14, జూన్ 2023, బుధవారం

స్నేహాలు కూడా ఇలాగే ఉంటాయి

 ఒక మహిళ ఒక కొండచిలువను పెంచుకొంటోందట. 

రోజూ తనకు కావలసిన ఆహారం అందిస్తూ,

అది వేగంగా పెరిగి పెద్దదవటం చూసి మురిసిపోయేదట.  కొంత కాలం తర్వాత ఉన్నఫళంగా అది ఆహారం తీసుకోవడం మానేసిందట.  తను బయట నుంచి ఇంటికి రాగానే ఒళ్లంతా చుట్టుకుని, తన నోటితో ఆమె తల మీద ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేసేదట.

ఇంత ప్రేమ వ్యక్తపరుస్తున్న కొండచిలువ ఆహారం తీసుకోకపోవడం చూసి తట్టుకోలేక ఆమె డాక్టర్ ని తీసుకొచ్చి చూపించిందట. డాక్టర్ అమెతో ఇలా చెప్పాడు దీనికి ఎలాంటి జబ్బులు లేవు. కాకపోతే అది చేస్తున్న విన్యాసాలు ప్రేమతో కాదు, తను ఎన్ని రోజులు ఆహారం తీసుకోకపోతే నిన్ను తినేసి అరిగించుకోగలదో అంచనా వేస్తోంది. నీ శరీరాన్ని😆 

చుట్టుకోవడంలో ప్రేమ లేదు నిన్ను చంపేందుకు తన శక్తి సరిపోతుందో లేదో చూసుకొంటోంది.  నీ తల మీద అది ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేయటం లేదు, నీ తల తన నోటికి సరిపోతుందో లేదో అని పరీక్షిస్తోంది అని చెప్పాడట.

కొన్ని స్నేహాలు కూడా ఇలాగే ఉంటాయి.

ఇలాంటి స్నేహితులు కొంత మంది మనతోనే ఉంటారు. మనతోనే తిరుగుతారు. మన బలాలు, బలహీనతలు బాగా తెలుసుకుని ముంచేస్తారు.

అందుకే ఇలాంటి స్నేహితుల దగ్గర జాగ్రత్త.🙏🙏🙏🙏🙏😆

సహజ స్థితి

 *శుభోదయం* 

🙏💐🙏💐🙏


*ఆనందం ఎక్కడ ఉంటుంది? ఎలా దాన్ని పొందాలి?* 


👉 ఆనందం నా సహజ స్థితి అంటున్నారు. మరి, అది నా సహజ స్థితి అయినప్పుడు ఎక్కడో దానికోసం ఎందుకు వెతకాలి? 


👉 ఆనందం కోసం వెతుకుతూ కష్టాలు, కన్నీళ్లు ఎందుకు తెచ్చుకుంటున్నాను?

 

👉 బాధలు, సమస్యలలో ఎందుకు చిక్కుకుంటున్నాను? 


*నిజమే, ఆనందం నా సహజ స్థితి..*


👉 అహం దేహం అనుకుంటే కష్టాలూ, కన్నీళ్ళు, బాధలూ, సమస్యలు.. 


👉 అహం ఆత్మ అనుకుంటే ఉండేది ఆనందం ఒక్కటే.....


👉 అహం దేహంలో స్వార్థం ఉంటుంది.. 

అహం ఆత్మలో నిస్వార్థం ఉంటుంది...

 

👉 అహం ఆత్మగా అనుకోవడం కష్టమైతే, సాధన చెయ్యలేము అనుకుంటే, చాలా సులభతరమైన సాధన ఒకటి చెప్తాను... 

చేస్తారా? 


👉 ఆ సాధనే... ప్రేమను పంచడం...  


👉 *ప్రేమ అనేది భగవత్ స్వరూపము...* 

*అదే కృష్ణ తత్వం...* 


👉 ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే...


*ప్రేమలో స్వార్థం ఉండదు,ఉండకూడదు..*

*ఏదో ఆశించి చూపేది ప్రేమ కాదు...* 


*ప్రేమ అంటే రెండు మనసులు పొందే అనుభూతి, రెండు శరీరాల ఆకర్షణ కాదు..*

 

*ఒక పసివాడి బోసినవ్వు చూడగానే మనలో కలిగే అనిర్వచనీయమైన భావన పేరు ప్రేమ....*


*ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు అయ్యో అని అప్రయత్నంగా నీలో కలిగే స్పందన పేరు ప్రేమ...*

 

*అప్రయత్నంగా నీవు చేసే సాయం పేరే ప్రేమ...*

 

*ప్రేమను పంచడంలో నావాళ్లు, పరాయివాళ్లు అనే భేదం ఉండకూడదు.  నీ శత్రువుపైన కూడా కన్న బిడ్డ పట్ల తల్లి చూపే ప్రేమను చూపగలగాలి..*


*ప్రేమలో మృదుత్వం మాత్రమే ఉంటుంది...*


*నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో, ఎదుటి వ్యక్తి పట్ల కూడా అలాంటి భావనను వ్యక్త పరచగలగటమే ప్రేమ...*

 

*ఆ ప్రేమ పేరే ఆనందం*

*ఆ ఆనందమే నా సహజ స్థితి....* 


*ఒక్కసారి ప్రేమను పంచి, ఆ ఆనందాన్ని అనుభవించి చూడండి... ఆ సహజ స్థితిలో ఒదిగిపోయి, ఆ అనుభూతిని మీరే ఆస్వాదిస్తారు.....*  


🙏🙏🙏🙏🙏🙏

ఓం అరుణాచల శివ

తెలుసుకోవాలి

 ఈమధ్య నెల్లూరులో ఒక జైన్ మతం అమ్మాయుని ఒక ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకునేందుకు తీసుకెళ్ళాడు( ఎత్తుకెళ్లాడు?).

