10, అక్టోబర్ 2024, గురువారం

Palupu taadu పలుపు త్రాడు


 పలుపు తాడు

ప్రస్తుత సమాజంకు పలుపు తాడు అంటే ఏమిటో తెలియదు కానీ గ్రామీణ జీవనం చేసే వారికి పలుపు తాడు చిరపరిచయం వున్న మాటపలుపు తాడు అంటే పశువులను కట్టేసే త్రాడుఇది ఒకవైపు పశువు మెడ చుట్టూ కట్టే విధంగా ఉండి మరొకవైపు ఒక గుంజకు (స్తంబానికి )కట్టటానికి వీలుగా ఉంటుందిపలువు మేడలో  తాడు కట్టి గుంజకు కట్టి వున్నట్లయితే  పశువు కొట్టాన్ని (షెడ్డువదలి వెళ్ళదు . ఉదయం గోపాలుడు వచ్చి  పలుపు తాడును తీసి పశువులను మేపటానికి అడవికి తీసుకొని వెళ్లి మరల సాయంత్రం వచ్చి కొట్టంలో గుంజకు కట్టివేయటం రైతుల దినచర్యపలుపు తాడు పరిధిలోనే పశువులు సంచరించగలవు అంటే  త్రాడు నిడివికన్నా దూరంగా అవి వేళ్ళ లేవువాటి ముందు మేత (గడ్డికుడితి ఏర్పాటు చేసి రైతు వెళతాడు.  అవి వాటికి ఆకలి వేసినప్పుడు గడ్డి తిని కుడితి తాగుతాయి.

ఒక రోజు ఒక రైతు తన వద్ద వున్న ఒక పశువుకు పలుపు తాడు కట్టడానికి ప్రయత్నిస్తే  తాడు రోజు పసువు మల మూత్రాదులతో తడిసి ఉన్నందున చీకి తెగిపోయి వున్నదిమిగిలిన తాడును కలిపి ముడి వేయ ప్రయత్నిస్తే అది చాలా పోట్టిగా వుందిఇక  పశువుకు వేరే తాడు కట్టటం  మినహా ఇంకొక మార్గం లేకపోయిందిసమయానికి అతని వద్ద ఇంకొక త్రాడు లభ్యం కానందువల్ల ఏమి చేయాలా అని అలోచించి అక్కడ వున్న కొన్ని గడ్డి పోచలను పశువు మెడచుట్టు త్రాడు కట్టినట్లుగా త్రిప్పినాడటమరుసటి రోజు గోపాలుడు వచ్చి  పశువుకు త్రాడు లేకపోవటం గమనించి దానిని తోలుకొని పోవటానికి ప్రయత్నిస్తే అది అక్కడి నుండి కదలటం లేదుఇదేమి ఆశ్చర్యం మేడలో పలుపు లేనే లేదు కానీ పశువు మాత్రం కదలటం లేదు అని  రైతుకు చెపితే అప్పుడు రైతుకు గత దినం తానూ చేసిన పని గుర్తుకు వచ్చి మరల కొన్ని గడ్డి పోచలను తీసుకొని దాని మెడచుట్టు త్రాడు విడతీస్తున్నట్లు త్రిప్పాడట అప్పుడు  పశువు అక్కడినుండి కదిలి గోపాలునితో అడవికి వెళ్ళిందినిజానికి అప్పటిదాకా  పశువు తన మెడకు పలుపు తాడు లేకపోయినా ఉన్నట్లు భ్రాంతిలో ఉండీ వుంది .  అందుకే అక్కడినుండి కదల లేదు.

సాధక మిత్రమా నిజానికి ప్రతి సాధకుడు కూడా కేవలం  పశువు లాగానే ఆలోచిస్తున్నాడుతన మెడకు పలుపు తాడు లేకపోయినా ఉన్నట్లు భ్రాంతిలో ఉండీ వుంటున్నారు.ప్రతి మనిషి  చెరా చెర ప్రపంచంలోకి అంటే  జగత్తులోకి ఒంటరిగానే వస్తువున్నాడుఅంతే  కాదు  జగత్తుని నిష్క్రమించే వేళ ఒంటరిగా వెళుతున్నాడుఇంకొక విషయం ఏమిటంటే తానూ ఉన్నన్ని రోజులు ఇది నాది అది నాది వీరు నా వాళ్ళు నా భార్య నా భర్త నా పిల్లలు నా సోదరులు నా సోదరీమణులు అని భావిస్తూ ఒక గిరి గీసుకొని బ్రతుకుతున్నారు రకంగా అయితే పశువు తన మెడకు పలుపు తాడు ఉండి దాని పరిధిలో ఉంటున్నట్లునిజానికి పశువు తన మెడకు పలుపు లేకపోయినా రైతు తెలివిగా దానికి పలుపు తాడు ఉన్నట్లు బ్రాంతిని కలుగచేస్తే అదే నిజమని అనుకొని  పలుపుకు కట్టుబడి ఉన్నట్లుమనము కూడా  భగవంతుడు కల్పించిన శారీరిక బంధాలను శాశ్వితమైన బంధాలు అని అనుకోని వాటి పరిధిలోనే ఉండటమే కాకుండా వాటివరకు పరిమితం అయి అవే శాశ్వితం అని అనుకోని వాటి వెంటే జీవితాన్ని గడిపి అమూల్యమైన కాలాన్ని వృధా చేస్తూ విలువైన మానవ జీవితాన్ని శాశ్వితము నిత్యమూ అయినా బ్రహ్మపదం వైపు నడపకుండా మరల  జీవన మరణ చక్రంలో పరిబ్రమిస్తూవున్నామునిజానికి సాధకునికి సంసారం ఒక బంధనం కానే కాదుప్రతి సాధకుడు సాధారణ సంసారిక జీవనం చేస్తూ మోక్ష పదాన్ని చేరుకోవచ్చు.

 

కాకపొతే సాధకుడు గమనించవలసిన విషయం ఏమిటంటే తన సాధనకు ఏవి ఏవి అవరోధాలుగా ఉంటున్నాయి అని తెలుసుకొని  తెలివిగా అధిగమించాల్సి ఉంటుంది.

త్రివిధ అవరోధాలుప్రతి సాధకుడు మూడు విధములైన అవరోధాలను అధిగమించవలసి ఉంటుందని మన మహర్షులు వక్కాణించారు

1) ఆద్యాత్మికంఅంటే సాధనకు సాధకుని శరీరం సహకరించక పోవటంఉదాహరణకు సాధకుడు అనారోగ్యంతో ఉంటే శరీరము సాధనకు సహకరించదుఅంతే కాక బద్దకం అంటే తామస ప్రవ్రుత్తి కలిగి వున్నా సాధనకు ఉపక్రమించలేడు.

2) అది భౌతికము అంటే తన చుట్టు ప్రక్కల పరిసరాలు ప్రజలు తన సాధనకు అవరోధం కలిగించటంఅంటే సాధకుడు సాధనకు ఉపక్రమించినప్పుడు ఎక్కడో యేవో ధ్వనులులేక పరిసరాలలో కాలుష్యలో ఇతరులు లేక ఇతర జంతువులు కలిగించటం మొదలైనవిఇటీవల  సాధకుడు ఇంకొక విషయాన్ని  కోవకు చెందినదిగా తెలుసుకున్నాడుఎవరో మిత్రుడు భక్తి మార్గంలో వెళుతుంటాడుమంచిదే కానీ తానూ అంతటితో ఆగడు సాధకుని మిత్రుడు అవటం చేత సాధకుని నిరుత్సాహపరుస్తాడు ఎలాగంటె కలి యుగంలో జ్ఞ్యాన మార్గంతో పనిలేదు  కేవలం స్మరణాత్ ముక్తిహి అని అన్నారు కాబట్టి నీవు కూడా నామ స్మరణ చేయి లేక ఇంకొక నోమో వ్రతమోయజ్ఞమో చేయి అని తాను చేసిన చేస్తున్న దైవ కార్యాన్ని వివరించి అది ఆచరించమని ప్రబోధిస్తూ వుంటారువారి మాట వినక పొతే నీకు ఏమాత్రం భక్తి లేదు అందుకే నేను చెప్పింది వినటం లేదు అనో లేక నీవు కేవలం డాంబికుడివే నీకు ఏమి తెలియకపోయిన అన్ని తెలుసు అని తలుస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటూ ఇతరులను త్రప్పుడు తోవలో సూచనలిస్తున్నావు అని హెచ్చరించాను కూడా వచ్చునుఇవన్నీ ఎందుకు చెపుతున్నానంటే ప్రస్తుత సమాజంలో మన గురుదేవులు ఆది శంకరులు బోధించిన అద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకొని ఆచరించే శక్తి లేకపోవటమే వీటన్నిటికీ కారణాలు.  ఎవరు ఏమి అన్న వాటిని వీటిని లెక్కలో పెట్టుకోకుండా సాధకుడు నిత్యం తన సాధనతో బ్రహ్మ పదాన్ని చేరవలసి ఉంటుందిఅనితర సాధన చేస్తే కానీ మోక్షాన్ని పొందలేరు.

ఇక మూడవ అవరోధాన్ని అది దైవికము అని అంటారు అవి ఏమిటంటే ప్రక్రుతి వలన ఏర్పడే బీబత్సవాలు ఉదాహరణకు తీవ్ర వానలుతుఫానులూ భూకంపాలు ఇతర ప్రళయాలువాటిని మనం అదుపులో వుంచుకోలేవుకానీ జాగ్రత్త వహిస్తే మొతటి రెండు అవరోధాలను సాధకులు అదుపులోకి తీసుకొని రావచ్చు.

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు మీ

భార్గవ శర్మ

 

9, అక్టోబర్ 2024, బుధవారం

హైందవం వర్ధిల్లాలి 25*

 *హైందవం వర్ధిల్లాలి 25*


సభ్యులకు నమస్కారములు.


*ధర్మప్రచారకులు, ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు, హిందూ నాయకులు హైందవ జాగ్రుతికై ప్రజలలోకి రావాలి* vi) :- తెలుగునాట వేద, స్మార్త, వైష్ణవ, శైవ విద్వన్మూర్తులు, పండితులు, ధార్మిక వరేణ్య బిరుదాంకితులు, స్వర్ణ కంకణధారులు, తత్వవేత్తలు, జీయరుస్వాములు, ఎకరాలకొద్దీ మాతృ భూమిని పొందిన ఆశ్రమాధిపతులు, మహా ఘనతవహించిన పీఠాధి పతులు ఇంకా ఎందరెందరో మహానుభావులు. దేశం యావత్తు గమనిస్తే ఇంకా ఎందరెందరో గొప్ప వారు. స్వదేశీ పలుకుబడి కలవారితో బాటు అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన న్యాయవాదులు, పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య ప్రముఖులు, విదేశీ దౌత్యవేత్తలు వీరందరూ భారతీయులే గదా. భారత దేశ మూల మరియు అనాదిగా నెలకొని ఉన్న హిందూ/సనాతన ధర్మానికి, సంస్కృతి, సంప్రదాయాలతో బాటు జనులకు గూడా హాని జరుగుచున్నపుడు, వీరందరూ కేంద్ర మరియు రాష్ర్ట ప్రభుత్వాలను, వివిధ రాజకీయ నాయకులను కలసి పరిస్థితులను సరిదిద్దాలి గదా. 


*ధర్మ సంస్థాపనార్థం మరియు అధర్మమునకు అడ్డుకట్టు వేయుటకు మళ్ళీ శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యుల వారే దివి నుండి భువికి రావల్సిందేనా*. 


భారతదేశ ప్రజలు భగవత్ చింతన లేనివారా, అధార్మికులా అంటే కానే కారు అని ఘంటాపథంగా చెప్పవచ్చును. రుజువులు ఎన్నెన్నో. అసంఖ్యాకంగా దేవాలయాలు దర్శనమిస్తున్నాయి, ఇంకా నిర్మించబడుచున్నాయి. దైనందిక పూజలతో సహా ప్రజలు శ్రీ అయ్యప్ప స్వామి మాలలు ధరిస్తున్నారు, మరికొందరు శ్రీ ఆంజనేయ స్వామి మరియు దుర్గా దేవి మండల దీక్షలు చేపడుతున్నారు, ఇవన్నీటితో బాటు వీలుని బట్టి, అవసరమైనప్పుడల్లా ప్రజలు హోమాలు, యాగాలు, యజ్ఞాలు, శాక్తేయ పూజలు, గణేష్ మరియు దేవి నవ రాత్రులు నిర్వహిస్తున్నారు. *ఇవన్నిటి ఉద్దేశ్టమేమిటి, ప్రజలు భక్తులుగా మారి ఏమి నేర్చుకుంటున్నారు*. 


హిందువు అను పదమునకు ఉన్న నానార్థాలలో ఒక అర్థము గురించి పరిశీలిద్దాము. *హింసామ్ దూషయతి ఖండయితి హిందు*. అర్థం:- హింస మరియు దూషణ ఎక్కడ ఉంటుందో వాటిని ఖండించే వాడే హిందువు. *హిందువులుగా మన స్వభావాన్ని మనధర్మాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నాము*. మరింత విపులంగా చెప్పాలంటే *మన జాతిపై పరజాతి వారి హింసాత్మక చర్యలను మాత్రమే ఖండించమని* అర్థము. హింసా చర్యలను ఖండించడానికైనా ప్రతి పౌరుడు ముందుండాలి. హిందూ సమాజ రక్షణకు చుక్కానిగా నిల్చి, జనుల రక్షణ చేపట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్ మళ్ళీ ఉదయించాలా, అంతే సామర్థ్యంతో హిందూ ధర్మ వ్యతిరేకులను నిరోధించిన మహారాజ్ రాణా ప్రతాప్ సింగ్ అరుదెంచాలా. ధర్మ వ్యతిరేకులను ఎదిరించండి అని కురుక్షేత్రంలో నుడివిన శ్రీ కృష్ణ పరమాత్మ మళ్ళీ అవతరించాలా. ఇవన్నిటికి సమాధానం, ప్రజలు, పెద్దలు మరియు మేధావులే సమాధానం చెప్పాలి. *స్వధర్మ రక్షణ, ప్రోత్సాహం నేరం కాదు, కాదు, కాదు*.


హైందవ ధర్మ ప్రచారం కొనసాగిస్తున్న పెద్దలందరికి సవినయ విజ్ఞప్తి. మహానుభావులారా ముఖాముఖి గాని, బహిరంగ సభలలో గాని, వీడియోలలో, Tv మరియు రేడియోలలో గాని మీరు ఎక్కడ ఏ గీతోపదేశము, ధర్మోపదేశము చేసినా, సంప్రదాయ భజనలు గావించినా దయచేసి అరుదెంచిన లేక మీ కార్యక్రమాలను వీక్షిస్తున్న భక్తులకు, శ్రోతలకు *ప్రస్తుతం దేశానికి, ధర్మానికి, సంస్కృతికి, సంప్రదాయాలకు వాటిల్లుతున్న హాని గురించి విశదీకరించి, హిందు సమాజ జాగ్రూతికై*, తప్పనిసరిగా సమయము కేటాయించగలరు. *వినే ప్రజలు క్షేమంగా ఉంటేనే చెప్పే మహానుభావుల ఉనికి మరియు అస్థిత్వము*. ఇది పరమ సత్యము. అన్యధా భావించకండి.


*కావున, మన హిందూ ధర్మానికి సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*


ధన్యవాదములు

*(సశేషం)*

శారదా దేవి దివ్య స్వరూపం!

 శు  భో   ద  యం🙏


శారదా దేవి దివ్య స్వరూపం!  


ఉ:  "  అంబ!  నవాంబుజోత్పల  కరాంబుజ  శారద!  చంద్ర  చంద్రికా


          డంబర  చారుమూర్తి; !  ప్రకట స్ఫుట భూషణ  రత్నదీపికా 

          

           చుంబిత  దిగ్విభాగ , శ్రుతి  సూక్తి  వివిక్త  నిజప్రభావ,   భా

            

           వాంబర  వీధి   విశ్రుత  విహారిణి!  నన్ గృపజూడు  భారతీ!


                 హరివంశము- అవతారిక - ఎఱ్ఱాప్రగ్గడ ;


(నవాంబుజోజ్జ్వలయనిపాఠాంతరము)


మాత  సరస్వతిని  కవులందరూ  స్మరించారు. కానీ , కవిత్రయంలో  తృతీయుడు  ఎఱ్ఱన  ప్రస్తుతించిన  తీరు అబ్బురమైనది.

ఆమూర్తిలోని  అంతస్ఫూర్తి  ,నింత గొప్పగా  ఆవిష్కరించిన  కవి  మరియొకఁడు  కానరాడు. బాహిర స్వరూపము నొక్కింత తడవుచు ఆతల్లి యక్షరామృత  వితరణా శీలమును  యెఱ్ఱన  యీపద్యమున  రూపు గట్టించినాడు.

    

         కఠినపదములకు అర్ధము:- అంబుజము-పద్మము; ఉత్పలము-కలువ; చంద్రిక-వెన్నెల;  చారు మూర్తి-  మనోహరాకారము కలది; రత్నదీపిక- రత్న దీపము; చుంబిత -ముద్దిడుకొను ; శ్రుతి-వేదము; సూక్తి-మంచిమాట;

వివిక్త- విశ్లేషణ;( కాళీప్రదేశమని మరొక అర్ధముంది) భావాంబరము- మనస్సనే యాకాశము; విశ్రుత విహారిణి: ప్రసిధ్ధినొందిన విహారముగలది;


           అప్పుడే వికసించిన పద్మములను,కలువలను బోలిన కరములు గలదానా! చంద్రుని వెన్నెలను బోలిన  మనోహర స్వరూపిణీ! ఆభరణములందు గల దీప సదృశములగు రత్నకాంతులను దిగంత పరివ్యాప్త మొనరించుదానా! వేదవాక్యములయందు  నిరూపింపబడు మహా ప్రభావ శాలినీ!  హృదయాకాశమునందు  స్వేఛ్ఛావిహారమొనరించు  మాతా! 

భారతీ!  నన్ను  దయజూడుము;  అని భావము.


                    ఈపద్యంలో 1  నవాంబుజోత్పల కరాంబుజ!


                                        2భూషణ  రత్నదీపికా చుంబిత  దిగ్విభాగ!

   

                                        3 శ్రుతి సూక్తి  వివిక్త  నిజప్రభావ!

       

                                        4 భావాంబర వీధి విశ్రుత విహారిణి!                      అనే యీనాల్గు  విషయాలూ  విశ్లేషింప దగినవి.

మొదటిది: ఆమె కరములు  అంబుజములట! అంబుజములు రెండురకములు .పగటికి తామరలు పద్మములు.రేయికి కలువలు. ఆమెహస్తము లీ  రెంటిని బోలి యుండునట. రేయింబవళ్ళు  ఆమెచేతులకు పని. యేమిపని? జ్ఙానామృతమును పంచుపని.అక్షరామృతమునందించుపని, పద్మమునందు మకరంద ముండును.మాత సరస్వతి హస్తమున జ్ఙానామృతముండును. దానినామె నారాధించువారికి  రేయింబవళ్ళు వితరణ మొనర్చును. ఆహా! ఎఱ్ఱనగారి యూహ యెంత గొప్పది!!!


               ఇఁక రెండవ యంశము: ఆమెభూషణములు  రత్నదీపములట!ఔను రత్నదీపికలే! శ్రుతులే యామెకు నిజభూషణములు. వాటిప్రభావము విశ్వ వ్యాప్తమేగదా! భారతీయ జ్ఙాన వికాసమునకు వాని వెలుగులే  యాధారము.


            3శ్రుతి సూక్తి  వివిక్త  నిజప్రభావ! వేద సూక్తుల యందు ఆమెప్రభావము  అడుగడుగునా ప్రస్ఫుట మగుట మనకు విదితమే"  అక్షరం పరమంపదం"- ఆఅక్షరమైన పరంబ్రహ్మ  స్వరూపావిష్కరణకు  అక్షరం అవసరంగదా! ఆఅక్షరమే ఆమెరూపము, ఆమెస్వభావము, ఆమెప్రభావము. 


                        4  భావాంబర వీధి  విశ్రుత విహారిణి! హృదయాకాంశంలో  తిరుగు లేని సంచారంచేసే తల్లి.ఆమాట నిజమే!

కానీ, భావాంబరమని  " అంబర"- శబ్దాన్ని యెఱ్ఱన ప్రయోగించుటలో  నేదో ప్రత్యేకత యున్నది. అంబరము అనుపదమునకు 

ఆకాశము  అను నర్ధమేగాక  వస్త్రము  అను నర్ధముకూడా ఉన్నది. హృదయమనే కేన్వాసుపై  చెరగని ముద్రవైచుకొని  యెటుబోయిన నటువచ్చు(మూవీ) స్వరూపముగలదట! ఈచిత్ర మెంత చిత్రము!


                               మనము  మరియొక దాని నుపేక్షించితిమి ." శారద  చంద్ర చంద్రికా డంబర  చారుమూర్తి" శరత్కాలమునందలి చంద్రుని వెన్నెలనుదలపించు చల్లని మనోహర రూపిణి! మాత  సరస్వతి  చల్లనిది. ఆమెకరుణ సూర్యాతపమువంటిదికాదు, చంద్రాతపమును బోలి చల్ల నిది. వెన్నెలను జ్ఙానముగా పెద్దల సూచన! అందుచేత చల్లగ మెల్లగ జ్ఙాన సంపదను యిచ్చుతల్లీ!యని కవియను చున్నాడు.


                              ఇటులీ పద్యము  అనవద్యము  హృద్యమునై  చదువుల తల్లి యంతః సత్త్వమును వ్యక్తమొనర్చు

పరమామ్నాయ  సదృశమై  యొప్పారు చున్నది.


                                                                  స్వస్తి! 🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👏🌷🌷🌷🌷🌷👏

40. " మహాదర్శనము

 40. " మహాదర్శనము " ---నలభైయవ భాగము --జ్యోతిర్దర్శనము


40. నలభైయవ భాగము-- జ్యోతిర్దర్శనము



        యాజ్ఞవల్క్యునికి ఇంతవరకూ లేని ధర్మ సంకటమొకటి ప్రాప్తమైంది . ఇంతవరకూ తన బ్రహ్మ కర్మలు ముగిసిన తర్వాత జపమునకు కూర్చొనేవాడు . 


          ఒక్కో దినము అప్రతిమమైన తేజోమండలము ఒకటి కనిపించేది . అది సర్వ దిక్కులనూ తన వెలుగుతో నింపుతూ అది ఉన్నంత వరకూ తేజస్సు తప్ప ఇంకేదీ కనిపించేది కాదు . అది చక్షుర్గోచరమగు ప్రకాశమా ? లేక అలౌకికమైన ఇంకేదైనా ప్రకాశమా -అనునది తెలుసుకోవలెనని కుతూహలము కలిగేది . అయితే , ఆ మండలము ఉన్నపుడు మాత్రము ఆ కుతూహలమునకు అవకాశమే లేదు . మనో బుద్ధులు ఆ మండలమును తప్ప ఇతరమైన దేనినీ గమనించవు . ఆ తేజస్సు ఎదురుగా ఉన్నపుడు చెవులు బాహ్య శబ్దములను వినుచుండుట లేదు . ఊపిరాడుచుండెడిదో లేదో , అదికూడా తెలియదు . స్పర్శ యైతే ఎక్కడికో పారిపోయి ఉండెడిది . ఆ తేజస్సు లేనపుడే ఈ కుతూహలము కలిగేది , కలిగినపుడు మనసు ," ఇది జాగ్రత్స్వప్నము అయిఉండాలి . మెలకువ లో నున్నట్లే బాహ్య స్మృతి ఉన్నది . కలలో వలె జ్ఞానేంద్రియముల కర్మ నడచుచున్నది . " అంటుంది . ఆలోచనలు దానికన్నా ముందుకు పోయేవి కావు. అక్కడికే తుంచివేసినట్లు కుతూహలమే ఆరిపోయేది .  


          ఇప్పుడు యాజ్ఞవల్క్యునికి అగ్ని దేవుడి ఆదేశము వచ్చినది . " పంచ భూతములను ప్రత్యేక ప్రత్యేకముగా చూడు ." అని . కానీ చూచుటెలా ? ఎటు తిరిగిననూ పంచభూతములనుండీ ఏర్పడిన వస్తుజాలమే కంటికి కనబడుతున్నది . కావలెనన్న , అగ్ని ధ్యానము వలన పంచభూతములు గూడు కట్టుకొని యున్న చేతనా ప్రకాశమును చూడ వచ్చును . తానే ఆ గూడు అనుకొని ఆ చైతన్యము పుట్టుచున్నది . అది గర్భములో నున్నపుడు దానిని మాట్లాడించి చూడవలెను . కానీ బ్రహ్మచారియైన తనకు అదెలా సాధ్యము ? 


ఇలాగ అసాధ్యమైన దానిని వదలి , సాధ్యమైన జపమును చేస్తూ ఉందామా అంటే ఒకసారి ప్రశ్న మనసులోకి వచ్చినాక , ఊరికే కూర్చొనుటకు సాధ్యము కాదు . దీని వలన , దీర్ఘ కాలము జరుగుతున్న జపము కొంచము సేపే క్లుప్త కాలములో జరిగి , మిగిలిన సమయమంతా ఆ విచారములోనే గడచిపోతున్నది . ఒకటే ప్రశ్న. పంచభూతములను ప్రత్యేకముగా చూచుట ఎలా ? వెనుకా ముందూ తిరిగి తిరిగీ అదే ప్రశ్న , అదే ప్రశ్న , అదే ప్రశ్న .


          ఇలాగ ప్రశ్నను ముందుంచుకొని పరిభావిస్తున్నపుడు ఆ దినము ధేనువు మాట్లాడినది జ్ఞాపకము వచ్చినది . ధేనువు చెప్పినదంతా గుర్తొచ్చింది . " ఉత్తరము చెప్పునది ఉదానము . ఉదానపు వెనుకల ఉన్న ప్రాణము వరకూ నా ప్రశ్న పోవలెను . అప్పుడు కోష్ఠగతమైన ప్రాణము , విశ్వములోనున్న ప్రాణమును చేరి , విశ్వపు ఏమూలనో ఉన్న ఉత్తరమును పట్టుకొని తెచ్చును . అయితే , ఇప్పుడు నాకు కావలసినది క్రియ. ఈ క్రియ , మొదట వాగ్రూపముగా ఉత్తరమును పొందవలెను . దానికేమి చేయవలెను ? ... సరే , మొదట వ్యాపారపు కథను విందాము , తర్వాత వ్యాపారము చేయు ఆలోచన " అను సిద్ధాంతమునకు వచ్చినాడు . 


          " ప్రాణదేవుడినే సాక్షాత్కరించుకొని ఏల అడుగరాదు ? " అని ఇంకొక ప్రశ్న లేచింది . అయితే అతడిని అడుగుటకు ఏదో బెదురు . " ’అడగమని అగ్ని దేవుని అనుమతి యైనది’ , అనిన చాలు " అని ఇంకో ధైర్యము . అయినా నిశ్చయము చేసుకోలేదు . ఎందుకో దిగులవుతుంది . " నేనిన్ని దినములు ప్రాణ పరిచర్యను చేసినాను . అదీకాక, ప్రాణ దేవుడు నాకు కొత్తవాడేమీ కాదు , కాబట్టి దిగులెందుకు ? " అని అధైర్యమును పోగొట్టు నమ్మకము ఒకటి . 


ఇలాగే నలిగిపోయి మరలా పయోవ్రతమును ఆరంభించినాడు . ఒక మండలము పయోవ్రత మందుండి ప్రాణదేవుని అడుగవలెను అని నిర్ణయించుకున్నాడు . 


         అయితే , ఇంకొకరి ఆశ్రమములో ఉండి , వారిని అడుగక , తానే స్వతంత్రించుటెలా ? కాబట్టి , ఉద్ధాలకుల అనుమతి పొంది , ఆచార్యాణి అనుజ్ఞతో పయోవ్రతమును ఆరంభించవలెను అనుకున్నాడు .


          ఒక దినము ఆచార్య ఉద్ధాలకులు దిగుపొద్దులో ఆశ్రమపు తల వాకిట్లో ఉన్న రాతి పానుపు పైన కృష్ణాజినమును పరచుకొని కూర్చున్నారు . యాజ్ఞవల్క్యుడు వస్తున్నది చూచినాడు . వారికి యాజ్ఞవల్క్యుడంటే అమితమైన అభిమానము . దానికి తోడు , ఆచార్యాణులనుండీ ప్రాణాగ్ని సంభాషణమును విన్న తరువాత ఆ అభిమానము గౌరవముగా మారింది . ఇప్పుడు వస్తున్న వాడినీ ఆముఖములోని భావమునూ చూచి , " ఏదో అడుగవలెనని వస్తున్నట్లుంది . ఇతడు అగ్ని, ప్రాణ , ఆదిత్యులను వదలి ఇక దేనినీ అడిగేవాడు కాదు , ఏది అడిగిననూ చెప్పవలెను " అనుకున్నారు . వారు తమ అంగాంగములూ యాజ్ఞవల్క్యుని చూచి ప్రసన్నములైనది చూచినారు . ఆశ్చర్యమైనది . అంటే దేవతలు తమ భక్తులను చూచి ఇంత విశ్వాసము చూపెదరా ? ఇకముందు ఏమగునో గానీ , ఈతడి వలన మాకు ఇప్పుడే ప్రయోజనమైనట్లయింది . " అని ప్రసన్నులై, సావధానులై కూర్చున్నారు . 


          యాజ్ఞవల్క్యుడు వచ్చినాడు . వచ్చి , పెద్దవారిని చూచినపుడు చిన్నవారికి కలుగు సహజమైన వినయ విశ్వాసములతో అభివాదనము చేసి ఆశీర్వాదమును పొంది వారి అనుమతితో నేలపైన కూర్చున్నాడు. ఆచార్యుడు వద్దని , ఎవరినో పిలచి లోపలినుండీ ఒక కృష్ణాజినమును తెప్పించి పరచి , దానిపైన కూర్చోమని అన్నారు . యాజ్ఞవల్క్యుడు అటులే చేసినాడు . 


         అదే సమయానికి ఆచార్యాణి కూడా అటు వచ్చి , " చూచితిరా ? ఇదిప్పుడు సరియైన జోడి . ఆ దినము అగ్నిదేవుని అనుమతియైనది . మీరు వచ్చిన తరువాత మీ వద్ద పంచాత్మ సంక్రమణ విద్యనూ , అవస్థా క్రమ విచారమునూ గురించి ప్రస్తావించవలెనని ! ఈ దినము కుమారుడు దానికే వచ్చినాడేమో ? " అన్నారు . 


          యాజ్ఞవల్క్యుడు ఏమి చెప్పవలెనో తెలియక, తల పంకించినాడు . ఆచార్యుడు అప్పుడే సరిగ్గా అన్నాడు , " వాడికేమి , పుణ్యవంతుడు .! వాడు జాతవేదుడు . వాడికి తెలియనిది లేదు . అయినా , రాజ్యపు విస్తారమునూ , వైభవమునూ చూడని యువరాజు వలె ఉన్నాడు . మేమైతే ఎప్పుడో చెప్పినాము , అతడికి కావలసినది అడగవచ్చునని . ఒకవేళ అతడు అడిగే విషయము మాకు తెలియదనుకుందాము , అతనిచేత పరిచర్యలను చేకొన్న అగ్ని ప్రాణులే దానిని చెపుతారు . దీనికి నువ్వే సాక్షి ! " అన్నారు . 


          వారి మాట విని యాజ్ఞవల్క్యునికి ఆలోచనలు చుట్టుముట్టినాయి . వీరు , జాతవేదుడిని అంటున్నారు . ఆచార్యాణి నోటి ద్వారా , అగ్నిదేవుడు సర్వజ్ఞ బీజముందని చెప్పినాడు . అలాగయితే నేను చేయవలసినది ఒక్క తపస్సు మాత్రమే . సకాలములో ఋతులింగ న్యాయము ( బాహ్య ప్రపంచములో ఆయా ఋతువులకు తగ్గట్టుగా చెట్లు , పక్షులు మొదలైన ఆయా గుర్తులు ఎవరి అపేక్ష లేకుండా వ్యక్తమగును --అను న్యాయము ) వలన అది తానే కనిపిస్తుంది . అలాగే కానిమ్ము , నేను ఆగి వేచియుంటే నష్టమేమిటి ? వారినోటనే వస్తున్నది కదా , నన్ను కాపాడుటకు ప్రాణాగ్నులిద్దరూ సిద్ధముగా ఉన్నారని ? " అని ఊరకే కూర్చున్నాడు . 


         ఆచార్యులు , " యాజ్ఞ వల్క్యా , వచ్చిన కారణమేమో చెప్పనేలేదే ? " అన్నారు . అతడేమి చెప్పవలెను , ? తన ప్రశ్నను పక్కకుపెట్టి , " తల్లిగారు అప్పుడే చెప్పినారు , ఇక నేను దానినే మరలా చెప్పుట ఎందుకని ఊరకే ఉన్నాను " అన్నాడు . 


          ఆచార్యులు , ’ అలాగా ? ’ అని వెనక్కు తిరిగి చూచినారు . ఆలాపిని ఒక కృష్ణాజినమును తెచ్చి గడప లోపల వేసుకొని కూర్చున్నది . అది చూచి ఉద్ధాలకులకు బహు సంతోషమైనది . " నువ్వున్నావో లేదో యని తిరిగి చూచితిని . ఇదిగో , చూడు . అమృత మేఘము వచ్చింది . నానుండీ అమృత వర్షము కురిపిస్తున్నది . ఇద్దరం ఆ వర్షపు ప్రయోజనమును పొందెదము " అని యాజ్ఞవల్క్యుని వైపుకు తిరిగినారు . 


          " చూడు యాజ్ఞవల్క్యా , పంచాత్మ సంక్రమణము , అవస్థాత్రయముల విచారములో మొదట అవస్థాత్రయమును తీసుకొనవలెను . ఈ అవస్థాత్రయమును గురించి చెప్పుటకు ముందే చెప్పవలసినది ఇంకాఉంది ,అది విను . అజ్ఞులు ( తెలియని వారు ) అవస్థ నుండీ అవస్థకు ప్రకృతి వశమున వెళ్ళి వచ్చెదరు . విజ్ఞుడయినవాడు ( తెలిసినవాడు ) వాటికి సాక్షి కావలెను . వాడికి కల , నిదుర అనునవి ఒక గది నుండీ ఇంకొక గదికి వెళ్ళివచ్చు నట్లుండవలెను . విజ్ఞుడగువరకూ ఇది సాధ్యము కాదు . ఇది అగువరకూ విజ్ఞుడు కాలేడు . ఇదే ఇక్కడున్న రహస్యము . " 


యాజ్ఞవల్క్యుడు ఒళ్ళంతా చెవులై వింటున్నాడు . ఆలాపిని ఆ విద్య తెలిసినదాని వలెనే అనుసంధానము చేస్తున్నది . అప్పటికే ఆమెకు సాక్షీభావము కూడా వచ్చింది . 


          ఆచార్యులు కొనసాగించినారు : " చూడు , ఈ రహస్యమును తెలుసుకొనుట కోసము ఇంద్రుడు నూటొక్క సంవత్సరములు బ్రహ్మచర్యము పాటించినాడు . ఇంకొక మార్గము ద్వారా దానిని ఛేదించిన యమధర్మరాజు నచికేతునికి ఆ రహస్యమును చెప్పినాడు . జాగృదవస్థ చివర , స్వప్నావస్థ ఆరంభమున ఉన్న స్థితిలో ఈ సాక్షీభావము లభించును . జాగృదవస్థలో కర్మేంద్రియములతో చేరిన మనసు వాటినుండీ విడిపించుకొని స్వప్నపు జ్ఞానేంద్రియములకు ఇంకా దొరకని సంధి సమయములో దీనిని చూడవలెను . మనసు , ఇటు ఇంద్రియాలు అటు బుద్ధి , రెండింటికీ సంబంధించినట్లు ఉంటే , అప్పుడు లాగి కట్టిన తాడువలె జీవము తన సంకల్ప వికల్పములను చేస్తూ కూర్చొనును . అలాకాక, ఇంద్రియ సంబంధమును వదలి బుద్ధికి మాత్రమే సంబంధించునట్లు ఉంటే , మనసు నేలపై పడియున్న తాడు వలె ఏ పనీ లేక , తానున్ననూ లేనట్లే అగును . అప్పుడు కనిపించు జాగృత్ , స్వప్న , సుషుప్తి అను మూడు అవస్థలూ కాక, నాలుగవ అవస్థలో సాక్షి దర్శనమగును . అలాగయినపుడు జాగృత్ కాదు , స్వప్నము కాదు , సుషుప్తి అసలే కాదు , ఈ స్థితిలో కూర్చొని చూచుట నేర్చినవాడికి తత్త్వ దర్శనమగును . ఆ దర్శనము ఇటు జాగృత్తు , అటు సుషుప్తి లను ఆవరించినపుడు ఆ రెండు అవస్థలూ లేకుండాపోవును . ఇలాగ జాగృత్సుషుప్తులు రెండూ ఉన్ననూ లేకుండా పోయినపుడు , ఆ సాక్షీ భావము అంతటా తానే నిండి మహా దర్శనమగును . తెలిసిందా , యాజ్ఞవల్క్యా ? "


         యాజ్ఞాల్క్యుడు వెనుక తనకు కలిగిన జ్యోతిర్దర్శనమును జ్ఞాపకము చేసుకున్నాడు . వాన పడగానే తడిసిపోవు నేల వలె , అతని జీవము తన విశ్వ స్థానమైన భ్రూ మధ్యమును వదలినది .( జీవుడికి విశ్వతైజస్యప్రాజ్ఞుడు అని మూల నామము . భ్రూ మధ్యమము , కంఠము , హృదయము అను మూడు స్థానములు . ) తైజస స్థానమగు కంఠమును ఇంకా చేరలేదు . ఇంద్రయోని స్థానములో ఎవరో పైనుండీ లాగుతున్నారు . కిందకు వెళ్ళకుండా ఎవరో నిలిపివేసినారు . కుమారునికి ఈ విశాల జగత్తంతయూ ఆచార్యుల మాటలలో కేంద్రీకృతమైనట్టుంది . లాగుతున్నది ఎవరు ? తనను కిందకు పడకుండా నిలుపుతున్నదెవరు ? అనునది చూచుటకు కూడా అవకాశము లేదు . దేహమంతా చెవులే అయితే ఎలా వినవచ్చునో అలాగ వింటున్నాడు . 


          ఆచార్యులు దానిని చూచినారు . వారు అతడి దేహమును ప్రవేశించకయే అతడి స్థితిని కనిపెట్టినారు . అంతా అద్దములో చూచినట్లే వారికి స్ఫురించినది . దానిని , అతడి స్థితినీ భార్యకు కూడా చూపించవలెనని వారికి ఇష్టము . అయితే ఆమెకూడా అనుసంధానము చేస్తున్నది . 


         ఆచార్యులు ఒక ఘడియ ఊరికే ఉన్నారు . అప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది : " యాజ్ఞవల్క్యుడు ఇలాగ వ్యాపారవంతుడైనదెలాగ ? తన మాటయొక్క బలము వలన అనునట్లయితే , ఇంతవరకూ ఈ విషయమును అనేకులకు చెప్పియున్నాను . వారెవరికీ మొదటిసారికే ఇలాగ వ్యాపారము ఆరంభము కాలేదు . కాబట్టి ఇది యాజ్ఞవల్క్యుని పూర్వపుణ్యమై యుండవలెను " అనుకున్నారు . 


        అంతలో యాజ్ఞవల్క్యుడు వ్యాపారమును ముగించి బయటికొస్తున్నట్లు కనిపించినది . మరలా అతడిని సంబోధించి అన్నారు : " చూడు యాజ్ఞవల్క్యా , అక్కడున్నపుడే చూడు. నిన్ను కిందకు పడకుండా ఆపుతున్నది ఎవరు ? పైకి లాగుతున్నది ఎవరు ? " ఈసారి మాటలో ఆజ్ఞాభావము ఉంది . పెద్దవారు చిన్నవారికి చెప్పునపుడు కనిపించు వాత్సల్యము , అధికారమూ రెండూ ఉన్నాయి .


       యాజ్ఞవల్క్యుడు చూచినాడు : తనను పైకి లాగుతున్నవి సూర్య కిరణములు . తానున్నది భూమ్యాకాశములు రెండూ కాని అంతరిక్షము . అక్కడ నుండీ కిందకు పడకుండా , తరుణి ఒకతె తన చేతులను చాచి అతడిని పట్టిఉన్నది . ఆమెను అడిగితే , " నేను సూర్యగణమునకు చెందినదానిని . ఇప్పటికింతే చాలు " అని దాక్కుంటున్నది . ఆమె మాయమైనట్లే సూర్య కిరణములు కూడా మాయమగుచున్నవి . అయితే , ఆ పైని లాగుట , కింది పట్టు ఇవి తప్పలేదు . 


      ఆచార్యులు ఆమె ఆడిన మాటను అలౌకిక శ్రవణ శక్తితో విన్నారు . బహు సంతోషమయినది . కుమారుడికి తనకుతానుగా మెలకువ కానీలెమ్మని నెమ్మదితో కాచి కూర్చున్నారు . 


        కొంతసేపటికి యాజ్ఞవల్క్యుడు మేలుకున్నాడు . అంతవరకూ అతడు చేసిన , చేస్తున్న వ్యాపారమంతా తన ముందున్న పాత్రలోని నీటిలో ఈదుతున్న చేపల వ్యాపారము వలె స్పష్టముగా కనపడుచున్ననూ ఆచార్యులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూర్చున్నారు . యాజ్ఞవల్క్యుడు కనులు తెరచి నవ్వుచూ ఆచార్యునికి నమస్కారము చేసినాడు . ఆచార్యులు అడిగినారు : 


" ఏమేమి చూచితివి యాజ్ఞవల్క్యా ? " 


        " ఏమి చెప్పుదును ఆచార్యా ? నేను చూచినది చెప్పుటకు నాకు మాటలు చాలడము లేదు . కాబట్టి కొంచము హెచ్చుతక్కువ అయితే క్షమించవలెను . మొదట భ్రూమధ్యము నుండీ ఏదో ఒక అదృశ్య పదార్థము మెరిసి కిందికి దొరలినట్లాయెను . అప్పుడు నా తల ముందుకు వాలి పడిపోవలసినది . ఎవరో పడుతున్న తలను అలాగే నిలిపివేసినారు . లోపల , పడుచున్న ఆ పదార్థమును ఎవరో ఆదుకొని అక్కడే నిలిపినారు . నేను ఉన్నది భూమికాదు , ఆకాశమూ కాదు అనిపించినది . వెంటనే తానుగా అర్థమైనది , ఇది అంతరిక్షము అని . అక్కడ తమరు చెప్పుచున్నవి , నేనాడినవి మాటలు గా కాకుండా , వ్యాపారమును ప్రచోదించు క్రియల వలె ఉన్నాయి . అటు ఆదిత్యుని కిరణాలు , ఇటు ఆదిత్యగణపు దేవియొకతె , ఇద్దరూ ఒక జ్యోతిర్మండలమును పట్టుకొనియున్నారు . ’ఆ జ్యోతిర్మండలమే నేను ’ అన్నది స్ఫురించుచుండెను . ఆ పక్కలోనే , తమరు చెప్పినట్లు ఒక తాడు వదులుగా వేలాడుతూ యుండెను . ఆ మండలమునకు తానొక సంపుటములో నున్నట్లు తోచినది . తాను జ్యోతియై ఉన్నందు వల్లనో ఏమో , అంతటా జ్యోతియే కనిపించు చుండినది . "


       " ఆ సంపుటమే బుద్ధి , యాజ్ఞవల్క్యా . ఆ వేలాడుతున్న తాడు వలె నిర్వ్యాపారముగా నున్న ప్రకాశమే మనసు . నిన్ను కిందకు పడకుండా పట్టుకున్నామె ఉషా దేవి . ఇదిగో , ఆమెయే వచ్చినది . ఋగ్వేదపు ఉషా సూక్తముతో ఆమెను ఆరాధించు " 


ఆచార్యుల అనుజ్ఞమేరకు యాజ్ఞవల్క్యుడు ఉషా సూక్తమును చెప్పినాడు . అది సామముగా పరిణమించినది . 


ఇటూ ఆచార్యులూ , ఆచార్యణీ ఆ సామము ముగియువరకూ చేతులు జోడించి నిలుచున్నారు . 


        అంతా ముగిసిన తరువాత ఆచార్యులు అన్నారు , " యాజ్ఞవల్క్యా , ఈ దినము నీకు సాక్షీ దర్శనమైనది . ఇకముందు నీకు తత్త్వ శాస్త్రమును అభ్యాసము చేయుటకు అధికారము వచ్చినది . ఇప్పుడు నీకు అయినది దర్శనము . నువ్వు తత్త్వమును సమగ్రముగా తెలుసుకుంటే అది ’ మహా దర్శనమగును ’ . "


        యాజ్ఞవల్క్యుడు ఆచార్యవాక్కును ఆశీర్వాదమని పరిగ్రహించి , నమస్కారము చేసినాడు . ఆచార్యాణి , తనకు నమస్కారము చేయుటకు వచ్చిన కుమారుని వారించి , " అది మాకు మూల స్థానము , అక్కడ అయినదంతా మాకూ అయినట్లే " అని అంటున్ననూ , యాజ్ఞవల్క్యుడు ఆమెకూ నమస్కారము చేసినాడు . 

Janardhana Sharma

39. " మహాదర్శనము

 39. " మహాదర్శనము "--ముప్పై తొమ్మిదవ భాగము-- సర్వజ్ఞుడు 2


39.  సర్వజ్ఞుడు 2



         ఆచార్యాణితో నడచిన సంభాషణ వలన యాజ్ఞవల్క్యునికి జ్ఞానోదయమైనది . తనలో తాను మాట్లాడుకుంటున్నట్లు అన్నాడు ."  అలాగయితే , ఈ చిన్నదీ , పెద్దదీ అనుకుంటూన్న భేదమంతా పరిమాణములోనే కానీ , జాతిలో కాదు ! " 


        దానిని ఒప్పుకున్నట్లు అన్నాడు , " అలాగయితే ప్రకృతి చేతికి దొరకువరకూ ఈ చిన్నతనము . దీని గుర్తుగా శోక మోహములు . ప్రకృతినుండీ ముక్తుడైతే ఇవి లేవు . అప్పటి స్థితి ఏమిటి తల్లీ ? "


         " ప్రకృతి బయట ఉన్నవాడిని శృతీ భగవతి కూడా వర్ణించలేక , ’ మహాన్ ’ అనీ , ’ బ్రహ్మ ’ అనీ ఊరకుండి పోయింది . ఇంకొక చోట బ్రహ్మను గురించి , ’ సత్యం జ్ఞానమనంతం  బ్రహ్మ ’ అన్నది . ఈ వాక్యములో నున్న జ్ఞానము బయటి వస్తువుల విషయమును సంగ్రహించుకొను భాండారము కాదు , యాజ్ఞవల్క్యా , అనుకూల కాలములో మఠములో కనిపించు చిగురు వలెనే  ఇదీ ! . అదీకాక , సంగ్రహ భాండారమైన జ్ఞానము , మనోవృత్తి .  దానిని వదిలితే , అనగా మనసు నుండీ బయటికి పోతే బుద్ధివృత్తి . అక్కడినుండీ కూడా బయటికి పోతే అక్కడ జ్ఞానమే తానై యున్న బ్రహ్మ . అక్కడికి పోవచ్చును . అయితే , చక్కెరను నోట్లో వేసుకుంటే ఎలాగుంది అంటే ’ తియ్యగా ఉంది ’ అనవచ్చు , తీపిని వర్ణించుటకగునా ? అటులనే , దానిని చెప్పుటెలాగో తోచక , ’ అది జ్ఞానము ’ అంటాము , తెలిసిందా ? " 


" తెలిసింది " 


        " ఇప్పుడు నీ ప్రశ్నను తీసుకుందాము . జ్ఞాన రూపియైన బ్రహ్మ పంచభూతములలోనూ , గుణత్రయములోనూ  అనగా , ప్రకృతిలో చేరినందువలన , ఇలాగ చిన్నవాడై యున్నాడు . ఇలాగ ప్రకృతికి చిక్కి , చిన్నవాడయిననూ , తన గుణములను పోగొట్టుకోలేదు కదా ? కాబట్టి అతని సర్వజ్ఞత్వము ఎక్కడికి పోయింది ? " 


" తల్లీ , ఇది నిజంగా ప్రౌఢ వాదము . మాట యొక్క బలము చేత నా నోటిని మూయించినారు , కదా ? . "


       " కాదు యాజ్ఞవల్క్యా , నీ నోరు మూయించే అవసరము నాకు లేదు . నువ్వు నా కడుపున పుట్టిన కొడుకు లాంటి వాడవు . నిజంగా నీకు చెప్పవలెనంటే , ఇంత సేపూ మాట్లాడినది నేను కాదు . నీ ఉపాస్య దేవత యైన అగ్ని దేవుడు . ఔనో కాదో చూడు . "


        యాజ్ఞవల్క్యుడు కన్నులు మూసి అనుసంధానము చేసినాడు . ఇంతవరకూ తన దేహములో , తాను కోరిన చోట దర్శనమిస్తున్న అగ్నిదేవుడు ఇప్పుడు ఆచార్యాణిలో కూర్చొని పలుకుతున్నాడు . దేవుడికి నమస్కారాదులు చెల్లించి , " ఇదేమి విచిత్రము ? ఇందుకేనేమి , ఈ రోజు నాతో జపము చేయించ నియ్యకుండా ఇక్కడికి పిలుచుకు వచ్చినది ? " అని అడిగినాడు . 


        అగ్ని దేవుడు ప్రసన్నుడై , " ఔను , ఇక నీకు దేహ తత్త్వ , మనస్తత్త్వములను బోధించవలెను . ఇప్పుడు చెప్పినది జీవ తత్త్వము మాత్రమే . ఈ దినము నీకు సర్వజ్ఞ బీజపు యోచన వచ్చినపుడు , నువ్వు అడిగి ఉంటే అప్పుడే అక్కడే చెప్పేవాడిని . నువ్వు అడుగలేదు . అందుకని ఇక్కడికి పిలుచుకొచ్చి , ఈ ముఖముగా చెప్పినాను . ఇదంతా మా దేవతల ఆట. ఇప్పటికి ఇంత తెలుసుకో, చాలు " అన్నాడు . 


అగ్ని దేవుని మాట ముగిసిన తర్వాత ఆలాపిని అడిగినది . " నమ్మకము కుదిరిందా? యాజ్ఞవల్క్యా ? " 


" సరే , మరి దేహతత్త్వ , మనస్తత్త్వముల గురించి ఎప్పుడు చెప్పెదరు ? "


        " అది ఇంతవరకూ మాట్లాడినవారి ఇష్టము . నేను ఒకటి మాత్రము చెపుతాను , వినియుండు . వారు తిరిగి వచ్చిన తర్వాత , వారి దగ్గర , ఛాందోగ్యములోని , ఇంద్ర విరోచనోపాఖ్యానమును , తైత్తిరీయపు పంచాత్మ సంక్రమణ విద్యనూ అడుగు . "


       యాజ్ఞవల్క్యుడు సరేనన్నాడు . నమస్కార పూర్వకముగా వీడ్కొని , తన గుడిసెకు వెళ్ళినాడు . దారిలో తనకు కలిగిన అనుభవమును గురించే ఆలోచనలు . 


Janardhana Sharma