1, మార్చి 2026, ఆదివారం

*శ్రీ మహావిష్ణు పురాణం* *11వ భాగం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*శనివారం 28 ఫిబ్రవరి 2026*


      *శ్రీ మహావిష్ణు పురాణం*            

          *11వ భాగం*


*ఊర్థ్వలోకాలు,అధోలోకాలు- అనంతుడు*```


పద్నాలుగు లోకాల నిర్మాణం తరువాత ఏయే లోకాలలో ఎవరుండాలో బ్రహ్మ నిర్ణయించాడు.```


           *ఊర్థ్వలోకాలు*


#భూలోకం : ```

భూలోకంలో నాలుగు రకాల జీవాలు ఉంటాయి.```


*అండజాలు : ```

గ్రుడ్డు (అండము) ద్వారా జననం పొందేవి :```


*జరాయుజాలు : ```

గర్భం ద్వారా జన్మించేవి. పశువులు, జంతువులు,మానవులు.```


*స్వేదజాలు : ```

చెమట నుండి జన్మించే జీవులు.

```

*ఉద్భిజాలు : ```

భూమి నుండి ఉద్భవించేవి.  

```


#భువర్లోకం : ```

భూమి పైన గల ఈ లోకంలో సూర్య చంద్ర గ్రహ నక్షత్రాలు, సూక్ష్మ రూపులైన కిన్నెర కింపురుష విద్యాధరులు ఉంటారు.```



#సువర్లోకం (స్వర్గ లోకము): ```

ఇంద్రాది అధిష్ఠాన దేవతలు, దిక్పాలకులు, సాధ్యులు, దేవర్షులు, గంధర్వులు, అప్సరసలు నివసిస్తారు. పుణ్యఫలం అనుభవించడానికి మానవులు మరణానంతరం స్వర్గలోకానికి వస్తారు. పుణ్యఫలం తీరిపోగానే తిరిగి భూమిపై జన్మించడానికి వెళతారు. ఇక్కడ ఆకలిదప్పులు ఉండవు. స్వర్గంఅంటేసుఖాలకు, ఆనందాలకు నిలయం.```



#మహర్లోకం : ```

స్వర్గలోకం పైన గల మహర్లోకంలో దేవతలు తపస్సు చేస్తుంటారు. స్వర్గలోక సుఖాల నుంచి పరమాత్మునిలో లయం చెంది మోక్షము పొందాలి అని తపస్సు చేసే వారు ఇక్కడ ఉంటారు.```



#జనోలోకము : ```

ధర్మాత్ములు అయిన పతులు, పతివ్రతలైన సతులు అనగా ధర్మం తప్ప కుండా ఆచరించే భార్యాభర్తలు ఇరువురు ఈ లోకంలో నివాసం పొందుతారు.```



#తపోలోకము : ```

భూలోకంలో ఏయే దేవతా మూర్తులను ఆరాధిస్తారో, ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలు పొంది ఇక్కడ పరబ్రహ్మ అనుగ్రహంకోసం తపస్సు చేస్తారు. కల్పాంత కాలం వరకు ఉండి కర్మానుసారం భూలోకంలో జన్మించి తపస్సు చేస్తారు. మహాప్రళయంలో సర్వం లయమైనప్పుడు వీరు జన్మ రాహిత్య మోక్షం పొందుతారు.

```


#సత్యలోకం : ```

సృష్టికర్త బ్రహ్మదేవుడు ఉండే లోకం సత్యలోకము. బ్రహ్మలోకం అని కూడా అంటారు. బ్రహ్మజ్ఞానం పొందిన భూలోకవాసులు మరణానంతరం బ్రహ్మలోకం పొందుతారు. బ్రహ్మర్షులు, దేవతాది గణాలుతో బ్రహ్మ సభలో నిరంతరం వేద వేదాంత చర్చలు జరుగుతుంటాయి.


బ్రహ్మలోకం వరకు గల సప్త లోకాలు మహాప్రళయంలో పరబ్రహ్మలో లీనమవుతాయి. బ్రహ్మకు పగలు కాగానే తిరిగి సృష్టి ఆరంభిస్తాడు. బ్రహ్మకు రాత్రి కాగానే సృష్టి ఆగి లయం జరుగుతుంది.

```


*అధోలోకాలు:*```

*అతలము : 

మయాసురుడి పుత్రుడు బలుడు ఈ లోకానికి అధిపతి. అసురుల నివాసము. ఇక్కడి వారు స్వేచ్ఛస్వాతంత్ర్యం కలిగి ఆకర్షించే రూపము కలిగి ఉంటారు 


*వితలము: 

శివుడు హటకేశ్వరుడు అనే నామంతో భవాని, ప్రథమ గణాలతో పరివేష్టితుడై నివసిస్తూ బ్రహ్మ సృష్టికి సహాయం చేస్తుంటాడు. క్రోధ రూపుడవైన హటకేశ్వరుడి రజస్సు ఇక్కడ హాటకి అనే అగ్ని జ్వాలలనదిగా ప్రవహిస్తుంటుంది. ఈ నది నుండి లభించే హాటకం అనే బంగారంతో దైత్య స్త్రీలు ఆభరణాలు చేయించుకుని ధరిస్తారు.


*సుతలము : 

ప్రహ్లాదుడి మనవడు, విరోచనుడి కుమారుడు బలి చక్రవర్తి ఈ లోకానికి అధిపతి. వామనుడిగా బలి చక్రవర్తికి ఇచ్చిన మాట ప్రకారం మహావిష్ణువు సుతలాన్ని స్వర్గం కన్నా సుందర ప్రదేశం చేసి తానే స్వయముగా కావలి కాస్తూ రక్షణ గా ఉన్నాడు.


*తలాతలము :  

మాయావిద్యా ప్రవీణుడు మయుడు దీనికి అధిపతి. దానవులు, రాక్షసులు నివసిస్తారు. మయుడు మాయావిద్యల సంపన్నులైన దానవ రాక్షసులకు గురువు, ప్రభువు.


*మహాతలము :  

మహా రౌద్ర క్రోధులైన క్రాదవేయ (క్రదువ కుమారులు) సర్పజాతులకు నివాసమై ఈ లోకం ఉంటుంది. తక్షక, కాళీయాది నాగ శ్రేష్ఠులు ఇక్కడ నివసిస్తారు.


*రసాతలము : 

దైత్య దానవ నాగ జాతులు నివసిస్తుంటారు. వీరు మహాబలవంతులు, ఓజస్వంతులు.


*పాతాళ లోకము:  

పాతాళ లోకాన్ని నాగలోకము అని కూడా అంటారు. వాసుకి, కులికి, శ్వేతాది నాగ ప్రముఖులు నివసిస్తారు. వీరు నిలువెల్లా విషము కలిగి పెద్ద పెద్ద పడగలు, దీర్ఘ శరీరాలు కలిగి ఉంటారు. ఐదు పడగల నుంచి వేయి పడగల నాగులు ఇక్కడ నివసిస్తారు. వీరి పడగల పై ధగధగ మెరిసే మణులు ఉంటాయి. వీటి కాంతితో పాతాళ లోకం ప్రకాశిస్తూ ఉంటుంది.


పాతాళలోకానికి ముఫై వేల యోజనాల కింద వేయి తలల ఆదిశేషుడు భూమిని శిరస్సు పై ధరించి ఉంటాడు. అనంతమైన శక్తి కలిగి అనంతుడు అనే పేరుతో ఇక్కడ ఉంటాడు. ఆదిశేషుడిగా శ్రీమహావిష్ణువుకి తల్పంగా క్షీరసాగరంలో సేవిస్తుంటాడు. అనంతుడు ఆదిశేషుడు శ్రీమహావిష్ణువు యొక్క అంశావతారము..


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారిసౌజన్యంతో*


*మాఘపురాణం ఒకటవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

కామెంట్‌లు లేవు: