6, ఆగస్టు 2023, ఆదివారం

శ్రీ సూర్య దేవాలయం

 🕉 మన గుడి : 




⚜ బీహార్ : డియో, ఔరంగాబాద్


⚜ శ్రీ సూర్య దేవాలయం



💠 డియో సూర్య దేవాలయం

దేశంలోని పురాతన సూర్య దేవాలయాలలో ఒకటి, 8వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం ఛత్ పూజ సమయంలో పూజలకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.


💠 8వ శతాబ్దంలో చంద్రవంశ రాజు భైరవేంద్ర సింగ్ చేత నిర్మించబడిన ఇది దేశంలోని పురాతన సూర్య దేవాలయాలలో ఒకటి. ఆలయ ప్రస్తావన పురాణాలు మరియు ఇతర మత గ్రంథాలలో కూడా చూడవచ్చు. 

100 అడుగుల ఎత్తైన ఆలయం దాని నిర్మాణ రూపంలో కోణార్క్‌లోని ఆలయాన్ని పోలి ఉంటుంది. 


💠 డియో దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది తూర్పు వైపున ఉన్న సాంప్రదాయ సూర్య దేవాలయాల వలె కాకుండా పశ్చిమ దిశగా ఉంటుంది. 


💠 డియో అనేది ఛత్ (బీహార్‌లో సూర్య భగవానుడికి  అత్యంత పవిత్రమైన పండుగ) జరిగే ప్రదేశం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

అక్టోబరు-నవంబర్‌లో సూర్య భగవానుని గౌరవార్థం జరుపుకునే పండుగ అయిన ఛత్ పూజ సమయంలో వేలాది మంది భక్తులు నాలుగు రోజుల పాటు ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు వస్తారు


💠 కుష్ఠురోగి అయిన మహారాణా ప్రతాప్ వంశస్థుడు రాజా ఫతే నారాయణ్ సింగ్ తన గుర్రానికి దాహం తీర్చుకోవడానికి వేటలో వెళ్లి ఆ "కుండ్" (చెరువు)లో పడ్డాడని ఈ ప్రాంతంలో జానపద కథలు ఉన్నాయి.  

అతని కుష్టు వ్యాధి మాయమైందని చెబుతారు.


💠 ఒకసారి , విశ్వకర్మను సూర్యుడు ఒక రాత్రిలో 3 ఆలయాలను నిర్మించమని కోరినట్లు చెబుతారు, మరియు విశ్వకర్మ ఒక రాత్రిలో డియో సూర్య ఆలయాన్ని నిర్మించాడు.


💠 ఈ ప్రాంతంలో ఒకే రాత్రిలో మూడు ఆలయాలను నిర్మించడం ప్రారంభించాడని, వాటిలో రెండు, దేవ్ మరియు ఉమ్గా దేవాలయాలు పూర్తయ్యాయి, కానీ దేవ్‌కుండ్‌లోని మూడవది ఉదయం కాకి కవ్వించడం ప్రారంభించినందున పూర్తి కాలేదు.  ఈ మూడు ఆలయాలు నిర్మాణ రూపకల్పనలో సరిగ్గా ఒకే విధంగా ఉన్నాయి.


💠 సాధారణంగా ఉదయించే సూర్యునికి కాకుండా, అస్తమించే సూర్యునికి ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉండటం వల్ల ఈ ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది.

 

💠 స్థానిక స్థల పురాణం ప్రకారం, వాస్తవానికి ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉండేది. 

ముస్లింలు, కాలాపహార్ దాడిలో, అతను దానిని నాశనం చేయడానికి ప్రయత్నించాడు.

 కానీ, ఆలయాన్ని ధ్వంసం చేస్తే అరిష్టం వస్తుందని పూజారులు అడ్డుకున్నారు. ఆలయం అంత అద్భుతంగా ఉంటే పశ్చిమం వైపు తిరగాలని కాలా పహార్ పూజారులకు సవాలు విసిరాడు. తదుపరి సూర్యో ఆలయం అద్భుతంగా పడమర వైపు తిరిగింది.


💠 చాలా సూర్య దేవాలయాలు ఉదయించే సూర్యునివై ఉన్నందున, కొంతమంది పండితులు ఈ ఆలయం మొదట బౌద్ధ దేవాలయంగా ఉండేదని, తరువాత ముహమ్మద్ బిన్ భక్తియార్ ఖల్జీచే నాశనం చేయబడిందని మరియు చివరకు భైరవేంద్రచే సూర్య దేవాలయంగా మార్చబడిందని నమ్ముతారు


💠 ఆలయానికి దక్షిణాన సూర్యకుండ్ కూడా ఉంది, ఇక్కడ ప్రజలు అస్తమించే మరియు ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం చెల్లిస్తారు.  


 💠 ప్రస్తుతం గర్భగుడిలో మూడు విగ్రహాలు (విష్ణువు, సూర్యుడు మరియు అవలోకితేశ్వరుడు) ఉన్నాయి.

అవి అసలు ప్రధాన దేవత కాదు.  

విరిగిన దేవతను పూజించడం ఆచారం కానందున ప్రధాన గర్భగుడి ముందు  విభాగంలో 3 విరిగిన విగ్రహాలు ఉంచబడ్డాయి.  

విరిగిన శిల్పాలలో ఒకటి సూర్యుని (సూర్యదేవుడు) ఏడు గుర్రాల శిల్పం మరియు ఒకటి ఉమా-మహేశ్వర విగ్రహం మరియు మరొకటి విష్ణువు.  

ఒక శివలింగం మరియు గణేశ శిల్పం కూడా ఉన్నాయి.  


💠 ఆదివారం నాడు చత్ పూజ / అరుద్ర నక్షత్ర తిథి పండుగ సందర్భంగా ఈ ఆలయాన్ని సందర్శించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.  

సూర్య కుండ్ ఒక కి.మీ దూరంలో ఉంది, ఇక్కడ పూజాదికాల కోసం నైవేద్యాలు చేస్తారు. 


💠 రుద్ర కుండ్ (ఎడమ) మరియు సూర్య కుండ్ (కుడి) అని పిలువబడే రహదారికి ఇరువైపులా ఉన్న రెండు ట్యాంకులు కుష్టు వ్యాధి మరియు ఇతర తీవ్రమైన వ్యాధులను నయం చేస్తాయని నమ్ముతారు.


💠 ఇక్కడ ప్రధాన దేవతను త్రికాల్ సూర్యుడు అని పిలుస్తారు - బ్రహ్మ, శివుడు మరియు విష్ణువుల రూపాలు.

 బ్రహ్మ ఉదయించే సూర్యుడిని, 

 శివుడు మధ్యాహ్న సూర్యుడిని మరియు విష్ణువు అస్తమించే సూర్యుడిని సూచిస్తాడు.


💠 ఈ దేవాలయం వేసర, ద్రావిడ మరియు నాగర నిర్మాణ శైలుల కలయిక.

 దేవ్ సూర్య దేవాలయం పైన, గోపురం ఆకారపు చెక్కడం పైన బంగారు కలశం ఉంచబడింది.


💠 బీహార్ మరియు ఇతర ప్రాంతాల నుండి అనేక వేల మంది భక్తులు ఆలయానికి పూజలు చేయడానికి, ఛత్ మేళాలో పాల్గొనడానికి, పవిత్రమైన సూర్య కుండ్‌లో స్నానం చేయడానికి మరియు అర్ఘ్యం సమర్పించడానికి వస్తారు.


💠 సూర్య మందిర్  సమయాలు: 

ఉదయం 4.30 - రాత్రి 9.00



💠 ఔరంగాబాద్ నుండి బీహార్ దేవ్ సూర్య మందిరం దూరం - డియో-బహురా రోడ్ మీదుగా 36 నిమిషాలు (14.5 కిమీ)

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 3*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 3*


దుడుకు, అల్లరి  బాలుడు నరేంద్రుడు. అతడిలో సదా చిలిపితనం చిందులాడేది. ఒకింతసేపు కూడా అతడు ప్రశాంతంగా ఉండేవాడు కాడు. అతణ్ణి అదుపులో ఉంచడం అసాధ్యం. ఎలాంటి గదమాయింపుతోను అతణ్ణి శాంతింపజేయడం కుదరనిపని. 


భువనేశ్వరి విసిగివేసారి "సాక్షాత్తు పరమేశ్వరుడే నాకు కుమారునిగా జన్మించాలని వరం కోరుకొంటే, ఆయన తన భూతగణాలలో ఒకదాన్ని పంపించాడు" అని వాపోవడం కద్దు. అతణ్ణి శాంతింప జేయడానికి ఒక్కటే దారి! 'శివ శివ' అంటూ తలమీద చన్నీరు కుమ్మరించడమే! మరుక్షణమే అతడి అల్లరి అణగిపోయేది. 


అతడి అల్లరితో విసిగిపోయే భువనేశ్వరి ఒక్కోసారి, "ఇదుగో చూడు బిలే! ఇలా అల్లరి పిల్లవాడిగా తయారయ్యావంటే పరమేశ్వరుడు నిన్ను కైలాసానికి రానివ్వడు" అని బెదిరించగానే నరేంద్రుడి అల్లరి మటుమాయమయ్యేది. 


అంతేగాక, "పరమేశ్వరా! ఇకమీదట ఇలా ప్రవర్తించను.ఈ ఒక్కసారికి మాత్రం క్షమించు" అని పరమేశ్వరుణ్ణి ప్రార్థించేవాడట.అతణ్ణి చూసుకోవడానికి ఇద్దరు దాదులను నియమించిన అల్లరి అట్లే కొనసాగేది.


తల్లి ఒడిలోనే బిడ్డ విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టబడుతుంది. తల్లి పాలు పాటు ఆమెలోని సద్గుణాలూ, ఉన్నతాదర్శాలూ గ్రోలడమే బిడ్డకు విద్యాభ్యాసం పరిణమిస్తుందనడం అతిశయోక్తి కాదు. తల్లి తన బిడ్డను పెంచే తీరు అతడి భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. నరేంద్రుడి తల్లి అతడికి గరపిన సాటిలేనిది. "జీవితంలో నేను సాధించినవన్నింటికీ ఋణపడివున్నాను" అనేవారు కాలాంతరంలో స్వామి వివేకానంద. 


భారతీయ సంస్కృతిలోని దేవీదేవతల, ఋషుల, వారి త్యాగమయ జీవితాల, ఇతిహాస నాయకులను గూర్చి కథల ద్వారా, పాటల ద్వారా భువనేశ్వరీదేవి నుండి నరేంద్రుడు విన్నాడు. ముఖ్యంగా ఆమె చెప్పిన రామాయణ, మహాభారతం కథలు అతడి హృదయంలో చెరిగిపోని ముద్రవేశాయి. తన బామ్మ, ఆమె వద్ద అనేక భాగవత కథలు కూడా నరేంద్రుడు విన్నాడు.


రోజూ ఇంట్లో మధ్యాహ్నంపూట రామాయణ మహాభారతాలు పారాయణ చేసేవారు. ఆ సమయాల్లో కూడా తన చిలిపిచేష్టలు కట్టిపెట్టి నరేంద్రుడు ప్రశాంతంగా కూర్చుని వినేవాడు.🙏

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 10*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 10* 


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


బాగుగా ఆలోచించిన వెనుక, బ్రహ్మ శివుడుండు వెండికొండకు వెడలినాడు బ్రహ్మరాకకు శంకరుడానందమును వ్యక్తమొనర్చుచు, ఆయనకు సకల మర్యాదలు చేసి, గౌరవించి, ఉచితాసన మలంకరింపజేసి


 ‘విధాతా! విశేషములేమైన నున్నచో నెఱిగించెదవా! అనెను.


అనగానే ‘‘శంకరా! భక్తవశంకరా! లక్ష్మీదేవి ఎడబాటు వలన శ్రీమహావిష్ణువు భూలోకమున శేషాచలమును చేరి ఒక పుట్టలో నివసించడము ప్రారంభించాడు. నిద్రాహారములు లేక శుష్కించి, శ్రీమన్నారాయణుడా పుట్టలో నున్నాడు. 


ఉపవాసములతో ఆయన దినదినమునూ కృశించుచున్నట్లు నారదుని వలన తెలిసినది. కనుక మనమీ దశలో నారాయణునకు ఉపకారము చేయవలసియున్నది. 


మన మిరువురమూఆవు యొక్క దూడయొక్క రూపములు ధరించి నారాయణుడున్నటువంటి పుట్టను చేరి ఆయనకు ఆహారముగా పాలనిచ్చిన, కొంతలో కొంత ఆయన కుపకారము చేసినవారమగుదుము’’ అనినాడు బ్రహ్మదేవుడు.


అది విని శంకరుడు ‘‘విధాతా! అంతకన్న మనకు కావలసినదేమున్నది? ఆపదయందున్నవారి నాదుకొనుటకన్న గొప్ప యగునదేమున్నది? అదియును గాక నారాయణుని పట్ల ఆ మాత్రము వ్యవహరించుట మనకు విధిగా నెంచుట తగును. నీ వనినట్లే చేయుదుము’’ అన్నాడు.


మన కార్యములు సాధించుటకు సంధానము చేయు వారలు ఎప్పుడూ కావలసియే వుండును గదా! అందువల్లనే బ్రహ్మ, శివుడూ యిద్దరూ సరాసరి భూమండలానికి వెళ్ళి కొల్లాపురము చేరినారు. 


అచ్చట తపస్సు చేసుకొనుచున్న రమాదేవిని దర్శించి ‘‘అమ్మా కోపము చాలా చెడు వస్తువు సుమా! చూడు నీవు విష్ణువు పై కోపగించి భూతలానికి వచ్చేసిన కారణముగా పండంటి మీ సంసారములో కలతల అగ్ని కణాలు రేగాయి,


 అవి మీ సంతోషాన్ని దహించివేశాయి. విష్ణువు విషయము నీకు తెలిసిందా అమ్మా ఆయన యిప్పుడు మునుపటివలె కళాకాంతులతో చిరునవ్వులు చిందించే విష్ణువు కాదు. దైన్యదశలోనున్నాడు. 


నీకై క్షణమొక యుగముగా భూతలమునకు వచ్చి వెదకుచూ వెదకి వెదకి వేసారి శేషాద్రిచేరి, అక్కడున్న ఒక పుట్టలో తలదాచుకొని నిద్రాహారములు లేక దిగాలు పడి శుష్కించి శుష్కించి వున్నాడు. 


ఆయన కెట్లయిననూ ఆహారము నందించవలెననీ మా కోరిక, ఇందుకై నీవు చేయవలసిన ఉపకారము ఒకటి లేకపోలేదు. మేము ముగ్గురము ఆనందించవలెననీ మా కోరిక, ఇందుకై నీవు చేయవలసిన ఉపకారము ఒకటి లేకపోలేదు. మేము యావుదూడల రూపములు ధరించెదము నీవు గొల్లభామ వేషం ధరించి ఆవు దూడలమయిన మమ్ము తోలుకొని చోళరాజునకు అమ్మవలెను. 


ప్రతిదినమూ ఆ చోళరాజు యొక్క మందతో కలసివెళ్ళి మేము పుట్టలో నున్న శ్రీమహా విష్ణువునకు క్షీరాహారము నిచ్చుట ప్రారంభించెదము, 


కనుక మా కోరిక మన్నించవలెనని అన్నారు. విధాత, శంకరుల మాటలకు లక్ష్మీదేవి వెనువంటెనే సమ్మతించినది.


 *అనాధ రక్షక గోవిందా, ఆపద్భాంధవ గోవిందా, కరుణాసాగర గోవిందా,* *శరణాగత నిదే గోవిందా; |* 

 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా* *గోవిందా* .||10||


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం 🙏*

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

డాక్టర్ బృంద ఐఏఎస్



 ఆమె…. డాక్టర్ బృంద ఐఏఎస్… కాంధమాల్ అనే జిల్లాకు కలెక్టర్ ఆమె…! కాస్తోకూస్తో జనం కోణంలో… ఏదైనా మంచి చేయాలనుకునే కలెక్టర్…! అదసలే ఒడిశా… బీమారు రాష్ట్రాల్లో ఒకటి… అంతులేని పేదరికం, జాడతెలియని అభివృద్ధి… అనేకానేక గ్రామాలకు రోడ్లుండవు, చదువు అసలే ఉండదు, వైద్యం అందదు… ఆమె ఓరోజు పత్రికలు చదువుతుంటే ఆమెను ఓ వార్త ఆకర్షించింది…


అది సంపూర్ణంగా చదివింది… వివరాలు తెప్పించుకున్నది… ఓ కలెక్టర్‌గా సిగ్గుపడింది… ఈ వ్యవస్థకు ఏమీ చేయలేకపోతున్నాను సుమా అని తలవంచుకున్నది… డ్రైవర్‌ను పిలిచింది, గుమ్సాహి అనే ఊరి దగ్గరకు తీసుకువెళ్లాలని చెప్పింది… డ్రైవర్ పరేషాన్… ఆమె బయల్దేరింది…


 ఆ ఊరు చేరుకున్నది… ఇక్కడ జలంధర్ నాయక్ అంటే ఎవరు అని అడిగింది…. ఏమిటీ కథ నేపథ్యం..?ఆయన ఓ మట్టిమనిషి… వయసు 45… పుల్బనీ తాలూకాలోని గుమ్సాహి తన సొంతూరు… ఒంటిచేత్తో కొండను తొలిచి తమ ఊరికి రోడ్డు వేసిన బీహారీ దశరథ్ మాంఝీ కథ తెలుసు కదా… సేమ్, ఆయన ఒడిశా మాంఝీ… ఎందుకో తెలుసా..? తనూ అంతే… ఆ ఊరికి రోడ్డు లేదు, నిజం చెప్పాలా..? కరెంటు కూడా లేదు, మంచినీటి సరఫరా ఆశించేదే లేదు…


 ఒక్కొక్కరే ఊరు విడిచి వెళ్లిపోయారు… ఆ స్థితిలో ఆ ఊరికి రోడ్డు తనే సొంతంగా వేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఈ జలంధర్… ఎందుకు..? తన ఊరి నుంచి పుల్బనీలోని పాఠశాలకు పిల్లలు వెళ్లాలన్నా అవస్థలే… ఎవరిని ఎన్నేళ్లు వేడుకున్నా ఫలితం లేదాయె… లంచాలు తప్ప ఇంకేమీ తెలియని అధికారులకు అస్సలు పట్టదాయె… అసలు ఈ దేశానికి పట్టిన దరిద్రమే ఈ నాయకులు, ఈ అధికారులు అని అర్థమైంది… దాంతో ఓ ఆలోచనకు వచ్చాడు… కనీసం తన ఊరికి రోడ్డు వేసుకోలేనా…?భార్య సద్దిమూట కట్టి ఇచ్చింది… ఓ పలుగూ, ఓ పార పట్టుకుని బయల్దేరాడు… రోజూ పొద్దున మొదలు పెట్టి సాయంత్రం దాకా తనే రోడ్డు వేయడం మొదలు పెట్టాడు…


రాళ్లూరప్పల్ని తొలగిస్తూ, రోడ్డు వేసుకుంటే పోతున్నాడు… మొత్తం 15 కిలోమీటర్ల రోడ్డు తన టార్గెట్… ఒక్కడూ సహకరించినవాడు లేడు… అయితేనేం..? ఆ గడ్డపార ఆగలేదు, ఆ పార అలిసిపోలేదు… రెండేళ్లు… నమ్మండి… రెండేళ్లపాటు కష్టపడ్డాడు… 


నా జీవిత లక్ష్యం అదే అని తీర్మానించుకుని అదే పనిలో మునిగిపోయాడు… 8 కిలోమీటర్ల రోడ్డు తనొక్కడే నిర్మించాడు… ఓరోజు ‘గుండెలో తడి’ ఇంకా మిగిలిన ఓ స్థానిక పత్రిక జర్నలిస్టు ఆ కథను రాశాడు… అదీ ఆ కలెక్టర్ దగ్గరకు చేరింది… ఆమె చదివింది… ఆమె కళ్లు చెమర్చాయి…


 ఈ వ్యవస్థలో భాగమైన తను కూడా సిగ్గుపడాలి కదానే భావన ఆమెను తలవంచుకునేలా చేసింది… అందుకే ఆ ఊరికి బయల్దేరింది…అతన్ని కలిసింది… మాట్లాడింది… ‘ఏం లేదు మేడమ్… మూడేళ్లు ఆగండి, నేనా రోడ్డును పూర్తి చేస్తాను’ అన్నాడు జలంధర్… ఆమె మరింత సిగ్గుపడింది… ఓసారి రోడ్డు చూద్దామంటూ వెళ్లింది…


ఒక మనిషి శ్రమను, లక్ష్యాన్ని, నిబద్ధతను, కష్టాన్ని, సంకల్పాన్ని చూసింది… ఆమెలో కలెక్టర్ అనే పాత్ర నిద్రలేచింది… అయ్యా, మీ త్యాగం నిరుపమానం అని ఆయన చేతులు పట్టుకున్నది… మిగతా ఆ ఏడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఇక నాకు వదిలెయ్ అని చెప్పింది… తనకు అందుబాటులో ఉన్న ఏవో నిధులను అడ్జస్ట్ చేసింది… ఆ రోడ్డు పూర్తయ్యేదాకా దాని నిర్మాణ పర్యవేక్షణకూ తననే నియమించింది… అంతేకాదు, ఇప్పుడా ఊరికి కరెంటు పోల్స్, లైన్స్ పడుతున్నాయి… మంచినీటి సరఫరా ప్రణాళికా రూపుదిద్దుకున్నది…


 మరో విషయం… ఈ రెండేళ్లపాటు తను చేసిన పనికి ఉపాధిహామీ కింద డబ్బులు ఇవ్వటానికి కూడా ఆమె అంగీకరించింది… వావ్… ఇవీ కదా సక్సెస్ స్టోరీలు… ఇవీ కదా పది మందికీ స్పూర్తినిచ్చే అసలు విజయగాథలు…!!

అరుణతార

 అరుణతార.


ఎర్రసూరీడు వాలిపోయాడు

గొంతు మూగబోయేను

నల్ల గొంగళి జారి పోయేను

చేతి కర్ర పట్టు జారేను


నేలన మాయమయ్యే

విప్లవ తార నింగి జేరే

పోరాటం కానరాకనే

పాట,ఆట కన్నీరయ్యే.


పిక్కటిల్లే స్వరం ఆగే

యుద్ధనౌక కనుమరుగై

పీడిత ప్రజల ధైర్యం పోయే

ఎర్ర చుక్క గగనాన చేరే..


ఉద్యమ గొంతు ఆగిపోయింది

హక్కుల గానం మాయమైంది

ఎర్రని సూరీడు కనుమరుగై

గానం, రాగం ఇక నిద్రించే..


పోరుకి సరికొత్త రూపు

వెలుగు నడిచిన తీరు

పోరాట చుక్కల చేరు

ఆట, పాటే అతని పేరు.


నల్ల గొంగళి ధరించి

చేత కర్ర పట్టి

స్వరం పిక్కటిల్లే

అడుగు వేసే..


అన్యాయం రాజ్యమేలే చోట

అకృత్యం బరితెగించిన వేళ

నిస్పృహాన కన్నీటీ మనిషికి

నేనున్నా అనే ఎర్ర బావుటా.


అతడే "గద్దర్"!.


గద్దర్ మరణం 

సమాజానికి, బాధిత పీడిత వర్గాలకు తీరని లోటు.


అశృతర్పణాలతో అరుణతారకు అంతిమ వీడ్కోలు..


అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

Panvhangam monday


 

దర్శనే స్పర్శనే వాపి

 *స్నేహం అనగా*


"దర్శనే స్పర్శనే వాపి

 భాషణే భావనే తథా

 యత్ర ద్రవత్యంతరంగం

స స్నేహః ఇది కథ్యతే"


ఎవరినైతే చూసినప్పుడు గాని, స్పృశించినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, మనసులో భావించినప్పుడు కానీ మనస్సు ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో, ఆర్ద్రతతో ద్రవిస్తుందో దానిని స్నేహం అని అంటారు.



అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు  💐💐

Interpretation of *Ramayana

 ॐ    A forwarded message to be read by everybody 


What a beautiful interpretation about 

*Rama* 

and *Ramayana* 


The Interpretation of *Ramayana*

As a *Philosophy of Life*…


‘ *Ra* ’ means *light*, 

‘ *Ma* ’ means *within me*, 

*in my heart*. 

  

So, 

*Rama* means the *Light Within Me*…


*Rama* was born to *Dasharath & Kousalya*…


*Dasharath* means 

‘ *Ten Chariots* ’…


The ten chariots symbolize the *five sense organs* ( *Gnanendriya* ) 

& *five organs of action* ( *Karmendriya* ) ...


*Kousalya* means 

‘ *Skill* ’…


*The skillful rider of the ten chariots can give birth to Ram*…


When the ten chariots are used skillfully,

*Radiance* is born within…


*Rama* was born in *Ayodhya*.


*Ayodhya* means ‘ *a place where no war can happen* ’…


When There Is No Conflict In Our Mind, 

Then The Radiance Can Dawn…


The *Ramayana* is not just a story which happened long ago..


It has a *philosophical*, *spiritual significance* and 

a *deep truth* in it…


It is said that the *Ramayana is happening in our Own Body*…


Our *Soul* is *Rama*, 

Our *Mind* is *Sita*, 

Our *Breath* 

or *Life-Force* ( *Prana*) is *Hanuman*, 

Our *Awareness* is *Laxmana* 

and 

Our *Ego* is *Ravana*…


When the *Mind* (Sita),

is stolen by the *Ego* (Ravana), then the *Soul* (Rama) gets *Restless*…


Now the *SOUL* (Rama) cannot reach the *Mind* (Sita) on its own…


It has to take the help of the *Breath – the Prana* (Hanuman) by Being In *Awareness*

(Laxmana)


With the help of the *Prana* (Hanuman), & *Awareness*

(Laxmana),

The *Mind* (Sita) got reunited with The *Soul* (Rama) and The *Ego* (Ravana) *died/ vanished*…


*In reality Ramayana is an eternal phenomenon happening all the time*… 


My continuation 


 ॐ Well. 

     We have to interpret Sugriva too. 

     Hunuman (Life - Force/Breath i.e. Prana) brings Rama to Sugriva. 

     Su (good) griva (throat) means Veda. 

     We enchant Veda comes through the throat. 

    So Sugriva means the right knowledge of Veda to be followed. 

     The Vedas came from the breath of the Divine.

శ్రీవారి లీలలు..

 శ్రీవారి లీలలు..


తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆఫీసు

*****************************

 పి వి ఆర్ కే ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు executive officer గా పనిచేస్తున్నారు..సరిగ్గా అవే రోజుల్లో దేవస్థానం వారు కూడా తమ స్వర్ణోత్సవపు సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచి పోయేటట్లుగా ఏదన్నా కొత్త పని మొదలు పెడితే బావుంటుందన్న ఆలోచనలో వున్నారు..


వారంతా ఆలోచనయితే చేసారు గానీ ఎన్ని దఫాలుగా ఎన్ని మీటింగులు పెట్టి ఎంత చర్చించినా ఆ ఆలోచనని ఆచరణలో పెట్టటంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోయారు..సమయం దగ్గర పడుతోంది..ఏం చేయాలో దిక్కు తోచని స్థితి..వెంటనే ఏదో ఒకటి ప్లాన్ చెయ్యకపోతే అభాసుపాలు అవుతామేమోనన్న భయం అందర్లోనూ ఏ మూలో ఉంది….


అక్కడున్న వారిలో TTD బోర్డు మెంబర్లుగా ఉన్నకొద్ది మంది పేరొందిన ప్రముఖులతో పాటు మరి కొంత మంది ముఖ్యమైన ఆలయ అధికారులు కూడా ఉన్నారు..అప్పుడక్కడ వేడిగా వాడిగా చర్చ జరుగుతోంది..చర్చ అయితే జరుగుతోంది కానీ తమ స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా స్వామి వారికి కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయంలో మాత్రం అక్కడున్న పెద్దలు ఒక perfect అవగాహనకు రాలేక పోతున్నారు..


సమయం  గడుస్తున్నకొద్దీ EO పీ వీ ఆర్ కే ప్రసాద్లో అసహనం ... ఆయనకు క్లియర్ గా అర్థం 


సరిగ్గా అదే సమయంలో తలుపు తోసుకొని ఆఫీస్ అటెండర్ మెల్లిగా ప్రసాద్ దగ్గరికి వచ్చాడు..అసలే చిరాగ్గా ఉన్న ప్రసాద్ టైం గాని టైం లో వచ్చిన ఆ అటెండర్ని చూస్తూ ‘ఏంటయ్యా” అని మరింత చిరాకు పడిపోతూ అడిగారు..కంగారు పడ్డ ఆ అటెండర్ తన నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ ఆయన ముందుకొంగి “సార్ మిమ్మల్ని కలవటం కోసం గుంటూరు నుండి ఎవరో భక్తుడు వచ్చాడు.. ” అని మెల్లిగా చెప్పాడు..


చిర్రెత్తుకొచ్చింది ప్రసాద్ కి.. “..ఎవరయ్యా అతను..ఇప్పుడింత అర్జెంటుగా మీటింగులో ఉంటే నన్ను డిస్టర్బ్ చేసి మరీ చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది..కాసేపుండమను…”మరి కాస్త చిరాకు పడిపోతూ అన్నారు ప్రసాద్…”చెప్పాను సార్..కానీ ఏదో అర్జెంటుగా మీతో మాట్లాడాలట..అతని పేరు షేక్ మస్తాన్ అని చెప్తున్నాడు..” కొద్దిగా భయపడుతూ చెప్పాడు అటెండర్..


“.. షేక్ మస్తానా…” అని ముందు కాస్త ఆశ్చర్య పోయినా..”ఎవరో ముస్లిం భక్తుడు ఏదో రికమండేషన్ లెటర్ తో వచ్చి ఉంటాడు.. మా వాళ్ళు నా దగ్గరికి పంపించుంటారు..మళ్ళీ బయటకు పోవటం ఎందుకు..ఏదో రెండు నిమిషాలిక్కడే మాట్లాడి పంపించేస్తే సరిపోతుంది కదా ” అని మనసులో అనుకుంటూ.. “.. సర్లేవయ్యా..ఇక్కడికే రమ్మను..” ..అని అటెండర్ తో చెప్పి పంపించేసారు  ప్రసాద్..


అప్పుడు దుద్రుష్టవసాత్తు ప్రసాద్ కి గానీ అదే రూం లో ఉన్నఏ ఇతర బోర్డు మెంబర్లకి గానీ తెలినీ విషయం ఏమిటంటే కాసేపట్లో తమ ముందుకు రాబోతున్న ఆ ముస్లిం భక్తుడు కేవలం ఒక భక్తుడు మాత్రమె కాదని స్వయంగా తమ స్వామి వారు పంపిస్తే తమ దగ్గరికి వస్తున్నాడని అంతేకాకుండా అతని ద్వారానే తాము ఇన్నాళ్లుగా తలలు బద్దలు కొట్టుకుంటున్న తమ స్వర్ణోత్సవ సంవత్సర సమస్యకు కూడా గొప్ప పరిష్కారం దొరకబోతోందని..


ఇవేమీ తెలీని ఆ పెద్దలంతా ఆ రూంలో వెయిట్ చేస్తుంటే ఆ ముస్లిం భక్తుడొక్కడూ బయట వెయిటింగ్ హాల్లోవెయిట్ చేస్తున్నాడు.. సరిగ్గా అప్పుడే అటెండర్ బయట కొచ్చిఆ ముస్లిం భక్తుడి దగ్గర కెళ్ళి చెప్పాడు “సార్..మా సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు” అని..


అప్పటిదాకా తను కూర్చున్నచెక్క కుర్చీ లోంచి లేచి ఆ అటెండర్ కి థాంక్స్ చెప్తూ ఆ ముస్లిం భక్తుడు ఒక్కో అడుగూ వేసుకొంటూ బోర్డు రూం లోపలికి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాడు..వెళ్తూనే రెండు చేతులు జోడించి అక్కడున్నవారందరికీ ఎంతో వినమ్రంగా నమస్కారం చేసి ఆ తరువాత మెల్లిగా ప్రసాద్ వైపు తిరిగి ఇలా చెప్పటం మొదలు పెట్టాడు..


“.. అయ్యా.. నా ఏరు షేక్ మస్తాన్..మాది గుంటూరు జిల్లా..మాది చాల పెద్ద కుటుంబం..అన్నదమ్ములందరం కలిసి ఉమ్మడిగా ఒకే  ఇంట్లో ఉంటాం..మా కుటుంబానికక్కడ ఓ చిన్న పాటి వ్యాపారముంది..ఎన్నోతరాలుగా మేమంతా స్వామి వారి భక్తులం..”


“..మా తాత ముత్తాతల కాలం నుండీ కూడా మా కుటుంబ సభ్యులమంతా చిన్న పిల్లలతో సహా ఒక పద్ధతి ప్రకారం పొద్దున్నేలేచి స్వామి వారి ముందు నిలబడి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పటిస్తాం..అట్లాగే ఏ మాత్రం తప్పులు పోకుండా శ్రీ వేంకటేశ్వర  ప్రపత్తి, మంగళాశాసనం కూడా పటిస్తాం..నా మటుకు నేను శ్రీనివాస గద్యం మొత్తం పొల్లుపోకుండా అప్పజెప్పగలను..”


“తరతరాలుగా మా ఇంట్లో మరో ఆచారం కూడా ఉంది..అదేమిటంటే మేమంతా కలిసి ప్రతి మంగళ వారం పొద్దున్నే లేచి మా పెరట్లో పూచే రకరకాల పూలతో స్వామి వారి 108 నామాలూ ఒక్కొక్కటిగా పటిస్తూ ఒక్కో నామానికి ఒక్కో పువ్వు చొప్పున సమర్పిస్తూ శ్రీ స్వామి వారికి అష్టోత్తర శత నామ పూజ చేస్తాం..”


“అయ్యా ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిమిటంటే..మా తాతగారు అంటే మా తండ్రి గారి తండ్రి గారు తన చివరి రోజుల్లో స్వామి వారికి తన స్వార్జితంతో 108 బంగారు తామర పూలు చేయించి శ్రీవారి ఆలయంలో సమర్పిస్తానని మొక్కుకున్నారు..మొక్కయితే మొక్కుకున్నారు గానీ పాపం వారి ఆరోగ్యమూ అంతంత మాత్రమే ఆర్ధిక స్తోమతా అంతంత మాత్రమె కావటం చేత కొద్ది మాత్రం బంగారు తామర పూలు మాత్రమే చేయించ గలిగారు..”


“..ఆ తరువాత తండ్రి గారి మొక్కు తీర్చే బాధ్యత తనది కూడా అవుతుంది కాబట్టి మా తండ్రిగారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక్కో రూపాయి కూడ పెట్టి మరికొన్ని బంగారు పూలు చేయించారు..అంత కష్టపడీ చివరికా మొక్కు తీర్చకుండానే మా తండ్రి గారు కూడా వారి తండ్రి గారి లాగానే తమ చివరి రోజుల్లో ఎంతో బాధపడుతూ స్వామి వారి పాదాల్లో ఐక్యమై పోయారు..”


“..మరి మా తాతగారిది తండ్రిగారిది మొక్కు తీర్చాల్సిన బాధ్యత ఇంటికి పెద్ద కొడుగ్గా నా మీద కూడా వుంటుంది కాబట్టి నా ఆర్ధిక పరిస్థితి కూడా పెద్దగా సహకరించక పొయినా నేను కూడా ఎంతో కష్టపడి నా వంతు ప్రయత్నంగా ఆ మిగతా బంగారు పూలు కూడా పూర్తి చేయించాను..ఈ మధ్యనే కరెక్టుగా 108 పూల లెక్క పూర్తయ్యింది..ఎంతో భక్తితో అవి స్వామి వారికి సమర్పించాలని మా కుటుంబ సభ్యుల మంతా మొత్తం 54 మందిమి కలిసి ఇందాకే కాలి బాటన కొండెక్కి పైకి చేరుకున్నాం..”


అంటూ కాసేపాగి అందరివేపు ఒక్క నిమిషం తదేకంగా చూసాడు షేక్ మస్తాన్..ఆ తరువాత మెల్లిగా అసలు విషయం బయట పెట్టాడు… 


“అయ్యా..ఇప్పటికే మీ అమూల్యమైన సమయం చాలా తీసుకున్నాను..కానీ చివరగా పెద్దలందరికీ నాదొక చిన్న విన్నపం.. మూడు తరాలుగా మా కుటుంబ సభ్యులంతా ఎంతో శ్రమపడి ఈ బంగారు తామర పూలు చేయించాం..ఇవి ఒక్కోటి 23 గ్రాముల బరువుంటాయి..”


“..కాదనకుండా మీరు వాటిని స్వీకరించి ఏదో రూపేణా స్వామి వారి కైంకర్యంలో ఉపయోగిస్తే మా కుటుంబం మొత్తానికి కూడా గొప్ప సాయం చేసిన వారవుతారు..మా తండ్రీ తాతగారి ఆత్మలు కూడా శాంతిస్తాయి..ఇది విన్నవించు కుందామనే మీ దగ్గరకు వచ్చాను ..ఇక మీ ఇష్టం..నిర్ణయం మీకే వదిలేస్తున్నాను..”


అంటూ వినమ్రంగా అందరికీ రెండు చేతులెత్తి మరోసారి నమస్కారం చేసి అప్పుడు మెల్లిగా తన చేతిలో ఉన్న ఒక బరువైన సంచీని తీసి ప్రసాద్ ముందున్న టేబుల్ మీద పెట్టాడు షేక్ మస్తాన్ అనబడే ఆ అతి గొప్ప ముస్లిం భక్తుడు..


నిశ్శబ్దం..నిశ్శబ్దం..నిశ్శబ్దం..


గుండెలు పిండేసే నిశ్శబ్దం.. రాతిని కరిగించే నిశ్శబ్దం.. బరువైన నిశ్శబ్దం.. గుండె చెరువైన నిశ్శబ్దం.. నిర్వెదమైన నిశ్శబ్దం… నిలువెల్లా మనిషిని నివ్వెర పరిచే నిశ్శబ్దం.. మనసంతా నిశ్శబ్దం.. మనసుని కలవర పరిచే నిశ్శబ్దం.. గతి తప్పిన నిశ్శబ్దం.. మనసుని గతి తప్పించే నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. 


కొన్ని క్షణాల పాటక్కడ ఇంతకంటే వర్ణించటానికి వీలుకాని నిశ్శబ్దం తాండవించింది..అక్కడున్నవారందరూ ఓ మహాశిల్పి చెక్కేసి గదిలో వొదిలేసిన మహాత్ముల శిలా విగ్రహాల్లాగా freeze అయిపోయి కూర్చున్నారు..అక్కడ గది మూలల్లో ఏర్పాటు చేసిన pedestal fans తిరుగుతూ చేసే శబ్దం తప్ప ఆ సమయంలో అక్కడ మరే ఇతర శబ్దం వినిపించటంలేదు..


ఎంతో సాదా సీదాగా కనపడుతూ తమ మధ్యన మామూలుగా నిలబడి ఎన్నో అద్భుత విషయాలు చెప్పిన ఆ గొప్ప శ్రీవారి ముస్లిం భక్తుడి మాటలకు చేష్టలుడిగి పోయి ఉన్నారంతా.. అందరికంటే ముందు తేరుకున్నవాడు పీ వీ ఆర్ కే ప్రసాద్..


