13, అక్టోబర్ 2024, ఆదివారం

ప్రతిభావంతులేమో

 ✊✊


*బోల్ ఇండియా బోల్ - చేదు నిజాలు*


రైతులు పొలంలో - రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు,

కానీ

నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు.


*చేదు నిజం ఏమంటే*, ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ పి.హెచ్.డి, గ్రాడ్యుయేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం,

టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం. *ఆలోచించండి*.


రాజకీయ నేతలు కావాలనుకొనే వాళ్ళు ఐదు సంవత్సరాలు సైన్యంలో ఖచ్చితంగా పనిచేసి తీరాలన్న నిబంధన పెడితే,

దేశంలో 80 శాతం ఉత్పాతాలు (దరిద్రాలు) వాటంతట అవే సర్దుకుంటాయి.


*25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసిన వాళ్లకు పెన్షన్ఉండదు*.

కానీ,

ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం *జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు* ఇస్తున్నారు.

ఇలా ఎందుకు ఇవ్వాలి? 


నాయకులపైకి చెప్పులో, కోడి గుడ్లో, నల్ల సిరానో, విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు.

కానీ,

భారతీయ సైన్యం పై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఎందుకు?


రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు.

కాని,

మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు.

*రైతు తినేది దొంగ సొమ్మా?*

 *నేతలు తినేది కష్టార్జితమా?* ఇదేమి న్యాయం.


*విద్యలో రాజకీయం 100%*

*రాజకీయంలో విద్య 00%*

ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో.

ఇందుకేనేమో *రాజకీయం అంతా చెత్త తో నిండిపోయింది*.


దేశంలోని ప్రతిభావంతులేమో

వలస పక్షులు అవుతున్నారు.


దేశంలోని ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలకు 

వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి.

అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం.


*₹399 కి అపరిమిత కాల్స్* డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి *₹15000 టెలిఫోన్ బత్తా ఎందుకు?*


*ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా?*

అందరూ ఆలోచించాలి. మతం గురించి రాజకీయ నాయకులు రెచ్చగొడితే పేద వర్ణ ప్రజలు రెచ్చిపోయి సాటి మనిషిని దూరం పెట్టి, మతంలో మృగాలా మారిపోతున్నారు. కానీ అది రాజకీయ ఎత్తుగడ తెలుసుకోలేకపోతున్నాడు.


దయచేసి మన దేశంలోని ఇలాంటి *దరిద్ర వ్యవస్థ* గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి.

సేకరణ

ఆకవరం దామోదరాచారి

కామెంట్‌లు లేవు: