20, మార్చి 2023, సోమవారం

బిల్వ చెట్టు వృత్తాంతం

 *బిల్వ చెట్టు వృత్తాంతం, బిల్వాష్టకం - విశిష్టత*


శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే, ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది. 

శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు.


*శివపూజకు సంబంధించినంత వరకు*


వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.


వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.


వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.


వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.


వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.


వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.


వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.


వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.


వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపువ్వు ఉత్తమం.


వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపువ్వు శ్రేష్ఠం.


వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. 


_శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది. శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు, శివునితో సమమయిన పరాక్రమంగలవారై వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు._


ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.


పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. 

ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.


ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు.

రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు.

మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి. 

నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి,

ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. 

ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది.


సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి, మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం.

లింగపురాణం ఆ స్వామికి ఇషామైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది. 

మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. 

అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, ఆయా పత్రిని ఉపయోగించవచ్చు.


ఇక పుష్పదానానికి సంబంధించినంతవరకు, పుష్పాన్ని గాని, ఫలాన్నిగాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగిలబడకూడదు. 

అలా చేయడంవల్ల దుఃఖం కలుగుతుంది. 

అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. 

మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.


ఇప్పటివరకు మనం ఏయే పూలతో శివుని పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. 

అయితే మన మనసులోని కోరికననుసరించి కూడ శివునికి పువ్వులను సమర్పించవచ్చు.


ఉదాహరణకు ధనం కావాలను కున్నవారు శివుని గన్నేరుపూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్తపూలతో, సుఖశాంతుల కోసం నల్లకాలువతో, చక్రవర్తిత్వం కోసం తెల్లతామరలతో, రాజ్యప్రాప్తి కోసం ఎర్రతామరలతో, నాగకేసరం, కేసరీపుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయట.


గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో లాభాసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది. 

కోరుకున్న కన్యను పొందాలంటే శివుని సన్నజాజి పూలతో పూజించాలి. 

సంతానం కావాలనుకునేవారు శివుని మొల్లపువ్వులతో పూజించాలి. 

దర్భపూలతో ఆరోగ్యం, రేలపూలతో ధనం, తుమ్మిపూలతో వశీకరణం, కడిమిపూలతో శత్రుజయం కలుగుతుంది. 

బిల్వదళ పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. 

శివుని మరువంతో పూజిస్తే సుఖం, లోద్దుగపూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది. 

మోదుగ, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది.


*ఇక, శివపూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి!!*


మొగిలి, మాధవి, అడవిమల్లి, సన్నజాజి, దిరిసెన, సాల, మంకెన పువ్వులు శివార్చనకు పనికిరావు. 

బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు. 

వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు.


దశసౌగంధికం పుష్పం నిర్గంధియది భామిని

శాతసాహస్రి కామాలా అనంతం లింగపూజసే పది సుగంధపుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయిన వైనప్పటికీ) శివలింగాన్ని పూజిస్తే, శతసహస్రమాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది.

చేయవలసిన పనులు:

 .

               _*సూక్తిసుధ*_


*చేయవలసిన పనులు:*           పితృవాక్యపరిపాలనచేత శ్రీరాముడు కీర్తి వహించెను. పితృవాక్య పరిపాలనచేత గరుడుడు యశయము పొందెను. సత్యవాక్యపాలనముచేత హరిశ్చంద్రుడు ఖ్యాతి పొందెను. దానంచేత బలిచక్రవర్తి వినుతికెక్కెను, ఓర్పుచేత ధర్మరాజు గొప్పను పొందెను, పెద్దలుతలపెట్టిన  పని నెరవేర్చుటచేత బగీరథుడు ప్రఖ్యాతిగాంచెను, కావున ఈ పనులు పురుషునకు ఆవశ్యకంబులు.

మునగ ఆకు ఉపయోగాలు

 మునగ ఆకు ఉపయోగాలు - సంపూర్ణ వివరణ . 


    మనలో చాలామందికి మునగ ఆకును ఆహారముగా తీసుకొవచ్చు అనే సంగతి చాలమందికి తెలియదు . మరికొంతమందికి మునగ ఆకు శరీరానికి వేడి చేస్తుందని అపొహ కూడా కలదు. ప్రకృతి ప్రసాదించిన అతి ముఖ్యమైన ఆహారపు విలువలు కలిగిన పదార్ధాలలో మునగాకును తప్పకుండా చేర్చాలి. మునగాకులో ఉన్న విటమిన్స్ గాని , ఖనిజ లవణాలు శరీరానికి అమితమైన మేలుని కలిగించును.  


        ఇప్పుడు మునగాకులోని ఆహారపు విలువల గురించి సంపూర్ణముగా వివరిస్తాను. 


  మునగాకులో ఆహారపు విలువలు - 


         16 కిలోల మాంసంలో విటమిన్ A ఎంత ఉంటుందో ఒక కప్పు మునగాకు రసంలో అంతే A విటమిన్ ఉంటుంది. అదేవిధముగా 9 గుడ్లలో గాని , 80 కప్పుల తాజా ఆవుపాలలో గానీ , అరకిలో వెన్నలో గానీ విటమిన్ A ఎంత ఉంటుందో 1 కప్పు మునగాకు రసంలో అంత ఉంటుంది. 


               16 అరటిపళ్ళలో గానీ , 8 ఆపిల్స్ లో గానీ , 6 కమలాలలో గానీ , రెండున్నర కిలోల ద్రాక్షలోగానీ , 6 నిమ్మకాయలలో గానీ , 20 మామిడి కాయలలో గానీ , ఏడున్నర కిలోల పుచ్చకాయలలో గానీ విటమిన్ C ఎంత ఉంటుందో అంత 1 కప్పు మునగాకు రసంలో C విటమిన్ ఉంటుంది. 


        900 గ్రాముల బాదంపప్పులో గానీ , 8 కమలాలలో గానీ , మూడున్నర కిలోల బొప్పాయిలోగాని , 20 కోడిగుడ్లలో గానీ , రెండున్నర కిలోల మాంసంలో గానీ ఎంత క్యాల్షియం ఉంటుందో అంత 1 గుప్పెడు మునగాకులో అంత క్యాల్షియం ఉంటుంది. 


             అదేవిధముగా దీనిలో ఉన్న మాంసకృత్తులు కూడా మాంసం , చేపలు , గుడ్లు , పాలు మొదలగు వాటిలో ఉన్నవాటికంటే అధికంగా ఉన్నాయి. 


             పైన మీకు మునగాకులో ఉన్న విలువైన విటమిన్ల గురించి పోషకాల గురించి వివరించాను. ఇప్పుడు మీకు మునగాకుతో ఔషధయోగాల గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 


  మునగాకుతో ఔషధ యోగాలు - 


 * మరిగే నీటిలో గుప్పెడు మునగాకులు వేసి గట్టిగా మూతపెట్టి 5 నిమిషాలు ఉంచిన తరువాత ఆ పాత్రను చన్నీటిలో పెట్టి బాగా చల్లార్చి పాత్రలోని మునగాకు తీసివేసి మిగిలిన రసములో కొద్దిగా మిరియాలపొడి తగినంత ఉప్పు , 1 చెంచా నిమ్మరసం వేసి ప్రతిరోజూ ఉదయం సేవిస్తూ ఉంటే అజీర్తి , ఉబ్బసం , రక్తహీనత , మామూలు జలుబు , దగ్గు , నిస్సత్తువ వంటివి దరిచేరవు . 


