23, జనవరి 2025, గురువారం

తెలుగు భాష లో ' తెలుగు ' ఎంత? ఇది

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹మనం మాట్లాడే తెలుగు భాష లో ' తెలుగు ' ఎంత? ఇది ఆలోచించవలసిన ప్రశ్న. మనం వాడుకునే పాలలో  ' పాలు' ఎన్ని? అనే ప్రశ్న లాంటిదన్నమాట. ఈ శీర్షిక భాషలో తమాషాలు లో కూడా తమాషాలు మన పదం కాదు. ఇంకా నిషా, దేశ్, తయారు, దస్తూరీ, ఫర్వాలేదు, వాకబు, మునసబు వంటి అనేకానేక పదాలు తెలుగులో కలిసి పోయి తెలుగే అనిపించేలా అలవాటయిపోయాయి.  ఆ విషయాలు  చక్కగా విశ్లేషించారు ప్రముఖ సాహితీవేత్త డా. తిరుమల నీరజ గారు. విని తెలుసుకోండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కర్మలకు_పద్దెనిమిది 18మందిసాక్షులు..

 మన కర్మలకు_పద్దెనిమిది 18మందిసాక్షులు...........!!

చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత . 

కానీ ..... 


‘నేను ఒక్కడినే కదా ఉన్నాను, 

నన్ను ఎవరూ గమనించడం లేదు’ 

అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు . 


మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి 

నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి . 


వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి . 


ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని, 

వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .

దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు . 


ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి . 


అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి . 


ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి . 


అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు . 

ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .

 

అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు . 

అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .


 కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .


 ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం . 

కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .

 

నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .


 అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం . 


ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .


 ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు .

కాళిదాసు 🙏 రెండవ భాగం

 🙏కాళిదాసు 🙏

                రెండవ భాగం 

కాళిదాసు భారతీయ కవితకి ఆత్మ వంటివాడు. కవిత ఏ రూపాన్నైనా పొంది ఉండవచ్చు. కావ్యం కావచ్చు నాటకం కావచ్చు.కవితాత్మ పాలు కొంతైనా దానిలో ఉంటుంది. ఇలా కాళిదాసప్రభావం తరువాత తరాల కవుల్లో ఉంటూనే వచ్చింది. కాళిదాసు భారతసంతతికి కేవలం కవిత్వాన్నే ఇవ్వలేదు. ఇంకా కొన్ని మౌలిమైన, మేధాపరమైన, సాంస్కృతిక పరమైన ఉపాధుల్ని సమకూర్చాడు. అవేమిటి? కాళిదాసు కవికులగురువు ఎందుకయ్యాడు? 


కవితాత్మలో కొన్ని భాగాల్ని కాళిదాసు ఎలా పండించి పోషించాడు? ఏ విధంగా అతడు మనకి అధ్యాపకుడు? అన్నది స్థూలంగా చర్చించడమే మిగిలిన వ్యాసం యొక్క ముఖ్యోద్దేశ్యం. కాళిదాసు కవిత్వంలో రసజ్ఞత గురించి వేరే చెప్పక్కర్లేదు. అది అన్నివేళలా తొణికిసలాడుతూనే ఉంటుంది. ఇక మిగిలిన విషయాలకొస్తే, ఇంత చిన్న వ్యాసంలో అన్నీ కూలంకషంగా చర్చించడం సాధ్యం కాదు కాబట్టి, కొన్నింటిని కాస్త విశదంగా, కొన్నింటిని స్థాలీపులాకంగా, కొన్నింటి గురించి సూక్ష్మం గానూ చెప్పి ముగిస్తాను.


1. భాష

భాషని నాదయోగంగా భావించినవాడు కాళిదాసు. పలికే మాట (శబ్దం), దానికున్న అర్ధం, వీటి మధ్యనున్న విడదీయరాని అర్థనాదేశ్వరబంధం అర్ధనారీశ్వరబంధంలాంటిదని పూర్తిగా తెలిసినవాడు. కాబట్టే రఘువంశాన్ని,


వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ  


అని మొదలు పెట్టాడు. పైగా వాగర్థప్రతిపత్తి (శబ్దం, అర్థం రెండింటికీ సంబధించిన జ్ఞానం అబ్బడం) కోసమే జగత్తుకి తల్లిదండ్రులైన (పితరౌ) పార్వతిని, పరమేశ్వరుణ్ణీ ప్రార్థిస్తున్నానన్నాడు. పార్వతీపరమేశ్వరౌ = పార్వతీప + రమేశ్వరౌ అని విడదీస్తే శివుడు, విష్ణువు అనే అర్థం వస్తుంది. సంస్కృతభాషలో పితరౌ అంటే ఇద్దరు తండ్రులు అని కూడా అర్థం ఉంది. అందువల్ల ప్రపంచానికి తండ్రులైన శివవిష్ణువులను కూడా ప్రార్థిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. మొదటి శ్లోకంలోనే, వాగర్థప్రతిపత్తికోసం ప్రార్థిస్తున్నా (వందే) అనగానే అది పుష్కలంగా దొరికేసినట్టుంది, వెంటనే పార్వతీపరమేశ్వరౌ అనే గొప్ప శ్లేష చూపాడు.


రమ్యమైన పదాల్తో పూలజల్లులు కురిపించడం, కోమలమైన పదబంధాల్తో కట్టిపారెయ్యడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. సంస్కృతభాషతో పరిచయం తక్కువ ఉన్న (లేదా అసలు లేని) వాళ్ళకి కూడా హృద్యంగా తోచే విధంగా కూడా వ్రాశాడు. కేవలం పదనాదం ద్వారా రమ్యతను సృష్టించాడు. ఋతుసంహార కావ్యంలో కాళిదాసు ఆరు ఋతువుల్నీ ఆరు సర్గల్లో వర్ణించాడు. మచ్చుకి ఋతుసంహారం లోని మూడు శ్లోకాలు చూడండి.


