18, సెప్టెంబర్ 2023, సోమవారం

సోమరిపోతులను

 *అన్నీ ఉచితం ! అంతా ఉచితం !*

✍🏻

45 ఏళ్ళదాకా నిరుద్యోగ భృతి,


45 ఏళ్ళనుండి వృద్ధాప్య పెన్షను.


*ఇంక జీవితంలో లేదు టెన్షన్,*

.

ఆకలేస్తే అన్న క్యాంటిన్


రోగమొస్తే ఆరోగ్యశ్రీ కార్డు


నిద్దరొస్తే సర్కారిచ్చిన ఇల్లు,


చుట్టాలొస్తే రూపాయికిలోసన్నబియ్యపువిందు !


పండగొస్తే 2 gas సిలిండర్లు,పండుగ కానుకగా ఒక సంచిలో 5 ఐటమ్స్.

.

అంతా బాగానే ఉన్నది !

భూతల స్వర్గం భారతదేశం !


కానీ

.

అన్న క్యాంటిన్ లో వంట ఎవరు చేస్తారు ? ఎందుకు చేస్తారు ?


రోగానికి మందిచ్చి సేవచేయటానికి ఎవరుముందుకొస్తారు ?


ఇంటినిర్మాణానికి రాళ్ళెత్తే కూలీవస్తాడా ?

.

వ్యవస్థ ,సమాజం ఛిన్నాభిన్నం కాదా ! అసలు మన నాయకులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ, మనలోని ఆత్మ గౌరవాన్ని నాశనం చేస్తున్నారు.


5 రూపాయల భోజనం ప్రజలు అడిగారా??


పండుగలకు బహుమతి అడిగారా??


లేదు 


నాణ్యమైన జీవితం కావాలని అడిగారు.


రోడ్లు అడిగారు, కరెంటు,నీరు,విద్య , ఉద్యొగ కల్పన అడిగారు. 


కానీ


అవి కాకుండా ఇదేమి విచిత్రం.


అసలు మనం ఎటు పోతున్నాం.


అసలు సంఘర్షణ లేని జీవితం ఒక జీవితమేనా ?


Is it worth living ???

.

ఒక గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాలంటే "సంఘర్షణ"


ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఒక ప్రధాని పీఠం దాకా రావాలంటే "సంఘర్షణ "


తన కలలు పండించుకోవడానికి  ఒక "కలామ్ " పడ్డది "సంఘర్షణ "


మనిషి ఎదగాలంటే కావాల్సింది సంఘర్షణ!

.

*పథకం చూడటానికి గొప్పదే*

.

ఇప్పటికే ప్రతి రంగం లోను పని చేసేవారు లేక కుదేలయిపోయింది !

.

వ్యవసాయానికి కూలీలేడు 

కొట్లోకి గుమాస్తా దొరకడు !


పనికి రమ్మంటే ఒక్కడూ రాడు ! వచ్చినా సరిగా పని చేయడు.

.

మనిషిని పనికి పురికొల్పేది అతని ఆకలే ! ఆకలి తీర్చాలి ! 


కానీ ఉచితంగా కాదు ! అది తీరేమార్గం చూపించాలి !


చైనా లో ఒక సామెత. ఆకలితో ఉన్నవాడికి  చేపలు ఇవ్వకండి, చేపలు పట్టడం నేర్పండి.

అతనికి ఎప్పుడు ఆకలేసిన, ఆకలి తీరుతుంది. 


అంతే గాని అన్ని ఉచితంగా ఇస్తాను. ఏమిటిది ???


.

*ఎవరికి ఉచితమివ్వాలి*?


పని చేసుకోలేని వారికి ,వృద్ధులకు ,అనాధలకు అభాగ్యులకు.

వారికి చేయూతనిచ్చే వ్యవస్థ ను రూపొందించండి.

.

అందరికీ అన్నీ ఉచితం అని సోమరిపోతులను తయారుచేయవద్దు !


పనిచేయని వాడికీ, పని చేసే వాడికీ కూడా ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తే, చివరకి పని చేసే వాడు కూడా పని చేయడం మానేస్తాడు. వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది,


ఒకప్పటి రష్యా పరిస్థితి ఇంతే కదా! 👋

ఎక్కడ దృష్టి పెడితే అదే కనిపిస్తుంది*

 👀 *ఎక్కడ దృష్టి పెడితే అదే కనిపిస్తుంది* 🌝


 ఒక మహిళ ప్రతిరోజు గుడికి వెళుతూ ఉండేది. 

 ఒక రోజు ఆమె పూజారిని చూసి ఇట్లా అంది -- ఇకపై నేను గుడికి రాను. 

 అప్పుడు పూజారి అడిగాడు -- ఏం జరిగింది? 

 అప్పుడు ఆమె చెప్పింది -- ఇక్కడ గుడిలో జనాలు చలవాణి లో తమ వ్యాపార విషయాలు మాట్లాడుకుంటున్నారు. కొందరు గుడిని ఊరికే ముచ్చట్లు పెట్టుకొనే స్థానంగా చేసుకున్నారు. కొందరు పూజ తక్కువ, అనాచారాలు, ప్రదర్శనలు ఎక్కువ చేస్తున్నారు. ఇదే చూస్తున్నాను. 

 అప్పుడు పూజారి కొద్దిసేపు మౌనం వహించి తర్వాత ఇట్లా అన్నాడు -- నిజమే కానీ మీ చివరి నిర్ణయానికి ముందు నేను చెప్పింది ఒకటి చేస్తారా? 

 అప్పుడు ఆమె ‘సరే చెప్పండి, ఏం చేయాలి?’ అని అడిగింది. 

 పూజారి అన్నాడు -- ఒక లోటా తీసుకొని నీటితో నింపండి. రెండుసార్లు గుడిచుట్టూ ప్రదక్షిణ  చేయండి. నియమం ఏంటంటే లోటా లో నుండి నీరు కింద పడరాదు. 

 అప్పుడామె -- సరే అలాగే చేస్తాను- అంది. 

 తర్వాత ఆమె కొద్దిసేపటి తర్వాత అట్లా చేసి చూపించింది. 

 అప్పుడు గుడి పూజారి ఆమెను చూసి 3 ప్రశ్నలను అడిగాడు – 

1. ఇప్పుడు మీరు ఎవరినైనా చలవాణిలో మాట్లాడుతూ చూసారా? 

2. ఎవరైనా గుడిలో ముచ్చట్లు పెట్టుకుంటూ కనిపించారా? 

3. ఎవరైనా అనాచారం చేస్తూ కళ్ళబడ్డారా? 

 అప్పుడామె అన్నది -- లేదు. నాకు ఇవేమీ కనిపించలేదు. 

 అప్పుడు పూజారి అన్నాడు -- మీరు గుడిలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పూర్తి దృష్టిని లోటా మీదనే ఉంచారు. దాని నుండి ఎక్కడ జలం కింద పడుతుందో అని. అందువల్ల మీరు ఇంక ఏమీ చూడలేదు. ఇవాల్టి నుంచి ఎప్పుడైనా మందిరానికి వస్తే మీ దృష్టినంతా పరమాత్మ మీద పెట్టండి. దానివల్ల మీరు దేనిని, ఎవరిని పట్టించుకోరు. భగవంతుడు మాత్రమే అంతట దృష్టిపథంలో కనిపిస్తాడు.

సత్సంగత్వే

 *ఖర్చులేని స్వర్గం!*

               ➖➖➖✍️


 *వాకింగ్ కి నడుచుకుంటూ వెళ్లివస్తూ, కాస్త అలుపు తీర్చుకునేందుకు కూర్చున్నప్పుడు, నా పక్కన ఉన్న వ్యక్తి ఒకరు సర్ ‘ఈరోజు ఏవైనా మంచి విషయాలు చెప్పండి!’ అన్నాడు.*


*నేను కాసేపు ఆలోచించి…“ స్వర్గానికి ప్రవేశం ఉచితం, కానీ నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి, అయినా జనం చాలామంది ఖర్చు పెట్టి మరీ నరకానికి వెళ్ళటానికి ఇష్టపడతారు  అన్నాను.*


*అతను ఆశ్చర్యంగా నా వంకచూసి “అదెలా సామీ ?” అన్నాడు.*


*నేను చిన్నగా నవ్వి, ఇలా అన్నాను.. “జూదం ఆడటానికి డబ్బు కావాలి, మత్తు పానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి, సిగరెట్ త్రాగడానికి డబ్బు కావాలి, పాపాలతో పయనించడానికి డబ్బుకావాలి, ఇలాటివే ఇంకా, ఇంకా చాలా ఉన్నాయ్ .. అవన్నీ నరకానికి వెళ్లేందుకు త్రోవలే కదా* 


