1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

Careful


 

ఉద్యోగాలు రిజర్వేషన్లు

 తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలలున్నాయి గానీ తెలుగు మాధ్యమంలో చదువులున్నాయా?తెలుగు మాధ్యమం ఉంటేనే  తెలుగు మాధ్యమ చదువులకు ఉద్యోగాలు రిజర్వేషన్లు ఆడగగలం .

కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ తమిళ మహాసభల్లో తమిళ మాధ్యమ విద్యార్ధులకు ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా లభించేలా కొన్ని తీర్మానాలు చేశారు. తమిళ మీడియం అభ్యర్దులకు ఉద్యోగాలు దొరకక పొతే ప్రజలు పిల్లల్ని తమిళ మాధ్యమం లో చదివించరనీ ,ఎవరూ చదవని భాష నశిస్తుందనీ ,తమిళం పదికాలాలపాటు బ్రతకాలంటే ఆభాషలో మాత్రమే చదివిన వారికి వెనుక బడిన కులాలవారికి ఇస్తున్నట్లుగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశారు .అందుకోసం అత్యవసరంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చారు.శాసన సభలో,స్థానిక సంస్థల్లో ,ప్రభుత్వ కార్పోరేషన్లు,కంపెనీలలో తమిళ అభ్యర్దులకు 20 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని శాసించారు.

న్యాయస్థానం సమర్ధించింది

తమిళనాడు ప్రభుత్వం జీవో ఎం ఎస్ నంబర్ 145 P & AR (S) డిపార్ట్ మెంట్ తేదీ. 30.09.2010 ద్వారా తమిళ మీడియం లో డిగ్రీ వరకు చదివిన అభ్యర్దులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు.చెన్నై హైకోర్టు కూడా 23.2.2016 న ఈ చట్టాన్ని సమర్ధించింది.తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది.రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలని,ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని కూడా తెలియ జేసింది.

తెలుగు మాధ్యమం ఉంటేనే  తెలుగు మాధ్యమ చదువులకు ఉద్యోగాలు రిజర్వేషన్లు ఆడగగలం .

పోతన గారి మనోచిత్రణం !

 


పోతన గారి మనోచిత్రణం !


మ: తన వేంచేయు పదంబు పేర్కొనఁ డనాధ స్త్రీ జనాలాపముల్

వినెనో? మ్రుచ్చులు మ్రుచ్చిలించిరొ ఖలుల్ వేదప్రపంచంబులన్?

దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో? భక్తులం

గని చక్రాయుధుఁడేడి ? చూపుఁడని ధిక్కరించిరో దుర్జనుల్;


పోతనగారి భాగవతం--గజేంద్రమోక్షము-


శ్రీమదాంధ్రమహా భాగవతమున ప్రసిధ్ధ ఘట్టము "గజేంద్రమోక్షము" అటు కథాపరంగాను ఇటు కవితాపరంగానూ మహోన్నత స్థితికి తావలమైనది ఆకథ.గజేంద్రుని మొఱవిని ఉన్నపాటున నిరాయుధుడై భార్య చేలాంచల హస్తుడై పరువెత్తు మగని యారాటమును జూచి వెరగుపడి యతనివెనుక వినువీధిలో పరువెత్తు శ్రీమహాలక్ష్మి యొక్కచిత్తమునందలి సందేహములను పోతన కడు రమణీయముగా చిత్రిం చినాడు. అదియే పైపద్యము.


శ్రీపతి ఉన్నపాటున పరువెత్తు చున్నాడు. యిదెంత చిత్రం! యెక్కడికి వెళుతున్నాడో తెలియదు.చెప్పనైనా చెప్పడు. ఎక్కడికబ్బాఈపరుగు.? అని యించుక వితర్కించి, గతంలో వేద రక్షణకు, భక్త రక్షణకు అతడుపడిన పాట్లు స్మరణకురాగా

అనుకొను చున్నదట!(తనలో) ఈయన యెటువెళ్ళుచు న్నాడో చెప్పటంలేదు.బహుశః మరోసారి వేదాలనెవరైనా దొంగిలించుకొని పోయారేమో? ఒకసారి సోమకాసురు డెత్తుకుపోతే మత్స్యావతారమెత్తి వాడిని సంహరించి తెచ్చాడుగదూ?


లేకపోతే, అనాధయైన వనిత రక్షింపుమని యార్తనాదం చేసిందోయేమో? ద్రౌపది విషయంలో జరిగిన దదేకదా! అప్పుడూ యింతే ! అక్షక్రీడ మధ్యలోనుండగా నన్ను వదలి పరుగెత్తలేదా? లేక పోతే ,రాక్షసులేమైనా అమరావతిపై దండయాత్రచేశారో యేమో? వారికదేపనీ, వీరికిదేపనీ ,మధ్యలో నాకూ యీ తిప్పలు. లేదా!, ఈయనగారి భక్తులను పట్టుకొని

మీశ్రీహరి యెక్కడరా? చూపండి? అనిదుర్మార్గులెవరైనా భక్తులను బాధించినారో యేమో? (గతంలోహిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని అలాగే బాధించాడుగదా)


ఏంమొగుడో? ఏమీచెప్పడాయె! పోనీ అడుగుదామా?


" అడిగెదనని కడువడిఁ జను.

అడిగినదన మగుడ నుడువడని నడయుడుగున్,

వెడవెడ జిడిముడిఁ దడబడ,

నడుగిడు.నడుగిడదు. జడిమ నడుగిడు నెడలన్;


ఆహా! ఏమీపద్యము! డకార యమకమున లక్ష్మి మనస్సు లోని యూగిసలాటను ఊటాడించినాడు పోతన! అడుగుదామని రెండడుగులు తొందర తొందరగా ముందుకేస్తున్నదట. ఆఁ అడిగినా యీతొందరలో బదులుచెప్పేనా? సందేహమే? మరెందుకులేయని రెండగులు వెనక్కు వేయుచున్నదట. దారిపొడుగునా యిదే పని. ముందుకూ వెనక్కూ లక్ష్మియూగిసలాట!పై పద్యము చదివినచో హృదయసంబంధమైన 

వ్యాధులు రావని పెద్దలు చెబుతారు.

చూచితిరా! పోతన రచనాశిల్పము! అది యనల్పము. అదిపరమేశ్వర కటాక్షము. శారదాదేవి యనుగ్రహము. అదియే అతనికవితలోని జీవము. సాహిత్య పిపాసులకందజేయు కవితామృత రసాయనం !భాగవతం చదవండి! బాగుపడండి!

జయహో! పోతన కవీంద్రా! జయతు ! జయతు!

--       ...

                 స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

భీష్మ ఉవాచ

 శ్లోకం 

               భీష్మ ఉవాచ 


 దైవం పౌర్వాహ్ణికం కుర్యాద్                     

 అపరాహ్ణే తు పైతృకమ్ !

మంగలాచారసంపన్న:                  

కృతశౌచ: ప్రయత్నవాన్ !! 


మనుష్యాణాం తు మధ్యాహ్నే ప్రపద్యాదుపపత్తిభి: !

కాలహీనం తు యద్ దానం           

తం భాగం రాక్షసాం విదు: !!


మనుష్యుడు శుభాచార సంపన్నుడై స్నానాధికం చేసి పవితృడై, ప్రయత్నవంతుడై పూర్వాహ్ణంలో దేవ సంబంధ దానాలను, అపరాహ్ణంలో పితృసంబంధ దానాలను  మధ్యాహ్న కాలంలో మనుష్య సంబంధ దానాలను చేయాలి. వేళ పాటింపక చేసిన దానం రాక్షస భాగ మవుతుందంటారు.

పంచాంగం 01.09.2023 Friday

 ఈ రోజు పంచాంగం 01.09.2023 Friday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస కృష్ణ పక్ష: ద్వితీయ తిధి భృగు వాసర: పూర్వాభాద్ర  నక్షత్రం దృతి యోగ: తైతుల తదుపరి గరజి కరణం ఇది ఈరోజు పంచాంగం. 


విదియ రాత్రి 11:53 వరకు.

పూర్వాభాద్ర మధ్యాహ్నం 02:59 వరకు.

సూర్యోదయం : 06:05

సూర్యాస్తమయం : 06:26

వర్జ్యం : రాత్రి 11:37 నుండి 01:03 వరకు.

దుర్ముహూర్తం: పగలు 08:33 నుండి 09:23 వరకు తిరిగి మధ్యాహ్నం 12:40 నుండి 01:30 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00  వరకు.


యమగండం : మద్యాహ్నము  03:00 నుండి 04:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

బ్రాహ్మణ నిర్వచనము

 *బ్రాహ్మణ శబ్దమునకు* *నిర్వచనము*


*జన్మనా బ్రాహ్మణో జ్ఞేయః*|

*సంస్కారైః ద్విజ ఉచ్యతే*|

*విద్వత్వాచ్చాపి విప్రత్వం*|

*త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే*||


అనగా *బ్రహ్మ* బీజోత్పన్పడుగుట మాత్రము చే *బ్రాహ్మణుడగును* ! సంస్కారములు క్రమంగా జరగడం వల్ల *ద్విజుడు* అగును!

అతడే క్రమముగా విద్వాంసుడైనచో *విప్రుడగును*

ఈ మూడు లక్షణములు అతను లో పూర్ణముగా ఉన్నచో *శ్రోత్రియుడనబడును*

*శుక్రవారం, సెప్టెంబర్ 01, 2023* రాశి ఫలాలు

 .       *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

.  *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*శుక్రవారం, సెప్టెంబర్ 01, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*నిజ శ్రావణ మాసం - బహుళ పక్షం*

*తిధి*      :  *విదియ తె3.21* వరకు   


.                *🌹రాశి ఫలాలు🌹* 

 

*మేషం*


బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.  వ్యాపారాలలో నూతన  పెట్టుబడులు అందుతాయి. గృహమున  మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

*వృషభం*


 వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.  దైవదర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో  కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

---------------------------------------

*మిధునం*


సంతానం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. కొన్ని వ్యవహారాలు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. వృధా ఖర్చులు ఉంటాయి.

---------------------------------------

*కర్కాటకం*


ఇంటా బయట పని ఒత్తిడి అధికమై శిరో బాధలు  కలుగుతాయి.  ప్రయాణాల్లో  ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. 

---------------------------------------

*సింహం*


చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.  నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో  పరిచయాలు పెరుగుతాయి. వాహన యోగం ఉన్నది.

---------------------------------------

*కన్య*


చిన్ననాటి మిత్రుల నుండి  ఆర్థిక సహాయం లభిస్తుంది.   వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది.  ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన  కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

*తుల*


కుటుంబ సభ్యుల విషయంలో  ముఖ్యమైన నిర్ణయాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు.  ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగవు.

---------------------------------------

*వృశ్చికం*


బంధువులతో  మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో  ఆస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.  ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------

*ధనస్సు*


జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు ఉన్నవి.  ధనాదాయం బాగుంటుంది. సమాజంలో ప్రముఖులతో  నూతన పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు  దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

*మకరం*


పాత రుణాలు తీర్చడానికి నూతన  రుణాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన  పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణం సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

---------------------------------------

*కుంభం*


మిత్రుల నుంచి వివాదాలకు సంబంధించి ముఖ్య విషయాలు తెలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతం అవుతాయి. చేపట్టిన  వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

*మీనం*


ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు పొందుతారు.  నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి నూతన అవకాశాలు లభిస్తాయి.


సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻

*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

బలిచక్రవర్తి కథ

 

బలిచక్రవర్తి కథ

బలి గొప్పరాక్షస చక్రవర్తి, యోద్ధ ఘనుడు, దానఘనుడు, మానఘనుడు. . . శ్రీమన్నారాయణుడు ఇతని గురించి వామనావతారం ఎత్తి, అథోలోక చక్రవర్తిగ జేసాడు. అజ్ఞానం తొలగించాడు అతనిని అణిచేయ లేదు, అంతటి గొప్పవాడు బలిదైత్యేంద్రుడు. నీ మూడోపాదం నా తలపై పెట్టు అన్నా, అలా చేసినట్లు మన పోతన్నగారు చెప్పలేదు, ప్రహ్లాదుని పౌత్రుడు బలి. మిక్కిలి బలశాలి. గొప్ప యుద్దకళానిపుణుడు, యుద్ధనీతిజ్ఞుడు. తన విశేష బలంతో ఇంద్రుని మీదకి వెళ్ళిన వాడు. ఇంద్రపదవికోసం వందయజ్ఞాలు చేయాలి అంటారు. అంటే బలాలతో సాధించేది కాదు సాధనతో సాధించేది స్వర్గలోకం అనుకోవచ్చు. ఇంద్రుడు ఇంద్రియాలకు మనసుకు అధిపతి మరి. స్వర్గ ప్రవేశానికి సామాన్యంగా పుణ్యబలం కావాలి. అక్కడి సౌఖ్యాలు అనుభవించంటం ద్వారా కూడబెట్టిన పుణ్యం వ్యయంకాగానే మళ్ళా మర్త్యలోకం రావాలి. ఇకపోతే, ప్రహ్లాదుడు అంటే విశేషమైన ఆనందం కలవాడు లేదా చిదానందుడు. అలా ఆత్మానందం అందుకో గలిగిన వానికి విశేషమైన శక్తిసామర్థ్యాలు అలవడతాయి. వీటిలో భౌతికమైన శక్తికి తగులం పడితే, ఎవరినైనా జయించ గల శక్తి పొందచ్చు. అహంకారం విజృంభిస్తుంది. అది రాక్షసగుణ ప్రధానానికి దారితీస్తుంది.
ఇప్పుడు మళ్ళా కథలోకి వెళ్దాం. ప్రహ్లాదుని పౌత్రుడు బలి. ఇంద్రునికి ఓడిన వాడు. శుక్రాచార్యుడు వీరి గురువు. వీరి అండతో విపరీతమైన సైనిక, దైహిక బలాలు వీర్యం పొందాడు. ఆ బలాల సాయంతో స్వర్గంమీదకి యుద్దానికి వెళ్లాడు. అక్కడ అధిపతి ఇంద్రుడు కదా ఆలోచనాపరుడు కదా. గురువు బృహస్పతిని చేరాడు. ఆయన విప్రబలమున వీనికి వృద్ధివచ్చె వారిఁ గైకొన కిటమీఁద వాఁడి చెడును; అని మంత్రోపదేశం చేసాడు. విప్రబలం అంటే దైవారాధన, యోగసాధ నాదులచే లభించే దైవబలం. దీనికి గురువులను ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. దాంతో ఇంద్రుడు సపరివారంగా పక్కకి తప్పుకున్నాడు. బుద్ది పక్కకి తప్పుకుంది. త్రి లోకాధిపతి అయ్యాడు.
దానితో మహా సాధకుడే, మహాపుణ్యాత్ముడే, దానాది సుగుణాలలో సాటిలేని వాడే కాని, బుద్ధిచెప్తుండే గురువులు చెప్పేమాట పెడచెవిని పెట్టడం మొదలైంది. మరి ఈయన అతికాయుడు, అతికార్యుడు కదా. దానికి విరుగుడుకి సూచనగా బడుగు వడుగు వలె కన్పట్టు వామనుడై దిగి వచ్చాడు. ఒకామె కశ్యపుని భార్య అదితి (జీవాత్మ ధారి) పయోభక్షణ వ్రతం చేపట్టింది. పయస్ అంటే నారములు కదా వాటిని భక్షించటం అంటే జీర్ణచేసుకోడం. అలా జ్ఞానగ్రహణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం పాడ్యమినుంచి పన్నెండురోజులు చేసింది. సంతోషించిన నారాయణుడు, విశ్వ వ్యాపకుడయ్యు పుత్రుడిగా విశ్వగర్భుడు ఆమె గర్భంలోకి దిగివచ్చాడు. సమయం ఆసన్నంకాగా దిగి వచ్చాడు కపట వటునిగా ఉపనయన వయస్కుడిగ వామనుడై.
అదే అంటారు కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని. రూపంలో వామనుడైన విష్ణుమూర్తి చిరుకోరికగానే అడిగాడు. నేను అతికాయుణ్ణి, అతికార్యుణ్ణి, నన్ను ఇంత స్వల్పకాయుడవు ఇంత స్వల్పం అడుగుతావా అంటున్నాడు అతివీరుడు. తెలియకా కాదు ఇద్దరికి తెలుసు. నిరయంబైన . . అని భౌతిక న్యాయం ఒకటే సరిపోతుందా. అదిగో అధోలోక యాత్రకి శ్రీకారం చుట్టుకున్నాడు. కాని కాలం వచ్చింది మంచి చెప్పే ఆచార్యుని మాట పెడచెవిని పెట్టాడు. విధినిర్ణయం వక్రీకరించడం సాధ్యమా. ఈయన ధర్మోరక్షతి రక్షితః తెలిసి వారిజాక్షులందు . . అనడమే కాదు. విప్రుడై ఉండి విపరీతపోకడకు పోయాడు శుక్రుడు కన్నుపోగొట్టుకున్నాడు. కమలనాభు. . విప్రాయ . . అంటూ దానం చేసాడు. గురుశిష్యులు
ఇద్దరు మహానుభావులే. (గురువు చెప్పింది అనుల్లంఘనీయ ఆజ్ఞ ధర్మాధర్మాల ప్రసక్తి లేదు, ఫలితంతో పనిలేదు). రాక్షస అంటే రజస్తమోగుణాల ప్రకోపం వల్ల అలా వర్తించారేమో. అవును వచ్చినవాడు విశ్వ వ్యాపనశీలుడు విష్ణువు కదా అందుకే త్రివిక్రమరూప దర్శనం ఇచ్చాడు. ఇంతింతై. . , రవిబింబం . . అంటుమొదలెట్టి పద్యాలంటే లాభంలేదు అని పెద్ద వచనం వేసారు మన పోతన్నగారు. ఇది ఒక అనుగ్రహం. ఇప్పుడు చెప్పు నువ్వు నాకివ్వగల స్థలమేదో అన్నాడు. అజ్ఞానపొరలు వీడిన బలి నీ యెడ దుర్లభ మేమి కలదు అంటుంటే. బలిచక్రవర్తి భార్య వింధ్యావళి కా దనఁడు. . అంటు అడిగింది స్త్రీమూర్తి కదా. జీవాత్మ పరమాత్మల ద్వైతం రెంటికి మధ్యది వింధావళి కొండల వరస కదా.
నీవు అర్హుడవే కాని నీ ఇంద్రపదవికి సమయం రాలేదు సావర్ణి మన్వంతరంలో నేనే పిలిచి ఇస్తాను. అంతవరకు సుతలమున సపరివారంగా సుఖంగా ఉండు అని అనుగ్రహించాడు. అధోలోకమే కాని అది సుతలాలయమున. అంతటి రాక్షసునికి సర్వరక్షకుడు చక్రి చక్రరక్షణ సమకూర్చాడు. ఎందుకంటే మనసు పరిపరివిధాల పరిగెట్టేది కనుక. ఈ ఘట్టంలో పద్యాలు సాహిత్యపరంగా కూడ అమృతగుళికలు, భక్తిమార్గంగా హృదయంగమములు, జ్ఞానసాగరములు.

బలి బలం

8-456-సీస పద్యము
వినవయ్య దేవేంద్ర వీనికి సంపద;
బ్రహ్మవాదులు భృగుప్రవరు లర్థి
నిచ్చిరి; రాక్షసు నెదురను నిలువంగ;
హరి యీశ్వరుఁడు దక్క నన్యజనులు
నీవును నీ సముల్ నీకంటె నధికులుఁ;
జాలరు; రాజ్యంబు చాలు; నీకు
విడిచి పోవుట నీతి విబుధనివాసంబు;
విమతులు నలఁగెడువేళ చూచి
తేటగీతి
మరలి మఱునాఁడు వచ్చుట మా మతంబు;
*విప్రబలమున వీనికి వృద్ధివచ్చె
వారిఁ గైకొన కిటమీఁద వాఁడి చెడును
;దలఁగు మందాక రిపుఁ బేరు దలఁపరాదు.
8-526-కంద పద్యము
హరిహరి; సిరి యురమునఁ గలహరి
హరిహయుకొఱకు దనుజు నడుగం జనియెన్;
బరహితరత మతియుతులగు
దొరలకు నడుగుటయు నొడలి తొడవగుఁ బుడమిన్.

నర్మదనదిని దాటాడు వామనుడు

8-529-కంద పద్యము
శర్మద, యమదండక్షత
వర్మద, నతి కఠిన ముక్తి వనితాచేతో
మర్మద, నంబునివారిత
దుర్మద, నర్మదఁ దరించెఁ ద్రోవన్ వటుఁడున్.

వామనుని నడక

8-541-కంద పద్యమువెడవెడ నడకలు నడచుచు
నెడనెడ నడు గిడక నడరి యిల దిగఁబడగా
బుడిబుడి నొడువులు నొడువుచుఁ
జిడిముడి తడఁబడగ వడుగు చేరెన్ రాజున్.

వామనుడు బలిని ఆశీర్వదించుట

8-545-ఉత్పలమాల
స్వస్తి జగత్త్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర వి
ద్వస్త నిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం
ద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళ
న్యస్త సువర్ణసూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్.

బలి నీవెవరు నీకేంకావాలి అడుగుతున్నాడు

8-549-మత్తేభ విక్రీడితము
వడుగా! యెవ్వరివాఁడ? వెవ్వఁడవు? సంవాసస్థలంబెయ్య? ది
య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మముం;
గడు ధన్యాత్ముఁడనైతి; నీ మఖము యోగ్యంబయ్యె; నా కోరికల్
గడతేఱన్; సుహుతంబులయ్యె శిఖులుం; గల్యాణ మిక్కాలమున్.
8-550-మత్తేభ విక్రీడితము
వరచేలంబులొ మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా!

మూడడుగులు చాలులే అంటున్నాడు

8-566-ఆటవెలది
ఒంటివాఁడ నాకుఁ నొకటి రెం డడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల;
గోర్కిఁదీర బ్రహ్మకూకటి ముట్టెద
దానకుతుకసాంద్ర! దానవేంద్ర!

ఇంత స్వల్పమా అడగటం ఇలాంటివి అడగాలి అంటున్నాడు బలి

8-570-మత్తేభ విక్రీడితము
వసుధాఖండము వేఁడితో? గజములన్ వాంఛించితో? వాజులన్
వెసనూహించితొ? కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో?
పసి బాలుండవు; నేర వీ వడుగ; నీ భాగ్యంబు లీపాటి గాక
సురేంద్రుండు పదత్రయం బడుగ నీ యల్పంబు నీ నేర్చునే?

మూడడుగులు చాలు అదే నాకు బ్రహ్మాండం అంటున్నాడు వామనుడు

8-572-మత్తేభ విక్రీడితము
గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,
వడుఁ గే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.
8-575-శార్దూల విక్రీడితము
ఆశాపాశము దాఁ గడున్ నిడుపు; లే దంతంబు రాజేంద్ర! వా
రాశిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాశిం బొందిరిఁ గాక వైన్య గయ భూకాంతాదులున్నర్థకా
మాశం బాయఁగ నేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే.

శుక్రనీతి

8-585-ఆటవెలది
వారిజాక్షులందు వైవాహికము లందుఁ
బ్రాణవిత్తమానభంగమందుఁ
జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు
బొంకవచ్చు నఘము పొందఁ దధిప!

శుక్రుని మాట కాదనటం

8-590-శార్దూల విక్రీడితము
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁ గట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!
8-592-శార్దూల విక్రీడితము
ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనవుపై, నంసోత్తరీయంబుపై,
బాదాబ్జంబులపైఁ, గపోలతటిపై, బాలిండ్లపై నూత్నమ
ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?

ఏమైనా నే అసత్యం పలకను అనటం

8-593-మత్తేభ విక్రీడితము
నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మరణంబైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో;
హరుఁడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ;
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా; ధీవర్య! వే యేటికిన్?

దానమియ్యటం

8-607-శార్దూల విక్రీడితము
విప్రాయప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే
దప్రామాణ్యవిదే త్రిపాద ధరణిం దాస్యామి! యంచుం గ్రియా
క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జే సాఁచి పూజించి బ్ర
హ్మప్రీతమ్మని ధారపోసె భువనం బాశ్చర్యముం బొందగన్.
8-613-ఆటవెలది
కమలనాభు నెఱిఁగి కాలంబు దేశంబు
నెఱిఁగి శుక్రు మాట లెఱిగి నాశ
మెఱిఁగి పాత్ర మనుచు నిచ్చె దానము బలి
మహి వదాన్యుఁ డొరుఁడు మఱియుఁ గలఁడె.
8-619-ఆటవెలది
పుట్టి నేర్చుకొనెనొ పుట్టక నేర్చెనో
చిట్టి బుద్ధు లిట్టి పొట్టివడుగు
పొట్ట నున్న వెల్ల బూమెలు నని నవ్వి
యెలమి ధరణి దాన మిచ్చె నపుడు.

త్రివిక్రమావతారం

8-622-శార్దూల విక్రీడితము
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.
8-623-మత్తేభ విక్రీడితము
రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

అసత్యం పలకలేను అనటం

8-643-ఆటవెలది
సూనృతంబుఁ గాని నుడియదు నా జిహ్వ
బొంకఁజాల; నాకు బొంకు లేదు;
నీ తృతీయపదము నిజము నా శిరమున
నెలవు జేసి పెట్టు నిర్మలాత్మ!

వింధ్యావళి ప్రశ్నంబు

8-657-కంద పద్యము
కా దనఁడు పొమ్ము లే దీ
రా దనఁడు జగత్త్ర యైక రాజ్యము నిచ్చెన్
నా దయితుఁ గట్టనేటికి?
శ్రీదయితాచిత్తచోర! శ్రితమందారా!

బలిని అనుగ్రహించుట

8-664-కంద పద్యము
సావర్ణి మనువు వేళను
దేవేంద్రుండగు నితండు దేవతలకు; దు
ర్భావిత మగు నా చోటికి
రావించెద; నంతమీఁద రక్షింతు దయన్.
8-665-కంద పద్యము
వ్యాధులుఁ దప్పులు నొప్పులు
బాధలుఁ జెడి విశ్వకర్మభావిత దనుజా
రాధిత సుతలాలయమున
నేధిత విభవమున నుండు నితఁ డందాకన్."

మర్యాద గల ప్రవర్తన

 🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


 𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*ధన్యానాముత్తమమ్ దాక్ష్యం*

*ధననాముత్తమమ్ శ్రుతమ్౹*

*లాభనాం శ్రేయ ఆరోగ్యం*

*సుఖానాం తుష్ఠిరుత్తమా॥*

               ~యుధిష్ఠిర గీత 53వ శ్లోకం*


𝕝𝕝తా𝕝𝕝

మర్యాద గల ప్రవర్తన భౌతిక విషయాల కంటే శ్రేష్ఠమైనది, జ్ఞానం సంపద కంటే గొప్పది.... ధనలాభము కంటే ఆరోగ్యం శ్రేష్ఠమైనది మరియు సంతృప్తి అనేది అన్నింటిలోనూ ఉత్తమమైనది.

సోరియాసిస్

 


     ప్రస్తుత పరిస్థితులలో చాలమంది "సోరియాసిస్" బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలిలో వచ్చిన మార్పు . ఈ సోరియాసిస్ పైన పూర్తిగా అవగాహన లేకపోవడం ఈ వ్యాధి పెరగడానికి ప్రధాన కారణం . 


        పద్దెనిమిది రకాల కుష్టువ్యాధులలో ఈ సోరియాసిస్ ఒకటి దీనిని ఆయుర్వేద పరిభాషలో కిటిబకుష్టు లేదా సిద్మకుష్టు అని అంటారు. ఇది చాలా మొండి వ్యాధి అల్లోపతి మరియు హోమియోపతి వైద్యవిధానంలో సరైనటువంటి పరిష్కారం లేదు . ఇంతకుముందు సోరియాసిస్ కి సిద్ధములికలతో ఒక ఔషదాన్ని తయారుచేశాను అని మీకు తెలియచేశాను . దాని ఫలితాలు ఇప్పుడు ప్రత్యక్షంగా మీకు చూపిస్తున్నాను . 


 గమనిక  - 


       సరైన పథ్యం పాటించగలను అనుకున్న వారు మాత్రమే డైరెక్ట్ గా సంప్రదించగలరు. కామెంట్స్ కి సమాధానం ఇవ్వలేము . గమనించగలరు .


      సంప్రదించవలసిన నెంబర్ 


             9885030034 


           కాళహస్తి వెంకటేశ్వరరావు .