21, నవంబర్ 2023, మంగళవారం

పితృదేవతా స్తుతి

 వందేమాతరం


*🙏పితృదేవతా స్తుతి🙏*


 చిన్న స్తోత్రమే దయచేసి పఠించి, పితృదేవతల అనుగ్రహాన్ని పొందండి. 

సాక్షాత్తూ బ్రహ్మదేవుడే చెప్పిన పితృదేవతా స్తుతి.


 ప్రతీ రోజూ చదువుకోవచ్చు. తల్లిదండ్రులు ఉన్నవారు కూడా చదువుకోవచ్చు. పితృదేవతలు అంటే, జన్యుదేవతలు. బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి.


ఈ స్తోత్రాన్ని ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు. ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. పాపకర్మలు నశించిపోతాయి.


బ్రహ్మ ఉవాచ:


౧. నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ!

సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే!!


౨. సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!

సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!!


౩. నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః!

సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!


౪. దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!

సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః!!


౫. తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!

మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః!!


౬. యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!

అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమోనమః!!


*ఫలశ్రుతి:*


ఇదం స్తోత్రం పిత్రుః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః!ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ 

స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా 

న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్ 

నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః 

సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ 

పితృప్రీతికరైర్నిత్యం సర్వ కర్మాణ్యధార్హతి!!


*స్తోత్రం యొక్క భావము*


ఎవరివలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.


సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు. 


సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు.


ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరివలన లభించిందో ఆ పితృ దేవతలకు నమస్కారములు.


ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు. 


ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందలకొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారము


పితృదేవతా నమోస్తుతే.


*హిందూ ధర్మ సంరక్షణ సమితి*

9849795167

ఋతుక్రమం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*ఋతుక్రమం..ఊర్ధ్వ, అధో లోకాల వివరణ..*


*(ముప్పై నాలుగవ రోజు)*


శ్రీ స్వామివారు ఏదో ముఖ్యమైన విషయం గురించి వివరించబోతున్నారని శ్రీధరరావు దంపతులకు, సత్యనారాయణమ్మ గారికీ అర్ధమైంది..


"స్త్రీలైనా..పురుషులైనా..పశుపక్ష్యాదులైనా.. క్రిమికీటకాలైనా..శరీరధారణ ఉన్న ప్రతి జీవికీ..ఆకలి దప్పులు.. నిద్ర, మైధునం.. ఋతుక్రమం..సంతానోత్పత్తి..మల, మూత్ర, స్వేద, కఫ, అపానవాయు విసర్జన అన్నది తప్పనిసరిగా ఉంటుంది..వీటిలో ఏ ఒక్క ధర్మాన్నీ..ఏ జీవీ తప్పించుకోలేదు..ఏ ఒక్కటి సరిగ్గా జరుగాకపోయినా..ఆ జీవి అనారోగ్యం పాలు కావటమో.. లేదా ఏదో లోపంతో బాధపడటమో జరుగుతుంది..అవునా?..ఇక మానవమాత్రుల విషయానికి వస్తే..స్త్రీలకు బహిష్టు అనేది సహజమైన శారీరిక ధర్మం!..మల మూత్ర విసర్జన..శరీరానికి చెమట పట్టటం..జలుబు చేస్తే..ముక్కులోంచి చీమిడి రావడం..దగ్గు వచ్చినప్పుడు కళ్ళే రావడం..ఎంత సహజమో..ఇదీ అంతే సహజం!..అవన్నీ అపవిత్రం కానప్పుడు..ఇది అపవిత్రం ఎలా అవుతుంది?..మానవ శరీరం ఒక మహా అద్భుత లోకం.." అంటూ అనర్గళంగా చెపుతూ ఒక్కక్షణం ఆగి ..ప్రభావతి గట్టి వైపు చూసి..


"తల్లీ!..అసలు సప్త సముద్రాలు..పోనీ పద్నాలుగు లోకాలు అంటే ఏమిటో చెప్పమ్మా.." అని అడిగారు..


"నాయనా!..ఇలా గబుక్కున చెప్పమంటే చెప్పలేను కానీ..భూమి క్రింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ లోకాలనీ..భూమికి పైన..స్వర్గలోక,  సువర్ణలోక, భువర్ణలోక, సత్యలోక, తపోలోక, బ్రహ్మలోక..ఇలా చెపుతారు..వాటి క్రమం ఎలా ఉంటుందో గుర్తులేదు..చదివి చాలా రోజులైంది.."  అన్నారు ప్రభావతి గారు..


"అవునమ్మా..అలానే చెపుతారు..అయితే అవన్నీ మనిషి శరీరం లోనే ఉన్నాయి తల్లీ బాగా ఆలోచిస్తే..సప్త సముద్రాలు అంటే..లవణ, క్షీర, రక్త, స్వేద, జీర్ణకోసం లోని ఆమ్లాలు..నోటిలోని లాలాజలం ఇలా చెప్పుకోవచ్చు..అలాగే నీవు చెప్పిన ఊర్ధ్వ, అధో లోకాలకు కూడా మానవదేహమే నిలయం..మాలాంటి యోగులు, మనో నేత్రాలతో..యోగసిద్ధితో చూస్తాము వాటిని..మేము చెపితే సత్యమని నమ్మి, చిత్తశుద్ధితో ఆలోచిస్తే తప్ప తెలుసుకోలేరు మీరు!.."


