1, మార్చి 2026, ఆదివారం

ఆదివారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

01-03-2026 ఆదివారం రాశి ఫలితాలు


మేషం


స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారమున సదవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ద పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

---------------------------------------


వృషభం


ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఖర్చులను అదుపు చేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాలి. క్రయ విక్రయాలలో స్వల్ప నష్టాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలించవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------


మిధునం


సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూ సంభందిత వ్యవహారాలు కలసివస్తాయి. అన్ని రంగాలవారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.

---------------------------------------


కర్కాటకం


బంధు మిత్రులతో అనుకోని వివాదాలు కలుగుతాయి. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు కలిసిరావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు సమస్యలుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. 

---------------------------------------


సింహం


ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. సన్నిహితుల సలహాలు కలసివస్తాయి. వస్త్ర,ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పాత స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాలలో దీర్ఘ కాలిక సమస్యల నుండి బయటపడతారు.

---------------------------------------


కన్య


నిరుద్యోగులకు శుభవార్తలుఅందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రముఖులతో పరిచయాల వలన సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో వివాదాలు అధికారుల సహాయంతో సర్దుమణుగుతాయి.

---------------------------------------


తుల


ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఋణ ప్రయత్నాలు అనుకూలించవు. దూర ప్రాంత బంధువులను కలుసుకుంటారు. వ్యాపారపరంగా పెట్టుబడులు లాభించవు. వృత్తి, ఉద్యోగాలలో చేసే ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయి. అనారోగ్య సూచనలున్నవి.

---------------------------------------


వృశ్చికం


ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు పనిచేయదు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాలలో వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఉద్యోగ విషయమై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతోంది.

---------------------------------------


ధనస్సు


వృధా, ఖర్చులు చేస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. విద్యారంగం వారి శ్రమకు గుర్తింపు లభిస్తుంది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో మరింత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు నత్తనడక సాగుతాయి.

---------------------------------------


మకరం


వృత్తి ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఋణాలు తీర్చగలరు. వ్యాపారాలు విస్తరిస్తారు.ధనదాయం బాగుంటుంది.

---------------------------------------


కుంభం


సంతాన పరంగా చిన్నపాటి వివాదాలతో కలుగుతాయి. పనులలో జాప్యం కలిగినా సమయానికి పూర్తిచేస్తారు. స్థిరాస్తి విక్రయాలకు అడ్డంకులు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. నిరుద్యోగుల శ్రమకు ఫలితం లభిస్తుంది.

---------------------------------------


మీనం


అన్నిరంగాలవారికీ సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు పునరాలోచన చెయ్యడం మంచిది. బంధు వర్గం నుండి శుభవార్తలు ఊరటను ఇస్తాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందలేరు. వృత్తి , ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

కామెంట్‌లు లేవు: