు ఈశ్వరుడు. 'ఈశస్తిరయతి' ఈశ అన్న ఈశ్వరుడన్న ఒకటే - ఈయన తిరోధాన కార్యము అంటే త్రిమూర్తులతో సహా ఈ సర్వాన్నీ మాయలో ముంచెత్తుతాడు. 'తిరయతి' అంటే కప్పి ఉంచటం మాయతో కప్పిఉంచడమన్న అర్థం. ఈశ్వరుడు పాలించే వాడని ఈతడు అంబిక పంచాక్రియల నిర్వహణకు నియమించిన అధికారులలో ఒకడు మాత్రమే! నిజమైన యజమాని అంబిక, పరాశక్తి. ఆమె అయిదుగురు అధికారులను నియమించి, వారిచేత పని చేయించుతున్నది.


పనిచేయిస్తున్నదంటే మెమోలు, సర్క్యులర్లు పంపుతున్నదా లేక మౌఖికమైన ఉత్తర్వులు జారీచేస్తున్నదా? మహారాజ్ఞి అయిన ఆ తల్లి ఇంతటి చిన్న చిన్న విషయాలకై అంత శ్రమ తీసుకోనవసరం లేదు. ఆమె వద్దనుండి చిన్న సూచన లభిస్తే చాలు ఈ అధికారులు మెరుపువేగంతో పనిచేస్తారు. ఆమె తన లతలవంటి కనులతలను క్షణకాలం కదపడం వంటి చిన్న సంజ్ఞ చేస్తేచాలు. “క్షణ చలితయో గ్ర్భూలతికయోః" - ఆ సంజ్ఞనే ఆమె ఆజ్ఞగా గ్రహించి “ఆజ్ఞామాలభ్య” ఈ పంచక్రియలు నిర్వహించడానికి ఆమెచే ఏర్పాటు చేయబడిన దేవతలు వారి వారి విధులు చేయడానికి శీఘ్రగతిని సాగిపోతారట.


మొదటి శ్లోకంలో అంబిక సర్వోన్నతమైన స్థితిలో అభివర్ణించబడింది. అక్కడ త్రిమూర్తులు ఆమె భక్తులు - ఆమె వారి ఆరాధ్యదైవం. ఇక్కడ రాచరికపు మర్యాదలు, హంగులు చూపబడినా వారితో ఆమె సంబంధం ఒక యజమాని, సేవకుల మధ్యనుండే సంబంధం వంటిదే! మరి ఆరాధ్యదైవం కంటే యజమాని స్థితి కొంచెం నిమ్నమైనదే కదా?


సరి! ఆమె పరిజనులలో తిరోధాన కార్యం నిర్వహించే ఈశ్వరుడొకడు. సమస్త విశ్వాన్ని, త్రిమూర్తులను మాయా బద్దులను చేసి ఉంచేది నేనేకదా అని ఆయన అనుకుంటూ ఉండవచ్చు. అందుకే ఆయన మహోన్నతుడైన దైవతమని సూచించే ఈశ్వర నామము వచ్చింది. “తిరస్కుర్వన్నేతత్" త్రిమూర్తులను కూడా మాయా బద్దులను చేస్తాడని చెప్పబడింది. “స్వమపి వపుః ఈశస్థిరయతి”. అంతేకాదు, తానేమి చేస్తున్నాడో తెలియక తనుకూడా మాయాబద్దుడై కప్పబడతాడట. అతని శక్తి నైపుణ్యములు అంబిక అనుగ్రహం. తన మాయచేతనే తాను కప్పబడేవాడు ఈశ్వరునిగా పిలవ బడటంలో హేతువులేదు. అంబికే నిజమైన ఈశ్వరి. ఆయనను ఆ పేరు ధరించనీయడం అంబికయొక్క పెద్దమనసు.

**దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఇరవైనాల్గవ శ్లోక భాష్యం - రెండవ భాగం


అయిదుగురు అధికారులలో నలుగురిని చూశాము, ఇక అయిదో అధికారి అనుగ్రహం చేస్తూ ఉంటాడు. అంబిక - ఈశ్వరుని ఉదాహరణ చూసిన తరువాత ఈయన ఇంకొక మెట్టు పెద్దదైన పేరుపెట్టు కొంటాడోమో! నాకంటే ఉన్నతుడునని సూచించే పేరుపెట్టుకోవచ్చు. అయితే నాకంటే ఉన్నతు లేవరూ లేరే? సములు ఎవరైనా ఉన్నారా అంటే అది నాపతి అయిన శివుడు మాత్రమే! మేమిద్దరమే ఈ పంచకృత్యాలు నిర్వహించే అధికారుల కంటే ఉన్నతులము. ఇప్పుడు ఈ అయిదవ అధికారి ఏమిపేరు పెట్టుకొంటాడో - అని ఆలోచించి నట్లుంది. ఆ అయిదో అధికారిని పిలిచి “నీ పేరు నీవే ఎన్నుకోవచ్చు. అయితే, శివుడనే పేరుమాత్రం పెట్టుకోవద్దు” అని శాసించినట్లుంది.


పెరుమాళ్ళు కింద ఎంతో భక్తిగల ఒక వైష్ణవ భూస్వామి వద్ద ఒక సేవకుడు ఉన్నాడు. ఒక రోజు ఆ యజమాని అతనిని “నీపేరేమిటి” అని అడిగినాడు. ఆతడు “పెరుమాళ్ళు” అని సమాధానం చెప్పాడు. "ఆ! ఒక సేవకుడు స్వామి నామంతో పిలవబడటమా? ఎంతటి అపచారం” అనుకొని ఆ భూస్వామి సేవకుని పెరుమార్చుకుని గాని పనిలోకి రాకూడదని చెప్పాడు. మరి దానికి చాలా ఖర్చు అవుతుంది. గ్రామపెద్ద కార్యాలయానికి వెళ్ళాలి. మేకనో కోడిపుంజునో బలి ఇవ్వాలి. చాలా ఖర్చవుతుంది. యజమాని ఆ ఖర్చు భరించడానికి ఒప్పుకుని బదులిచ్చాడు. ఆయనకు కావలసింది తాను సేవకుని తన ఆరాధ్యదైవమైన పేరుమాళ్ళు పేరుతో పిలవరాదనిమాత్రమే! పేరు మార్చుకొని వచ్చిన తరువాత యజమాని ఇప్పుడు “నీపేరేమిటి?” అని అడిగాడు. ఆ సేవకుడు “పెద్ద పెరుమాళ్ళు” అని చెప్పాడు. తమిళంలో “పెరుమాళ్ళు తరువాత పెద్ద పెరుమాళ్ళు” అన్న సామెత ఉన్నది.


తమిళంలో “పెరుమాళ్ కోయిల్” అంటే కాంచీపురం. ఒట్టిగా “కోయిల్” అంటే అది శ్రీరంగం. వైష్ణవులు రంగనాథుని ‘పెరియ పెరుమాళ్” అంటారు. “పెద్ద పెరుమాళ్ళు” అన్నా మరి ఇదే! తమిళదేశం చాలాకాలం తెనుగుల పాలనలో ఉన్నది. అందువల్లనే తమిళంలో చాలా తెలుగు పదాలుంటాయి. వాటిలో ఈ “పెద్ద” అన్న పదం ఒకటి. ఆచార్యులవారు ఆ అధికారి తన నామం సదా అన్నపదం ముందు చేర్చబడ్డ శివునిగా అంటే సదాశివునిగా పెట్టుకొన్నదని చెబుతున్నారు. “సదాపూర్వశివ”. కానీ ఆచార్యులవారు సదాశివుడని చెప్పక ఈ రకంగా చెప్పడం ఎందుకు? కొంటెతనం. చమత్కారం కోసం. అంబిక అమ్మ. ఏదో సందర్భంలో ఆమెను ఎగతాళి పట్టించడంలో ఒక ఆనందం ఉంది. ఆవిడ ఆ అధికారితో శివుని పేరుతప్ప ఏదైనా పేరు పెట్టుకోమందనుకోండి. ఆతడు సదా - నిత్యము, ఎల్లప్పుడూ అనే శబ్దంతో చేర్చిన శివుని పేరు పెట్టుకొన్నాడు. ఒకడు ఎల్లపుడూ శివుడయితే ఇక పేరు మార్చేదెలా? అంబిక విస్తు పోవడాన్ని ఆచార్యులవారు ఒక చమత్కారమైన మలుపుతో చెబుతామనుకొన్నారు. ఎంతో సున్నితంగా “సదాపూర్వశివు” డని చెప్పి పాఠకులలో ఒక ఉత్సుకతను రేకెత్తించి సమాధానం వెతుక్కొనేలా చేశారు. ఇలా చేయడం వల్ల పాఠకుల మనసుల్లో కథపైన లోతయిన ముద్ర ఉంటుంది. సదాశివుడని చెపితే ఇంత ఆలోచించాల్సిన అవసరమే ఉండదుకదా! ఈ రకంగా అమ్మవారిని పల్టీకొట్టించి 'సదాశివుడు' పేరు పెట్టుకొన్న అధికారి తన అనుగ్రహకార్యాన్ని అంబిక కనుసన్నల మేరకు జరుపుతూఉంటాడు. 


ఈ శ్లోకంలో అంబిక యజమానిగానూ, శివుడు తన రుద్ర, ఈశ్వర, సదాశివ రూపంలో సేవకులుగానూ అభివర్ణించ బడినాడు.