"చూడు తల్లీ!..శరీరాన్ని రెండు సమభాగాలుగా విభజిస్తే..నాభి అనేది భూలోక స్థానం..అటు పైలోకాలకు, ఇటు క్రింది లోకాలకు నాభి ఆధారభూతం..నాభి నుండి క్రింది భాగం..ఆకలి దప్పులకు.. జీర్ణకోశానికి, ప్రాణీ జన్మస్థానానికి..మల మూత్ర విసర్జనకు..ప్రాణీ కదలికలకు..సృష్టి కార్యానికి ఆధారం..ఉదాహరణకు..మీరు ఏ రైల్లోనో..బస్సులోనో ప్రయాణం చేస్తున్నారు..లేదా ఎక్కడో ఒకచోట ముఖ్యమైన పనిలో ఉంటారు..హఠాత్తుగా మల మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది..అవకాశం లేదనుకోండి..అప్పుడేం చేస్తారు?..ఒక గంట పాటో.. అరగంట పాటో..లేదా మీరు ఆపుకోగలిగినంత సేపు ఆపుకుంటారు..అవునా?..అంటే..నీ శరీరం లోనే ఒక మరుగుదొడ్డి ఉంది..నీ వెంటే మోసుకుపోతున్నావు..మళ్లీ అవకాశం రాగానే..విసర్జిస్తారు..శరీరం లోని ఆ భాగం ఖాళీ అవుతుంది..ఒక క్రమబద్ధమైన ఏర్పాటు శరీరం లో వుండన్నమాట!..అవగతం అవుతోందా?..అందుకే నాభి నుండి క్రింది భాగాలను అధోలోకాలు అనవచ్చు..ప్రతి ప్రాణీ పుట్టుకా అధోలోకాల నుండే జరుగుతుంది..అలాగే ఈ బహిష్టు కూడా..శరీరం లోపల తయారవుతున్న మకిలి..అవసరమైన మంచి రక్తం నీలోనే ఉంచబడి..చెడు రక్తం బహిష్టు రూపం లో బైటకు వెళ్ళిపోతుంది..దానికి రకరకాల పేర్లు పెట్టి..ఇంటికి దూరంగా ఉంటారు.."


"ఇక ఊర్ధ్వ లోకాలు..నాభి పై స్థానాలు..రక్తప్రసరణకు ఆధారమైన గుండె..నాడీమండలం..ఆలోచనకు మెదడు..శిరస్సు..రుచులు ఆస్వాదించే నాలుక..మాట్లాడటానికి నోరు..ధ్వనిని గ్రహించే చెవులు..దృష్టి తెలుసుకునే కళ్ళు.. ఇవి..వీటినే ఊర్ధ్వలోకాలుగా భావించండి..నీ ఆలోచన సక్రమంగా  ధర్మబద్ధంగా వుంటే..నీ శరీరం ధర్మమార్గంలో పయనిస్తుంది..అవి వక్రంగా వుంటే..జీవితమే గతి తప్పుతుంది.."


"యోగులు ఇంద్రియ నిగ్రహం..రాజయోగం..గుహ్యప్రదేశం నుండి..మూలాధారం మొదలు సహస్రారం వరకూ కొనసాగిస్తారు..అంటే జీవి అధోలోకం నుండి..నాభి దాటి..ఊర్ధ్వలోకాలను తెలుసుకొని..ఆత్మజ్యోతిని దర్శించటం అన్నమాట!..ఇది మానవ దేహం లోనే ఉన్న ఊర్హ్వ అధోలోకాల గురించి క్లుప్తంగా ఇస్తున్న వివరణ.." 


"ఇక అసలు విషయానికి వద్దాము..పెద్దలు ఏ ఆచారాన్నీ అనవసరంగా పెట్టరు.. ప్రతి దానికీ ఒక సహేతుకమైన కారణం ఉంటుంది..అదేమిటో వివరిస్తాను..శ్రద్ధగా వినండి.." అన్నారు..


శ్రీ స్వామివారు చెప్పబోయే వివరణ కోసం ఆతృతగా ఎదురుచూడసాగారు ఆ ముగ్గురూ..