ఆ జిల్లాలోవున్న జైన్ మతం కమ్యూనిటీ పెద్దలు అందరూ సమావేశం అయ్యారు.దానిలో తీసుకొన్న నిర్ణయం....."ముస్లిం లను  పనిలో నుండి తొలగించాలి...".అంతే,ఉన్న ఫలంగా 10,000 మంది ముస్లింలు ఉద్యోగం కోల్పోయారు.వెంటనే ముస్లిం పెద్దలు సమావేశం అయ్యారు.అమ్మాయు ఎక్కడ ఉందో గుర్తించారు. తొమ్మిదే గంటల వ్యవధిలో అమ్మాయిని జైన్ మతం వారికి అప్పగించారు. దీనినే " హిందూ సంఘటన శక్తి ప్రభావంతమైన విజయం " అంటారు.

       దీని నుండి మనకు అర్థమైంది ఏమిటి......?

      నాకులం,నా కుటుంబం ,నా

సంపద,....అనుకోకుండా ,ఇక నుండి "...హిందూవులంతా ఐకమత్యంగా ఉండాలి....." అని తెలుసుకోవాలి.

13, జూన్ 2023, మంగళవారం

సుమంగళి కోరిన వైధవ్యం:*

 

   *సుమంగళి కోరిన వైధవ్యం:*

               ➖➖➖✍️


```ఒక నాడు పరమాచార్య స్వామి వారి దగ్గరకు ఓవృద్ధ సువాసిని వచ్చి,స్వామి వారిని ఓ విచిత్రమైన కోరిక కోరింది.


"స్వామీ ఒకవేళ నాభర్తకు ఏదైనా జరగ రానిది జరిగి ఆయువుచెల్లితే, అదినేను ఉండగానే  జరిగేలా    ఆశీర్వదిoచoడి. నా కన్నా ముoదు,      నా కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోయేటట్టు     అనుగ్రహించండి" అని ఆర్తితో వేడుకుంది.


వెంటనే మహాస్వామివారు చిరునవ్వుతో "అలాగే అవుగాక" అని           దీవించి పంపారు. కానీ అక్కడ ఉన్నవారందరూ ఈ మాటలను విని నిశ్చేష్టులైపోయారు.


ఆమె అలా వెళ్ళిన వెంటనే స్వామివారి తో    “స్వామీ!    పెళ్ళి కాక ముందు చేసే నోములూ వ్రతాలు మంచిభర్త రావాలనీ పెళ్ళైన తరువాతచేసే సమస్తపుణ్యకర్మ  లూ        భర్త ఆయురారోగ్యాలతో ఉండి ఆయన చేతుల్లో    తను     పుణ్య స్త్రీ గా పోవాలనీ కదా!     మరి    ఈవిడ ఇoత విపరీతమైన కోరిక కోరడమేమిటి? మీరు కూడా అలాగే అని దీవించడం....”అని ఆశ్చర్యoగా అడిగారు.

   

అందుకు స్వామివారు చిరునవ్వుతో... "వారిది అన్యోన్య దాంపత్యం! భర్తమీద వల్లమాలిన ప్రేమ ఆవిడకి.    ప్రారబ్ధమో లేక శాపమో వారికి పిల్లలు లేరు. వృద్ధా ప్యం మరో బాల్యం అంటారు కదా!    ఈ వృద్ధాప్యంలో   ఆ భర్తకు  ఈవిడే అన్నీ. ఆయన్ని  చoటి పిల్లాడిలా  సాకుతోంది. పైగా  ఆయనకు    జిహ్వచాపల్యo  కాస్తఎక్కువ. మరి ఆవిడే ముందు కాలoచేస్తే ఆయన్నెవరు  చూసుకుoటారు,  ఆయన అవసరాలను పట్టిoచుకునేదేవరు  అని బెoగ ఆ తల్లికి!      అందుకే ఆ కోరరాని కోరిక కోరింది" అని సెలవిచ్చారు.


భర్తకోసం పద్నాలుగేళ్ళు   కారడవులను సైతం లెక్కచేయక  ఆయన తోడిదే    నా స్వర్గం అని సమస్త భోగాలను  త్యజించి ఆయన్ని అనుసరిoచిన సుకుమారియైన రాకుమారి మన సీతమ్మ తల్లి. ఇప్పటికీ అటువంటి    ఎoదరో    మహాతల్లులకు సీతమ్మ తల్లి ఆదర్శం.!


  భర్తే తన దైవoగా భావిoచి   "శ్రీవారు" అని పిలుస్తూ        గృహస్థాశ్రమంలోనే తరిoచిన అనేక మహాతల్లులు నడయాడిన నేల ఇది!వారoదరినీ సీతమ్మవారి అoశగాగాక మరెలా పరిగణిoచగలo?


అందుకే స్వామి వారికి అంతటి అపార కరుణ ఆ తల్లిపై...```



అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య

వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్

ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.✍️

https://t.me/paramacharyaVaibhavam

                   

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

వాల్మీకి రామాయణం: 29 వ భాగం:

 29.

రామాయణం...

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది...


            వాల్మీకి రామాయణం:

                  29 వ  భాగం:

                  ➖➖➖✍️



అలా లోపలికి వచ్చిన రాముడిని చూసిన కౌసల్యాదేవి పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వెళ్ళి "నాయనా రామా! నీకు యువరాజ పట్టాభిషేకం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, మన వంశంలో పుట్టిన ఎందరో గొప్పవాళ్ళలాగ నువ్వు కూడా కీర్తిని సంపాదించు" అని ఒక బంగారు ఆసనాన్ని చూపించి రాముడిని కుర్చోమంది.


అప్పుడు రాముడు ఆ ఆసనాన్ని ఒకసారి ముట్టుకొని కౌసల్యతో… 

"అమ్మా! నేను కూర్చోడానికి సమయం లేదు, నాన్నగారు భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నారు, నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు. అందుకని నేను దండకారణ్యానికి వెళ్ళిపోతున్నాను. నేను దర్భలతో చేసినటువంటి ఆసనముల మీద కూర్చోవాలి కాని, ఇటువంటి వాటి మీద కాదు. నీ ఆశీర్వాదం తీసుకొని వెళదామని వచ్చాను" అని రాముడన్నాడు.


ఈ మాటలు విన్న కౌసల్య నిట్టనిలువునా కింద పడిపోయింది.

తరువాత ఆమెకి కొంత సపర్యలు చేశాక బాహ్య స్మృతిని పొంది ఇలా అంది…  "రామా, నువ్వు చెప్పిన మాటలు విన్నాక నాకు అసలు పిల్లలు పుట్టకుండా ఉండి ఉంటే బాగుండు అనిపిస్తోంది. పిల్లలు లేకపోతే నన్ను అందరూ గొడ్రాలు అంటారు, అంతకుమించి నాకు వేరే బాధ ఉండదు. కాని ఇవ్వాళ నేను పొందుతున్న బాధ సామాన్యమైనది కాదు. రామా, నీకొక నిజం చెప్తాను,


న ద్ఋష్ట పూర్వం కల్యాణం సుఖం వా పతి పౌరుషే |

అపి పుత్రే విపశ్యేయం ఇతి రామ ఆస్థితం మయా ||


నేను దశరథుడికి భార్యగా ఉన్నప్పుడు ఏ మంగళకరమైన ఆనందాన్ని పొందలేదు. ఎందుకంటే ఆయన కైకేయికి వశుడై ఉన్నాడు.    కైకేయి మనస్సు నొచ్చుకుంటుందని ఒక జేష్ఠ భార్యకి ఇవ్వవలసిన మర్యాద నాకు ఇవ్వకుండా, కైకేయి యొక్క దాసీజనంతో సమానంగా చూశాడు. ఇవ్వాళ నీకు యుక్త వయస్సులో పట్టాభిషేకం జరిగి యువరాజుగా నిలబడితే, నిన్ను చూసి, నీ పరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆనందం అనుభవించచ్చు అని అనుకున్నాను. కాని ఇవ్వాళ నాకు ఆ ఆనందం కూడా లేకుండాపోయింది. ఊసర క్షేత్రంలో విత్తనం వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అవుతాయో, అలా నేను చేసిన వ్రతాలు, పూజలు నిష్ప్రయోజనం అయ్యాయని అనుకుంటున్నాను రామా! దైవానుగ్రహము నా మీద లేదు. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరున్నారు. నువ్వు వెళ్ళిపోయాక నేను ఈ రాజ్యంలో ఎవరిని చూసుకొని బతకాలి, అందుకని నేను మరణిస్తాను" అని కౌసల్య అన్నది.


ఇప్పటిదాకా ఈ మాటలన్నీ వింటున్న లక్ష్మణుడు ఆగ్రహంతో…"అన్నయ్యా! నాన్నగారికి వృధాప్యం వచ్చింది కాని కామం తీరలేదు, విషయసుఖాలకి లొంగి కైకేయితో హాయిగా కాలం గడుపుతున్నాడు. ఏ అపరాధం చెయ్యని నిన్ను అడవులకు పంపిస్తున్నారు. నువ్వేమో ధర్మము, పితృవాక్య పరిపాలన అని వెళ్ళిపోతున్నావు. అమ్మ ఇక్కడ ఇంత బాధపడుతోంది. చేతకానివాడిలా నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు, నువ్వు ఒకసారి "ఊ" అను, నేను నా అస్త్ర-శస్త్రాల చేత ఈ అయోధ్యలోని ఏనుగుల తొండాలని పర్వతాల్ని పడేసినట్టు పడేస్తాను, భరతుడి పేరు చెప్పిన వాడిని, భరతుడు రాజుగా కావాలన్న వాళ్ళని   ఒకే బాణంతో కొన్ని వందల మందిని చంపేస్తాను. ఇంతటి ధర్మాత్ముడైన కొడుకిని అడవులకు పంపిస్తున్న                ఆ దశరథుడిని బంధించి కారాగృహంలో తోసేస్తాను, లేకపోతే చంపేస్తాను. నిన్ను రక్షించుకోలేకపోతే నీ పక్కన నేను ఉండి ఎందుకు, కావున నాకు అనుమతి ప్రసాదించు" అని అన్నాడు.


లక్ష్మణుడి మాటలు విన్న కౌసల్య ఇలా అంది.. "రామా! నిన్ను విడిచి నేను ఉండలేను, ఉంటే నీతో పాటు నేను ఉండాలి, లేదా నువ్వు నాతో ఉండాలి. నీతో పాటు నేను అడవులకు వస్తే, నువ్వు ఏది తింటావో నాకు అదే పెట్టు. లేదంటే లక్ష్మణుడు చెప్పిన ఆలోచన గురించి ఆలోచించు. తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో, తల్లి మాట కూడా అలానే వినాలి. తండ్రి అనుమతిచ్చాడు కనుక వెళ్ళిపోతానంటున్నావు, కాని తల్లిగా నేను నీకు అనుమతిని ఇవ్వడంలేదు. ఒకవేళ నువ్వు నా మాట కాదని వెళితే నేను విషం తాగి చనిపోతాను. నువ్వు వెళ్ళడానికి వీలులేదు" అని కౌసల్య అన్నది.


అప్పుడు రాముడు "అమ్మా! నువ్వు చెప్పింది తప్పు అని నేను అనను. ఖండువు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన తండ్రి ఒకసారి పిలిచి గోవుని చంపమంటే, ఆ మహర్షి గోవుని చంపేసాడు. పరశురాముడిని ఆయన తండ్రి జమదగ్ని పిలిచి నీ తల్లి అయిన రేణుక శిరస్సు నరకమన్నాడు, పరశురాముడు ఎందుకు నాన్నా అని అడగకుండా తన తల్లి కుత్తుక కోసేశాడు. అలాగే మన వంశంలో పూర్వీకుడైన సగర చక్రవర్తి తన 60,000 కుమారులని పిలిచి ఈ భూమి మొతాన్ని తవ్వమంటే, అలా తవ్వడం పాపం కదా అని వాళ్ళు ఆలోచించలేదు, తండ్రి చెప్పాడని తవ్వేశారు. ఒకేసారి తల్లి మాట, తండ్రి మాట వినవలసి వస్తే, తండ్రిమాటకే గౌరవం ఇవ్వాలి. నేను ఇప్పుడు తల్లి మాట విని ఆగిపోతే, పూర్వం మన వంశంలో తండ్రి మాట విన్నవాళ్ళు అవివేకులవుతారు. నేను వారి ప్రవర్తనని అవమానించకూడదు. అందుకని నేను ఇప్పుడు దశరథ మహారాజు మాట విని అడవులకు వెళ్లిపోవాలి" అన్నాడు.