సదా మనోఙ్ఞం స్వనదుత్సవోత్సుకం వికీర్ణ విస్తీర్ణ కలాపి శోభితం

ససంభ్రమాలింగనచుంబనాకులం ప్రవృత్తనృత్యం కులమద్యబర్హిణామ్ – (వర్ష ఋతువు)


(ఎప్పుడూ మనోజ్ఞంగా, శబ్దాలతో కూడిన మహోత్సవంలో తేలియాడుతూ, విస్తరించి విసరబడిన పింఛంతో శోభిస్తూ ఉన్న నెమళ్ళ గుంపులు ఇప్పుడు ముప్పిరిగొన్న ఆనందంలో ఒకదాన్నొకటి కౌగిలించుకుంటూ, ముద్దులాడుకుంటూ నాట్యం చెయ్యడం మొదలుపెట్టాయి. పైన చెప్పిన శబ్దాలు నెమళ్ళ కేకలు కావచ్చు లేదా మేఘాల గర్జనలు కావచ్చు.)


నితాంత లాక్షారసరాగరంజితైః నితంబినీనాం చరణైః సనూపురైః

పదే పదే హంసరుతానుకారిభిః జనస్య చిత్తం క్రియతే సమన్మథమ్ – (గ్రీష్మ ఋతువు)


(దట్టంగా పూసిన లాక్షారసం రంగు వల్ల ఎర్రబడి, అందెలతో కూడిన స్త్రీల పాదాలు అవి వేసే ప్రతీ అడుగులోనూ హంసల ధ్వనులను అనుకరిస్తున్నట్టుగా ఉన్నాయి. అది విన్న జనులందరి మనస్సులూ మన్మథప్రభావాన్ని పొందుతున్నాయి.)


ఆమ్రీ మంజులమంజరీ వరశరః సత్కింశుకం యద్ధనుః

జ్యా యస్యాలికులం కలంకరహితం ఛత్రం సితాంశుః సితం

మత్తేభో మలయానిలః పరభృతా యద్ద్వందినో లోకజిత్

సోఽయం వో వితరీతరీతు వితనుర్భద్రం వసంతాన్వితః – (వసంత ఋతువు)


(ఎవడి గొప్ప బాణాలు అందమైన ఆకర్షణీయమైన మామిడిపూల గుత్తులో, ఎవడి విల్లు మోదుగపువ్వో, ఎవడి వింటినారి తుమ్మెదల బారో, ఎవడి మచ్చలేని తెల్లని గొడుగు తెల్లని కిరణాల్తో కూడిన చందమామో, ఎవడి మదపుటేనుగు గంధపుచెట్లున్న మలయపర్వతపు వాయువో, ఎవడి వంది జనం (స్తోత్రపాఠాలు చేసేవాళ్ళు) కోకిలలో, అటువంటి లోకాల్ని జయించే మన్మథుడు, తన స్నేహితుడైన వసంతుడితో కలిసివచ్చి (అంటే వసంతకాలంలో) మీ అందరిమీదా సుఖభాగ్యాల్ని వెదజల్లుగాక! )


ఋతుసంహారం కాళిదాసు తొలిరోజుల్లో వ్రాసినది. రాను రాను, పదలాలిత్యానికి గాఢమైన భావాల్ని కూడా జోడించి తన భాషకీ, పదనాదానికీ కొత్త రంగులు దిద్దాడు. తరువాత వ్రాసిన రఘువంశ, కుమారసంభవ, మేఘదూత కావ్యాల్లో ఇది బాగా కనిపిస్తుంది. ఆ కావ్యాలు చదివి ఆనందించాలంటే సంస్కృతభాష నేర్చుకోవాలి. శ్రీమద్రామాయణం చదవాలంటే కొద్దిగా భాష తెలిస్తే చాలు. ఒక విధంగా చెప్పాలంటే, ఏ భాషవాళ్ళకి, ఆ భాషలో వాల్మీకి మహర్షి వ్రాసిన పాటలా ఉంటుంది. శ్లోకంలో ఉన్న పదాల్ని గద్యక్రమంలో (కర్త-కర్మ-క్రియ వరసలో) పేర్చుకుని అర్థం చేసుకోవడం చాలా సులువు. కాళిదాసు కావ్యాలకొస్తే, ఋతుసంహారంలో తప్ప మిగిలిన కావ్యాల్లో శ్లోకాల్ని గద్యక్రమంలో పేర్చుకోవడం, కొన్ని పదబంధాలకి అర్థాన్ని తెలుసుకోవడం అంత సులువు కాదు. భాషను ఒక గురువు దగ్గర నేర్చుకోవాలి. ఆ పరిణామాన్ని పై మూడు శ్లోకాల్లోనే చూడవచ్చు. వీటిలో మూడవ శ్లోకం ఋతుసంహారంలో ఆఖరి సర్గ అయిన వసంతర్తువులో ఆఖరి శ్లోకం.


ఇలా భాషను నేర్వగా, నేర్వగా ఈ క్రింద చెప్పిన లాంటి శ్లోకాల్లో, గీతరచయిత వేటూరి చెప్పినట్టుగా ‘ఆరు ఋతువులూ ఆహార్యములై’ కనిపిస్తూంటే, భావాల విందు, నాదాల పసందు రెండింటినీ అనుభవిస్తాం.


అది కుబేరుడి అలకానగరం అవడం వల్ల అన్ని ఋతువులూ అన్ని వేళలా ఉంటాయి. అందువల్ల అక్కడి వనితలు అన్ని ఋతువుల పువ్వుల్నీ అన్ని వేళలా దేహమంతా ధరిస్తారని మేఘుడికి (మబ్బుకి) యక్షుడు చెప్తున్నాడు.


హస్తే లీలాకమల మలకే బాలకుందానువిద్ధం

నీతా లోధ్రప్రసవరజసా పాండుతామాననే శ్రీః

చూడాపాశే నవకురువకం చారు కర్ణే శిరీషం

సీమంతే చ త్వదుపగమజం యత్ర నీపం వధూనామ్ – (మేఘసందేశః 2-2)


[యత్ర= ఏ (అనగా ఆ కుబేరుని అలకానగరంలో); వధూనామ్ = స్త్రీల యొక్క; హస్తే = చేతిలో; లీలా కమలమ్ = విలాసం కోసం పట్టుకున్న తామరపువ్వు (ఇది శరదృతువులో లభిస్తుంది); అలకే = ముంగురుల్లో; బాలకుందానువిద్ధమ్ = తురుముకోబడ్డ అప్పుడే విరిసిన మల్లెలు (ఇది హేమంత ఋతువులో లభిస్తుంది); ఆననే = ముఖం మీద; లోధ్రప్రసవరజసా = లొద్దుగ పువ్వుల పుప్పొడిచేత  నీతా= ఇవ్వబడిన; పాండుతామ్ శ్రీః= గౌరవర్ణపు శోభ (లొద్దుగ శిశిర ఋతువులో లభిస్తుంది); చూడాపాశే = కొప్పు ముడిలో; నవకురువకం = ఎర్ర గోరింట పువ్వు (ఇది వసంత ఋతువులో లభిస్తుంది); కర్ణే = చెవియందు; చారు శిరీషం = అందమైన దిరిసెన పువ్వు (ఇది గ్రీష్మ ఋతువులో లభిస్తుంది); సీమంతే = పాపటలో; త్వత్ =నీ; ఉపగమజం = రాక వల్ల పుట్టిన (వర్షాకాలం లో లభించే); నీపం చ = నీపకుసుమమూ ఉంటాయి


ఈ విధమైన భాషావికాసమే కాళిదాసుని కవికులగురువుగా మాత్రమే కాదు, సంస్కృతగురువుగా కూడా నిలబెట్టింది. సంస్కృతం నేర్చుకోవడంలో మొదటి భాగం పంచకావ్యాలు గురువు దగ్గర కూర్చుని చదివి అర్థం చేసుకోవడం. పంచకావ్యాలంటే రఘువంశం (కాళిదాసు), కుమారసంభవం (కాళిదాసు), కిరాతార్జునీయం (భారవి), శిశుపాలవధం (మాఘుడు), నైషధీయ చరితం (శ్రీహర్షుడు). దాక్షిణాత్యులు కొందరు నైషధీయ చరితం బదులు మేఘసందేశం (కాళిదాసు) అని అంటారు. ఏ లెక్కన చూసినా, అధ్యయనం విషయానికొస్తే, కాళిదాస గ్రంథాలకే పెద్దపీట. భాష నేర్వాలన్నా, భాషాసౌందర్యాన్ని అనుభవించాలన్నా కాళిదాసే.


ఆ కావ్యాల్ని చదవడం కూడా పైన చెప్పిన వరస లోనే చదవాలి. అప్పుడే భాషని సవ్యంగా నేర్చుకోగలుగుతాం. రఘువంశంలో భాష సరళంగా ప్రారంభమై, ఒక కావ్యాన్నుండి మరో కావ్యానికి వెడుతూంటే సంక్లిష్టంగా మారుతూ విద్యార్థుల మెదడుకి పరీక్షలు పెడుతుంది. అందుకే, నైషధం విద్వదౌషధం అనే సామెత. ఈ పాఠ్యప్రణాళికలో, కాళిదాసు విద్యార్ధులకిచ్చిన గొప్ప బహుమతి రఘువంశం నుంచీ కూడా కవితాసువాసనల్ని వెదజల్లడం. ఒకప్రక్క భాషని నేర్చుకుంటూండగానే, అద్భుతమైన భావసంపదలో చదువుకునే వాళ్ళని ముంచి తేల్చడం. భాషావిషయమైన అంతరార్ధాల్ని తెలియజెప్పడం. (రఘువంశం మొదటి శ్లోకంలోనే చూడండి. పదానికీ, దానికుండే అర్థానికీ గల సంబంధంతో మొదలు పెట్టాడు కావ్యాన్ని.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

గురువారం🌷* *🌹23, జనవరి, 2025🌹* *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🌷గురువారం🌷*

*🌹23, జనవరి, 2025🌹*  

     *ధృగ్గణిత పంచాంగం*


  *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - కృష్ణపక్షం*

*తిథి      : నవమి* సా 05.37 వరకు ఉపరి *దశమి*

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే )

*నక్షత్రం  : విశాఖ* (24) తె 05.08 వరకు ఉపరి *అనూరాధ*

*యోగం  : గండ* (24) తె 05.07 వరకు ఉపరి *వృద్ధి*

*కరణం  : గరజి* సా 05.37 *వణజి* (24) తె 06.38 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు* 

      *ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.00*

అమృత కాలం  : *రా 07.24 - 09.10*

అభిజిత్ కాలం  :  *ప 11.57 - 12.42*

 

*వర్జ్యం             :  ఉ 08.46 - 10.32*

*దుర్ముహూర్తం  : ఉ 10.26 - 11.11 మ 02.58 - 03.43*

*రాహు కాలం   : మ 01.44 - 03.09*

గుళికకాళం       : *ఉ 09.29 - 10.54*

యమగండం     : *ఉ 06.40 - 08.05*

సూర్యరాశి : *మకరం*  

చంద్రరాశి : *తుల/వృశ్చికం* 

సూర్యోదయం :*ఉ 06.40*

సూర్యాస్తమయం :*సా 05.59*

*ప్రయాణశూల  : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు* 

ప్రాతః కాలం          :  *ఉ 06.40 - 08.55*

సంగవ కాలం         :      *08.55 - 11.11*

మధ్యాహ్న కాలం    :      *11.11 - 01.27*

అపరాహ్న కాలం    : *మ 01.27 - 03.43*

*ఆబ్ధికం తిధి         : పుష్య బహుళ నవమి*

సాయంకాలం        :  *సా 03.43 - 05.59*

ప్రదోష కాలం         :  *సా 05.59 - 08.31*

రాత్రి కాలం            :  *రా 08.31 - 11.54*

నిశీధి కాలం          :*రా 11.54 - 12.45*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.58 - 05.49*

________________________________

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


      *#సమస్యలు #తీర్చే* 

 *#దత్తాత్రేయ #మంత్రాలు*


*🌹సంతాన భాగ్యం కోసం దత్త మంత్రం.🙏*


*"దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం||*

*యో భూదభీష్టదః పాతు సనః సంతాన వృద్ధికృత్||*


*🌹ఓం శ్రీ దత్తాత్రేయ నమః🌹*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌷🌷🌹🌷

      🌹🌷🪔🪔🌷🌹

23.01.2025,గురువారం

 


*🙏జై శ్రీమన్నారాయణ🙏*

23.01.2025,గురువారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం - బహుళ పక్షం

తిథి   : నవమి  మ3.18 వరకు

వారం   : బృహస్పతివాసరే  (గురువారం)

నక్షత్రం : విశాఖ తె3.22 వరకు

యోగం : గండం తె3.52 వరకు

కరణం  : గరజి మ3.18 వరకు

తదుపరి వణిజ తె4.11 వరకు

వర్జ్యం   : ఉ7.09 - 8.54

దుర్ముహూర్తము : ఉ10.20 - 11.05

మరల మ2.47 - 3.32

అమృతకాలం : సా5.42 - 7.27

రాహుకాలం     : మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం :

ఉ6.00 - 7.30

సూర్యరాశి: మకరం

చంద్రరాశి: తుల

సూర్యోదయం: 6.38 

సూర్యాస్తమయం: 5.46


*శ్రీ గోదా తాయారు రంగనాథ స్వామి దేవాలయము & శ్రీరామానుజ సేవా ట్రస్ట్, శ్రీరంగగిరి, క్రిష్ణానగర్, హెచ్.బి.కాలనీ,మౌలాలీ.* 

ఛైర్మన్. డా.ధనుంజయ. *7702417779.*


మీ రక్తాన్ని ధారపోయండి - నేను స్వాతంత్రం సాధించి పెడతానని ఉర్రూతలూగించిన సుభాష్ చంద్రబోస్ మాటలు ఆనాటి యువతరాన్ని స్వాతంత్ర్య సమరంలో ఉవ్వెత్తున పాల్గొనేటట్లు చేశాయి. స్వామి వివేకానంద, భగత్ సింగ్ తరువాత దేశ యువతపై అత్యంత ప్రభావం, చైతన్యం కలిగించిన వ్యక్తిగా, దేశభక్తికి మారుపేరుగా నిలిచిన ధీశాలి సుభాష్ చంద్రబోస్. ఈయననే మనం నేతాజీ అని పిలుచుకుంటాం...


ప్రముఖ భారత స్వాతంత్ర్య సమరయోధుడు "నేతాజీ"గా పేరుపొందిన సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897న ప్రస్తుత ఒడిషాలోని కటక్ నగరంలో జన్మించాడు. మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసావాదంతో స్వరాజ్యం కోసం పోరాటం చేస్తున్న సమయంలో ఆయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి దాన్ని ఆచరణలో పెట్టి ప్రసిద్ధి చెందాడు. మొత్తంపై అతివాద భావాలతో ఈయన చేసిన స్వాతంత్ర్యపోరాటం శ్లాఘనీయమైనది. మరణం కూడా వివాదాస్పదమైంది. ఆగస్టు 18, 1945న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించాడని ప్రకటించినప్పటికీ అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు. 1992లో బోస్‌కు "మరణానంతరం" అని ప్రకటించిన భారతరత్న పురస్కారం కూడా ఇదే కారణంతో ఆయన కుటుంబీకులు స్వీకరించనందును ఆయనకు ప్రకటించిన భారతరత్నను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.


నేతాజీ జన్మదినాన్ని ‘పరాక్రమ దివస్'గా జరుపుకుంటున్న నేటి సమయంలో, భవిష్యత్తులో ‘వికసిత్ భారత్' సాధనలో నేటి యువత అన్ని రకాల సామర్థ్యలతో, నైపుణ్యాలతో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుటలో ప్రధాన భూమిక పోషించాలని ఆశిద్దాం. 'అన్యాయం, తప్పుతో రాజీపడటమే అత్యంత ఘోరమైన నేరమని మర్చిపోవద్దు' అని నేతాజీ తెలిపిన మాటలు నిత్య జీవితంలో మనం అందరం ఆచరించడమే నేతాజీకి మనం ఇచ్చే ఘన నివాళి...


డా.ధనుంజయ...

గణిత మేధావి గొప్పతనం*

 *రాయలసీమకు చెందిన గణిత మేధావి గొప్పతనం* 


ఓ తెలుగు వ్యక్తి గొప్పదనం.

 *కడప జిల్లా ప్రొద్దటూరు* కు గర్వకారణం. కాని ఆయన విగ్రహం లేదు 🤷‍♀️🤷‍♀️


టిప్పు సుల్తాన్ కు గౌరవం ఇచ్చారు ప్రొద్దటూరు నాయకులు 🤗


*గణితబ్రహ్మగా* పేరొందిన *లక్కోజు సంజీవరాయ* (నవంబర్ 22, 1907 - డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. సంజీవరాయ 1907 నవంబర్ 27 న *కడపజిల్లా ప్రొద్దుటూరు* మండలంలోని కల్లూరులో జన్మించాడు.


జన్మతః అంధుడు. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ, అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు. అక్క పాఠశాలలో చదివినవి ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే అవి విని గుర్తు  పెట్టుకుని గణితంలో అపార విజ్ఞానం సాధించాడు.


తండ్రి మరణించడంతో తల్లి పెంచి పెద్దచేసింది. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించే వారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలోనే ఆయన వయొలిన్ పట్ల ఆకర్షితుడై నేర్చుకొన్నారు.


శ్రీ సంజీవరాయ తొలిసారి *1928 లో గణితావధానం నిర్వహించారు.* అప్పటినుంచి 1995వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చాడు. మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదులలోను పలు ప్రదర్శనలను ఇచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగినపుడు ప్రధాన ఆకర్షణ శ్రీ సంజీవరాయ గణితావధానమే.


సాధారణంగా గణితావధానంలో, పుట్టిన తేదీ ఇస్తే అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం-కాని, ఈ విషయంలో శ్రీ సంజీవరాయకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ పుట్టిన తేదీ ఏ వారము అయినదో చెప్పడమే కాకుండా, ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవారు. అంటే, పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము చెప్పగానే, దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వర్జ్యము, రాశి కూడా చెప్పి, కొంత వరకు జాతకం కూడా చెప్పేవారు.


ఈ ప్రత్యేకతను (మానవ గణన యంత్రంగా [Human Computer] పేరొందిన శకుంతలా దేవితో సహా) మరెవరూ చూపలేక పోయారు. ఆవిధంగా, ఇది అనితర సాధ్యమైన ప్రత్యేకత. 1966 డిసెంబరు ఏడో తేదీ.. అది హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదిక 2 power 103 ఎంత? 


దానికి సమాధానంలో ముప్పైరెండు అంకెలున్న సంఖ్య చెప్పారు అవధాని. 

'క' నుంచి 'క్ష' వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే, 'స, రి, గ, మ, ప, ద, ని'' అక్షరాల లబ్దం ఎంత? ఏభై రెండు కోట్ల అయిదు లక్షల ఆరువేలు... 


కలం, కాగితం రెండూ ఉన్నా గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏమాత్రం తడుముకోకుండా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారు! ఆయనేమన్నా విద్యావంతుడా?... కాదు. 


పోనీ రెండు కళ్లూ ఉండి అంకెలిలా ఉంటాయి, సంఖ్యలిలా ఏర్పడతాయని చూడగలిగిన వారా ?... కాదు. పుట్టుగుడ్డి! 

పై ప్రశ్నల వంటివి ఆయన్ని వేలల్లో అడిగారు. ఆయన చెప్పిన సమాధానాలు సరిచూడడానికి గణిత మేధావులకు గంటల తరబడి సమయం కావలసి వచ్చింది.

ఆయనే గణిత బ్రహ్మడా. లక్కోజు సంజీవరాయ "అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు. ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక మేధావి!"  


శ్రీపాద కథల్లో వడ్ల గింజల ప్రస్తావన తెలిసిందే. రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా... 

 *మొదటి గడిలో ఒక వడ్లగింజ, రెండో గడిలో రెండు గింజలు, మూడో గడిలో నాలుగు, నాలుగో గడిలో ఎనిమిది...* ఇలా అరవై నాలుగు గళ్లు నింపి ఇమ్మంటాడతను. రాజు ఓస్ ఇంతేనా అనుకొంటారు. తీరా ఎన్ని వడ్ల గింజలో తేల్చాల్సి వచ్చేటప్పటికీ.. అందరూ తలలు పట్టుకుంటారు!


దానికి సంజీవరాయ చెప్పిన సమాధానం... *ఒక కోటి 84 లక్షల 46 వేల 74 కోట్ల 40 లక్షల 73 వేల 70 కోట్ల 95 లక్షల 51 వేల 615 వడ్ల గింజలన్నమాట* (1,84,46,74,40,73,70,95,51,615!)

ఒక ఘనపు మీటరు పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్లగింజలు పడితే...


అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్లు ఘనపు మీటర్ల బస్తాలు అవసరం! నాలుగు మీటర్ల ఎత్తు, పది మీటర్ల వెడల్పు గల.. ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు మూడు *వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరం భూమికీ సూర్యుడికీ మధ్య ఉన్న దూరానికి 20 ఇంతలు!


అంత ధాన్యం ఈ భూమండలంపై ఉండదు!  ఇదంతా అబ్బురమని పించవచ్చు. కానీ సంజీవరాయ గణితావధాన వివరణ మహిమ అదంతా!  ఒకటి, రెండు, మూడు.... ఎలా ఉంటాయో తెలియకుండానే గణితబ్రహ్మ అయ్యారు!


సంవత్సరాలు, తిధులు, నెలలు, నక్షత్రాలు, వారాలు, పక్షాలు... గంటలు, నిముషాలు, సెకనులు ఏవీ తెలియకున్నా అన్నీ తెలుసుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించారు.. తొలిసారి 1928లో గణితావధానం నిర్వహించిన అప్పట్నించీ 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చారు. మహానగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదుల్లోను  పలు ప్రదర్శనలు నిర్వహించారు.. అప్పట్లో మద్రాసు గవర్నరు, భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ ప్రముఖులు ఆయన మేధాశక్తికి ఆశ్చర్యచకితులయ్యారు! నాలుగువేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలండరు సైతం తయారుచేశారు. అప్పటి *రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్* ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న సొమ్ము ఎం.ఓ చేయడం విశేషం! 


అప్పట్లో అనీబ్‌సెంట్, నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్‌లతో పాటు, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమాలి, హుమాయూన్ కబీర్, కాశీనాధుని నాగేశ్వరరావు, పి.వి.రాజమన్నార్, గవర్నర్ సర్ జార్జి స్టాన్లే, మేధ్స్ విజార్డ్ శకుంతలాదేవి తదితరులంతా గణితావధాన.. ప్రదర్శనలు స్వయంగా తిలకించి అన్యులకు సాధ్యం కాదని వేనోళ్ల కీర్తించారు.


పలు విశ్వవిద్యాలయాల్లో, ప్రసిద్ధ కళాశాలల్లో అవధానం ప్రదర్శించి విద్యార్ధుల్ని ఉత్తేజితుల్ని చేశారు. అలాగే గ్రంధాలయాల పిలుపునందుకొని పలుబిగ్రంధాలయాల్లోనూ తమ గణితావధాన ప్రదర్శనలు చేశారు.

అలాగే మేధమేటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలిచ్చారు.

ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది. దురదృష్టం ఏమిటంటే 1993లో అమెరికా సందర్శించాలని ఆయన్ని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేథావి ఇల్లు కదలలేక పోయారు.


వివిధ విశ్వవిద్యాలయాలు... ఆయన్ని సత్కరించాయి. కొన్ని ఆయన్ని బంగారు పతకాలతో సత్కరించాయి. దురదృష్టమేమిటంటే 1964 అక్టోబరు పదో తేదీన రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన 14 బంగారు పతకాల సూట్‌కేసును దొంగలు తస్కరించారు.


ప్రపంచంలో అంధులైన మహా ప్రతిభావంతుల్లో జాన్‌మిల్టన్, బ్రెయిలీ కనుగొన్న హెల్‌న్ కెల్లర్, ద్వారం వెంకటస్వామినాయుడు వంటివారు పుట్టుకతో అంధులు కారు. తదనంతర కాలంలో వారు అంధులయ్యారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటివారు.. మంచి శిక్షణ పొందారు. 


కానీ సంజీవరాయ అంధుడే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి. అంతా వినికిడి జ్ఞానమే... ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు


ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ *''ఈయన మా దేశంలో పుట్టి వుంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు.. చేసేవాళ్లం''* అని అయన్నుద్దేశించి అన్నారు.


శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ప్రతిభావంతుడు అని అంగీకరించింది. అయినా ఆయన పేదరికంలోనే జీవించారు. శ్రీనివాస రామానుజన్ వంటి మేధావిని గుర్తించని దేశమిది. అలాగే సంజీవరాయని రక్షించుకోలేక పోయింది. 1997 డిసెంబరు రెండోతేదీన సంజీవరాయ అస్తమించారు. 'అంక విద్యాసాగర విశ్వసాంఖ్యాచార్య, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ పొందిన తన చివరి" రోజుల్ని శ్రీ కాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో వయొలిన్ మీటుతూ స్వామినర్చిస్తూ గడిపారు!


నిజానికి... *ఈ నోబెల్ బహుమతులు, మెగ్‌సెసేలు, జ్ఞాన్‌పీఠ్‌లు...* ఆయన ప్రతిభ ముందు ఎంత చిన్నవో!


సేకరణ :  (చరిత్రలో  తెలుగు వాడు)


🍎🍎🍎🍇🍇🍇☀️☀️☀️

కవిసార్వ భౌముని కనకాభిషేకము!

 శు భో ద యం🙏


కవిసార్వ భౌముని కనకాభిషేకము! 


కం:- కవి సార్వ భౌమ బిరుదము 


యవులే! యది నీకె తగును అవనీ స్ధలి లో

చవులూరు కవితఁ జెప్పఁగ

పవి సమమౌ వాదులాడ పరువము మీరన్ ;


డింఢిముని పరాజయానంతరము రాయలు హృష్టుఁడై, తుష్టుఁడై " శ్రీనాధ కవీంద్రా! ఓడినవారి బిరుదములను గెలిచిన వారుధరించుట విజయ నగరమున యాచారము. శ్రవణ పేయమయిన కవితఁజెప్పుటయందును, వజ్రాయుధ ఘాతమువలె తిరుగులేని వాదమొనరించుట , యందును నీవుసమర్ధుఁడవు. కావున నేటినుండి యీయాంధ్ర సాహిత్య ప్రపంచమున నీవే కవిసార్వ భౌముఁడవు. తక్కొరులెవ్వరీ బిరుదమునకు భాజనులై యుండకుందురుగాక! ఆచంద్ర తారార్కము నీకిది శాశ్వతమై వర్ధిల్లుదువుగాక" యనిపలుక "శ్రీనాధ కవిసార్వ భౌమా జయీభవ! విజయీభవ! యనువందిమాగధుల స్తోత్రములతో నాసభ కొంతవడి మారుమ్రోగెను. వందిమాగధుల బృందగానముతో నచటిపండితులెల్ల తమఠములనుగలిపి శ్రీనాధుని మనసార నుతించుట విశేషము. శ్రీనాధుని తనువు హర్ష పులకిత మయ్యెను . పరాభవాగ్నిచే దందహ్యమాన మగుచున్న నాతనిమనంబు చల్లబడెను .


అంత రాయలవారు యేమి కవిసార్వ భౌమా! మీప్రతీకారము తీరినదిగదా! ఇకనైన మీయధ్భుత కవిత్వ గానముతో మాభనలరించుఁడు. అదియే మాకుపరమ భాగ్యము. అనిపలుక, శ్రీనాధుఁడు ఆసనమునుండి పయికి లేచి వినయ వినమితుఁడై,


మ: జన నాధోత్తమ! దేవరాయ నృపతీ! చక్రేశ! శ్రీవత్సలాం

చన సంకాశ! మహీ ప్రభావ! హరి! రక్షాదక్ష! నాబోఁటికిన్

గునృప స్తోత్ర సముధ్భవంబయిన వాగ్దోషంబు శాంతమ్ముగా

గనక స్నానముఁ జేసిగాక, పొగడంగా శక్యమే దేవరన్!


యనిపలికెను. పండితవిజయమాత్రమున నాతనికి దృప్తి గలుగలేదు . కనకాభిషేక గౌరవమునుగూడ పొందవలె. అందుకు సమర్ధులు విజయ నగర ప్రభువులే! వారు మహాధనవంతులు, వదాన్యులు, కవిపండిత ప్రియులు, హిందూధర్మ పరిరక్షకులు. కావున వారికడనే తనమనోరధ మీడేరవలె. కావుననే రాయలవారితో శ్రీనాధుఁడిట్లనినాఁడు " రా జోత్తమా! దేవరాయ సార్వభౌమా! విష్ణ్వంశాసంభూతా! అనన్య సామాన్య ప్రభావా! రాజ్యరక్షాదక్షా! యేదో యల్పులగు రాజులను బొగడిన ఈనోటితో మీవంటి యుత్తములను బొగడుట పాడిగాదు . కనక స్నానముతో నావాగ్దోషము నపనయింప వచ్చును . దేవర కదేమంత భాగ్యము? పిమ్మట ప్రభువుల దయ నాభాగ్యము. అనిపలుక యతనిమాటల లోనిమర్మమును గ్రహించి రాయలు మంత్రులను జేరబిలిచి వారికేదోయాదేసించెను . కొద్దిసమయములోనే సువర్ణ నిష్కములు నింపిన పళ్ళెరములతో పరిచారికలరుదెంచి యవనిక మాటున నుండ, దేవరాయలు సింహాసనము నుండి దిగివచ్చి స్వస్తిక మంత్రములను విప్రులచ్చైస్స్వరమున జదువుచుండ నాదీనారముల నభిషేకింప సాగెను. యాశిరోపాదముగా నాయభిషేకము సాగినది. సుకవితా సన్మానమున నటు రాయలు కనకాభిషేకగౌరవ మందజాలినందుల కిటు శ్రీనాధుఁడును. చరితార్ధమునుపొందిరి. రాయలకు, శ్రీనాధకవికిని శాశ్వతమగు కీర్తి లభించినది.


శ్రీనాధుని యౌదార్యము :-


కవిృసార్వ భౌముడంత నాద్రవ్యమును నంతయు నొకచోటునకుఁ జేర్పించి , దోసిళ్ళతో నెత్తి యచటి విప్రులకు పంచిబెట్టసాగెను. రాయలు సంభ్రమాశ్చర్యములతో దిలకింపసాగెను. ఆద్రవ్యమంతయు సంపూర్ణముగా బ్రాహ్మణులకు బంచి యచ్చి నిర్లిప్తుఁడై తనయాసనమున గూర్చున్న శ్రీనాధునిగాంచి యొకింత కినుకఁదోప " ఏమిది? కవిసార్వ భౌమా! మేమిచ్చిన విత్తమంతయు నిట్లు పంచి బెట్టి రిక్త హస్తములతో నేగెదరా? రాయలవారేమిచ్చిరని ప్రశ్నంచు వారికి మీరిక్త హస్తములను ప్రదర్శించి మ మ్మవమానింతురా? తమవంటివారి కిది తగునా? యనిప్రశ్నింప,


"ప్రభూ! తమరెరుంగని దేమున్నది. అయినను విన్నవింతునుగాక! ' ప్రాజ్ఙుఁడెప్పుడును స్నానోదకమును పానమునకు వాడడుగదా! కనకమేయైనను యది తమచే నభిషేకింప బడుటచే స్నానోదక సమమైనది. కావున నాయొనర్చిన కృత్యము ధర్మ విరుధ్ధముగాక సముచితమై తమకు మరింతగా ఖ్యాతినార్జించి పెట్టినది " నకర్మణా న ప్రజయా న ధనేన త్యాగేనైకేన అమృతత్వ మానసుః" అనిగదావేద వాక్యము.(మానవుడు తనపనులవలన గానీ, తనసంతతి వలనగానీ, తనకున్న ధనమువలనగానీ అమృతత్వాన్ని పొందలేడట! ఒక్కదానము చేతనే యమృతత్వమును పొందగలడు : అనియర్ధము) ఇకరిక్త హస్తములందురా? ప్రభువులికపై కరుణించి యిచ్చెడు విత్తమును పదిలముగా నావెంట గొనిపోగలవాఁడనని పలికెను.


రాయలాతని వదాన్యతను వేనోళ్ళ గొనియాడి మరికొంత విత్తమును దెప్పించి యతని కొసంగి సంతుష్టుని యొనరించెను. అట్టి ప్రభువులు గానీ యట్టి వదాన్యులయిన కవులు గానీ లోకమున నరుదు గదా! మనమింతవరకు శ్రీనాధునిలో స్త్రీలోలత్వమునే గాంచినాము. మరి యిప్పుడు అతనివదాన్యతను గూడ సప్రమాణముగా కనుగొన గలిగినాము . ఇట్టివారు అరుదుగా నుందురు .వారిలో మనకవి సామ్రాట్ విశ్వ నాధయొకరు. వారివిషయమును వేరొకపరి  ప్రస్ధావించెదనుగాక!

                     స్వస్తి!🙏🙏🌷🌷👌🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐

శ్రీనాధుని శివభక్తివైభవము!!

 శు భో ద యం🙏


శ్రీనాధుని శివభక్తివైభవము!!

"పంచబ్రహ్మ షడంగ బీజసహిత ప్రాసాద

పంచాక్షరీ,

చంచన్మత్రపరంపరాపరమనిష్ఠాతత్ప

రత్వంబునన్

మంచుంగొండ యనుంగు బెండ్లికొడుకున్, మధ్యాహ్నకాలంబుబూ

జించుంనిర్జర రాజసూనుడు మనోవీధీ

సదా ధ్యాసితన్";-హరవిలాసం -శ్రీనాధుడు.7ఆ-33ప;


      కవిసార్వభౌముడు శ్రీనాధకృత మహాకావ్యాలలో "హరవిలాసం కడపటికావ్యం.శివపారమ్యమైన ఈమహాకావ్యం శివపరత్వంబున తల్లీలలను వివరించేకావ్యం.ఆశ్వాసానికొక యితివృత్తంవంతున ఈకావ్యం వివిధ శివకథా కలితమైన కావ్యం.ఆనాటి వణిక్ప్రముఖుడు అవచితిప్పయసెట్టికీకావ్యం అంకిత మొనర్పబడినది

        ఇందలి చతుర్ధాశ్వసము వీరాద్భుత రసములకు కాణాచి పాశుపతాస్త్రసంసిధ్ధికై అర్జనుడు

పరమేశ్వరునిమెప్పింప, హిమశిఖరమున ఘోరతపమొనరించుట ఇందలి యితివృత్తము.

      పార్ధుని తపశ్చర్య వర్ణనా సందర్భములోనిది పైపద్యము.

           తత్పురుషాది పంచబ్రహ్మాత్మకమై,అంగన్యాస కరన్యాసాదియుక్తమై ఓంకారాది (పంచాక్షరీ) షడంగసహితమై  యొప్పు శివమంత్ర జపనిష్ఠా తత్పరత్వమున మనోవీధీనిరంతరనివాసియగు (హిమాలయుని ప్రియజామాతను) పరమేశ్వరుని మధ్యాహ్న సమయమున అర్జనుడు పూజించుట ఇందలిభావము.

      పద్యము పటువైనది శివదీక్షావిధాన నిధానమైనది.


    :కఠినవిషయముల వివరణము:


పంచబ్రహ్మలు;


1తత్పురుష,2 అఘోర 3 వామదేవ,

,4సద్యోజాత,5ఈశానాదులు

పరమేశ్వరునకుఅయిదు మఖములు వీనిని పంచబ్రహ్మలని యందురు.


షడంగబీజసహితము!

       నమశివాయ మంత్రము ఓంకారమునుగూడి షడక్షరపరిమితమగును. అదియే షడంగయుక్తము.


నిర్జరరాజ సూనుడు-దేవతలప్రభువైన

ఇంద్రుని కుమారుడు  పార్ధుడు.


మనోవీధీ సదాధ్యాసితన్-మనోవిధియందు నిరంతరము ధ్యానించు అభ్యాస వశమున,


                          స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఆయుధాలు అవసరం లేని యుద్ధం

 🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏             🔥 *ఆయుధాలు అవసరం లేని యుద్ధం పేరు మోసం.. వెన్నంటి ఉండి వెన్నుపోటు పొడిచే దాని పేరు స్నేహం.. నమ్మించి గొంత్తు కోసే దాని పేరు ప్రేమ.. ఇవి అన్ని కలిసున్న మృగం పేరే మనిషి* 🔥అవసరం ఉన్నప్పుడు వచ్చే మాటలు పొగడ్తలతో ఉంటాయి.. అవసరం తిరేక వచ్చే మాటలు పొగరుతో ఉంటాయి..మనుషుల స్వాభావం రెండు రకాలు.. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు.. అవసరం తిరినప్పుడు తేలులా కుట్టి ఎగతాళి గా మాట్లాడతారు🔥మన వల్ల ఎదుటి వారికి కష్టం కలిగినప్పుడు ఆది ఎలాగైనా పరిష్కరించి తీరాలి అని అనుకునే వారు అందుకు మార్గాలు అన్వేషిస్తారు..ఆ పని చేయడం ఇష్టం లేని వారు మాత్రం సాకులను వెతుక్కుంటారు..ఆ సాకులకు అలవాటు పడిన వారు జీవితాంతం అక్కడే ఉండిపోతారు.. కరువులో ఉన్నానని అప్పు తీసుకుంటే ఆ అప్పు రేపు బరువు అయితే జీవితం కన్నీళ్ళ చెరువు అవుతుంది.. బతుకు భారమవుతుంది🔥 *అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో అనందంగా జీవించడం నేర్చుకోవాలి.. లేకపోతే బతుకు బజారు పాలవుతుంది*🔥🔥మీ *అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్  ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్ స్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం. మందులు అయిపోయినవారు లేదా రాలేనివారికి కొత్తవారికి మందులు కొరియర్ ద్వార పంపబడును9440893593 91820 75510* 🙏🙏🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం  - నవమి - విశాఖ -‌‌ గురు వాసరే* (23.01.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*