25, ఆగస్టు 2023, శుక్రవారం

ఆగస్టు 25, 2023* రాశి ఫలాలు🌹

 .       *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

.  *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*శుక్రవారం, ఆగస్టు 25, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*నిజ శ్రావణ మాసం - శుక్ల పక్షం*

*తిధి*      :  *నవమి రా8.26* వరకు 


.                *🌹రాశి ఫలాలు🌹* 

 

*మేషం*


సన్నిహితులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి.

---------------------------------------

*వృషభం*


చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటాబయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

---------------------------------------

*మిధునం*


వృత్తి వ్యాపారాలలో సొంత  ఆలోచనలు అమలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. గృహమునకు ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఉద్యోగాలలో సమస్యలు తొలగి హోదాలు పెరుగుతాయి.

---------------------------------------

*కర్కాటకం*


ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.  ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం తప్పదు.

---------------------------------------

*సింహం*


స్నేహితులు మీ మాటతో విబేదిస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలలో మార్గ  అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది.  ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. 

---------------------------------------

*కన్య*


ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.  ఇంటా బయట కొన్ని సమస్యలు సన్నిహితుల సాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో  అనుకున్న లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు.

---------------------------------------

*తుల*


ఆదాయం మరింత  నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన  వ్యవహారాల్లో చికాకులు తప్పవు. కొందరి ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు.

---------------------------------------

*వృశ్చికం*


ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందుతాయి. చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగాల్లో  అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

*ధనస్సు*


మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------

*మకరం*


 ధార్మిక  సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో  ముందుకు సాగుతారు. సమాజంలో  పలుకుబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన  కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. 

---------------------------------------

*కుంభం*


సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో  స్థిరాస్తి  విషయాలలో నూతన ఒప్పందం చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతాన  ఉద్యోగ, వివాహయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

*మీనం*


సన్నిహితులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో పునరాలోచన చేయడం మంచిది. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఇంటా బయట  పరిస్థితులు అనుకూలించవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో   వివాదాలు తప్పవు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻,


*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 21*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 21*


ఆత్మవిచారణ


తర్వాతి అర్హత స్వాధ్యాయం. చదువు, మంత్రజపం అని సామాన్యంగా దీనికి అర్థం చెప్పుకొంటారు. కాని దీని విశేషార్థం, 'తనను అధ్యయనం చేసుకోవడం' (స్వ+అధ్యయనం). అంటే ఆత్మ విచారణ అని అర్థం. 


ఆధ్యాత్మిక జీవితానికి మాతృమూర్తి శ్రీ శారదాదేవి దీనిని ఒక ముఖ్యమయిన నియమంగా అభివర్ణించారు. నౌకకు చుక్కానిలా ఆత్మ విచారణ సాధకునికి మార్గదర్శి వంటిదని కూడా ఆమె పేర్కొన్నారు. 


"నేనెవరిని? నా మనోవైఖరి ఏమిటి?”, “నేను దేనిని అన్వేషిస్తున్నాను?" "దానిని పొందడానికి తగిన మార్గంలోనే వెళుతున్నానా?” ఇలాంటి ప్రశ్నలను లోతుగా యోచించడం తప్పనిసరి. వీటికి జవాబులు లభించినా, లభించకపోయినా నిత్యం కొంతసేపు వీటిని గూర్చి యోచించడం ఎంతో ఆవశ్యకం.🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పండగ పూట

 నిత్యాన్వేషణ: 


"పండగ పూట పాత మొగుడేనా" ఈ సామెత సరైనదా?

పండగ పూట పాత మొగుడేనా? ఈ సామెత తప్పు…!

పండగ పూట పాత మొగుడేనా.. అనే సామెత…! ఎప్పటి నుంచో మనం విటున్నాం కదా… ఈ మాటకున్న అర్థం మీరు ఎప్పుడైనా ఆలోచించారా…? అసలు ఇంతకూ ఈ సామెత కరెక్టేనా…? ఈ సామెత మన హిందూ స్త్రీ యెుక్క గుణనమును తప్పుగా తెలిపే విధంగా అర్థాన్ని తెలపటం జరుగుతున్నది.

మన హిందూ సంప్రదాయానికి విరుద్ధమైన అర్థం ఇచ్చే విధంగా అంటే……”పండగ పూట కొత్త మొగుడు కావాలి” అన్న అర్థం వచ్చేల వుంది. ఆడవారిని కించపరిచేలా ఈ సామెత వుండడం బాధాకరం.

నిజంగా ఈ సామెత ఇలానే వుందా అని….. అనుమానం రావడంతో… దీని ఆంతర్యం కోసం చిన్న పరిశోధన ప్రయత్నం చేశాను.. అప్పుడు నాకు దొరికింది అసలైన సామెత… ఇది నిజమైన తెలుగు సాంప్రదాయ సామెత…. అదే ఈ సామెత……!!

పండగ పూట పాత మడుగేనా… మరొకసారి చదవండి, ఈ పురాతన సామెత ఇప్పుడు వెలుగు చూడడం చాలా సంతోషించదగిన విషయం. ఈ పాత సామెత అర్థం ఏమిటో మనం ఒక్క సారి చూద్దాం…!

మడుగు అంటే వస్త్రం అని అర్థం.. ‘పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన ఆనవాయితీ.. ఆ అర్థంలో పుట్టిన సామెత ఇది… పండగ పూట పాత బట్టలు కాదు.. కొత్త బట్టలు కట్టుకోవాలి’ అని…, అప్పటి ప్రజల స్థితిగతులు(ఆర్ధిక పరిస్థితులు) సరిగాలేని రోజులలో ఈ సామెత పుట్టుకు రావడం జరిగింది….!!

ఇకపై ఈ సామెతకు తప్పుడు ప్రచారం మనం చేయకూడదు… ఈ సామెతను సరైన రీతిలోనే పలుకుదాం.. పలికిద్దాం… మన హిందూ స్త్రీ గుణాన్ని కించపరిచే సామెతను మరిచిపోదాం…పండగ పూట పాత మడుగేనా అన్న పాత సామెతనే ఇక నుంచి అందరం పలుకుదాం… మన తెలుగును మనం పరిరక్షంచు కొందాం…

నవగ్రహా పురాణం🪐* . *10వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *10వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*సూర్యగ్రహ జననం - 1*


ఆశ్రమ సమీపంలోని సుందర ప్రాంతంలో అదితి తపస్సు ప్రారంభించింది. పచ్చని పరిసరంలో , ప్రశాంత వాతావరణంలో పూర్వాభిముఖంగా కూర్చున్న అదితి , అచిరకాలంలో తాను కూడా ఆ ప్రకృతిలో భాగంగా లీనమైపోయింది. అసామాన్యమైన ఏకాగ్రత ఆమెను వరించింది. ప్రణవ పూర్వకంగా శ్రీ మహావిష్ణు నామం ఆమె హృదయంలో నినదిస్తోంది.


ఆమె ధ్యాననిష్ఠ నిత్య ధ్యానంతో గడిపే కశ్యప ప్రజాపతినే అబ్బుర పరుస్తోంది. 


అనతికాలంలోనే శ్రీమహావిష్ణువు ఆమె ముందు సాక్షాత్కరించాడు. అసంకల్పితంగా అదితి కళ్ళు విచ్చుకున్నాయి.


*"పరమాత్మా ! వచ్చావా !"* అదితి ఆనంద బాష్పాలు రాలుస్తూ చేతులు జోడించింది. *"నీ ధ్యాన తరంగాలు ఏకోన్ముఖంగా నా హృదయాన్ని తాకాయి ! నన్ను నీ ముందుకు రప్పించాయి !"* విష్ణువు మందహాసం చేస్తూ అన్నాడు. *"ఏం కావాలో కోరుకో !"*


*"ఈ దీనురాలి కోరిక నీకు తెలియదా , స్వామీ !"* అదితి కంఠంలో భావావేశం తొణికింది.


*"తెలుసు ! భక్తుల కోరికలను వాళ్ళ వాక్కులలో వినడం నాకు ఇష్టం ! అడుగు అదితీ !"* శ్రీమహావిష్ణువు కంఠం ఆ ప్రశాంత వాతావరణానికే గిలిగింతలు పెట్టింది.


*"ఈర్ష్యాద్వేషాలు లేని వాడూ , సర్వుల పట్లా సమదృష్టి కలిగిన వాడూ , లోక హితం కోరే వాడు అయిన పుత్రుణ్ని ప్రసాదించు , తండ్రీ ,"* అదితి వినయంతో అడిగింది. 


విష్ణువు మొహం మీద దరహాసం మెరిసింది. *"అదితీ ! నువ్వు కోరిన వరం ప్రశంసించదగింది. ఒక్కసారి , నీ ఎదురుగా ఆకాశంలోకి చూడు !"*


అదితి ఆశ్చర్యపోతూ , అప్రయత్నంగా కళ్ళెత్తి , ఆకాశంలోకి చూసింది. 


*"ఎవరు కనిపిస్తున్నారు. నింగిలో ?"* విష్ణువు ప్రశ్న ఆమెను హెచ్చరించింది. 


"... సూర్యభగవానుడు , స్వామీ..."* అదితి సమాధానమిచ్చింది. *"ఇప్పుడు నీ ఎదురుగా వున్న పూల మొక్కనూ , ముళ్ళపొదనూ చూడు !"* విష్ణువు చిన్నగా నవ్వాడు


అదితి అసంకల్పితంగా చూసింది. పూల మొక్కా , ముళ్ల పొదా రెండూ సూర్యకాంతిలో మెరుస్తున్నాయి.


*“ఆ రెండు మొక్కల మీదా సూర్యరశ్మి సమానంగా పడుతోంది కదా !"* విష్ణువు కంఠ స్వరంలో తేనెలు కురుస్తున్నాయి.


*"అవును..."* అదితి మంత్ర ముగ్ధలా అంది.


*"సకల ప్రాణుల పట్లా , సకల చర - అచర ప్రపంచం పట్లా సమదృష్టి కలిగిన వాడూ , సర్వలోక హితం కోరే వాడూ - ఆ సూర్యుడు ! ఆ సూర్యుడే నీ పుత్రుడుగా జన్మిస్తాడు !"*


*"స్వామీ !”* అదితి కంఠం వణికింది. ఆనందబాష్పాలు ఆమె కళ్ళ ముందు మంచు తెరను పట్టుతున్నాయి.


*"ఆ సూర్యుడు ఎక్కడున్నాడో తెలుసా ?"* విష్ణువు నవ్వుతూ అన్నాడు. *"ఊర్ధ్వ లోకంలో , జ్యోతిర్మండలంలో నీకు కనిపిస్తున్న గోళాకారంలో వున్నాడు ! సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంలో - ఇదిగో - నా కుడికంటిలో వున్నాడు !"*


అదితి శరీరంలో ఏదో గగుర్పాటు.


*“చర్మ చక్షువులకు కనిపించని మహా సూక్ష్మరూపంలో నా దక్షిణ నేత్రంలోనూ , కంటికి కనిపిస్తూ , తదేకంగా చూడలేని తీక్షణ గోళాకారంలో నింగిలోనూ వున్న ఆ 'వెలుగు వేలుపు' సశరీరంగా నీ పుత్రుడుగా జన్మిస్తాడు !".*


*"స్వామీ ! స్వామీ ! నేనెంత ధన్యురాల్ని ! ఎంత అదృష్టవంతురాల్ని...”* అదితి వణికే కంఠంతో అంటోంది.


*"అవును , అదితీ ! నీవు మహాభాగ్యశాలినివి ! సకల జీవులూ , ముఖ్యంగా భూలోకంలోని మానవులూ , ఆరాధించుకోవడానికి అనువుగా జ్యోతిర్మండలాలలో కాంతి గోళాలుగా వున్న నవగ్రహాలు తేజోరూపాలతో , శరీరాలతో అవతరించాలని నేను సంకల్పించాను. నీ ద్వారా నవగ్రహాల ఆవిర్భావాలకు ఆరంభం జరుగుతుంది. నా అంశ కలిగిన సూర్యుడు నీ గర్భవాసాన జన్మిస్తాడు !"*  శ్రీ మహావిష్ణువు గంభీరంగా అన్నాడు. *"నన్ను అలరించినట్టే , ఆ సూర్యుణ్నీ నీ ధ్యానంతో అలరించు ! అఖండభక్తితో ఆరాధించు ! వరం అర్థించు !"* 


మాటలు మరిచిపోయిన అదితి వినయంగా చేతులు జోడించింది. విష్ణువు అంతర్ధానమయ్యాడు.


*"నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి, అదితీ !"* శ్రీహరి సాక్షాత్కారం గురించి భార్య చెప్పిందంతా విన్న కశ్యపుడు సంతోషంగా అన్నాడు. *"ఆ పరమ పురుషుడు ఆదేశించిన విధంగా రేపే సూర్యారాధన ప్రారంభించు !"*


అదితి సోదరీమణులు పన్నెండుగురూ చుట్టూ చేరి ఆసక్తిగా వింటున్నారు. *"అదితి అక్క అదృష్టమే అదృష్టం ! విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేసుకుంది ! ఇప్పుడు నింగిలోని సూర్యుణ్ణి నేలకు దించి , పుత్రుడిగా పొందబోతోంది !"* వినత మెప్పుగా అంది..


దితి ఎగతాళిగా నవ్వింది. *"సంతానం కోసం అంతయాతన ఎందుకు వినతా ? తపస్సు , ధ్యానమూ అనే శ్రమ అవసరం లేకుండానే , సంతానాన్ని యిచ్చే పతిదేవుడు. కళ్ళముందే వుంటే - ఎక్కడో వున్న ఆ దేవుళ్ళెందుకు ?”*


దనూ , సింహకి , కళా పగలబడి నవ్వారు.


కశ్యపుడు , దితివైపు మందలింపుగా చూశాడు. *"నీది అజ్ఞానమూ , అవిధేయతా కలిసిన ఆలోచన దితి ! శ్రీ మహావిష్ణువు ఎవరనుకున్నావు ? నీ తండ్రి దక్ష ప్రజాపతికి , నీ నా తండ్రి మరీచి మహర్షికి జన్మనిచ్చిన ఆ సృష్టికర్తకే తండ్రి. ఆయనే సూర్యుడు ! అలాంటి దైవస్వరూపుడైన సూర్యభగవానుడి ఆరాధనను అపహాస్యం చేయడం అపచారం !".*


*"పోనీలెండి , చెల్లి , దితి అమాయకురాలు. పాపం దానికి ఏమీ తెలీదు !"* అదితి కల్పించుకుంటూ అంది.


*ఎందుకు తెలీదు తెలుసు ! ఆ మహావిష్ణువు మన తండ్రులకు తాత ; మనకు ముత్తాత ; అందుకే గదా , మునిమనుమరాలైన యీ దితి కొడుకు హిరణ్యాక్షుణ్ని వరాహరూపంతో వధించాడు. హు !"* దితి అక్కసు వెళ్ళగక్కుతూ అక్కణ్నుంచి వెళ్ళిపోయింది. వినత , కద్రువా , మునీ తప్పించి - మిగతా సోదరీమణులందరూ దితి వెంట వెళ్ళిపోయారు.


*"దితి మాటల్ని మరిచిపో అక్కా నీ సూర్యారాధన ప్రారంభించు !"* అంది వినత.


అదితి ఉపవాస దీక్షతో సూర్యారాధన ప్రారంభించింది. విష్ణువును గురించి తపస్సు చేసిన ప్రదేశంలోనే ఆమె తపోదీక్ష కొనసాగుతోంది.


రోజులు గడుస్తున్నాయి. ఏకాగ్రతలో మునిగిపోయిన అదితి తాను వున్న స్థలాన్నీ , జరుగుతున్న కాలాన్నీ , ఆకలిదప్పుల్నీ , చివరికి తన ఉనికినీ పూర్తిగా మరిచిపోయింది. ఆమె శరీరంలోని ప్రతి అణువూ సూర్యధ్యానం చేస్తోంది. తన చుట్టూ వున్నది వెలుగో , చీకటో కూడా తెలుసుకోలేని ఒక దివ్యమైన అవస్థలోకి ప్రవేశించిందామె సర్వస్వమూ !


*“అమ్మా !”*


ఏదో అంతరాళం నుంచి వినవస్తున్నట్టు , అదితి చెవులకు లీలగా వినిపించిందా పిలుపు. ఆ పిలుపులోని మాధుర్యం అదితి నిమీలిత నేత్రాలు విచ్చుకునేలా చేసింది.


*"అమ్మా...”*


అదితి హృదయంలో ఏదో అవ్యక్తానందం పరవళ్ళు తొక్కింది. కళ్ళు పెద్దవిచేసి చూసిందామె. ఎదురుగా , భూమికి అంటకుండా ఒక కాంతిగోళం కనిపించింది. ఆ కాంతిగోళం లీలగా స్పందిస్తోంది. కనిపించీ కనిపించని కదలిక అది !


*"ఎవరు ?"* అదితి కంఠం వణికింది.


*"నేనే ! సూర్యుణ్ని ! మౌనభాషతో పిలిచావుగా ! వచ్చాను"* , కాంతి గోళంలోంచి స్పష్టంగా వినిపించింది సూర్యుడి కంఠం.


*"తండ్రీ !"* ఆనందోద్రేకంతో అదితి కంఠం సన్నగా వణికింది. గగుర్పాటుతో ఆమె లతలాంటి శరీరం వణికింది.


*"వచ్చావా , తండ్రీ..."* అంది అదితి పారవశ్యంతో.


*“నాకు తల్లి కావాలనుకున్నావుగా ! అందుకే వచ్చాను ! నీ గర్భవాసాన విశ్రాంతి తీసుకుని , నీ బిడ్డగా జన్మించి , నీ వొడిలో ఆడుకుంటాను !"* సూర్యుడి మాటల్లోని మధురిమ అదితిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది !


*"అది... అది... నా అదృష్టం తండ్రీ !" "నీ స్తన్యపానంతో తుష్టినీ , పుష్టినీ పొంది , నీ వొడిలో ఆడుకోవడం నా అదృష్టమమ్మా !”*


*"నాయనా..."* అదితి కంఠం మాతృభావనతో కంపించింది. 


*"అమ్మా ! ఆశ్రమానికి వెళ్ళు ! నా రాక కోసం ఎదురు చూడు !"* కాంతి వలయం లోంచి సూర్యకంఠం పలికింది.


క్షణంలో ఆ కాంతిగోళం అదృశ్యమైంది.


అదితి రెప్పలు టపటపలాడించింది. అంత సేపూ తాను రెప్పవేయడం మరచిపోయినట్టు ఆమె గుర్తించి ఆశ్చర్యపోయింది. నరనరంలోనూ , అణువణువు లోనూ ప్రవహిస్తున్న ఆనందం అదితిని ఆశ్రమం వైపు నడిపించింది.


సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 21*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 21*


ఆత్మవిచారణ


తర్వాతి అర్హత స్వాధ్యాయం. చదువు, మంత్రజపం అని సామాన్యంగా దీనికి అర్థం చెప్పుకొంటారు. కాని దీని విశేషార్థం, 'తనను అధ్యయనం చేసుకోవడం' (స్వ+అధ్యయనం). అంటే ఆత్మ విచారణ అని అర్థం. 


ఆధ్యాత్మిక జీవితానికి మాతృమూర్తి శ్రీ శారదాదేవి దీనిని ఒక ముఖ్యమయిన నియమంగా అభివర్ణించారు. నౌకకు చుక్కానిలా ఆత్మ విచారణ సాధకునికి మార్గదర్శి వంటిదని కూడా ఆమె పేర్కొన్నారు. 


"నేనెవరిని? నా మనోవైఖరి ఏమిటి?”, “నేను దేనిని అన్వేషిస్తున్నాను?" "దానిని పొందడానికి తగిన మార్గంలోనే వెళుతున్నానా?” ఇలాంటి ప్రశ్నలను లోతుగా యోచించడం తప్పనిసరి. వీటికి జవాబులు లభించినా, లభించకపోయినా నిత్యం కొంతసేపు వీటిని గూర్చి యోచించడం ఎంతో ఆవశ్యకం.🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సుభాషితమ్


 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


 𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*శ్రద్ధయా సాధ్యతే ధర్మో దత్తం వార్యపి చాక్షయమ్‌౹*

*మాతుః శతగుణం దానం సహస్రం పితురుచ్యతే౹*

*అనన్తం దుహితుర్దానం సోదర్యే దత్తమక్షయమ్‌౹౹*


𝕝𝕝తా𝕝𝕝

ధర్మము శ్రద్ధచేతనే సిద్ధిస్తుంది. శ్రద్ధతో మంచి నీళ్ళు ఇచ్చినా అది అక్షయమైన ఫలితాన్ని అందిస్తుంది.

( *శ్రద్దలేక చేసేదానికి ఏ ఫలం లేదు* )

తల్లికి ప్రేమతో ఏదైనా ఇచ్చినదానికి నూరు రెట్లు ఫలము, తండ్రి కిచ్చినదానికి వేయి రెట్లు ఫలం ఉండును.....పుత్రికలకు ఇచ్చినందుకు అనంత ఫలం, అక్కా చెల్లెండ్లకు ఇచ్చినందుకు అక్షయ ఫలం ఉంటుంది.

సన్యాసి..సంసారి..*

 *సన్యాసి..సంసారి..*


"నేను ఇక్కడ మండలం రోజులు ఉండాలని అనుకుంటున్నాను..ఈ వాతావరణం నాకు నచ్చింది..నేను ఉండటానికి ఏర్పాట్లు చేయగలరా?..నేను ప్రతిరోజూ సాధన చేసుకోవడానికి ఈ ప్రదేశం అనువైనదిగా నా మనస్సుకు అనిపిస్తోంది..పైగా ఇక్కడ ఒక అవధూత తపస్సు చేసి సిద్ధిపొందాడని విన్నాను.." అని ఆ సాధువు నన్ను అడిగాడు..కాషాయ వస్త్రాలు కట్టుకొని నుదుటన పెద్ద బొట్టు పెట్టుకొని ఉన్న ఆయనను చూడగానే నాకు పెద్దగా భక్తిభావం కలుగలేదు..వయసు నలభై ఏళ్ళు ఉంటుందేమో అనుకున్నాను..అతని ముఖం లో నిర్లక్ష్యంతో కూడిన చూపు కనబడుతున్నదా అన్న భావన కలిగింది..


"ఇలా హఠాత్తుగా వచ్చి, ఏర్పాట్లు చేయండి అంటే..మాకు వీలుపడదు..మీరు కనీసం రెండు మూడు నెలల ముందుగా తెలియపరచి ఉంటే..అవకాశం కల్పించేవాడినేమో..ప్రస్తుతానికి ఇక్కడ తపస్సు చేసి సిద్ధిపొందిన అవధూత దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్ళండి..కొంతకాలం తరువాత మీరు ముందుగా తెలియచేస్తే..మీరు సాధన చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తాము.." అన్నాను..


"అలాగా..సరే.." అని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు..కనీసం స్వామివారి సమాధి దర్శనం కూడా చేసుకోలేదు.."ఆ సాధువు మళ్లీ వస్తే..సమాధి వద్దకు పంపించండి..మనమేమీ ఏర్పాట్లు చేయలేమని చెప్పండి.." అని మా సిబ్బందికి చెప్పాను..మా వాళ్ళు కూడా సరే అన్నారు..ఆరోజు అతను మాకు కనబడలేదు..మేమూ మా పనుల్లో మునిగిపోయాము..ప్రక్కరోజు ఉదయం మళ్లీ వచ్చాడు.."అయ్యా..స్వామివారి సమాధి దర్శనం చేసుకుంటాను.." అన్నాడు..సరే అన్నాను..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చి..గడప వద్ద నిలబడి..రెండు చేతులూ జోడించి నమస్కారం చేసుకొని..తన చొక్కా జేబులోంచి ఒక చిన్న కర్పూరపు గడ్డ తీసుకొని..ప్రక్కనే స్వామివారి ఉత్సవ మూర్తి ముందు వెలుగుతున్న దీపం వద్ద ఆ కర్పూరాన్ని వెలిగించి.."స్వామీ దత్తాత్రేయా..." అంటూ పెద్ద కేక పెట్టి..వెలుగుతున్న ఆ కర్పూరాన్ని అమాంతం నోట్లో వేసుకొని మింగేసాడు..ఈ తతంగం అంతా చూస్తున్న మా కందరికీ ఒళ్ళు జలదరించింది..ఒక ఐదు నిమిషాల పాటు అక్కడే కళ్ళుమూసుకుని నిలబడ్డాడు..ఆ తరువాత స్వామివారి ఉత్సవ మూర్తి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని..అర్చక స్వామి ని అడిగిమరీ తీర్ధం ఇప్పించుకొని..దానిని నోట్లో వేసుకొని..మళ్లీ నమస్కారం చేసుకొని..బైటకు వచ్చేశాడు..


"నాకు ప్రాయశ్చిత్తం జరిగింది.." అని ఒకే ఒక మాట చెప్పి.."నేను వెళ్ళొస్తాను.." అని వెళ్ళిపోయాడు..ఆరోజు ఆ సంఘటన నా మనసులో హత్తుకు పోయింది..ఆ తరువాత అతను మళ్లీ రాలేదు..క్రమంగా నేనూ మర్చిపోయాను..


మరో  రెండు సంవత్సరాల తరువాత..ఒక శనివారం నాటి మధ్యాహ్నం మూడు గంటల వేళ, ఇద్దరు దంపతులు వచ్చారు..నేరుగా నేను కూర్చున్న చోటుకి వచ్చి.."నన్ను గుర్తు పట్టారా?" అని ఆ ఇద్దరిలో మగవాడు అడిగాడు.."లేదు..మీరెవరో నాకు గుర్తు రావడం లేదు.." అన్నాను.."నిజమే లెండి..గుర్తుపట్టడం కష్టమే..కానీ ఇది చెప్పండి..రెండు సంవత్సరాల క్రితం..ఇక్కడ సాధన చేసుకోవాలి..నాకు ఉండటానికి ఏర్పాటు చేయమని ఒక సన్యాసి మిమ్మల్ని అడిగాడు..మీరు కుదరదు అన్నారు..గుర్తుందా?..ఆ సన్యాసిని నేనే..ఇప్పుడు సంసారిగా మారి..స్వామివారి దర్శనానికి వచ్చాను..ఈమె నా భార్య..సాధన, తపస్సు, మోక్షం..ఇలాటి మాటలు విని..సన్యాసుల్లో కలిశాను..ఎక్కడెక్కడో తిరిగాను..ఒక గమ్యం లేదు..ఒక మార్గం లేదు..మొదటిసారి మొగిలిచెర్ల వచ్చి ఈ స్వామివారి మందిరం లో అడుగుపెట్టిన తరువాత..నాకు తపన మొదలైంది..మీరు ఇక్కడ ఉండటం కుదరదు అన్న తరువాత..ఆరోజు రాత్రి స్వామివారు నాకు స్వప్న దర్శనం ఇచ్చి..నీ మార్గం ఇదికాదు..కుదురుగా సంసారం చేసుకో..పోరా..పోయి..నీ భార్య తో కలిసి ఇక్కడకు రా..! అని చెప్పారు..అందుకే తెల్లవారి వచ్చి ఇక్కడ వెలిగే కర్పూరాన్ని మింగి..నా తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను..నేరుగా మా ఊరు వెళ్లి, నా భార్యకు క్షమాపణ చెప్పుకున్నాను..వ్యవసాయం చేసుకుంటూ..కుదురుగ్గా వున్నాను..ఇన్నాళ్లకు మళ్లీ స్వామి దయవల్ల ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చాను.." అన్నాడు..


అందరూ సాధకులు కాలేరు..కొందరు వక్రమార్గం పడతారు..అటువంటి వారు సరైన సమయం లో సద్గురువును ఆశ్రయిస్తే...సక్రమమైన బోధచేసి..జీవితానికో మార్గం చూపుతారు..సంసారిగా వుండి..సన్యాసిగా మారి..మళ్లీ సంసారం లోకి వచ్చిన ఈ సాధకుడి జీవితం కూడా మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు అనబడే సద్గురువు బోధ తోనే బాగుపడింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

చంద్రయాన్ 3 “

 మిషన్  “చంద్రయాన్ 3 “ ద్వారా చంద్రుడిమీద మన విక్రమ్ safelanding కావడం మన భారతీయులందరికీ గర్వ కారణం. ఈసందర్భంగా  ఎప్పుడో  దాదాపు  60 ఏళ్ల నాడు మహాకవి శ్రీశ్రీ గారు  తన “ఖడ్గ సృష్టి “ లో వ్రాసిన కవితా పంక్తులు  గుర్తుకొస్తాయి - కవులు దార్శనికులు ,సామాజిక శాస్త్రవేత్తలు అనడానికి ఈ కవితే నిదర్శనం !!


“ మబ్బుతునక జేబురుమాలు 

మాటు చేసుకున్న జాబిల్లీ !


ఏమో బహుశా త్వరలో 

నీ ఇంటికి రావొచ్చు మేము 

స్వాగతం ఇస్తావు కదూ !

ఆతిధ్యానికర్హులమే మేము !


చంద్ర మండలానికి ప్రయాణం 

సాధించరాని స్వప్నం కాదు 

గాలికన్నా బరువైన వస్తువుని 

నేల మీద పడకుండా నిలబెట్ట లేదూ ?


పరమాణువు గర్భంలోని 

పరమ రహస్యాలు 

మహాకాశ వాతావరణంలోని 

మర్మాలు తెలుసుకున్నాక 

సరాసరి నీదగ్గరకే  ఖరారుగా వస్తాంలే 

అపుడు మా రాయబారుల్ని 

ఆదరిస్తావు కదూ నువ్వు ?


(ఇది శ్రీశ్రీ గారు  1966 లోనే అందించిన “మానవుని ప్రోగ్రెస్ రిపోర్ట్”)

పంచాంగం 24.08.2023 Thursday,

 ఈ రోజు పంచాంగం 24.08.2023 Thursday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస శుక్ల  పక్ష: అష్టమి తిధి బృహస్పతి వాసర: విశాఖ నక్షత్రం ఇంద్ర యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


అష్టమి రాత్రి 03:08 వరకు.

విశాఖ  పగలు 09:00 వరకు.

సూర్యోదయం : 06:04

సూర్యాస్తమయం : 06:32

వర్జ్యం : మధ్యాహ్నం 01:02 నుండి 02:38 వరకు.

దుర్ముహూర్తం: పగలు 10:13 నుండి 11:03 వరకు తిరిగి మధ్యాహ్నం 03:13 నుండి 04:02 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం  01:30 నుండి 03:00 వరకు.


యమగండం : ఉదయం 06:00 నుండి 07:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

శ్రీ శంకర కృప

 .🕉️ హర హర మహాదేవ శంభో శంకర 🔱 మన భారతదేశ చరిత్రలో సనాతన ధర్మానికి ధర్మ పరిరక్షకుడుగా నిలువెత్తు సాక్ష్యముగా నిలబడ్డ మహనీయుడు ఆదిశంకరాచార్యులు వారు. అయితే ఆ గురు పరంపరంగా వస్తున్న ఆ పీఠాధిపతులు కూడా ఎంతో ధర్మ పరిరక్షణ చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా ఈ ఆధునిక యుగంలో శ్రీ శంకర కృప అనే పేరుతో మన సనాతన ధర్మంలో జరుగుతున్న విశేషాలు వాటి యొక్క అర్థాలు వివరణలు తో కూడిన మాసపత్రిక పుస్తకమును శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ స్వామి వారి చేతుల మీదగా ఈ మాస పత్రికలను పంపిణీ జరగడం ప్రారంభమైనది, కావున తమరికి వీలైన వారందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా చదివి ఆ విషయాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నాము, మన ధర్మాన్ని మనమే పరిరక్షించుకోవాలి. మనము ఖర్చు చేసే విషయాల్లో కి వస్తే దీనికి ఖర్చు పెట్టేది చాలా చిన్నది కావున ప్రతి హిందువులు ఇంటిలో కూడా ఈ మాస పత్రిక పుస్తకం ఉండాలని మేము కోరుకుంటున్నాము, ప్రతినెలా కూడా ఈ పుస్తకము డైరెక్టుగా మీ ఇంటికి మీ అడ్రస్కే వస్తుంది, అందరూ కూడా సహకరించగలరని కోరుతున్నాము. మూడు సంవత్సరమునకు చందా ₹300/-. దీనికి సంబంధించి సంప్రదించవలసిన వారు సాయి కుమార్ శర్మ 9642907999