ఋతుక్రమం..ఆచారం..మరింత వివరణ.. రేపటి భాగంలో..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



రాజేంద్రా ! దేవేంద్రుడికి మిత్రుడివై మాకందరికీ ఒక సహాయం చెయ్యాలి. సంగ్రామంలో

రాక్షసులు మమ్మల్ని ఓడించారు. నువ్వు మా పక్షాన నిలిచి పోరాడి దైత్యులను జయించాలి. పరాశక్తి

అనుగ్రహం పూర్తిగా నీపట్ల ఉంది. నీకు అసాధ్యమంటూ ఏదీ లేదు. విష్ణుమూర్తి సలహామీద నీ దగ్గరికి

వచ్చాము. ధర్మజ్ఞుడివీ సమర్థుడివి. ఈ సహాయం చేసిపెట్టు.దేవతలారా ! మీ పక్షాన నిలుస్తాను. దైత్యులతో పోరాడతాను. జయం సాధిస్తాను. కాకపోతే

సంగ్రామంలో ఇంద్రుడు నాకు వాహనమై సహకరించాలి.

ఇంద్రో మే వాహనం తత్ర భవేద్యది సురాధిపః ।

సంగ్రామం తు కరిష్యామి దైత్యైర్దేవకృతే ధునా॥ (9-24)

కకుత్థ్సుడు పెట్టిన ఈ నియమాన్ని గురించి దేవతలు పరస్పరం చర్చించుకున్నారు. అవసరం

మనది కనక సిగ్గుపడకూడదు. కకుత్థ్సుడికి వాహనం అవ్వమని అందరూ కలిసి ఇంద్రుణ్ణి ఒత్తిడి చేశారు.

చివరికి శ్రీహరివచ్చి అదే సలహా చెప్పాడు. వాసవుడు అంగీకరించాడు. సిగ్గు విడిచిపెట్టి వృషభరూపం

ధరించాడు. కకుత్థ్సుడు ఆ వృషభవాహనం అధిరోహించి మరొక రుద్రుడో అన్నట్టు రాక్షసులతో

సంగ్రామానికి దిగాడు. ఈ రకంగాకూడా కకుత్థ్సుడు అనే పేరు చరితార్థమయ్యింది. (కకుది స్థితః = ఎద్దు

మూపున కూర్చున్నవాడు)

స్థితః కకుది యేవాస్య కకుత్థ్సస్తేన చాభవత్ ॥

ఇంద్రో వాహః కృతో యేన తేన నామ్నేంద్రవాహకః

పురం జీతం తు దైత్యానాం తేనాభూచ్చ పురంజయః

నాశనం చేస్తాయని గుర్తించలేరు

 *1981*

*కం*

వంచనతో నొరుల సిరుల

సంచిత మొనరించుకొనగ స్వంతం బగునా!!?

సంచితమగు పాతకసిరి

క్రుంచును తరతరముల సిరి కొదముగ సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మోసం చేసి ఇతరుల సంపదలను నీవు కూడబెట్టుకున్నంత మాత్రాన అవి నీ స్వంతమవుతాయా!!?? అలా పాపంద్వారా కూడబెట్టిన సిరులు తరతరాలుగా నీవు పొందిన సిరులను కూడా పెద్దగా నాశనం చేయును.

*సందేశం*:-- కొందరు తెలివితేటలు అనుకొని ఇతరుల సంపదలను దోచుకొని సంతృప్తి పొందిన పొందుతారు, కానీ అలా అధర్మం గా సంపాదించి న సంపదలు తమరి సంపదలను మొత్తం (మనశ్శాంతి మొదలైన వెలగట్టలేని సంపదలు సహితంగా) నాశనం చేస్తాయని గుర్తించలేరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మంగళవారం, నవంబరు 21,2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


మంగళవారం, నవంబరు 21,2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

కార్తీక మాసం - శుక్ల పక్షం

తిథి:నవమి రా12.53 వరకు

వారం:మంగళవారం (భౌమవాసరే)

నక్షత్రం:శతభిషం రా8.36 వరకు  

యోగం:వ్యాఘాతం సా6.57 వరకు

కరణం:బాలువ మ2.05 వరకు తదుపరి కౌలువ రా12.53 వరకు

వర్జ్యం:ఉ.శే.వ6.26వరకు & రా2.33 - 4.03

దుర్ముహూర్తము:ఉ8.25 -9.10 &

రా10.28 - 11.20

అమృతకాలం:మ1.54 - 3.23

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్య రాశి   : వృశ్చికం

చంద్రరాశి   : మకరం 

సూర్యోదయం:6.09

సూర్యాస్తమయం:5.21


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

⚜ శ్రీ గంగేశ్వర్ మహాదేవ్ మందిర్

 🕉 మన గుడి : నెం 245



⚜ గుజరాత్ : డియూ


⚜ శ్రీ గంగేశ్వర్ మహాదేవ్ మందిర్


💠 దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత శివాలయాల గురించి మనందరికీ తెలుసు, కానీ గుజరాత్ లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం, సోమనాధ్ కు 90 కిమీ దూరం లో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం 'డియూ'లో అరేబియా మహాసముద్రం ఒడ్డున కొలువై ఉన్న పాండవ ప్రతిష్ఠిత పురాతన, ప్రాచీన దివ్యక్షేత్రం "శ్రీ గంగేశ్వర్ మహాదేవ్".ఆలయం  గురించి మనలో చాలా మందికి తెలియదు.


💠 గంగేశ్వరుడు అనే పేరు గంగా మరియు ఈశ్వర్ నుండి ఉద్భవించింది , దీని అర్థం గంగ యొక్క ప్రభువు అని .

 గంగానది స్వర్గం నుండి భూమిపైకి దిగుతున్నప్పుడు , ఆమె విపరీతమైన ప్రవాహం నుండి భూగ్రహాన్ని రక్షించడానికి శివుడు ఆమె జలాలను తన జాటాజూటంలో బందించాడు.

అందుకే, శివుడిని గంగాధర్ లేదా గంగాేశ్వర్ అని కూడా అంటారు. 


💠 మహాభారత కాలంలో స్థాపించబడిన ఇటువంటి శివలింగాలు భారతదేశంలో చాలా ఉన్నాయి.  వాటిని పాండవులు స్వయంగా స్థాపించారని నమ్ముతారు.  

ఈ ఆలయంలో 5 శివలింగాలు కలిసి ఉన్నాయి.  

పాండవులు తమ వనవాసం  సమయంలో ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్టించారని నమ్ముతారు.


💠 సాంప్రదాయం ప్రకారం, ఈ ఆలయం 5000 సంవత్సరాల పురాతనమైనదిగా నమ్ముతారు, అయితే ఈ తేదీని నిర్ధారించడానికి ఈ ప్రదేశంలో ఎటువంటి పురావస్తు శాశనాలు దొరకలేదు.


💠 సముద్రపు అలలు శివలింగానికి జలాభిషేకం చేసే అనేక శివాలయాలు భారతదేశంలో ఉన్నాయి.  

గంగేశ్వర్ మహాదేవ్ అని పిలువబడే ఈ ప్రసిద్ధ శివాలయంలో ఐదు శివలింగాలు ఉన్నాయి, ఇక్కడ సముద్రపు అలలు ఈ శివలింగాలను ఢీకొట్టి, వాటిపై జలాభిషేకం చేసిన తర్వాత తిరిగి వస్తాయి.  అలాంటి దేవాలయం గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో కూడా ఉంది.  కొలియాక్ తీరానికి 3 కిమీ దూరంలో అరేబియా సముద్రంలో నిష్కలంక్ మహాదేవ్ ఆలయం ఉంది.  ఈ ఆలయంలో కూడా సముద్రపు అలలు తమ నీటిని శివలింగంపై సమర్పిస్తాయి.  

ఇక్కడ ప్రజలు ఆటుపోట్లు తగ్గే వరకు వేచి ఉండి, ఆపై దర్శనం కోసం కాలినడకన ఆలయంలోకి వెళతారు.  ఒక్కోసారి అలలు చాలా ఎత్తుకు ఎగసిపడుతుంటాయి కాబట్టి గుడిలోని జెండా మరియు స్తంభాలు మాత్రమే కనిపిస్తాయి.


⚜చరిత్ర ⚜


💠 గంగేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుని 5 స్వయంభూ శివలింగాల ముందు నంది విగ్రహం కూడా ఉంది.  మొత్తం 5 శివలింగాలు చతురస్రాకార వేదికపై నిర్మించబడ్డాయి.  

వారి చరిత్ర మహాభారత కాలానికి సంబంధించినది.  

మహాభారత యుద్ధం ముగిసిన తరువాత, పాండవులు తమ బంధువులను చంపినందుకు అపరాధభావంతో చాలా బాధపడ్డారని చెబుతారు.  

శ్రీ కృష్ణుని సలహా ప్రకారం, ప్రస్తుత గుజరాత్‌లో ఉన్న కొలియాక్ తీరం దాటి శివుని గురించి ధ్యానం చేయడం మరియు తపస్సు చేయడం ప్రారంభించారు.  భగవంతుడు భోలేనాథ్ వారి తపస్సుకు సంతోషించి ఐదుగురు సోదరులకు వేర్వేరు లింగ రూపాలలో కనిపించాడు.  


💠 పాండవులు 12 సంవత్సరాల పాటు హస్తినాపూర్ రాజ్యం నుండి బహిష్కరించబడినప్పుడు పాండవులు తమ ఆహారం తినే ముందు శివుడిని ఆరాధించే ప్రదేశం కోసం వెతుకుతున్నారు. 

వారు ఈ స్థలాన్ని కనుగొన్నారు మరియు ఐదు శివలింగాలను సముద్ర తీరంలోని రాతి ఉపరితలంపై ఐదుగురు పాండవ సోదరులు - యుధిష్ఠిర, భీమా, అర్జునుడు, నకుల మరియు సహదేవులు వాటి పరిమాణాలను బట్టి ఉంచారు. 

అతిపెద్దది భీమునిచే నిర్మించబడింది, మిగిలినవి అతని అన్నయ్య యుధిష్ఠిరుడు మరియు తమ్ముళ్ళు అర్జునుడు, నకులుడు మరియు సహదేవులచే ఈ క్రమంలో స్థాపించబడ్డాయి


💠 5 శివలింగాలు ఇప్పటికీ ఉన్నాయి.  

ఈ శివలింగాన్ని నిర్మించిన వేదికపై చిన్న నీటి కొలను చెరువు కూడా ఉంది.  

దీనిని పాండవుల చెరువు అంటారు.  

ఇందులో భక్తులు ముందుగా కాళ్లు చేతులు కడుక్కుని శివలింగాలకు పూజలు చేస్తారు.


💠 ఈ లింగాలు సాధారణంగా అధిక ఆటుపోట్ల సమయంలో సముద్రంలో మునిగిపోతాయి మరియు తక్కువ అలల సమయంలో మాత్రమే కనిపించే అవకాశం ఉంటుంది.  

సముద్ర తీరంలో శివలింగం ఉన్నందున ఈ ఆలయాన్ని 'సీషోర్ టెంపుల్' అని కూడా పిలుస్తారు.


💠 సముద్రంలో అలలు వచ్చినప్పుడు ఈ శివలింగాలు సముద్రపు నీటిలో నిమజ్జనం అవుతాయి.  ఈ దృశ్యం చాలా అందంగా ఉంది.  దానిని చూస్తుంటే సముద్రమే తన అలలతో శివుని పాదాలను పూజిస్తున్నట్లు అనిపిస్తుంది.


💠 చిన్నపాటి మెట్ల మార్గం ద్వారా భక్తులు, పర్యాటకులు గుహను చేరుకుంటారు. 

నాచుతో మార్గం కప్పబడిఉంటుంది. 

జారుతూ ఉండే మార్గంలోనే భక్తితో స్వామిని దర్శిస్తారు భక్తులు. 

పర్యాటకులు, భక్తులే అర్చకులుగా మారి, నిత్యపూజలు నిర్వహిస్తారు. 

అర్చకులు వేరేగా ఉండని దేవాలయం.


💠 శివయ్యతో పాటు పార్వతీమాత, గణపతి, హనుమ, నందీశ్వరుడు, శిలారూపం లో పొడవైన ఫణిరాజు దర్శనమిస్తారు. 


💠 కొద్దిపాటి జలం శిరస్సుపై ప్రోక్షించినా పరవశించే అంబాపతి నిత్యం సాగరజలాల మధ్య 5000 సంవత్సరాలకు పైగా కొలువై ఉండి భక్తులను, పర్యాటకులను అనుగ్రహిస్తున్న  అద్భుతం దర్శించి పరవశించి, తరిస్తారు భక్తజనం...


💠 ఈ పురాతన హిందూ దేవాలయం గుజరాత్ లోని ఫుడామ్ గ్రామంలో డియు నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Respect


 

కార్తికపురాణం

 *కార్తికపురాణం*

🌸🌿🌸🌿🌸🌿🌸🌿


*శ్రీ హరి నామస్మరణా ధన్యోపాయం*


వశిష్టుడు చెప్పిన దంతా విని' మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్ని౦టిని శ్రద్దగా వింటిని. అందు ధర్మము బహు సుక్ష్మ మనియు, పుణ్యం సులభ౦గా కలుగు ననియూ, అది- నదీస్నానము, దీపదానము, ఫలదానము అన్నదానము, వస్త్ర దానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప దర్మములచేతనే మోక్షము లబించుచుండగా  వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులె చెప్పు చుందురు గదా! మరి తమరు యిది సూక్ష్మములో  మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము  కలుగుచున్నది. దుర్మార్గులు  కొందరు సదాచారములను పటింపక, వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులగు 

మహా పాపములు చేయువారు యింత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్ధించు చున్నాను'యని కోరెను.


అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి .' జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే, నేను వేద వేదంగ ములను కూడా పటి౦చితిని. వానిలో కూడా సుక్ష్మ మార్గాలున్నవి. అవి యేమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక, మనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్త్వమను గుణము జని౦చి ఫలమంతయును పరమేశ్వరర్పితము కావించి, మనో వాక్కాయ కర్మలచె నొనర్చిన ధర్మము అ ధర్మమందు యె౦తటా ఆధిక్యత కలదు.  సాత్త్విక ధర్మము సమస్త పాపములను నాశన మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్ర మున కలియు తావునందు స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగ ధగ మెరిసి, ముత్యమగు విధానముగా సాత్త్వికత వహించి, సాత్త్విక ధర్మ మాచరించుచూ గంగ, యమునా, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలుగు పుణ్య కాలముల యందు దేవాలయముల యందు- వేదములు పటించి, సదచారుడై, కుటి౦బీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్ప దానము చేసిననూ, లేక ఆ నదీ తీరమందు న్న  దేవాలయం లో జపత పాదు లొనరించినను విశేష ఫలమును పొందగలరు.

రాజస ధర్మమ మనగా- ఫలాపేక్ష  కలిగి శాస్త్రోక్త  విధులను విడిచి చేసిన దర్మం. ఆ ధర్మం పునర్జన్మ  హేతువై కష్ట సుఖాలు కలిగించున దగను.

తామస ధర్మమనగా - శాస్త్రోక్త  విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.

దేశకాల పాత్రము సమ కూడిన పుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భ స్మమగునట్లు శ్రీ మన్నా నారాయుణుని నామము, తెలిసి గాని, తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.


*ఆజా మీళుని కథ*


పూర్వ కాలమందు కన్యా కుబ్జ మను నగరమున నాల్గు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్య వ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమ వతియను భార్య కలదు. ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి అ పూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలాకాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారాబాలుని అతి గారాబముగా పెంచుచు, అజా మీళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దిన దిన ప్రవర్ధ మానుడగుచు అతి గారాబము వలన పెద్దలను కూడ నిర్లక్షముగా చూచుచు, దుష్ట సావసములు చేయుచు, విద్య నభ్య సింపక, బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించు చుండెను. ఈ విధముగా కొంత కాలమునకు యవ్వనము రాగా కమంధుడై, మంచి చెడ్డలు మరిచి, యజ్ఞో పవితము త్రెంచి, మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీ ని వలచి, నిరంతరము నామెతోనే కామా క్రీడలలో తేలియాడుచూ, యింటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె యి౦ టనే భుజించు చుండెను. అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా! తామ బిడ్డలపై యెంత అనురాగామున్ననూ పైకి తెలియ పర్చక చిన్ననాటి నుంచీ అదుపు ఆజ్ఞలతో నుంక పోయిన యెడల యీ విధంగానే జురుగును. కావున ఆజామీళుడు కుల భ్రష్టుడు కాగా, వాని బంధువుల తనని విడిచి పెట్టిరి. అందుకు ఆజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను, జంతువులను చంపుతూ కిరాత వృత్తి లో జీవించు చుండెను. ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫ రములు కోయుచుండగా ఆ స్త్రీ తెనేపట్టుకై చెట్టే క్కి తేనెపట్టు తియబోగా కొమ్మ విరిగి క్రింద పది చనిపోయెను. ఆజామీళుడు ఆ స్త్రీ పైబడి కొంత సేపు యేడ్చి, తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామంధ కారాముచె కన్ను మిన్ను గానక ఆజా మీళుడు ఆ బాలికను కూడ చేపట్టి ఆమెతో కూడ కామ క్రీడలలో తేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడ కలిగిరి. ఇద్దరూ పురిటి లోనె చచ్చిరి. మరుల ఆమె గర్భము దరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి 'నారాయణ'అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన నూ ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్ళినా వెంట బెట్టుకుని వెళ్ళు చూ, ' నారాయణా-నారాయణా' అని ప్రేమతో సాకు చుండిరి. కాని ' నారాయణ'యని స్మరించిన యెడల తన పాపములు నశించి, మోక్షము పొంద వచ్చునని మాత్ర మతానికి తెలియకుండెను. ఇట్లు కొంత కాలము జరిగిన తర్వాత అజా మీళునకు శరీర పటుత్వము తగ్గి రోగ గ్రస్తుడై 

మంచము పట్టి చావునకు సిద్ద పడి యుండెను. ఒకనాడు భయంకరాకారములతో, పాశాది ఆయుధములతో యమ భటులు ప్రత్యక్ష మైరి. వారిని చూచి అజా మీళునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక ' నారాయణా" నారాయణా' యనుచునే ప్రాణములు విడిచెను. అజా మీ ళుని నోట ' నారాయణా' యను శబ్దము వినబడగానే యమ భటులు గడ గడ వణక సాగిరి. అదే వేళకు దివ్య మంగళ కారులు శంఖ చక్ర గదా ధరులూయగూ శ్రీ మన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి ' ఓ యమ భటులారా! వీడు మావాడు మేము వీనిని వైకు౦ టమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి'యని చెప్పి, అజా మీళుని విమాన మెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు ' అయ్యా! మీ రెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమి చ్చటికి వచ్చితిమి గాన, వానిని మాకు వదలుడని కొరగా విష్ణు దూతలు యిట్లు చెప్పదొ డ౦గిరి.


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి*

*ఎనిమిదో అధ్యయము- ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.*🌸🌿🌸

*కార్తిక పురాణము-9*

 *కార్తిక పురాణము-9*


*కార్తిక పురాణము- తొమ్మిదవ అధ్యాయము*


విష్ణుదూతలడిగిరి.ఓ యమదూతలారా! మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీయమదండనకు ఎవ్వడు తగినవాడు? పుణ్యమనగా ఏమి? ఈవిషయములన్నిటిని మాకు చెప్పమని విష్ణుదూతలడుగగా యమదూతలు ఓ విష్ణుదూతలారా! సావధానముగా వినుడు.


సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు.


మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను చేసిన వానిని దండింతుము. వేదమార్గమును వదలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు, వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదములచేత తన్నువాడును, తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని, నిత్యము అబద్ధమాడుచు జంతువులను జంపుచు కులాచారములను వదిలినవారిని, ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్నవానిని, డాంబికుని, దయాశాంతులు లేనివానిని

భార్యతో క్రీడించువానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యములను చెప్పువానిని మేము దండింతుము.


నేను దాతనని చెప్పుకొనువానిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరచిన వానిని అపకారమును చేయువానిని మేము దండింతుము.వివాహమును చెరుచువానిని, ఇతరుల సంపత్తులను జూచి అసూయపడువానిని మేము దండింతుము. పరుల సంతానమును జూచి దుఃఖించువానిని కన్యాశుల్కముల చేత జీవించువానిని,

చెరువును, నూతిని, చిన్న కాలువలను నిర్మించు వ్యాపారమును మార్పించు వానిని, నిర్మితములయిన వాటిని చెరుచు వానిని మేము దండింతుము.


మోహముచేత మాతాపితరుల శ్రాద్ధమును విడచినవానిని, నిత్యకర్మను వదలిన వానిని మేము దండింతుము. పరపాకపరిత్యాగిని, పరపాకరతుని, పితృశేషాన్నమును భుజించువానిని మేము దండింతుము.


పరపా పరిత్యాగియనగా తానువండిన అన్నములో ఇతరులకు ఎంతమాత్రము పెట్టక తానే అంతయు భుజించువాడు, పితృశేషాన్నభోక్తయనగా శ్రాద్ధభోక్తలు భుజించిన తరువాత మిగిలిన అన్నమును భుజించువాడు, ఇతరులు దానము చేయు సమయాన ఇవ్వవద్దని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణునకివ్వని వానిని, తన్ను శరణుజొచ్చిన వానిని చంపువానిని మేము దండింతుము.


స్నానమును, సంధ్యావందనమును విడుచువానిని, నిత్యము బ్రాహ్మణనిందకుని బ్రాహ్మణహంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని మేము దండింతుము. ఈమొదలయిన పాతకములను చేయు మానవులు యమలోకమున మాచేత యాతనలను పొందుదురని చెప్పారు. ఈ అజామీళుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీ సంగలోలుడై పుట్టినది మొదలు చచ్చువరకు పాపములను చేసినాడు.ఇతనిచే చేయబడిన పాపములకు మితిలేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును?


ఈ ప్రకారముగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునగవుతో వికసించిన ముఖపద్మములు గలవారై మేఘ సమాన గంభీరధ్వనితో నిట్లనిరి. ఏమి ఆశ్చర్యము! మీరింత మూఢులు.ధర్మమర్యాదను మేము చెప్పెదము. సావధానముగా వినుడు.


దుస్సంగమును విడుచువాడు, సత్సంగము ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మ చింతనమును చేయువాడు యమదండార్హుడుగాడు. స్నాన సంధ్యావందనములు ఆచరించువాడును, జపహోమాదులు ఆచరించువాడును, సర్వభూతములందు దయావంతుడును యమలోకమును పొందడు.సత్యవంతుడై అసూయా దోషరహితుడై జపాగ్ని హోత్రములను జేయుచు కర్మల ఫలములను బ్రహ్మయందుంచినవాడు యమదండార్హుడుగాడు. కర్తృభోక్తృత్వాదులను సగుణపరమేశ్వరునియందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటయే తాత్పర్యముగా కలవాడు యమమందిరానికి వెళ్ళడు.


అన్నదానమాచరించువాడును, జలదాతయు, గోదానకర్తయు, వృషోత్సర్గకర్తయు యమలోకమును పొందడు. వృషోత్సర్గము=ఆబోతును అచ్చుపోసి వదలుట. విద్యను గోరినవారికి విద్యాదానమాచరించువాడు, పరోపకారమందాసక్తి గలవాడును యమలోకమును పొందడు.


హరిని బూజించువాడును, హరినామమును జపించువాడును, వివాహములను ఉపనయనములను చేయువాడును, యమలోకమును పొందడు. మార్గమధ్యమందు మండపములు కట్టించువాడు, క్రీడాస్థానములను గట్టించువాడు, దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారమును చేయించువాడు యమలోకమును పొందడు. నిత్యము సాలగ్రామ అర్చనమాచరించి ఆతీర్థమును పానముజేసి దానికి వందనమాచరించువాడు యమలోకమును పొందడు.


తులసీ కాష్ఠమాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడును సాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు. భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను, గృహమందుంచుకొన్నను యమలోకమును పొందడు. సూర్యుడు మేషతులా మకర సంక్రాంతులయందుండగా ప్రాతః స్నానమాచరించు వారు యమలోకమును పొందరు.


రుద్రాక్షమాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యము అచ్యుత, గోవింద, అనంత, కృష్ణ, నారాయణ, ఓ రామా! అని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు.


కాశియందు మణికర్ణికాఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతినొందినయెడల వాడు సర్వపాపములు చేసినవాడయినను యమలోకమును పొందడు. దొంగ, కల్లుత్రాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణహంత, గురుభార్యరతుడు, స్త్రీహత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య, చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన యెడల పాపవిముక్తులగుదురు.


మహిమను తెలుసుకొనిగాని, తెలియకగాని, మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములయినను ముక్తులగుదురు. పడినప్పుడును, తొట్రుపాటు బొందినప్పుడును, కొట్టబడినప్పుడును, జ్వరాదులచేత పీడింపబడినప్పుడును, సప్తవ్యసనములచే పీడింపబడునప్పుడును, వశముకానప్పుడును హరి హరీయని అన్నయెడల యమయాతన పొందడు. అనేక జన్మలలో సంపాదింపబడి ప్రాయశ్చిత్తములు లేక కొండలవలె పెరిగియున్న పాపములన్నియు భూమియందుగాని, స్వర్గమందుగాని హరినామసంకీర్తనము చేత నశించును.


మరణావస్థలో ఉన్నవాడు హరినామస్మరణమును చేసినయెడల వాని పాపములన్నియు అగ్నిలోనుంచిన దూదివలె నశించును. విష్ణుదూతలిట్లు యమదూతలతో పలికి అజామీళుని యమదూతలవలన విడిపించిరి. తరువాత అజామీళుడు విష్ణుదూతలకు నమస్కారము చేసి మీ దర్శనము వలన నేను తరించితిని అనెను. తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకుబోయిరి.


తరువాత అజామీళుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంతకష్టమాయెను. ఆత్మహితము చేసికొనలేకపోతిని. ఛీ ఛీ నాబ్రతుకు సజ్జననిందితమాయెనుగదా! పతివ్రతయైన భార్యను వదలివేసి కల్లుద్రాగెడి ఈదాసీభార్యను స్వీకరించితినిగదా! వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యాత్ములయిన మాతాపితరులను నీచుడనై విడిచితిని గదా! అయ్యో ఎఃత కష్టము,ధర్మమును చెరుచువారు కాముకులు నిరంతరమనుభవించెడి నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడెడివాడను.


ఇదియేమి ఆశ్చర్యము. ఇది స్వప్నమా. ఆనల్లకత్తులను ధరించిన యమభటులెట్లు పోయిరి? నేను పూర్వజన్మమందు పుణ్యమాచరించినవాడను ఇది నిజము. అట్లుగానిచో దాసీపతియైన నాకు మరణకాలమందు హరిస్మృతి యెట్లుగలుగును.


నా జిహ్వహరినామమును యెట్లు గ్రహించును? పాపాత్ముడైన నేనెక్కడ, అంత్యకాలమందీ స్మృతియెక్కడ? సిగ్గువిడిచి బ్రాహ్మణులను చంపు నేనెక్కడ, మంగళకరమయిన నారాయణ నామమెక్కడ? అజామీళుడిట్లు విచారించి నిశ్చలమైన భక్తినిబొంది జితేంద్రియుడై కొంతకాలముండి సాయుజ్యముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామకీర్తన గావించువాడు సమస్తపాపవిముక్తుడై వైకుంఠలోకము పొందుదురు. ఇందుకు సందియము లేదు.


*ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే నవమోధ్యాయసమాప్తః*

*21-11-2023* *రాశి ఫలితాలు

 *21-11-2023*

 *రాశి ఫలితాలు*

*మంగళ వారం భౌమ వాసరః*

*మేషం*

ధన వ్యవహారాలను అనుకూలంగా  సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

*వృషభం*

కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

*మిధునం*

బంధు మిత్రులతో ఆకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.  కుటుంబసభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో  సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలుగుతుంది. ఇతరుల  విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

*కర్కాటకం*

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పరిస్థితి వంట నిరుత్సాహపరుస్తుంది.  ఇంటాబయటా చికాకులు తప్పవు. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.  నిరుద్యోగ యత్నాలు మందగిస్తాయి.

*సింహం*

దూరపు బంధువుల ఆగమనం ఆశ్చర్యం కలిగిస్తుంది. బంధు మిత్రులతో పాత విషయాల గూర్చి చర్చలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.  ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి. 

*కన్య*

నూతన పరిచయాలు విస్తృతం అవుతాయి. వివాహాది శుభకార్యాలకు  కుటుంబ సభ్యులతో హాజరవుతారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు సాధ్యమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. 

*తుల*

కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాలలో వివాదాలు తప్పవు. రుణ ఒత్తిడి అధికమవుతుంది. శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తికావు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర  ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగము అధికారులతో చర్చలు ఫలించవు. 

*వృశ్చికం*

అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. దూరప్రాంత మిత్రుల నుండి అందిన సమాచారం మానసిక బాధను కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. 

*ధనస్సు*

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.  నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. 

*మకరం*

చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. వ్యాపార మన భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. సంతానం  విద్యా పరంగా మరింత సారించడం మంచిది.

*కుంభం*

నిరుద్యోగ  ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. బంధువర్గం నుండి  ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి  ఉద్యోగాలలో అవరోధాలను అధిగమించి పదోన్నతులు పొందుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

*మీనం*

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు.  నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ప్రతిఫలం  ఉండదు. ఆకస్మికప్రయాణ సూచనలు  ఉన్నవి వ్యాపార ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని  ఇబ్బందులు ఎదురవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

🕉️