 * ఒక స్పూన్ మునగాకు రసము , కొద్దిగా తేనె , ఒక గ్లాసు కొబ్బరినీటిలో కలిపి కలరా , విరేచనాలు , కామెర్ల వ్యాధులలో ఔషధాలు వాడుకుంటూ ఈ మిశ్రమాన్ని కూడా రోజుకి 2 నుంచి 3 సార్లు తీసుకుంటూ ఉంటే మంచిఫలితాలు వస్తాయి. 


 * ఒక కప్పు మునగాకు రసము బాగా వేడిచేసి చల్లార్చి పైపై నీటిని వంచేసి మిగిలిన పదార్ధములో పాలుపోసి కలిపి ప్రతిరోజూ పిల్లలకు తినిపిస్తుంటే పిల్లలు మంచి ఆరోగ్యముగా ఉండి చిన్నచిన్న వ్యాధులను లెక్కచేయకుండా చక్కగా ఆడుకుంటారు. వారి ఎముకలు గట్టిపడి పెరుగుదల బాగా ఉంటుంది. 


 * ఒక కప్పు మునగాకు రసము బాగా వేడిచేసి చల్లార్చి పైపై నీటిని వంచేసి మిగిలిన పదార్ధములో పాలుపోసి కలిపి ఆ మిశ్రమాన్ని గర్భిణీలు గర్భము ధరించిన నాటినుండి తీసుకొనుచున్న పిండము చక్కగా పెరుగుటయే కాక ప్రసవం సౌఖ్యముగా అగును. దీనిలో ఉన్న క్యాల్షియం , ఐరన్ , విటమిన్స్ బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడును. కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా అన్ని వయసులవారు స్త్రీపురుష బేధము లేకుండా టానిక్ లాగా వాడుకొనవచ్చు. ఈ మిశ్రమాన్ని బాలింతలకు ఇచ్చిన సమృద్దిగా పాలు ఉత్పత్తి అగును. ప్రసవానంతరం త్వరగా కోలుకుంటారు. 


 * బాగా మరిగించి చల్లార్చిన మునగాకు రసం ఒక చెంచా మోతాదులో తీసుకుని ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ నందు కలుపుకుని తాగిన మూత్రవిసర్జనలో మంట , కొన్ని మూత్రపిండాల వ్యాధులు , మలబద్దకం తగ్గును. 


 * ఒక చెంచా మునగాకు రసములో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ పడుకునే ముందు తాగుచున్న రేచీకటి తగ్గును. ఇంకా ఙ్ఞాపకశక్తి కూడా పెరుగును . 


 * పైన చెప్పిన మిశ్రమము నందు కొంచం నిమ్మరసం కూడా కలిపి తీసుకుంటే తలతిరుగుడు , మొలలు , ఎక్కిళ్లు , అజీర్ణం , తీసుకున్న ఆహారం శరీరానికి ఒంటబట్టకపోవడం వంటి సమస్యలు నివారణ అగును. 


 * మునగాకు రసము నందు నువ్వులనూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంతవరకు మరగకాచి ఆ మిశ్రమాన్ని గజ్జి , దురద వంటి చర్మవ్యాధులకు పైపూత ముందుగా రాయుచున్న చర్మవ్యాధులు అంతరించును. 


 * మునగాకులను బాగా వేడిచేసి చిన్నచిన్న దెబ్బలకు , బెణుకు నొప్పుల పైన వేసి కట్టు కట్టిన నొప్పుల బాధలు తగ్గును. 


 * మునగాకు రసము లో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకున్న ముఖము పైన మొటిమలు నశించి ముఖచర్మం మృదువుగా అగును. 


 * ఒకస్పూను మునగాకు రసములో 3 మిరియాలు పొడి చేసి కలిపి కణతలు పైన రాసుకున్న తలనొప్పి అంతరించును. 


          పైన చెప్పిన విధంగా ఎన్నో విలువైన యోగాలు కలవు. ఇప్పుడు మీకు మునగకాయలు మరియు మునగ పువ్వుల ఉపయోగాలు కొన్ని వివరిస్తాను . 


  * మునగ కాయలు , పచ్చిమామిడి కాయలు కలిపి వండిన కూర తినుచున్న వేసవిలో శరీరానికి చలవ చేకూరటయే గాక మన దేహము నందలి ఐరన్ , విటమిన్ C లోపించకుండా ఉంటాయి. 


 * మునగ పువ్వులను పాలలో వేసి కాగబెట్టి తాగుచున్న తాత్కాలిక నపుంసకత్వం తగ్గును. 


 * ఒక స్పూన్ మునగ పువ్వుల రసమును ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగుచున్న ఉబ్బసానికి , అజీర్తికి మంచి ఔషధముగా పనిచేయును . 


 * మూత్రపిండాల వ్యాధిలో సంబంధిత మందులతో పాటు లేత కొబ్బరినీటిలో ఒక చెంచా మునగపువ్వుల రసము కలిపి తాగుచున్న మంచి ఫలితాలు కలుగును. 


           * సమాప్తం * 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

శివసల్లాపము

 .

              _*సుభాషితమ్*_


𝕝𝕝శ్లో𝕝𝕝 

*తద్దినం దుర్దినం మన్యే*

*మేఘఛ్ఛిన్నం న దుర్దినం౹

*యద్దినం శివ సల్లాప* 

*కథా పీయూష వర్జితం॥*


*మేఘములు కమ్మి సూర్యుడు కనబడని రోజు సామాన్యులకు దుర్దినం.....ఏ రోజు శివుడి కబురు లేకుండా, శివుడి తలంపు లేకుండా గడిచిపోతుందో అది దుర్దినము... కష్టాలు అనుభవించిన రోజు దుర్దినం అని మేము అనం...కష్టాలు అనుభవించినా సరే శివుడిని స్మరిస్తే అది సుదినమే*..... (ఇక్కడ శివసల్లాపము అనగా భగవంతునితలంపు అనువిస్తృతార్థమునుగ్రహించాలి).

నీటిలో పడిన నూనె బిందువులా

 శ్లోకం:☝️

*యస్తు సంచరతే దేశాన్*

 *యస్తు సేవేత పండితాన్ l*

*తస్య విస్తారితా బుద్ధిః*

 *తైలబిందు రివాంభసి ll*


భావం: ఎవరు దేశాలు తిరుగుతారో, ఎవరు పండితులను సేవిస్తారో, వారి బుద్ధి నీటిలో పడిన నూనె బిందువులా విస్తరిస్తుంది!

శ్రీ మహాభారతం

 .


               శ్రీ మహాభారతం 

                ➖➖➖✍️

                 300 వ భాగం

    శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:



 #మహానుభావులు:


#విష్ణువుని_దర్శించిన_నారదుడు


భీష్ముడు ధర్మరాజుతో “ధర్మనందనా! నేను నీకు శ్వేతద్వీపంలో ఉండే మహా పురుషులగురించి చెబుతుండగా ప్రసంగవశాత్తు ఉపరిచరమనువు గురించి చెప్పాను. ఇక ఆ మహానుభావుల గురించి చెప్తాను…. 


‘నారదుడు శ్వేతద్వీపముకు వెళ్ళి అక్కడ ఉన్న అద్భుత శరీరాలతో ప్రకాశిస్తున్న మహాపురుషులను చూసి వారికి నమస్కరించాడు. వారుకూడా నారదుడిని ఆదరించారు. అప్పుడు నారదుడు విష్ణువును గురించి స్తోత్రం చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు నారదుడి ముందు విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు. విష్ణువు అనేక శిరస్సులు, అనేక బాహువులు, అనేక పాదములు, అనేక రంగులతో కమండలంతో ఓంకారము గాయత్రిని జపిస్తూ చతుర్వేదములు పారాయణం చేస్తూ నారదుడి ముందు ప్రత్యక్షం అయ్యాడు. 


నారదుడు వినయంతో విష్ణుమూర్తికి నమస్కరించాడు. 


అప్పుడు విష్ణుమూర్తి ‘నారదా ! నన్ను చూడడం అందరికీ సాధ్యం కాదు. లేశమాత్రమైనా అహంకారము లేనంత మాత్రాన అనన్య భక్తివలన నీవు నన్ను చూడగలిగావు. నీకు కావలసిన వరము కోరుకో’ అన్నాడు. 


నారదుడు ‘పరాత్పరా ! నీ దివ్యదర్శనం కంటే నా కేమీ వద్దు’ అన్నాడు. 


విష్ణువు ‘ఎవరు ఇంద్రియనిగ్రహము కలిగి త్రిగుణాతీతుడై ప్రళయకాలంలో కూడా నిశ్చలంగా వెలుగుతుంటాడో అతడే ఆత్మసాక్షి, అజుడు, నిష్కళంకుడుగా వెలుగుతుండే అతడు క్షేత్రజ్ఞుడు, జీవుడు అనబడే వాసుదేవుడు అతడే, సంకర్షుణుడు అతడే. మనస్సు, అహంకారమే ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని అంటారు. ఇది నా మాయ. నేను 24 తత్వములకు అధినాధుడనైన 25వ తత్వమును. పరమపురుషుడను నాకంటే వేరు పరము లేదు. మహామునులు సతతము ఎవరి కొరకు తపస్సు చేస్తుంటారో ఆ వాసుదేవుడను నేనే. ఈ చరాచర జగత్తులో ఉన్న సకలభూతములలో ఉన్న ధాతుశక్తి వేరుగా లేదు ఆ శక్తిని నేనే. ఆ జీవశక్తి సర్వవ్యాప్తంగా సకల లోకములలో విస్తరించి ఉంది. లేని ఎడల ఈ లోకలో చైతన్యము లేదు. జీవుడు వేరు శరీరము వేరు జీవుడిని గురించి నేను తెలుసుకున్నాను అనుకోవడము నా మాయవిలాసము. ఆ మాయ నేను కల్పించినదే. జీవుడికి నాకు భేదము లేదు రెండూ ఒకటే. అచంచలమైన భక్తితో నన్ను కొలిచిన వారికి నేను ముక్తి ప్రసాదిస్తాను. అదిత్యులు, మరుత్తులు, రుద్రులు మొదలైన దేవతా గణములు, బ్రహ్మదేవుడు, చతుర్వేదములు నా స్వరూపములే. నేనే బ్రహ్మదేవుడిని సృష్టించి ఈ సృష్టి కార్యము అప్పగించి నేను నిర్వికారంగా, నిమిత్త మాత్రంగా, ఏకాకిగా కోరిన వారికి సహకరిస్తాను.’



#లోకరక్షణ:


‘ఒక్కోసారి జగద్రక్షణార్ధమై అవతారం ఎత్తుతుంటాను. వరాహరూపంలో హిరణ్యాక్షుడిని, నరసింహరూపంలో హిరణ్యకశిపుని, పరశురాముడిగా క్షత్రియకులాన్ని, దశరధపుత్రుడిగా రావణుడిని సంహరించాను. యాదవకుల సంజాతుడనై ఇంద్రకుమారుడి సాయంతో భూభారాన్ని తగ్గించాను. పూర్వము నేను నరుడు, నారాయణుడు అనే రెండు రూపాలతో మునులుగా అవతరించి లోకరక్షణ చేసాను. తరువాతి కాలంలో మానవరూపంలో అవతరించి లోక కంటకులైన కాలయవనుడిని, కంసుడిని, మురాసురుడిని, నరకాసురుడిని, బాణాసురుడిని సంహరించాను. బాణాసుర వధసమయంలో నన్ను ఎదిరించి నిలిచిన దేవసేనాని కుమారస్వామితో, మహాశివుడితో పోరాడి బాణాసురుడి గర్వము అణిచాను. అంతకు ముందు మత్సత్వము, కూర్మత్వము పొంది దేవతలను వేదములను రక్షించాను. ధర్మరక్షణ కొరకు నేను చేయవలసినది చేసాను. నేను చేయవలసిన కార్యము పూర్తికాగానే నేను తిరిగి నా మూల ప్రకృతిలో చేరిపోతాను. నారదా ! నీవు ఏకాగ్రచిత్తుడవై నన్ను ధ్యానించినందున ఇది నీకు చెప్పాను’ అని విష్ణువు భోదించాడు. 


తరువాత నారదుడుకి శ్వేతద్వీపంలోని మహాపురుషులను చూపి ‘నారదా కాంతి దేహధారులై నిరంతరం నన్నే ధ్యానించే ఈ మహాపురుషులకు నీ ఉనికి భంగము కలిగిస్తుంది కనుక నీవు ఇక ఇక్కడ నుండి వెళ్ళు’ అని చెప్పాడు.


#బదరికావనము:

విష్ణుమూర్తి ఆదేశంతో నారదుడు శ్వేతద్వీపము నుండి బదరికావనము వెళ్ళి అక్కడ ఉన్న నరనారాయణులను దర్శించుకున్నాడు. అక్కడ తాను సాక్షాత్తు విష్ణుమూర్తి ముఖతః విన్న వేదార్ధసారమును, యోగము, సాంఖ్యముల సారమును మునులందరికీ ఉపదేశించాడు. అక్కడి నుండి బ్రహ్మసభకు వెళ్ళి అక్కడి వారికి విష్ణుమూర్తి సందేశం వినిపించాడు. అలా ఆ ఉపదేశం క్రమంగా ముల్లోకాలలో వ్యాపించింది. దానిని నేను నా తండ్రి శంతనుడి ద్వారా విని ఇప్పుడది నేను నీకు చెప్పాను. ఈ ఉపదేశమును దేవతలు మునులు ఎంతో శ్లాఘిస్తారు. వారు విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తారు, శ్రద్ధతో జపిస్తారు, ఏకాగ్రతతో ధ్యానిస్తారు. ధర్మనందనా ! నీవు కూడా విష్ణుమూర్తిని అనన్య భక్తితో పూజించి తరించు. నీవు దీనిని విష్ణుభక్తులకు, నీతిపరులకు, ఇంద్రియ నిగ్రహము కల వారికి మాత్రమే ఉపదేశించు. నీవిప్పటి వరకు విన్న కథలేవి ఈ ఉపదేశముకు సాటి రావు. ఇది విన్న వారికి, తెలుసుకున్న వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు తప్పక సిద్ధిస్తాయి.” అని భీష్ముడు నారదుడికి స్వయంగా విష్ణుమూర్తి ఉపదేశించిన ఉపదేశమును ధర్మరాజుకు ఉపదేశించాడు. 


ఈ పవిత్రమైన ఉపాఖ్యానమును పఠించుతూ పాండవులు విష్ణుమూర్తిని భజిస్తూ కాలంగడిపారు” అని వైశంపాయనుడు జనమే జయుడికి చెప్పాడు.


వ్యాసమహర్షి ఆకాశగమనం:

జనమేజయమహారాజా వ్యాసుడు కూడా విష్ణుమూర్తిని తలచుకుంటూ ఆకాశమార్గాన ప్రయాణిస్తున్నాడు అని వైశంపాయనుడు చెప్పగా … జనమేజయుడు “మహర్షీ ! నీవు మోక్షము అత్యంత సుఖప్రథము అని చెప్పావు. కాని సదా ప్రాపంచిక సుఖములలో మునిగితేలే ప్రజలు వారే కాక దేవతలు కూడా హవిర్భాగాలు పొందడానికి చూపించే ఉత్సుకత మోక్షసాధన అందు చూపరు కదా ! ఇలా ఎందుకు జరుగుతుంది అని నా మనసు సదా మధనపడుతుంది. మానవులే కాక దేవతలు సహితము ఇలా మోక్షమార్గమును వదిలి కర్మబంధాలలో చిక్కుకు పోవడానికి కారణమేమిటి ? నాకు వివరించండి”అని అడిగాడు. 


వైశంపాయనుడు …”జనమేజయమహారాజా ! వ్యాసభగవానుడు తన శిష్యులకు నాలుగు వేదములను భారతమును బోధించాడు. ఆ సమయంలో సుమంతుడు, పైలుడు, జైమిని నీవు అడిగిన విధంగా మేము మా గురువు గారిని అడిగాము. అప్పుడు మా గురువైన వ్యాసుడు నేను ఒకప్పుడు భూతభవిష్యత్తు వర్తమానం తెలుసుకోవడానికి క్షీరసాగరంలో తపస్సు చేసాను. ఆ నారాయణుడి దయ వలన నాకు భూత, భవిష్యత్తు వర్తమానం తెలుసుకునే దివ్యజ్ఞానం లభించింది. దాని ప్రభావంతో నేను ఈ కల్పంలో బ్రహ్మదేవుడు మొదలైన వారు చేసిన పనులు చూడగలిగాను. వాటిని మీకు చెప్తాను. మరుత్తులు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు మొదలగు దేవతా గణములు, మునులు, బ్రహ్మదేవుడిని చూసి ‘మాకర్తవ్యము బోధించండి’ అని అడిగారు. 


బ్రహ్మదేవుడు ‘నా మనసులో మెదిలే విషయమే మీరు నాకు గుర్తుచేసారు. మనమందరం విష్ణుమూర్తిని అడిగి మన కర్తవ్యం తెలుకుందాము రండి’ అని వారిని విష్ణులోకము తీసుకు వెళ్ళి అక్కడ వారంతా కలిసి విష్ణువును గురించి తపస్సు చేయగా వారికి అప్పుడు ఒక దివ్యమైన వాక్కు వినిపించింది…



#పరమాత్మ వాణి:


దివ్యవాణి… “దేవతలారా ! మునులారా ! మీరు వచ్చిన పని నాకు తెలుసు. బ్రహ్మదేవుడు ఈ లోకములకు గురువు. ఆయన చెప్పినదే వేదవాక్కు. నాకు కూడా ఆయన చెప్పినదే వేదవాక్కు. మీరందరూ కలిసి వేదోక్తంగా యజ్ఞము చేసి అందు నాకు హవిర్భాగం కల్పించండి” అని పలికింది. 


ఆ మాటలకు ఆనందించిన బ్రహ్మదేవుడు ఒక యాగమును ఏర్పాటు చేయమని దేవతలకు ఆదేశం ఇచ్చాడు. 


దేవతలందరూ వేదోక్తంగా యాగం చెయ్యడానికి పూనుకున్నారు. ఆ యాగమునందు విష్ణుమూర్తికి హవిర్భాగము కల్పించారు. 


విష్ణుమూర్తి అదృశ్యరూపంలో ఆకాశంలో నిలబడి “దేవతలారా ! మునులారా ! మీరు నేను చెప్పినట్లు యజ్ఞము చేసారు. మీరు చేసిన పుణ్యముకు తగిన ప్రతిఫలం ఇస్తాను. మరీచి, పులహుడు, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, క్రతువు, వశిష్ఠుడు అను బ్రహ్మమానసపుత్రులు వేదములకు ఆచార్యులు. వీరు ఏర్పరిచిన నియమాలు, ఆచారములు, పద్ధతుల ప్రకారం మానవులు యజ్ఞములు చేస్తారు. అందులో మీకందరికి హవిర్భాగములు సమర్పిస్తారు. దానితో వారు తృప్తి పొందుతారు. బ్రహ్మమానస పుత్రులైన సన, సనక, సనంద, కపిల, సనత్కుమారులు సహజమైన జ్ఞానసంపద కలిగి ముక్తి గురించే సదా చింతిస్తుంటారు. వీరు మోక్షధర్మములను జగములకు వివరిస్తారు. మీ అందరికి తల్లి, తండ్రి, గురువు బ్రహ్మదేవుడే. అతడు నా అభీష్టము మేరకు లోకాలను శాసిస్తాడు. నా నుండి పుట్టిన రుద్రుడు లోకాలకు ఆరాధనీయుడు, పూజ్యుడు, సకల వరములను ప్రసాదించు కరుణామయుడు. ఇక మీరు వెళ్ళి మీకు విధించిన వేదోక్త కర్మలను బ్రహ్మ, మరీచి, ప్రజాపతులు చెప్పినట్లు విని ఆచరించండి. ఇది కృతయుగము అను పేరుతో ఉత్తమమైన కాలంగా వర్ధిల్లుతుంది. యజ్ఞయాగములలో పశువధ చేయరాదు. ఇందు ఏమాత్రము సందేహము లేదు” అన్నాడు. దేవతలు, మునులు విష్ణుమూర్తికి నమస్కరించి వెళ్ళారు.



#హయగ్రీవుడు:


దేవతలు, మునులు వెళ్ళినా అక్కడే ఉన్న బ్రహ్మదేవుడి ముందు హయగ్రీవరూపంలో వేదాధ్యయనం చేస్తూ దండ కమండలములతో ఎదుటకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మదేవుడిని కౌగలించుకుని “బ్రహ్మదేవా ! నీవు సర్వ లోకములకు విధాతవు, గురుడవు, అధిపతివి అందుకే నేను ఈ జగముల భారం నీ అందు ఉంచి నేను సుఖంగా ఉన్నాను. ఈ లోకమును సక్రమంగా నడపడం నీ బాధ్యత. ఈ లోకమును నడపడంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు నేను కల్పించుకుని తీర్చుతుంటాను”అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. 


ఇలా యజ్ఞయాగములలో అగ్రభాగమునకు అర్హుడు, యజ్ఞధారి అయిన మహావిష్ణువు ప్రవృత్తి ధర్మమును నిర్వహించడానికి బ్రహ్మదేవుని, దేవతలను నియమించి తాను మాత్రం నివృత్తి ధర్మమును నిర్వర్తిస్తూ జ్ఞానమూర్తి అయి సర్వత్రా సంచరిస్తున్నాడు.” అని వ్యాసుడు వైశంపాయనుడికి చెప్పాడు.



#విష్ణుతత్వము:


వ్యాసుడు ఇంకా ఇలా ….                     “వైశంపాయనా ! ఈ సమస్త లోకములను వాటిని పదిలంగా రక్షిస్తూ తిరిగి వాటిని తనలో లీనం చేసుకునే విష్ణుమూర్తిని నేను కొలుస్తాను. అజుని, విశ్వమే తన రూపముగా కలవాడిని, మృత్యంజయుడిని, దేవతలకు అధినాధుడిని, ఆది అయిన వాడిని, నాలుగు వేదములను అధ్యయనం చేసిన వాడిని, ఆత్మతో కాని ఎరుగ లేని వాడిని, ఈశానుడిని, నాశనం లేని వాడిని, అన్ని తపములకు కర్మఫలదాతను నేను ఆశ్రయిస్తాను. ఈ విధంగా వ్యాసుడు నారాయణుడిని స్తుతించాడు. వ్యాసుడు మమ్ము చూసి నా పూర్వ వృత్తాంతము మీకు చెప్పాను. మీరు కూడా నాకు విష్ణుమూర్తి చెప్పిన ఉపదేశములను ఆచరించండి. ఆ పరమేశ్వరుడిని కొలవండి. వేదముల చెప్పిన ప్రకారము నడవండి అని మాకు చెప్పాడు. మేము వ్యాసుడు చెప్పిన విధముగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదముల ప్రకారము ఈ త్రిలోకాధిపతిని స్తుతించాము. మనసులో ఆరాధించాము” అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడు. జనమేజయ మహారాజా ! వ్యాసుడు మాకు బోధించిన పుణ్యప్రథమైన విష్ణుతత్వము చదినను విన్న విప్రుడు వేదవేదాంగములను చదివిన ఫలమును పొందుతాడు, క్షత్రియుడు సర్వత్రా విజయము పొందుతాడు, వైశ్యుడు ధనలాభము పొందుతాడు, శూద్రుడు అత్యంత సుఖములను పొందుతాడు. పెళ్ళికాని వారికి పెళ్ళి జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం జరిగి మంచి పుత్రుడిని పొందుతుంది. గొడ్రాలు సంతానవతి ఔతుంది” అని వైశంపాయనుడు ఫలశృతి చెప్పాడు.✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                    .🙏

19, మార్చి 2023, ఆదివారం

ఇడ్లీలు - బ్రహ్మానుభూతి*

 


          *ఇడ్లీలు - బ్రహ్మానుభూతి*

                  ➖➖➖✍️


తిరుచిరాపల్లి భిక్షందర్ దేవాలయలో ఉండే మా మావయ్య కీర్తిశేషులు శ్రీ సుందరేశ్వర అయ్యర్ ఒకసారి తిరువణ్ణామలై వెళ్లారు. 


దేవాలయంలో దర్శనం చేసుకుని రమణ మహర్షుల దర్శనం కోసం రమణాశ్రమానికి వెళ్లారు. 

బహుశా 1940 లేదా 1945 సమయం అప్పుడు అనుకుంటా. భగవాన్ రమణుల గురించి ఎంతో విన్నారు కానీ వారిని మొదటిసారిగా దర్శించుకోబోతున్నారు. 


భగవానులు అందరితో కలసి ఫలహారము, భోజనం చెయ్యడం చూసి ఆశ్చర్యపోయారు. రమణులు ఇడ్లీలు తినడం చూసి అమితాశ్చర్యానికి లోనయ్యారు.


భగవాన్ రమణులు భక్తులకు దర్శనం ఇవ్వడానికి హాలులోకి రాగానే, మా మావయ్య కూడా అందరితోపాటు కూర్చున్నారు. 


అప్పుడు మా మావయ్యకి ఒక ఒళ్ళు జలదరించే అద్భుతం జరిగింది. రమణుల కళ్ళు మామావయ్య కళ్ళతో కలిశాయి. వెంటనే మా మావయ్య శరీరం తేలిక అయ్యింది. చాలా ఆనందం కలిగింది. వెంటనే బాహ్యస్మృతిని కోల్పోయారు. కొద్దిసేపటి తరువాత భగవాన్ రమణులు చూపు తిప్పుకోవడంతో మరలా బాహ్య స్మృతి కలిగింది. 


చుట్టూ ఏం జరుగుతోందో తెలియక, బాహ్యస్మృతి కోల్పోయి అలా ఎంతసేపు ఉన్నారో కూడా వారికి అర్థం కాలేదు. ఇదంతా వారికి చాలా గందరగోళంగా ఉంది. ఎవర్నైనా అడిగి తెలుసుకోవాలనుంది - కానీ ఎవరిని అడగాలి? చివరకు కంచి పరమాచార్య స్వామివారిని అడిగి నివృత్తి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.


వెంటనే కంచి వెళ్ళి మహాస్వామి వారిని దర్శనం చేసుకున్నారు. 


స్వామివారు విశ్రాంతిగా ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి, స్వామివారి పాదాలపై పడి తమ తాతగారి పేరు (శ్రీ నారాయణ అయ్యర్), తండ్రిగారి పేరు (శ్రీ గణపతి అయ్యర్), అమ్మగారి పేరు (శ్రీమతి ఈశ్వరి) చెప్పి, వారి మేనమామ గారైన శ్రీ పైంగానాడు పంచపకేశ అయ్యర్ (పరమాచార్య స్వామివారు మహేంద్రమంగళంలో చదువుకుంటున్నప్పుడు, స్వామివారికి ఋగ్వేదం బోధించినవారు) గారి పేరు చెప్పి, చివరగా తమ పేరు చెప్పి నమస్కరించారు. తరువాత వారికి కలిగిన అనుభవాన్ని చెప్పారు.


“ఇటీవలే తిరువణ్ణామలై వెళ్ళాను”


స్వామివారు చిరునవ్వుతో, “స్వామి దర్శనం చేసుకున్నావా?” అని అడిగారు.


మేమందరమూ “స్వామీ” అని కొలుచుకునే దేవుడు,   భగవాన్ రమణులను “స్వామీ” అని సంబోధిస్తూ “స్వామి” దర్శనం చేసుకున్నవా అని మా మావయ్యని అడిగారు!!!


“హా చేసుకున్నాను”


“ఏమి? ‘హా చేసుకున్నాను’ అని అంటున్నావు? ఏం జరిగింది?”


మా మావయ్య ఏదో చెప్పాలనుకుంటున్నారని, కానీ చెప్పడం సరియా? కాదా? అని సంశయిస్తున్నారని స్వామివారికి తెలుసు. అందుకనే చెప్పమని స్వామివారు ప్రోత్సహిస్తున్నారు.


*మావయ్య :* “లేదు... భగవానుల దర్శనం చేసుకున్నాను. దర్శనం బాగా జరిగింది. వారు అందరితో కూర్చుని భోజనం కూడా చేశారు. . .”


*స్వామివారు :* “*అందరితోపాటు తిన్నారు . . .* ఎందుకు దీర్ఘం తీస్తున్నావు? ఎందుకంటే రమణులు ఇడ్లీలు కూడా తిన్నారని కదూ? అందుకేనా?”


స్వామివారికి తెలియని విషయం ఏదైనా ఉందా? వారి సందేహాన్ని స్వామివారు గ్రహించారు.


*మావయ్య :* “అవును. అవును... తిన్నారు... ఇడ్లీలు తిన్నారు...!”


*స్వామివారు :* “కనుక నీకు అనిపించింది. ‘ఏమిటిది? కంచి మఠంలో స్వామివారు ఇడ్లీలు తినరు, కానీ ఇక్కడ రమణులు ఇడ్లీలను తింటున్నారు’ అవునా?”


*మావయ్య :* “అవును... స్వామీ”


స్వామివారు చిరునవ్వుతో చెప్పడం మొదలుపెట్టారు...“రమణులు అన్ని ఆశ్రమ పరిధులను దాటిపోయారు. వారికి మఠము, నియమము, పరిధి లేవు. కానీ ఇక్కడ అలా కాదు. ఈ మఠానికి సాంప్రదాయాలున్నాయి. నియమాలున్నాయి, హద్దులున్నాయి. మరియు నాకు వాటినన్నిటిని పాటించి పాలించాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇక్కడ ఇడ్లీలు తినరు (తమని చూపుతూ చిరునవ్వుతూ). అర్థమైందా?”


*మావయ్య :* “హా...” తలూపారు మా మావయ్య.


*స్వామివారు :* “సరే. అక్కడ ఇంకేం జరిగింది?”


*మావయ్య :* “మేము సాయంత్రం మహర్షుల దర్శనానికి వెళ్లాము. అప్పుడు నేను రమణుల వైపే తీక్షణంగా చూస్తున్నాను. హఠాత్తుగా వారు నావైపు చూశారు. వారి చూపు నా కళ్ళల్లోకి పడగానే, నాకు ఏదో జరిగింది. నా స్మృతిని కోల్పోయాను. నా శరీరం తేలికైపోయింది. చాలా అద్భుతమైన అనుభవం. అలా ఎంతసేపు ఉండిపోయానో నాకు తెలియలేదు. హఠాత్తుగా నాకు బాహ్యస్మృతి పొందగానే రమణులు వేరేవైపు చూస్తున్నారు...”


*స్వామివారు :* “అంటే, ఏం జరిగిందో నీకు తెలియదు అంటావు?”


*మావయ్య :* “అవును”


*స్వామివారు :* “అంతేకాక, ఎవరికైనా ఆ స్థితి శాశ్వతంగా ఉండిపోవాలని అనుకుంటున్నావు, కదూ?”


*మావయ్య :* “అవును”


స్వామివారు చిన్నగా నవ్వారు. కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తరువాత నిదానంగా చెప్పనారంభించారు...“రమణులు కొద్దిసేపు నీ మనస్సును లేకుండా చేశారు. మనస్సు లేకపోతే, మనస్సు లుప్తమయిపోతే, ఇక ఉండేది ఆనందం మాత్రమే. అటువంటి శాశ్వత ఆనందాన్ని నీకు కాస్త రుచి చూపించారు. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి వారి దర్శనం చేసుకో!”


మా మావయ్య స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించి ఊరికి వెళ్ళిపోయారు. తరువాత, ఎన్నోసార్లు భగవాన్ రమణుల దర్శనం చేసుకున్నారు.


ఈ సంఘటనను మా మావయ్య ఎన్నోమార్లు చెబుతూ, ప్రతిసారీ ఆ బ్రహ్మానంద అనుభవాన్ని పొందేవారు.✍️

                       --- విశి నాథన్.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహ

                       🌷🙏🌷

దూసుకుపోవచ్చు

 శ్లోకం:☝

*యద్వత్ ప్రత్యఞ్చి బాణస్య*

  *తీవ్రగతిశరాయణం |*

*తద్వత్ ప్రత్యఞ్చి విక్రాంతే*

 *యశోమార్గపరాయణం ||*


భావం: ఎలాగైతే వింటి నారిని వెనక్కి సారించి వదిలితే బాణం అత్యంత వేగంగా వెళుతుందో, అలాగే జరిగిన విషయాలని ఒక్కసారి సింహావలోకనం చేసుకుని ప్రణాళిక వేసుకుంటే అభివృద్ధి పథంలో శరవేగంతో దూసుకుపోవచ్చు!

మనస్సుద్వారా

 .


              _*సుభాషితమ్*_


𝕝𝕝 శ్లో𝕝𝕝 

*యన్మనసా ధ్యాయతి తద్వాచా వదతి!* 

             *యద్వాచా వదతి తత్కర్మణా కరోతి*! 

             *యత్కర్మణా కరోతి తదపి సంపద్యతే!!*


తా𝕝𝕝 *ఏదైతే మనం మనస్సుద్వారా ఆలోచన (ధ్యానం ) చేస్తున్నామో, అదే వాక్కు ద్వారా వచించాలి*..... *ఏదైతే వాక్కు ద్వారా వచిస్తున్నామో, అదే కర్మ-పని ద్వారా చేయాలి. ఏదైతే కర్మ ద్వారా చేస్తున్నామో ఆ సత్ కర్మ ఫలాలను సత్యదృష్టితో దర్శించి సర్వజనుల సౌఖ్యాన్ని ఆకాంక్షించాలి*.......


*:ఒక మంచి విషయము:*


పాపములు:-   పరులకు కీడుదలచుట మనస్సు చేసిన పాపము; పరులను పరుష వాక్యములు పలుకుట నోరు చేసిన పాపము; పరధనమును అపహరించుట చేతులు చేసిన పాపము; పరుల శ్రమమునెంచని వాని వద్దికి తిరుగుడట కాళ్లుజేసిన పాపము, పరనిందవినుట చెవులు చేసిన పాపము, ప్రీతిలేని అన్నము తినుట నాలుక చేసిన పాపము, పరస్త్రీలను ఆలింగనము చేయుట దేహము చేసిన  పాపము.

సటికా వ్రుక్షాయుర్వేధం



: సటికా వ్రుక్షాయుర్వేధం - ప్రాచీన వృక్ష వైద్య గ్రంధం .


 * వృక్ష జాతులు అనగా తిన్త్రిని మామిడి మొదలగు చెట్లు ను తీగలుగా మార్చుట 


  బియ్యపు పొడి 1 భాగము , మినుముల 1 బాగము , నలగ దంచిన వడ్ల పిండి 1 భాగము , నువ్వుల పిండి 1 భాగము, వీటిని మాంసము కడిగిన నీళ్లలో కడిగి పసుపు పొడి పోగవేసి పాటి మట్టి నేలలో నాటితే అవి తీగలుగా మారును.


 చెట్లు అప్పటికి అప్పుడే పెరిగి చిగుర్చుట - 


 * అంకోల తైలము లొ యే చెట్టు యెక్క బీజములు నైనా నూరు మాట్లు తడిపి వడగండ్లతో కలిపి పాటిమట్టి లొ నాటితే అప్పటికప్పుడే చెట్టు మొలిచి పండ్లు, పువ్వులు ఇచ్చును.


 బీజములు తొందరగా మొలుచుటకు - 


 ఆయా పండ్లు కాచే సమయమున వాటి విత్తనాలు సేకరించి వాటిని బాగుగా ఎండించి పాలలో తడిపి అయిదు దినములు ఎండనించి వాయు లవంగాల కషాయముతో కలిసిన నేతితో పోగవేసి పంచాంగం, బృహతి, నిప్పుల బూడిద ను పాలలొ కలిపి ఆ విత్తనాలను దీనితో పిసికి ఆ ప్రకారము అయిదు రోజులు అయిన పిమ్మట ఆ బీజములు ఆవు పేడతో , ఆవు మూత్రములో ఒక్కో దినము నానబెట్టి విత్తిన మొక్కలు తొందరగా మొలుచును . 

 చెట్లకు విపరీతముగా పువ్వులు , పండ్లు కాచుటకు 

 * చేప మాంసమును , ఆవు పేడతో కలిపి చెట్లకు వేసి యావలు, నువ్వులు , మిణుములు, పెసలు, వులవులు ఈ ఐదింటిని సమబాగాలుగా కలిపి నీళ్లు పోసి వుడకపెట్టి ఆ నీళ్లు చల్లార్చి రెండు దినములు వరసగా చెట్లకు చల్లితే చెట్లు విశేషముగా ఫలించును. 


 * మామిడి చెట్లకు నక్క మాంసం , ఉడుము మాంసం లేదా లేడి, పంది మాంసం , రావి చిగుల్లు, మర్రి చిగుల్లు , అత్తి చిగుల్లు, మామిడి చిగుల్లు, నేరేడు చిగుల్లు, కషాయం పెట్టి చల్లార్చి పాదులో పొసిన మంచి పండ్లు పండును. 

 * మామిడి చెట్టు వేరు దగ్గర చుట్టు గొడ్డలితో కొంచం కాటు చేసి కషాయం పొసిన విశేషమైన ఫలములు ఇచ్చును.


 * పెసలు , మినుములు ఉడక పెట్టి చల్లార్చి ఆ నీళ్లు తేట వంచి ఆ గుజ్జు కొబ్బరి చెట్టు వేళ్ళకు పట్టించి ఉప్పు నిండా వేసి ఆ నీళ్లు పోస్తే పెద్ద పెద్ద కాయలు కాయును , కాయలు రాలవు.


 * పోక చెట్లకు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పైన ఎండిపోయిన మట్టలు కోసి చెట్ల చుట్టు త్రవ్వి పైన చెప్పిన కషాయము పొస్తే అధికముగా పండును.


 * అరటి చెట్టు కు ఏనుగు దంతపు పొట్టు కాల్చిన నిప్పులోగాని, పంది పెంటికలు, గుర్రపు పెంటికలు కాల్చిన నిప్పులో గాని ఇనప సలాకు ఎర్రగా కాల్చి చెట్టు మొదట వేరులో గుచ్చితే చాలా గొప్ప ఫలితాలు ఇచ్చును.


 * రేగు చెట్టుకి నువ్వులు , పెసలు సమబాగములు గా చేర్చి దానితో కొంచం అతిమధురం వేసి చెట్టు చుట్టు వేసి మాంసం కడిగిన నీళ్లు పొసిన మరియు నూవుల పిండి , అతిమధురం కలిపి ఎరువు వేసిన తియ్యటి ఫలములు మరియు తియ్యటి ఫలములు ఇచ్చును. 


 * పత్తి విత్తనాలను ఆవు పేడలో , ఆవు పంచితములో చాలుమార్లు తడిపి పేడనీళ్ళు చల్లుతూ నాటిన తరువాత పందికొవ్వు, మాంసం కడిగిన నీళ్లు చల్లిన అది తన జాతిని విడిచి నిమ్మ జాతిగా మారును. 


             : ఆయుర్వేదం నందు వివరించబడిన భోజన నియమాలు - 


     "అన్నం పరబ్రహ్మ స్వరూపం" కావున నియమనిష్టలతో భోజనం చేయవలెను . ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి నియమ నిబంధలు పాటించకుండా మనుషులు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. మనం చేసే ప్రతిపని కొన్ని నియమానుసారాల ప్రకారం చేసినప్పుడే ఆ పని సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి నియమనిబంధనలు మన పూర్వీకులు ఎంతో దూరదృష్టితో ఆలోచించి కొన్ని , తమ అనుభవ పూర్వకంగా కొన్ని ఏర్పరిచారు. వాటిని పాటించటం వలన మనకి మంచి ఆరోగ్యం , ఆయష్షు కలుగును. కొన్ని పురాతన గ్రంథాలు పరిశీలించి వాటిలో మీకు కొన్ని తెలియచేస్తున్నాను .


  భోజన నియమాలు - 


 * భోజనం చేయటానికి ముందే స్నానం ఆచరించి దేవతార్చన చేసి మంచి మనసుతో మంగళకరమైన వస్తు దర్శనం చేయవలెను . సూర్యుడు , అగ్ని, గోవు మొదలగు మంగళకరం అయిన వాటిని దర్శించుకొనవలెను . ఆ తరువాత చల్లని నీటితో బాగుగా కాళ్లు , చేతులు , ముఖం పరిశుభ్రం చేసుకుని తెల్లని వస్త్రం ధరించవలెను 

ఎందుకనగా యోగశాస్త్రం నందు మనుషుని యొక్క శ్వాస గతి 12 అంగుళములు అనియు భోజనకాలం నందు మనుష్యుని యొక్క శ్వాసగతి 20 అంగుళములు అని తెలుపబడినది. అతిశ్వాస ఆయుఃయుక్షీణం .శ్వాసగతి తగ్గిన యొడల ఆయుర్వృద్ధి అగును. కావున భోజనకాలం నందు హస్త, పాద , ముఖప్రక్షాళన చేయనిచో శ్వాసగతి ఎక్కువ అగును. అందుకే చల్లని నీటితో ప్రక్షాళన చేసుకుని ప్రశాంత మనస్సుతో భోజనశాల కు చేరవలెను .


 * తడిసిన పాదములతో భోజనం చేయవలెను దీనివల్ల ఆయుర్వృద్ధి కలుగును. తడిసిన పాదములతో శయనించిన ఆయష్షు క్షీణించును. దీనికి ముందు పితృదేవతలను , అతిధులను , శిశువులకు , గర్భిణి స్త్రీలకు , పెంచుకున్న పశుపక్ష్యాదులకు మొదట ఆహారం మొసంగి తృప్తిపరుచుట మరువకూడదు . 


 * ఆహారము మనస్సుకి, తృప్తిని , బలం, ఆయష్షు , తేజస్సు , ఉత్సాహం , జ్ఞాపక శక్తి , రోగనిరోధక శక్తి కలిగించును.


 * ఆయష్షు కోరువాడు భోజనం తూర్పుముఖంగా , యశస్సు కోరువాడు దక్షిణముఖంగా కూర్చొని భుజించవలెను .


 * ఉత్తరాభిముఖంగా కూర్చుని భుజించిన యెడల విద్యుత్ శక్తి నరముల ద్వారా అత్యంత తీవ్రంగా ప్రవహించును. అందువలన ఉత్తరాభిముఖంగా కూర్చుని భుజించరాదు . 


 * పితృదేవతలు దక్షిణదిశ యందు ఉండుటచే దక్షిణదిశకు అభిముఖంగా కూర్చుని భుజించటం వలన యశస్సు లభించును.


 * భోజనం పగలు దినములో ఎనిమిదో వంతు కాలం అనగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్య చేయవలెను . 


 * ఉదయం 9 గంటలలోపు భుజించినచో ధాతువులు పూర్తిగా జనించవు . 12 గంటల తరువాత భుజించినచో బలం క్షీణించును. కావున ఉదయం 9 నుంచి 12 గంటల మధ్యనే భుజించవలెను . 


 * రాత్రి భోజనం 8 గంటల లోపు ముగించవలెను . అదికూడా తేలికైన సులభంగా జీర్ణం అయ్యే విధంగా ఉండును.రాత్రి సమయాన మన శరీరంలో మెటబాలిజం రేటు బాగా తగ్గును. కావున తిన్న ఆహారం శక్తిగా మారక కొవ్వుగా మారును . రోగులు ముఖ్యంగా 

ఆస్తమా రోగులు 7 గంటలకే ఆహారాన్ని భుజించవలెను .


 * భోజన విషయంలో సమయపాలన గురించి నీతిశాస్త్రం చెప్తున్న విషయం మీకు తెలియచేస్తున్నాను . " నీకోసం వందమంది కాచుకుని కూర్చున్నను సమయం అయితే వారిని విడిచి భోజనం చేయాలి . వెయ్యి మంది కూర్చున్నను వదిలివెళ్ళి స్నానం చేయవలెను . లక్షమంది వద్దన్నా వెళ్లి దానం చెయ్యాలి . కోటిమంది కాదన్నా వెళ్లి భగవంతుడి ధ్యానం చేయాలి " అన్నది నీతిశాస్తం వివరించింది.


 * మలమూత్రములు బాగుగా వెడలి , హృదయం నిర్మలమై , వాతాది దోషములు చక్కగా ప్రవర్తించుచు లోగడ భుజించిన ఆహారం జీర్ణమైనట్టు త్రేపులు వచ్చి బాగుగా ఆకలిపుట్టి , వాతం క్రిందివైపు పయనించి సంచరిస్తూ జఠరాగ్ని బాగా ప్రజ్వరిల్లుతూ ఇంద్రియములు వినిర్మములై శరీరం తేలికగా ఉన్నప్పుడు కాలం అతిక్రమించకుండా నియమం ప్రకారం ఆహారం భుజించవలెను .


 * ఆకాలంలో అతిస్వల్పంగా భుజించినను అది విషంగా మారి రోగాలకు కారణం అవుతుంది. ఎల్లప్పుడు సకాలంలోనే భుజించవలెను .


 * ఉదయం , సాయంకాలం నందు మాత్రమే మనుష్యులు భోజనం చేయాలని వేదం చెప్తుంది .ఆయుర్వేదం ప్రకారం "ఏకభుక్త్తోమహాయోగి , ద్వీభుక్తో మహాభోగి, త్రిభుక్తో మహారోగి " అనగా రోజుకి ఒకసారి భోజనం చేసేవాడు మహాయోగి , రోజుకి రెండు సార్లు భోజనం చేసేవాడు మహాభోగి , రోజుకి మూడుసార్లు భోజనం చేసేవాడు మహారోగి అని అర్థం .కావున రోజుకి రెండుసార్లు మాత్రమే భోజనం చేయడం శ్రేష్టం అని మన సాంప్రదాయం చాటుతుంది. 


 * రెండు భోజనాల మధ్య ఫలహారం అనగా పండ్లు తినవచ్చు. జీర్ణక్రియ అయ్యే సమయంలో మరలా భుజించరాదు . అది రోగాలకు ముఖ్యకారణం . అప్పుడప్పుడు జీర్ణ అవయవాలకు విశ్రాంతి ఇవ్వవలెను.లేనిచో అవి బలహీనం చెందును 


 * చిన్నపిల్లలకు అన్నకోశం పెరిగి ఉండదు కనుక వారు శరీరంకి కావలసిన ఆహారం ఒక్క మారు తీసుకొనలేరు . వారు ఆటపాటలతో ఎగురుచుందురు. వారు ఒకటికి రెండు సార్లు తినినను తప్పులేదు . కష్టం చేయు శ్రామిక వర్గం వారు జఠరాగ్ని ఎక్కువుగా ఉండును. కావున వారు మూడొవసారి భోజనం చేయవచ్చు . 


 * మీరు తినవలసినంత మాత్రమే తినవలెను .ఎక్కువ తిన్నచో అజీర్ణం రోగం కలుగును. ఒకపూట ఎక్కువుగాను ఒకపూట తక్కువుగాను సేవించుటయు ఒక దినం తిని మరుదినం నిరాహారంగా అనగా ఏమి తినకుండా ఉండరాదు. 


 * మానవుడు తన పొట్ట యందలి స్థలముని నాలుగు భాగాలుగా విభజించి అందు రెండు భాగములు ఘనద్రవ రూపములు భక్ష్యములు 

అనగా నమిలి తినదగినవి , భోజ్యమనగా నమలాక చప్పరించి తినతగినవి . లేహ్యం అనగా నాలుకతో చప్పరించి తినదగినట్లు కొంచెం ద్రవరూపంగా ఉండునది , పేయం అనగా మిక్కిలి ద్రవరూపం అయి త్రాగదగినది ఈ విధంగా నాలుగు రకాల ఆహారముల చేత ఒక భాగం నీటిచేత నింపి మిగిలిన ఒక భాగం వాయు సంచారం కొరకు అనగా జీర్ణక్రియ జరుగుటకై వదిలినచో ఆహారం బాగుగా జీర్ణం అగును.


 * ప్రత్యేక పర్వదినములలో తీపి , నెయ్యి, నూనె పదార్దములు , సెనగ పిండితో తయారగునవి ఉపయోగించినప్పుడు మిగతా 

భోజనం తగ్గించి చివర పెరుగును వాడకుండా ముఖ్యంగా చారు, మజ్జిగలతో భోజనం ముగించుట ఉత్తమం . 


 * భోజనం చేయుటకు తూర్పు ముఖం అలా వీలుకానిచో దక్షిణాభిముఖంగా ఉన్నతంగా , సమప్రదేశమున పీట లేక చాప మీద కూర్చొనవలెను. ఆకులమీద , ఇనుపమేకులు వేసిన పీటల మీద కూర్చుని భోజనం చేయకూడదు . ఇత్తడి మేకులు వేసిన పీటల మీద కూర్చుని తినటం ఆచారం .


 * ఒక వస్త్రంని మాత్రమే ధరించి భోజనం చేయరాదు . కావున ఉత్తరీయం పైన కప్పుకొనవలెను . దానివలన శరీరం నకు బాహ్యవాయువులు తగలక సురక్షితంగా ఉండును.అది పట్టువస్త్రం అయితే మరింత మంచిది . తలపాగా ధరించి భోజనం చేయరాదు . టేబుల్ మీద భోజనం శాస్త్ర విరుద్ధం . 


 * ఆహారం భుజించు సమయం నందు అధికంగా మాట్లాడకుండా , అతిగా నవ్వకుండా మనుజుడు తన శరీరం నకు అనుకూలం అయిన మరియు తేలిక అయిన స్నిగ్ధగుణము , ఉష్ణగుణము కలిగి ద్రవప్రమాణం అయి మధుర , ఆమ్ల , లవణ, కటుతిక్త కషాయములు అను ఆరు రసములు గల ఆహారంను మిక్కిలి తొందరగా కాకుండా మిక్కిలి మెల్లగా కాకుండగా భుజించవలెను .


 * ఆకలిగొన్నవారు, రోగులు , హీనులు , దరిద్రులు , బిక్షగాండ్రు వీరి యొక్కయూ కుక్క, కోడి మొదలగు వాని యొక్క దృష్టి భోజన కాలము న తగలకూడదు.కావున భొజనశాలకు వీరిని దూరంగా ఉండునట్లు చేయవలెను . 


 * బంగారు పాత్ర యందు భోజనం మంగళకరం మనోదోషములు పొగొట్టును. జఠరాగ్నిని వృద్ధిపరుచును. మంచి చూపుని ఇచ్చును.


 * వెండిపాత్రల యందు శ్లేష్మాన్ని హరించును మూత్రరోగముని హరించును . ఆరోగ్యకరం . వెండి పళ్లెం మధ్యలో బంగారం తాపడం చేయుంచుట మంచిది . 


 * కంచుపాత్రలో భోజనం చేయుట నోటివెంట రక్తం పడు రోగముని నయం చేయును . శుభ్రంగా మరియు రుచికరంగా ఉండి నేత్రరోగములు హరించును . బుద్దిని పెంచును. అగ్నివృద్ధి పెంపొందించి శరీరానికి కాంతి ని ప్రసాదించును. ఎముకలు వృద్ది అగుటకు తోడ్పడును. హృదయ రోగములను నిగ్రహించును.


  * స్టీల్ పాత్రలో భోజనం చేసిన పాండురోగం తగ్గును. కామెర్ల వ్యాధిని హరించును . 


 * అల్యూమినియం పాత్రయందు వండిన భోజనము వండుచున్న మరియు తినుచుండిన అతిసార వ్యాధి కలుగును. 


 * గాజు పాత్రలో ఆహారం తీసుకోవడం వలన ఉపయోగం ఏమియును లేదు . కేవలం దోషాలు మాత్రం కలగవు. ఆమ్లములు ఇందు ప్రభావం చూపించలేవు . 


 * అరటి ఆకు నందు భోజనం మిక్కిలి పరిశుభ్రం అయి శ్రేష్ఠంగా ఉండును. శరీరకాంతి , సంభోగశక్తిని పెంచును. ఆకలి దంతకాంతిని పెంచును. క్రిమినాశనకారి , ఉదరం నందు పుండ్లను తగ్గించును . 


 * మోదుగ ఆకుల యందు భుజించుటచే గుల్మరోగం , మహోదరం , క్రిమిరోగం , రక్త, పిత్త రోగాలు నయం అగును.మోదుగ చంద్రుడికి సంబందించిన వృక్షం . సాత్త్విక గుణాలు కలిగించును.


 * మర్రి ఆకుల యందు భుజించటం వల్ల క్రిమిరోగం నివారణ అగును. నేత్రదోష నివారణ జరుగును.


 * రావియాకు విస్తరి యందు భుజించిన పిత్త నివారణ జరుగును. అగ్నివృద్ధిని కలిగించును. జననేంద్రియ దోషాలు నివారణ అగును. విద్యార్జనకు మనస్సు పుట్టించును.


 * పనస ఆకుల యందు భుజించిన అగ్నివృద్ది, పిత్తాన్ని హరించును .


 * తామరాకు లో భోజనం విషహరంగ ఉండును. సరస్సులో ఉన్న తామరాకు పనిచేయదు .