19, ఏప్రిల్ 2024, శుక్రవారం

కాశీ యాత్ర (మూడవ భాగము)

కాశీ యాత్ర (మూడవ భాగము)

 5 తారీకు సాయంత్రం 4గంటలకు సత్రం రూముకు తాళం వేసి నడుచుకుంటూ సందులన్నీ తిరిగి మేము బాపు పాండే ఘాట్ వద్దకు వెళ్ళాము. అక్కడ మెట్ల ప్రక్కన ఒక స్లోపు గోడ వున్నది నేను గోడమీదనుంచి నడవటం వలన క్రిందికి దిగటం తేలిక అయ్యింది. మేము కొంత క్రిందికి రాగానే ఒక పడవ వాడు మమ్ములను కలిసి రెండు వేలు ఇస్తే మొత్తం ఘాటులన్ని చూపించి వస్తానన్నాడు. నేను క్రింద నది దగ్గరకు తొందర తొందరగా వెళ్ళితే అక్కడ ఒక ఫెర్రీ షిప్  బయలుదేరటానికి సిద్ధంగా వున్నది నేను పడవ వానిని ఎంత తీసుకుడుంటావు  అని అడిగితె మనిషికి 300 రూపాయలు అని అన్నాడు. కానీ మా కుమారుడు 15వందలకు చిన్న మోటారు బోటు మాట్లాడాడు. మా కాంట్రాక్టు ప్రకారం మమ్మలను ఆవలి వడ్డుకు తీసుకొని వెళ్లి మేము నదిలో స్నానం చేసే దాకా ఉండి తరువాత కాశీలోని గాటు  లన్నీ చూపించి గంగ హారతిని చూపించి మరల మమ్మలను బాపు పాండే ఘాటులో వదలాలి. అదే ప్రకారం ముందుగా మమ్మల్ను ఆవలివడ్డుకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ మేము ముగ్గురం స్నానాలు చేసాము. తరువాత నదికి ఎగువగా వెళ్లి ఒక్కొక్క గాటుని దూరం నుంచి చూపుతూ చివరి ఘాట్లు అంటే హరిచంద్ర ఘాటు మేము ఘాటుని చూసినప్పుడు ఒక నాలుగు చితులు కాలుతూ కనిపించాయితరువాత మణికర్ణికా ఘాటు అక్కడ కూడా నాలుగు చితులు కాలుతూ కనిపించాయి. నేను బోటులోంచే చితులకు నమస్కరించానుఆహ వాళ్ళ భాగ్యం ఏమిటి కాశీలో మరణించారు అని తలచాను. " కాశీని మరణాత్ ముక్తిహి" అని మనసులోనే అనుకొన్నాను. కాశీలోనే మరణించాలని చాలామంది వృద్ధాప్యంలో కాశీకి వచ్చి నివసిస్తారని నేను విన్నాను. యెంత ప్రయత్నించినా కానీ కొద్దిమందో పుణ్యస్థలంలో మరణించగలరని నానుడి. మమ్మలను అన్ని ఘాట్లు తిప్పుతూ చివరకు దశాశ్వమేధ ఘాటుకు తీసుకొని వచ్చి గంగ నదిలో నావను నిలిపాడు. అక్కడ దాదాపు రాత్రి 8 గంటలవరకు ఉండి గంగ హారతిని కన్నులపండుగగా తిలకించాము. హారతి కార్యక్రమం ముగియకముందే మమ్ములను నదిలో బాపు పాండే ఘాటు వద్దకు బోటు వాడు తీసుకొని వెళ్ళాడు. మేము అతనికి వప్పుకున్న ద్రవ్యం ఇచ్చి మేము నడుచుకుంటూ సత్రానికి చేరుకున్నాము. కరివేనసత్రంలో రాత్రి పుట భోజనం పెట్టరు . నా కుమారుడు వెళ్లి టిఫిన్ ప్యాక్ చేయించుకొని ఒక స్టీలు మగ్గునిండా మజ్జిగ తీసుకొని వచ్చాడు. మేము ఉప్మా తిని మజ్జిగ త్రాగినాము. నేను నా కుమారుడు అక్కడికి దగ్గరలోని తారక రామ ఆంధ్రశ్రమాన్ని వెళ్లి రూములగూర్చి విచారించాము. మీరు సామానుతో వస్తే కానీ మీకు రూము ఇవ్వము అని అక్కడి రిసిప్షన్లోని ఆయన అంటే తిరిగి సత్రానికి వచ్చి రూము కిరాయి రూ. 1200 కట్టి రూము  కాళీ చేసి ఆంధ్రాశ్రమానికి వెళితే  మాకు రెండవ అంతస్తులో 39 నంబరు గది రూ 375 కిరాయితో ఇచ్చారు. మేము ఎదురుగా వున్న లిఫ్ట్ ఎక్కి 2 అంతస్తులోని గదికి వెళ్ళాము. అటెండరు గది తాళం తీసి మాకు గది  వప్పచెప్పి  తాళం చెవి తీసుకొని వెళ్ళాడు. అదేమిటని అడిగితె మీరు మీ సొంత తాళం వేసుకోవాలని అన్నాడు. నేను క్రిందికి వచ్చి అక్కడి సమీప షాపులో ఒక చిన్న తాళం రూ 50 పెట్టి కొన్నాను. ఆంధ్రశ్రమంలో బియ్యపు రవ్వ ఉప్మా పెడితే నేను గదికి తీసుకొని వచ్చి దానిని తిని మేము పడుకున్నాము.

అలోచిoచండి

 *తప్పకుండా చదవండి...*

-------------------- Jai Gurudeva

🌀 జననం ధర్మమని, మరణం తప్పదని అందరికి తెలుసు 60 లేదా 70 కాకపోతే 80 సంవత్సరాలు.

🌀 ఖాళీ చేతులతో తల్లి గర్భంనుండి వచ్చాము, ఖాళీ చేతులలో భూగర్భంలోకి పోతాం, తొలిస్నానం గుర్తులేదు, చివరిస్నానంతెలియదు.

🌀 నీగురించి నీవు ఎక్కువ మాట్లాడు తున్నావ్ అంటే నీకు ౼ నేను అన్నది పోలేదన్నమాట... 

🌀 జ్ఞానమున్న వారితో వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది కాని అజ్ఞానునితో వాదించకు నీ విజ్ఞతను కోల్పోతావు...

🌀 ఈ ప్రపంచమంతా అవకాశవాదులతోనే నిండి ఉంది, ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు.... 

అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది...

🌀 మనం ఎంత మంచిగా ఉన్న ఎవరో ఒకరి కథలో చెడ్డ వాళ్లమే, కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది..

🌀 బయట గరికగడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగదు. అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివారు అభివృద్ధి చెందలేరు..

🌀 ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచేలోపు, అబద్దం అందంగా తయారై అందర్నీ తనవైపు ఆకర్షిస్తుంది.. 

🌀 మన దగ్గర డబ్బులేకుంటే మన రక్తసంబంధంలోనే విలువుండదు, _అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది._,

_ఒకప్పుడు గుణం చూసి దగ్గరయ్యేవారు, ఇప్పుడు ధనం చూసి దగ్గరవుతున్నారు...

🌀 ఎదుటి వ్యక్తి నీపై నేరుగా నెగ్గే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు...

🌀 నీ నొప్పి నువ్వు గ్రహిస్తే ప్రాణాలతో బతికి ఉన్నావని అర్ధం, 

_ఇతరుల నొప్పిని కుడా నీవు గ్రహించగలిగితే మానవత్వం గల మనిషిగా బతికి ఉన్నావని అర్ధం.._

🌀 మన వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునేవారి గురించి ఆలోచించకండి ఎందుకంటే...? వారిస్థానం ఎప్పుడు మన వెనుకే...

🌀అతివేగం ప్రమాదాలకు దారితీస్తుంది..అలాగే అన్నీ అనారోగ్యసమస్యలు వేగంగా తగ్గిపోవాలని వాడే మందుల వల్ల వచ్చే ప్రమాదాలే సైడ్ ఎఫెక్ట్స్....

అలోచిoచండి... మిత్రులారా

సర్వే జనా సుఖినోభవంతు. Jai Shri Ram 

Kancherla Venkata Ramana 

🙏🙏🙏🙏🙏🙏

ఐదు "వ" కారాలుండాల

 *ఐదు "వ" కారలతో పూజ్యత*

~~~~~~~~~~~~~~~~

“వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ

వ కారైః పంచభిర్యుక్తః నరో భవతి పండితః ”

ఒక వ్యక్తి సమాజంలో గౌరవింపబడాలంటే ఐదు "వ" కారాలుండాలని చెప్తోంది ఈ శ్లోకం. 

అవి - 1.వస్త్రధారణ 2.శరీరపోషణ (వపుషా) 3.సంభాషణ (వాచా ) 4.విద్య 5.వినయం.

*మొదటిది - వస్త్రధారణ*

ధరించిన వస్త్రాలను బట్టి వ్యక్తిని విలువ కట్టటం మంచిది కాదని తెలిసినా, మన ప్రథమవీక్షణం ఎదుటివాడు ధరించిన వస్త్రాలపైనే ప్రసరిస్తుంది. ఆ వస్త్రధారణం మనకు నచ్చితే అసంకల్పితంగా ఒక సానుకూల భావన అతనిపట్ల ఏర్పడుతుంది. నచ్చకపోతే అయిష్టభావన ఏర్పడుతుంది. కొందరు చూపరులను రెచ్చగొట్టే విధంగా వస్త్రధారణ చేస్తూ ఉండటం, దానివల్ల కొన్ని అనర్థాలు జరుగుతూ ఉండటం మనకు తెలుసు. ఎలాంటి బట్టలు కట్టుకోవాలనేది ఎవరికి వారు నిర్ణయించుకోవటం నూటికి నూరుపాళ్ళు న్యాయమే అయినా, సభ్యతను , వ్యవస్థను దృష్టిలో ఉంచుకోవాలి. “తగిన వేషము” సర్వదా శ్రేయస్కరం.

*రెండవది - శరీర పోషణ*

ఆరోగ్యం, ఆకర్షణ, సభ్యత అనేవి శరీరపోషణకు ఆంతర్యాలు. ఆరోగ్యం బాగానే ఉన్నా దర్శనీయత లోపిస్తే ఇబ్బంది. కనీసం ఎదుటివాడికి రోత పుట్టించని విధంగా శరీరాన్ని ఉంచుకోవాలి. వికారచేష్టలు , దుర్వాసనలు మొదలైనవి ఎదుటివారికి వెగటు పుట్టిస్తాయి. పదిమందిలో ఉన్నప్పుడు కొన్ని శారీరక బలహీనతలను , ఎదుటివారికి అసహనాన్ని కలిగించే వైఖరులను నియంత్రించుకోవాలి.

*మూడవది - మాటతీరు*

ఇంటా,బయటా గౌరవింపబడాలంటే ప్రతి మాటనూ ఆచి తూచి మాట్లాడాలి.

“ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః

తస్మాత్తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రతా ? ”- 

ఒక మంచి మాట మాట్లాడితే సర్వులూ సంతోషిస్తారు. అందువల్ల ప్రియభాషలే మాట్లాడాలి. మాటలకు దారిద్ర్యంలేదుకదా !అని ఈ శ్లోకభావం. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందనే సామెత ఉంది కదా !

*నాల్గవది - విద్య*  

“విద్వాన్ సర్వత్ర పూజ్యతే” విద్యావంతుడు ఎక్కడైనా పూజింపబడుతాడు.

విద్యావంతుడు దుర్జనుడైతే వాడిని దూరంగా ఉంచాలి. వాడు తలమీద మణి ఉన్న సర్పంలాంటివాడని పెద్దలు చెప్పారు. అందువల్ల అహంకార, కుసంస్కార దూషితం కాని విద్యాతేజస్సు మాత్రమే వందనీయం.

*ఐదవది - వినయం*

విద్యాతత్త్వం గ్రహించిన వాడే వినయసంపదను పొందగల్గుతాడు.“ఉద్ధతులు గారు బుధులు సమృద్ధిచేత ” అన్నాడు భర్తృహరి. ఎన్ని సంపదలున్నా అహంకరించక వినయశీలాన్ని పోషించుకొనేవాడు అందరిచేతా ఆదరింపబడుతాడు.

వేంకటేశ్వర ఆలయం

 🕉 మన గుడి : నెం 291

⚜ *కర్నాటక  :  Jp నగర్, బెంగళూరు*

⚜ *శ్రీ తిరుమలగిరి లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం*

💠 శ్రీ వేంకటేశ్వరుడు తనను కోరే భక్తులకు కొలమానమైన సంపద.. వేంకటేశ్వరుడికి అంకితం చేయబడిన అనేక ఆలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి.  

బెంగళూరులోని J.P. నగర్‌లో ఉన్న

 శ్రీ తిరుమలగిరి లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం అటువంటి అనేక దేవాలయాలలో ముఖ్యమైన పుణ్యక్షేత్రం.  

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో వేంకటేశ్వరుని ప్రతిరూపం ఇక్కడ ప్రతిష్టించిన వేంకటేశ్వరుడు అని చెబుతారు.

💠 శ్రీ రంగనాథునిగా భావించబడిన ఒక దేవాలయం తిరుపతిలోని వేంకటేశ్వరుని నివాసానికి పుణ్యక్షేత్రంగా మారింది.  

ఇక్కడ దేవుడు అనేక ఇతర దేవతలను దర్శించుకునే అవకాశం ఇచ్చాడు.  

ఇక్కడ  వేంకటేశ్వరుడు అతని కుడి వైపున నరసింహ స్వామి మరియు ఎడమ వైపున తల్లి లక్ష్మీ దేవి ఉన్నారు.  

గోవిందరాజ స్వామి, ఆంజనేయుడు (హనుమాన్), గణపతి మరియు ఆదిశేషునికి ప్రత్యేక మందిరాలు కలవు.

💠 తిరుమలగిరి ఆలయాన్ని సూర్యాస్తమయం తర్వాత పండుగ రోజులలో చూడాలి..

ఆ సమయంలో మీరు స్వర్గపు నక్షత్రాల మధ్య నిలబడి, రంగురంగుల ప్రకాశంతో మైమరచిపోయినట్లు అనిపిస్తుంది.

💠 ఏడు తలల ఆదిశేషునిపై 13.5’ ఎత్తులో ఉన్న రంగనాథ స్వామి విగ్రహం ఒకే రాతితో చెక్కబడి ప్రపంచంలోనే అత్యంత అరుదైనదిగా పేర్కొంటారు.  

శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం పునాదితో సహా 13 అడుగుల ఎత్తు ఉంటుంది.  

100 సంవత్సరాలకు పైగా ఆంజనేయుడు ఉనికిలో ఉన్నందున ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించక ముందే ఆంజనేయ దేవుడు అక్కడ ఉన్నాడు.

💠 అనేక పండుగలలో వైకుంఠ ఏకాదశిని ఘనంగా జరుపుకుంటారు ఎందుకంటే ఆ రోజున ఆలయానికి 7 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారు.

💠 శ్రీ తిరుమలగిరి లక్ష్మీ వేంకటేశ్వర ఆలయాన్ని 29 డిసెంబర్ 1996న శ్రీ రంగప్రియ స్వామిగళ్ ప్రారంభించారు

💠 2011 నుండి ప్రతి శనివారం, ఆలయాన్ని సందర్శించే భక్తులందరికీ నిత్య ప్రసాదంతో పాటు, అన్నదానం ప్రారంభించబడింది.

ప్రతి సంవత్సరం శ్రావణ మాసం నాడు ఆలయంలో తిరుపావడై సేవను పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహిస్తారు. 

వైకుంఠ ఏకాదశి రోజున ఆలయంలో ప్రత్యేక లడ్డూలను తయారు చేసి భక్తులందరికీ పంచుతారు.

దేవతలకు నిత్య అలంకారానికి సంబంధించిన పూలమాలలన్నీ ఆలయంలో రోజూ తయారు చేస్తారు.

💠 రాష్ట్రంలోని అనేక దేవాలయాలకు భిన్నంగా, శ్రీ గోపాల అయ్యంగార్ తన దివ్య ప్రపంధ గోష్టి (బృందం)తో కలిసి ఆలయంలో నిత్య పారాయణం (రోజువారీ ప్రార్థనలు) నిర్వహిస్తారు.

సేమ్యా పాయసం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

 *🌷జగదీశ్ కొచ్చెర్లకోట గారి కథనం🌷* 

                    🌷🌷🌷

సేమ్యా పాయసం చెయ్యడమెలాగో నేర్చుకుందాం బోయ్స్!

ఫేస్‌బుక్ చూసింది చాలుగానీ ముందా ఫోన్ పక్కనబడేసి లేచి ఆ లుంగీ అదీ కాకుండా ఎంచక్కా పాంటూ చొక్కా తొడుక్కోండి. ఒకవేళ ట్రాక్ వేసుకునుంటే మార్చక్కర్లా! దానిమీదకి ఆపోజిట్ కలర్ టీషర్టేదన్నా వేసుకోండి. బూడిదరంగు ట్రాక్ మీదకి నేవీ బ్లూ.. అలాగన్నమాట! మరీ ఎడ్డిమొహంలా కాకుండా కాస్త మొహం సబ్బుతో ఓ రెండుమార్లు రుద్దుకుని ఆ నాలుగు వెంట్రుకల్నీ పక్కకి దువ్వుకుని చాలా మర్యాదస్తుడైన అంకుల్లా బయల్దేరండి.‌

మీ వీధి చివర్లో ఉన్న మోర్‌కో, రత్నదీప్‌కో వెళ్లి ఓ రెండుమూడు వరసలు వదిలేసి బాగా లోపలికి వెళ్తే అక్కడుంటాయి సేమ్యా పేకెట్లు. సరిగ్గా చూసుకునేడవండి, నూడుల్స్ కూడా అలాగే తగలడతాయి. తెలీకపోతే ఆ ఆరెంజ్ కలర్ డ్రెస్సేసుకున్న అమ్మాజీని పిలిచి సేమ్యా పాకెట్టివ్వమని అడగండి. 

తీసుకున్నారా, ఇప్పుడు కాస్త వంగితే ఆ కిందరల్లో జీడిపప్పు, కిస్‌మిస్, యాలక్కాయలంటూ చిన్నచిన్న పొట్లాలు కట్టి పడేసివుంటాయి. అవి తలొకటీ తీసుకోండి. ఇప్పుడు బిల్ కౌంటర్ దగ్గరకి రాగానే పక్కనే బీరువా సైజులో ఫ్రిజ్ ఉంటుంది. అందులోంచి అముల్ ఎర్ర పాకెట్టొకటి తీసుకోండి. అంటే పాలు కాస్త చిక్కగా ఉంటాయని ఎర్రదన్నానన్నమాట.

అంతా అయింతరవాత వాడు మీ ఫోన్ నెంబరడుగుతాడు. చెప్పనని చెప్పండి. ఇచ్చారంటే ఆనక మధ్యాన్నాలప్పుడు అప్పులాళ్ళూ, అపార్ట్‌మెంటలోళ్ళూ పీక్కుతినేస్తారు. మహా అయితే ఏ రెండొందలేభయ్యో ఎంతో అవుతుంది. క్యాష్ ఇచ్చేస్తే బెటర్.

ఇంటికి రాగానే మళ్ళీ లుంగీలోకి మారండి. పైన బనీనొకటీ ఉంటే హోమ్లీగా ఉంటుంది. చొక్కాలవీ అవసరంలా!

ఇప్పుడు రెండు స్టవ్వులూ వెలిగించుకోవాలి. లైటర్ చాలాసేపు ఏడిపిస్తుంది కానీ స్టవ్ అంటుకోదు. సిగరెట్టలవాటుందా? ఉంటే లైటరో, అగ్గిపెట్టో ఉండేవుంటుంది జేబులో, తియ్యండి. అంటించారా? నే చెప్పేది స్టవ్వు. సిగరెట్టు కాదు. అది తరవాతంటిద్దురుగాని.

ఇప్పుడు ఒకదాని మీద పాలగిన్నె పెట్టండి. ఆవేశంగా మంట పెద్దది పెట్టెయ్యకండి, సిమ్‌లో ఉంచితే బెటర్. పక్క స్టవ్వుమీద ఓ చిన్న మూకుడొకటి పడేసి అందులో ఓ పెద్ద చెంచాడు నెయ్యి పొయ్యండి. అది మీ మేనేజర్లా కాసేపు చిటపటలాడుతూ ఉండగానే అందులో ఒక గ్లాసుడు సేమియా వేసి కాస్త రంగు మారేవరకూ వేయించుకోండి. ఆనక అదే మూకుట్లో మళ్ళీ ఓ నేచ్చుక్క వేసుకుని అరడజను జీడిపప్పులు, మరో అరడజను కిస్‌మిస్‌లు వేసి బాగా కలుపుతూ కొంచెం ఎర్ర రంగు రాగానే స్టవ్వాపెయ్యండి. 

ఈలోగా పాలవైపొకసారి చూడండి. అవెలాగూ ఏ పాపమూ ఎరుగని పాపాయిలా తెల్లమొహం వేసుకు చూస్తుంటాయి. మనకి సహనం నశిస్తుంది. స్టవ్ మంట ఒక నెంబరు వరకూ పెంచండి. అప్పుడు గిన్నె అంచులమ్మట అలజజడి మొదలవుతుంది. అదుగో, అప్పట్నుంచి మీరిక అప్రమత్తంగా ఉండాలన్నమాట. ఆ రెండు నిముషాలూ ఏ ఫోనూ రాకూడదని, ఎవరూ కాలింగ్‌బెల్లదీ కొట్టకూడదని సాయిబాబాకి దణ్ణం పెట్టుకుని వేళ్ళు పిసుక్కుంటూ పాలవైపు చూస్తుండండి.

ఖాళీగా ఉండడం ఎందుకూ అనుకుంటే చిన్న పాలరాయి అమాన్‌దస్తాలో ఓ నాలుగు యాలక్కాయలు పడేసుకుని బాగా నూరుకోవచ్చు. తిరపతి లడ్డూలో పడేసినట్టు తొక్కలవీ పాయసంలో పడేసుకోకండి, తినడానికి చిరాగ్గా ఉంటుంది.

కాసేపటికి పాలగిన్నె దగ్గర చిన్న శబ్దం వినబడుతుంది. పొంగిపోతాయేమోనని మనకి భయమేస్తుంది, స్టవ్ తగ్గించేస్తాం, ఆ తరవాత రెండు నిముషాలు శంకరాభరణం మొదటి రెండువారాల కలెక్షన్స్‌లా స్తబ్దుగా పడుంటాయి పాలు. ఇక సహనం మరింత నశించి ఇంకొంచెం పెంచుతాం. వెంటనే ఆమధ్య కేదార్‌నాథ్‌లో చెప్పాపెట్టకుండా వరదలొచ్చేసినట్టు పాలు పొంగిపోయి గిన్నెదాటి స్టవ్వు మీదపడి డిజైన్లెయ్యడం మొదలెడతాయి. 

అంచేత స్టవ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకండి. నామాటిని కంగారుపడకుండా స్ట్రెస్ తగ్గడానికి పదంకీలు లెక్కబెట్టుకుంటూ ఈ వేయించిపెట్టుకున్న సేమ్యానీ, జీడిపప్పుల్నీ కిందామీదా పోసుకోకుండా ఆ పాల ఎసట్లో పోస్తూ కలపండి. కాసేపటికి పాలు శాంతించి నిదానంగా మనవైపు కుతకుతలాడుతూ చూస్తుంటాయి. 

అవలా ఉడుకుతుండగానే దగ్గరపడకముందే మంటాపెయ్యడం బెటర్. లేకపోతే పాయసం తాగడానికి గ్లాసు బదులు కత్తి వాడాల్సొస్తుంది. 

అయిపోవచ్చింది, ఇపుడేంచేస్తారంటే ఒక చిన్నగ్లాసుడు పందార తీసుకుని ఈ తయారైన సేమియా పాయసంలో పోసుకుని బాగా కలియదిప్పండి. 

ఆనక ఆ యాలకుల పొడుంది కదా, అది కూడా పైన చల్లేసి సున్నితంగా, సుకుమారంగా కలుపుతూ ఆ పరిమళాన్ని టీవీ అడ్వర్టైజ్‌మెంట్లలో స్నేహలా ఆస్వాదించండి. 

ఇప్పుడు క్రోకరీ అల్మరా దగ్గరకెళ్లి ఓ నాలుగైదారేడు సంవత్సరాల నుంచీ వాడకుండా ఊరికే అలా దాచుంచుకున్న మాంఛి వెడల్పాటి బౌలొకటి తీసుకోండి. దానిమీద లేలేత పువ్వుల డిజైన్లవీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. మరీ ప్లెయిన్‌గా ఉంటే ఫీల్ రాదు. ఒకవేళ మీయింట్లో వెండిగిన్నుంటే అదే బెటరు. కాస్త ఘనంగా ఉంటుంది.

అందులోకి ఓ నాలుగైదు పెద్ద స్పూన్ల పాయసం వేసుకుని చూడండి.

నా సామిరంగా... ఎర్రెర్రటి జీడిపప్పులు అక్క పెళ్లికి ప్రత్యేకంగా మేకప్పైన చెల్లెళ్లలా ఉత్సాహంగా తిరిగేస్తుంటాయి. కిస్‌మిస్సులేమో పెళ్లిపందిట్లో పెద్దవాళ్లు పిలుస్తోంటే సిగ్గుపడుతూ తలుపెనకాల దాక్కునే పిల్లల్లా అక్కడక్కడా దాక్కుంటాయి. 

చూడటానికే ఇంత వైభవంగా ఉంటే ఇక తింటే ఎలా ఉంటుందో నే చెప్పాలా? 

ఇంకెందుకూ లేటు, కంటిముందున్నది పంటికిందకెళితే ‘అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా...’ పాటందుకోవడం ఖాయం!

ఇప్పుడు చెప్పండి థాంక్సు!

ఉగాది శుభాకాంక్షలర్రా! నాకీ సాయంత్రం కవి సమ్మేళనం ఉందని రాశిఫలాల్లో రాసుంది. విధినెవడు తప్పించగలడు? కాసేపలా వెళ్లొస్తా!

మీ....

కొచ్చెర్లకోట జగదీశ్

ఇప్పుడు చెప్పండి థాంక్సు

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5125* *శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం -‌ ఏకాదశి - మఘ -‌‌ భృగు వాసరే* *19-04-2024.* 

ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.

🙏🙏

18, ఏప్రిల్ 2024, గురువారం

కాశీ యాత్ర (రెండవ భాగము)

కాశీ యాత్ర (రెండవ భాగము)

కాశీలో కాలుమోపటం: మా విమానం రాత్రి 10 గంటలకు కాశీ చేరుకుంది. హైదరాబాదు నుండి 1035 కిలోమీటరులు ప్రయాణించి మేము కాశీలో అడుగిడాము .  మా వెంట తినుబండారాలు అంటే పులిహోర, ఇతరత్రా పదార్ధాలు ఏవి తీసుకొని వెళ్లనందున మాకు దిగగానే ఆకలి వేసింది. ఒక టాక్సీ మాట్లాడుకొని సైకిలు బాబా ఆశ్రమానికి తీసుకొని వెళ్ళమని అడిగాము. నిజానికి మేము బ్రాహ్మణ కరివేన సత్రంలో బస చేద్దామని అనుకున్నాము. కాగా ఆ సత్రం పేరు చెపితే టాక్సీవాళ్ళు తెలియదనటంతో దానికి సమీపంలోని సైకిలు బాబా ఆశ్రమం అని   చెప్పాము. ఒక అర్ధగంటలో బెంగాలీ టోలి (బెంగాలు ప్రైమరీ స్కూల్ ) వద్ద  రోడ్డు మీద మా కారు ఆపి ఈ సందులోంచి వెళ్ళండి సందులోకి కారు రాదనీ చెప్పాడు డ్రైవరు. టాక్సీ డ్రైవరుకు 750 రూపాయలు చెల్లించి తినటానికి ఏదైనా దొరుకుతుందా అని అక్కడ చుస్తే ఒక రోడ్డుప్రక్క దోశ బండి కనిపించింది. బ్రతుకు జీవుడా అని తలా ఒక దోశ తిన్నాము. దాని రుచి కూడా మాకు తెలియటెడు. బండివాడు దోశ లను తయారు చేస్తుంటే నేను ఆ సందులో కొంతదూరం నడచి విచారించ ప్రయత్నించాను. సందులో నాకు ఒక ముగ్గురు మనుషులు కనిపించారు అందులో ఇద్దరు పెద్దవారు ఒక బాలిక వున్నది. వాళ్ళు తెలుగులో మాట్లాడుకోవటం నాకు ఆశ్చర్యం కలుగచేసింది. నేను తెలుగులో ఇక్కడ కరువేనా సత్రం ఎక్కడో మీకు తేలుసా అని అడిగాను. ఈ సందులోంచి చివర వరకు వెళ్ళండి అని అన్నారు.  ఆ సందు ఒక 5-6 అడుగుల వెడల్పు కన్నాలేదు. ఇంకా ముందుకు చాలా ఇరుకుగా వుంది. కాశీలో సందులు చిన్నగా ఉంటాయి అని అప్పుడు నాకు తెలిసింది. విద్యుత్ దీప కాంతితో సందు దేదీప్యమానంగా వుంది.  నేను  వచ్చి మా వాళ్లతో పాటు ఒక దోశ తిన్నాను. తరువాత ఎవరి బ్యాగు వాళ్ళం తగిలించుకొని సందులో ప్రయాణం అయ్యాము. నడచి, నడచి, నడచి చూసుకుంటూ వెళితే మాకు అఖిల భారతీయ బ్రాహ్మణ కరువేనా సత్రం కనిపించింది. అది చూడటానికి ఒక చిన్న ఇల్లుమాదిరిగా వుంది. మేము లోపలి వెళ్లగా అక్కడ ఒకరు  వున్నారు. మాకు రూము కావలి అని అడిగితె రెండవ అంతస్తులో ఎసి రూము వుంది రోజుకు కిరాయి 1200 అని చెప్పి అతని హెల్పరుకు మాకు రూము చూపించమని చెప్పాడు. 

మీరు డబ్బులు రేపు  చెల్లించండి ముందు  గదిలోకి వెళ్లి విశ్రాన్తి తీసుకోండని ఆయన అన్నారు. అయన పేరు సుధాకర్ అని చెప్పారు. మేము కాలాతీతం చేయకుండా రూముకు వెళ్ళాము. అక్కడి మెట్లు చాలా ఇరుకుగా ఎత్తుగా వున్నాయి. ఎలాగో ఆలా మెట్లు ఎక్కి రూములోకి వెళ్ళాము. మేము వెంట తెచ్చుకున్న నీళ్ల బాటిలులోని నీళ్లుతాగి బ్రతుకు జీవుడా అని ప్రక్కమీద మేను వాల్చాము. నేను  ఉదయం 3 గంటలకు లేచి దంతధావన చేసి తరువాత స్నానం చేసే సరికి దాదాపు 4 గంటలు కావచ్చింది.  నా శ్రీమతిని, కుమారుడిని లేపి వాళ్ళను కూడా త్వరగా కాలకృత్యాలు తీర్చుకోమని చెప్పాను . మేము ముగ్గురం ఉదయం 5 గంటలకు తయారు అయి రూము బయటకు వచ్చాము. మాకు దోవ క్రొత్త నా కుమారుడు గూగులు మ్యాప్స్ పెట్టి మమ్మలను రోడ్డు మీదకు మార్గదర్శనం చేసాడు. ఒక 15 నిముషాలు నడచి మేము రోడ్డు మీదకు చేరాము. అక్కడ ఒక ఆటో లో మాకు కాలబైరవ డైవ దర్శనం చేయించి తరువాత విశ్వనాధుని ఆలయ దర్శనం చేయించవలెనని అడుగగా అతను నేను కాలాభిరవ దేవాలయానికి తీసుకొని వెళ్లి మిమ్ములను నంది సర్కిల్ దగ్గర దింపుతాను నాకు 300 రూపాయలు ఇవ్వాలని అన్నాడు. సరేనాని ఆటోలో కూర్చున్నాము. దాదాపు ఒక 3 కిలోమీటర్లు తీసుకొని వెళ్లి ఒక సందులో ఆటో ఆపి మీరు ఇటునుంచి వెళ్లి దైవదర్శనం చేసుకొని రండి నేను ఇక్కడే ఉంటానని అన్నాడు. కాలభిరావుని దేవాలయంలో రద్దీ ఎక్కువగా లేదు  మేము ఒక 10-15 నిముషాలలో స్వామి దర్శనం చేసుకొని ఆటో చేరుకున్నాము. ఆటో ఒక 3,4 నిముషాలలో నంది సర్కిల్ చేరింది.  నంది సర్కిల్లో రెండు విపుల మాత్రమే వాహనాలను అనుమతిస్తారు రెండు రోడ్లలో అనుమతించరు. అందులో ఒక రోడ్డు మీద కొంత దూరం వెళ్లిన తరువాత మనం విశ్వనాధ ఆలయం వెళ్లే గేట్లు ఉంటాయి. గేటు నెం 4 క్రొత్తగా నిర్మించారని విన్నాము. మేము గేటు నెంబరు 2 నుండి లోపలి వెళ్ళాము. లోపలి మార్గం చాలా ఇరుకుగా ఉంటుంది. ఒక ముగ్గురు ప్రక్క ప్రక్కగా ఉంటే అటు గోడ ఇటు గోడ ఆనుతుంది కొన్ని చోట్ల ఇంకా ఇరుకుగా కూడా ఉంటుంది. అందులోంచి అక్కడి వారు మోటారు సైకిళ్ళు, స్కూటర్లు నడుపుతూ వెళతారంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇరువైపుల రకరకాల దుకాణాలు. కొన్నిచోట్ల సందులలో అరుగులు కూడా వున్నాయి. ఆ అరుగులమీద కూడా దుకాణాలు వున్నాయి. రాగి, ఇత్తడి సామానులు, రుద్రాక్షమాలలు,  పూలు,మొదలైనవి షాపులలో ఎక్కువగా కనపడతాయి. మారేడు దళాలు, ఉమ్మెత్త కాయలు, జిల్లేడు మొగ్గల మాలలు ఇతర పూలు, స్వీట్లు ఎక్కువగా కనపడ్డాయి. ఆ సందులో చాలా దూరం మాకు ఎటువంటి రద్దీ కనపడలేదు. కొంత దూరం వెళ్లిన తరువాత షాపులలో మీరు ఇక్కడ లాఖరులో మీ ఫోన్లు పెట్టుకోండి ప్రీ మీరు పూలు మాదగ్గర కొంటె చాలు అని అన్నారు. నా కుమారుడు ఒక షాపులో పూలు, స్వీట్లు పెట్టిన బుట్టను అడుగగా అతను రూ. 250 అన్నాడు. నేను 200 బ్యారం చేస్తే అందులోంచి కొన్ని ధ్రవ్యాలను తీసి మాకు ఇచ్చాడు. మేము ఆ బుట్ట పట్టుకొని కొంత దూరం వెళ్లగా అక్కడ ఒక షెడ్డు కనిపించింది. అక్కడ దాకా జనాలు ఎక్కువ లేరు. అక్కడినుంచి లైను మొదలైయింది. ఆడవారికి వేరు మొగవారికి వేరుగా లైన్లు వున్నాయి. అక్కడ చెక్ చేసి లోపలి హాలులోకి మమ్మలను పంపారు. అక్కడ మన దేవాలయాల బారికేట్లు కనిపించాయి. వాటిలో దాదాపు ఒక గంట నడచి మేము విశ్వనాధుని చేరుకున్నాము. ఉదయం 8-30 కల్లా మాకు దర్శనం అయ్యింది. కాసేపు గుడి ప్రాంగణంలో కూర్చున్నాము. అక్కడ బోర్డులు తెలుగులో వ్రాసి ఉండటం ఆనందాన్ని కలుగచేసింది. కాశీలో తెలుగు వాళ్ళు చాలామంది వున్నారు. ఆలయానికి ఒక గోడకు ఆనుకొని ఒక పురాతన మసీదు ఉండటం నాకు బాధ కలిగించింది. 9గంటలకు ఆలయ ప్రాంగణాన్ని వదిలి 10 నిముషాలు  నడచి మేము రోడ్డు మీదకు చేరుకున్నాము. అక్కడ ఒక హోటలులో టిఫినీ చేసాము. తరువాత కొంత దూరం నడచి ఆ ప్రక్కనే వున్నా గంగ ఘాటుకి వెళ్ళాము. పైన ఎండ బాగా ఎక్కువగా వుంది. మేము తిన్న టిఫిన్ ఎప్పుడో ఆవిరి అయ్యింది. ఇక ఎక్కువ సేపు ఎండలో ఉండలేక పోయాము. అక్కడి రోడ్డుకి ఇఱుపేపులా బట్టల దుకాణాలు రోడ్డుమీద వ్యాపారాలు నాకు హైదరాబాదులోని చార్మినార్ సెంటరు లాగ అనిపించింది. కొంత దూరం నడచి ఒక సైకిలు రిక్షా ఎక్కాము . సైకిలు బాబా ఆశ్రమం దాకా రావటానికి 70రూపాయలు  అడిగాడు సరే అని అన్నము. . ఆ రిక్షా సీటు ఎత్తుగా వుంది ఇద్దరు కూర్చోవటానికి కూడా ఇరుకుగా వుంది. మరి నేను యెట్లా కూర్చోవాలని నా కుమురుడు అడుగగా నా సీటు మీద కూర్చో మని అన్నాడు అట్లానే తంటాలు పడుతూ ముగ్గురం కూర్చున్నాము. రిక్షావాలా కొంత దూరం తోసుకుంటూ నడిచి తరువాత తొక్కుకుంటూ చిన్నగా బెంగాలీ టోలి అంటే మా సందు కలిసే రోడ్డు వద్దకు వచ్చి ప్రక్కసందులో కొంత దూరం తీసుకొని వెళ్లి సైకిలు బాబా ఆశ్రమం దగ్గర రిక్షా ఆపాడు. అతను ఎక్కువగా కష్టపడ్డట్లు నేను భావించి వప్పుకున్న దానికన్నా ఎక్కువ అంటే 100 రూపాయలు ఇచ్చి అక్కడినుండి నడుచుకుంటూ సత్రానికి చేరుకున్నాము. సత్రం లో అడిగితె ఇప్పుడు వెళితే మీకు భోజనం పెడతారు అని ప్రక్కనుండి వెళ్ళమని మార్గదర్శనం చేస్తే మేము ప్రక్కవీధిలోని భోజనశాలకు వెళ్లి భోజనం చేసాము. అక్కడినుండి రూముకు చేరుకొని విశ్రాన్తి తీసుకొని మరల సాయంత్రం గంగా నదికి వెళ్ళటానికి ప్లాను చేసుకొన్నాము.   

వైకుంఠపాళి

 *"వైకుంఠపాళి" - కొంచెం పెద్దదే, కానీ "చదివితే జీవితం తెలుస్తుంది."*

తెలుగు తోటలో పండిన విక్రమకేళి - వైకుంఠపాళి

 కేవలం నాలుగు గవ్వలతో మూడో నాలుగో చింత పిక్కలతో (ఆడేవాళ్ళ సంఖ్యను బట్టి) జీవితాన్ని ఆస్వాదించగలిగే, అనుభవించగలిగే, ఎదిరించగలిగే ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే ఈ ఆట తెలుగు వారి సృష్టి. తెలుగు సంస్కృతిలో పుత్రకామేష్టి.

ఇందులో 11 వరుసలుంటాయి. ఒక్కో వరుసలో 11 గడులుంటాయి. మొత్తం 121 గడులు పూర్తయ్యాక 11 గడులలో ‘పరమపదసోపానపటము’ అక్షరాలు రాసి ఉంటాయి. ఆ పైన “ధరసింహాసనమైనభంబు గొడుగై తద్దేవత భృతులై...సిరిభార్యామణియై” అన్నట్లుగా పదిమంది దివ్య పురుషుల మధ్యలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. చివరకు చేరుకోవల్సిన స్థానం అది. అక్కడకు చేరుకొనే వరకు (జీవితమనే) ఆట ఆడుతూ ఉండవలసిందే. ఈలోగా ఒకటి నుంచి 121 వరకు ఎక్కుతూ దిగుతూనే ఉండాలి. పడుతూ లేస్తూనే ఉండాలి. అంటే పరమపదాన్ని చేరుకునే వరకు ఈ జనన మరణ సంసార చక్రంలో పడుతూ లేస్తూ ఉండటం తప్పదని హెచ్చరిక.

పదకొండు అంటే సంస్కృతంలో ఏకాదశి. ఏకాదశీవ్రతం భారతీయులందరికీ ఆచరణీయం. ఏకాదశి మహా పర్వదినం. ఆ రోజు ఉపవాసం, జాగరణ, దైవస్మరణం అనే మూడూ తప్పని సరి. అలా 11 ఏళ్ళు వరుసగా ఏకాదశీ వ్రతం చేస్తే పరమపదం చేరుకోవచ్చనేది పురాణ కథనం. అయితే ఇదంతా ఆధ్యాత్మికం.

గెలుపోటములు మానసికానుభూతులు. పరమపదం చేరుకోవడం ఆధ్యాత్మిక పరమార్ధం. ఇదొక రకంగా అరచేతిలో వైకుంఠం. ఇందులో గొప్ప వ్యక్తిత్వ వికాస సూత్రాలున్నాయి. నీ ఉన్నతి నీ చేతిలోనే ఉందని చెప్పడం. గవ్వలతో గెలవగలవని జీవితం కోసం ‘రవ్వ’ పెట్టుకోవద్దని ఉపదేశం.

ఇందులో చాలా గళ్ళలో ఏదో ఒక బొమ్మ, దానికో పేరు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని గళ్ళు అడ్డంగా దాటేస్తూ నిచ్చెనలు ఊరిస్తాయి. కొన్ని గళ్ళు అమాంతం దించేస్తూ ఉంటాయి. అంతలో ఉత్సాహం అంతలోనే నిరుత్సాహం. అంతిమంగా ద్వంద్వాతీతమైన పరమశాంతి. ఇదీ ఆట నడిచేతీరు.

ఈ ఆటలో పాములు, నిచ్చెనల గడుల్లోని పేర్లను నిశితంగా పరిశీలిస్తే అద్భుత రహస్యాలు కనిపిస్తాయి. ఉదాహరణకు 75వ గడిలో ఒక పాము తల దగ్గర కర్కోటకుడు అని రాసి ఉంటుంది. దాని తోక 10వ గడిలోకి పాకుతుంది. అక్కడ పంది బొమ్మ ఉంటుంది. పాము కరవడం వల్ల కిందికి రావడం అనేది పైకి కనిపించే విషయం. జీవితంలో కర్కోటకంగా వ్యవహరిస్తే వచ్చే జన్మలో పందైపుడతావనేది ఆధ్యాత్మిక హెచ్చరిక. పందిలా హీనంగా చూస్తారనేది వ్యక్తిత్వ పాఠం.

అలాగే 55వ గడిలో ఒక పాము తల ఉండి దుర్యోధనుడు అని రాసి ఉంటుంది. దాని తోక 12 వ గడిలోకి పాకుతుంది. 43 గడులు కిందికి జారిపోవడం పైకి కనిపించే ఓటమి. దుర్యోధనుడు అసూయకు ప్రతిరూపం. దాని వల్లే కురు వంశ క్షయం. అలానే... మనమూ అసూయపడితే జీవితం నరకప్రాయమవుతుందని, సుఖ శాంతులు నశిస్తాయని హెచ్చరిక.

పాముల అమరిక ఇంత అర్ధవంతంగా ఉంటే నిచ్చెనల ఏర్పాటు మరింత పరమార్ధ బోధకంగా ఉంటుంది. 63వ గడిలో ఒక నిచ్చెన అడుగు భాగం ఉంటుంది. అక్కడ భక్తి అని రాసి ఉంటుంది. ఒక భక్తుని బొమ్మ ఉంటుంది. దాని కొస 83వ గడి వరకూ సాగుతుంది. అక్కడ బ్రహ్మలోకం అని రాసి ఉంటుంది. బ్రహ్మదేవుని చిత్రం ఉంటుంది. భక్తిగా ఉండటమే బ్రహ్మలోకానికి చేరే ఉపాయమన్నది పరమైతే..ఏ పనైనా దాని మీద భక్తితో చేస్తేనే మంచి ఫలితాలొస్తాయన్నది ఇహం.

అలాగే 65వ గడిలో ఒక నిచ్చెన మొదలు ఉంటుంది. అక్కడ చిత్తశుద్ధి అని ఉంటుంది. దాని కొస 105వ గడిలో ఉంటుంది. అక్కడ మహాలోకం అని ఉంటుంది. మొత్తం వైకుంఠపాళిలో ఇదే పెద్ద నిచ్చెన. 40 గడులు అమాంతం ఎగబాకవచ్చు. ఇదంతా పైకి ఆశ పెట్టే విధానం. చిత్తశుద్ధి ఉంటే మహాలోకాలు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాయని అంతరార్ధం. లోకంలో మహానుభావుడిగా కీర్తిపొందుతారని విశేషార్ధం. ఏ చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఇవాళ దేశం అవినీతి ఊబిలో కూరుకుపోయిందో అటువంటి చిత్తశుద్ధి ప్రాధాన్యాన్ని చిన్నతనంలోనే పిల్లలకు ఆటల రూపంలో నేర్పిన ఏకైక జాతి మన తెలుగుజాతి.

ఇంత గొప్ప విషయాన్ని చెబుతూనే చెంతనే పొంచి ఉన్న ముప్పును గుర్తించి జాగ్రత్త పడమనడం ఈ ఆట ప్రత్యేకత. సాధారణంగా 105వ గడి వరకు రాగానే ఆటగాడికి కొంచెం గర్వం వస్తుంది. ఇంక 16 గడులు దాటితే పండిపోయినట్లే కదా అనుకుంటాడు. అక్కడే ఎదురవుతుంది పెద్ద ప్రమాదం. 106వ గడిలో అరుకాషుడు అనే అతి పెద్ద సర్పం ఉంటుంది. దాని నోట్లో పడితే అమాంతం కిందికి జారి మొదటి గడిలోకి అంటే కోతి లోకి వచ్చి పడతాడు. అంటే ప్రముఖుణ్ణి (సెలబ్రిటీ) అయ్యాను కదా అని గర్వించి ఒక్క పొరపాటు (ఒకటి వెయ్యడం)చేసినా మళ్ళీ ఆట మొదటికి రావడం ఖాయం అని హెచ్చరించడం అన్నమాట. పైగా వైకుంఠపాళి పరిభాషలో ఒకటిని గుడ్డి అంటారు. అంటే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా గర్వించి ఒక్క గుడ్డి పనిచేసినా మళ్ళీ కిందకి జారిపోవడం తప్పదని చెప్పడం.

ఇంత జరిగినా ఆట మానకూడని పరిస్థితి ఇందులో విచిత్రమైన విషయం. ఒకడు పెద్దపాము నోట్లో పడినా ఇంకొకడు ఇంకా పడలేదు కాబట్టి అతను ఇతన్ని ఆడమని ప్రోత్సహిస్తాడు. ప్రత్యర్ధిని సైతం బాగా ఆడమని ప్రోత్సహించే ఏకైక క్రీడ బహుశా వైకుంఠపాళీయే నేమో!

ఇంతకీ చివిరిదైనా చిన్నది కాని విషయం మరొకటుంది. చివర 121 వ గడిలో కూడా ఒక పాము ఉంటుంది. దానిపేరు అహంకారం. దానితోక 99 వ గడిలోకి ఉంటుంది. అంటే 106 లో అరుకాషుణ్ణి దాటినా, 115లో వైకుంఠంలో ప్రవేశించినా, 117లో కైలాసంలో దివ్యానుభూతి పొందినా చివరలో 121 లో అహంకారానికి లోనయితే తిరిగి రాక్షస జన్మ తప్పదు అని హెచ్చరిక. బ్రహ్మరుద్రాది దేవతల్ని తపస్సులతో ప్రసన్నం చేసుకొని మహాభోగాలు అనుభవించి లోకాలన్నీ జయించిన హిరణ్యకశిప, రావణాసురాది వీరులు చివరకు రాక్షసులై దుర్మరణం పాలుకావడానికి ఈ అహంకారమే కారణం కదా!

అంతిమంగా అహంకారం, మమకారం అనే రెండిటినీ జయించినవాడే పరమపదం చేరుకోగలడని సారాంశం.

జీవితమే ఒక వైకుంఠపాళి

నిజం తెలుసుకో భాయి!

ఎగరేసే నిచ్చెనలే కాదు

పడదోసే పాములు ఉంటాయి

చిరునవ్వులతో విషవలయాలను

ఛేదించి ముందుకు పోవోయి.

ఈ చలనచిత్రగీతం ఒక ప్రాచీన శ్లోకంలా, ఒక ప్రబంధ పద్యంలా, ఒక భావకవితలా, ఒక అభ్యుదయ గేయంలా ఎప్పుడూ తెలుగువారి చెవుల్లో మారుమోగుతూ గెలుపుకోసం వెన్ను తడుతూనే ఉంటుంది.🙏👏🤝👍🦜

Panchaag