9, డిసెంబర్ 2023, శనివారం

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో*

*యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప* |

*బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ*

*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 16_* _


*తా: ఓ లక్ష్మీ పతీ! నీవు పద్మమును నాభి యందు కలవాడవు. దేవతలకు నాయకుడవు. సర్వవ్యాపకుడవు. యజ్ఞములకు అధిపతివి. యజ్ఞ రూపుడవు. మధువను రాక్షసుని శిక్షించినవాడవు. విశ్వరూపుడవు. బ్రాహ్మణ ప్రియుడవు. బ్రహ్మ, రుద్రుల అంశలు కలవాడవు. జన్మము లేకుండ చేయువాడవు. వసుదేవునకు పుత్రుడవై అవతరించినవాడవు. ఓ నృసింహదేవా! నాకు చేయూత నిమ్ము. లక్ష్మీదేవితో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.


🧘‍♂️🙏🪷 ✍️🙏

శనివారం, డిసెంబరు 9, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


శనివారం, డిసెంబరు 9, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

కార్తీక మాసం - బహుళ పక్షం

తిథి:ద్వాదశి తె5.01 వరకు

వారం:శనివారం (స్థిరవాసరే)

నక్షత్రం:చిత్ర ఉ9.16 వరకు 

యోగం:శోభన రా11.00 వరకు

కరణం:కౌలువ సా4.31 వరకు తదుపరి తైతుల తె5.01 వరకు

వర్జ్యం:మ3.11 - 4.53

దుర్ముహూర్తము:ఉ6.21 - 7.49

అమృతకాలం:రా1.21 - 3.02

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 -3.00

సూర్యరాశి : వృశ్చికం చంద్రరాశి: తుల 

సూర్యోదయం:6.22

సూర్యాస్తమయం:5.22


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

⚜ శ్రీ గోపితలాబ్

 🕉 మన గుడి : నెం 263








⚜ గుజరాత్ : ద్వారక


⚜ శ్రీ గోపితలాబ్



💠 గోపి తలావ్ (గోపి తలాబ్ లేదా చెరువు), గుజరాత్‌లోని ద్వారకలో ఉన్న ఒక చెరువు.

గోపీ తలాబ్ పేరు గోపి తలవ్ అనే పేరు వల్ల వచ్చింది. ఇక్కడ "తలవ్" అంటే గుజరాతీలో 'సరస్సు' అని అర్థం. ఈ ప్రదేశాన్ని " గోపి తలవ్" అని పిలుస్తారు, ఎందుకంటే ఇది గోపికలు శ్రీకృష్ణుడిని కలుసుకుని, ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి రావడానికి మోక్షాన్ని పొందే ముందు చివరి స్నానం చేసిన సరస్సు. 


⚜ స్థల పురాణం ⚜


💠 కంస మరణం మరియు రాజు ఉగ్రసేనుని పట్టాభిషేకం తరువాత, శ్రీకృష్ణుడు ఉద్దవుడిని ద్వారా బృందావన నివాసులను ఒక సందేశంతో కలవడానికి పంపాడు.


💠 ఉద్దవుడిని చూసి, నంద మహారాజ్, తల్లి యశోద మరియు బృందావనంలోని ఇతర నివాసితులు చాలా సంతోషించారు. 

వారు శ్రీకృష్ణుని గురించి ఉద్దవుడిని అడగడం ప్రారంభించారు. ఉద్ధవుడు శ్రీకృష్ణుడు చాలా సంతోషిస్తున్నాడని, వారిని కలవడానికి త్వరలో వస్తానని చెప్పాడు. రాత్రంతా శ్రీకృష్ణుడి గురించే మాట్లాడుకున్నారు అందరూ.


💠 ఉదయం, గోపికలు నంద మహారాజు నివాసం వెలుపల ఉద్ధవ రథాన్ని చూసినప్పుడు, ఎవరు వచ్చారో అని తమలో తాము చర్చించుకోవడం ప్రారంభించారు. కృష్ణుడు రాలేదని అనుకున్నారు. 


💠 అది విని ఉద్ధవుడు వచ్చి గోపికలను ద్వారకకు తీసుకెళ్లడానికి వచ్చానని చెప్పాడు. ఇది విన్న గోపికలు చాలా సంతోషించి ఉద్ధవునితో కలిసి ద్వారకకు బయలుదేరారు. దారిలో వారు మాయా సరోవర్ అనే సరస్సు వద్ద ఆగారు.

వారు ద్వారక పొలిమేరలో తమ స్వామిని కలుస్తారు.

 

💠 గోపికలు శ్రీకృష్ణుని అభ్యర్థించారు, "దయచేసి ఇక్కడ ఒక సరస్సును నిర్మించండి, తద్వారా మీ ఆశీర్వాదం ద్వారా సృష్టించబడిన సరస్సులోని పవిత్ర జలాల్లో మేము స్నానం చేస్తాము. 

"కృష్ణుడు వెంటనే వారి అభ్యర్థనను మన్నించాడు మరియు క్షణంలో, వారి ఎదురుగా ఒక సరస్సును సృష్టిస్తాడు. 

గోపికలు తమతో కలిసి వచ్చి స్నానం చేయమని వారి రెండవ అభ్యర్థన చేస్తారు. కృష్ణుడు, గోపికలతో కలిసి ఈ సరస్సులో స్నానం చేస్తాడు. 


💠 స్నానం తర్వాత, శ్రీకృష్ణుడు గోపికలను ఇలా అడుగుతాడు, "ఓ గోపికలారా, మీరందరూ నన్ను చూడడానికి చాలా దూరం నుండి వచ్చారు. నా నుండి మీకు ఇంకా ఏమి కావాలో నాకు చెప్పండి.

" గోపికలు ఇలా సమాధానం ఇచ్చారు, 

"ఓ ప్రభూ, కేవలం వచ్చి మిమ్మల్ని కలవాలనేది మా కోరిక. మాకు ఇక కోరికలు లేవు. 

ఈ పుణ్యస్నానం తర్వాత ఈ భౌతిక శరీరాలను ఇక్కడ వదిలివేయాలనుకుంటున్నాము. దయచేసి మమ్మల్ని ఇక్కడి నుండి బయలుదేరడానికి అనుమతించండి.

" గోపికల భక్తికి, ప్రేమకు శ్రీకృష్ణుడు పొంగిపోయాడు. మరణానంతరం వారికి మోక్షం లభించేలా దీవించాడు


💠 ఇక్కడే శ్రీకృష్ణ నిర్యాణవార్త విన్న గోపికలు

తాము చివరిసారిగా శ్రీకృష్ణుని తో కలిసి రాసలీలలు ఆడిన ఈ ప్రదేశంలో గోపికలందరూ ఈ భూమి యొక్క మట్టికి తమ ప్రాణాలను అర్పించారు - తద్వారా భగవంతునితో ఐక్యంగా, వారు మోక్షాన్ని (మోక్షాన్ని) పొందారు.


💠 జానపద కథల ప్రకారం, గోపికలు గోపి చందన్ అని పిలవబడే పసుపు మట్టిగా రూపాంతరం చెందారు, ఇది నేడు వైష్ణవాసులకు తప్పనిసరిగా ఆమోదించాల్సిన సౌందర్య సాధనంగా పరిగణించబడుతుంది.


💠 నేటికీ గోపి తలవ్‌ల నేల నునుపుగా పసుపు రంగులో ఉందని చెబుతారు.

ఇక్కడి నేల చక్కగా మరియు పసుపు రంగును కలిగి ఉంటుంది మరియు అనేక వ్యాధులను నయం చేయగల దైవిక లక్షణాలను కలిగి ఉందని నమ్ముతారు, ముఖ్యంగా చర్మానికి సంబంధించినవి. నేడు, చాలా మంది పర్యాటకులు తమ సందర్శనకు గుర్తుగా గోపీ చందన్‌గా ప్రసిద్ధి చెందిన ఈ మట్టిని కొనుగోలు చేస్తారు.


💠 గోపీ తాలాబ్ దగ్గర  గోపికల దేవాలయలు ఉన్నాయి . తాలాబ్‌కు అతి సమీపంలో ఉన్న ఒక దేవాలయం గోపీ కృష్ణ దేవాలయం. ఇందులో రాధా దేవి మరియు శ్రీకృష్ణుని తెల్లటి పాలరాతి విగ్రహాలు ఉన్నాయి. 

గోపీ తలావ్ వద్ద శ్రీకృష్ణుడు మరియు గోపికల పెయింటింగ్ కూడా ఉంది. 


💠 దీని పక్కనే రుక్మిణి ఆలయం ఉంది . 

రుక్మిణి దేవి యొక్క తెల్లని విగ్రహాన్ని కలిగి ఉన్న ఆలయం.

రుక్మిణి ఆలయం పక్కన లక్ష్మీ నారాయణ ఆలయం ఉంది.

దీనిలో లక్ష్మీ దేవి మరియు నారాయణుని నల్లని విగ్రహాలు ఉన్నాయి. 

ఈ ఆలయంలో అనేక ఇతర దేవుళ్ళ మరియు దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి.


