30, జూన్ 2023, శుక్రవారం

నిత్యాన్వేషణ

 నిత్యాన్వేషణ: 


*లార్డ్ వేంకటేశ్వర విగ్రహము మీద వుండే సింహం బొమ్మ కు అర్థము ఏమిటి ?*



నిజానికి దీన్ని సింహం బొమ్మ అనరు అండి…..దానిని మకర తోరణం అంటారు… ఇది ఒక్క వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం మీదే కాదు…హిందూ దేవి దేవతల విగ్రహాలు అన్నింటి మీద వుంటుంది. ఇది ఇలా పెట్టడం వెనుక వృత్తాంతం స్కాంద పురాణంలో చెప్పబడింది.


కీర్తి ముఖుడు అనే రాక్షసుడు అమరుడిగా పొందిన వర గర్వంతో ముల్లోకాలు జయించి, దేవతలను పీడిస్తూ, కన్ను మిన్ను కానక జగన్మాత ను కూడా పొందడానికి ప్రయత్నించగా మహా దేవుడు ఆగ్రహోదగ్రుడై మహా భీకర ప్రళయాగ్నిను ఆ రక్కసుని పైకి ప్రయోగించగ….వరము పొందినా కూడా భయ కంపితుడై నలు దిక్కులు పరుగెడుతూ చివరికి మళ్ళీ కైలాసం చేరి మహాదేవుని కాళ్ళ మీద పడి ప్రార్థించగా ఆ అగ్నిని తన మూడవ నేత్రంలో బంధించి తనను కాపాడగా…ఆ రాక్షసుడు ఆకలి గొని ఆ విషయం మహాదేవుని చెప్తే తనను తనే తినమని పరమ శివుడు ఆజ్ఞపించగ…ముందుగా ఆ రాక్షసుడు మకర ముఖుడు అయి తోక నుండి తినడం మొదలెట్టి దేహం అంత తిని చివరికి తల దగ్గరకు వచి అది తినడం సాధ్యం కాకపోగా మహాదేవుని అర్ధించాడు….తనకు ఇంకా ఆకలి తీరలేదు ఏం చేసేదని వేడుకొనగా మహాదేవుడు తనను అప్పటినుండి దేవతల విగ్రహాలకు వెనుక తోరణ భాగంగా వుంటూ వారిని దర్శనం చేసుకునే భక్తుల అహంకారం, అరిషడ్వర్గాల ను భుజిస్తూ వుండమని, తద్వారా పుణ్యము పొందగలవు అని చెప్పగా ఆ క్షణమునే మకర ముఖుడుగా వున్న ఆ రాక్షసుడు తోరణం లో కలిసిపోతాడు. ఆ రాక్షసుని తలయే మకరతోరణములోని తల.

ఆవులను రక్షించండి

 *ఆవును చంపడం దారుణం!!!*😭

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

     ఆవు:

 నన్ను కబేళాలో పెట్టి 4 రోజులు కడుపునిండా తిండి పెట్టరు!

  ఎందుకంటే....నా రక్తంలోని హిమోగ్లోబిన్ కరిగిపోయి కండలో అతుక్కుపోతుంది!

 అప్పుడు నన్ను ఈడ్చుకెళ్లారు ఎందుకంటే...నేను మూర్ఛపోయాను.

 200 డిగ్రీల సెల్సియస్ వేడినీరు నాపై పోస్తారు....నాకు తల తిరుగుతోంది.

 అప్పుడు నా పాలు తాగుతున్న నువ్వు (మనిషి) గుర్తుకొస్తాను!

 అప్పుడు నన్ను కర్రతో తీవ్రంగా కొడతారు....ఎందుకంటే నా చర్మం తేలికగా రాలిపోతుంది!

 వారు నా రెండు కాళ్లను కట్టి, తలక్రిందులుగా వేలాడదీసి, ఆపై నా శరీరం నుండి చర్మాన్ని తీసివేసారు.

 భూలోక జీవులారా, వినండి.

 నేను ఇంకా చావలేదు!!

 ఈ కబేళాలో మానవత్వం పుడుతుందా అని ఆత్రుత కళ్లతో చూస్తాను!  అలాంటి సమయంలో కూడా నన్ను పోషించే వారు ఎవరూ లేరు...

 నా చర్మం కోరుకున్నంత కాలం....నేను బ్రతికుండగానే దుర్మార్గులైన కసాయిలు నా చర్మాన్ని తొలగిస్తారు....నేను మూలుగుతూ ఆరాటపడి చనిపోతాను.


 ఇంత పవిత్రమైన భారతదేశంలో నన్ను రక్షించడానికి ఏ మతం మరియు చట్టం అనుసరించాల్సిన అవసరం లేదు.

 నీపై జరిగిన క్రూరమైన అత్యాచారాన్ని భరించి కూడా నేను నీకు 'శాపం' ఇవ్వలేను.

 ఎందుకంటే........నేను నీ తల్లిని కదా...


 మీరు గోవు ప్రేమికులా...

 మరి మీరు ఆవు పాలు తాగే వారైతే...... ఈ మెసేజ్ ని షేర్ చేసి పాల రుణాన్ని కొంచెం అయినా తగ్గించుకోండి.

 హిందువులందరి ఒక్క ఏడుపు...

 గోహత్యను ఇక సహించేది లేదు..!


 ఆవు యొక్క ఈ బాధను అందరికీ తెలియజేయడానికి 2 నిమిషాల సమయం ఇవ్వండి మరియు మీ స్నేహితులు మరియు బంధువులందరితో పంచుకోండి.


 దేవుడు నిన్ను దీవించును!