(సశేషం)


కృతజ్ఞతలతో 🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

(సశేషం)


కృతజ్ఞతలతో 🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

శ్రీమన్నారాయణీయం

 **దశిక రాము**


**శ్రీమన్నారాయణీయం**


**1-2-6-శ్లో.**


ఏవంభూతమనోజ్ఞతా నవసుధానిష్యందసందోహనం

త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతామ్।

సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచ యత్యంగకం

వ్యాసించత్యపి. శీతబాష్పవిసరైరానందమూర్ఛోద్భవైః||


భావము: సౌందర్యామృత మయమైన నీ రూపము బహు మనోజ్ఞమైనది. నిత్య నూతనమైనది. అట్టి నీ స్వరూప ఆకర్షణతో ప్రేరేపింపబడిన భక్తుల చిత్తములు పరతత్వ జ్ఞానానందము పొందుతాయి. వారి శరీరములకు గగుర్పాటు కలిగి, ఆనందభాష్పములతో పులకితులవుతారు.


వ్యాఖ్య - మనలను ఈ లోకానికి బంధించేది మనస్సు. మనస్సు వామనాడియైన ఇడానాడి అధీనములో ఉన్నది. దానిని ఆధారముగా చేసుకుని కూడా పైకి వెళ్ళవచ్చును. లోకములో అనేక వస్తువులపై పెంచుకునే మోహమును పరమేశ్వరునియందే పెంచుకొనవచ్చును. అన్నికోరికలు తీరుటకు ఆయననే ఆరాధింపవచ్చును. మధురమైన పాయసమును త్రాగితే కలిగే సంతృప్తిని ఆయనే ఈయగలడు. ఆయన చూపించేది ముక్తి మార్గమే అవుతుంది. 


అటువంటి స్థితికి చేర్చే భక్తి ఎలా ఉండాలో భాగవతంలో వచ్చే ప్రహ్లాదుడి మాటల్లో చూద్దాం.


 "దేవతలూ, సిద్ధులూ, మునీశ్వరులూ, బ్రహ్మదేవుడు మున్నగువారు ప్రగాఢమైన కాంక్షతో నిన్ను నిత్యం అనేక విధాలుగా ఆరాధిస్తారు; నీ గుణాలను గానం చేస్తారు; కాని సంపూర్ణంగా నిన్ను తెలుసుకుని సమగ్రంగా నిన్ను అభివర్ణించలేరట! నేనేమో దైత్యునికి పుట్టినవాడిని; గర్వ మద స్వభావిని; చిన్నపిల్లాడిని; మూర్ఖుడిని; మరి నిన్ను కీర్తించటం నాకెలా సాధ్యం అవుతుంది?


ఓ నారసింహా! గొప్ప గొప్ప జపతపాలు, సద్వంశమూ, తేజస్సూ, వేద నైపుణ్యాలూ, సౌందర్యాలు, గట్టి నిష్ఠలూ, సత్కార్యాలు చేసే నైపుణ్యాలు, పరాక్రమాలూ, పౌరుషాలు, నైష్ఠికాలూ, శక్తిసామర్థ్యాలూ, హోమాలూ యజ్ఞాలూ మొదలైని ఏవీ కూడ నిన్ను సంతోషపెట్టటానికి సరిపోవు. 


పూర్వం గజేంద్రుడు భక్తితో నిన్ను మెప్పించి మె

మోక్షం సాధించాడు కదా. నిన్ను మెప్పించటానికి అలాంటి భక్తి తాత్పర్యాలు అలవరుచుకోవాలి.


దానం, నీతి, సత్యం, క్షాంతి, ఈర్ష్య లేకపోవుట, యజ్ఞాలు, తపశ్శక్తి, అసూయ లేమి వంటివి ఎన్ని ఉన్నా గర్విష్ఠి అయిన బ్రాహ్మణుని కంటె త్రికరణసుద్ధిగా సమబుద్ధితో నిన్ను సేవించే చండాలుడు ఉత్తముడు. అట్టివాడు నీ సాన్నిధ్యాన్ని పొంది తన వంశం మొత్తానికి శోభ కలిగిస్తాడు.


భగవానుడు అజ్ఞానులు చేసిన భక్తిని స్వీకరించడు. కాని ఆయన దయాసముద్రుడు కనుక కొందరు అజ్ఞానులు చేసిన ఆరాధనలను కూడా స్వీకరిస్తాడు. ఆయన పరిపూర్ణుడు కనుక భక్తులు చేసే భక్తివలన భగవంతునికి ఏ ప్రయోజనమూ లేదు. అయినా సర్వ కార్యాలు భగవదర్పణంగా చేయవలెను, అలా చేస్తే అద్దంలో నుదుటి బొట్టు కనబడినంత స్వచ్ఛంగా, సర్వ కార్యాలు ప్రయోజనాలు చేకూరుతాయి. 


భగవంతుడు హరి దయామయుడు, భక్తుల ఎడ బందువాత్సల్యం గలవాడు. ఆయన భక్తిని తప్ప మరి దేనిని మెచ్చడు అందుచేత విష్ణుభక్తి విడువక చేయవలెను.


శ్రీహరీ! మానవుడు కేవలం నీ గుణాలను కీర్తించటం ద్వారా అవిద్యను జయించి కైవల్యాన్ని అందుకుంటాడు.


భగవంతుడా! ప్రతీ జన్మలోనూ సుఖానికి వియోగం, దుఃఖానికి సంయోగం కలుగుతూనే ఉంది. దానితో నా కెప్పుడూ శోకమే ప్రాప్తిస్తూ ఉంది. ఈ శోకాగ్ని నన్నెప్పుడూ నిలువునా కాల్చివేస్తూ ఉంది. సుఖం ఇవ్వదని తెలిసినా, ఈ దేహం మీద అభిమానం వదలటంలేదు. అలా ఆ మోహంతో తిరుగుతున్నాను. అటువంటి నాకు ప్రియుడవు, సఖుడవు, పరదేవతవు సర్వం నీవే. నీ లీలావతారాలే బ్రహ్మగీతాలు. వాటినే నిత్యం పఠిస్తూ కోరికలనుండి విముక్తి పొంది, దుఃఖాలను అధిగమించి నీ పాదపద్మాలను సేవించే భక్తులతో కలిసి ఉంటాను.


చంటిపిల్లాడిని తల్లిదండ్రులూ, రోగిని వైద్యుడు ఇచ్చే ఔషధమూ, సముద్రంలో మునిగిపోతున్న వాడిని నావ ఎలాగైతే రక్షిస్తారో, అలాగే ఈ సంసార తాపత్రయాలతో తప్తులైన వారిని నీవే తప్ప మరెవరు రక్షించలేరు. నీచేత ఉపేక్షింపడిన వానిని, నువ్వు తప్ప మరెవ్వరూ ఉద్ధరించలేరు. 


లోకంలో ఎవడు, ఏ కార్యం, ఎవరి ప్రేరణతో, ఏ ఇంద్రియాల వలన, దేని కోసం, ఎవరికి సంబంధించి, ఏ స్థలంలో, ఏ సమయంలో, ఏ రూపంలో, ఏ గుణం వలన నెరవేరుస్తాడో; ఇహలోకంలో జనకభావానికీ, పరలోకంలో బ్రహ్మభావానికీ రూపాంతరం పొందించే ఆ వివిధ ప్రకారాలూ నీవే. సమస్తమూ నీవే, నీవు నిత్యముక్తుడవు. సత్యరక్షకుడవు.

నీ అంశయైన పురుషునిలో నీ అనుగ్రహం వలననే కాలప్రేరితమూ, కర్మమయమూ, బలయుతమూ, ప్రధానలింగమూ అయిన మనస్సును, నీ మాయ సృష్టిస్తుంది. 


ఈ మనస్సు అవిద్యాజనకమైన వికారమూ, వేదోక్తకర్మ ప్రధానమూ, సంసారచక్రాత్మకం అయినది. ఇలాంటి మనస్సుతో నిన్ను సేవించకుండా తరించగల సమర్ధుడు ఎవడూ లేడు. 


నువ్వు విజ్ఞానం చేత బుద్ధిగుణమును జయించిన వాడవు. కార్యకారణ శక్తినీ కాలం నీ వలననే వశం చేసుకుంటుంది, ఈ కాలం మాయతో కూడి పదహారు విధాలైన వికారాలతో కూడిన సంసార చక్రమును నిర్మించి, త్రిప్పుతూ ఉంటుంది, నేను ఈ సంసార దావానలంలో పడిమాడిపోతున్నాను లోకరక్షామణీ! రక్షించు!


ప్రజలు సిరి సంపదలూ, ఆయురారోగ్యాలు, వైభవమూ వంటి వాటినే దివ్యమైనవి అనుకుంటారు, వాటిని ఆశించి దిక్పాలకాదులను కొలుస్తారు. మా తండ్రి హిరణ్యకశిపుడు కోపంతో చూసే కడగంటి చూపుతో చెలరేగే భృకుటి ముడి మాత్రం చేతనే, ఆ దిక్ప


ాలురు వణికిపోతారు. అంతటి మహాశూరుడు ఒక్క నిమిషంలో నీ చేతిలో ఇవాళ మరణించాడు. కనుక బ్రహ్మాది రూపధారుల వైభవాలు, సిరిసంపదలు, జీవితాలు ఏవీ శాశ్వతాలు కావు. ఇవన్నీ కాలరూపంలో మెదులుతుండే విష్ణుమూర్తీ! నీ చేతిలో నశించిపోతాయి. ఇవేమీ నాకు వద్దు. నీ మీద కొద్దిగా భక్తి, జ్ఞానం కుదిరాయి. కాబట్టి, నేను నిత్యం సేవకుడిగా నిన్ను సేవిస్తాను.


ఎండమావుల వంటివి ఈ సుఖాలూ, భోగాలూ. మనిషి ఇవే జీవిత పరమావధి అనుకుంటాడు. తన దేహం దుఃఖ భూయిష్ఠం, రోగగ్రస్తం అయినా సరే, విరక్తి పొందడు. ప్రజ్వలించే కామాగ్నిలో పడి తపించిపోతూ ఉంటాడు. అట్టివాడు ఈ దుష్టసౌఖ్య పరంపరలకు లోబడిపోయి ఎన్నటికీ తీరం చేరలేడు.


ప్రభూ! లక్ష్మీ పతి! నరసింహా! పద్మంలో పుట్టిన ఆ బ్రహ్మదేవుడికి అయినా సరే నీ చెయ్యెత్తి తలమీద పెట్టి అభయం ఇవ్వలేదు. నేనేమో చిన్న పిల్లాడిని; తామసగుణంతో కూడిన రాక్షసవంశంలో పుట్టిన వాడిని; దైత్యుడిని; ఉగ్ర మైన రజోగుణం కలవాడను; అలాంటి నా తల మీద, అవ్యాజ్యమైన కృపతో నీ ది వ్య భవ్య హస్తాన్ని ఉంచి దీవించావు. ఇది నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. స్వస్తి.


🙏🙏🙏

శ్రీ శివ మహా పురాణం

 **దశిక రాము**


**శ్రీ శివ మహా పురాణం**


24  by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


మార్కండేయ చరిత్ర


పూర్వకాలంలో మృకండుడు అనబడే ఒక మహర్షి ఉండేవాడు. గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణయందు ఆయన, ఆయన భార్యయైన మరుద్వతి ఇద్దరూ కూడా బహుశ్రద్ధ పూనిక ఉన్నవారు. వీళ్ళిద్దరూ హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక ఆశ్రమమును నిర్మితం చేసుకుని తల్లిదండ్రులతో, శిష్యులతో అక్కడ నివసిస్తున్నారు. ఆవులనన్నిటినీ చేరదీసి కాపాడుతూ ఆ ఆవుపాలతో శివార్చన చేస్తూ ఆయన ఈలోకమునందు ప్రకాశిస్తున్నాడు. మరుద్వతి ఎంతో సంతోషంతో అత్తమామలకు సేవ చేసేది. భర్తను సేవించేది. శిష్యులను తల్లిలా కాపాడేది. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో తమ జీవితమును పండించుకుని అందరికీ కామధేనువై కల్పవృక్షమై తమ జీవితమును నడుపుతున్నా వారికి బిడ్డలు కలుగలేదు. ఆ సాకుతో వారు శివార్చన మాత్రం మానలేదు. ఈశ్వరుడిస్తాడని పూనికతో వారు శివార్చన చేస్తున్నారు.

ఇలా ఉండగా ఒకరోజు మృకండుడు బ్రహ్మ ఉండే అంతఃపురప్రదేశమునకు వెళ్ళి బ్రహ్మగారి సభలోనికి ప్రవేశించడం కోసం మిగిలిన ఋషులతో పాటుగా లోపలికి వెడుతున్నాడు. అపుడు ఆయనను అక్కడ ఉండే ద్వారపాలకులు మీరు వెళ్ళకూడదు అని అడ్డుపెట్టారు. ఆయన ఆశ్చర్యపోయి ‘నేను ఎందుకు వెళ్ళకూడదు?” అని ప్రశ్నించారు. ‘మీకు సంతానం లేదు. అందువల్ల మీకు బ్రహ్మ సభా ప్రవేశార్హత లేదు’ అన్నారు. మృకండుని అవమానించడం వారి ఉద్దేశం కాదు. శాస్త్రవాక్కు ఒకటి ఉన్నది. సంతానం లేకపోతే పితృ ఋణం తీరదు. ఎవరయినా వివాహం చేసుకోక బ్రహ్మచర్యంలోనే ఉండిపోతే ఇలాంటి బిడ్డలను కన్నారు కాబట్టి ఆ బిడ్డల తల్లిదండ్రులను తిరగేసి చెట్లకు కట్టేస్తారు. దేవీ భాగవతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉంది. అందుకే నేను పెళ్లి చేసుకోను అనరాదు. చేసుకుని తీరాలి. ఇక్కడ మృకండునికి పితృ ఋణం తీరలేదు. అది దోషం. మృకండు మహర్షి ధర్మ సూక్ష్మం తెలిసిన ఉన్నవాడు. ‘నాకు అనపత్య దోషం ఉంది’ అని మనస్సులో కొంచెం బాధపడుతూ ‘అయ్యో నన్ను ఎందుకు ఈశ్వరుడు పితృ ఋణం నుంచి విముక్తుడిని చేయలేదు’ అని బెంగ పెట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండే మహర్షుల భార్యలు అక్కడి ప్రదేశంలో ఉండే తపోవనములను దర్శించడం కోసమని వచ్చారు. వారు మరుద్వతిని చూసి చాలా సంతసించి ‘అమ్మా మేము చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడ ప్రదేశములను చూడడానికి వచ్చాము. మాకు కొంచెం దేవతార్చనకు అవకాశం ఇవ్వగలవా’ అని అడిగారు. అపుడు ఆవిడ మీరందరూ తప్పకుండా రండి’ అని వారందరినీ పిలిచి పంచభక్ష్య పరమాన్నాలతో చక్కటి భోజనం తయారుచేసి వాళ్ళకి భోజనం వడ్డించింది. అపుడు వాళ్ళు ‘అమ్మా, అలా మేము ఒక్కళ్ళం భోజనం చేయము మేమూ తల్లులమే కదా! నీ బిడ్డలను పిలు. నీ బిడ్డలు కూడా ఇక్కడ కూర్చుంటే మేము నివేదన చేసుకుని స్వీకరిస్తూ తత్ప్రసాదమును వారి చేతిలో కూడా ఉంచుతాము. ఆ పిల్లలతో కలిసి తినాలని మాకు కోరికగా ఉంది. నీ బిడ్డలను పిలువవలసినది’ అన్నారు. అపుడు మరుద్వతి ‘అమ్మా నేను తక్కువ నోములు నోచాను. నా నోములు ఫలించలేదు. నాకు బిడ్డలు లేరు. మీవంటి తపస్వినులు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అన్నం తిన్న పుణ్యం చేత నాకడుపు పండుతుందని అనుకుంటున్నాను. దయచేసి స్వీకరించండి’ అంది. అపుడు వాళ్ళు ‘అమ్మా, ఏమీ అనుకోవద్దు. పురుషుడు పితృ ఋణం తీరడం కోసమే సంతానమును అపేక్షించే క్షేత్రముగా భార్యను స్వీకరిస్తున్నాడు. మీరు గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారో తత్ఫలాన్ని ఇప్పటికీ పొందలేక పోయారు. కాబట్టి అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనం చేయము’ అని చెప్పి వారు వెళ్ళిపోయారు. అపుడు మరుద్వతి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది.ఆసమయంలో మృకండు మహర్షి కూడా బాధపడుతూ ఇంటికి వచ్చాడు. ఆయన భార్యను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగారు. జరిగిన విషయం చెప్పింది ఆవిడ. అపుడు ఆయన కన్నుల కూడా నీరు కారింది. సంతానం కలుగకుండా గల దోషం పరిహరింప బడడం ఈశ్వరానుగ్రహంగా ఉంటుంది. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుని అనుగ్రహం మీదనే వంశవృద్ధి ఆధారపడి ఉంటుందని శాస్త్రవాక్కు. అందుకే సుబ్రహ్మణ్యారాదన అంత గొప్పది. ఆయన పూజ తద్దోషమును పరిహరిస్తుంది. అపుడు మృకండుడు అన్నాడు “అయ్యయ్యో మరుద్వతీ, ఏక కారణమునకు ఇద్దరమూ గురయ్యాము. దేవీ, నువ్వు బాధపడకు. ఈశ్వరుడు ఉన్నాడు. నేను ఆయన గూర్చి తపస్సు చేస్తాను, బయలుదేరుతున్నాను” అని నీ తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరి ఒక మారేడు వనమునందు శివలింగమును ప్రతిష్ఠించి దానికి రోజూ అర్చన చేస్తూ తపస్సు చేస్తున్నాడు. మరుద్వతి తపస్సు చేస్తున్న భర్త గారికి అన్నీ అందిస్తూ ఆయన క్షేమమును విచారిస్తూ తాను కూడా ఖాళీ సమయంలో పరమేశ్వరారాధన చేస్తోంది. వీరిద్దరూ ఇలా తపస్సు చేస్తున్నా శంకరుడు ప్రత్యక్షం అవలేదు.

నారదమహర్షి కైలాసమునకు వెళ్ళి శంకరుని చూసి ‘తండ్రీ, నిన్ను నమ్మి ఆ దంపతులిద్దరూ తపస్సు చేస్తున్నారు. ఇలా పిలిస్తే పలికేవాడివి.వారినింకా ఎన్నాళ్ళు పరీక్షిస్తారు’ అన్నాడు. శంకరుడు మహర్షికి ప్రత్యక్షమై నీకు పదహారేళ్ళ వయసు ఉండే కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. కుమారుడు పుట్టాడు. మార్కండేయుడని పేరు. ఆ దంపతులు, కుమారుడు కూడా పరమేశ్వర భక్తితో కాలం గడుపుతున్నారు. ఇలా గడిపేస్తుండగా ఒకరోజు నారదమహర్షి అక్కడికి వచ్చారు. మృకండు దంపతులు మహర్షికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించారు. నారదుడు మృకండునితో ‘మృకండా, నీకు ఒక్క విషయం జ్ఞాపకం ఉందా? ఈ పిల్లవానికి పదిహేనవ సంవత్సరం వెళ్లి పదహారవ సంవత్సరం వచ్చింది. అది కూడా కొద్ది రోజులలో అయిపోబోతోంది. ఆనాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది. ఇలాంటి పిల్లవాడికి ఏదయినా జరగరానిది జరిగితే మీరు తట్టుకోగలరా! ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతోంది కదా’ అన్నాడు. నారదుడు ఈమాటలు చెప్పగానే మరుద్వతి ఏడుస్తోంది. ఇంత తపో నిష్ఠా గరిష్టుడయిన మృకండుడు కూడా దుఃఖమును ఓర్చుకోలేక క్రిందపడి దొర్లి ఏడుస్తున్నాడు. ఇంతలో మార్కండేయుడు గబగబా లోపలికి వచ్ఛి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. వాళ్ళు ఉన్న సత్యమును ఎరుకలో పెట్టారు. పిల్లవాడు మాత్రం ఏ విచారమూ లేకుండా నవ్వుతూ నిలబడి ఉన్నాడు. అపుడు నారదుడు వాడి భక్తి, వాడి విశ్వాసం వాడి ధృతి వాడి ధైర్యం చూశారా! మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తపించగల శక్తితో ఉన్నాడు. వాడే శివుడున్నాడు, రక్షించి తీరుతాడనే పూనికతో ఉన్నాడు. కాబట్టి మీరు కూడా శివార్చనను పెంచండి. తపస్సు మొదలుపెట్టండి. మొట్టమొదట వీనిని హిమాలయ పర్వత ప్రాంతములకు పంపించి వీనిని అక్కడ కూర్చోపెట్టి తపస్సు చేయమని చెప్పండి. ఎ శంకరుడు వీనిని ఇచ్చాడో ఆ శంకరుడు వేడిని రక్షిస్తాడో రక్షించడో తేలిపోతుంది. పిల్లాడిని పంపండి’ అన్నాడు. అపుడు మార్కండేయుడు “నన్ను అనుమతించండి. నేను దీర్ఘాయుష్మంతుడనవ్వాలని ఆశీర్వచనం చేయండి. శంకరుని గూర్చి తపస్సు చేస్తాను. నాకు ఆ మహానుభావుడు సిద్ధిని ఇస్తాడు. మీరేమీ బెంగ పెట్టుకోకండి’ అని చెప్పి పిల్లవాడు వెళ్ళిపోయాడు. అలా వెళ్లి హిమాలయ ప్రాంతమందు ఒక శివలింగమును తయారు చేసి దానికి చిన్న దేవాలయం లాంటిది నిర్మించి అక్కడ కూర్చుని తపస్సు మొదలు పెట్టాడు.

సమయం ఆసన్నమయింది. అక్కడ యమలోకంలో యమ ధర్మరాజు దూతలను పిలిచి మార్కండేయుడిని పాశములచేత బంధించి ఈ లోకమును చేరండి’ అని చెప్పాడు. యమదూతలు వెళ్లి పాశం వెయ్యడానికి భయం వేసి యమలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. అపుడు యమధర్మరాజుకు ఎక్కడలేని కోపం వచ్చి నేను బయలుదేరి వెడతాను. నాకు ఏమగాడు అడ్డు వస్తాడో చూస్తాను’ అని బయలుదేరుతుండగా నారదుడు ఎదురు వచ్చాడు. మహర్షిని నమస్కారం చేశాడు యమధర్మరాజు. అపుడు నారదుడు ‘ఎందుకయ్యా పంతాలు పట్టింపులు. వాళ్లకి ఉన్నది ఒక్క పిల్లాడు. మహర్షి కదా. పుత్రభిక్ష పెట్టిన వాడవు అవుతావు కదా’ అన్నాడు. నారదుడు ఇలా అనేసరికి యమధర్మరాజుకి కోపం వచ్చేసింది. ప్రాణములు తీసి తీరతాను అని దేవాలయం దగ్గరకు వెళ్ళాడు. అతనిని బహిర్ముఖుని చేస్తే సరిపోతుంది అనుకోని బయటకు రా నేను యమధర్మరాజుని నీ ప్రాణములు తీయడానికి వచ్చాను. అదే నీకు మోక్షము. బయటకు రా’ అన్నాడు. అపుడు మార్కండేయుడు ‘ఓరి పిచ్చివాడా! నీకుకూడా ప్రభువెవడో వానిని నేను ఆరాధన చేస్తున్నాను. నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు. నా తల్లిదండ్రుల కోర్కె తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను. అలా ఉండేటట్లు చేయమని పరమశివుని ప్రార్థిస్తున్నాను. నేను ఆయనను ఆరాధన చేస్తుండగా ఫలితం ఆయన ఇవ్వాలి తప్ప ఇవ్వడానికి నువ్వెవరు? నీకు చేతనయితే ప్రాణాలు తియ్యి’ అన్నాడు. యమధర్మరాజు గారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. చేతిలో మెరిసిపోతున్న యమపాశమును విసిరి లాగుతున్నాడు. పిల్లవాడు భయపడకుండా శివలింగమును కౌగలించుకుని చంద్రశేఖరునిపై అష్టకం చదువుతున్నాడు. అలా కౌగలించుకోవడంలో కంఠమునకు పడిన పాశం శివలింగమునకు తగిలింది. అంతే ఒక్కసారి శివలింగం ఫెటిల్లున పేలిపోయింది. వామార్ధ భాగమునందు పార్వతీ దేవితో శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు వక్షస్థలం పై ఒక్క తన్ను తన్నేటప్పటికి యమధర్మరాజు నీలపై విరుచుకు పడిపోయాడు. అపుడు శివుడు తన చేతిలోని త్రిశూలంతో ఒక పోటు పొడిస్తే యముడు మరణించాడు. పిమ్మట మార్కండేయుని వంక ప్రసన్నుడై చూశాడు. ఒక్కవరం కోరుకో. అన్నాడు.