💠 గోపి తలావ్ ద్వారక నుండి బెట్ ద్వారకకు వెళ్ళే మార్గంలో 20 కిలోమీటర్ల దూరం

శుభోదయం, పంచాంగం

 శుభోదయం, పంచాంగం                ఓం శ్రీ గురుభ్యోనమః

*శనివారం, డిసెంబరు 9, 2023

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

  *దక్షిణాయనం - శరదృతువు*

  *కార్తీక మాసం - బహళ పక్షం*

తిథి      : *ద్వాదశి* తె5.01 వరకు

వారం   : *శనివారం* (స్థిరవాసరే)

నక్షత్రం  : *చిత్ర* ఉ9.16 వరకు 

యోగం : *శోభన* రా11.00 వరకు

కరణం  : *కౌలువ* సా4.31 వరకు

తదుపరి *తైతుల* తె5.01 వరకు

వర్జ్యం  : *మ3.11 - 4.53* 

దుర్ముహూర్తము : *ఉ6.21 - 7.49* 

అమృతకాలం    : *రా1.21 - 3.02*                   

రాహుకాలం : *ఉ9.00 - 10.30*

యమగండ/కేతుకాలం : *మ1.30 - 3.00*

సూర్యరాశి: *వృశ్చికం చంద్రరాశి: *తుల*

సూర్యోదయం: *6.22 సూర్యాస్తమయం: *5.22

*సర్వేజనా సుఖినో భవంతు **

నవగ్రహా పురాణం

 .        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *101వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శనిగ్రహ చరిత్ర- 1*


యముడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాడు. సావర్ణినీ , శనినీ , యమినీ , తపతిని ప్రేమగా పలకరించాడు.


*"అనుకున్నది సాధించావు కద , యమా ?"* సూర్యుడు కుమారుడిని అడిగాడు.


*"అనుకోని అద్భుత పదవిని బ్రహ్మదేవుడు నాకు అనుగ్రహించాడు. నాన్నగారూ !"* యముడు సగర్వంగా అన్నాడు. *"ఆయన నన్ను దక్షిణ దిక్కుకు పాలకుడుగా నియమించాడు !"*


*"చూశారా , స్వామీ ! నా బిడ్డ దిక్పాలకుడయ్యాడు !"* సంజ్ఞ సంతోషంగా అంది.


*"కాలం తీరిన జీవులను పాశబంధంతో తీసుకురావడం , వాళ్ళ పాపపుణ్యాలను పరిగణించి , నరకానికో , స్వర్గానికో పంపించడం - ఇది నా విధి ! పాప పుణ్యాలను నిర్ణయించి , శిక్షలు సక్రమంగా విధించగలిగే పరిజ్ఞానం కోసం పరమేశ్వరుడిని ఆశ్రయించమని ఆ పరమేష్టి నన్ను ఆజ్ఞాపించారు..."*


*"అలాగా !”* సంజ్ఞ సంతోషంగా అంది.


*"చతుర్ముఖుల ఆనతిని అనుసరించి , హిమాలయ పర్వతం మీద పరమశివుడి గూర్చి తపస్సు చేశాను ! ఆయన సాక్షాత్కరించాడు. తాను రూపొందించిన 'శిక్షాస్మృతి'ని నాకు ఉపదేశించాడు."* యముడు ఆనందంగా వివరించాడు.


*"పరమశివుడు శిక్షాస్మృతి రచించాడా ?"* సంజ్ఞ అడిగింది.


*"విశ్వంలో మొట్టమొదటి సారిగా శిక్షాస్మృతిని నిర్మించింది పరమశివుడే , సంజ్ఞా !"* సూర్యుడు అన్నాడు.


*"మేరు పర్వతం మీద దక్షిణాన నా కోసం 'సంయమని' అనే పట్టణం విశ్వకర్మ నిర్మించాడు. వంద యోజనాల పొడవుతో , వంద యోజనాల వెడల్పుతో ఉన్న సభలో నేను నా విధులు నిర్వహించాలి ! మీ ఆశీస్సులతో నా దిక్పాలక పదవిని ప్రారంభిస్తాను !"* యముడు సంతోషంతో చెప్పాడు.


యముడు చెప్తున్న విషయాలు అందరి ముఖాల మీద ఆనందాన్ని పులుముకున్నాయి. ఒక్క శనైశ్చరుడు మాత్రం - నవ్వలేదు. అతని నల్లటి ముఖం మీద తీవ్రమైన అసంతృప్తి , అసూయా జమిలిగా కనిపిస్తున్నాయి.


*"సావర్టీ ! చూశారా మీ సోదరుడు యముడు బ్రహ్మనూ , శివుడినీ - ఇద్దర్నీ మెప్పించాడు. దిక్పాలక పదవి సంపాదించుకున్నాడు. తన పరిపాలన కోసం అద్భుతమైన సభాంగణం , సంయమనీపురం లభించాయి మన యముడికి !"* సంజ్ఞ ఉత్సాహం నూరి పోస్తూ అంది.


*"మీరు కూడా యముడిని ఆదర్శంగా తీసుకుని - సాధించాలి !"* సూర్యుడు. అన్నాడు.


*"యముడి కన్నా ఎక్కువే సాధిస్తాను !"* శని ఆవేశంగా అరిచాడు.


అందరూ అదిరిపడి అతని వైపు చూశారు. శని కళ్ళు నల్లటి కుండ చిల్లుల్లో కనిపించే ఎర్రటి నిప్పుల్లా ఉన్నాయి.


*"శనైశ్చరా...”* సూర్యుడు ఆశ్చర్యంగా అన్నాడు. *"ఆగ్రహిస్తున్నావు ! ఎందుకు , నాయనా ?”*


*"యముడు పరమేష్టినీ , పరమేశ్వరుణ్ణి - ఇద్దర్ని మాత్రమే మెప్పించాడు ! ఈ శనైశ్చరుడు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులను ముగ్గుర్నీ మెప్పిస్తాడు !”*


యముడు శని స్పందనతో నివ్వెరపోయాడు. దగ్గరగా వచ్చి , అతని భుజం మీద అనునయంగా చెయ్యి వేశాడు. చిరునవ్వుతో చూస్తూ , *“సోదరా...”* అన్నాడు. 


శనైశ్చరుడు యముడి చేతిని విసురుగా తోసి , ఎడంగా జరిగాడు. *“నీ విజయాన్ని మించిన ఘన విజయాన్ని సాధించి , నా శక్తి నిరూపించుకుంటాను !”


******************************************


*"శనీ ! ఏమిటా అహంభావం ?"* సంజ్ఞ గద్దించింది.


*"అహంభావం కాదు , జ్యేష్ఠమాతా ! ఆత్మ విశ్వాసం ! ఈ యముణ్ణి మెచ్చుకున్నట్టే , నన్నూ మెచ్చుకోవాలి మీరు !"*


*"శనైశ్చరా..."* సూర్యుడు మందలింపుగా అన్నాడు.


*"త్రిమూర్తుల వరాలు సంపాందించి గానీ తిరిగి రాను !"* శని హుంకరించాడు. *"ఇప్పుడే - ఇప్పుడే వెళుతున్నాను !"*


*"సోదరా !"* సావర్ణి సముదాయిస్తున్నట్టు అన్నాడు.


*"సాధించి , తిరిగి వస్తాను , సావర్డీ!"* అంటూ శనైశ్చరుడు విసురుగా మందిరంలోంచి వెలుపలికి నడిచాడు.


అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు. 


*"స్వామీ... శనైశ్చరుడికి ఎందుకా స్పర్ధ ?"* సంజ్ఞ విచారంగా అంది.


*"వృద్ధి కోసం పూనే స్పర్థ మంచిదే దేవీ !"* సూర్యుడు నవ్వాడు.


*************************************


శని నెమ్మదిగా , మందమందంగా , అడుగులో అడుగు వేసుకుంటూ అరణ్య మార్గంలో వెళ్తున్నాడు.


నారాయణ నామస్మరణ చేసుకుంటూ , ఆకాశ మార్గాన వెళ్తున్న నారదుడు శనిని చూసి , ఆలస్యం చేయకుండా కిందకు దిగి , శనికి అభిముఖంగా నడవసాగాడు. మలుపు తిరిగి , సమీపంలో ఉన్న శనిని సమీపించాడు. 'నారాయణ!' అంటూ...


శని నారదుడి వైపు తీక్షణంగా చూశాడు.


*"అభివాదం మహర్షీ !"* అన్నాడు చేతులు జోడిస్తూ.


*"నారాయణార్పణం ! ఎక్కడికి ప్రయాణం సూర్యనందనా ?”* నారదుడు ఎగాదిగా చూస్తూ అన్నాడు.


శని కళ్ళు చిట్లించాడు. *"మా జనయిత్రి నామధేయం కూడా కలిపి , 'ఛాయా మార్తాండనందనా !' అని సంబోధించవచ్చు కదా ?”*


*“నారాయణ ! నేను అనకపోయినా , నువ్వు ఛాయాసుతుడు కాకపోతావా ? చాలా వేగంగా వెళుతున్నావు... ఎక్కడికో తెలుసుకోవచ్చునా , ఛాయా పుత్రా ?"*


*"అపహాస్యమా , నారదమహర్షీ ? నేను అడుగులో అడుగు వేస్తూ , నడిచేవాడిననీ , అందుకే నన్ను శనైశ్చరుడనీ , మందుడనీ అంటారనీ తెలియదా ? నేను... వేగంగా , అదీ 'చాలా వేగంగా' వెళ్ళడం అనేది సంభవమా ?"* శని సూటిగా అడిగాడు.


నారదుడు శని చూసేలా నాలుక కరుచుకున్నాడు. *"నీ నడకలో అడుగడుగునా కనిపించిన నిర్ణయాన్ని గమనించి , అలా అన్నానులే. ఛాయా మార్తాండ సంభూతా ?"*


*"తపస్సు రహస్య కార్యమైతే , నేను వెళ్ళే పని కూడా రహస్యమే !"* శని ముక్తసరిగా అన్నాడు.


*"తపస్సా ?! ఎవరి గురించి ?”* నారదుడు ఆశ్చర్యంగా అడిగాడు. *"బ్రహ్మా ? విష్ణువా ? మహేశ్వరుడా ?"*


ఈ శనైశ్చరుడికి ముగ్గురూ సమానమే ! త్రిమూర్తులు ముగ్గురి గురించీ తపస్సు చేసే సంకల్పంతో వెళ్తున్నాను"* శని గర్వంగా అన్నాడు.


*“ముగ్గురి గురించా ?”* నారదుడు ఆశ్చర్యంగా అన్నాడు. *"ఒక్కరైనా చాలుగా , వరాలు వర్షించేవారేగా , ఏ ఒక్కరైనా ?”.*


*“ముగ్గుర్నీ ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకుని , బయలుదేరాను , నారదా ! నా నిర్ణయం మారదు !"* శని పట్టుదలగా అన్నాడు. *"ఆ యముడు ఇద్దర్ని మెప్పించాడు. గదా ! నేను ముగ్గుర్నీ మెప్పిస్తాను !”.*


*"నారాయణ ! నారాయణ ! అదన్న మాట సంగతి ! ఆలోచన బాగానే ఉంది. అయితే , ముగ్గురికోసం తపస్సులోనే చాలా కాలం గడిచిపోతుంది...”*


శని గోరోచన గుళికల్లాంటి కళ్ళతో సూటిగా చూశాడు. *"నువ్వు ఇలాగే దారికి అడ్డుగా నిలుచుని , మాటకు మాట పెనవేస్తూ ఉంటే , ఇంకా చాలా కాలం గడిచిపోతుంది. నారదా !"*


*"నారాయణ ! మా సూర్య పుత్రుడు కదా , కుశల ప్రశ్నలు వేద్దామని వచ్చాను ! అంతే ! కాకపోతే , ముగ్గురు మూర్తుల్నీ ప్రసన్నం చేసుకోవాలంటే మూడు కాలాల పాటు , మూడు విడతలుగా..."*


*"నారదా !"* శని గద్దించినట్టు అన్నాడు. *"మూడు విడతలని ఎవరన్నారు ? ఒక్క ముక్కలో చెప్పేస్తాను ! నీ దారిన నువ్వు పో , నా దారిన నన్ను పోనీ ! నేను - బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల ముగ్గురి గురించే ఒకేసారి తపస్సు చేస్తాను ! అంటే త్రిమూర్తుల గురించి ఏక కాలంలో !"*


*"నారాయణ !"* అంటూ నారదుడు నోరు తెరిచాడు. *"ముగ్గురు దేవ దేవుల గురించి ఏక కాలంలోనా ? ఇలాంటి విచిత్రమైన తపశ్చర్య గతంలో లేదు. భవిష్యత్తులో ఉండబోదు..."*


*"వర్తమానంలో ఉంటుంది ! అన్ని లోకాలకూ ఈ వర్తమానం అందించు ! వెళ్ళు !"* అంటూ శనైశ్చరుడు నారదుణ్ణి తప్పుకుని అడుగులో అడుగేసుకుంటూ వెళ్తున్నాడు. నారదుడు అతని వైపు తిరిగి నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

🚩శ్రీ వివేకానందస్వామి

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                    *భాగం 111*


*భారతదేశానికి అవసరమైనా సంస్కరణలు:-*


స్వామీజీ వ్యక్తిత్వం పట్ల ఆకర్షితులైనవారు అనేకులు రోజూ ఆయన వద్దకు రావడమూ, ఆయన పాటలు, మాటలు వినడమూ ఘాజీపూర్ దినచర్యగా పరిణమించింది. కాని వచ్చేవారి పాశ్చాత్య వ్యామోహాన్ని స్వామీజీ గమనించకపోలేదు. వారి నడక, దుస్తులు, ప్రవర్తన అన్నీ పాశ్చాత్య సంస్కృతికి అద్దం పట్టాయి. పాశ్చాత్యులను అనుకరించడమే అభ్యుదయమని వారు భావించినట్లుగా కనిపించింది. 


“విదేశీయులు ఇక్కడికి ఎటువంటి నాగరికతను కొనితెచ్చారు? ఆహా! వారు ఎటువంటి ఐహిక వ్యామోహాన్ని కల్పించారు! దుర్బల హృదయులైన వీరిని ఆ విశ్వనాథుడే సంరక్షించుగాక‌!  


భారతదేశానికి ఆవశ్యకమైన సంస్కరణలు ఏ మార్గంలో జరగాలోఆయన మాటలు స్పష్టంగా తెలిపాయి: "ఉన్నదంతా బలవంతంగా తీసి పారవేయడమో, మన సంస్కృతిలో అంశాలనన్నింటిని నిష్పక్షపాతంగా తూలనాడడం వల్లనో కాదు మనం సంస్కరణ లను తీసుకురావలసింది. దానికి బదులు అపరిమితమైన ప్రేమను నాటాలి, ఎనలేని సహనం పాటించాలి.


"విద్యను వ్యాపింపచేయాలి. సహజంగా అభివృద్ధికి కారణమవుతుంది.ఈ అభివృద్ధి బాహ్యంగా ఉత్తేజితమైనది కాక, లోపల నుండే ఉద్భవించినదై ఉంటుంది. మనం అందించే విద్య కూడా ఈ దృక్పథంతో కూడిన విద్యగా ఉండాలి. హిందూమత మహత్యాన్ని ఎలుగెత్తి చాటాలి; అతిశయోక్తులకు పోకూడదు. హిందూమతంలోని ఆదర్శాలను ప్రజలు చైతన్యపూరితులై అవగతం చేసుకొనేలా చేయాలి. 


"ఒక్క విషయం మరచిపోకూడదు ‌‌- హిందూమతం నీతి విరుద్ధమైనది కాదు! దాన్లో లోతుగా మునగండి, దాని మహత్యాన్ని మీరు కొలవవచ్చు. కళ్లుమూసుకొని పాశ్చాత్య సంస్కృతికీ, ఆచారవ్యవహారాల అట్టహాసాలకూ, పై పై మెరుగులకు బానిసలు కాకండి. మీ మాతృదేశం గురించి అధ్యయనం చేయండి.. మీ జాతి, దాని జీవనాధార ప్రాతిపదిక ఉద్దేశం ఏమిటన్నది కనుగొనండి.


"భారతదేశ ఆదర్శాలూ, దృశ్యాలూ మహత్తరమైనవి కావని నేడు మనం  భావిస్తున్నాం. మనం క్షణం మాత్రమే ఆలోచించవచ్చు, అయినప్పటికీ మనం అలా ఆలోచిస్తున్నాం, అలాంటి మానసిక దురాకర్షణకు లోనయ్యాం. ఇలాంటి వినాశనం కన్నా ఆవేదన కలిగించే స్థితి మన భారతదేశ చరిత్రలో సంభవించి ఉండదు.


 నిజానికి మన దేశంలో విలయతాండవం చేస్తున్న పేదరికం ఏదో తెలుసా? మన నాగరకత ఆధ్యాత్మిక కొలబద్దను మనం కనుగొనకపోవడమే. మనలను మనం అవగతం చేసుకొన్నప్పుడు, కనుగొన్నప్పుడు మన సమస్యలు తొలగిపోతాయి.”.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

పెరియ పురాణం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 25*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*తిరునీల నక్క నాయనారు*


సిరి సంపదలతో కూడిన చోళదేశంలో తిరుచ్చందమంగై అనే అందమైన గ్రామం ఉంది. శివభక్తుడుగా ప్రసిద్ధిచెందిన నీలనక్కరు అక్కడ

జీవనం సాగిస్తూ వచ్చాడు. 


అతడు రోజూ శివుని అర్చిస్తూ శివభక్తులకు

సేవలు చేయడమే తన పరమావధిగా కాలం గడుపుతూ ఉండేవాడు.

ఒక పర్యాయం నీలనక్క నాయనారు అయవంది దేవాలయంలో

నెలకొని ఉన్న పరమేశ్వరుని సన్నిధికి పూజాద్రవ్యాలు తీసుకొని తన భార్యను

వెంట బెట్టుకొని వెళ్లాడు. భక్తితో దేవాలయం ప్రదక్షిణంచేసి స్వామి

గర్భగృహాన్ని సమీపించాడు. 


ఆ సమయంలో ఒక సాలెపురుగు

శివలింగంమీద పడగా పక్కనే ఉన్న తిరునీల నక్క నాయనారు భార్య

దానిని చూసింది. ఒక తల్లికి తన శిశువుమీద ఎంతటి ప్రేమ ఉంటుందో

శివునిమీద అలాంటి ప్రేమ భావాన్ని కలిగిన నీలనక్క నాయనారు భార్య

శివునికి ఏదైనా ఆపద సంభవిస్తుందేమోనని భయపడింది. వెంటనే తన

నోటితో ఆ సాలెపురుగును ఊదింది. 


సాలెపురుగు దూరంగా

కిందపడిపోయింది కాని ఆమె ఎంగిలి తుంపరలు కూడ శివలింగం మీద

పడింది. తిరునీల నక్క నాయనారు తన భార్య కారణంగా శివునిపై ఎంగిలి

పడిందని తెలుసుకొని కోపోద్రేకంతో ఆమెను చూసి “ఓ బుద్ధిహీనురాలా!

శివాపరాధం చేసిన నిన్ను క్షమించను. 


నిన్ను పరిత్యజించాను" అని చెప్పి భార్యను అక్కడే వదలిపెట్టి తాను మాత్రం ఇంటికి వెళ్లి పోయాడు.

ఆరోజు రాత్రి కలలో తిరు నీలనక్క నాయనారుకు పరమేశ్వరుడు

ప్రత్యక్షమై తన శరీరాన్ని చూపించి "భక్తుడా! నా మీద ప్రేమాభిమానాలతో

నీ భార్య నా శరీరంపై ఊదింది. 


ఆమె ఆ విధంగా ఊదడం వలన ఎంగిలి

తుంపరలు పడిన చోటుతప్ప మిగిలిన భాగాల్లో సాలెపురుగు కారణంగా

బొబ్బలు లేచాయి. ఇదిగో చూడు" అని చెప్పి భార్య భక్తి భావాన్ని అతనికి

తెలియజేశారు. తిరు నీలనక్క నాయనారు నిద్రనుండి మేల్కొని స్వప్న

వృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. తన భార్య శివభక్తిని తలచుకొని

సంతోషంతో పరమేశ్వరుని స్తుతించాడు. 


సూర్యోదయం కాగానే నాయనారు అయవంది దేవాలయానికి వెళ్లి పరమేశ్వరుని పాదపద్మాలకు సాగిలబడి

నమస్కరించారు. తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. తన భార్యను

సంతోషంగా ఇంటికి పిలుచుకొని వచ్చాడు.

శివభక్తులకు సేవ చేయడమే పరమావధిగా తన జీవితాన్ని గడిపిన తిరు నీలనక్క నాయనారు చివరగా శివ సాయుజ్యాన్ని పొందాడు.


*ఇరవై ఐదవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 25*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*స్తవైర్బ్రహ్మాదీనాం జయజయవచోభుర్నియమినాం*

*గణానాం కేళీభి ర్మదకలమహోక్షస్య కకుది*

*స్థితం నూలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం*

*కదాత్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుమ్!!*



స్తోత్ర పాఠములతో బ్రహ్మాదులూ, జయజయ ధ్వనులతో మహర్షులూ, క్రీడా వినోదాలతో ప్రమథగణములూ నిన్ను సేవిస్తుండగా, అది ౘూసి సంతోషంతో ఱంకె వేస్తున్న వృషభము అనగా నందీశ్వరునిమూపురము పై కూర్చున్న వాడవునూ, నల్లని కంఠము గల వాడవునూ, మూడు కన్నులు కల వాడవునూ, పార్వతిచే ఆలింగితమైన దేహము కలవాడవునూ, లేడిని చేతితో పట్టుకొన్నవాడవునూ, ఖండింపబడిన పరశువు అనే ఆయుధమును ధరించిన వాడవునూ అయిన నిన్ను ( శివుని) సందర్శించే భాగ్యము నాకు ఎప్పుడు లభిస్తుందో కదా


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  -‌ ద్వాదశి - చిత్ర -‌ స్థిర వాసరే* *(09-12-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/WjNVuq2lhjs?si=KJ15nm9IIjThYD2y


🙏🙏

గిరిక వచో మాధుర్యం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి పోస్ట్.* 

                     🌷🌷🌷

శుభోదయం🙏

                   చొప్పకట్ల.


గిరిక  వచో మాధుర్యం !

--------------------------------- 

              

          ఉ:  " ఇంతి మృదూక్తి  మాధురికి  నిక్షురసం  బెన వోలఁ జాల ,కా


                   ద్యంతము  నోడి   మధ్యమ గుణాశ్రయమై , నెఱకాఁ క  నెన్ని జ


                  న్మాంతరము ల్వహించియుఁ  దనంతనె  ఖండము లయ్యెఁగాని,  యా


                 వంతయుఁ బూన దెంత  వొడి యయ్యు  నఖండ తదీయ  సంపదన్.


                    వసుచరిత్రము--2 ఆ--46 వ పద్యం:  రామరాజ  భూషణుడు.


                                   రామరాజ భూషణ విరచిత  వసుచరిత్ర  ప్రబంధమున  నాయికా  వర్ణన  సందర్భమున  నీపద్యము చోటు

చేసికొన్నది.   గిరిక  వచోమాధుర్యము (మాటలతీయదనము) చక్కర కన్నతీయన , యని  చెప్పదలచి దానికొక  చక్కని కథ

నల్లినాడు. దానిని పరిశీలించుటకు  ముందు కఠిన పదములకు అర్థములను వివరిస్తాను.


            అర్ధములు: ఇంతి- వనిత:  మృదూక్తి- మెత్తనిమాట; మాధురి-తీపి;  ఇక్షురసము- చెరకు రసము; ఎనవోలుట: సమానమగుట;


ఆద్యంతము- మొదలునుండి చివరివరకు;  మధ్యమ గుణాశ్రయము- కణుపులలోచేరి ;( రజోగుణము వహించి)  నెఱకాఁక- అధికమైన ఉష్ణమున ; (పెద్దమంటలో ) జన్మాంతరములు- యెన్నోపుట్టుకలు(అనేక జన్మలనెత్తినా) ఖండములగుట-ముక్కలగుట;  ఆవంతయు -కొంచెమైనను; వొడియగుట- పొడిగా మారుట; అఖండ- అంతులేని (ముక్కలుగాని)  తదీయ సంపదన్-ఆమెవాక్సంపదను;


                భావము: చెఱకురసం  ఆగిరిక వచోమాధుర్యంతో  సమానత్వాన్ని పొందుదామని ప్రయత్నం చేసినదట. ఆప్రయత్నంలో ఆది మొదటినుండి చివరివరకూ ఓడిపోయిందట. అయినా అక్కడితో ప్రయత్నం ఆపిందా లేదే  మధ్యమ గుణాన్ని ఆశ్రయంచిందట

(సామాన్యంగా మధ్యమగుణమనేమాటకు రజోగుణమనే మాట చెపుతాం .)చెరకు  విషయంలో దానిమధ్యమగుణంవేరు.చెరకు కణుపుల మధ్యలోనే రసం విస్తారం ఆరసంలోనే  తీపియధికం. .కణుపులమధ్యలోచేరిందట. తరువాత మంటలోబడిందట. రూపాంతరాలను పొందిందట. బెల్లపు పాకంగా బెల్లపు అఛ్చులుగా యిలా ,తరువాత పొడిగా మారిందట. అయనా అదితుదకు యెన్నివేషాలు వేసినా దానియత్నంఫలింపలేదూ. అంటాడు కవి. అంటే ఆమెమాటలు చెక్కర కన్న తియ్యన యని ఫలితార్థం!


                ఇందుకోసం కవిచేసిన ప్రయత్నం గొప్పది. లోకంలో  తమకన్నా ఉన్నతులను గెలవాలంటే యెంతో పట్టుదలతో ప్రయత్నం చేయాలి ఆపట్టుదల రజోగుణంవలన కలుగుతుంది. అవసరమైతే  పంచాగ్నిమధ్యంలోనిలచి తపస్సుచేయాలి. అదీఫలించకపోతే మరోటి చివరకు వారు రూపుమాసిపోతున్నా వారిప్రయత్నం మానరు. అదిగో ఆవిధంగా చెరకు యీమెవచోమాధుర్యాన్ని పొందటంకోసం ప్రత్నించి ఓడిపోయింది సామ్యత నందలేదు. అనివర్ణన. 

            


                 చెరకు తనప్రయత్నంలో  ఆద్యంతం ఓడటం:.  చెరకును గానుగకు పంపేముందు  మొదలు  నరికేస్తారు. అలాగే ఆచివరి భాగంకూడా కొంతభాగం తొలగిస్తారు అదీవిషయం. మధ్యమగుణాశ్రయమగుట:- కణుపులలో చేరి  యని భావం. నెఱకాక:-చెరకురసం పెద్ద కళాయిలోపోసి క్రింద మంటబెట్టి బగా కాస్తారు. అప్పుడది గట్టిపడుతుంది. జన్మాంతరాలు :-బెల్లమువగైరా రూపాలు.

పొడికావటం : చక్కరగామారటం. 


                   ఇదిగో యింత ప్రక్రియ యీపద్యనిర్మాణంలో  కవి ఉపయోగించాడు. ప్రబంధకవుల  వర్ణనలన్నీయింతే! చివరకుచెప్పిందేమిచటి?


"ఆమెమాటలు చెక్కరకన్నాతియ్యనివి"-అని.

                                               స్వస్తి!

🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🕉️