*కానీ, ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు, నలుగురి మంచి కోరటానికి డబ్బులు అక్కర్లేదు, దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు, దీనులకు సేవచేయడానికి డబ్బు అవసరం లేదు, అలాగే  అప్పుడప్పుడు ఉపవాసం (ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం) ఉండడానికి డబ్బు అవసరం లేదు, క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు, మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి పెద్దగా డబ్బు అవసరంలేదు!*

 

 *దేవుడిపై నమ్మకం ఉండాలి, మనపై మనకు ప్రేమ, విశ్వాసం ఉండాలి, ఇప్పుడు చెప్పండి ..* 


*డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా ? ఉచితంగా లభించే స్వర్గం సుఖభోగాలకు ఇష్టపడతారా ? ఆలోచించండి ..*


 *సత్సంగత్వే నిస్సంగత్వం !* 

 *నిస్సంగత్వే నిర్మోహత్వం !!* 

 *నిర్మోహత్వే నిశ్చలతత్వం !* 

 *నిశ్చలతత్వే జీవన్ముక్తి: !!* 


*సత్పురుషుల మార్గదర్శనంలో సత్సాంగత్యం .. సత్ సహవాసం సత్ప్రవర్తనతో జీవించటానికి మించి గొప్ప జీవనం ఈ  భౌతిక  ప్రపంచంలో మరొకటి  లేదు*


పోస్ట్  వాట్సప్ నుండి సేకరించబడింది

రామమయం

 .

*ఒకసారి శ్రద్దగా చదవండి. చదివిన తరువాత ఆనందంతో ఆశ్చర్యపోతారు*

*అంతా రామమయం !. మన బతుకంతా రామమయం!*

*ఒక దేశానికి, జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి. మనకు అలాంటిదే రామాయణం.*

*ఇంగ్లీషువాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మన వెంట నడిచిన దేవుడు !*

*మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు.*

*మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు.*

*ధర్మం పోతపోస్తే రాముడు!ఆదర్శాలు రూపుకడితే రాముడు!*

*అందం పోగుపోస్తే రాముడు!*

*ఆనందం నడిస్తే రాముడు!*

*వేదోపనిషత్తులకు అర్థం రాముడు !*

*మంత్రమూర్తి రాముడు !*

*పరబ్రహ్మం రాముడు!* *లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు !*

*ఎప్పటి త్రేతాయుగ రాముడు?*

*ఎన్ని యుగాలు దొర్లిపోయాయి?*

*అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా రాముడే.*

*చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట శ్రీరామరక్ష సర్వజగద్రక్ష !*

*బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడినపాట రామాలాలి మేఘశ్యామా లాలి.*

*మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు శ్రీరామరక్ష, సర్వ జగద్రక్ష.*

*మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట అయ్యో రామా.*

*వినకూడని మాట వింటే అనాల్సిన మాట రామ రామ.*

*భరించలేని కష్టానికి పర్యాయ పదం రాముడి కష్టం.*

*తండ్రి మాట జవదాటని వాడిని పొగడాలంటే రాముడు.*

*కష్టం గట్టెక్కే తారక మంత్రం  శ్రీరామ.*

*విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట శ్రీరామ శ్రీరామ శ్రీరామ.*

*అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట అన్నమో రామచంద్రా !*

*వయసుడిగిన వేళ అనాల్సిన మాట కృష్ణా రామా !*

*తిరుగులేని మాటకు రామబాణం.*

*సకల సుఖశాంతులకు రామరాజ్యం.*

*ఆదర్శమయిన పాలనకు రాముడి పాలన.*

*ఆజానుబాహుడి పోలికకు రాముడు.*

*అన్నిప్రాణులను సమంగా చూసేవాడు రాముడు.*

*రాముడు ఎప్పుడూ మంచి బాలుడే.*

*ఆదర్శ దాంపత్యానికి సీతారాములు.*

 *గొప్ప కొడుకు రాముడు.*

*అన్నదమ్ముల అనుబంధానికి రామలక్ష్మణులు.*

*గొప్ప విద్యార్ధి రాముడు (వసిష్ఠ , విశ్వామిత్రలు చెప్పారు).*

*మంచి మిత్రుడు రాముడు (గుహుడు చెప్పాడు).*

*మంచి స్వామి రాముడు (హనుమ చెప్పారు).*

*సంగీత సారం రాముడు (రామదాసు, త్యాగయ్య చెప్పారు).*

*నాలుకమీదుగా తాగాల్సిన నామం రాముడు ( పిబరే రామ రసం సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు).*

*కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం రాముడు.*

*నోరున్నందుకు పలకాల్సిన నామం రాముడు.* *చెవులున్నందుకు వినాల్సిన కథ రాముడు.*

*చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు రాముడు.*

*జన్మ తరించడానికి రాముడు, రాముడు, రాముడు.*

*రామాయణం పలుకుబళ్లు మనం గమనించంగానీ, భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే.*

*ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లే ఉంటుంది.*

*చెప్పడానికి వీలుకాకపోతే అబ్బో అదొక రామాయణం.*

*జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ.*

*ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే అదొక పుష్పక విమానం.*

*కబళించే చేతులు, చేష్ఠలు కబంధ హస్తాలు.*

*వికారంగా ఉంటే శూర్పణఖ.*

*చూసిరమ్మంటే కాల్చి రావడం హనుమ.*

*పెద్ద పెద్ద అడుగులు వేస్తే అంగదుడి అంగలు.*

*మెలకువలేని నిద్ర కుంభకర్ణ నిద్ర.*

*పెద్ద ఇల్లు లంకంత ఇల్లు.*

*ఎంగిలిచేసి పెడితే శబరి.*

*ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే ఋష్యశృంగుడు.*

*అల్లరి మూకలకు నిలయం కిష్కింధ కాండ.*

*విషమ పరీక్షలన్నీ మనకు రోజూ అగ్ని పరీక్షలే.*

*పితూరీలు చెప్పేవారందరూ మంథరలే.*

*యుద్ధమంటే రామరావణ యుద్ధమే.*

*కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం).*

*సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు.*

*బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు.*

*ఒక ఊళ్లో పడుకుని ఉంటారు.*

*ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు.*

*ఒక ఊళ్లో నీళ్ళు తాగి ఉంటారు.*

*ఒంటిమిట్టది ఒక కథ.*

*భద్రాద్రిది ఒక కథ.*

*అసలు రామాయణమే మన కథ.*

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 25*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 25*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


  *త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్పూ పూజా పూజా తవ చరణయో ర్యా విరచితా |*

 *తథాహి త్వత్పాదోద్వహన మణి పీఠస్య నికటే*

  *స్థితా హ్యేతే శశ్వ న్ముకుళిత కరోత్తం సమకుటాః ||*


త్రిగుణములు సత్త్వ, రజస్తమోగుణములు సమ స్థితిలో వున్నప్పుడు  అవ్యక్తము.  దీనిని మూలప్రకృతి అంటారు.


 మూలప్రకృతిః అవ్యక్తా, వ్యక్తా-వ్యక్త స్వరూపిణీ" అని అమ్మవారి నామాల్లో చెప్పుకుంటాం. తరువాత ఈ త్రిగుణములు సమతూకం కోల్పోయి, వ్యక్తం అయినప్పుడు అమ్మవారి ఆజ్ఞపై ఆమె సహాయంతో త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయ కార్యములను చేస్తున్నారు. 


శివ వామ భాగ నిలయా ! నీ పాదములను పూజిస్తే సత్వ ,రజో ,తమో గుణాల వల్ల జన్మించిన బ్రహ్మా, విష్ణు, రుద్రులనే త్రిమూర్తులను పూజించినట్లే అంటున్నారు ఇక్కడ.

 భవేత్పూజా పూజా తవ చరణయోర్యా విరచితా... త్రయాణాం దేవానాం ఎందుకంటే, త్రిమూర్తులు నీ పాదపీఠం వద్ద నిలబడి రెండు చేతులు తలపై ఉంచుకొని నిన్ను ఆరాధిస్తున్నారు కనుక. మరి నీ పాదాలు ఎక్కడున్నాయి? సృష్టి, స్థితి లయలు జరిగే భువనానికి అతీతంగా పైన వున్నాయి. అట్టి త్రిగుణాతీతమైన అమ్మను ధ్యానిస్తే, త్రిగుణాలు మనను పతనం వైపు తీసుకువెళ్లకుండా కాపాడుతుందని భావం.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఈశ్వరపుత్రుడు

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


𝕝𝕝శ్లో𝕝𝕝 *రణత్క్షుద్రఘణ్టానినాదాభిరామం*

*చలత్తాణ్డవోద్దణ్డవత్పద్మతాలమ్।*

*లసత్తున్దిలాఙ్గోపరివ్యాలహారం*

*గణాధీశమీశానసూనుం తమీడే॥*

                ~శ్రీగణేశభుజఙ్గస్తోత్రమ్


𝕝𝕝తా𝕝𝕝 

మ్రోగుచున్న చిరుగవ్వల సవ్వడిచే మనోహరుడు, తాళముననుసరించి ప్రచండతాండవం చేయుచున్న పాదపద్మములు కలవాడు, బొజ్జపై కదులుతున్న సర్పహారములు కలవాడు, ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.

ప్రవచన కౌముది

 శ్రీ రామాయణ ప్రవచన కౌముది బిరుదు ప్రదానం

-------------------------------

ప్రవచన కళా ప్రపూర్ణ, విశాఖ వాసి..శ్రీమాన్ అద్దంకి రాఘవాచార్యుల వారి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. వారికి ' శ్రీ రామాయణ కౌముది ' అనే బిరుదు ప్రదానం చేశారు. హైదరాబాద్ కొండాపూర్ లోని శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో ' రామాయణ సారం సనాతన ధర్మ కాసారం ' అనే అంశంపై శ్రీమాన్ ఆచార్యుల వారు ఆదివారం చేసిన ప్రసంగం భక్తులను రామపారవశ్యంలో ముంచెత్తింది. దేవస్థానం వారు ఈ సందర్భంగా శ్రీవారిని బిరుదు, ప్రశంసా పత్రం, నగదు బహుమతితో ఘన.గా సన్మానించారు.

అజ్ఞానపు బిడ్డను

 శ్లోకం:☝️

*పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః*

*పరం తేషాం మధ్యే విరలతరలోఽహం తవ సుతః |*

*మదీయోఽయం త్యాగః సముచితమిదం నో తవ శివే*

*కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ||*

 - దేవ్యపరాధక్షమాపనస్తోత్రం


భావం: శ్రీ మాతా! ఈ లోకంలో నీకు ఎందరో జ్ఞానులు, ఋజువర్తనులైన పుత్రులుండవచ్చు, కానీ వారందరిలో నేనే చాలా అరుదైన అజ్ఞానపు బిడ్డను. ఈ కారణంగా నన్ను విడిచిపెట్టి రక్షించకపోవడం సరికాదు. ఎందుకంటే ఎక్కడైనా చెడ్డ కొడుకు ఉండవచ్చు కాని చెడ్డ తల్లి ఉండదు కదా!🙏

పంచాంగం 18.09.2023 Monday,

 ఈ రోజు పంచాంగం 18.09.2023 Monday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: తృతీయ తిధి ఇందు వాసర: చిత్రా  నక్షత్రం ఇంద్ర యోగ: గరజి తదుపరి వణిజ కరణం ఇది ఈరోజు 

తదియ మధ్యాహ్నం 12:36 వరకు.

చిత్ర మధ్యాహ్నం 12:04 వరకు .

సూర్యోదయం : 06:08

సూర్యాస్తమయం : 06:12

వర్జ్యం : సాయంత్రం 06:04 నుండి రాత్రి 07:46 వరకు.

దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:34 నుండి 01:22 వరకు తిరిగి మధ్యాహ్నం 02:59 నుండి 03:47 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30  వరకు.


యమగండం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.  

 

వరసిద్ది వినాయక చవితి శుభాకాంక్షలు 


శుభోదయ:, నమస్కార:

సందేశం 3/11 వినాయక చవితి

 ॐ    వినాయక చవితి శుభాకాంక్షలు 

        


                        సందేశం 3/11 


        అగజానన పద్మార్కం 

        గజానన మహర్నిశం 

        అనేకదం తం భక్తానామ్ 

        ఏకదంతముపాస్మహే ॥ 


  - అనే శ్లోకం చాలా కాలంనుండి ఆనవాయితీగా వస్తున్నది. 


అగజ ఆనన పద్మ అర్కమ్ 

    

    గమించనిది కొండ. అట్టి మంచుకొండ కూతురు పార్వతి. పార్వతి ముఖపద్మానికి సూర్యునివంటి వాడని అర్థం. 

    సూర్యుని పోలిన వినాయకుని చూచినంతనే అగజానన పద్మము వికసిస్తుంది. 


గజాననం అహర్నిశం ఉపాస్మహే 


  - వినాయకుని రేయింబవలూ ఉపాసిస్తాను అని అర్థం. 

    రేయింబవలూ ఉపాసనచేయటం మనదేశంలోనే సాధ్యం. 


అనేకదం తం భక్తానామ్ 


అనేకదం- తమ్ - భక్తానామ్ 

  - అని విడదీయాలి. 

అంటే, భక్తులను స్వామి అనేక విధాలుగా అనుగ్రహిస్తాడు.


దంతం - విశేషం


    ఒక్కొక్క ప్రాణికి ఒకొక్క విషయమునందెక్కువ ప్రీతి. 

    చమరీమృగం తోక అంటే, 

    నెమలికి తన పింఛమే 

బంగారం. 

    ఏనుగునకు దంతాలంటే ప్రాణం .దేహం ఎలాగున్నా ఏనుగు తన దంతాలను మాత్రం తెల్లని కాంతులు వెదజల్లుతూ ఉండేటట్లుగా కాపాడుకుంటుంది. 


గజాననుడు - భారతం 


    కానీ గజాననుడు తాను అందం చందం గౌరవం వీటి అన్నింటికీ మూలాధారమైన ప్రాణప్రదమైన దంతాన్ని, చటాలున పెరికి మహాభారత రచనా సందర్భంలో కలముగా చేసికొన్నాడు. 

    న్యాయం ధర్మం విద్య - వీటికొరకు ఎంతటి త్యాగమైనా చేయవచ్చునని ఈయన ఈ పనితో నిరూపించారు. 

    దైవానికి ఉపకరణం నిమిత్తమాత్రమనిన్నీ, విద్యావ్యాప్తికి సత్యం జ్ఞానం ధర్మం, ఇవి వ్యాపించడానికి ఉత్కృష్టమైన ఎట్టి దేహావయవమునైనా త్యాగం చేయవచ్చుననీ నిరూపణకే ఈ మహామహుడు మహాభారతం వ్రాశాడని గోచరమవుతున్నది . 


    వినాయకుడు ప్రణవ స్వరూపి. 

    వినాయకుడు విఘ్నవినాశకుడు. 

    ఆయన అనుగ్రహబలం ఉంటే అంతా అనుకూలమే. 


గిరిరాజసుతా తనయుడు 


    లోకంలో పనులు అన్నీ విఘ్నం లేకుండా జరగాలంటే వినాయకుని అనుగ్రహబలం మనందరికీ కావాలి.     

    అందులకే త్యాగరాజస్వామి 

  "గిరిరాజసుతా తనయా" అని గానం చేశారు. 


           గిరిరాజసుతా తనయ

              (త్యాగరాజ కీర్తన)

                   ----------------


    పర్వతరాజైన హిమవంతుడి కుమార్తె - పార్వతియొక్క పుత్త్రుడా! 

    మంచి దయ కలిగినవాడా! 

    దేవేంద్రుడు మొదలైనవారిచేత అర్చించబడే పాదద్వయం కలిగినవాడా! 

    గొప్ప ఏనుగు ముఖం కలిగినవాడా! 

    నన్ను రక్షించుము. 


    గణపతీ! 

    శ్రేష్ఠులకు శ్రేష్ఠుడా! 

    శుభాన్ని కలుగజేసేవాడా! 

    వేదములనే సముద్రానికి చంద్రుడా! 

    (చంద్రుడిని చూచి సముద్రం ఘోషిస్తూ ఉప్పొంగుతుంది - వేదాలు భగవంతుడిని స్వరసహితంగా స్తుతిస్తాయి) 

    చేతి కంకణముగా పాములరాజును కలవాడా! 

    ఆటంకాలను అడ్డుకొనేవాడా! 

    శంభువు కుమారుడా! 

    త్యాగరాజుచేత స్తుతింపబడేవాడా! 


కీర్తన 


గిరిరాజసుతాతనయ! సదయ!     ॥గిరి॥ 


సురనాథముఖార్చిత పాదయుగ! - పరిపాలయ మామిభరాజముఖ!   ॥గిరి॥ 


గణనాథ! పరాత్పర!  శంకరా(ఆ) - గమవారినిధి రజనీకర! 

ఫణిరాజకంకణ! విఘ్ననివారణ! శాంభవ! శ్రీత్యాగరాజనుత!                        ॥గిరి॥  


https://youtu.be/yUeG8JxyHMM


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం