8, ఫిబ్రవరి 2025, శనివారం

పరాధీనమైనట్టి బ్రతుకు,

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


*శ్లో* 𝕝𝕝 *పరాధీనం వృథా జన్మ*

            *పరస్త్రీషు వృథా సుఖం।*

            *పరగేహే వృథా లక్ష్మీః*

            *విద్యా యా పుస్తకే వృథా॥*


*తాత్పర్యము 𝕝𝕝 పరాధీనమైనట్టి బ్రతుకు, పరస్త్రీల వలన సుఖము, పరుల యింట‌ నున్న ధనము, పుస్తకముల యందలి జ్ఞానము సమయమునకు అక్కరకు వచ్చునవి గావు.... అందుచేత, మన దగ్గర ఎన్ని పుస్తకాలను పోగు చేసుకున్నామన్నది కాదు, ఎన్నింటిని పూర్తిగా చదివి ఆకళింపు చేసుకున్నామన్నదే గమనించాల్సిన విషయం.....*

 

 ✍️🪷💐🌸🙏

విద్య నేర్చినవాడు

 సీ॥

విద్య నేర్చినవాడు విర్రవీగుచునుండు 

నాదుప్రతిభయంచు నవ్వుకొనుచు 

ధనము గూడినవాడు దర్పమ్ము జూపించు 

నాదుప్రతిభయంచు నవ్వుకొనుచు 

తెలివి గలుగువాడు ధృతితోడ వర్తిల్లి 

నాదుప్రతిభయంచు నవ్వుకొనుచు 

బలము గలుగువాడు బంధువుల్ గలవాడు 

నాదుప్రతిభయంచు నవ్వుకొనుచు 

తే.గీ॥ చెలగి చెలరేగి యందఱూ చిన్నవోవ 

దుష్టమార్గముల చరించి దోగు గాని 

దైవశక్తియిదియటంచు దలుపబోరు 

దైవ మొల్లమి నీవెందు? తలచవలదె? 

~"కవితాభారతి" 

*~శ్రీశర్మద* 

ది:08-02-2025

మూత్రపిండములలో రాళ్లు

 మూత్రపిండములలో రాళ్లు కరిగించు గొప్ప ఔషధ యోగములు  - 


 *  కానుగ గింజలలోని పప్పు మూడు గ్రాములు తీసుకుని పొడిచేసి 60 మిల్లీలీటర్ల ఆవుపాలలో కలిపి లోపలికి తీసుకొనుచుండిన మూత్రపిండాలలోని రాళ్లు పడిపోవును .


 *  యవాక్షరం , బెల్లం సమాన భాగాలుగా కలిపి రెండు గ్రాముల చొప్పున రోజుకొకసారి ఒక వారం నుంచి పదిరోజులపాటు తినిన రాళ్లు కరిగి పడిపోవును . దీనితో పాటు బూడిదగుమ్మడికాయ రసం కూడా వాడిన ఫలితం తొందరగా కనిపించును.


 *  వేపాకు నీడలో ఎండించి కాల్చి భస్మం చేసి పూటకు ఒకటిన్నర గ్రాము చొప్పున ఒకరోజు నిలువ ఉంచిన నీళ్లతో కలిపి తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాయి కరిగిపోవును . రెండుపూటలా తీసికొనవలెను .


 *  రణపాల ఆకు రసము 6 గ్రాములు కాచిన వెన్న 13 గ్రాములు కలిపి ప్రతినిత్యము తాగుచున్న రాళ్లు కరుగును.


 *  పల్లేరు చూర్ణం ఒక స్పూన్ , కొండపిండి చూర్ణం ఒక స్పూన్ ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఉదయం మరియు సాయంత్రం తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాళ్లు నివారణ అగును.


 *  పొద్దుతిరుగుడు పువ్వు చెట్టు వేర్లు పొడి 25 గ్రాములు తీసుకుని ఒక లీటర్ తియ్యటి మజ్జిగతో కలిపి తీసుకొనుచున్న రాళ్లు కరుగును.


 *  పూటకు రెండు వెల్లుల్లి రేకల గుజ్జు తినుచున్న మూత్రాశయపు రాళ్లు కరుగును. అలా అప్పుడప్పుడు తినుచున్న రాళ్లు పుట్టవు .


  మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు  -


 తినవలసిన ఆహారపదార్దాలు  -


  పాతబియ్యపు అన్నం , యవలు , గోధుమలు , ఉలవలు , పెసలు , మజ్జిగ , ఆవునెయ్యి , ఆవుపాలు , పెసరకట్టు , ఉలవకట్టు , అల్లం , తియ్యని కల్లు , చక్కెర , ముదురు గుమ్మడికాయ , బూడిద గుమ్మడికాయ , పొట్లకాయ , కొండపిండికూర , పల్లేరుకూర , చిర్రికూర , పెరుగుతోటకూర , ఖర్జురము , వెదురుమొలకలు , కొబ్బరికాయ , తాటిముంజలు , నక్కదోసకాయ , మేకమాంసం .


 తినకూడని ఆహార పదార్ధాలు  -


    మలబద్ధకర ఆహారాలు , చద్ది అన్నం , బిరుసుఅన్నం , తాంబూలం , ఎక్కువ ఉప్పు గల ఆహారపదార్థాలు , ఎక్కువ నూనె , పిండివంటలు , నువ్వులపిండి , పులుసు , ఇంగువ , నువ్వులు , ఆవాలు , మినుములు , మామిడికాయ , వెల్లుల్లి మొదలగు వేడివస్తువులు , మలబద్దకాన్ని కలిగించు వస్తువులు , కోడిమాంసం , పందిమాంసం , చేపలు , మద్యం , మైథునం , అతిశ్రమ , మూత్రము , వీర్యము నిరోధము చేయరాదు . 


         పైన చెప్పిన ఆహారపదార్ధాలు పాటిస్తూ ఔషధాలను వాడగలరు .


      ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

7, ఫిబ్రవరి 2025, శుక్రవారం

Panchaag


 

నామ విశిష్టత

 నామ విశిష్టత


మానవ లోకంలోనే కాదు... ముల్లోకాల్లోనూ చరాచరాలకు పేర్లుంటాయి. పేరు లేనిదే మనిషి ఉండడు. పేరు లేని దేవుడు లేడు. పేరు లేని రాక్షసుడూ లేడు. బ్రహ్మ సృష్టిలో పేర్లకు గల విశిష్టత ఇంతా అంతా కాదు. మనిషి తాను జీవించి నంతకాలం తనకు మంచి జరగడానికి దేవతల ఆశీస్సులు కోరుకుంటాడు. తీర్ధ యాత్రలు చేస్తాడు. క్షేత్రాలను సందర్శిస్తాడు. దేవతల నామాలను జపిస్తాడు. తన సంతతికి దేవతల పేర్లు పెట్టుకొంటాడు. నిరంతరం నామస్మరణ చేస్తాడు. మనిషి నిత్యం చేసే ప్రతిపూజలోనూ దేవతానామాలను ఉచ్చరించడం పరిపాటి. ఆ దేవతానామాల్లోని గుణగణాలు తనలో నిలవాలని కోరుకోవడం ఇందులో కని పిస్తుంది. ప్రతి పూజలో, సంకల్పంలో విష్ణువుకు సంబంధించిన ఇరవైనాలుగు పేర్లను ఉచ్చరిస్తారు. విష్ణువు స్థితికారకుడు. అంటే మనిషి జీవించినంతకాలం అతడికి ఆయురారోగ్యభాగ్యాలను పుష్కలంగా సమకూర్చే విశిష్ట దైవం.


విష్ణువును స్తుతించే ఇరవై నాలుగు నామాలు ఎంతో విశి ష్టమైనవి. కేశవుడంటే అంద మైన శిరోజాలు కలవాడు. కేశి అనే రాక్షసుణ్ని చంపినవాడు. నారాయణుడంటే సృష్టికి మూలమైన నీటికి ఆధారమైన వాడు, నరుడి రూపంలో అవత రించిన అవతారపురుషుడు. శబ్దశక్తికి గమ్యం అయినవాడు. మాధవుడంటే లక్ష్మీదేవికి భర్త. సంపదలకు నెలవైనవాడు. గోవిందుడంటే భూమిని, గోవు లను, స్వర్గాన్ని, వేదాలను రక్షిం చేవాడు. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్న వాడు. మధుసూదనుడు సుణ్ని చంపినవాడు. త్రివిక్ర ముడంటే మూడు అడుగు లతో ముల్లోకాలనే ఆక్రమించినవాడు. వామనుడంటే పొట్టిగా ఉండీ గట్టివాడై బలిచక్రవర్తి గర్వాన్ని అణచివేసినవాడు. శ్రీధరుడంటే సకల సంపదలనూ ధరిం చినవాడు. హృషీకేశుడంటే ఇంద్రియాలను అదుపులో ఉంచేవాడు. పద్మనాభు డంటే నాభిలో పద్మాన్ని కలిగినవాడు. దామోదరుడంటే తులసీ మాలను ఉదరంపై ధరించినవాడు. సంకర్షణుడంటే శత్రువులను సంహరించేవాడు. వాసుదే వుడంటే వసుదేవుని కొడుకు, సంపదలు పుష్కలంగా కలిగినవాడు. ప్రద్యుమ్నుడంటే గొప్ప బలం కలవాడు. అనిరుద్ధుడంటే ఎవరూ అడ్డుకోలేనంతటి పరాక్రమం కలిగి నవాడు. పురుషోత్తముడంటే మానవుల్లో ఉత్తముడు. అధోక్షజుడంటే ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానాన్ని మించిన జ్ఞానాన్ని కలిగినవాడు. నారసింహుడంటే నర, సింహ రూపంలో దుష్టులను అణచివేసినవాడు. అచ్యుతుడంటే ఎటువంటి నాశమూ లేనివాడు. అధోగతి లేనివాడు. జనార్ధనుడంటే సాగరంలో దాగి ఉండి లోకాలను హింసించిన రాక్షసులను చంపినవాడు. ఉపేంద్రుడంటే ఇంద్రలోకానికంటే పై లోకంలో ఉండేవాడు. హరి అంటే సమస్త పాపాలనూ హరించేవాడు. దివ్యమంగళ స్వరూపంతో మనసులను దోచేవాడు. శ్రీకృష్ణుడంటే సకల కర్మలనూ చేసేవాడు. ఇలా ఇరవైనాలుగు నామాలతో విష్ణువును స్మరించడం వల్ల మనిషి శాంతిని, ఆనం దాన్ని, అభ్యుదయాన్నీ పొందుతాడని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

ప్రతి నామంలోనూ ఏదో ఒక గుణం, స్వభావం అంతర్భవించి ఉంటుంది. విష్ణువు నామాల్లోనూ గుణాలు విశేషంగా ఉన్నాయి. వాటిని తలచుకొన్నప్పుడు తానూ అలాంటి ఉత్తమ గుణవంతుడు కావాలని మనిషి అనుకొంటాడు. అలా అనుకున్నప్పుడు గుణసాధన కోసం ప్రయత్నిస్తాడు. సాధనలో లభించే ఫలితం మానవుణ్ని మాధవుడిగా చేస్తుంది. ఇదే నామస్మరణలోని విశిష్టత.

రాబోతున్న సంక్షోభం

 *Today news information*

*తెలుగు రాష్ట్రాల్లో రాబోతున్న సంక్షోభం మొత్తం రాజస్థాన్ బీహార్ గుజరాత్ వాళ్ళు తో*


●పని చేసేవాళ్ళు దొరకని స్థితిలోకి తెలుగు రాష్ట్రాలు.

●ఇతర రాష్ట్రాల పని వాళ్ళ చేతిలో కీలక రంగాలు.

క్రమంక్రమంగా దక్షిణ భారతదేశం రాజస్తాన్/గుజరాతీల వలసవాదంలోకి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు! మన వాళ్ళూ, స్ధానికులూ వ్యాపారాలు కోల్పోతున్నారు. మనం గమనించాలి.


బ్రిటిష్ కంటే ప్రమాదం మార్వాడీ వ్యాపారులు*


తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక బహుజన కులస్తుల వ్యాపారాలపై మార్వాడీల దండయాత్ర !


ఈరోజు రాష్ట్రంలో ఏ ఊరు చూసిన ప్రతి వ్యాపారంలోను మార్వాడీలు ఎంటర్ అయిపోయారు !


ఈస్టిండియా కంపెనీ మాదిరి తెలుగు రాష్ట్రలలో జిలేబి, పానీపూరి, సమోసా వ్యాపారాలతో మొదలెట్టి అంచెలంచెలుగా ఎదిగి నేడు రాష్ట్ర వ్యాపారాలను శాసించే స్థాయికి ఎదిగి పోయారు.


ఇల్లు, వ్యాపారాలు 60 శాతం మించి మార్వాడీలు కైవసం చేసుకున్నారు.


మార్వాడి వ్యాపార రహస్యం ఏమిటంటే చాలా వరకు బడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలు అన్ని కూడా మార్వాడి వాళ్ళవే కాబట్టి మార్వాడి వాళ్ళకి ఇచ్చిన రేటుకు మన వ్యాపారస్తులకు ఇవ్వరు.

డబ్బు ఎవరికీ ఊరికే రాదు కదా అని ఓ గుండు ఆయన చెప్పిన సూక్తిని మన వాళ్ళు బాగా పాటిస్తూ రూపాయి తగ్గుతుంది కదా అని మార్వాడి వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తూ మన బహుజన కులాల వ్యాపారస్తులకు పాడే కట్టేస్తున్నారు.


కొన్నాళ్ళకు మార్వాడి సేట్లు దగ్గర బానిస లాగా బతికే రోజు దగ్గర్లోనే ఉంది.


మార్వాడీలు గుజరాతి, రాజస్థాన్ వాళ్ళు వ్యాపారం నిమిత్తం ఇక్కడ రావడం వల్ల స్థానిక వ్యాపారుల మధ్య ఇక్కడ ఆజ్యం పోస్తున్నారు.


మన స్థానిక కులాల వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు.


మన చుట్టుపక్కల, చౌరస్తా లలో, డబుల్ సెట్టర్ దుకాణాలు కొత్తగా ఎవరు పెడుతున్నారు చూడండి.


మన తెలుగు రాష్ట్రాల బహుజన కులాలు కానీ మరే ఇతర వ్యాపారులు కానీ ఉన్నారా,.. లేరు.


చిన్న చిన్న వ్యాపారం చేసుకునే బహుజన కులాల కిరాణా షాపులు దెబ్బతీసి, లేకుండా చేసి హోల్ సేల్ వ్యాపారం అంటూ మార్వాడీలు మొత్తం దక్షిణ భారతదేశంలో స్థానికులు మధ్య పాతుకుపోయారు.


మన స్థానిక ప్రజల  డబ్బులు మొత్తం వాళ్ళే దోచుకు పోతున్నారు.


మన స్థానిక బహుజన కులాలు ఏదైనా వ్యాపారం చేద్దామంటే పోటీకి నిలబడే పరిస్థితి లేకుండా ఎంతో తెలివిగా మార్వాడీలు కుట్రలు చేస్తున్నారు.


ఇది ఇలాగే కొనసాగితే మన బహుజన కులాలకు వ్యాపారం చేసే స్థోమత కోల్పోయి మార్వాడీ ల దుకాణాలముందు బిచ్ఛం అడుగుకునే దుస్థితి కి దిగజారుతారు. 


భవిష్యత్తులో స్థానిక కులాల చిన్న చిన్న వ్యాపారులు ఉండరు.


ఇప్పుడు ఊర్లకు.....


👉గప్ చిప్ బండి వచ్చింది.


👉జ్యుస్ బండీ వచ్చింది


👉పీచ్ మిఠాయిలు బండీ వచ్చింది


👉రాజస్థాన్ టీ వచ్చింది


👉స్విట్ షాప్ వచ్చింది


👉రంగుల షాప్ వచ్చింది


👉పర్నీషర్ షాప్ వచ్చింది


👉సెల్ ఫోన్ చార్జర్లని వచ్చినోళ్ళు


👉షోన్ షాపులే పెట్టిర్రు.


👉సిమెంటు షాపులు


👉పైపుల షాపులు


👉బంగారు షాపులు


👉ఒక్కటేమిటీ అన్నీ వాళ్ళు పథకం ప్రకారం గ్రామగ్రామాన వస్తుంటే ....... పాపం


👉మన బజ్జీలు ఎవరు కొంటారు


👉మన బొండాలు ఎవరు కొంటారు


👉మన టీ షాపు ఎవరు పోవాలి


👉మన ఇడ్లీలు ఎవరు తింటారు


ఆలోచిస్తూ.... ఉండూ, వీళ్ళందరూ యూనిటీ గా ఉంటూ

మనల్ని వాల్ల మీద ఆధారపడి బతికేలాగ చేస్తారు.


తెర వెనుక మొత్తం మన వనరులను దోచుకోవడం, బజ్జీలు పానీ పూరీలు అని ఒకక్కటని కాదు,.. విద్యుత్ ఉపకరణాలు, హార్డ్వేర్ ఉపకరణాలు, సిమెంటు వ్యాపారాలు వజ్రాలు బంగారం వ్యాపారం వరకు ఇలా పెద్ద పెద్ద వ్యాపారులు గా తయారయ్యి వాళ్ల మీద మనం బతికేలా చేయించుకుంటారు


ఒక్కటి చెప్పు....

తెలుగు రాష్ట్రాలకు చెందిన కులాల వ్యాపారస్తులకు వందల కోట్ల రుణాలు బ్యాంకులు ఇచ్చాయా?


నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీ లాంటి వారు విదేశాలకు పారిపోయారు.


కానీ ఏ ఇతర కులాల వ్యాపారి అయిన వందల కోట్లు బ్యాకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయాడా...?

 

అంతేందుకు...

దక్షిణాది స్థానిక కులాల వ్యాపారులు ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రభుత్వం ద్వారా తిసుకున్న అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పోయినవాళ్ళను చూపగలవా????


 ఆత్మగౌరవం కోసం ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు.


ఉత్తరభారతీయులు మొత్తం లక్షల కోట్లు బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోతారు.


ఇప్పటి కైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేల్కొని...మన యవతను సోమరి పోతుల్లా ఉచిత పథకాలతో పరిమితం చేయకుండా...వారికి రుణ సదుపాయం కల్పించి, మంచి శిక్షణ ఇస్తే సరుకుల తయారీ రంగంలో తెలుగు యువత రాణిస్తారు. మన రాష్ట్రంలోని బహుజన కులాలతో పాటు ఇతర స్థానిక వ్యాపారులు కూడా నిలదొక్కుకుంటారు.


అంతేకాదు ఉత్తర భారతీయులు ముఖ్యంగా (గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల మార్వాడీలు)మన తెలుగు రాష్ట్రాలలో స్థానికంగా పాతుకుపోయి వాళ్ళు చెప్పిందే శాసనంగా భవిష్యత్తులో చేసే విధంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి.

●ఉచితాలకు అలవాటు పడుతున్న తెలుగు ప్రజలు.


 *ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో బయట రాష్ట్రము నుండి మార్వాడి రావడం తో* రాబోయే కాలంలో పని సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక రంగాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు పాతుకుపోయారని, ఇది ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో ఆర్ధిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.


ఇతర రాష్ట్రాల పని వారు, వారు చేసే పనులు:


బీహార్ వాళ్లు:-ఇటుక బట్టి నుండి , వరినాట్లు, పత్తి ఏరే దాకా అన్ని రకాల కూలి పనులు చేస్తున్నారు. 


 ఒరిస్సా వాళ్లు:-అన్ని రకాల కార్మికులు గా వంటకాల తయారీదారులు గా చేస్తున్నారు.


 రాజస్థాన్ వాళ్లు:-టీ స్టాల్ మరియు హోటల్, సానిటరీ షాప్‌ల నిర్వహణ చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రము వీళ్లది షాప్ లే ఎక్కువ 


 ఉత్తరప్రదేశ్ వాళ్లు:-టైల్స్ వేసే పని నుండి పెయింటింగ్, అన్ని రకాల ఇంటి లోపలి అలంకరణలుచేస్తున్నారు .


 కేరళ వాళ్లు:-ఇంగ్లీష్ బోధించు టీచర్లు గా పని చేస్తున్నారు.


 కర్ణాటక వాళ్లు:-భవన నిర్మాణ కూలీలు గా పని చేస్తున్నారు.


ఇలా  ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు.

         

          

    రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు మాత్రం మందు, మాంసం ఎవడు పంచుతాడు ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తాడు అంటూ పూటకో జెండా చేతిలో పట్టుకుని తెలిసిన పనిని, చేతిలో ఉన్న వృత్తినీ వదిలేసి సమయాన్ని వృధా చేస్తూ  ఉచితాలకు, వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.


ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంపదను గణనీయ భాగం ఇతర రాష్ట్ర ప్రజలు తీసుకు పొతే మన వాళ్ళు దివాలా స్థితికి వస్తారు. వారు పని చేసే అలవాటు Work Culture కూడా మర్చి పోతారు. ఆ తరువాత పని చేస్తామన్నా ఎవరూ పని ఇవ్వని పరిస్థితి వస్తుంది. ఇది రాబోయే కాలంలో ఏపీ, తెలంగాణ లో పని చేసే వారిని (labour ని)  సంక్షోభ స్థితికి నెట్టి వేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలియక పోవడం తప్పు కాదు.

 🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏            🔥మనిషికి తెలియక పోవడం తప్పు కాదు.. నేర్చుకోకపోవడం తప్పు.. బయపడటం తప్పు కాదు.. భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయక పోవడం తప్పు.. లోపాలు ఉండంటం తప్పు కాదు.. వాటిని సరిదిద్దుకోకపోవడం తప్పు.. మనం ఏ అంశంలో వెనుకబడి ఉన్నామో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సరి దిద్దుకుని మెరుగైవుతూ ఉంటేనే జీవితంలో నిజమైన ఎదుగుదల సాధ్యమవుతుంది🔥స్వప్నం ఎంత అందంగా ఉన్నా నిద్ర లేవక తప్పదు.. బాధ ఎంత పెద్దది అయినా దాటుకుని వెళ్లక తప్పదు.. చెట్టుకు ఉన్న ముళ్లనే చూస్తూ ఉంటే వికసించిన గులాబీని తాకలేము..నిన్నటిని మరచి రేపటికై పోరాడుతూ నేడు సాగిపోవడమే జీవితం🔥ఏదీ తప్పో ఏదీ ఒప్పో నీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది.. తెలియదు అని అనడం ఆత్మవంచన...నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు.. అలాగే ఈ రోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు.. కష్ట సుఖాలు వచ్చిపోయే బందువులాంటివి.. ఉన్నది ఒక్కటే జీవితం.. మంచి ఆలోచనలతో నలుగురితో కలసి మెలసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం జీవితాన్ని మిత్రమా🔥🔥మీ  *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D.N. 29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593 9182075510* 🙏🙏🙏

మధ్వనవమి_

 *_ఈ రోజు మధ్వనవమి_*



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



*మాఘ శుక్ల నవమి* 

మధ్వనవమిగా ప్రసిద్ధం.

త్రిమతాచార్యుల్లో ఆఖరి అవతారం శ్రీమధ్వాచార్యులు.


ఆయన ఆశ్వయుజ విజయ దశమినాడు 1238లో దక్షిణ కన్నడ ఉడిపి వద్ద పాజక గ్రామంలో జన్మించారు. మధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధురేహ భట్ట , వేదవతిలుగా పేర్కొన్నారు.


ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్వ ప్రజ్ఞ , ఆనందతీర్థ, మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు.


పన్నెండో ఏట అచ్యుతప్రజ్ఞ తీర్థుల గురుకృపతో సన్యాసం స్వీకరించారు.బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మికత విషయాల వైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవారు. చిన్న వయసులోనే సకల శాస్త్రజ్ఞానం సంపాదించుకున్నందువల్ల పూర్ణ ప్రజ్ఞుడన్న బిరుదు ప్రసాదించారు.


ద్వైతమతాన్ని ప్రతిపాదించి నందువల్ల ఆయన అనుసరించిన మధ్యేమార్గానికి చిహ్నంగా శ్రీమధ్వాచార్యులన్న నామధేయం కూడా వరించింది.గొప్ప కార్య సాధకుడు అనటానికి ఆయన చేపట్టిన విస్తృత సైద్ధాంతిక కార్యక్రమాలే ప్రబల నిదర్శనాలు. రుక్మిణీ దేవి పూజించే బాలకృష్ణ విగ్రహం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించింది మధ్యాచార్యులవారే.


శ్రీమధ్వాచార్యులవారు సుదీర్ఘ జీవితకాలంలో మూడు పర్యాయాలు బదరీయాత్ర విజయవంతంగా నిర్వహించారు, వారి చివరియాత్ర 1317లో 79వ ఏట పరిపూర్ణమైంది.


ఆ తిరిగిరాని పయనమే మధ్వానవమి వైశిష్ట్యానికి సంప్రదాయంగా మారింది, ఈ సందర్భంగా అన్ని మఠాల్లో దేశ వ్యాప్తంగా ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తారు.


జీవుడు వేరు , బ్రహ్మము వేరు , జీవుడు మిథ్య కాదు , అలాగే జడ జగత్తు కూడా మిథ్యకాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవ జగత్తులు కూడా అంత సత్యం , భక్తి ఒక్కటే ముక్తిదాయకం , అది జ్ఞాన పురస్కృతమైన భక్తి అయి ఉండాలి.అని మధ్వాచార్యుడు ఆసేతుసీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి ద్వైతమతాన్ని ప్రచారం చేశాడు.


దేశంలో వైష్ణవమత వ్యాప్తికి , ముఖ్యంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు , జగత్తు మాయ మాత్రమే , జీవితం ప్రత్యక్ష ప్రామాణికమే.


పరమాత్మ సర్వస్వతంత్రుడు , జీవాత్మ అస్వంతంత్రుడు , జీవోత్తముడు ఆచార్యుడు , ధర్మమార్గంలో ఆచార్యుల అనుగ్రహం సంపాదించి , అర్హమైన ఆనందాన్ని అనుభవించమని ఆయన చెప్పిన సూక్తిముక్తావళి మధ్వులకు శిరోధార్యం.మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించేవారిని మధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలుస్తారు.


మధ్వాచార్యుడు,  హనుమంతుడు మరి భీముడు అనంతరము వాయుదేవునకు తృతీయ అవతారమని నమ్ము తారు.తన ద్వైతసిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు , బ్రహ్మసూత్రాలకు , భగవద్గీతకు భాష్యాలు వ్రాశాడు.


ఋగ్వేదంలోని 40 సూక్తాలకు మరియు భారత భాగవతాలకు వ్యాఖ్యానం వ్రాశాడు, తర్కంతో పాటు 37 గ్రంథాలను రచించాడు.


మధ్వాచార్యులు అనంతరం మరే ఆచార్యులు భారతావనిలో పుట్టలేదు. వారు చేసిన ద్వైత సిద్ధాంతాన్ని ఖండించి దానికంటే ఉన్నతమైన మరొక సిద్ధాంతాన్ని ఎవరూ ప్రతిపాదించలేదు.


ఒకసారి వీరు దక్షిణ కన్నడలోని మాత్నే తీరం సమీపంలో మునిగి పోతున్న ఓడను రక్షించగా , ఓడలోని ముఖ్య నావికుడు భక్త భావంతో వీరికి ఒక గోపీ చందనం మూటను బహూకరించాడు.


శ్రీమహావిష్ణువుయొక్క వివిధ అవతారాలను స్తుతిస్తూ ఆ మూటను వీరు ఉడిపికి తెచ్చారు , ఆ స్తోత్రమే తరువాత కాలంలో 3 ద్వాదశస్తోత్రంగా పిలువబడింది.


ఆ గోపీచందనం మూటను మధ్వ సరోవరంలో శుద్ధిచేసి దానిని విప్పిన వీరికి ఆ గోపీచందనం కణికల మధ్య ఒక చిన్న కృష్ణ విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్నే 800 సంవత్సరాల పూర్వం ఉడిపిలో ప్రతిష్ఠించారని అంటారు.


తనను అమితంగా కొలిచే అంత్య కులజుడైన కనకదాసుని కరుణించి తూర్పు ముఖంగా వున్న శ్రీకృష్ణుడు పశ్చిమ ముఖుడై గవాక్షం గుండా అతనికి దర్శనం అనుగ్రహించాడు.


ఇప్పటికి కూడా ఉడిపిలో శ్రీకృష్ణుడు పశ్చిమాభిముఖుడై ఉండే మనల్ని అనుగ్రహిస్తున్నాడు. మూఢనమ్మకాల్నివ్యతిరేకించాడు , యుక్తవయస్సులో కన్యాకుమారి , రామేశ్వరం , శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించారు మధ్వాచార్యులు ప్రవచించిన మతం ద్వైతం.


జీవాత్మ , పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతారు. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ పరమాత్మ వాసుదేవుడిమీద ఆధారపడి వుంటుందని , ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది. పరబ్రహ్మ ఒక్కడే. అతను విష్ణువు అని ప్రబోధించాడు. మధ్వ మతతత్వానికి వన్నెతెస్తున్న ఉడిపికి చెందిన ఎనిమిది మఠాలు.


పెజావర, పుత్తిగె, పాలిమార్,  ఆడనూరు, సోధె ,  కవియూరు , శిరూరు ,  కృష్ణాపురం మఠాలు. సంప్రదాయాలకు , మతపరమైన ఆచారాలకు , ద్వైత సిద్ధాంతాలకు ఉడిపి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది.


పురందరదాసు , కనకదాసు వంటి వాగ్గేయకారులకు ఉడిపి నిలయం కావటంతో దీనిని దాస సాహిత్య కేంద్రమని పేర్కొంటారు.


మధ్వాచార్యులు తమ 79వ ఏట 1317లో శిష్యసమేతంగా బదరీ నారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా చేరుకుని వ్యాస భగవానుని కైంకర్యాలలో నిమగ్నమైపోయారు.

తిరునవాయ నవముకుంద పెరుమాళ్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1013


⚜ కేరళ  : మల్లపురం


⚜ తిరునవాయ నవముకుంద పెరుమాళ్ ఆలయం

( 65వ  శ్రీవైష్ణవ దివ్యదేశo )



💠 హిందువులలోని శ్రీ వైష్ణవ శాఖకు 108 దివ్య తిరుపతులు   ఉన్నాయి( 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలు)  మరియు వాటిలో 11 ఇప్పుడు కేరళలో ఉన్నాయి మరియు వాటిలో తిరునవయ ఒకటి. 


💠 ఇది నవ యోగులు (శాతువనాథర్, సాలోగ నాథర్, ఆదినాథర్, అరుళీతానాథర్, మధంగ నాథర్, మచ్చెందిర నాథర్, కడయంతీర నాథర్, కొరక్కనాథర్ మరియు కుక్కుడనాథర్) విష్ణువును పూజించిన ప్రదేశం.  

విష్ణువు నవయోగులకు దర్శనం ఇచ్చాడు.  అందుకే ఈ ప్రదేశాన్ని తిరునవయోగి అని పిలుస్తారు మరియు తరువాత తిరునావయగా మార్చబడింది.


💠 ఇప్పుడు పూజలో ఉన్న నవముకుంద విగ్రహం 9 మంది సాధువులతో కూడిన 'నవయోగులు' ఇక్కడ స్థాపించిన తొమ్మిదవది అని నమ్ముతారు. 

పురాణాల ప్రకారం, వీటిలో మొదటి 8 వాటిని స్థాపించిన వెంటనే భూమిలో మునిగిపోయాయి. చివరిది కూడా అలాగే మునిగిపోవడం ప్రారంభించింది కానీ దాని మోకాలి స్థాయిలో బలవంతంగా ఆపివేయబడింది. 

8 విగ్రహాలు ఎక్కడికి పోయాయో కచ్చితమైన స్థలం తెలియకపోవడంతో చాలా మంది మోకాళ్లతో మాత్రమే ప్రదక్షిణలు చేస్తారు. 

తిరునవయను 9 మంది విగ్రహాలను ప్రతిష్టించిన యోగుల పేరు మీద 'నవయోగి స్థల' అని కూడా పిలుస్తారు.



🔆  స్థలపురాణం 

 

💠 మనోహరమైన భరతపుళ అను నదీ తటమున వెలసిన ఈ దివ్యదేశమున శ్రీమహాలక్ష్మి శ్రీమన్నారాయణుని సుందరమూర్తిని ప్రతిష్ఠించుకొని ప్రక్కనే యున్న ఒక కొలను నుండి కమలములను కోసి తెచ్చి పెరుమాళ్ కు సమర్పించి , అలకరించి , అర్చించుచుండెను .


💠 ఒక గజేంద్రుడు ( ఏనుగు) కూడ ఆ పెరుమాళ్ యందు మహాభక్తి తత్పరుడై ఉండెను . 

శ్రీమన్నారాయణుని ధ్యానమునే సదా కాలము గడుపుచు ఆ గజేంద్రుడు ఆ కొలను నుండియే కమలములను కోసి తెచ్చి పెరుమాళ్కు సమర్పించి అర్చించుచుండెను . 

కాని గజేంద్రుడు ఈ విధముగా చేయుట లక్ష్మీదేవికి ఇష్టములేకుండెను .


💠 తన భర్త అయిన శ్రీమన్నారాయణుని మరియొకరు అలంకరించుట , తను ఏ కొలనులో కమలములు కోయుచున్నదో ఆ కొలనులోని కమలములను ఇంకొకరు కోసి పెరుమాళ్కు సమర్పించుట సహించలేకుండెను . 

అందువలన ఆ దేవి చాలా ముందుగా పోయి కొలను లోని కమలములను కోసివేసి పెరుమాళ్ పూజకు , అలంకరణకు వినియోగించుచుండెను . 


💠 కొలనులో ఒక కమలము కూడ లేకుండుట గజేంద్రునికి చాలా బాధకలిగి , శ్రీమన్నారాయణుని అర్చించుటలో తాను చేసిన లోపములే అందుకు కారణమని భావించుకొని అతి దీనముగా పెరుమాళ్ ముందు మ్రోకరిల్లి గాఢముగా ధ్యానమున ప్రార్థించుచుండెను . 


💠 గజేంద్రుని నిర్మల భక్తికి సంతోషించిన పెరుమాళ్ శ్రీమహాలక్ష్మి యొక్క ఆలోచన సరియైనది కాదు అని తలచి , “ దేవీ ! ఆ గజేంద్రుడు మన భక్తుడు . తనను , తన భక్తిని సంపూర్ణముగా నాయందు సమర్పించుకొని నిర్మలమైన అంతరంగమున నిండుగా నన్ను ప్రతిష్ఠించుకొని తన్మయుడై అర్చించి మహానందమును పొందువాడు . 

నీకు నాయందు గల అమిత అనురాగము వలన నన్ను ఎంత చూచుకొని అలంకరించి అర్చించుకొనినను తనివి తీరని నీ అంతరంగము నాకు తెలియనిదా ! 

దేవీ ! నా ప్రక్కనే ఆసీనురాలివై గజేంద్రుని పూజలను స్వీకరించుము . 

ఈ గజేంద్రుడు మనకు పుత్రసమానుడు . 

పుత్రవాత్సల్యముతో అతనిని చూడుము . నీకును ఎంతయో ఆనందదాయక మగును " అని బోధించెను . 


💠 అంతట లక్ష్మీదేవి తన ఆలోచనలోని సంకుచితత్వమునకు చింతించి , గజేంద్రుని నిర్మలమైన భక్తి ముందు తన భావనలు ఎంత నిమ్నమైనవో గ్రహించి , తన నాథుని యెదుట లజ్జిత వదనయై నిలిచియుండెను . శ్రీమన్నారాయణుడు ఆమెను బుజ్జగించి , “ దీనికి అంతకును నీకు నాయందుగల స్త్రీ సహజ ప్రేమయే కారణము బాధపడకుము " అని చెప్పి లక్ష్మీదేవిని తనచెంతనే కూర్చుండ బెట్టుకొనెను . 


💠 శ్రీ కోవిల్ అని పిలువబడే గర్భాలయంలో నవముకుంద విగ్రహం ఉంది. విగ్రహం మోకాలిపై నుండి మాత్రమే ఉంది, మిగిలిన విగ్రహం భూమి లోపల ఉంది.

నవముకుంద విగ్రహం 6'  ఎత్తు, మరియు రాతితో తయారు చేయబడింది మరియు పంచ లోహoతో కప్పబడి ఉంటుంది . 

విగ్రహం నిలబడి ఉన్న భంగిమలో ఉంది, నాలుగు చేతులతో పాంచజన్య శంఖం, తామర పువ్వు, కౌమోదకి గద మరియు సుదర్శన చక్రం  ఉన్నాయి. విగ్రహం తూర్పు ముఖంగా ఉంది. 


💠 ఇక్కడ నదీతీరం పవిత్రమైన వారణాసి లేదా కాశీ వలె పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు ప్రజలు ఇక్కడ కాశీ మాదిరిగానే పూర్వీకులకు పిండ ప్రదానాలు పూజలు చేస్తారు. 

ఈ దేవాలయం పితృ తర్పణానికి ప్రసిద్ధి చెందింది.


🔅 పండుగలు:


💠 మామాంకం అనేది 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే గొప్ప పండుగ. కనీసం 8వ శతాబ్దపు నుండి గమనించబడుతుందని నమ్ముతారు, ఇది నది ఒడ్డున జరుపుకుంటారు. 

వార్షిక ఉత్సవం కూడా మేలో ధ్వజారోహణంతో నిర్వహిస్తారు. ఏనుగుల ఊరేగింపు కూడా ఈ ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటి.

నవముకుంద ఏకాదశి, అష్టమి రోహిణి (శ్రీకృష్ణుని జన్మదినం), నవరాత్రి మరియు అన్ని ఇతర వైష్ణవ సంబంధిత  పండుగలు జరుపుకుంటారు.



💠 కోజికోడ్ విమానాశ్రయం మలప్పురం నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది.  


Rachana

©️ Santosh Kumar

13-19-గీతా మకరందము

 13-19-గీతా మకరందము

           క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారికll ఇవ్విధముగ  క్షేత్రక్షేత్రజ్ఞుల రెండిటినిగూర్చి తెలిపి, అట్టి విజ్ఞానమువలన కలుగు ఫలితమును వచించుచున్నారు-


ఇతి క్షేత్రం తథా జ్ఞానం 

జ్ఞేయం చోక్తం సమాసతః 

మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే.


తాత్పర్యము:- ఈ ప్రకారము క్షేత్రము, అట్లే జ్ఞానము,  జ్ఞేయముకూడ సంక్షేపముగ చెప్పబడినవి. నా భక్తుడు (నాయందు భక్తిగలవాడు) వీనినెరింగి నాస్వరూపమును (మోక్షమును, భగవదైక్యమును) బొందుట కర్హుడగుచున్నాడు.


వ్యాఖ్య:- "మద్భక్త ఏతద్విజ్ఞాయ' - నాభక్తుడు దీనిని తెలిసికొని అనిచెప్పుట వలన భక్తుడు కానివాడు ఆ జ్ఞానాదుల నెఱుంగజాలడనియు, పైనదెల్పిన జ్ఞానజ్ఞేయాదుల నెఱుంగుటకు పూర్వము ప్రతివారున్ను భక్తుడు కావలసియున్నదనియు స్పష్టమగుచున్నది. భక్తియను పుష్పమునుండి జ్ఞానమనుఫల మావిర్భవించును. కావున ప్రప్రథమమున సర్వేశ్వరునిపై, సద్గురువులపై అచంచలభక్తి కలిగియుండి జపతపపూజసంకీర్తనాదులచే వారిని ఆరాధించువారికి వారు కరుణించి జ్ఞాన, జ్ఞేయముల నెఱుంగగల 'బుద్ధియోగము' నొసంగగలరు. తద్ద్వారా ఆ భక్తులు జ్ఞానులై భగవత్సాయుజ్యమునకు (‘మద్భావాయ') తగినవారగుచున్నారు. అట్లు కాక భగవద్భక్తిలేనిచో వారెంతటి గొప్పపండితులైనప్పటికిని, భౌతికవిజ్ఞాన కుశలత్వము గలిగియున్నప్పటికిని ఈశ్వరీయ విజ్ఞానము, జ్ఞేయతత్త్వానుభవము వారికి కలుగజాలదని ఈ శ్లోకముద్వారా వెల్లడియగుచున్నది. మరియు జనులు సామాన్యభక్తితో తృప్తిపడక, సాధనాతిశయముచే క్రమముగ జ్ఞాన, జ్ఞేయములను గూడ నెరిగి మోక్షార్హులు కావలసియున్నారనియు విదితమగుచున్నది.


మోక్షమును ఎవరు పొందగలరను ప్రశ్నకు భగవంతు డిచట సూటియైన సమాధానము నొసంగెను. ఈ జ్ఞానజ్ఞేయాది తత్త్వమును బాగుగ తెలిసికొనినవారే మోక్షార్హులని ఇచట వచింపబడినది. ఆ జ్ఞానాదులో భగవద్భక్తికలవారికే అబ్బుననియు తెలుపబడినది.


ప్రశ్న:- భగవత్సాయుజ్యమును (మోక్షమును) ఎవడు బొందగలడు? 

ఉత్తరము:- జ్ఞానస్వరూపమును, జ్ఞేయస్వరూపమును బాగుగ తెలిసికొనినవాడు. 

ప్రశ్న:- జ్ఞాన జ్ఞేయములను ఎవడు తెలిసికొనగలడు? 

ఉత్తరము:- భగవద్భక్తికలవాడు మాత్రమే.