16, నవంబర్ 2023, గురువారం

గురువారం, నవంబరు 16,2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


గురువారం, నవంబరు 16,2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

కార్తీక మాసం - శుక్ల పక్షం

తిథి:తదియ మ12.53 వరకు

వారం:గురువారం (బృహస్పతివాసరే)

నక్షత్రం : మూల తె3.26 వరకు  

యోగం: సుకర్మ ఉ11.48 వరకు

కరణం:గరజి మ12.53 వరకు తదుపరి వణిజ రా12.12 వరకు

వర్జ్యం:ఉ11.50 - 1.24 &

రా1.54 - 3.26

దుర్ముహూర్తము:ఉ9.52 - 10.37 &

మ2.21 - 3.06

అమృతకాలం:రా9.11 - 10.45

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్యరాశి :  తుల

 చంద్రరాశి : ధనుస్సు 

సూర్యోదయం:6.08

సూర్యాస్తమయం:5.21


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - శుక్ల పక్షం  - తృతీయ  - మూల -‌ గురు వాసరే* *(15-11-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏

శివానందలహరీ – శ్లోకం – 1*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 1*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం


*కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః*

*ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే |*

*శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పున*

*ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్  1*


కళలస్వరూపులునూ (శ్రీవిద్యాస్వరూపులు, సకలవిద్యాస్వరూపులు),  సిగలపై చన్ద్రకళలను ధరించినవారునూ (కాలాతీతులునూ), ఒకరినొకరు తపస్సుద్వారా పొందిన వారునూ, భక్తులకు ఫలములిచ్చువారునూ, త్రిభువనములకూ మంగళదాయకులునూ, హృదయమునందు ధ్యానములో మరలమరల గోచరించువారునూ, ఆత్మానందానుభవముతో స్ఫురించు రూపముకలవారునూ అయిన పార్వతీపరమేశ్వరులకు నమస్కారములు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

శివానందలహరీ – శ్లోకం – 2*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 2*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*గళంతీ శంభో! త్వచ్చరితసరితః కిల్బిషరజో*

*దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్ |*

*దిశంతీ సంసారభ్రమణపరితాపోపశమనం*

*వసంతీ మచ్చేతోహ్రదభువి శివానందలహరీ*


మహాదేవ శంభో! నీ చరితామృతము నుండి మొదలై, నా బుద్ధి అను కాల్వలద్వారా  ప్రవహిస్తూ, నా పాపములనూ, నా చావు-పుట్టుకల చక్రమునూ(సంసారభ్రమణం) తొలగించివేస్తూ, నా మనస్సనే మడుగును చేరి నిలిచిన శివానందలహరికి (పరమేశ్వరుని లీలలు వినుటచే కలిగిన ఆనంద ప్రవాహము) జయమగు గాక.

(శివలీలలను తెలిసుకొనుట ద్వారా పాపనాశనమూ, తాపనాశనమూ సాధించవచ్చునని శంకరాచార్యుల ఉపదేశం)


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

శివానందలహరీ – శ్లోకం – 3*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 3*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం*

*జటాభారోదారం చలదురగహారం మృగధరమ్ |*

*మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం*

*చిదాలంబం సాంబం శివ మతివిడంబం హృది భజే  3*


మూడు వేదములద్వారా తెలిసికొన దగిన వాడును , మిక్కిలి మనోహరమయిన ఆకారము కలవాడును , త్రిపురములనూ(త్రిపురాసురులను) సంహరించినవాడును , సృష్టికి పూర్వమేఉన్నవాడును , మూడుకన్నులు కలవాడును , గొప్ప జటాజూటము కలవాడును, గొప్ప ఉదారస్వభావం కలవాడును, కదులుచున్నసర్పములను ఆభరణములుగా ధరించినటువంటివాడును, లేడిని ధరించినవాడునూ , దేవతలకే దేవుడయిన మహాదేవుడునూ , సకల జీవులకూ పతి అయినవాడును , జ్ఞానమునకు ఆధారమయినవాడును , అనుకరింపశక్యము కానివాడును , నాయందు దయ కలవాడును అయిన పార్వతీ సమేతుడయిన శివుని హృదయమునందు ధ్యానించుచున్నాను.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

పెరియ పురాణం⚜️* . *నాయనార్ల చరిత్ర - 01*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 01*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *1. తిరు నీలకంఠ నాయనారు*


వేద బ్రాహ్మణులకు ఆవాసమైన చిదంబరంలో ఒక కుమ్మర కులంలో తిరునీలకంఠ నాయనారు జన్మించాడు. అతడు పరమేశ్వరునిపై అచంచల భక్తి తత్పరతలు కలిగినవాడు.

ఒక పర్యాయం తిరు నీలకంఠ నాయనారు ఒక వేశ్య ఇంటికి వెళ్లి తిరిగివచ్చాడు.


 తిరు నీలకంఠుని భార్య ఇది సహించలేకపోయింది. తన

భార్య అలుకను పోగొట్టడానికై నీలకంఠనాయనారు మృదు మధురంగా

మాట్లాడుతూ ఆమెను కౌగలించుకోవడానికి ప్రయత్నించాడు. “మీరు

మమ్మల్ని తాకినట్లయితే తిరు నీలకంఠేశ్వరుని మీద ఆన” అంటూ ఆమె తన భర్తను వారించింది. 


తిరు నీలకంఠ నాయనారు తన భార్యను చూసి

“నీవు మమ్మల్ని అని చెప్పడం వలన ఇక మీదట నిన్నే కాదు ఇతర స్త్రీలను

కూడ మాతృమూర్తులుగా భావించి తాకను కూడ తాకను" అంటూ ప్రతిజ్ఞ

చేసి అప్పటి నుండి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాడు. యౌవనప్రాయాన్ని

దాటి వారు ముసలివారయ్యారు. 


వారి భక్తి శ్రద్ధలను లోకానికి

తెలియజేయాలనే ఉద్దేశంతో పరమేశ్వరుడు జంగమ వేషంతో అతని ఇంటికి

వచ్చాడు.

మాయాశివుడు తన చేతిలో ఉన్న భిక్షాపాత్రను నీలకంఠుని చేతికి ఇచ్చి "ఇది చాలా అపూర్వమైంది. దీనిని నీ దగ్గర దాచి ఉంచు. మాకు

అవసరమైనపుడు తీసుకుంటాను” అని చెప్పి వెళ్లిపోయాడు. 


తిరు నీలకంఠుడు దానిని తన ఇంటిలో ఒకచోట భద్రంగా దాచాడు. శివుడు

నీలకంఠుని వద్దనున్న భిక్షాపాత్రను అదృశ్యమయ్యేలాగా చేశాడు.

కొంతకాలమైన తరువాత శివయోగి నీలకంఠుని దగ్గరికి వచ్చి "పూర్వం

నేను నీదగ్గర దాచి ఉంచిన భిక్షాపాత్రను నాకు తిరిగి ఇవ్వవలసింద”ని కోరాడు. 


నీలకంఠుడు ఇల్లంతా వెతికినా భిక్షాపాత్ర కనిపించలేదు.

శివయోగితో "స్వామీ! మీరిచ్చిన భిక్షాపాత్రకు బదులుగా వేరొక అందమైన

భిక్షాపాత్రను ఇస్తాను" అని చెప్పాడు. 


శివయోగి కోపంతో "నీవు నా

భిక్షాపాత్రను దొంగలించావు. నీవు దానిని దొంగలించి ఉండకపోతే నీ

భార్య చేతిని పట్టుకొని ఈ కొలనులో మునిగి శపథం చేయమని

కట్టడిచేశాడు. తిరు నీలకంఠుడు తనకు తన భార్యతోగల శపథాన్ని వివరించి

చెప్పి ఆమెతో కలసి కొలనులో మునగడం సాధ్యం కాదని చెప్పాడు.


శివయోగి ఆ మాటలకు కోపావేశుడై తిల్లెలోని బ్రాహ్మణులతో ఫిర్యాదు

చేశాడు. వాళ్లు తిరు నీలకంఠుని పిలిచి "ఈ యోగి చెప్పిన విధంగా నీవు

నీ భార్యతో కలిసి ఈ కొలనులో మునగడం న్యాయమే” అని తీర్పిచ్చారు.

వారు చెప్పిన ప్రకారం భార్యాభర్తలిరువురూ తమ శపథానికి భంగం

రాకుండా ఒక కర్రను చెరొకవైపు పట్టుకొని కొలనులో మునిగారు. 


మునిగి లేచిన భార్యభర్త లిరువురూ తమ ముదిమిని పోగొట్టుకొని యౌవనవంతులై

విరాజిల్లారు. శివగామీ సుందరీ సమేతుడై పరమేశ్వరుడు వారికి దర్శనమిచ్చి

“మీరిరువురూ మా సన్నిధిలో నిత్య యౌవనంతో శాశ్వతంగా ఉండగలరు”

అని దంపతులిరువురినీ ఆశీర్వదించాడు.


   *ఒకటవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కార్తీకపురాణం - 3వ అధ్యాయము*

 *కార్తీకపురాణం - 3వ అధ్యాయము*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*కార్తీక మాస  స్నాన మహిమ*


జన క మహరాజా ! కార్తి క మాసమున యే ఒక్క చిన్న దానము చేసిన నూ, అది గొప్ప ప్రభావము గలదై వారికి సక లైశ్వర్యములు కలుగుట యే గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ, కొంత మంది ఆస్థిరములైన భోగ భాగ్య ములు విడువలేక, కార్తిక స్నానములు చేయక , అవినీతి పరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి , కుక్క, పిల్లి గ జన్మింతురు..

అధమము కార్తీక మాస శుక్ల పార్ణమి రోజు న యిన నూ స్నాన దాన జపత పాదులు చేయక పోవుట వలన న నేక చండాలాది జన్మ లెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టిదురు. దీనిని గురుంచి నాకు తెలిసిన యితిహాసమొకటి  వినిపించెదను. సపరి వారముగా శ్రద్దగా ఆలకి౦పుము.


*బ్రహ్మ రాక్ష సులకు ముక్తి కలుగుట*


ఈ భారత ఖండ మదలి దక్షిణ ప్రా౦తమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు, తపశాలి, జ్ఞాన శాలి, సత్య వ్యాక్య పరిపాలకుడు అగు ' తత్వనిష్టుడు' అను బ్రాహ్మణుడొక  డుండెను. ఒక నాడా  బ్రాహ్మణుడు తీర్ధ యాత్ర సక్తుడై  అఖండగోదావరికి బయలుదేరును. ఆ తీర్ధ సమీపమున ఒక మహా వట వృక్ష౦బు  పై భయంకర ముఖములతోను, దీర్ఘ  కేశములతోను, బలిష్ట౦బులైన కోరలతోను, నల్లని బాన పొట్టలతోను, చూచువారుకి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసి౦చుచూ , ఆ దారిన బ్రోవు బాట సారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంత మంతయు భయక౦పితము చెయుచు౦డిరి. తీర్ధ యాత్రకై  బయలుదేరి అఖండ గోదావరి పుణ్య క్షేత్రమున  పితృ దేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు అ వృక్షము చెంతకు చేరుసరికి  యథా ప్రకారము బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చ౦పబోవు 

సమయమున, బ్రాహ్మణుడు ఆ భయ౦కర రూపములను చూచి గజ గజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పటి౦చుచు ' ప్రభో ! ఆర్త త్రాణ పరాయణ! ఆ నాధ రక్షక ! ఆపధలోనున్న గజేంద్రుని, ని౦డు సభలో అవమానాలు పలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే - యి పిశాచములు  బారినుండి నన్ను రక్షించు తండ్రీ!  యని వేడుకొనగా, ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మ రాక్షసులుకు జ్ఞానో దయ౦ కలిగి ' మహానుభావా! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు  జ్ఞానో దయ౦ అయినది మమ్ము రక్షింపుడు' యని ప్రాదేయపడిరి. వారి మాటలకూ విప్రుడు ధైర్యం తెచ్చుకొని' ఓయీ! మీరెవరు ? ఎందులకు మికి రాక్షస రూప౦బులు కలిగెను? మీ వృత్తా౦తము తెలుపుడు' యని పలుకగా వారు' విప్ర పుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు , వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన యే ఆపద కలగదు' అని అభయమిచ్చి, అందొక  బ్రహ్మ రాక్షసుడు తన వృ త్తాంతము యీవిదముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం . బ్రహ్మనుడను. నేను మహా పండితుడనని గర్వము గలవాడై నై యుంటిని. న్యాయాన్యాయ విచాక్షణలు మని పసువునై ప్రవర్తి౦చితిని, బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యం గా దానం లాగుకోనుచు, దు ర్వ్యనాలతో  భార్య పుత్రా దులను సుఖపెట్టాక, పండితుల నవమాన పరచుచు, లుబ్దు డనై లోక కంట కుడిగ నుంటిని.

ఎట్లుండగా ఒకానొక పండితుడు కార్తిక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమర్ధన చేయు తల౦పుతొ పదార్ధ సంపాదన నిమి త్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచెను. వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతనికి వద్ద నున్న ధనము, వస్తువులు తీసుకోని ఇంటినుండి గెంతి వైచితిని. అందులకా విప్రునకు కోపము వచ్చి ' ఓరి ని చూడ ! అన్యక్రా౦తముగ డబ్బుకూడా బెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకొంటివి గాక, నివు రాక్షసుడవై నార భక్ష కు డువుగా నిర్మానుష్య ప్రేదేశాములలో నుందువు'గాక! యని శపించు టచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మస్త్రమునైన తపెంచుకొవచును కానీ బ్రాహ్మణ శాపమును తపెంచాలేము గదా! కాన నయాప రాదము క్ష మి౦ పుమని వానిని ప్రా ర్ధి౦ చితిని. అందులకాతాడు దయదలచి' ఒయీ! గోదావరి క్షే త్రమ౦దొక వట వృక్షము గలదు. నివండు నివసించుచు యే బ్రాహ్మణువలన పునర్జన్మ నొ౦దు దు వు గాక' యని వేదలిపోయాను. ఆనతి నుండి నేని రాక్షస స్వరుపమున నభాక్ష ణము చేయుచున్దిని. కాన, ఓ విప్రోతమ! నన్ను న కుటుంబము వారిని రక్షిమ్పుదని మొదటి రాక్షసుడు తన వ్రుతంతమును జెప్పెను.


ఇక రెండవ రాక్షసుడు- ' ఓ ద్విజోత్త మా ! నేను కూడా పూర్వ జన్మలో బ్రహ్మనుడునే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను భాదించి వారికీ తిండి పెట్టక మాడ్చి  అన్నమో రామచంద్రాయను నటులచేసి, వారి యెదుటనే ణ బార్య బిడ్డలతో పంచభక్ష్య పరమన్నములతో భుజించుచు౦డేడివాడను.  నేను యెట్టి దానధర్మములు చేసి మెరుగును, నా బ౦ధువులను కూడా హింసించి వారి ధనమపహరి౦చి రాక్షసుని వలె ప్రవ ర్తి౦చితిని. కాన, నాకీ రాక్షస  సత్వము కలిగెను. నన్ని పాపప౦కిలము నుండి ఉద్దరి౦పుము' అని బ్రాహ్మణుని పాదములపై  బడి పరి పరి విధముల వేడుకొనెను.


మూడవ రాక్షసుడు కూడా తన వృ త్త౦తమును యిటుల తెలియ జేసెను. ' మహాశయా! నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రహ్మణుడను. నేను విష్ణు  ఆలయములో అర్చకునిగా నుంటిని. స్నాన మైనను చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచు౦డేడి వాడను భగవంతునికి ధూప దీప నైవేద్యము  లైనాను నర్పించక, భక్తులు గొనితేచ్చిన సంభారములను  నా వుంపుడు గత్తెకు అందజేయుచు మధ్య మాంసము సేవించుచు పాపకార్యములు  చేసినందున నా మరణన౦ తరము యి రూపము ధరించితిని, కావున నన్ను కూడా పాప విముక్తి ని కావి౦పు' మని ప్రార్ధించెను.ఓ జనక మహారాజ! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచములు దినలపము లాలకించి 'ఓ బ్రహ్మ రాక్షసులరా! భయపడకుడు. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోర క్రుథ్య౦బులవల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును' యని, వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి చేతనవిముక్తి సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంటమున కేగిరి. కార్తిక మాసములో గోదావరి స్నానమాచరించినాచో హరిహరాదులు సంతృప్తి నొంది, వారికీ సకలైశ్వర్యములు ప్రసాది౦చుతురు. అందువలన, ఎంత ప్రయత్నించిన సరే కార్తిక స్నానాలనా చరించాలి.


*ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య* *ముందలి*

*మూడవ రోజు* *అధ్యాయము -* *మూడవ రోజు పారాయణము సమాప్తము.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

 సంపూర్ణ ఆరోగ్యం సిద్దించుట కొరకు ఆయుర్వేద సూత్రాలు  - 


 *  ప్రాతఃకాలం నందే నిద్ర నుండి మేల్కొనవలెను . బ్రహ్మ ముహూర్తం సరైన సమయం . 


 *  ప్రాతఃకాలం నందు నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చటి నీటిని తాగవలెను దీనివలన మలమూత్రాలు సాఫీగా సాగును. 


 *  నిద్ర లేచిన వెంటనే మలమూత్ర విసర్జన చేయవలెను . మలమూత్రాలను బలంగా ఆపుట వలన రోగాలు సంప్రాప్తిస్తాయి .


 *  దంతధావనం నందు నాలుకను , దంతములను శుభ్రపరచుకోవలెను . నల్లతుమ్మ చెట్టు బెరడు కషాయం నోటి యందు క్రిములను తొలగించు గుణము కలదు 


 *  దంతముల పాచిని తొలగించుట కొరకు వనమూలికలతో చేసినటువంటి దంత చూర్ణంని వాడవలెను . చిగుళ్ల యందు వ్యాధులు ఏమైనా ఉన్నచో చిగుళ్లకు నువ్వులనూనె రాయవలెను . 


 *  స్నానానికి ముందు నువ్వులనూనెతో మర్ధించుకొని కొంతసేపు నీరెండలో ఉండవలెను . నువ్వులనూనె బదులు కొబ్బరినూనె లేదా ఆవాలనూనె వాడుకోవచ్చు . ఆవాల నూనె చాలా శ్రేష్టం . ఔషధ తైలాలు కూడా వాడవచ్చు . 


 *  శరీరంకి నూనె మర్దించుకొనుట వలన చర్మం మృదువుగా , కోమలంగా తయారగును. 


 *  కీళ్లు , కండరాలు కదలికలు మంచిగా జరుగును. 


 *  రక్తప్రసరణ మంచిగా జరుగును. చర్మం ద్వారా , మలపదార్థాలు త్వరగా తొలగించబడును. 


 *  వ్యాయమం చేయవలెను . 


 *  స్నానం గొరువెచ్చటి నీటితో చేయవలెను .


 *  గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వలన జఠరాగ్ని పెరుగును . రోమకూపములు , స్వేదరంధ్రములు , చర్మము శుభ్రపరచబడి శరీరం నిర్మలంగా ఉండును. 


 *  నివశించే ప్రదేశముని బట్టి, కాలం మరియు అలవాట్లని అనుసరించి ఆహారం నిర్ణయించవలెను . తీపి , పులుపు , ఉప్పు, కారం , చేదు , వగరు అను ఆరు రుచులు కలిగి ఉండు ఆహారముని తీసుకొనవలెను . 


 *  జీర్ణశక్తికి అనుకూలంగా ఉండు ఆహారముని నిర్ణయించుకొని తీసికొనవలెను . 


 *  భోజనం చేయుటకు 10 - 15 నిమిషములు ముందు పచ్చి అల్లం ముక్కలను కొద్దిగా ఉప్పుతో కలిపి తినవలెను . 


 *  గట్టిగా ఉండు పదార్థాలను బాగుగా నమిలి తినవలెను . 


 *  సాధ్యం అయినంత వరకు ఆహారసేవన తరువాత పెరుగు లేదా మజ్జిగ సేవించవలెను .


 * బాగుగా చల్లగా , వేడిగా ఉన్నటువంటి ఆహారపదార్థాలు తీసుకోరాదు . 


 *  ఆహారం తినుటకు 15 నిమిషాల లోపు నీరు తీసుకోరాదు . తిన్నవెంటనే అధిక మోతాదులో నీటిని తీసుకోరాదు . మధ్యమధ్యలో కొంచం కొంచం నీటిని తీసుకోవచ్చు . 


 *  ఆలస్యముగా జీర్ణం అయ్యేటువంటి ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోరాదు 


 *  భోజనం చేసిన వెంటనే అధిక శ్రమ చెయ్యరాదు . భోజనం చేసిన వెంటనే కొంత సమయం విశ్రాంతి తీసికొనవలెను . 


 *  తూర్పు , దక్షిణం వైపు తల యుంచి నిద్రించవలెను .


 *  నిదురించే గది అత్యంత స్వచ్ఛముగా గాలి వీచే విదముగా ఉండవలెను . 


 *  నిద్రించే మంచం ఎత్తు , వంపులు లేకుండా స్థిరంగా ఉండవలెను . 


 *  గది వాతావరణం దుష్ప్రభావం లేకుండా ఉండవలెను . 


 *  మెదడుని ఉత్తేజిత పరుచు పనులు అనగా గట్టిగా చదువుట , ఆలోచించుట , మద్యపానం , కాఫీ, టీలు సేవించుట మొదలగు వాని తరువాత వెంటనే పడుకోరాదు . 


 *  రోజుకి కనీసం 7 గంటలు నిద్రించవలెను . 


 *  పగటినిద్ర మంచిది కాదు కేవలం ఎండాకాలం నందు మాత్రమే పగటి సమయం నందు నిద్రించవలెను . 


 *  నింద్రించుటకు ముందు అరికాళ్లకు , అరచేతులకు తైలం మర్దించుట వలన కలలు నియంత్రించబడును . అనగా పీడకలలు నియంత్రించబడును. 


 *  అధికంగా మైథునం చేయుట వలన శరీరముకు హాని కలుగును. దీనివలన క్షయ మొదలగు వ్యాధులు కలుగును .


 *  మైథునం రాత్రి మొదటి భాగం నందు చేయుట ఉత్తమం . తగినంత విశ్రాంతి లభించును. 


 *  అసహజ మైధున కర్మలు రోగాలకు మూలకారణం . 


 *  వ్యాధులకు చికిత్స తీసుకునే సమయంలో మైధున ప్రక్రియ నిలిపివేయవలెను . లేనిచొ శరీర రోగ నిరోధక శక్తి సన్నగిల్లును. 


 *  మూత్రము ఆపుట వలన మూత్రము పోయుటలో బాధ కలుగును. మూత్రములో రాళ్లు ఏర్పడును . మూత్రాశయం యొక్క కండరాలు పటుత్వము కోల్పోవును. మూత్రమార్గంలో వాపు , మంట కలుగును.  అందువలన బలవంతంగా మూత్రాన్ని ఆపరాదు . 


 *  మలవిసర్జన ఆపుట వలన కడుపులో నొప్పి , కడుపుబ్బరం , అజీర్ణం , అపానవాయువులు , తలనొప్పి , కడుపులో పుండ్లు  వంటి సమస్యలు మొదలగును . కావున మలవిసర్జన ఆపకూడదు.


 *  శుక్రం బయల్పడే సమయంలో నిరోదించినచో శుక్రం గడ్డలు గడ్డలుగా రావటం వృషణాలలో నొప్పి , సంభోగం చేయు సమయంలో నొప్పి కలుగును. కావున శుక్ర వేగాన్ని నిరోధించరాదు . 


 *  వాంతిని ఆపుట వలన దద్దుర్లు , తలతిరగడం , రక్తహీనత , కడుపులో మంట , చర్మరోగాలు మరియు జ్వరం కలుగును . కావున వాంతులను బలవంతంగా అపరాదు. 


 *  తుమ్ములను ఆపుట వలన జలుబు , ముక్కునుండి అదేపనిగా నీరు కారే పీనస రోగం , తలనొప్పి , పార్శ్వపు నొప్పి మొదలగు సమస్యలు కలుగును. ముక్కులో ఉండు మలినాలు , అనవసర పదార్థాలను తొలగించుటకు సహాయపడతాయి. తుమ్ములను బలవంతంగా ఆపరాదు . 


 *  త్రేపులను ఆపడం వలన ఎక్కిళ్లు , ఛాతిలో నొప్పి , దగ్గు , ఆకలి మందగించడం , రుచి లేకపోవుట మొదలగు సమస్యలు సంభంవించును. 


 *  ఆవలింతలు ఆపుట వలన కండ్లు , గొంతు , చెవి , ముక్కు సంబంధ వ్యాధులు ఉత్పన్నం అగును . 


 *  ఆకలి , దప్పిక శరీరంకు కావలసిన పోషకాంశాలు మరియు నీటి ఆవశ్యకత ని తెలియచేస్తాయి . వీటిని అతిగా ఆపుట వలన శరీరంకు అందవలసిన పోషకాలు అందక శరీరం క్షీణించిపోతుంది. శరీరం కావాల్సిన రోగనిరోధక శక్తి తగ్గి రకరకాల సాంక్రమిక వ్యాధులు సంభవిస్తాయి . శరీరం పొడిగా మారును . 


 *  కన్నీటిని ఆపుట వలన  మనసిక వ్యాధులు , ఛాతిలో నొప్పి , తలతిరుగుట మరియు జీర్ణకోశ వ్యాధులు కలుగుతాయి . 


 *  శ్వాసప్రక్రియని ఆపుట వలన శ్వాసకోశ వ్యాధులు , గుండెజబ్బులు కలిగి మనిషి ని ఉక్కిరిబిక్కిరి చేయును . ఒక్కోసారి మరణం కూడా కలుగును. 


 *  నిద్రని ఆపుట వలన నిద్రలేమి , మానసిక వ్యాధులు , జీర్ణకోశ వ్యాధులు , మరియు జ్ఞానేంద్రియ వ్యాధులు సంభంవించును. 


          పైన చెప్పిన వాటిని అధారణీయ వేగాలు అని ఆయుర్వేదంలో పిలుస్తారు . ఇవి మొత్తం 13 రకాలు గా విభజించారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా ఆపరాదు . 


           ఈ నియమాలు నిబద్ధతతో పాటించటం వలన అనారోగ్యాలు కలగకుండా చూసుకోవచ్చు. 


     మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


       ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

         

        9885030034  

                         


    మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


        కాళహస్తి వేంకటేశ్వరరావు .


  అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


           9885030034

సప్త ధాతువులు

 శరీరం నందలి సప్త ధాతువులు మరియు ఉపధాతువులు గురించి వివరణ  - 


  శరీరం నందలి  7 రకాల ధాతువులు కలవు. 


 1 -  రసము .


 2 - రక్తము .


 3 - మాంసము .


 4 - మేధస్సు 


 5 - మజ్జ .


 6  - అస్థి .


 7 - శుక్రము .


                ఇవి శరీరమును పొషించును. 


 *  ఓజస్సు  - 


         శరీరం నందలి రసధాతువు మొదలు శుక్రధాతువు వరకు ఉండు సప్తధాతువుల యొక్క ఉత్క్రుష్టమైన తేజస్సే ఈ ఓజస్సు అని చెప్పబడును. అది స్నిగ్దముగా , నిర్మలంగా కొంచెం రక్తవర్ణము గా ఉండును.  ఇది ముఖ్యముగా హృదయము నందు ఉండినను శరీరం అంతా వ్యాపించి ఉండును. ఇది నశించినచో జీవియు నశించును . దీనివలన ప్రాణి బ్రతికి ఉండును. 


              దీనివల్లనే దేహసంబంధమైన అనేక భావములు కలుగుచున్నవి. ఇది శరీరం యొక్క జీవిత స్థితికి ముఖ్యకారణం అయిఉన్నది. ఇది 10 బిందువుల ప్రమాణంతో 

శరీరం నందు ఉండును.  


              కోపము , ఆకలి, ధ్యానము , దుఃఖము   శ్రమ  మొదలగు వాటివల్ల మనుజుడు యొక్క శరీరం మిక్కిలి దౌర్బల్యత్వం  చెందును .  శరీరం కాంతి నశించును. 


         పైన చెప్పిన కారణాల వలన ఓజస్సు తగ్గినప్పుడు చికిత్సా సమయంలో మధురద్రవ్యములను , పాలు , మాంసరసం , నెయ్యి , దూలగొండి మొదలగు ద్రవ్యములను వాడినచో ఓజస్సు వృద్ధిచెందును. 


  సప్తధాతువులు శరీరం నందు సంచరించు పద్దతి  - 


 *  రసము  - 


        ఇది మిక్కిలి పలచగా ఉండును. చిన్న ప్రేగుకి సంబందించిన రసాయనుల ద్వారా హృదయముకి చేరి అచ్చట వడపోయబడి స్థూలసూక్ష్మ భాగములుగా విభజింపబడును . అందు స్థూలభాగము సర్వశరీరం నందు గల రసాయనుల ద్వారా వ్యాపించుతూ రక్తధాతువుని పోషించుచుండును.


 *  రక్తము  - 


        ఇది శరీరం నందలి సిరల యందును , మాంసము నందు వ్యాపించి ఉండును. ఇది ధమనీ సహాయమున శరీరం అంతటా ప్రవహించుతూ కాలేయం , మూత్రపిండముల యందు శుద్ది అగును . రసధాతువు నుండి రక్తధాతువు ఏర్పడును . 


 

 *  మాంసము  - 


        ఇది నాళములలోని రక్తము ద్వారా పోషించబడుచూ ఉండును. ఇది కూడా స్థూలం , సూక్ష్మం , మలం అను విభాగాలు పొందును. సూక్ష్మంగా ఉండు భాగం మేధస్సుని చేరి పోషించబడుతూ ఉండును. ఇది రక్తధాతువు నుండి ఏర్పడును . 


 *  మేథస్సు  - 


          ఇది నెయ్యి వలే తెల్లగా ఉండును. ఇది కడుపులోను మరియు చిన్నచిన్న ఎముకలకు అంటియుండు కొవ్వుపదార్థం . మాంసము నందలి సూక్ష్మ భాగములచే ఇది పోషించబడును. ఇది కూడా స్థూల, సూక్ష్మ , మల భాగములుగా విభజించబడి ఎముకలను పోషించుచుండెను . ఇది మాంసధాతువు నుండి ఏర్పడును . 


 *  అస్థి  - 


          ఇది మేధోధాతువుచే పోషింపబడుచూ శరీరం యొక్క పటుత్వమునకు ప్రధాన హేతువుగా ఉంటుంది. ఇది 3 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఇది మజ్జా ధాతువుని పోషించుతూ ఉండును. ఇది మేధోధాతువు వలన ఏర్పడును . 


 *  మజ్జ  - 


           

          ఇది బోలు ఎముకలో ఉండు పచ్చని కొవ్వు వంటి పదార్థం . ఇది అస్థిధాతువు చే పెంచబడును. ఇది స్థూలం , సూక్ష్మం , మలం మూడు బాగాలుగా విభజింపబడి ఉంటుంది. అందులో స్థూలభాగం మజ్జభాగంలో చేరుచూ ఉండును. సూక్ష్మ భాగం శుక్రధాతువు ని పొషించుచుండును . ఇది అస్థిధాతువు వలన ఏర్పడును . 


 *  శుక్రము  - 


        

           ఇది శరీరం నందు అంతటా ఉండు మజ్జాధాతువు యొక్క సూక్ష్మభాగం . ఎముకలలో ఉండు అతి సూక్ష్మ రంధ్రముల ద్వారా పైకి వచ్చి రక్తముతో కలిసి సిరల గుండా ప్రవహించుచూ సూక్ష్మ శుక్రద్రవము ను పోషింపుచూ ధమనీ సహాయంతో బీజకోశములలోకి చేర్చబడును . ఇది స్థూల సూక్ష్మ అను రెండు భాగములుగా విభజింపబడును. అందు స్థూలభాగం శుక్రమును , సూక్ష్మ భాగం ఓజస్సు పోషింపబడును. ఇది మజ్జా ధాతువు వలన ఏర్పడును . 


  ధాతువులకు ఉపధాతువులు  - 


     రసధాతువుకు  స్తన్యము , రక్తధాతువు కు స్త్రీల రజస్సు, మాంసధాతువుకు వస అనెడి చమురు , మేధోధాతువుకి చెమట, అస్థిధాతువుకి దంతములు , మజ్జాదాతువుకి వెంట్రుకలు , శుక్రధాతువుకి ఓజస్సు ,  వీటిని ఉపధాతువులు అనబడును.



   మరెన్నో అద్భుత సులభయోగాలు నేను రచించిన గ్రంథాల యందు సంపూర్ణముగా ఇచ్చాను. 


 

   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

        9885030034 


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


            9885030034

15, నవంబర్ 2023, బుధవారం

Panchaag