31, జులై 2024, బుధవారం

తెలుగు పరీక్ష

 *" తెలుగు పరీక్ష 😊 "* 


*సమాధానాలలో  పదానికి  చివర "తి " మాత్రమే  రావలెను!!* 

*ప్రయత్నించండి* 


1) ఒక  నది పేరు 

2) ఒక పుణ్య క్షేత్రం  

3) ఒక గ్రహము  

 4) ఒక తిథి  

5) ఓరుగల్లు నేలిన రాజుల ఇలవేల్పు   

6) ఒక  తెలుగు  సంవత్సరం

7 అసోమ్ లో ఒక పట్టణం  

8) భార్య 

9) ఒక నక్షత్రం  

10) నారదుని వీణ 

11) ఇంద్రుడు  

12) విష్ణుమూర్తి మెడలోనిమాల

13) శివుని  సతి

14)మానవుని దేహంలో ఒక అవయవం  

15) ఒక పూల తీగ 

16) చిన్న పిల్లల ఆట వస్తువు 

17) ధైర్యం  

18) ఏడుకొండల వాడు  

19) కృష్ణుని  సతి  

20) ఒక  వాహనం  

21) ఒక ఋషి పత్ని  

22) జటాయువు సోదరుడు  

23) దుర్యోధనుని  ఇల్లాలు  

24) హరిశ్చంద్రుని  భార్య  

25) బలరాముని  పత్ని


సమాదానలు వ్రాసి కామెంటులొ పెట్టండి. మీ పేరు ఫొను నెంబరు వ్రాయటం మరవకండి

*శ్రీ రంగనాథస్వామి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 395*


⚜ *కర్నాటక  :  శ్రీరంగపట్నం- మండ్యా*


⚜ *శ్రీ రంగనాథస్వామి  ఆలయం*



💠 పురాణాల ప్రకారం, భక్తులు ఆధ్యాత్మిక ముక్తిని పొందే ప్రధాన ఆలయాలలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఒకటి. 

కావేరి నది తన మార్గంలో శివనసముద్రం, శ్రీరంగపట్నం మరియు శ్రీరంగం అనే మూడు ద్వీపాలుగా ఏర్పడిందని నమ్ముతారు. 

ఈ ప్రదేశాలలో ఒకే రోజున మూడు ఆలయాలను సందర్శించిన భక్తులు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు అని

గట్టి నమ్మకం.


💠 ఆలయ ప్రధాన దేవత శ్రీ రంగనాథుని అవతారంలో ఉన్న విష్ణువు కాబట్టి ఈ పట్టణానికి ఈ పేరు వచ్చింది.


💠 రంగనాథస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాలలో ఒకటి మరియు శ్రీరంగపట్నంలో సందర్శించవలసిన ప్రధాన ప్రదేశాలలో ఒకటి . ఈ ఆలయం పంచరంగ క్షేత్రాలలో ఒకటి, మిగిలిన నాలుగు...

శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం, కుంభకోణంలోని సారంగపాణి ఆలయం, తిరుచ్చిలోని అప్పకుదతన్ ఆలయం మరియు మైలాడుతురైలోని పరిమళ రంగనాథస్వామి ఆలయం. 


💠 శ్రీరంగపట్నాన్ని ఆది రంగం అని, శ్రీరంగం అంత్య రంగం అని, కర్ణాటకలోని శివసముద్రంను మధ్యరంగం అని కూడా పిలుస్తారు.


💠 పురాణాల ప్రకారం, గౌతమ మహర్షి ఈ ప్రదేశంలో మహావిష్ణువును శయన భంగిమలో దర్శనం చేసుకోవడానికి కఠోర తపస్సు చేసాడు. తన భక్తుడిని ఆశీర్వదించడానికి, విష్ణువు తనను తాను ఈ ప్రదేశంలో రంగనాథ స్వామిగా శయనించిన రూపంలో దర్శనం ఇచ్చాడు.

రాబోయే యుగాలలో భక్తులు తనను ప్రార్థించగలిగేలా శాశ్వతంగా ఇక్కడే ఉండమని గౌతమ మహర్షి కోరగా, దేవుడు అక్కడ విగ్రహ రూపంలో ఉన్నాడు. 


💠 ఈ ఆలయానికి సంబంధించి ఇంకొక పురాణగాథలు ఉన్నాయి.  

ఈ క్షేత్రం వద్ద ప్రవహించే కావేరి నది వైకుంఠంలోని నది వలె పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.  

శ్రీ రంగనాథస్వామి విగ్రహం మానవ నిర్మితం కాదు.  శ్రీ రంగనాథ భగవానుడు ఈ ప్రదేశంలోనే మూర్తిగా వెలిశాడు.  


💠 ఒకసారి కావేరి నది శ్రీ మహావిష్ణువు ఆదిశేష మరియు మహాలక్ష్మి సమేతంగా తనపై విశ్రమించమని తపస్సు చేసింది.  

ఆమె తపస్సుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై ఉన్న శ్రీ రంగనాథస్వామి విగ్రహాన్ని ధరించాడు.


💠 శ్రీరంగపట్టణం అనాదిగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. విజయనగర పాలకుల కాలంలో ఇదొక అతిపెద్ద సామంతరాజ్యంగా పేరొందింది.

 మైసూరు, తలకాడు  రాజ్యాలు కూడా ఈ కావేరీ పట్టణం అదుపాజ్ఞల కిందే ఉండేవి. విజయనగర సామ్రాజ్య ప్రాబల్యం క్షీణించిన తరువాత ఇది మైసూరు ప్రభువుల పాలన కిందికి వచ్చింది. 


💠 1610 నుంచి 1947 లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు శ్రీరంగ పట్టణం మైసూరు రాజ్యంలోని అంతర్భాగంగానే ఉండేది.

 

💠 మైసూరుకు కేవలం 15 కిమీ దూరంలోనే ఉన్నప్పటికీ ఇది పక్క జిల్లా అయినట్టి మండ్య లో ఉంది.

894 లో ఇక్కడ గంగ రాజ్యపాలకుడు తిరుమల రాయడు అనే రాజు నిర్మించిన శ్రీ రంగనాథస్వామి ఆలయం సుప్రసిద్ధం. 


💠 మొత్తం కర్ణాటక రాష్ట్రంలోనే అతిపెద్ద రంగనాథుడి విగ్రహం ఈ ఆలయంలోనే ఉంది. శేష తల్పం మీద శయనించిన కారణంగా శ్రీ రంగనాథుడిని శేషతల్ప శాయి అనికూడా అంటారు.


💠 ఆలయ ముఖద్వారాన్ని నవరంగ ద్వారం అంటారు. దానికి ఇరువైపులా ద్వారపాలకులైన జయవిజయుల విగ్రహాలు చెక్కబడ్డాయి. ఆలయ ప్రాంగణం, అక్కడి స్తంభాలు హోయసల పాలకుల నిర్మాణాలని భావిస్తున్నారు. 

ప్రధాన ప్రవేశద్వారం దగ్గరున్న నాలుగు స్తంభాలు విజయనగర పాలనాకాలంలో నిర్మించినవి. వాటి మీద విష్ణువు 24 రూపాలు చెక్కబడ్డాయి. 

రంగనాయకి, నరసింహస్వామి , సుదర్శన, గోపాలకృష్ణ, రామాలయాలు,  శ్రీనివాస ఆలయం, రామానుజ దేశికుల మంటపం కూడా మనం ఈ ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు.


💠 విజయనగర పాలకుల కాలంలో ప్రతిష్ఠ చేయబడిన ఇక్కడి సుప్రసిద్ధ ఏకశిలా గరుడ స్థంభం చూడదగినట్టిది.

ఆలయ ప్రవేశానికి అటూ ఇటూ ఉన్న రెండు ముచ్చటైన ఏనుగు విగ్రహాలు హోయసల పాలకుల కాలం నాటివని భావిస్తున్నారు.


💠 ఆలయ స్థంభాల మీద నరసింహుడు, ఆంజనేయుడు, శంఖ చక్రాల మూర్తులు చెక్కబడ్డాయి.


💠 గర్భగుడిలో, విష్ణుమూర్తి పాము ఆదిశేషునిపై, పాము యొక్క ఏడు పడగలపై ఏర్పడిన పందిరి క్రింద, అతని భార్య లక్ష్మి అతని పాదాల వద్ద ఉంది.  

పక్కనే ఉన్న ఇతర దేవతలు;  

శ్రీదేవి, భూదేవి మరియు బ్రహ్మ.

 నరసింహ, గోపాలకృష్ణ, శ్రీనివాస, హనుమంతుడు, గరుడ మరియు ఆళ్వార్ లకు అంకితం చేయబడిన ఇతర చిన్న మందిరాలు ఈ సముదాయంలో ఉన్నాయి.


💠 మైసూర్ నుండి 14 కి.మీ దూరంలో ఉంది. బెంగళూరు నుండి ఈ పట్టణం 125 కి.మీ దూరంలో ఉంది.

భార్య ఇంటికి ఆభరణం!!*

 భార్య ఇంటికి ఆభరణం!!* 

(నేడు ప్రపంచ వివాహ దినోత్సవం)

* భరించేది భార్య,

* బ్రతుకు నిచ్చేది భార్య,

* చెలిమి నిచ్చేది భార్య 

* చేరదీసేది భార్య 

* ఆకాశాన సూర్యుడు    లేకపోయినా...

ఇంట్లో  భార్య లేకపోయినా...

అక్కడ జగతికి వెలుగుండదు,

ఇక్కడ ఇంటికి వెలుగుండదు. 

* భర్త  వంశానికి సృష్టికర్త 

* మొగుడి అంశానికి మూలకర్త,

*కొంగు తీసి ముందుకేగినా...

* చెంగు తీసి మూతి తుడిచినా...ముడిచినా..

తనకు లేరు ఎవరు సాటి 

* ఇలలో తను లేని ఇల్లు...  కలలో....

ఊహకందని భావన...

* బిడ్డల నాదరించి...

* పెద్దల సేవలో తరించి

* భర్తని మురిపించి..

మైమరపించి...

* బ్రతుకు మీద ఆశలు పెంచి... 

* చెడు ఆలోచనలు త్రుంచి...

* భ్రమరం  లా ఎగురుతూ...

* భర్త ను భ్రమల నుండి క్రిందకు దించుతూ...

* కళ్ళు కాయలు కాచేలా...

*  భర్త  జీవితాన పువ్వులు పూచేలా చేసిన

జీతం లేని పని మనిషి.

 

జీవితాన్ని అందించే మన మనిషి.

 ... 

ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం 

ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప.. 


ఒకరికి ఒకరు తోడు నీడ చిరకాలం. 


బిడ్డల బాధ్యతలు తీరాక వృద్ధాప్యంలో నూతన వసంతం తోడు నీడ బంధం. 


అదే  భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం..!

🙏🙏🙏🙏🙏🙏🙏

మహాభారత సారాంశం*

 *లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం* 


ఆణిముత్యాలు వంటి ఈ తొమ్మిది వాక్యాలలో మహాభారత సారాంశం తెలుసుకోండి.


1 మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి, మీ ఆధీనంలోంచి దూరం అవుతారు..వారి ఆధీనంలో కి మీరు వెళ్తారు.


   ఉదా *కౌరవులు.*


2. నువ్వు ఎంత బలవంతుడు అయినా,ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ..ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ.. వాటిని అధర్మం కోసం వినియోగిస్తే..అవి నిరుపయోగమవుతాయి.

  ఉదా: *కర్ణుడు*

 

3 యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యం తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది.

 ఉదా.. *అశ్వత్థామ*.


 4. పాత్ర తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది.

  ఉదా-- *భీష్ముడు.*


5.సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము  దురహంకారం తో అధర్మం గా వినియోగిస్తే వినాశం జరుగుతుంది.

ఉదా.. *దుర్యోధనుడు*


6.స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు,గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా తనవారి పట్ల వల్లమాలిన అభిమానం గల అంధునికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది.

  ఉదా:- *ధృతరాష్ట్రుడు*

 

 7. తెలివితేటలకి ధర్మం, సుజ్ఞానం తోడైతే విజయం తప్పక లభిస్తుంది.

 ఉదా: *అర్జునుడు*.


8. మోసం,కపటం, జిత్తులమారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు. 

  ఉదా: *శకుని*


9. నీవు నైతిక విలువలు పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు హానిచేయదు.

     ఉదా.. *యుధిష్ఠిరుడు*

     

 *సర్వే జనాః సుఖినోభవంతు.*

Panchaag


 

విష్ణు సహస్రనామం

 విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది🙏🏵️🙏


భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. కృష్ణుడు, ధర్మరాజుతో సహా, కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?


అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తిని అక్కడున్న వారినందిరినీ ఉద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది?" అని అడిగారు.


ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?" అని అడిగారు


ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"


స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"


మళ్ళీ నిశబ్దం.


స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు.


అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని.


"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.


శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.


"అదెలా" అని అందరూ అడిగారు.


శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.


శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస మహర్షి వ్రాసిపెట్టాడు.ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

 శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।

విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూధానం ||

హరిం నరహరరిం రామం గోవిందం దధివామనం ||

A Collection from 

Admin 

Brahmana Samaakhya

మొటిమల నివారణ

 మొటిమల నివారణ కొరకు  - 


      వేపాకులు , స్వచ్చమైన పసుపు , పాలు , సెనగపిండి వీటిని సమబాగాలుగా నూరి పేస్ట్ లా చేసి దానిని ముఖానికి ఒత్తుగా పట్టించి ఆరిన తరువాత గొరువెచ్చని నీటితో కడుగుతూ ఉంటే మొటిమలు నివారించును.


 గమనిక - మగవారు కేవలం మొటిమల పైన మాత్రమే రాయవలెను.


  

       ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కర్ణుడు కనక స్వార్థపరుడు అయితే

 6 అనే సంఖ్యను నా వైపు నుండి చూస్తే.. 6 లాగా ..మీ వైపు నుండి చూస్తే 9 లాగా కనపడుతుంది ..


మన ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అంటే ఎవరైనా ఏమ్ చెప్పగలరు ... ఇద్దరూ కరక్టే అని చెప్తారు...


ధర్మరాజు కి అస్త్ర శస్త్రాలలో నైపుణ్యం తక్కువ ..


భీముడు కేవలం గదా యుద్ధంలో మాత్రమే నైపుణ్యం కలవాడు ...


నకుల సహదేవులలో ఒకరు అశ్వ శాస్త్రం లో నిపుణుడు .. మరొకరు. కత్తి యుద్ధంలో నైపుణ్యుడు... 


కేవలం అర్జునుడు మాత్రమే విలు విద్యలో నైపుణ్యం కలవాడు ...


మాలో ఏ ఒక్కరితో అయినా సరే యుద్ధం చేసి గెలవమని చెప్పినప్పుడు.. 

కర్ణుడు అర్జునుడిని కాక వేరెవ్వరిని ఎన్నుకున్నా ..అది న్యాయం కాదు ...


అలాగే ..కర్ణుడు కౌరవుల పక్షం వీడి ..పాండవుల పక్షానికి వస్తె మహారాజుని చేస్తా అని కూడా కృష్ణుడు చెప్పినట్లు ..మనం చదువుకున్నాము...


కర్ణుడు కనక స్వార్థపరుడు అయితే.. పాండవుల పక్షానికి వెళ్ళేవాడు కదా !!  .. 


..


🙏🙏🙏

శ్రీరాముణ్ణి అందరూ అనుసరించాలి*

 *శ్రీరాముణ్ణి అందరూ అనుసరించాలి* 


ప్రతి ఒక్కరూ సుఖదుఃఖాలను సమంగా చూడగలిగిన దృష్టిని అలవరచుకోవాలి. కానీ మనం ఈవిధంగా ప్రవర్తించం. ఆనందం వచ్చినప్పుడు మనల్ని మనమే మర్చిపోతాం. దుఃఖం వచ్చినప్పుడు క్రుంగిపోతాం. అలా కాకుండా మనం శ్రీరాముణ్ణి అనుకరించడానికి ప్రయత్నించాలి. 

*"నిన్ను రేపు చతుస్సాగర పర్యంతమైన భూమండలానికి రాజుగా చేస్తాను"* అని శ్రీరామునితో దశరథుడు చెప్పినప్పుడు ఆయన *'సరే'* అన్నాడు. అదే దశరథుడు మరునాడు పిలిచి *"నువ్వు అన్నీ విడిచి అరణ్యానికి వెళ్ళాలి"* అని చెపితే కూడ వెనుకటి వలెనే *"సరే"* అన్నాడు. రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తాను అన్నప్పుడు ఆనందం  పరవశుడై పోలేదు. అరణ్యానికి వెళ్ళమన్నప్పుడు దుఃఖాక్రాంతుడైపోలేదు.

ధర్మమార్గంలో ఉన్నవానికి తిర్యగ్జంతువులుకూడ సహాయం చేస్తాయి. తిర్యజ్గంతువుల మాట అటుంచి సోదరుడు కూడా దుర్మార్గుణ్ణి విడిచి వేస్తాడు.

" *యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతామ్ |* 

 *అపంథానం తు గచ్చంతం సోదరోపి విముంచతి ||* 

రామాయణంలో వర్ణించిన రామరావణుల చరిత్ర ఈ విషయాన్ని స్పష్టీకరిస్తుంది. శ్రీరాముడు ఎల్లప్పుడూ ధర్మమార్గాన్ని అనుసరించాడు. కలలో కూడ అధర్మం వైపు చూడలేదు. *"ధర్మమే రాముని రూపంలో అవతరించింది"* అని వాల్మీకి వర్ణించాడు.

ఇందుకు విరుద్ధంగా రావణుడున్నాడు. అతడు మూర్తీభవించిన అధర్మం. ఒకప్పుడు విశ్వామిత్రుడు యాగం చేశాడు. దానివల్ల రావణునికి కలిగే నష్టం ఏదీ లేదు. అయినా ఈ యాగం జరగడం అతనికి ఇష్టం లేదు. అందుచేత దానికి విఘ్నం కలిగించమని వెప్పి మారీచ సుబాహుల్ని పంపాడు. అదే విధంగా దండకారణ్యంలో ఉండే మునులందరికీ అతడు చాలా కష్టాలు కలిగించాడు. ఇవన్నీ రామాయణం చదివిన వాళ్ళందరికీ తెలిసినవే. అతడు చేసిన చాలా చెడ్డపని ఏమనగా శ్రీమహాలక్ష్మీ అవతారమూ, మహా పతివ్రతా అయినా సీతా దేవిని అపహరించడం. అలాంటప్పుడు వాని సాక్షాత్సోదరుడే అయిన విభీషణుడు కూడా వానిని విడిచి పెట్టేశాడంటే ఆశ్చర్యం ఏముంది? రావణుణ్ణి అధర్మ మార్గం నుండి  తప్పించడానికి విభీషణుడు ఎంతగానో ప్రయత్నించాడు. ఎంత చెప్పినా ప్రయోజనం లేదని గ్రహించిన తరువాత *"ఏది జరగాలో  అది జరుగుతుంది. అయితే నేను మాత్రం నీవు అవలంబించిన అధర్మమార్గంలో నీకు అండగా ఉండలేను"* అని రావణునితో చెప్పి రావణుని వదిలి వేసాడు. తరువాత రాముని ఆశ్రయించి ఆయన కృపకు పాత్రుడయినాడు.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు*

విజయం



         *విజయం అంటే ఏమిటి?*

                  ➖➖➖✍️

```

మన దేశం నుండి    ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీ     లో విద్యార్థులతో మాట్లాడుతూ...    “విజయం అంటే ఏమిటి?” అని అడిగితే ఒక యువతి “విజయం అంటే దండిగా డబ్బు సంపాదించడం!”అన్నది.


అపుడు ఆ ప్రొఫెసర్ “అయితే ఇరవై ఏళ్ళక్రితం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో చెప్పండి?” అంటే ఎవరూ చెప్పలేదు.


[ఎందుకటే ప్రతి ఏడాదికీ అది మారిపోతూవుంటుంది కాబట్టి]


బ్రతకడానికి కొంత డబ్బు కావాలి కానీ, డబ్బే బ్రతుకు కాదు!                అంటే విజయమంటే డబ్బు సంపాదన కాదు అన్నమాట.

   

మరో యువకుడు లేచి “విజయం అంటే బలం/శక్తి”  అన్నాడు.


అలా అయితే అలెగ్జాండర్, నెపోలియన్, ముస్సొలిని, హిట్లర్, స్టాలిన్, బిన్ లాడెన్ ... వీళ్ళంతా బలవంతులు, ప్రపంచాన్ని గెలవాలని అనుకొన్నవారే కదా, వీళ్ళు జీవితం లో సంతోషంగా వుండగలిగారా?  వీళ్ళ జీవితాలు ఎలా గడిచి, ముగిశాయో చరిత్ర చెపుతున్నది కదా ! తన బలంతో, తన ముష్టిఘాతాలతో మహా బలవంతులను మట్టికరిపించిన మహమ్మద్ అలీ అనే ప్రపంచ చాంపియన్ బాక్సర్, తరువాత కొన్నేళ్ళకు పార్కిన్ సన్ వ్యాధి వల్ల  కాఫీకప్పును కూడా పట్టుకోలేక పోయాడు. అయితే విజయమంటే బలం/శక్తి సంపాదన కాదు అన్నమాట.


మరో యువతి “విజయమంటే ప్రఖ్యాతి, అందం!” అంది. 


“అయితే కేట్ మోస్, జీన్ ష్రింప్టన్, సోఫియాలారెన్, మార్లిన్ మన్రో ... లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా వుండేవో చాలామందికి తెలియదు.  భారత్ విషయానికొస్తే, పర్విన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ వుండేది. ఆమె ఎంత అందగత్తే అంటే, అమితాబ్ బచ్చన్ తో సహా, ఆమెను పెళ్ళి చేసుకోవాలి అని అనుకొనని హిందీ సినిమా హీరో నే లేడు. డానీ, కబీర్ బేడీ, మహేష్ భట్ లతో ఆమె ప్రేమ, పెళ్ళి నడిచి అవన్నీ విఫమయ్యాయి. ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్.. ఇలా అందరూ ఆమె వెంట పడ్డవారే. కొద్దిరోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయి, నమ్మిన వాళ్ళు మోసం చేస్తే, తాగుడుకు బానిస అయ్యి, ఒక దశలో కాలికి కురుపు లేచి, అది ఒళ్ళంతా ప్రాకి, ఏ శరీరం కోసం అయితే అంతమంది మగ వాళ్ళు పిచ్చిక్కెపోయారో, అదే శరీరమే కంపు వాసన కొడుతూవుంటే, ఆమెకు ఏదో వింతవ్యాధి వచ్చిందని, జనం ఆమెను తాళ్ళతో కట్టి, ముంబాయి వీధుల్లో లాగుకొంటూ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పడేస్తే ఆఖరుకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లోనుండి భరించలేనంత కంపు వస్తోందని కంప్లైంట్ చేస్తే, కార్పొరేషన్ వాళ్ళు వచ్చి 3 రోజులక్రితమే చనిపోయిన ఆమెను చూసి తీసుకెళ్ళి పూడ్చేసారు. అయితే అందం, ప్రఖ్యాతి అనేవి విజయం కావన్నమాట!


మరోసారి మరొకరు “విజయమంటే అధికారం” అని అన్నారు.


”అయితే కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి!” అని అంటే వున్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లూ వ్రాయలేకపోయారు.


మా అనంతపురంలో  ఒకప్పుడు రాష్ట్రపతి గా వెలిగిన సంజీవరెడ్డి గారి ఇంటిదగ్గర ఇపుడు పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి, పందులు దొర్లుతున్నాయి. విజయం అంటే అధికారం కాదు అన్న మాట.


చివరగా ఆదే ప్రొఫెసర్ భారత్ లో మరో యూనివర్సిటీ లో యువతీ యువకులను ఇదే ప్రశ్న వేసారు  - “విజయం అంటే ఏమిటి?”  అందరూ మౌనంగా వుంటే అపుడు ఆయన అన్నారు, “మీ అవ్వ తాతల పేర్లు మీకు తెలుసా?” అందరూ 'తెలుసు’ అన్నారు. “వాళ్ళ అవ్వ, తాతల పేర్లు తెలుసా?” అని అడిగితే అయిదారుమంది “తెలుసు” అన్నారు. “వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా?”


‘తెలియదు’ అన్నారు.


అపుడు ప్రొఫెసర్ గారు “శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, ఆదిశంకరుడు, అందరూ?”


”ఓ, తెలుసు!” అని ముక్తకంఠం తో బదులిచ్చారు.


”మీకు మీ స్వంత అవ్వ తాతలు గుర్తుకులేరు కానీ మీరు ఎన్నడూ చూడని వీళ్లంతా ఎలా గుర్తుకున్నారు?”అని అడిగినపుడు పద్మిని అనే ఒక యువతి, ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్లలో నీరు తిరుగుతుండగా ఇలా అంది : “సార్, మీ ప్రశ్నకు నేను జవాబు చెపుతాను. మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం, రాముడు, కృష్ణుడు, బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తువుండటానికి కారణం ఇదే... తమ కోసం కాకుండా సమాజ హితం కోసం తపించిన ఋషులు, మునులు చిరంజీవులైనారు.

తమ కోసం, తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది, ఇతరులకోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకొనేవుంటుంది. ఇదే విజయం అంటే!”


”నా గురించి నేను దుఃఖించక పోవడమే నా ఆనందానికి కారణం!” అని 2600 ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన మాట, “ఇతరులకోసం జీవించేవారే నిజంగా జీవించినట్టు, అలా చేయని ఇతరులు జీవించివున్నా మరణించినట్టే లెక్క” [Only they live who live for others, the others are more dead than alive]  అని వివేకానంద 1896 లో అన్న మాట ఇదే కదా.✍️```

                               ….సేకరణ.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