“దివినుండి దేవ దేవుడే దిగి వచ్చినాడా..” 


అన్న ఒక్క అతి చిన్న అనుమానం లిప్త పాటు కాలంలో ఓ మహోగ్ర రూపం దాల్చిఆయన మనసంతా ఆక్రమించింది..ఇంకొక్క ఉత్తర క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఒక్క ఉదుటున లేచి షేక్ మస్తాన్ దగ్గరికి చేరుకున్నారు  ప్రసాద్..


కళ్ళనుండి ధారగా కన్నీళ్లు కారిపోతుండగా షేక్ మస్తాన్ రెండు చేతులు పట్టుకొని ఎంతో ఆర్త్రతతో,”మస్తాన్ గారూ..మమ్మల్ని దయచేసి క్షమించండి..మీరెవరో తెలీక ఇంతసేపూ మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడించాను..రండి ..” అంటూ ముందు తన కుర్చీ దగ్గరికి తీసుకెళ్ళి తన పక్కనున్న కుర్చీలో కూర్చోపెట్టుకుని ఆ తరువాత మెల్లిగా ఇట్లా అన్నారు..


“మస్తాన్ గారు..ఇక్కడున్న మేమంతా మా సర్వీసులో ఎంతో మంది గొప్ప గొప్ప భక్తుల్ని చూసాం..కానీ మీ అంతటి అద్వితీయమైన  భక్తుడ్నిమాత్రం ఇప్పుడే చూస్తున్నాం..ఒక రకంగా మిమ్మల్ని చూడగలగటం మా పూర్వజన్మ సుకృతం అనుకోండి..బహుశా మిమ్మల్ని ఆ శ్రీనివాసుడే మా దగ్గరికి  పంపించాడేమో..ఎవరికి తెలుసు..”


“..కానీ నాదొక విన్నపం..ఈ అమూల్యమైన బంగారు తామర పూలను TTD తరఫున ఒక బాధ్యత కలిగిన ఆఫీసర్ గా నేను తప్పకుండా స్వీకరిస్తాను..కానీ వీటిని స్వామి వారి సేవలో వెంటనే ఉపయోగిస్తామని మాత్రం ఈ క్షణం లో మీకు మాటివ్వలేను.. ఎందుకంటే పేరుకి మేము కూడా శ్రీవారి సేవకులమే అయినా ప్రభుత్వం తరఫున బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం కాబట్టి మాకు కొన్ని పరిమితులుంటాయి.. వాటిని అధిగమించటానికి మాకు చాలానే సమయం పడుతుంది..”


“అయినా సరే.. ప్రయత్నలోపం లేకుండా నా వంతు కృషి చేసి వీలున్నంత తొందరగా మీ పని పూర్తి చేసి మీకు కబురు పెడతాను.. ఏం చేస్తాననేది మాత్రం ఇప్పుడే చెప్పలేను..మీరు మీ అడ్రస్సు ఫోన్ నెంబర్  మాకిచ్చి వెళ్ళండి..మిగతా విషయాలు నేను చూసుకుంటాను..అంతవరకూ కాస్త ఓపిక పట్టండి..”


 అంటూ షేక్ మస్తాన్ రెండు చేతులూ పట్టుకొని ప్రసాద్ ఇట్లా అన్నారు.. 


” మస్తాన్ గారు.. చివరగా ఒక్క మాట.. ప్రస్తుతం మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ మా వాళ్ళు దర్సనం వసతి ఏర్పాటు చేస్తారు..హాయిగా  మీ స్వామి వారిని దర్శించుకొని వెళ్ళండి..thank you very much..”


ఉపసంహారం 


ఆ తరువాత పనులన్నీ చకచకా జరిగిపొయినయి.. ఇంకో రెండు మూడు మీటింగుల తర్వాత చివరికి శ్రీ వారికి ఒక కొత్త అర్జిత సేవను ప్రవేశ పెట్టాలని TTD బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది..ఆ సేవలో భాగంగా స్వామి వారికి వారానికొకసారి అష్టోత్తర శతనామ పూజ జరపబడుతుంది.. 


ఆ పూజలో స్వామి వారి 108 పేర్లను ఒక్కొక్కటిగా పటిస్తూ షేక్ మస్తాన్ కుటుంబం సమర్పించిన ఒక్కొక్క బంగారు తామర పూవును పూజారులు స్వామి వారి పాదాల మీద ఉంచుతారు..TTD ఈ ఆర్జిత సేవను 1984 లో స్వామి వారికి తమ స్వర్మోత్సవపు కానుకగా ప్రవేశ పెట్టింది.. 


శ్రీ వారి పట్ల షేక్ మస్తాన్ కుటుంబానికున్న గొప్ప భక్తి వలన స్వామి వారికి ఒక కొత్త ఆర్జిత సేవ ప్రారంభం అవటమే కాకుండా అదే కుటుంబం వలన TTD బోర్డుకి కూడా తమ స్వర్ణోత్సవ సంవత్సరాన్ని తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకొనే ఒక గొప్ప సదవకాశం లభించింది.. 


గత 30 సంవత్సరాలకు పైగా ప్రతి మంగళవారం స్వామి వారికి జరపబడే ఈ సేవలో ఇప్పటికీ షేక్ మస్తాన్ ఇచ్చిన బంగారు తామర పూలనే వాడతారు..కాలక్రమేణా ఈ సేవ భక్తుల్లో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది..మొదట్లో ఈ సేవను “అష్టదళ స్వర్ణ పద్మ పూజ” అని పిలిచినా ఇప్పుడది “అష్టదళ పాద పద్మారాధన సేవ” గా మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.......


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Vantakam