6, జులై 2023, గురువారం

కౌసల్యా సుప్రజా రామా'

 *కౌసల్యా సుప్రజా రామా' అంటూ శ్రీవేంకటేశ్వర సుప్రభాతం మొదలవ్వడంలో అంతరార్ధం ఏమిటి? శ్రీనివాసుని స్తుతిలో రాముని ప్రస్తావన ఎందుకు వచ్చింది?*


🙏🙏🙏🙏🙏🙏🙏


శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలోని మొదటి శ్లోకమైన 'కౌసల్యా సుప్రజా రామా' అనేది వాల్మీకి రామాయణంలోని శ్లోకం. యాగ సంరక్షణ కోసం తనతో తీసుకు వెళ్తున్న ఆ సుకుమారుడైన రాముణ్ణి నిద్ర మేల్కొలుపుతూ విశ్వామిత్ర మహర్షి చెప్పిన శ్లోకం ఇది. ఇక ఈ సుప్రభాతంలోని రెండవ శ్లోకం 'ఉత్తిష్టోత్తిష్ట గోవిందా అంటూ కృష్ణుణ్ణి నిద్రలేపుతున్నట్టు ఆ తరువాత 'ఉత్తిష్ట గరుడధ్వజ' అంటూ విష్ణువుకు మేలుకొలుపు పాడుతున్నట్టూ ఉంటుంది. 24వ శ్లోకంలో 'మీనాకృతే' అంటూ మత్స్యావతార వర్ణన కూడా ఉంది.


దీని అర్ధం ఏమిటంటే ఈ దశావతారాలనూ వహించిన సాక్షాత్ ఆ శ్రీమహావిష్ణువే ఈ వేంకటేశ్వరస్వామి అని పునఃప్రతిపాదించడానికే. తిరుమల కలియుగ వైకుంఠం. ఆ వేంకటేశ్వరస్వామి వైకుంఠం నుంచీ మనందర్నీ తరింపజేఒయడానికి వచ్చిన ఆ మహా విష్ణువే కాబట్టీ ఆయన అవతారాలన్నీ వేంకటేశ్వరస్వామికీ ఆపాదించవచ్చు

*సర్వేజనాసుఖినోభవంతు*🙏

భగవాన్

 భగవాన్ (శ్రీకృష్ణుడు) కుల భేదాలను (గీతలో) ఖండించలేదని కొందరు అంగీకరిస్తారు, అయితే భగవంతుని ప్రకారం, కులం అనేది పుట్టుకపై ఆధారపడి ఉండదు కానీ వ్యక్తుల వ్యక్తిగత లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. 

మద్దతుగా వారు గీత నుండి ఈ పంక్తిని ఉటంకించారు. 

"కాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణ-కర్మ-విబాగసః".



ఒక వ్యక్తిని వేరు చేసే లక్షణాలను మనం ఎప్పుడు తెలుసుకుంటాం? 

ఏ వయస్సులో అతను తన స్వభావాన్ని బయటపెడతాడు? 

మనం దీన్ని ఎలా గుర్తించాలి మరియు అతని లక్షణాలకు అనుగుణంగా ఉండే వృత్తికి అవసరమైన విద్య మరియు శిక్షణను ఎలా అందించాలి? 

ఉదాహరణకు, ఏడెనిమిదేళ్ల వయసులో గురుకులంలో చేరాల్సిన బ్రాహ్మణుడిని పిలవడం తీసుకోండి.


అతని విద్య పన్నెండు సంవత్సరాల వ్యవధిని కలిగి ఉంటుంది; 

దీని తర్వాత మాత్రమే అతను తన వృత్తికి అర్హత పొందుతాడు, ఇందులో ఇతర విషయాలతోపాటు, బోధన ఉంటుంది. 

ఒక వ్యక్తి యొక్క వృత్తి, అతని పాత్ర మరియు లక్షణాలు ఏర్పడిన తర్వాత అతని వృత్తిని స్థిరపరచినట్లయితే, అది అతని యవ్వన సంవత్సరాలు వృధా అవుతుంది. 

ఒకవేళ అతను లేటు వయసులో ఉద్యోగం లేదా వ్యాపారం నేర్చుకుంటే అది తనకే కాదు సమాజానికి కూడా నష్టం. 

మనం నిరంతరం పనిలో నిమగ్నమై ఉండాలని, ఒక్క క్షణం కూడా నిశ్చలంగా ఉండకూడదని భగవంతుడు పదే పదే చెబుతున్నాడు. 

అప్పుడు ఎలా వౌ

చేయరాని పనిని చేయకూడదు.

 కర్తవ్యమేవ కర్తవ్యం 

ప్రాణైః కంఠగతైరపి!

అకర్తవ్యం న కర్తవ్యం 

ప్రాణైః కంఠగతైరపి!!


కంఠములో ప్రాణం ఉన్నంత వరకు చేయవలసిన కర్తవ్యమును చేసియే తీరవలెను. ప్రాణములు గొంతుదాకా వచ్చి, ప్రాణములు పోయే స్థితిలో ఉన్నప్పటికినీ చేయరాని పనిని చేయకూడదు.


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

వరంవిరోధోపి సమం మహాత్మభిః

 గురు  శిష్యుల  లడాయి!

------------------------------------ 

               

               పండిత లోకంలో  " శిష్యాదిచ్ఛేత్పరాజయం"- అనే  ఆభాణకం  ప్రచారంలో  ఉంది. అంటే  శిష్యుని చేతిలో గురువు పరాజయాన్ని  కోరుకుంటాడని.  ఉత్తమ గురువు  విద్యలో  తనకన్నా తన శిష్యుని  గొప్పవానిగా, సమున్నతునిగా , చూడగోరుతాడని,

దీనిభావం. శిష్యుడు అల్పుడై  యెదిరిస్తేమాత్రం  చీల్చి చెండాడుతాడు. 


                                     గురువుగా  చెళ్ళపిళ్ళవారి  పరిస్థితిమాత్రం చిత్రాతి  చిత్రమైనది.ఈవిషయంలో  ఆయనకన్నా  అదృష్టవంతుడూ లేడు,  ఆయనకన్నా  దురదృష్టవంతుడూ  కనిపించడు.  


                             తెలుగు వారికి మాత్రమే  స్వంతమైన  అవధాన కళకు  అత్యద్భుతమైన  జనాకర్షణ  కలిగించిన  జంటకవులు

తిరుపతి  వేంకట కవులు   వారిలో చెళ్ళపిళ్ళవేంకటశాస్త్రి యొకరు. వారిశిష్యులలో  ప్రముఖుడు  విశ్వనాథ సత్యనారాయణ. ఆయన తమ గురువుగారిని

గురించి  మహోన్నతంగా  సంభావిస్తూ  యిలాచెప్పుకున్నారు.


           "   అల  నన్నయ్యకు  లేదు  తిక్రనకు  లేదాభోగ  మస్మాదృశుం


              డలఘు  స్వాదు  రసావతార  ధిషణాహంకార   సంభార  దో


              హల  బ్రాహ్మీమయ  మూర్తి   శిష్యుడైనాడట్టి   దావ్యోమ   పే


              శల  చాంద్రీమృదుకీర్తి   చెళ్ళపిళ   వంశస్వామి   కున్నట్లుగన్;


                     ఇందులో  స్వోత్కర్ష  ఉన్నప్పటికీ  


. తనవంటి శిష్యుడుండేభాగ్యం నాడు నన్నయకూ,  తిక్కనకూ

కలుగలేదు చెళ్ళపిళ్ళ వారికి మాత్రమే దక్కిందంటాడు విశ్వనాధ!  ఇలా ఒకవంక  తనగొప్పతనం  చాటుకుంటూనే  గురువుగారి గౌరవాన్ని  ఆకాశమంత  యెత్తు కుపేంచేశాడు. మాగురువుగారు నన్నయ తిక్కనకన్న  గొప్పవాడని  సాటుకున్నాడు. అటువంటి శిష్యుడు దొరికితే  గురువు  కింకేమి కావాలి? అనిపించాడు.  ఇది  మొదటి కోణం!


                              ఇక  రెండో కోణంతోనే  ఉంది సమస్యంతా !  

            

                     చెళ్ళపిళ్ళ వారికి  'ఓలేటి  వేంకట రామ శాస్త్రి'  అనే శిష్యుడుండేవాడు. ఎందుకో  ఆయనకూ  చెళ్ళపిళ్ళ వారికి చెడింది.

"నీవునాగురువువు కానేకాదు పొమ్మన్నాడు ఓలేటి. చెళ్ళపిళ్ళవారికి  మండింది. కాదంటే  ఊరుకుంటాడా ? అద్యతనాంధ్రకవిత్వ ప్రపంచ

నిర్మాతగదా!  వారికి  కోపమొచ్చినా తాపమొచ్చినా 'పద్యాలలోనేకదా!  ఒకసీసాన్ని  గుప్పించి  తనదగ్గర గలసాక్ష్యాలన్నీ  యేకరువు పెట్టారిలా పద్యంమాట యెటున్నా చూచేవారికది వినోదంగా మారింది.


                            సీ:   ఇంజరం బొకసాక్షి- యేనాము తా సాక్షి


                                                పల్లె పాలెంబు  తానెల్ల సాక్షి!


                               ఇపుడు  నీవున్నట్టి- యీపిఠాపురిసాక్షి


                                                      ఏలూరుసాక్షి   నీయిల్లు  సాక్షి


                               వల్లూరు నృపతి  శ్రీ- భాష్య కారులు  సాక్షి


                                                          నూజివీడ్రామచంద్రుండు   సాక్షి


                             మంజువాణీప్రెస్సు- మానేజరొక  సాక్షి


                                                           శంకరుండాతని   సాని  సాక్షి


             తే:      మధున పంతుల సూరయ  బుధుడు సాక్షి


                        యయ్యనఘు,  నన్నసాక్షి  సుబ్బయ్యగారు


                        సాక్షులున్నారు   పద్యంబు  చాలదింక


                       వేంకటేశ్వరు  శిష్యుడవే! నిజమ్ము  !


                                                            

                                        చిత్ర  మైన  విషయమేమిటంటే  యీవిషయంలో  అటూ ఇటూ మధ్యవర్తు లుండటం. చెళ్ళపిళ్ళవారి తరపున వారి  సోదర కవులు  దివాకర్ల  తిరుపతి  శాస్త్రిగారు  ఓలేటిని గట్టిగా మందలించారు. 


                             "  వ్యాకరణంబుఁ జెప్పె ,  నది యంటక పోయిన  పోవుగాక , నీ


                                కీ' కవి'నామ మయ్యనఘుఁడే  కద పెట్టిన   దంతఁ బోక     తా


                                నే కడ  కేగె , నిన్ను గొనియే చనె  నచ్చటి , కట్టివాని  ,  సు


                                శ్లోకు ,  సభాస్థలిన్విడచి  చోరుగతి  న్మెలగంగ    నేమొకో?


                                              "   వేంకటేశ్వరు  పాదంబు  వీడి  పిదప


                                                  నెవని  సేవించితివి?   చెప్పు  మింత యేల?


                                                  యే విషయమీవు  సాధించినావొ    పిదప?


                                                 వ్రాయుమా  వేంకటేశ్వరు  పదము  లాన !


                                    అంటూ  హితవు  చెప్పారు. అయినా   ఇతరుల దుర్బోధలకు  లోగిన  ఓలేటి యామాటలను లేక్క సేయలేదు.

వారి మనసు మారలేదు. ఓలేటి వారికి   వేదుల రామకృష్ణ శాస్త్రి యను మిత్రుడున్నాడు. అతడే  ఓలేటివారికి వెనుక నున్నదన్ను.

" పాఠంచెప్పేవాడు గురువైతే, గుణపాఠం చెప్పేవాడే  శిష్యుడనే" వాదాన్ని నమ్మేవ్యక్తి  రామకృష్ణశాస్త్రి. చెళ్ళపిళ్ళవారికి తమకు మధ్యగల వైరానికి   ఓలేటినొక  అస్త్రంలా  వాడుకోదలచారు.  అందుకే  ఓలేటివారి పక్షాన  చెళ్ళపిళ్ళపై  వారోపద్యాస్త్రాన్ని సంధించారు.


                                              "  ఎట్టొ  చదివితి  మూనాళ్ళ పట్ట పగలు,


                                                    పట్టుమని  రెండు  ముక్కలు  పలుక కున్న,


                                                     తిరుగడిక  నెన్ని  చెప్పిన    గురుడ ననుచు,


                                                     తగులు  కొన్నాడు , నిన్ను  'సైతాను'   లాగు; 


   "-       అనేశాడు.చూశారా !  యెంత     నీచంగా   వ్రాశాడో!   చెళ్ళఫిళ్ళవారిగురించి    ఇంతనీచంగామాట్లాడినా   


               వారిని   గురువుగా   తానేయొప్పుకున్నాడు.


                                              పాపం   చెళ్ళపిళ్ళవారికి   శిష్యులతోనేకాదు.గురువుగారు   చర్లబ్రహ్మయ్యశాస్త్రిగారితో   గూడా     గొడవ     తప్పలేదు.  ఒకసారి గురువుగారిమీద  ఒళ్ళుమండి"గురుడైనన్  హరుడైననేమి?"- అంటూ పద్యంచెప్పారట! కొంతకాలానికి అదే తనకూప్రాప్తించింది. ఆయన శిష్యుడు ఓలేటి గట్టిగానే  యిచ్చుకున్నాడు "శ్రుత పాండిత్యము  దక్క లేనిగురుడు"- అంటూ చెళ్ళపిళ్ళవారిపాండిత్యాన్ని  వేళాకోళమాడాడు. చెళ్ళపిళ్ళ  యేదో  అక్కడాయిక్కడా విని నేర్చుకున్నదే తప్ప డొక్క శుధ్ధిగా చదువుకొన్నవాడు  కాదని దాని సారాంశం!


                            ఏది  యేమైనా " వరంవిరోధోపి  సమం  మహాత్మభిః"- (మహాత్ములతో  విరోధంకూడా మంచిదే)  అనే' భారవి'

వాక్యం మరువరాదు.

                                                                 స్వస్తి!


                    తెలుగు  వెలుగుల  సౌజన్యంతో--🙏🙏🙏🌷🌷💐💐🌷🌷💐💐🌷🌷💐🌷🌷🌷

నన్నెచోడకవి వర్ణనా వైభవం!

 


నన్నెచోడకవి  వర్ణనా వైభవం!


              

                సీ:  శశిబింబ  మణిహేమ  సౌదామినీ  చయో


                                                 త్కరము లన్నియు గూడ నరసి  దెచ్చి ,


                       నవలతా  పుష్ప పల్లవ బిస కోమల


                                                    విభవంబు లన్నియు  వెదకి  తెచ్చి ,


                       కర్పూర  చందన కాశ్మీర  మృగమదా


                                                   మోదంబు  లన్నియు  ముంచి  దెచ్చి  , 


                       పరివాదినీ   శుక పరిపుష్ట  మధుకరా


                                                      రాకంబు  లన్నియు  రాచి  దెచ్చి ,


      ఆ:      హావ భావ  రూప లావణ్య  సారముల్ 


                 త్రిభువనముల  నేర్చి  తెచ్చి,  నేర్పు 


                 సూపఁదలచి   యాడు  రూపజుఁడొనరించె ,


                  నని నుతింప  నొప్పు   నగతనూజ!


               

               ----- కుమార సంభవము-- తృతీయాశ్వాసము-121పద్యం--నన్నెచోడుడు .


      సతిగా  దేహమును చాలించి పార్వతిగా హిమవంతుని యింట జనించిన  యభవుని పత్ని  కాత్యాయని  దిన దిన ప్రవర్ధమానయై  అపురూప సౌందర్యరాసిగా  రూపొందెను. ఆమె యతిలోక మనోహర మైన రూపమును నన్నెచోడుడీ పద్యమున కడు రమ్యముగా వర్ణించినాడు. 


                    బ్రహ్మగారు సృష్టిలోని  అపురూప వస్తు సముదాయములను  యేర్చికూర్చి  యొక లోకోత్తర  సౌందర్యవతి యగు స్త్రీని

సృష్టింప  దలచినాడట. అందుకు పార్వతియే తగినపిల్ల  యని నిర్ణయించి  ఆపదార్ధాలను తెచ్చి యోజన చేశాడట.! ఆసౌందర్య నిర్మాణ సామగ్రి యేదో మనమిపుడు  తెలిసికొందాము. 


                     చంద్ర బింబము,బంగారము మణులు, మెఱపుతీగెలు ,మున్నగు వాని సముదాయమును, నవతలలు ,పుష్పములు ,చిగురుటాకులు ,తామరతూడుల వంటి మృదువైన  వస్తు సముదాయమును , కర్పూరం( పచ్చకర్పూరం) మంచిగంధం ,కస్తూరీ, మొన్నగు సుగంధపరిమళములను , కోకిల ,చిలుక ,తుమ్మెద , మొన్నగువాని ధ్వనులను, తెప్పించి.


                       చంద్రబంబాదులతో రూపాన్ని దిద్దాడు. అందుకే ఆమె మోమున వెన్నెలవంటి కాంతులు. శరీరమున సువర్ణచ్చాయలు, తనువున మెరపులను బోలిన లావణ్యకాంతులు అలముకొన్నాయి.


                       నవలతా పుష్పాదులతో  ఆశరీరానికి  మెత్తదనం  కల్పించాడు. అందుకే ఆమెతనువు నవ వికసిత పుష్పసదృశం. పల్లవ బిసరుహ  మృదులం. 


                          కర్పూర  చందన  కస్తూరికాదులతో  మెదపి ఆమెతనువునకు  సుగంధమలదినాడు. అందుకే ఈమె శరీరము సహజసువాసితమై సన్నిహితులకు ఆమోదకారక మైనది.


                    కోకిల ,చిలుక ,తుమ్మెదల కూజితముల తో నామె కంఠమును సవరించినాడు. అందుకే ఆమె కలభాషిణి యైనది.


                     ఈరీతిగా ఆమె హావ , భావ ,రూప,లావణ్యాదులను  సవరించి, బ్రహ్మ  యద్భుతమైన  స్త్రీ మూర్తిని  సృజియింపగల

దిట్ట  యనిపించు కొన్నాడట!  యేమి  వర్ణనమిది!! ఒక్క కాళిదాసుకు తప్ప నితరు లెవ్వరకు నిట్టి వర్ణనమును చేయనవకాశములేదు.ఆమహానుభావుడు  విక్రమోర్వశీయమున  ఊర్వసి  నిట్లే మనోహరముగా వర్ణించినాడు. 


             శ్లో:  అస్యాః సర్గవిధౌ ప్రజాపతి రభూశ్చంద్రోను కాంతిప్రదః /

                    శృంగారైక రసస్వయన్ను మదనో మాసోను పుష్పాకరః /

                    వేదాభ్యాస జడః కధన్ను  విషయ వ్యావృత్త కౌతూహలః /

                     నిర్మాతుం ప్రభవేన్మనోహరమిదం రూపం  పురాణోమునిః ! 


                                      విక్రమోర్వశీయం- 2 అంకం-- కాళిదాసు.


                  భావం:  ఈపిల్లని కాంతిప్రదుడైన చంద్రుడు గాని , లేదా పుష్పాకరుడైన వసంతుడుగాని , శృంగార రస ప్రచోదకుడైన మన్మధుడుగాని సృజియించి ఉండాలి. వేదాభ్యాస జడుడు , సంసార సుఖవిముఖుడూ ,అయిన ఆముసలిబ్రహ్మ సృష్టించాడంటే 

నేను నమ్మను. అని ఢంకా బజాయించాడు. కాళిదాసు. నన్నెచోడకవి మరింతగా  మెఱుగులు దిద్దాడు.


                                                                            స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐💐💐

5, జులై 2023, బుధవారం

శ్రీ అశ్వక్రాంత ఆలయం

 🕉 మన గుడి : 






⚜ అస్సాం : గౌహతి


⚜ శ్రీ అశ్వక్రాంత ఆలయం



💠 శ్రీకృష్ణుడు నరకాసురుని వధించిన చోట వెలసిన దేవాలయము అశ్వక్రాంత్ స్వామి (విష్ణుమూర్తి) దేవాలయము


💠 ఇది బ్రహ్మపుత్ర నదీతీరములో ఉన్నది. సుక్లేశ్వర్ ఘాటికి దగ్గర నదికి ఇటు వైపున గౌహతి, అటు వైపున ఈ ఆలయం ఉన్నది. ఇక్కడికి వెళ్ళాలంటే పడవల మీద వెళ్ళాలి. ఇక్కడ విష్ణుమూర్తి తాబేలుపై, కప్పపై నీటిలో నీటి మొక్కలపై తేలియాడుతూ పవళించి ఉంటాడు. 


💠 ఈ దేవాలయములో సోమవారము నాడు అమావాస్య వచ్చిన రోజున అతి వైభవముగా ఉత్సవము జరుగుతుంది.


🔅 ఆలయ చరిత్ర 🔅


💠 "అశ్వక్రాంతం" అనే పదానికి అర్థం గుఱ్ఱము అనే పదం నుండి తీసుకోబడింది. 

ఆలయం చుట్టూ ఉన్న పౌరాణిక పురాణం ప్రకారం, శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుడిని ఓడించి చంపడానికి ముందు తన సైన్యంతో ఇక్కడ విడిది చేశాడు. 


💠 అశ్వక్రాంత ఆలయం శ్రీకృష్ణుడు మరియు అతని భార్య రుక్మిణి కథతో ముడిపడి ఉంది. ఈ ఆలయం నిర్మించబడిన ప్రదేశంలో సరిగ్గా కృష్ణుడి గుఱ్ఱాన్ని అనేక మంది శత్రువులు చుట్టుముట్టారని కూడా నమ్ముతారు.

మరియు శ్రీకృష్ణుడు కుండిల్ నగర్ నుండి తన నగరమైన ద్వారకకు ప్రయాణం చేస్తున్నప్పుడు అతని గుఱ్ఱము అశ్వం అలసిపోయినందున ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నట్లు కూడా అంటారు.


💠 అశ్వక్రాంత ఆలయం చుట్టూ, శ్రీకృష్ణుడు, కూర్మజనార్దన మరియు అనంతశాయి యొక్క పాదముద్ర ఉన్న ప్రదేశాన్ని సందర్శించవచ్చు.


💠 'యోగిని తంత్రం' ప్రకారం ఈ ప్రత్యేక మందిరం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. 

ఏ పాపుడైనా ఇక్కడ పూజలు చేయడం ద్వారా మోక్షాన్ని పొందగలడని నమ్ముతారు.

 

💠 గౌహతి అశ్వక్రాంత దేవాలయానికి ఎలా చేరుకోవాలి

 

🔅 రైలు మార్గం: సమీప రైల్వే స్టేషన్ గుహతి స్టేషన్.


 🔅 విమాన మార్గం: సమీప విమానాశ్రయం గౌహతి విమానాశ్రయం.

పండ్ల బండి

పండ్ల బండి 

ఒక గ్రామంలో ఒక పండ్ల వర్తకుడు ఒక తోపుడు  బండినిండా అరటి పండ్లు యాపిల్ పండ్లు, బత్తాయిలు ఇలా రకరకాల పండ్లను పెట్టుకొని  వీధిలో విక్రయిస్తున్నాడట.  ఉదయం నుంచి మధ్యాన్నం వరకు విరామం లేకుండా పండ్లు అమ్మి గల్లా నిండా డబ్బులు  సంపాయించాడు. ఎండలో ఒకింత విశ్రాన్తి తీసుకుందామని దగ్గరలోని ఒక చెట్టుక్రింద పడుకున్నాడు. ఈ ఎండలో ఎవరు గ్రాహకులు రారనే  భావనతో. అతనికి తన బండిమీద పండ్లు, డబ్బులు ఎవ్వరు తీసుకొని పొరనే నమ్మకం.  ఎందుకంటె అతడు రోజు అలానే చేసినా కూడా ఒక పండు పోలేదు ఒక రూపాయి పోలేదు.  అతనిని .చుస్తే సృష్టి కార్యం చేస్తూ అలసిపోయి మధ్యలో ఒకింత విశ్రాన్తి తీసుకుంటున్న వటపత్ర సాయి లాగ వున్నాడు.

కానీ ఈ విషయాన్ని రోజు గమనించిన ఒక దొంగ అవకాశం కోసం  ఎదురుచూస్తున్నాడు. ఈ రోజు అతనికి ఆ బండివాని డబ్బులు కాజేయటానికి సరైన సమయం దొరికింది.  చిన్నగా అతను దూరంగా బండివాని కదలికలను గమనిస్తూ చిన్నగా అతను నిద్రలోకి జారుకోగానే పిల్లిలా నడుచుకుంటూ ఆ బండి వైపుకు బయలుదేరాడు.  ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో కానీ ఒక పెద్ద కోతి ఆ బండిమీదకు దూకి కొన్ని పండ్లను తింటూ, కొన్ని పండ్లను చేతులతో పట్టుకొని ఆ పండ్లను దొంగిలిస్తున్నది. అది గమనించిన మన దొంగగారు వేగంగా ఆ కోతిని అదిలిస్తూ ఆ బండి వద్దకు వెళ్ళాడు. అతని భయం ఏమిటంటే ఆ కోతి అక్కడి డబ్బులపెట్టే మీద పడితే ఆ డబ్బులని  తీసుకొని పొతే ఇన్నాళ్ల తన నీరిక్షణ అంతా వృధా అవుతుందని, అతని ఆందోళన. నిజానికి ఆ కోతికి అక్కడ డబ్బుల పెట్టె వున్నదని అందులో పండ్లకన్నా ఎంతో విలువైన ద్రవ్యం వున్నదని దానికి తెలియనే  తెలియదు. దానికి తెలిసినదల్లా తన ఎదురుగా వున్న పండ్లు మాత్రమే. కోతి డబ్బుల పెట్టె జోలికి వెళ్లనందుకు ఎంతో సంతోషించిన మన దొంగగారు ఆ కోతిని అదిలించి చిన్నగా డబ్బుపెట్టెను తెరచి అందులోని ద్రవ్యాన్ని చేచిక్కించుకున్నాడు.  అతను ఒక్క పండుకూడా ముట్టుకోలేదు. ఇలాంటి సంఘటనను మనం  ఊహించుకోవచ్చు. కొన్నిసందర్భాలలో జరిగి కూడా ఉండ  వచ్చు.

 ఇక విషయానికి వస్తే సాధక మిత్రమా ఈ ప్రపంచంలోని సాధారణ ప్రజలు పైన చెప్పిన కోతిలాగా పండ్ల వెంట అంటే ఐహిక భోగాలకు, విలాసాలకు, సుఖాలకు ఆశ పడి వాటిని పొందుతూ అవే  వారి జీవిత లక్ష్యగా భావించి వాటితోటె సంతృప్త పడుతుంటారు. కానీ నిజమైన జ్ఞ్యాని ఈ ఐహిక భోగాలు కేవలం కొంత సమయం వరకు తృప్తిని ఇచ్చేవిగా తెలుసుకొని అనంతమైన బ్రహ్మ జ్ఞ్యానం శాశ్వితము నిత్యము అని తెలుసుకొని ఏరకంగా అయితే దొంగగారు డబ్బుల పెట్టె వెంట పడ్డారో అలానే జిజ్ఞాసువులు జ్ఞ్యాన బాండాగారమైన శాస్త్రాలను అంటే వేదాంత జ్ఞ్యానానికి సంబందించిన ఉపనిషత్తులు మొదలైనవి  సత్ గురువుల ద్వారా తెలుసుకొని నిత్యము, సత్యము శాశ్వితము అయిన బ్రహ్మ జ్ఞనాన్ని పొందుతారు.  ఎన్నో జన్మలనుంచి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్ధిస్తూ ఉంటే ఆ దేవదేవుడు దయతో మనకు ఈ రోజు ఈ మానవ జన్మను ప్రసాదించాడు. కాబట్టి ఒక్క క్షణం కూడా వృధా కాకుండా నిరంతరం పరమేశ్వరుని సేవలో జీవితాన్ని గడుపుతేనే కానీ మనకు మోక్షము  లభించదు. ఈ విషయం ప్రతి సాధకుడు గమనించి ఆ అనంతుని వెంట వెంటనే పడి జన్మరాహిత్యానికై కృషి చేస్తే తప్పకుండా మోక్ష సిద్ది లభిస్తుంది. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మనం నాది, మనది అనేది ఏదీకూడా నాది కాదు అది వస్తువే కానీ జ్ఞ్యానమే కానీ అంతా కూడా ఆ పరమేశ్వరుడిది  మాత్రమే అయి వున్నది. ఇంకా వివరంగా చెప్పాలంటే ఆ పరమేశ్వరుడే అయి వున్నది.   ఏరకంగా అయితే ఆ బండివాడి పండ్లు, ద్రవ్యం అతనివే అయినట్లు.  మనవి కాని వాటిని మనం మనవి అని అనుకొంటూ వాటి కొరకు పరుగులు తీస్తూవున్నాము. నిజానికి ప్రతి సాధకుడు కూడా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ జగత్తు మొత్తం జగదీశ్వరుడిదే అయి వున్నది.  నేను కేవలం ఈ జగత్తులోని వాటిని కొంతకాలం అనుభవించటానికి వచ్చిన ఒక అతిధిని  మాత్రమే. ఈ విషయాన్ని ఎప్పుడైతే ప్రతి సాధకుడు తెలుసుకుంటాడో అప్పుడు నిత్యా నిత్య జ్ఞ్యానం కలిగి సమర్పణ భావంతో మెలఁగి ఈశ్వరునితో సఖ్యత కలిగి ఈశ్వరునితో ఐక్యం చెందగలదు. ఇదే విషయాన్ని ఈశావాసోపనిషత్తు ఉటంకిస్తున్నది. 

ఓం ఈశావాస్య మిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్

తేనత్యక్తేన భుంజీథా: మాగృథ: కస్యస్విద్ధనమ్. 

కాబట్టి మనది కానిదానిని మనది అని అనుకోకుండా పూర్తిగా ఆ ఈశ్వరునిదే అనే భావము కలిగి కేవలం ఒక అద్దె ఇంట్లో నివసించే కిరాయిదారుడిగా మాత్రం ఈజగత్తుతో సంబంధం కలిగి సర్వే సర్వేత్ర ఆ ఈశ్వరుని తలుస్తూ జీవనాన్ని గడపాలి. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ భార్గవ శర్మ 



_భగవంతుడి_ఆరాధనలో

 #పురాణగ్రంధాల_ప్రకారం_భగవంతుడి_ఆరాధనలో_నిషేధించబడినవి_ఏమిటో_చూద్దాం


1. తులసిని వినాయకుడికి సమర్పించద్దు.

2. ఏ దేవతకూ దూర్వాపత్రం వద్దు.

3. తిలకంలో విష్ణుమూర్తికి అక్షతలు వద్దు.

4. ఒకే పూజాస్థలంలో 2 శంఖాలు వద్దు.

5. గుడిలో 3 గణేశ విగ్రహాలను ఉంచద్దు.

6. తలుపు దగ్గర Shoes, Chappals తలకిం దలుగా ఉంచద్దు.

7. భగవంతుడ్ని దర్శించుకుని తిరిగొచ్చేటప్పుడు గంట మోగించరాదు.

8. ఒక చేతితో హారతి తీసుకోరాదు.

9. బ్రాహ్మణుడు ఆసనం లేకుండా కూర్చోరాదు.

10. తల్లికి తప్ప ఏ స్త్రీ కి కూడా నమస్కరించడం నిషేధం.

11. దక్షిణయివ్వలేనప్పుడు జ్యోతిష్యుడ్ని కలవద్దు. 

12. ఇంట్లో పూజకోసం బొటనవేలు కంటే పెద్ద శివలింగాన్ని ఉంచద్దు.

13. తులసిచెట్టులో శివలింగం ఉండరాదు.

14. గర్భిణీ స్త్రీ శివలింగాన్ని తాకరాదు.

15. కుటుంబంలో సూతకముంటే, పూజా విగ్రహాలను తాకరాదు.

16. శివలింగం నుండి ప్రవహించే నీటిని దాటరాదు.

17. ఒక చేత్తో నమస్కరించద్దు.

18. చరణామృతం తీసుకునేటప్పుడు, ఒక్క చుక్క కూడా కిందపడకుండా కుడిచేతి కిం ద రుమాలు ఉంచాలి. చరణామృతం తా గిన తర్వాత తలపై చేతులు తుడచద్దు, కానీ, కళ్లపై రాసుకోండి. గాయత్రి మన తల పై నివసిస్తుంది. కనుక ఎంగిలి చేతితో కలుషితం చేయరాదు.


19. పెళ్లికాని ఆడపిల్లల పాదాలు పెద్దలు తాకడం పాపం.

20. తాగుబోతులు భైరవుడు కాకుండా వేరే దేవాలయాల్లోకి ప్రవేశించడం నిషేధం.

21. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ముందుగా కుడిపాదం, బైటకెళ్లేటప్పుడు ఎడమ పాదం ఉంచాలి.

22. పగిలిన శబ్దం వచ్చేంత బిగ్గరగా గంటను మోగించరాదు.

23. గుడికెళ్లడానికి ఒక జత బట్టలు విడిగా ఉంచుకోండి.

24. దేవాలయం మీ యింటికి చాలా దగ్గర్లో ఉంటే కనుక పాదరక్షలు లేకుండా నడిచెళ్ళండి. 

25. గుడిలో కళ్లు తెరిచి దేవుడి దర్శనం చేసుకోండి. 

26. ఆరతి తీసుకున్న తర్వాత  తప్పకుండా చేతులు కడుక్కోవాలి.


ఈ విషయాలన్నీ శాస్త్రాల్లో ఋషుల నుండి సాంప్రదాయబద్దంగా చెప్పబడ్డాయి.


🚩సర్వే జనా సుఖినోభవంతు🚩... Chittatturu Rambaburao గారి వాల్ నుండి...

కర్మ భూమి" చర్చ

 ఈ రోజు ఓ గౄపులో "కర్మ భూమి" పై జరిగిన ఓ చర్చ:-


[7/5, 12:14 PM] +91 80963 54159: ఈ విషయంలో ఏఏ శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? ఒకవేళ లోకంలో ఇదొక ప్రచారం మాత్రమేనా? లేదా ఏదన్న శాస్త్రం స్పష్టంగా ఈ విషయాన్ని చెబుతోందా అన్నది పరిశోధించటం  చాలా అవసరం.  ఒకవేళ చెబితే ఆ శాస్త్రమే అక్కడికక్కడే పరిష్కారాన్ని సూచిస్తుంది కదా. కాబట్టి  మీరు చెప్పినది ఏ గ్రంధంలోనో /శాస్త్రంలోనో లేదా మరో రూపంలో ఎక్కడ ఉందో తెలియజేయ ప్రార్ధన.   🙏 🙏                                                                                                                                          వాల్మీకి విరచిత యోగావాసిస్టం లో  అద్భుతమైన విషయాలు వున్నాయి. ఒక గ్రహం నుండి ఇంకోగ్రహానికి ప్రయాణం,  ఒక బ్రహ్మాండం నుండి మరో బ్రహ్మాండంకి ప్రయాణం, అలాంటి సమయంలో ఎలాంటి కర్మలు చేయాలి? వాటి ఫలితం ఏమవుతుంది? టైం ట్రావెల్ లో వొచ్చే ధార్మిక సమస్యలకు ఎలాంటి పరిహారం చేయాలి..... ఇలాంటి అద్భుతమైన విషయాలని సాక్షాత్తు సరస్వతిదేవి లీల అనే  భక్తురాలికి ఒక బ్రహ్మాండం నుండి మరో బ్రహ్మాండంకి ప్రయాణం చేయిస్తూ వివరంగా చెబుతుంది. ఆ సమయంలో మొదటి సారి సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ దేవుడు సంధ్యావందనం చేసి ప్రారంభించాడని మాత చెబుతుంది. ఏ సృష్టి లేనపుడు సంధ్యావందనం ఎవరికో? అది కూడా చెబుతుంది మాట.  ఒక బ్రహ్మాండం నుండి మరో బ్రహ్మాండంకి ప్రయాణం చేసినపుడు ఎలాంటి వైదిక కర్మలు చేయాలో వాటి స్టితి,ఫలితం ఏమవుతాయో చెప్పినపుడు. సముద్రం దాటితే పరిహారం ఉండదా? 🙏🙏

[7/5, 12:51 PM] శర్మద: ఆర్యా! 

మీ ప్రశ్నలు బాగున్నాయి. 


నాకు తెలిసిన విషయం చెప్పటానికి ప్రయత్నిస్తాను. 


భూమిపైన మన భారతదేశం ఒక్కటే కర్మభూమిగా గుర్తించబడినది. మిగతా ఏ ప్రాంతములోనూ లేదా దేశాలలోనూ మన శాస్త్రాలు చెప్పిన కర్మాచరణ లేదు. అంతా అనాచారము. అసంస్కృతీప్రవర్తనలు. (మనదేశంలో ఇవి లేవని కాదు. ఇప్పుడు ఈ దుష్టసంస్కృతి ఏర్పడినది.) మన యొక్క ఏ మతగ్రంథాన్ని పరిశీలించినా.... భగవంతుని అవతారాలనుండి దేవతల తపస్సులు సహితము మన హైందవభూమియందే జరిగినట్లు మనకు తెలుస్తుంది. 


భగవద్గీత లో కూడా భగవంతుడు భరతవర్షమే కర్మభూమి అని, దేవతలు సహితము భరతవర్షంలో జన్మించాలని కోరుకుంటారని చెప్పటం జరిగింది. ఇలా ఎందుకంటే.... భూలోకంలో తప్ప మరేలోకంలోనూ కర్మాధికారం లేదు. చివరకు తపస్సు చేయాలన్నా కర్మ అవసరమే. అందువలన అలా కోరుకుంటారని భగవంతుని మాట. 


కర్మభూమియైన భరతవర్షంలో చేసిన కర్మ ఫలవంతమౌతుంది. ఇతరచోట్ల చేసిన కర్మ నిష్ఫలమౌతుంది. అందువలన కర్మాచరణకు మన కర్మభూమి దాటి పోరాదని శాస్త్రనియమం. ఎంతటి బ్రాహ్మణుడైనా వరుసగా మూడురోజులు పాటు సంధ్యావందనము చేయనిచో అతనికి మరలా శుభముహూర్తంలో ఉపనయనం చేయమని శాస్త్రం చెబుతోంది. అందువలన సముద్రాన్ని దాటి వేరే దేశాలకు వెడితే...  కర్మభూమి కానటువంటి ఆ దేశంలో చేసిన కర్మలు (సంధ్యావందనము సైతం కర్మయే) నిష్ఫలమౌతాయి. అందువలన మరలా ఆ వ్యక్తి ఉపనయనంచేత సంస్కరించబడాలి. అందుకే...  కంచి పరమాచార్య అనేక సందర్భాలలో సంధ్యావందనం చేయటం ముఖ్యమని, ఇతరదేశాలకు నీవు వెళ్ళటం అవసరమా? అని భక్తులకు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. 


ఈ కారణాలవలన సముద్రం దాటటం వద్దని చెప్పటం జరిగింది.

[7/5, 1:38 PM] +91 80963 54159: లోక వ్యవహార దృష్టి కోణంలో ...సముద్రం దాటి ఇతరదేశాలకు వెళ్ళటం వల్ల  "Brain drain" కి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. విద్వాంసులు మనకు తక్కువై మనసమాజంలో అజ్ఞానం పెరుగుతుంది అని మహాత్ములు ఎప్పుడో  దర్శించి చెప్పివుండవచ్చు.  అది మన మంచికే.  ఇప్పుడు అదే చూస్తున్నాం అనుభవిస్తున్నాం కూడా.  కానీ.. మనం రోజూ చేసే సంధ్యా వందనంలో ఆచమనం (శ్రౌతాచామానం) లోనే 6 లోకాల (భూ, భువ, సువ, మహా, జన, తపో, సత్య) ప్రస్తావన ఉంది. అసలు సంధ్యావందనలో ఎన్నిసార్లు ఆచమనం చెయ్యల్సివోచ్చినా శ్రౌతాచామానం మాత్రమే చేయాలి, పురాణాచమనం(కేశవాది నామాల) అప్రస్త్తుతం అని ప్రాచీన వేదపండితులు సూచిస్తున్నారు అని తన తాతగారు చెప్పగా తానూ విని ఆచరిన్స్తున్నాను అని మా తాతగారు నాకు  చెప్పగా యధాశక్తి నేను తిరుమల వెంకటేశ్వరుడి దయవల్ల ఆచరించగలుగుతున్న. ఇక్కడ అంశం ఏమంటే.. భూ లోకం అనగా ఈ మొత్తం భూగోళం తో పాటు  షడ్వికారాలకు లోనయ్యే జీవానికి, జీవ ప్రక్రియకు అవకాశం ఉన్న ప్రతి ప్రదేశాన్ని (మొత్తం సృష్టిలో..అనేకం వున్నాయి ) భూలోకంగానే భావిస్తున్నాను అని ఆచమన మంత్రానికి అర్ధం అని పెద్దలు చెప్పగా విన్నాను. కాబట్టి  అఖండమైన అనంతం శాశ్వతమైన వేదమే లక్ష్యంగా ఆచరించే వైదిక కర్మ అయిన సంధ్యవందనలో అనేక భూలోకాలనన్నిటినీ కలిపి ఒకే భూలోకంగా భావించి కర్మ చేస్తున్నపుడు.. మొత్తం భూలోకం కర్మభూమి వేదభూమి అయినట్లే. కాబట్టి వైదిక కర్మలు మనముంటున్న భూమి మీద ఎక్కడ ఆచరించినా ఫలితం రాకమానదు. సంధ్యావందనమే నిలువెత్తు సాక్ష్యం. 🙏🙏

[7/5, 2:01 PM] +91 79957 06813: భారతదేశము అంటేనే కర్మభూమి అనియు  కర్మాచరణమందు ఎక్కువ ఆదరణ గల భూమి అనియు ఆర్యావర్తము అని కూడా ఈ నిఘంటువులో ఇచ్చారు. ఇప్పుడే నిఘంటువును పరిశీలించి పలికిన వ్యాఖ్యలివి. 


మతపరమైన కర్మలు (కర్మకాండ) జరిగే భూమి, భారతవర్షము అని ఆప్టే నిఘంటువు.  


విష్ణుపురాణంలో వున్న  ఈ శ్లోకాన్ని ఓసారి గమనించగలరు. 


ఉత్తరేణ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం |

వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతిః ||

నవయోజనసాహస్రో విస్తరోSస్య మహామునే |

కర్మభూమిరియం స్వర్గమపవర్గంచ గచ్ఛతాం ||

(అపవర్గమంటే మోక్షం) 


ఈ శ్లోకానికి అర్థం ఇదిగో.


సముద్రమునకుత్తరమున హిమాలయమునకు దక్షిణమున భారతవర్షము గలదు. అందలిసంతతి ''భారతి'' యనబడును. ఇతి తొమ్మిదివేల యోజనముల వైశాల్యము గలది. కర్మభూమి యని దీనికిపేరు. స్వర్గాన్ని, మోక్షాన్ని ఇస్తుంది. 


ఇదే శ్లోకం కొలది మార్పులతో బ్రహ్మ పురాణం, పందొమ్మిదవ అధ్యాయం, జంబూద్వీప వర్ణనంలో ఇలా కనిపిస్తోంది.


రోమహర్షణ ఉవాచ -


ఉత్తరేణ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం |

వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతిః ||

నవయోజనసాహస్రో విస్తారశ్చ ద్విజోత్తమాః!|

కర్మభూమిరియం స్వర్గ మపవర్గం గంతు మిచ్ఛతామ్‌ ||


సూతుడిట్లనియె-


సముద్రమునకుత్తరమున హిమాలయమునకు దక్షిణమున భారతవర్షము గలదు. అందలిసంతతి ''భారతి'' యనబడును. ఇతి తొమ్మిదివేల యోజనముల వైశాల్యము గలది. కర్మభూమియని దీనికిపేరు. కోరినవారికి స్వర్గము మోక్షమును గూడ నిందే యున్నవి.


ఉదాహరణకు అగ్ని మహాపురాణం, జంబూ ద్వీప వర్ణనంలో ఇలా వుందట Agni Maha Purana (Telugu) Chapter 118


శివమహాపురాణంలో ఇలా వుందని విన్నాను. 


నవయోజనసాహస్రో విస్తరోSస్య మహామునే |

స్వర్గాపవర్గయో:కర్మభూమిరేషా స్మృతా బుధై:||


స్వర్గమోక్షాలనిచ్చే కర్మభూమి అని పండితులచే చెప్పబడినది


మొత్తానికి మనదేశానికి కర్మభూమి అనే పేరు పురాణాల్లో వుంది అని చెప్పవచ్చు. అంటే కర్మ భూమి అంటే మన దేశం తప్పించి యావత్ ప్రపంచానికి వర్తించదేమోనని నా నమ్మకం.

[7/5, 2:11 PM] +91 79957 06813: కాని భగవద్గీత 15 వ అధ్యాయం, 2 వ శ్లోకం లో *కర్మాణుబంధీని మనుష్యలోకే* అని చెప్పబడింది. 


అంటే మనుష్యులు నివసించే లోకమంతా కర్మ చేత బంధించబడినది అని చెప్పబడింది. భారత దేశం కూడా ఈ లోకంలో భాగమే కాబట్టి, ఈ విషయం భగవద్గీతలో చెప్పబడిందని అనవచ్చు. 


ఈ లోకంలో కర్మలచేతే (పనులు చేయడం వలనే) ఫలితాలు వస్తాయని చెప్తోంది (దేవలోకంలో సంకల్పమాత్రం వలన ఫలితాలు రావచ్చు).


అంటే ఈ లెక్కన మనకు తేలిందేమిటంటే పురాణాలు శాస్త్రాలు కూడా కర్మభూమి అంటే ఇదమిత్థంగా తెలియబరచని పరిస్థితి. 


ఇంకనూ ప్రయత్నిస్తేగాని వీటన్నిటిని అర్థం చేసుకోలేమేమో

[7/5, 2:48 PM] శర్మద: సరే అయితే...


ముందు మీరు సముద్రాన్ని దాటండి. 😅😅


నాకొక సందేహం వచ్చింది. దీనిని కూడా ఆలోచించండి. 


సీతమ్మను తీసుకొని రావటానికి వెళ్ళినవారంతా సముద్రాన్ని దాటారు కదా? 


అంతకుముందు రావణుడు లంకనుండి ఎన్నోసార్లు సముద్రాన్ని దాటి వచ్చాడు కదా? 


ఇక్కడ వారు ఫరిహారాలు చేసుకున్పారా?

[7/5, 2:55 PM] +91 92411 45762: రావణాసురిడిది కూడా అసలు లక్నో దగ్గర ప్రాంతమేనని ఒక వాదన.

[7/5, 2:57 PM] శర్మద: ఇది బాగున్నది. 


అసలు రావణుడు పులస్త్యబ్రహ్మకు మనుమడు. బ్రహ్మ దేవలోకానికి చెందినవాడు. కనుక రావణుడు అసలు భూలోకానికి చెందినవాడు కానేకాదు. 

😂😂😂😂😂

[7/5, 2:58 PM] +91 80963 54159: సముద్రాన్ని ఎవ్వరైనా దాటవచ్చు. వారి వారి వర్ణ/వేద/శాఖ ధర్మాలను అనుసరించి, దేశ,కాల,మాన, పరిస్త్తితులకు తగ్గట్లు మూల ధర్మం మారకుండాప్రాయచ్చిత్త సహితంగా యధాశక్తి వేదం నిర్దేశించిన కర్మలు చేయవచ్చు. సంధ్యావందనం, సత్రయాగం, వరలక్ష్మి వ్రతం...ఇలా అన్నీ హైదరాబాద్ లో చేసినా, బ్రెజిల్ లో అమెజాన్ చిట్టడవికి వెళ్ళి చేసినా శ్రద్ద,భక్తిని అనుసరించి ఫలితం రాకమానదు. 🙏

[7/5, 3:00 PM] శర్మద: భరతఖండంలో ఎక్కడ చేసినా ఫలితం ఓకే. 


భరతఖండం దాటి చేసేటువంటి కర్మలవిషయంలోనే పెద్దల (శాస్త్ర) అభ్యంతరం.

[7/5, 3:02 PM] శర్మద: దేశాంతరంలోనైనా, దేశంలోనైనా మూడురోజులపాటు నిత్యకర్మలను ఆచరించకపోతే అతడు కర్మభ్రష్టుడు అని, తిరిగి ఉపనయనం చేసుకోవాలనీ శాస్త్రం చెబుతోంది.

[7/5, 3:02 PM] +91 79957 06813: నేనూ ఈ నిబంధనతో ఏకీభవిస్తున్నాను

[7/5, 3:04 PM] +91 79957 06813: కంచి పరమాచార్య వారు ఎన్నో సార్లు ఈ వివరణ ఇవ్వడం నేనే చదివాను.

[7/5, 3:04 PM] +91 80963 54159: Brain Drain ని ముందే ఊహించి కట్టడిచేసే ప్రయత్నం అనుకోవచ్చు. వేద నిషేధం చేయకుండా పరిహారాలు చెప్పిందేమో....నాకు అంత బుద్ధి బలం లేదు. వేదవిద్వంసులు చెప్పగలరు. 🙏

[7/5, 3:07 PM] +91 80963 54159: ..దానిదేముంది శాస్త్రం చెప్పిన పరిహారం. కర్మపై కర్తపై నిషేధం లేదుకదా. పూజ ప్రారంభించాం..దీపం కొండెక్కింది. ఆపేయం కదా. ఓ పరిహార మంత్రమో/శ్లోకమో/నామమో చెప్పి మళ్ళీ వెలిగించి. కర్మ చేస్తాం. 🙏

[7/5, 3:09 PM] శర్మద: మీరు చెప్పినటువంటి ఎన్నో సైన్సు కారణాలు మన ఆచారాలవెనుక ఉన్నాయనేది సత్యం. 


మన పూర్వీకులకు ఈ రహస్యాలన్నీ తెలుసు. కారణాలను చెబితే.... *ఓస్... ఇంతేగా...* అనే నిర్లక్షం కలిగి సమాజం పాటించదనే శంకతో ఆ విజ్ఞానానికి భక్తిని రంగరించి బోధించారు మన పెద్దలు. 


అందవలననే ఏ సంప్రదాయం ఎందుకు అనేది అర్థంకాక ఇప్పుడు మనం జుట్టుపీక్కుంటున్నాము.


దీనిపై మన ఆత్మీయులు తమ తమ అభిప్రాయాలను తెలియజేయగలరు.

గాలులు లొని రకాలు -

 అష్ట దిక్కుల గాలులు  -  లాభ నష్టాలు . 


  గాలులు లొని రకాలు  - 


     బౌగోళిక పరిస్థితులను బట్టి సూర్య చంద్రుల గమనాలని బట్టి భూమి స్వరూపాన్ని ఎనమిది దిక్కులుగా విభజించారు. అన్ని దిక్కుల నుంచి వీచే గాలులు అన్ని ఒకే రకంగా ఉండవు  . ఆయా దిక్కుల స్వభావాన్ని బట్టి గాలి స్వభావం మారుతుంది . అయితే అన్నివేళలా అన్ని దిక్కుల నుండి గాలులు వీచవు. ఒక్కో రుతువులో ఒక్కో దిక్కునుండి ఒక్కో రకమైన గాలులు వీస్తాయి. వాటివల్ల మానవులు మానవులకు కొంత ఆరోగ్యము , కొంత అనారోగ్యము కలుగుతాయి. ఏ గాలులు అనారోగ్యమో , ఏ గాలులు ఆరోగ్యమో తెలుసుకోవడం ప్రతి మనిషికి అవసరం. 


  దక్షిణ దిక్కు గాలులు  - 


    ఏప్రిల్ , మే నెలలలో వచ్చే వసంత మాసంలో దక్షిణ దిక్కు నుంచి గాలులు నెమ్మదిగా వీస్తాయి . ఇవి మలయ పర్వతం మీదగా వీచడం వలన ఆ పర్వతం మీద ఉన్న ఔషధాల సువాసనలు కూడా ఈ గాలులతో కలిసి వస్తాయి. ఈ మలయ పవనాలు తమ చల్లని స్పర్శతో మానవాళిని వేసవితాపం నుంచి కాపాడతాయి. ఈ గాలులని ఆస్వాదించ గలిగితే శరీరంలోని త్రిదోషాలు హరించి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ గాలిలో తీపి , చేదు , వగరు రుచులు ఉంటాయి. ఈ కాలంలో అదే స్వభావం కలిగిన ఈశాన్య గాలులు కూడా వీస్తాయి 


  నైరుతి గాలులు  - 


      జూన్ , జూలై నెలలలో వచ్చే గ్రీష్మ రుతువు లొ నైరుతి దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఈ గాలుల్లో కారం రుచి ఉంటుంది. ఇవి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. ఈ గాలులు వాళ్ళ ఉదర రోగాలు , పైత్య రోగాలు , మేహా రోగాలు పుడతాయి. రక్త పిత్త రోగాలు కూడా పుడతాయి. ఈ నైరుతి గాలులు సకల రోగాలుకు నిలయాలు. 


  పడమర గాలులు  - 


     ఆగస్ట్ , సెప్టెంబర్ నెలలలో ఉండే వర్ష ఋతువులో పడమర గాలులు వీస్తాయి . ఈ గాలులు వెగటుగా ఉండి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. అయినా గ్రీష్మ ఋతువులో నైరుతి గాలుల వలన ఏర్పడిన రక్తపిత్త వ్యాధి హరించి పొతుంది. ఎంతో కాలం నుంచి ఉన్న వివిధ వ్రణాలు మాడిపోతాయి. 


  వాయువ్య దిక్కుల గాలులు  - 


   

     అక్టోబర్, నవంబర్ నెలలలో ఉండే శరత్కాలంలో వాయువ్య దిక్కు నుంచి గాలులు వీస్తాయి . ఈ గాలులలో కారం , చేదు గుణాలు ఉంటాయి. తేమ ఉండదు. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అయితే వాత వ్యాదులు కలిగించడం . వాతవ్యాదులు ఉన్నవారికి ఎక్కువ అవ్వడం ఈ గాలుల స్వభావం . కఫ రోగాలు , పైత్య రోగాలు తగ్గించి వంటిలోని చెడు నీరు తొలగించే గుణం ఈ గాలులలో ఉంది. 


  తూర్పు , ఉత్తర దిక్కుల గాలులు  - 


     డిసెంబర్ , జనవరి నెలలలో ఉండే హేమంత ఋతువులో తూర్పు దిక్కున ఉండి ఉత్తర దిక్కుకు ఈ గాలులు వీస్తాయి . తూర్పు గాలులు చలువ చేస్తాయి. కాని వీటివల్ల వాత రోగాలు , కఫ రోగాలు పైత్య రోగాలు పెరుగుతాయి. వంటి నిండా నీరు పట్టే ఉబ్బు వ్యాధి ని కలిగిస్తాయి. ఉత్తరపు గాలులు కూడా చల్లగా ఉంటాయి. ఇవి కఫాన్ని , కొవ్వుని పెంచుతాయి. 


   ఆగ్నేయ గాలులు   - 


  

       ఫిబ్రవరి , మార్చి నెలలలో ఉండే శిశిర ఋతువులో ఆగ్నేయ దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఇవి కూడా అమిత చల్లగా ఉంటాయి. వాతవ్యాదులని పుట్టిస్తాయి. ఉబ్బు రోగాలు , వ్రణాలు ఉన్నవారిని మరింత పీడిస్తాయి.


  

    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


మరింత విలువైన మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .

            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

      9885030034                       


    

    కాళహస్తి వేంకటేశ్వరరావు 


  అనువంశిక ఆయుర్వేద వైద్యులు