మార్కండేయుడు ఇరువురికీ నమస్కరించి నేను ఏ కోరిక కోరను? పాపం యముడు తెలియక పొరపాటు చేశాడు. ఆయనను బ్రతికించండి’ అన్నాడు. అపుడు శంకరుడు ప్రసన్నుడై చూడగా యమధర్మరాజు మళ్ళీ లేచి నమస్కరించి “స్వామీ, నువ్వు వరం ఇచ్చినప్పుడు ఈ బాలుడికి పదహారు సంవత్సరములు ఆయుర్దాయం మాత్రమె ఉంటుందని చెప్పావు. నేను చేసిన దోషం ఏమిటి? చెప్పవలసింది’ అన్నాడు. శివుడు మందహాసం చేసి నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం. ఎప్పుడూ పదహారేళ్ళు వయస్సు ఉండే పిల్లవాడిని నేను వాళ్లకి ఇచ్చాను. నువ్వు పదహారేళ్ళే అర్థం చేసుకున్నావు. అందుకని ఇలా జరిగింది ఏమీ బెంగలేదు. వెళ్ళు’ అన్నాడు. మార్కండేయుడిని చూసి పార్వతీదేవి పొంగిపోయింది. వీడికి మంచి వరమును ఇవ్వవలసింది అని చెప్పింది భర్తకి. అప్పుడు పరమేశ్వరుడు ‘ఈ లోకములు అన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్రశాయి తన బొటనవేలిని నోటిలో పెటుకుని చీకుతూ ఒక మర్రి ఆకుమీద పడుకున్తాడో అప్పటి వరకు చిరంజీవివై ఉంది మార్కండేయాయుష్షు అనే కొత్త ఆయుష్షును సృష్టించి నీకు ఇస్తున్నాను అన్నాడు. అందుకే మనవాళ్ళు పూర్వం పిల్లలకు నీళ్ళు పోస్తే నాన్నా నీకు మార్కండేయ ఆయుష్షురా’ అనేవారు. అలా రోజూ అంటూ నీళ్ళు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమౌతుంది అని వారి ఉద్దేశం.

ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండని వారు చంద్రశేఖర అష్టకమును నామీద నమ్మకంతో చదివితే వాళ్లకి అపమృత్యుదోషం రాకుండా నేను పరిహరిస్తాను. వారిని నేను రక్షించి తీరుతాను అంటాడు పరమేశ్వరుడు. కాబట్టి చంద్రశేఖరాష్టకం అంత గొప్పది. ఎవరయితే ఈ చంద్రశేఖరాష్టకమును నమ్ముకుని ప్రతిరోజూ ఇంట్లో చాడువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్ళలోంచి అకారణంగా సమయం కాకుండా అపమృత్యు దోషం వలన బయటికి శరీరములు వెళ్ళవలసిన అవసరం లేకుండా నేను వాళ్ళని వాళ్ళ వంశములను కాపాడతాను. ఇది చదివిన వారికి దీనిని వినిన వారికి అపారమయిన కీర్తిని తేజస్సుని ఆయుర్దాయం నేను కృప చేస్తున్నాను అన్నాడు. ఈ అష్టకం ఎక్కడ చదువుతున్నారో అక్కడ అంతా శుభం జరుగుతుంది అన్నాడు. ఎవరు నమ్మకంతో రోజూ శివుని సన్నిధానమునందు మృత్యు భీతితో ఈ అష్టకమును పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి మృత్యు భయం ఉండదు. ఆపదలు రాకుండా పూర్ణమయిన ఆయుర్దాయం వాళ్ళు పొందుతారు. దానితో బాటుగా అఖిలమయిన అర్థములు యశస్సు సంపత్తి అన్నీ చేకూరుతాయి. వీరి ప్రయత్నం లేకుండా చిట్టచివరి రోజున చంద్రశేఖరాష్టకం చదివిన ఫలితం చేత ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుని నామం జ్ఞాపకమునకు వచ్చి చంద్రశేఖరా అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షం ఇవ్వబడి ఆయనలోనే కలిసిపోతాడు. అంత గొప్ప అష్టకంతో కూడిన ఈ మార్కండేయ మహర్షి జీవితమును ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు చదువుతున్నారో/వింటున్నారో వారికి పరిపూర్ణమయిన శివకటాక్షం కలుగుతుందని శివపురాణామ్తర్గతమయిన వాక్కు.


🙏🙏🙏