 జై శ్రీ కృష్ణ!

 జై శ్రీరామ్!....

  దయచేసి ఆవులను రక్షించండి

 మరియు మీ మానవత్వానికి విలువ ఇవ్వండి........ Sada Gomatha Seva Lo.....  Me..  Yalagandula Ramu formor film censor board and textiles board member Government of India..  AICC member..  Suryapet Assembly consistency Suryapet Town 🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️🙏🙏🙏🙏🙏

బోగిపళ్ళు

 బోగి పండ్లు


రేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు. పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ చుట్టుపక్కలవున్న చెట్లనుంచి ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు. సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ, రేగు పళ్ళని తింటూ, ఆ ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.

బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతారంటారు. భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వచనాలతోబాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో.

రేగి పండు భారత ఇతిహాసంలో.... భారత నాగరికతలో..... పూజలలోను పాలు పంచుకున్న అతి కొద్ది పండ్లలో రేగి పండు ఒకటి. రేగి పండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. సంక్రాంతి నాడు బోగి పండ్లు పోయాలి అని అంటుంటారు అవి కూడ రేగి పండ్లే.

సంక్రాంతి పండుగకు వచ్చే ముందురోజున "భోగి" పండుగ జరుపుకుంటాం. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు. పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లల్లో ధన, ధాన్యలక్ష్మిలు కొలువై ఉంటారు కనుక వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

మూడు రోజులపాటు జరిగే ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో వైభవంగా నిర్వహిస్తారు. భోగిరోజున తెల్లవారకముందే గ్రామంలోని నాలుగు వీధుల కూడలిలో భోగిమంటలు వెలిగిస్తారు. ఇంట్లో పేరుకుపోయిన పాత పుల్లలు, చెక్కముక్కలన్నీ తీసుకొచ్చి ఈ మంటల్లో వేస్తారు.


భోగి మంటల పరమార్థం ఏమిటంటే... ఆ మంటల ద్వారా చలిని పారద్రోలటమేగాకుండా.. ఆ రోజు నుంచి జీవితాన్ని కొత్తవాటితో ప్రారంభించాలని అర్థం చేసుకోవాలి. అలాగే మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని, అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోమని సూచిస్తుంటారు.

ఇక భోగి రోజు సాయంత్రంపూట అందరి ఇళ్లలోనూ ఏర్పాటుచేసే బొమ్మల కొలువంటే పిల్లలకు భలే సరదా. ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్నిరకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగుపొరుగు మహిళలకు పసుపు కుంకుమలు అందిస్తారు.

దీనికి ప్రతిగా వారంతా రేగిపళ్లు, పువ్వులు, రాగి నాణాలను చిన్నారుల తలలపై ధారగా పోస్తారు. ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు. రైతుల ఇళ్లల్లో ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, ఈ మూడురోజులపాటు కొత్తబట్టలను కొనుక్కుని కట్టుకోవటంతోపాటు, అనేక పిండివంటలతో విందు చేసుకుంటారు.


బోగిపళ్ళు: బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.


 

 













 

పుష్పగిరి

 "పుష్పగిరి"

                  ➖➖➖


      చాలా కాలం కిందట ఒక గ్రామంలో నిష్టాపరుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు దివ్య క్షేత్రాలు దర్శించుకువద్దామనీ, పుణ్య నదులన్నిటి లోనూ మునిగి తరించుదామని ఎంతో ఆసక్తిగా వుండేది. ఐతే, పుట్టుపేద కావటంచేత చేయిసాగక, కోరిక నెరవేరింది కాదు.


ఇంతలో ఆ బ్రాహ్మణుడికి కాలం సమీపించగా, ఒక్కగానొక్క కుమారుడైన చైనుల్ని చేరబిలిచి, "నాయనా ! ఎంత యత్నించినా నా జీవితంలో తీర్థయాత్రలు సేవించుకోవటం గాని, పుణ్యనదులలో స్నానం చేయటంగాని పడలేదు. ఈ కోరిక అలానే నిలిచిపోయింది. కాబట్టి, నీకైనా సావకాశం చిక్కినట్టయితే, నా అస్తికలను వీలైనన్ని పుణ్యనదులలో కలప వలిసింది. ముఖ్యంగా పవిత్రమైన గంగా నదిలో కలప వలిసింది. ఈ ఒక్క పని నీవు చేశావంటే నా ఆత్మ సంతృప్తి పడుతుంది. నాకు ముక్తిమార్గం యేర్పడుతుంది”   అంటూ తన తుది కోరిక వెల్లడించి దేహయాత్ర చాలించాడు.


చైనులు పితృభక్తి కలవాడు. అందుచేత అతడు 'అప్పో సొప్పో చేసి ఐనా సరే, తండ్రి కోరిక నెరవేర్చి తీరాలె. కొడుకుననిపించుకుంటూ, ఈ మాత్రం పని చేయలేకపోతే, నాజన్మ యేం జన్మ !' అనే సంకల్పంతో బయల్దేరిపోయి, ఎన్ని కష్టాలకైనా ఓర్చి కాశీ క్షేత్రం దర్శించుకుని తండ్రి అస్తికలు గంగా నదిలో కలపాలని, నిశ్చయించుకున్నాడు.


ఆ కాలంలో ఇప్పటిలాగా రైల్లా, విమానాలా, ఇట్టె వెళ్లి అట్టె రావటానికి ! కాలి నడకని పోవాలి. కీకారణ్యాలు దాటాలి. కష్టసుఖాలు ఒంటపట్టించుకోవాలి. ఇన్ని జరిగినా, బయల్దేరిన మనిషి మళ్లీ ఇల్లు చేరుకునేవరకూ నమ్మకం లేకపోయె ! అందుకనే - “కాశీకి వెళ్లినవాడూ కాటికి పోయినవాడూ తిరిగిరారు" అనే సామెత కూడా యేర్పడినట్టుంది.


చైనులు పాదచారి అయి బయల్దేరాడు. రోజుకొక గ్రామం చొప్పున సంచారం చేస్తూ, దారిలో తగిలిన క్షేత్రాలన్నీ దర్శిస్తూ, పరలోకాన ఉండే తండ్రికి గతులు కల్పిస్తూ వెళుతున్నాడు. పోయి పోయి అతడు కడప జిల్లాలో కాలు పెట్టాడు. అక్కడ పినాకినీ నది ప్రవహిస్తున్నది. ‘సరే, ఇందులో కూడా స్నానం చేసిపోదాం' అనుకుని, అస్తికలమూట ఆ దగ్గరనే పెట్టి చైనులు నదిలో దిగాడు.


అతడు స్నానం చేసికొని, సంధ్య వార్చుకుని వచ్చి, మళ్లీ మూట బుజాన వేసుకు పోదామనుకొన్నాడు. తీరా చూడగా, ప్రవహించే పినాకినీ నది పొంగువచ్చి ఆ మూటంతా తడిసిపోయివున్నది. సరే, తడిగుడ్డ ఆరబెట్టి మళ్లీ కట్టుకుందామనే ఉద్దేశంతో మూట విప్పాడు.


ఆ మూట విప్పేసరికి, అస్తికలు మాయమై, , వాటికి బదులు అమోఘంగా పరిమళిస్తున్న తెల్లటి మల్లెపువ్వులు కనుపండువుగా కనిపించినై! ఇవి చూచి చైనులు ఆశ్చర్యంతో చకితుడయాడు. ఆహా, పినాకిని జలం ఎంతటి మహిమ కలది ! కాశీలో వుండే గంగాజల మహత్యం ఎటువంటిదో నేను ఎరుగను. కాని, పినాకిని మహిమ కళ్లారా ప్రత్యక్షంగా చూడగలిగాను. నా తండ్రికి తరణోపాయం కలిగింది. ఆయన ముక్తి పొందేశాడు. నా విధి నేను నెరవేర్చుకొన్న వాడినయాను. ఇక నేను కాశీకి పోనక్కరలేదు. ఇక్కడనే ధన్యుడనయాను”  అనుకుంటూ అపరిమితానందభరితుడై, తండ్రిని స్మరిస్తూ ఆ పువ్వులను పినాకినీ ప్రవాహంలో కలిపి వేసి ఇంటిముఖం పట్టాడు.


ఏమి చిత్రమో కాని, చైనులు స్నానం చేసిన తావు ఒక మడుగుగా యేర్పడింది. ఆ మడుగు నీలాటి రేవుకి సదుపాయంగా ఉండటంచేత స్త్రీలందరూ అక్కడ స్నానాలు చేసి, నీళ్లుపట్టుకునేవాళ్లు. పశువులు కూడా వచ్చి దాహం తాగేవి.


ఒకరోజున ఒక ముసలివాడు పశువులకు నీళ్లెట్టడానికని ఆ రేవుకి వచ్చాడు. బక్కచిక్కివున్న ఆ పశువులు మడుగులో నీళ్లు తాగి ఇవతలకు వచ్చేసరికల్లా మిస మిసలాడుతూ బలంగానూ పడుచుగానూ కనపడినై. ఈ వింత చూచి తాతకు ఆశ్చర్యం కలిగింది. తన పశువులు పడుచువైనాయనే సంతోషంతో తనుకూడా మడుగులో దిగి స్నానం చేశాడు. స్నానం చేసి గట్టు పైకి వచ్చేసరికల్లా తాతకు ముసిలిరూపం పోయి, పడుచువాడయాడు.


సరీగా అదే సమయానికి ఆ ముసలి వాని భార్య నెత్తిని కూటికుండ పెట్టుకుని ఆ దారిన పొలానికి పోతూవుంది. అలా పోతూవున్న ఆమెను అతడు పలుకరించే సరికి, ఎవడో తుంటరి తనతో సరాగాలాడుతున్నాడనుకొని, ఎదిరించి సమాధానం చెప్పసాగింది. 

"నేను నీ భర్తను, ఫలాన ముసిలివాడనే,” అని ఎంత చెప్పినా ఆమె నమ్మక పోయేసరికి వాడు ఆమెను బరబర చెయ్యి పట్టుకు లాగి మడుగులో ముంచాడు. ఏముంది? పైకి వచ్చేసరికల్లా ఆమె రూపవతి, యౌవనవతి ఐ కూర్చుంది. తీరా ముసిలివాడూ అతని భార్యా కలిసి ఇంటికి వెళ్లేటప్పటికి, వాళ్ల బిడ్డలు తలి దండ్రుల్ని ఆనవాలు పట్టలేకపోయారు. తరువాత క్రమంగా నిజానిజాలు బయల్పడి పినాకిని జలమహిమ అందరకూ వెల్లడి ఐంది. అప్పటినించీ ఆ మడుగులో స్నానం చేసి, ప్రజలు అమరత్వం పొందటం ప్రారంభమైంది.


కొద్ది కాలానికల్లా ఈ వర్తమానం త్రిలోక సంచారి ఐనటువంటి నారదమహర్షి చెవుల బడింది. ఎవరికైనా మేలు జరుగుతూ వుంటే ఓర్వలేని నారదుడు, ఇంతమంది ప్రజలు అమరత్వం పొందుతూవుంటే చూచి సహించగలడా? ఉహుం. కనుక, ఈ మడుగుకి ఏవిధంగా కట్టడి చేయటమా!" అని ఆలోచించి తిన్నగా బ్రహ్మదేముని వద్దకు వెళ్లి సంగతి సందర్భాలు చెప్పాడు.


ఐతే, భూలోకంలో ఇటువంటి మడుగు ఎలా పుట్టింది?' అని దివ్య దృష్టితో  చూచాడు బ్రహ్మ. పూర్వకాలమందు, తన తల్లి దాస్యవిముక్తికోసం దేవలోకంనించి గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకు పోతూవుండగా దేవేంద్రుడు ఎదిరించాడు. అప్పుడు ఇద్దరి మధ్యనా ఘోరయుద్ధం జరిగింది. ఆ పోరాటంలో అమృతబిందువు ఒకటి చింది, భూలోకంలో ఇప్పుడు ఆ మడుగు ఉండే చోటున పడి నట్టు గ్రహించాడు.


నారదుడు నూరిపోసిన మీదట, అమరత్వం యిచ్చే ఇటువంటి మడుగు భూలోకంలో ఉండకూడదు అని బ్రహ్మకు కూడా అనిపించింది. వెంటనే బ్రహ్మ, హనుమంతుని రప్పించి, “హనూ ! ఒక పర్వతం తెచ్చి పడవేసి, పినాకినిలో ఉండే ఆ మడుగును కప్పెట్టివేసెయ్యి" అన్నాడు. 


చెప్పటమే తడవుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తెచ్చి దభీమని ఆ మడుగులో పడవేశాడు. 


కాని, ఆ పినాకినీ జల మహిమ యేమిటో కాని, హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగును కప్పి వేయటానికి బదులు బెండు లాగా నీటిపైన తేలి ఆడుతూవుంది.


 ఈ చిత్రం చూచి బ్రహ్మకు కంగారుపుట్టింది. అతనికేమీ తోచక నారదుణ్ణి వెంటబెట్టుకుని, సరాసరి శివుని వద్దకు వెళ్లాడు. శివునికి కూడా ఈ విషయంలో ఏమీ పాలుపోక, ఆ ముగ్గురూ కలిసి వైకుంఠంలోవుండే విష్ణుమూర్తి వద్దకుపోయి జరిగిన వైనాలన్నీ పూసగుచ్చినట్టు ఆ జగన్నాటక సూత్రధారుడికి వినికిడి చేశారు.


విష్ణుమూర్తి చిరునవ్వుతో అంతా విని, “నాకూ, శివునికి యెప్పుడూ ఇటువంటివే చిక్కులు తగులుతూవుంటై. తిన్నగా ఉండడు కదా ఈ నారదుడు!" అని చెప్పి, బ్రహ్మనూ నారదుణ్ణి పంపి వేశాడు. 


తరువాత శివకేశవులు మానవరూపంతో భూలోకానికి దిగివచ్చి, ఆ మడుగు పైన తేలి ఆడుతూవున్న పర్వతాన్ని ఒక వైపున శివుడూ, రెండోవైపున కేశవుడూ అదిమిపట్టి అణిచివేశారు.


అప్పుడు వారి ప్రభావంవల్ల ఆ పర్వతం భూమి పైన అణిగి వుండి, మడుగు మూసుకపోయింది.


ఆ బ్రాహ్మడి అస్తికలను పువ్వులుగా మార్చగల మహిమ గలిగింది- పినాకినీ నది జలం. అటువంటి నీటిలో ఆంజ నేయుడు పర్వతం తెచ్చి పడవేశాడు. ఈ రెండు కారణాలవల్ల ఆ పర్వతానికి 

'పుష్ప గిరి' అనే పేరు వచ్చిందంటారు.


శివకేశవులు ఇద్దరూ దిగివచ్చి ఆ పర్వతాన్ని అణచటంచేత, కొండకు రెండు పక్కలా ఆ ఇద్దరి ఆలయాలూ వెలిసి, అది ఈనాడు ఒక దివ్య క్షేత్రమై ఉన్నది.


ఇక్కడ యేటా గొప్ప ఉత్సవాలు జరుగుతై. లక్షలాది జనం స్వాముల దర్శనానికి వస్తుంటారు. ఇది చెప్పదగిన పుణ్య క్షేత్రం గనకనే పుష్పగిరి స్వాములవారు ఇక్కడ మఠం ఏర్పరచుకొన్నారు.


పుష్పగిరి కడపకు పది మైళ్ళ దూరం లోనే ఉన్నది. కాబట్టి ఈ సారి మీరు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు తప్పక ఈ క్షేత్రం దర్శించి రండి!✍️

(1951 ఏప్రిల్ నెల చందమామ కథ)

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷

సజ్జన సాంగత్యం*

 .               🕉️🕉️🕉️


            _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*సాధు సజ్జన సాంగత్యం* 

*సద్బుద్ధిమ్ సత్ప్రవర్తనం|* 

*సంతోషం సద్విచారాంశ్చ* 

*దేహి మే మధుసూదన||*


తాత్పర్యము:

ఓ మధుసూదనా! నాకు సాధుస్వభావముండేవారితోను, మంచి ప్రవర్తన గలవారితోను సాంగత్యమును కలుగజేయుము....  నిరతము సంతోషముతో మంచి ప్రవర్తన ఉండునట్లు చేయుము..మంచి బుద్ధిని మంచి ఆలోచనలను నాకు ప్రసాదించుము.

దేవుడు ఉన్నాడు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

దేవుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా ?


మనిషికి దేవుడు ఉన్నాడా లేడా , ఒకవేళ ఉన్నా కూడా నా భక్తికి ప్రసన్నుడై దేవుడు సాక్షాత్కరిస్తాడా అనే సందేహం తరచుగా మదిని తొలుస్తూనే ఉంటుంది . మనలానే దేవునికి కూడా ఇన్ని జీవరాశులలో ప్రత్యేకంగా సృష్టించిన మానవులకు జ్ఞానం అనే ప్రత్యేక శక్తిని ఇచ్చాను కదా,ఏ మానవుడైన మనఃపూర్వకమైన భక్తితో , ఆర్తితో నన్ను చూడాలని పరితపించే భక్తుడు ఒక్కడైన ఉన్నాడా అని నిరంతరం ఎదురు చూస్తూనే ఉంటాడు .


దేవుని కరుణకు అవధులు లేవు . ఆయన కృపకు అందరూ పాత్రులే అయితే ఆ పాత్రత మనలో ఉండాలి అంతే . రాక్షసుడైన ప్రహ్లాదుని భక్తికి మెచ్చి నరసింహ అవతరందాల్చి హిరణ్యకసపుని కడతేర్చిన వృతాంతం మనకు సుపరిచితమే . 


అయినా అవన్నీ ఎప్పుడో కృత యుగం లో జరిగిన సంగతి కదా అంటారా . శ్రీ రాముడు త్రేతా యుగం లోనూ , శ్రీ కృష్ణుడు  ద్వాపర యుగం లోనూ అవతరించారు ప్రస్తుత కలియుగంలో అటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారా ?  అటువంటి భక్తుని కోసం దేవదేవుడు అవతరించిన వృతాంతం ఏదైనా ఉందా ? ఒక ఆలయానికి యుగాల నాటి చరిత్ర తప్పకుండా ఉండాలా , కనీసం ఆ ఆలయం కొన్ని వేల సంవత్సరాలో , వందల సంవత్సరాల చరిత్ర అయినా ఉండాలా ? ఆ భక్తునికి భగవంతుడు సాక్షాత్కరించాడు అనడానికి ఆధారాలు ఏవైనా ఉన్నాయా ? ఆ భక్తుని స్వామి వారి అనుగ్రహం కలుగుతుండగా ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా , ముఖ్యంగా నాస్తికులు , హేతువాదులు , అన్యమతస్థులు ప్రత్యక్షంగా చూసి , వాటిని నమ్మి అంగీకరించిన సంఘటనలు ఉన్నాయా ? 


పైన చెప్పిన వాటికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది ఈ భక్తుని వృతాంతం . దీన్ని కధ అనడం లేదు ఎందుకంటే ఇది యదార్ధ గాధ కనుక . 


అది 1889 వ సంవత్సరం .  విశాఖ పట్టణము జిల్లా బొబ్బిలి తాలూకాలోని ఉత్తరావెల్లి గ్రామములో విశ్వకర్మ కులస్తులైన శ్రీ గంగాధరం, రామమ్మ దంపతులు ధార్మికంగా జీవనం సాగిస్తుండేవారు.వారికి దేవుని యందు భక్తి ప్రపత్తులు మెండు.ఆ పుణ్య దంపతులకు 1889 ఏప్రిల్ 4వ తేదీన దేవుని అనుగ్రహం వలన ఒక మగబిడ్డ జన్మించాడు.ఆ బాలునికి నరసింహం అని నామకరణం చేశారు తల్లిదండ్రులు . ఆ అబ్బాయికి కూడా తల్లిదండ్రుల లానే  చిన్నతనంనుంచే దైవ భక్తి చాలా ఎక్కువ.భగవన్నామస్మరణ , కీర్తనలు , భజనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలంటే చాలా ఇష్టం . జీవనోపాధికి తన కుల వృత్తి స్వీకరించి ఆభరణాలు తాయారు చేయడంలో సిద్ధహస్తులయ్యారు . ఏ పని చేస్తున్నా అతని జిహ్వ భగవన్నామస్మరణ చేయడంలో ఉత్సహించేది అందులోనే సేద తీరేది . ఆయనకు పండరీపురం విఠలునిపై యెనలేని భక్తి ఉండేది .


తన 18వ ఏట బందరు జిల్లా చిలకలపూడి గ్రామానికి వలస వచ్చి అక్కడే స్థిరపడ్డారు నరసింహం గారి తల్లిదండ్రులు . అప్పటికే ఆభరణాల తయారీలో ఆరితేరిన నరసింహం గారు బంగారు పూతతో తాయారు చేసే నకిలీ నగలు తాయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు . ఆయన కనిపెట్టిన విధానమే నేటికి ( రోల్డ్ గోల్డ్ , ఉమా గోల్డ్ , గిల్టు నగలు , 1 గ్రాము గోల్డ్ ) అమములో ఉంది . వాటికి ఆధ్యులు నరసింహం గారే . 


గురువు అనుగ్రహం : 


జీవితంలో ఏదైనా సంపాదించవచ్చు కానీ గురువు అనుగ్రహం పొందటం అంత తేలిక కాదు . గురువంటే మన అజ్ఞానాన్ని తొలగించి , తగిన ఉపదేశమిచ్చి , నిత్యానిత్య వివేకమును కలిగించి , న్మార్గంలో ప్రవేశింపజేసి , గమ్యాన్ని తెలిపి , ఆ గమ్యాన్ని చేరుకోవడంలో పడే ప్రయాసల నుండి రక్షించి చివరి వరకు వెన్నంటి ఉండే భగవంతుని రూపమే. నరసింహం గారి జీవితంలో అటువంటి గురువు దర్శన భాగ్యం , అనుగ్రహం కలిగి ఆయన జీవిత గమ్యాన్ని నిర్దేశించిన సంఘటన పండరీపురంలో జరిగింది . నరసింహంగారు ఒకసారి పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మహీపతి గూండా మహరాజ్ అనే గురువుగారి దర్శనమయింది. ఆయన నరసింహంగారికి పాండురంగోపాసన విధానం తెలిపి శ్రీ విఠ్ఠల మంత్రముతో తులసిమాల ప్రసాదించారు. కొంతకాలం తరువాత శ్రీ విఠ్ఠల మహామంత్ర రాజమునుకూడా ఉపదేశించారు.


నరసింహం గారు తరచుగా పండరీ యాత్ర చేసి గురువు గారిని దర్శించుకునే వారు . 1929 వ సంవత్సరంలో ఆయన పండరీ పురం వెళ్ళినప్పుడు మహీపతి గుండా మహారాజ్ గారు " నీవు తరచుగా పండరీ యాత్ర చేస్తున్నావు కదా , నీకు ఈ పండరీ నాధుని వృతాంతం తెలుసునా ? " అని అడిగారు . నరసింహం గారు " తెలుసును గురువు గారు , పండరీనాధుడైన విఠలు తన భక్తుడైన పాండురంగని కోసం అతని ఇంట్లో వెలిసారని సమాధానమిచ్చారు . 


మరి నీవు కూడా ఆ పండరీనాధుని భక్తుడవు నీకోసం స్వామి వారు అక్కడే సాక్షాత్కరిస్తారు కదా ఇంత దూరం రావడం దేనికీ ? అని ప్రశ్నించారు . తరువాత ఇలా అన్నారు " ఇక నీవు పండరీ యాత్ర చేయవలసిన అవసరం లేదు , నీకోసం స్వామి వారే నీ ఊరిలోనే వేలుస్తారు . అక్కడే ఆలయం నిర్మించి కొలుస్తూ ఉండు అని చెప్పారు .


స్వామి వారి మాటలు విని విస్మయమొందిన నరసింహం గారు గురువు గారి అనుగ్రహంతో ఆలయం నిర్మించాలని నిశ్చయించుకుని చంద్రభాగా నది ( పండరీపురంలో ప్రవహించే నది ) లోని కొన్ని రాళ్ళను తీసుకువెళ్ళి శంకుస్థాపన చేస్తున్న సమయంలో వాటిని అక్కడ ప్రతిష్టించాలని అనుకున్నారు . కానీ చంద్రభాగానది ఆ సమయంలో మహా ఉధృతంగా ప్రవహిస్తూ, ఈతగాళ్ళుకూడా నదినుండి రాళ్ళు తియ్యలేని పరిస్ధితిగా వున్నది. అప్పుడు నరసింహంగారు చంద్రభాగను ప్రార్ధించగా పుండరీక దేవాలయము పక్కన ఇసుక దిబ్బ ఏర్పడింది.


నరసింహంగారు పడవలో అక్కడికి వెళ్ళి నదిలోని ఇసుక, రాళ్ళు, నీరు సేకరించి తిరిగి వచ్చారు. ఆ ఇసుకలో ఒక చిన్న గుండురాయి దొరికింది. వాటన్నింటినీ పాండురంగని ముందుంచి, నరసింహంగారు, వారి గురువుగారు ప్రార్ధనా తన్మయత్వంలో వుండగా పాండురంగనినుంచి ఒక జ్యోతి ఆ గుండ్రని రాయిలో ప్రవేశించింది. ఆ రోజు రాత్రి పాండురంగడు నరసింహంగారి కలలో సాక్షాత్కరించి, కీర పండరీక్షేత్రములో శ్రీ శుక్లనామ సంవత్సరం, కార్తీక శుధ్ధ ఏకాదశి బుధవారం (13-11-1929) పగలు తన మూర్తి సాక్షాత్కరించగలదని తెలిపారు. నరసింహంగారు సంతోషంగా తిరిగివచ్చి ఆలయ నిర్మాణం ప్రారంభించారు.


కొంతకాలం తర్వాత గురువుగారైన మహీపతి మహరాజ్ గారికి పాండురంగడు స్వప్న దర్శనమిచ్చి నీశిష్యునికోసం తాను తెలిపిన రోజున కీర పండరిపురంలో సాక్షాత్కరిస్తానని తెలుపగా వారు లేఖద్వారా నరసింహంగారికి ఈ విషయం తెలియజేశారు. పాండురంగని విగ్రహం తప్ప ఆలయ నిర్మాణము పూర్తయినది. పాండురంగని సాక్షాత్కార వార్త అందరికీ తెలిసి ఆ విశేషం దర్శించాలని ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. 


గర్భ గుడికి తాళం :


ఆ రోజు రానే వచ్చింది , అందరూ ఎంతో  ఉత్కంటగా ఎదురుచూసే సమయం అది . స్వామి వారు నిజంగానే ప్రత్యక్షమవుతారా ? ఈ కలికాలంలో ఇది సాధ్యమేనా ? నరసింహం గారు నిజంగానే అంతటి భక్తులా ?ఇలా ఎన్నో సందేహాలు . అప్పటి పాలకులైన బ్రిటీషు వాళ్ళు , నాస్తుకులు , హేతువాదులు ఈ విషయాన్ని నమ్మలేదు . అప్పటి బ్రిటిషు అధికారి ఆలయపు గర్భ గుడిని మూయించి , తాళం వేసి , బయట బందోబస్తును పెట్టించి , స్వామి వారు రావడం బూటకం అని నిరుపించాలనుకున్నాడు .  


ఆంజనేయ స్వామి అభయం : 


ఆంజనేయస్వామి ఆలయంలో ఆయనను ప్రార్ధిస్తూ తన్మయావస్తలో వుండగా ఆంజనేయుడు ఆయనకి ఆభయమిచ్చాడుట.. పన్నెండు గంటలయ్యేసరికి శ్రీ పాండురంగడు ప్రసన్నుడు కాకపోతే పండరీ క్షేత్రాన్ని ఇక్కడికి తీసుకువచ్చి స్ధాపిస్తానని .


పగలు పదిన్నర అయింది: 


ఉన్నట్లుంది ఆకాశం బ్రద్ధలవుతున్నాట్లు పెద్ద శబ్దం . ఉరుములు మెరుపులతో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉంది వాతావరణం . అంతలో గర్భ గుడిలో ఒక పెద్ద చప్పుడు పిడుగు పడినట్లు అనిపించింది .  దేవాలయమునకు వేసిన తాళం తీసి తలుపులు తీయటానికెంత ప్రయత్నించినా తలుపులు రాలేదు. భక్త నరసింహంగారు అనేక ప్రార్ధనలు చేయగా తలుపులు తెరువబడి దివ్య తేజస్సులమధ్య పాండురంగని విగ్రహ సాక్షాత్కరించింది. మూడు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహము పండరీపురములోని పాండురంగని విగ్రహమువలెనున్నది. చల్లని చిరుజల్లు కురిసి వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది.


నాస్తికులు ముక్కున వేలేసుకుని , తమ నాస్తిక వాదం వదిలి పాండురంగడి పాదాక్రాంతులయ్యారు . ఆ బ్రిటిషు అధికారి చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి స్వామి వారి భక్తుడయ్యాడు . ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటనగా ఆలయ చరిత్రలో లిఖించారు .


ఆ పండరీనాధుడే ఇక్కడ ఆయన భక్తుడైన నరసింహం గారి కోసం వెలిసారని వేయినోళ్ళ కొనియాడారు.పండరీపురంలో లాగానే ఇక్కడ కుడా భక్తులందరూ గర్భగుడిలోని పాండురంగని పాదములు తాకి నమస్కరించవచ్చు.


తదుపరి భక్త నరసింహంగారు సహస్రకోటి శ్రీ విఠలనామ యజ్ఞము తలబెట్టగా భారతావనిలో అనేకమంది ఈ యజ్ఞములో పాల్గొని శ్రీ విఠలనామమును వ్రాశారు. ఆ పుస్తకములన్నియు తగు పూజావిధానముతో ఆలయప్రాంగణములోని విఠల్ కోటి స్ధూపములో నిక్షిప్తంగావించబడ్డాయి.


శ్రీ పాండురంగని ఆలయానికి ఎదురుగా భక్త నరసింహంగారికి అభయమొసగిన ఆంజనేయస్వామి ఆలయం వున్నది. ప్రక్కనే వేరొక ఆలయంలో సహస్ర లింగ కైలాస మంటపము విరాజిల్లుతుంటే ఇంకొకపక్క రాధ, రుక్మిణి, సత్యభామ, అష్టలక్ష్ములకు వేరొక ఆలయము నిర్మింపబడ్డది. ఆరు ఎకరాల స్ధలంలో నిర్మింపబడ్డ ఈ ఆలయాలకు చుట్టూ భక్త మందిరాలు..వాటిలోనే షిర్డీ సాయిబాబా మందిరం..దానికి ఎదురుగా అతి పురాతనమైన అశ్వధ్ధ వృక్షము, దానికింద చిన్న సిధ్ధేశ్వరాలయము. 400 ఏళ్ళ పైనుంచి వున్న ఈ అశ్వధ్ధ వృక్షం కింద భూగర్భంలో ఒక ఋషి ప్రాచీన కాలంనుంచి తపస్సు చేసుకుంటున్నారని, ఆయన ఇప్పటికీ వున్నారనీ, భక్త నరసింహంగారికి ఆయన దర్శనమిచ్చారనీ అంటారు.


భగవంతుడు భక్త సులభుడు అని మరొకసారి నిరూపించిన నరసిహంగారు 16-1-1974 సంవత్సరంలో పరమపదించారు. ఆ సమయంలో ఆయన శరీరంనుంచి విద్యుత్కాంతిలాంటి వెలుగు వెలువడి పాండురంగనిలో ఐక్యమందటం, సహస్రలింగ మంటపం వద్ద గంటలు ఓంకారనాదంతో మోగటం అనేకమంది చూశారంటారు. 


దేవాలయ నిర్మాణ సమయంలోనే పాండురంగని ఆజ్ఞ ప్రకారం మహా మండపమునందు సమాధి నిర్మించి దానిమీద ఒక రాయి పరచి వుంచి అవసరమైనప్పుడు తన శరీరాన్ని అక్కడ వుంచమన్నారు. ఆవిధంగానే చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని స్ధాపించారు.


ఈ వార్తలకు సంబంధించి ఆనాడు వెలువడిన వార్తాపత్రికలు ఫ్రేము కట్టించి ఆలయంలో సందర్శకులకోసం వుంచారు. శ్రీ నరసింహంగారి మనుమలు ప్రస్తుతం ఆలయాన్ని నిర్వహిస్తున్నారు.


సముద్ర తీరంలో వున్న ఈ ఆలయానికి, ఆషాఢ, కార్తీక మాసాల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు మన రాష్ట్రంనుంచే కాక ఒరిస్సానుంచికూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఆలయం ఇప్పటికీ భక్త నరసింహంగారి సంతతివారిచేతే నిర్వహించబడుతున్నది. కృష్ణాజిల్లా ముఖ్యపట్టణమైన చిలకలపూడిలో వున్న ఈ ఆలయం చేరుకోవటానికి వివిధ ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. విజయవాడకి 82 కి.మీ. ల దూరంలో వున్నది.


భక్తుని కోసం భగవంతుడు వెలసిన నిదర్శనాలు ఎన్నో మన సనాతన ధర్మంలో ఉన్నాయి . 


హరే రామ హరే రామ రామ రామ హరే హరే

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే


అందరం  " ఓం నమో నారాయణాయ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహానికి  పాత్రులమవుదాం ...


ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ 

జై శ్రీ కృష్ణ


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

దేవుడు అంతటావున్నాడు*


*దేవుడు అంతటావున్నాడు*

                   ➖➖➖✍️


*”భగవంతుడు అన్నిటా వున్నానని చెప్పినప్పుడు హిందువులు విగ్రహారాధన ఎందుకు చేస్తారు?”*


*ఒకసారి వివేకానందుడు ఇప్పుడున్న రాజస్తాన్ లో వున్న అల్వార్ సంస్థానాధీశుని దగ్గరకు వెళ్ళాడు.*


*విగ్రహారాధానని వెక్కిరించడానికి ఆ రాజు వివేకానందునితో…  ‘నాకు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేదు, రాయినీ, రాప్పనీ, కర్రనీ, లోహాన్నీ ఎవరయినా ఎలా ఆరాధిస్తారు? ప్రజలు అపోహలో వున్నారు, కేవలం సమయం వృధా చేసికుంటున్నారు’ అన్నాడు.*


*స్వామీజీ నవ్వుతూ స్పందించారు.*


*రాజు సహాయకుడిని అక్కడ గోడకి వ్రేలాడుతూ వున్న రాజు చిత్ర పటాన్ని క్రిందకు దించమన్నారు.*


*అయోమయం లో పడిన ఆ సహాయకుడు స్వామీజీ చెప్పినట్లే చేసారు.*


*అప్పుడు స్వామీజీ ఆ పటం పై వుమ్మివేయమని రాజు సహాయకుడిని ఆదేశించారు.*


*నిర్ఘాంత పోయిన సహాయకుడు రాజు వైపూ, స్వామీజీ వైపూ చూస్తూ ఉండిపోయాడు.*


*స్వామీజీ మళ్ళీ, మళ్ళీ ఆదేశించారు. ప్రతీ సారీ మరింత తీవ్రంగా ఆదేశించ సాగారు.*


*రాజు ఆగ్రహోద్రకుడవుతున్నాడు, సహాయకుడు వణికి పోతున్నాడు.*


*చివరికి సహాయకుడు ‘నేను ఈ పటం పై ఎలా ఉమ్మగలను? పటం లో వున్న చిత్రం లో    మా రాజు వున్నారు అంటూ అరిచాడు.*


*అప్పుడు స్వామీజీ ‘రాజు నీ ఎదురుగా వ్యక్తిగతంగా కూర్చుని వున్నారు. ఆ పటం లో వున్నది ఒక కాగితం మాత్రమే అది మాట్లాడలేదు, వినలేదు, కదలలేదు. కానీ నువ్వు ఆ పటం పై ఉమ్మి వేయనంటు న్నావు, ఎందుకంటే నువ్వు ఆ పటం లో నీ రాజు ని చూసుకుంటున్నావు కాబట్టి ఉమ్మి వేయనంటు న్నావు. ఆ పటం మీద ఉమ్మితే నీ రాజు మీద ఉమ్మినట్లని నువ్వు అనుకుంటున్నావు’ అన్నారు.*


*స్వామీజీ ని చూసిన రాజు సామీజీ ముందర సాష్టాంగ పడ్డాడు, స్వామీ చెప్పదలుచుకున్నది తనకి పూర్తిగా అర్ధమయిందని ఆ రాజు చెప్పాడు.*


*ఇదే విగ్రహారాధన యొక్క సారము.*


*భగవంతుడు అన్నిచోట్లా వున్నాడు. కానీ మనం ఆయనని పూజించాలను కుంటాము, కోరికలను కోరాలను కుంటాము, నివేదన చేద్దామను కుంటాము, కధలు చెప్పాలని అను కుంటాము, స్నానం చేయించాలని అనుకుంటాము, ఆడుకోవాలను కుంటాము.*


*మనం మన జీవితాలతో ఏమి చేస్తామో అన్నీ భగవంతునితో చేయించాలని అనుకుంటాము.*


*విగ్రహం రూపంలో వున్న భగవంతుని ఆకారాన్ని మనం మన సహచరుడు గానూ, మార్గ దర్శకునిగానూ, స్నేహితుని గానూ, రక్షకునిగానూ, ప్రసాదించే వానిగానూ, సాటి మనిషి గానూ భావించుకుంటూ ఉంటాము.*


*విగ్రహము మనం చూడగలిగే యదార్ధ  ప్రతినిధి.*


*నేను ఆ విగ్రహపు కన్నులలోనికి చూస్తున్నప్పుడు, నాకది రాయిలాగానో, లోహం లాగానో కనిపించదు. మరొక జత కన్నులు  ప్రేమతో నన్ను  నవ్వుతూ  చూస్తున్నట్లు అనిపిస్తుంది.*


*అద్భుతమైన సందేశం, దయచేసి చదవండి మరియూ పంచండి.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

[29/6 7:40 AM] +91 96038 32266: విగ్రహారాధన వ్యతిరేకించే వారికి ఈ msg ఒక కనువిప్పు కలగాలి