తరువాత లక్ష్మణుడితో…


తవ లక్ష్మణ జానామి మయి స్నేహమనుత్తమం |

విక్రమం చైవ సత్యం చ తేజశ్చ సుదురాసదం |

మమ మాతుర్మహద్దుఃఖమతులం శుభలక్షమ్ణ |

అభిప్రాయం అవిజ్ఞాయ సత్యస్య చ శమస్య చ ||


"లక్ష్మణా! నువ్వు ఎంతటి పరాక్రమవంతుడివో నాకు తెలుసు, కాని నువ్వు అన్నటువంటి మాటలు వలన అమ్మ దగ్గర అనుమతి తీసుకొని అరణ్యవాసానికి వెళదామని వచ్చిన నాకు ఎంత ఇబ్బందిగా ఉన్నాయో చూశావా. సత్యమేదో, శాంతికి స్థానమేదో తెలుసుకోవడంలో అమ్మ తత్తరపడుతోంది.


ధర్మః హి పరమః లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం |

ధర్మ సంశ్రితం ఏతచ్ చ పితుర్ వచనం ఉత్తమం ||


ధర్మమునందు సత్యము ప్రతిష్టితమై ఉంటుంది, అందుకని ధర్మాన్ని విడిచిపెడితే, సత్యధర్మములు రెండిటిని విడిచిపెట్టినట్టు అవుతుంది. ఒక ధర్మాన్నో, ఒక సత్యాన్నో పట్టుకోకూడదు. సత్యంతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి.


త్వయా మయా చ వైదేహ్యా లక్ష్మణేన సుమిత్రయా |

పితుర్నియోగే స్థాతవ్యమేష ధర్మః సనానః ||


అమ్మా, నీకొక ధర్మాన్ని చెపుతాను. నాన్నగారు నిన్ను, సుమిత్రని, నన్ను, లక్ష్మణుడిని, సీతని శాసించచ్చు, మనమందరం దశరథుడు ఎలా చెప్తే అలా ప్రవర్తించాలి. (తండ్రి మాత్రమే కుటుంబానికి యజమాని). ఇది సనాతనమైన ధర్మము.


ధర్మార్థకామాః ఖలు తాత లోకే సమీక్షితా ధర్మఫలోదయేషు |

తే తత్ర సర్వే స్యురసంశయం మే భార్యేవ వశ్యాభిమతా సుపుత్రా ||


లక్ష్మణా! ధర్మము, అర్థము, కామము అని మూడు పురుషార్ధాలు ఉంటాయి, ఇందులో నువ్వు ధర్మం ఒక్కదాన్ని పట్టుకుంటే అది అర్థకామాలని తీసుకోచ్చేస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న అర్థం లోక ద్వేషాన్ని తీసుకొస్తుంది, ధర్మాన్ని వదిలి పట్టుకున్న కామం 

నీ పతనాన్ని తీసుకొస్తుంది. ధర్మం భార్యవంటిది. (అందుకే మనం భార్యని కామపత్నిగా చూడము, ధర్మపత్ని అని అంటాము. ధర్మబద్ధమైన పత్ని వల్ల కలిగిన కామము వలన అర్థము[శాస్త్రం ప్రకారం అర్థం అంటే ధనము కాదు, ధనాన్ని కర్మఫలం అంటారు, అర్థం అంటే కొడుకు అని] లభిస్తుంది.) లక్ష్మణా! నువ్వు దశరథుడిని ఖైదు చేసి రాజ్యాన్ని తీసుకోమన్నావు, అది ధర్మబద్ధం కాని రాజ్యం, అందుకని ఆ రాజ్యం నాకు అక్కరలేదు. తండ్రి చెప్పిన మాట పాటించడం కొడుకుకి ధర్మం, అందుకని నేను అరణ్యానికి వెళ్ళడానికే నిశ్చయమయ్యాను. అలాగే, నువ్వు నాకు పట్టాభిషేకం జరుగుతుందని సంతోషంగా తెచ్చినటువంటి ఈ సంభారములన్నిటిని, ఇక్కడినుంచి తీసెయ్యి. నేను అరణ్యాలకి తొందరగా వెళ్లిపోవాలి, లేకపోతే అమ్మ(కైకేయి) బాధపడుతుంది. అమ్మ మనసులో అనుమానం అనే దుఖం ఎప్పటికి రాకూడదు. అందుకని తొందరగా ఈ సంభారములన్నిటిని తీసెయ్యి. అమ్ామ నన్నూ, బరతుడిని ఎన్నడూ వేరుగా చూడలేదు. మరి ఇంతగా నన్ను ప్రేమించిన అమ్మ, నిన్న రాత్రి నన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తాను అన్న నాన్నగారు, ఇవ్వాళ తెల్లవారేసరికి నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు అంటె ఒకటి గుర్తుపెట్టుకో లక్ష్మణా......


సుఖ దుహ్ఖే భయ క్రోధౌ లాభ అలాభౌ భవ అభవౌ |

యస్య కించిత్ తథా భూతం నను దైవస్య కర్మ తత్ ||


సుఖం అవని, దుఖం అవని, శుభం అవని, అశుభం అవని, వెనకనుండి శాసించేవాడు ఆ దైవం. ఆ దైవాన్ని తిరస్కరించి నువ్వు ఏమి చెయ్యలేవు. ఒక మంచిపని చేద్దామని అనుకుంటే దానికొక ప్రతిబంధకం రావడం కూడా దైవము చేసిన పనే " అని రాముడన్నాడు.

రాముడు చెప్తున్న మాటలు వింటున్న లక్ష్మణుడు ఆ ధనుస్సుని గట్టిగా పట్టుకొని నలుపుతూ, పళ్ళు కొరుకుతూ, పాదాలు అసహనంగా కదుపుతూ రాముడితో ఇలా అన్నాడు " నీకే చెల్లింది అన్నయ్యా ఈ చేతకాని మాటలు మాట్లాడడం, అంత వృద్ధుడైన దశరథుడికి యవ్వనంలో ఉన్న కైకేయ పొందు కావలసి వచ్చిందా, ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకంలేవ కైకమ్మకి, నిన్న రాత్రి నిన్ను పిలిచి పట్టాభిషేకం అన్నాడు, రాత్రికి రాత్రే కైకేయకి రెండు వరాలు ఇచ్చి, సత్య ధర్మాలకి కట్టుబడి నిన్ను అరణ్యాలకి పొమ్మంటాడ, భరతుడికి రాజ్యం ఇస్తాడ, తండ్రి మాట నిలబెట్టడం ధర్మమని నువ్వు అరణ్యాలకి వెళతానంటావ, ఇంత ధనుర్విద్య నేర్చుకున్న నువ్వు దుంపలు తింటూ, తేనె తాగుతూ అడవుల్లో తిరుగుతావ, ఇదంతా దైవం చేశాడంటున్నావు కదా ఆ దైవాన్ని ఒకసారి కనపడమను, నా ధనుస్సుకి బాణాలని సంధించి మొదట దశరథుడి తల, తరవాత కైకేయ తల పడగొడతాను, నిన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కుర్చోపెడతాను, అప్పుడు కూడా నన్ను ఆ దైవం నిగ్రహించగలిగితే, దైవం ఉందని ఒప్పుకుంటాను, దైవమో, లక్ష్మణుడో నెగ్గాలి, నువ్వు చెప్పిన మాటలు నాకు ఎంతమాత్రము నచ్చలేదు, నువ్వు అనుమతిని ఇవ్వు దశరథుడి మీద యుద్ధం ప్రకటిస్తాను " అన్నాడు.


అప్పుడు రాముడు " లక్ష్మణా! నువ్వు మళ్ళి పొరబడుతున్నావు. ఇదంతా చేస్తున్నది ఆ దైవమె, నేను అనుమతించిననాడు కదా నువ్వు బాణం వెయ్యడం, దశరథ మహారాజు గారిని ఇచ్చిన మాట మీద నిలబెట్టడం కోసం అరణ్యాలకి వెళ్ళడం మినహా నాకు వేరొక మార్గం లేదు " అని లక్ష్మణుడితో అని, అడవులకు వెళుతున్న తనని ఆశీర్వదించమని కౌసల్యతో అన్నాడు.


" సరే, అలాగే వెళ్ళు, కాని నా కన్నీళ్ళని దశరథుడు తుడుస్తాడన్న నమ్మకం లేదు, అందుకని నన్ను నీతోపాటే తీసుకెళ్ళు, లేదా నేను ఇక్కడే విషం తాగి మరణిస్తాను, ఈ రెండిటిలో ఏది చెయ్యమంటావో చెప్పి బయలుదేరు " అని కౌసల్య రాముడితో అనింది.


భర్తుః కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః |

స భవత్యా న కర్తవ్యో మనసా అపి విగర్హితః ||


అప్పుడు రాముడు " ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టి, తాను ఒక్కత్తే భర్తకన్న వేరుగా, దూరంగా ఉంటానని మానసికంగా అయినా ఊహ చేస్తుందో, అటువంటి స్త్రీ నృశంస(ఆమెని చూడగానే "ఛి" అనవలసిన స్త్రీ). భర్తని వదిలేసి కొడుకులతో వస్తానని దశరథ మహారాజుకి పెద్ద భార్యవైన నువ్వు ఒక్కనాటికి అనకూడదు. దశరథ మహారాజు ఎంత కాలం ఉంటాడో, నువ్వు అంతకాలం ఆయనకి శుశ్రూష చెయ్యవలసి ఉంటుంది.


భర్తారం న అనువర్తేత సా చ పాప గతిర్ భవేత్ |

భర్తుః శుశ్రూషయా నారీ లభతే స్వర్గము త్తమం |

అపి యా నిర్నమస్కారా నివృత్తా దేవపూజనాత్ ||


ఎన్ని నోములు, వ్రతాలు, పూజలు చేసినా, తన భర్త మనసు గుర్తెరిగి, భర్తకి ఆనందం కలిగేటట్టు ప్రవర్తించడం చేతకానటువంటి స్త్రీ చిట్టచివర పొందేది నరకమే. అలాగే, జీవించి ఉండగా ఎన్నడూ ఒక దేవతకి నమస్కారం చెయ్యకపోయినా, పూజలు, నోములు, వ్రతాలు చెయ్యకపోయినా కాని, భర్తని అనువర్తించి, భర్తయందు ప్రేమతో ప్రవర్తించినటువంటి స్త్రీ చిట్టచివర స్వర్గాన్నే పొందుతుంది. అందుకని అమ్మా, నువ్వు అలా మాట్లాడకూడదు, నేను అలాంటి మాటలు వినకూడదు. నేను అరణ్యవాసానికి వెళితే నన్ను రక్షించేది చల్లని నీ ఆశీర్వాదమే అమ్మా " అని కౌసల్య పాదాలకి నమస్కారం చేశాడు.


అప్పుడు కౌసల్య తెల్లటి ఆవాలు, పెరుగు, తెల్లటి పూలతో ఉన్న దండలు తెప్పించి వేదం బాగా చదువుకున్నటువంటి ఆచార్యుడిని పిలిచి, హోమం చేయించి, ఆ అక్షతలని రాముడి శిరస్సు మీద ఉంచి "నాయనా, నిన్ను సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, దిక్కులు, గృహదేవతలు, రాక్షసులు, విషక్రిములు, చెట్లు, నదులు, ఋతువులు, నక్షత్రములు అన్నీ నిన్ను రక్షించాలి. ఆ వృత్తాసురిడిని చంపినప్పుడు దేవేంద్రుడికి ఎటువంటి మంగళం జరిగిందో, నీకు అటువంటి మంగళం జరుగుగాక, గరుగ్మంతుడు అమృతాన్ని అపహరించి తెచ్చినప్పుడు ఎటువంటి మంగళం జరిగిందో, నీకు అటువంటి మంగళం జరుగుగాక, క్షీరసాగర మధనంలో రాక్షసులని సంహరించిన ఇంద్రుడికి అదితినుంచి ఎటువంటి మంగళం లభించిందో, నీకు అటువంటి మంగళం కలుగుగాక, పాదముల చేత ఈ లోకములనన్నిటిని కొలిచిన ఆ త్రివిక్రమావతారానికి ఎటువంటి మంగళం లభించిందో, అటువంటి మంగళం నీకు లభించుగాక " అని ఆశీర్వదించింది. ✍️

రేపు...30వ భాగం...

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

మాటతీరు

 

     *మాటతీరు ఎలా ఉండాలి*  

               ➖➖➖✍️


*ఈ సృష్టిలో మాట్లాడే శక్తి ఒక్క మానవుడికే ఉంది. అది మనిషికి దేవుడిచ్చిన దివ్యమైన వరం.* 


*మాట ఓ అద్వితీయ శక్తి.    దాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.  మాటతీరు సంస్కార సంపన్నమైనప్పుడే ఎదుటి హృదయాన్ని ఆకర్షించగలుగుతుంది. మన భావాలు, ఆలోచనలు ఇతరులతో పంచుకొనేందుకు- మాటే ఓ అద్భుత సాధనం.*


*లోకంలో అర్థం కాకుండా మాట్లాడేవారు, అసమర్థంగా మాట్లాడేవారు ఎంతో మంది ఉన్నారు. అనవసరంగా, అనాగరికంగా మాట్లాడేవారూ ఉన్నారు. ప్రాణికోటిలో మనిషికి పెద్దపీట వేసింది మాటే. మాటతోనే మనిషి వ్యాప్తిచెందాడు. మాటతోనే మనిషి ఎత్తులకు ఎదిగాడు. ముందు తరాలకు మార్గదర్శకుడయ్యాడు.*


*మహనీయుల మాట మౌనం అనే మూసలో పోసిన బంగారంలా ఉంటుంది. అందుకే వారి మాటలకు ఎంతో విలువ సమకూరుతుంది.* 


*అదుపులేకుండా వాగడం మహాతప్పు.   మాటను తక్కెడలో పెట్టి తూచినట్లు మాట్లాడమంటారు విజ్ఞులు.*


*కటువుగా, అతిగా మాట్లాడేవారి పట్ల ఎవ్వరికీ గౌరవం ఉండదు. చెడ్డ మాటలు వెలువడకుండా ఉండాలంటే దానికి మౌనమే సరైన మందు అంటారు తత్త్వవేత్తలు.*


*‘ఎదుటివారు మనల్ని అర్థం చేసుకొనేందుకు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడండి. అధిక ప్రసంగం తగదు’ అంటూ రామకృష్ణ పరమహంస తనను కలిసేందుకు వచ్చిన భక్తజనంతో చెబుతుండేవారు.*


*మాటకు ప్రాణం సత్యం. ఇది యుగాల పూర్వమే హరిశ్చంద్ర చక్రవర్తితో నిరూపితమైంది. సత్యవచనం కారణంగానే ఆయన పేరు సత్యహరిశ్చంద్రుడని శాశ్వతంగా నిలిచిపోయింది.*


*మాటల్లో అబద్ధాలు దొర్లకూడదు. అబద్ధం మాట్లాడి నోరు కడుక్కోవడం కన్నా మౌనంగా ఉండటమే ఉత్తమం అన్నది జ్ఞానుల ఉవాచ.* 


*మాట ప్రభావం అద్భుతం. అది మనిషి మనసుకు అద్దం పట్టగలదు. అడ్డంగా నిలువగలదు. కొంపలు కూల్చగలదు. కుటుంబాలను రక్షించగలదు. శిశిరంలో వసంతాన్ని సృజియించగలదు. పెదవి వదిలితే పృథివి దాటిపోగలదు.*


*ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్నయినా వెనక్కి మళ్ళించవచ్చునేమోగాని- పెదవి దాటిన మాటను బ్రహ్మదేవుడైనా వెనక్కి మళ్ళించలేడు. మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు హెచ్చరించి మరీ చెబుతుంటారు.*


*సందర్భశుద్ధి కలిగిన  మాటకే విలువ, మన్నన ఉంటుంది. మాట, దాని అర్థం ఎలా పెనవేసుకొని ఉంటాయో మహాకవి కాళిదాసు ఓ శ్లోకరూపకంగా వివరించి చెప్పాడు.*


*ఔచిత్యం అనే తక్కెడలో పెట్టి తూచినట్లు మాట్లాడటం ఓ కళ. నోటికి వచ్చినట్లు వాగడం ఓ రోగం. చెడ్డ మాటలతో చెడు ఫలితమే వస్తుంది. మంచి చేకూరదు.*


*రామాయణంలో మంథర మాటలకు చెవొగ్గిన కైకేయి ఆ తరవాత ఎంత పశ్చాత్తాపం చెందిందో తెలియనిది కాదు. తీయని మాటలతో మన వెనకాలే గోతులు తీసేవారు ఎంతో మంది ఉంటారు.*


*మాటతీరు మనిషి సంస్కారానికి సూచిక. కార్యసాధనకు పనిముట్టు. ఆకర్షణకు అద్భుత మంత్రం. అందుకే మనిషి        మంచి మాటతీరును అలవరచుకోవాలి. మనం చెప్పిన మాట ఎదుటివారికి అర్థం కాకపోతే చక్కటి సామెతల రూపంగా అర్థమయ్యేలా వివరించవచ్ఛు అప్పుడే మాటతీరుకు మంచి ఆకర్షణ, స్పష్టత, పటిష్ఠత సమకూరుతుంది.*


 *కొందరి సంభాషణల్లో అబద్ధాలు, అపశబ్దాలు, అసభ్య పదాలు, అహంకారపు కథలు దొర్లుతుంటాయి. మన మాటతీరు ఎదుటివారికి కంటిలో నలుసులా, పంటి కింద రాయిలా బాధపెట్టే విధంగా ఉండకూడదు. మంచి గంధం పూసినంత హాయి కలిగించాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మంచి మాటకు మన్నన ఉంటుంది!*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

తాళికి పసుపుకొమ్ము

 


*పూర్వము తాళికి పసుపుకొమ్ము ఎందుకు జత చేసేవారు...??*

             ➖➖➖✍️



*పసుపు కి మన సంప్రదాయాలలో విశిష్ట స్థానముంది, పవిత్రతకు చిహ్నము అని మనకందరికీ తెలిసిందే.*


*పసుపులో  ‘కర్క్యుమిన్’  అనే రసాయనము ఉండడం వల్ల ఇది ఆరోగ్యపైన కూడా మంచి ప్రభావాన్ని చూపి మానవాళికి ఎంతో మేలు చేస్తుంది.   అందుకే  ఆడవారి హృదయస్థానాన్ని నిత్యం తాకేలా పసుపుకొమ్మును తాళికి జతచేశారు మన పూర్వీకులు.*


*పసుపు చాలా ప్రభావంతమైన ఏంటీ బేక్టీరియల్, ఏంటీ ఇన్ ఫ్లమేటరీ కూడా,     ప్రేగుల్లోని మలినాలను శుద్దిచేసే గుణకారిణి.*


*నొప్పులనూ హరించగల  దివ్య ఔషదమని ఏనాడో మన ప్రాచీన ఆయుర్వేద పండితులు పసుపును విరివిగా వాడమని సూచించారు*


*పూర్వము పాము పుట్రా ఇంటిలోకి చేరకుండా కూడా పసుపుని మన గడపలకి రాసే సాంప్రదాయాన్ని పెద్దలు సూచించారు.*


*అందుకే ఆడవారికి ఇన్ ఫెక్షన్లు సోకి   కేన్సర్  బారిన  పడకుండా పసుపుకొమ్మును తాళికి జతచేశారు. పసుపులోని ఔషద గుణాలను నేటి ఆధునిక సైన్స్ కూడా దృవీకరించింది.*


*చూశారా బ్రదర్స్/సిష్టర్స్ ఎంత గొప్పవి మన సాంప్రదాయాలు మన దేశములో మన జననం జరగడం పూర్వ జన్మ సుకృతం కాదంటారా..?*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

ఆచార్య సద్బోధన

 



           *ఆచార్య సద్బోధన:*

                ➖➖➖✍️


*ఐశ్వర్యం శాశ్వతం కాదు!!...* 

```శంకర భాగవత్పాదులవారు అనేక విధాలుగా జనులకు సన్మార్గాలను ఉపదేశించారు...


వారు రచించిన స్తోత్రాల్లో కేవలం దేవతా గుణగణానువర్ణనలే కాకుండా, మనం గ్రహించాల్సిన అనేకానేక విషయాలను పొందుపరిచారు... 


ఒకచోట ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఏం చెప్పారంటే ...


భగవంతా! నాకు కొన్ని ప్రార్ధనలు ఉన్నాయి. 

వాటిని నువ్వు అనుగ్రహించాలని ప్రార్ధించారు, ఆ ప్రార్ధనలు మనందరం ప్రతినిత్యం భగవంతుని ఎదుట చేయాల్సినవి...


ఎందుకు మనిషికి ఇంత అహంకారం? 

ఐశ్వర్యాన్ని చూసుకుని కావచ్చు. 

ఈ ఐశ్వర్యం అంతా మనకు ఎక్కడి నుండి వచ్చింది?

ఇదంతా భగవంతుడి కృప వల్ల వచ్చింది కాదూ? 

ఆయన దయలేనిదే ఇదంతా ఎక్కడుంది? 

మన సామర్థ్యం వల్ల మనం 

ఏ ఒక్కటీ సంపాదించలేం...

ఆయన కృప లేనిదే మన సామర్థ్యం దేనికీ పనికి రాదు, కాబట్టి మనకు వచ్చిన సంపాదన అంతా భగవంతుడి కృప వల్ల వచ్చిందే. 

దాన్ని సద్వినియోగం చెయ్యాలి, 

తప్పు పనులకు ఐశ్వర్యాన్ని ఉపయోగించకూడదు. 

ఎవడైతే తన ఐశ్వర్యాన్ని భగవంతుని సేవకు కానీ, సమాజ సేవకు గానీ ఉపయోగించకుండా కేవలం తాను మాత్రమే అనుభవిస్తాడో అలాంటి వాడు ‘పాపి’ అని వేదం చెబుతోంది.```✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺

అద్భుత_అరుణాచలంలో_అనుభూతి

  #అద్భుత_అరుణాచలంలో_అనుభూతి

(చివరి వరకు పూర్తిగా చదవండి)


అరుణాచల గిరి ప్రదక్షిణలో ఒక విదేశీ సోదరితో జరిగిన సంభాషణలో తెలిసిన తత్వం...


నేను: అమ్మా మీరు ఎక్కడి నుండి వచ్చారు ?


విదేశీ యువతి : ఉక్రెయిన్ నుండి... ఎందుకు అడుగుతున్నారు...?


నేను : ఏం లేదమ్మా... మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు ?


వి. యు.: శివుడి కోసమే వచ్చాము, శివుడే తీసుకువచ్చారు.


నేను : ఎంతమంది వచ్చారు ? ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ ?


వి. యు.: మొత్తం 65 మంది వచ్చాము, ఇన్ని రోజులు అని అనుకోలేదు.


నేను : మీకు శివయ్య గురించి మోటివెట్ చేసిన వారు ఎవరు ?


వి. యు.: ఎవరో మోటివేట్ చేస్తే పరిచయం వస్తుందేమో, కానీ నమ్మకం శోధనతోనే కలుగుతుంది, ఇక్కడ ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి ఉంది.

(నిజంగా చెప్పుడు మాటకు విని మతం మారుతున్న ప్రతీ హిందువు నేర్చుకోవాలి)


నేను: ఇంతకీ శివుడి గురించి మీరు ఏం తెలుసుకున్నారు. శివుడు అంటే ఎవరు ?


వి. యు.: ఎవరు అంటే, మీరూ శివుడే, నేనూ శివుడే. సర్వం శివమయం.


నేను: మరి మీరు మిగిలిన దేవుళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదా..?


వి. యు.: ఎవరి గురించి తెలుసుకున్నా అందరూ చివరికి శివుడే కదా... ఏం తేడా లేదు కదా...


నేను: శివయ్యని నమ్మాక మీకు ఏమనిపిస్తుంది ? మీరు శివయ్యను చూసారా ?


వి. యు.: చూసి నమ్మితే నిజం అంటారు ? చూడకపోయినా అనుభవం ద్వారా తెలుసుకుంటే సత్యం అంటారు. సత్యం శివం సుందరం.


నేను : మీ వయసు ఎంత అమ్మా ?


వి. యు.: 21 సంవత్సరాలు. మెడిసిన్ చదువుతున్నాను.


నేను: ఇంత చిన్న వయసులో, అంత చదువు చదువుతూ ఇలాంటివన్నీ ఎలా నమ్ముతున్నారు ?


వి. యు.: చిన్న వయసు కాబట్టే శివుణ్ణి తెలుసుకుందామని అనుకుంటున్నాను. ఇంత చదువుతున్నాను కాబట్టే, చదువు కంటే విలువైన జ్ఞానం శివుడని నమ్ముతున్నాను.


నేను : నీ పాదాలకు నమస్కారం తల్లీ... (అనుకుంటూ వాళ్ళ దగ్గర నుండి పక్కకు జరిగి వారి యాత్రను చూస్తూ తరించాను)


గమనిక : గొప్ప విశేషం ఏమిటంటే బొట్టు బరువైన భారత బాలికలలా కాకుండా, చక్కటి వస్త్ర ధారణతో, బొట్టుతో, క్రమశిక్షణతో చెప్పులు లేకుండా సాగుతున్న వాళ్ళ యాత్ర ను చూసి గుండె పులకించింది. అంతే కాదు ఆ చెల్లి నాకు సమాధానం చెబుతూ, ప్రశ్నకు ప్రశ్నకు మధ్య సమయంలో #నమః_శివాయ అంటూ స్మరణ చేస్తూనే ఉంది. 


అంతే కాదు ఇదే సంభాషణ ఎవరైనా భారతీయులతోనో, హిందువులతోనో అయితే అంత ఎక్సైట్ అయ్యేవాడిని కాదు. కానీ విదేశీయురాలు, పైగా 21 సంవత్సరాల చిన్న అమ్మాయి, శివయ్య తత్వాన్ని అంత సున్నితంగా తెల్చేసిన బంగారు తల్లి మాటలు విని ఆనంద భాష్పాలు వచ్చాయి.


ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ.. మనకు మాటలంటే ఓకే కానీ, వ్రాతకు బద్దకం కదా... అందుకే ఇంతవరకు వ్రాయగలిగాను... (చెప్పడం కుదిరిందో లేదో తెలియదు, కానీ చెప్పాలనిపించింది చెప్పాను)


భారత దేశాన్ని ఏదో చెయ్యాలని విదేశీ మతాలు కుట్రలు చేస్తుంటే, యెటువంటి కుట్రలతో పని లేకుండా ప్రపంచమంతా హిందుత్వం వైపు నడుస్తుంది. ఇది ధర్మ విజయం...


ఏది ఏమైనా, రెండో సారి వెళ్ళినప్పుడు మాత్రం అరుణాచలం గొప్పదనాన్ని ఆస్వాదించాను.


శివయ్య... పునః దర్శన ప్రాప్తిరస్తు

ధర్మం యొక్క లక్షణాలు

 .   

                      _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*శ్రుతిః స్మృతిః సదాచారః* 

*స్వస్య చ ప్రియమాత్మనఃl*

*ఏతచ్చతుర్వి ప్రాహుః* 

*సాక్షాత్ ధర్మస్య లక్షణమ్ll*


తా𝕝𝕝  

*వేదములు, ధర్మశాస్త్రములు, సదాచారములు, వ్యక్తికి సమాజానికి కూడా శాశ్వత శ్రేయస్సు కలిగించేవి - అనే నాలుగు రకాలుగా ధర్మం యొక్క లక్షణాలు ఉంటాయి.....*