1, మార్చి 2026, ఆదివారం

విద్యను ప్రతి మనిషి నేర్చుకోవాలి.

 |ఉ| విద్య నిగూఢగుప్తమగు విత్తము, రూపము పురుషాళికిన్
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశబంధుడున్,
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్,
విద్య నృపాలపూజితము, విద్య నెఱుంగనివాడు మర్త్యుడే? 

విద్య యొక్క గొప్పతనాన్ని తెలుపుతున్నారు ఏనుగు లక్ష్మణ కవి విద్య నిగూఢమైనట్టి ధనము అట అంటే విద్యావంతుడు తన చెంత ఎప్పుడు దానం కలిగి ఉంటాడని అంటున్నాడు.  అంటే కాదు విద్య యశస్సు అనగా కీరిని, భోగాలను ఇవాటమే కాకుండా అది గురువుగా, విదేశములలో బంధువుగా దైవముగా విద్యావంతునికి తోడుగా ఉంటుందని అంటున్నాడు. ఇంకా విద్యకు సరిఅయిన ధనము లేదట.  ఇంకా ఏమంటున్నాడంటే విద్య వలన రాజులు కూడా పూజిస్తారట.  అందుకే ప్రతివారు విద్యావంతుడు కావాలని భావము.  అంతటితో ఆగలేదు.  విద్యనేర్వని వాడు మనిషే కాదు అని అంటున్నాడు.  కాబట్టి ప్రతి వారు విద్యావంతులు కావలి.  తమ తమ విద్యతో ప్రకాశించాలి అని అర్ధం.  అన్ని విధాలుగా ఉపయోగకరమైన విద్యను ప్రతి మనిషి నేర్చుకోవాలి. 



కామెంట్‌లు లేవు: