16, ఆగస్టు 2020, ఆదివారం

హోమియో వైద్యంతో కరోనా ట్రీట్మెంట్

ఇప్పటి పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా వుంది. అటు అల్లోపతిలో కరొనకు ట్రీట్మెంట్ లేదంటూనే ప్రైవేట్ హొస్పేటిల్లో రోగుల  నుండి లక్షలలో ఫీజులు వాసులు చేస్తున్నారు.
మరి హోమియోపతిలో వైద్యం ఎలా ఉంటుంది అని అందరు అనుకుంటున్నారు. కానీ నిజానికి ఈ రోగానికి ఈ వైద్యవిధానంలోనే ట్రీట్మెంట్ వున్నది అది యెట్లా అంటే ఈ వైద్యం రోగానికి మందు ఇవ్వదు కేవలం రోగ లక్షణానికి మాత్రమే మందు ఇస్తారు. కాబట్టి ఎంతమంది ఈ వైద్య విధానంలో మందులు తీసుకొని కోలుకున్నారు. కాబట్టి ఈ వైద్య విధానాన్ని ప్రభుత్వం ప్రత్సాహించి ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నాను.


అల్లోపతి మందులకన్నా హోమియోపతి మందులు సురక్షితం, సైడ్ ఏవేక్ట్లు వుండవు అనే మీ అభిప్రాయాన్ని భావించకండి. ప్రతి మందుకు సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలానే హోమియో మందులకు కూడా. నిజానికి హోమియో వైద్యం ఎక్కువగా ప్రాధాన్యత సంతరించకపోవటానికి రెండు కారణాలు. వైద్యులు సరైన మందుని నిర్ధారణ చేసే సామర్థ్యం లేకపోవటంతో రోగ నిర్ములన్ కొన్ని సార్లు జరుగదు. ఈ రోజులల్లో రోగులు తక్షణ నివారణ కావాలని కోరుకుంటున్నారు దానితో వెంటనే రిలీఫ్ రాకపోటంతో వెంటనే వేరే వైద్యుడి దగ్గరకు పోతున్నారు. నిజానికి హోమియో వైద్యంలో రెండు ప్రధానాంశాలు ఉంటాయి అవి. ఒకటి  మందు రెండవది పోటెన్స్. ఈ రెండు సరిగా ఉంటేనే వ్యాధి నివారణ వెంటనే అవుతుంది. కానీ అల్లోపతిలో కేవలం రోగము-మందు ఉంటుంది. ఇక్కడ రోగ లక్షణానికి మందు. కొన్ని సందర్భాలలో ఒకే రకమైన రోగం వున్న ఇరువురికి వేరు వేరు మందులు కూడా ఇవ్వవలసి రావచ్చు. కాకపొతే బయో కెమికులో (హోమియోలో ఒక భాగం)  ఆలా ఉండక పోవచ్చు. ఏది ఏమైనా హోమియో కూడా జాగ్రత్తగా వాడవలసిన వైద్య విధానమే అని తెలుసుకోవాలి. 
**************

పితృ రుణం

భూమి మీదున్న ప్రతి మానవునికి దేవ ఋణము, పితృ ఋణము అనే రెండు ఋణములు ఉంటాయి. అవి తీర్చుకోవాల్సిందే. కృతఘ్నతా దోషముతో మళ్లీ మళ్ళీ జన్మలెత్తడం, లేదా ఇంటిలో భూత ప్రేత పిశాచాల భయం, అకాల మరణాలు వంటి.. కఠిన సమస్యలతో సతమతమవటం జరుగుతూనే ఉంటుంది. కనుక ముందు ఈ ఋణములు తీర్చుకోవాలి.

దేవ, పితృ యజ్ఞాలు ప్రతివారు ఆచరించాల్సిన నిత్య కర్మలు. ఆ పితరులే లేకపోతే.. ఈ జీవితం శరీరం ఎక్కడిది?! కనుక తప్పక వారిని అర్చించాలి. వారికి ఆహారాన్ని స్వధా దేవి చేకూరుస్తుంది. 'స్వర్గం లోకం దధాతి యజమానస్యేతి స్వధా' అనగా పితృ యజ్ఞములు చేయువారికి ఉత్తమ స్థితులు, చేయనివారికి అధోగతులని భావం. మేము జ్ఞానులైపోయాము బదరీ క్షేత్రంలో పిండప్రదానం చేశాము, ఇక తామేమి చేయనక్కరలేదని పితృ యజ్ఞములు మానేస్తే మహా పాపమును పొందుతారని చెప్పబడుతోంది. జీవం ఉన్నంతవరకు.. హేతువైన పితృ దేవతలను నిత్యం స్మరించుకోవాలి.
సమస్య వచ్చినప్పుడే, పండగ వచ్చినప్పుడే దేవతలు గుర్తొస్తారనే విషయం చాలా మందిలో కనిపిస్తున్న వాస్తవం. పితరులకు భక్తి విశ్వాసాలతో ప్రతి ఏటా పితృ కార్యాన్ని ఆచరించినప్పటికీ... ఆయా కుటుంబాల వారు సుఖ శాంతులకు దూరంగానే ఉన్నారు. దీనికి కారణమేమిటనే ప్రశ్న తెరపైకి రావవచ్చు. నిజమే మరి.. స్వధా దేవిని కేవలం పితృ కార్యాలనాడే తలుచుకుంటారే తప్ప మిగిలిన రోజులలో మచ్చుకైనా గుర్తుచేసుకోరు. కేవలం సంవత్సరానికి ఒక రోజున వచ్చే పితృ కార్యం ఆచరించి చేతులు దులుపుకొన్నంత మాత్రాన లాభం లేదు, పితృతిధి రోజునే పితృ కార్యం ఆచరించిననూ స్వధా దేవిని ప్రార్ధించటం లేదు. కేవలం ఆనాడు.. ఆ కార్యాన్ని పూర్తి చేయటానికి స్వధా దేవిని ఒక దూతగానే వాడుకున్నాం తప్ప ఆ తల్లి అనుగ్రహం నిత్యం ఉండాలని, చాలా మంది గమనించరు.

స్వాహా దేవికి 16 నామలున్నట్లుగానే, స్వధా దేవికి కూడా 8 నామాలున్నవి. పితృప్రాణతుల్యా, యజప్రీతికరా, యజదేవతారూపిణి, శ్రాద్ధాధిష్టాతృదేవీ, శ్రాద్ధఫలప్రదా, ఆత్మ మానసకన్యా, పితృదృష్టిప్రదా, కృష్ణవక్షస్థలా అనే 8 నామాలు. ఈ స్వధా దేవినే పురాణములలో గోలోక వాసినిగా ఉన్న కృష్ణవక్షస్థలా అనికూడా చెప్పబడింది. ఈ 8 నామాలతో ఉన్న స్వధా దేవిని ప్రత్యేక పద్ధతులలో అర్చించాలి. కనుక శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములోని మహా పుణ్యవంతమైన నామాలలో ఉన్న స్వాహా, స్వధా దేవతలను అర్చించటానికి కూడా ప్రత్యేకమైన రోజులు అవసరం. ఈ స్వాహా, స్వధా దేవతలను శాస్త్రీయ పద్దతిలో అర్చిస్తేనే, పూర్ణ ఫలాలను పొందగలుగుతారు.
ప్రతి ఒక్కరు దేవ యజ్ఞమును, పితృ యజ్ఞమును చేయాలి. దేవ యజ్ఞమును చేసినప్పుడు స్వాహాకారం, పితృయజ్ఞం చేసినప్పుడు స్వధాకారం ఉండును. ఈ రెండు శక్తులు వాక్కునకు మూలమైన అగ్నికి సంబంధించిన శక్తులుగా వర్ణింపబడినవి. ఈ విశ్వంలో దేవతలకి, పితృ దేవతలకి స్థానములున్నవి. వీరిరువురిని పూజించుట నిత్య కర్మలలో విధింపబడినది. భారతీయ యజ్ఞ విజ్ఞానంలో అనేక విషయములున్నవి. యజ్ఞాజ్ఞిలో సరియైన ప్రేరణతోనే స్వాహా, స్వధా శబ్దములు ఉండాలి. వాటి వల్లనే దేవతలు, పితృదేవతలు తృప్తి చెందుతారు.

పితృ కార్యములు ఆచరించునప్పుడు3 విధములైన దేవతలుగా చెప్పబడును. అవి వసు, రుద్ర, ఆదిత్య రూపమైన దేవతలు. అనగా అగ్ని, వాయు, సూర్యులలో దాగి ఉన్న పితృ శక్తి వసు, రుద్ర, ఆదిత్యుల రూపములుగా వ్యవహరింపబడుతున్నవి. ఈ 3 రూపములలో ఉన్నవారికి.. కర్త అయిన వ్యక్తి తన భావమును విన్నవించుకొనుటకు ఈ స్వధా దేవియే శరణ్యం. అగ్ని, వాయు, సూర్యుల ధారణా శక్తిని స్వధా అంటారు. ఇది వేదము చెప్పిన స్పష్టత. ఈ దేహములోనే కాక దేహానంతరము కూడా నడుపు శక్తి స్వధా దేవి. పితృ రూపములో జీవులు ఏ స్థితిలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో.. ఇక్కడ ఉన్నవారికి తెలియదు. కానీ ఆ పితృదేవతలను చేరుటకు మానవుని కర్మకు తగినటువంటి ఫలమును అందించుట ఒక్క స్వధా దేవికే సాధ్యం.

నైవేద్యం.

ఎవరింట్లో అయితే పితృశాపం ఉంటుందో, ఎవరింట్లో అయితే పెద్దల కార్యాలను సరిగ్గా చేసి ఉండరో, ఎవరింట్లో అయితే అకాల మరణాలు ఎక్కువుగా సంభవిస్తూ ఉంటాయో, ఎవరింట్లో అయితే పెద్దల కలలోకి వస్తుంటారో, ఎవరింట్లో అయితే దెయ్యం, భూతం, పిశాచాల సమస్యలు ఉంటాయో అటువంటివారు దేవునికి నువ్వుల అన్నం లేదా నువ్వుల పొడితో చిత్రఅన్నాన్నీ నైవేద్యంగా ఉంచి ప్రసాదంగా పంచాలి అలా చేస్తే వంశంలో, ఇంట్లో ఉన్న పితృ దేవతలా శాపాలు తొలగిపోతాయి. దేన్నీ చేసి మహాలయ అమావాస్య రోజు పెద్దల కార్యాలను చేస్తే అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతాయి.
*******************

సేవాభారతి

నమస్తే కరోనా సేవ కై సేవాభారతి టోల్ ఫ్రీ నంబర్ 04048210101
కరోనా సోకిన వ్యక్తి కి కానీ వారి కుటుంబ సభ్యుల కు కానీ పైన తెలిపిన టోల్ ఫ్రీ నంబరు కు phone చేస్తే సేవా భారతీ వారు వివరాలు నమోదు చేసుకొని 5000 రూపాయల విలువ చేసే kit ను ఉచితంగా అందిస్తున్నారు. అందులో Pulse Oxy meter, Thermo meter, ఆవిరి capsules, Vitamin tablets,. Paracetamol tablets, మాస్క్ లు మరియు గొంతు gargling చేయడానికి ఒక liquid కూడా ఉంది. దయచేసి ఈ విలువైన మెసేజ్ ని ఎవరైనా నిరుపేదలకు వైరస్ సోకి ఉంటే వారికి kit ni అందజేసే ప్రయత్నం చేయండి
**************

నాకు నచ్చిన పోస్టు


ఈ బ్లాగు చూస్తున్న మిత్రువులకు నమస్కారాలు.
దేశ విదేశాలనుండి ఎంతోమంది ఈ బ్లాగు చుస్తున్నందుకు ఈ బ్లాగరుకు చాలా సంతోషంగా వుంది. దయచేసి మీకు ఈ బ్లాగు నచ్చితే మీరు ఈ మైలుద్వారా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదే విధంగా ఫాలోవరు కండి అప్పుడు ఈ బ్లాగు నిర్వహణకు చాలా శక్తిని చేకూర్చినవారు అవుతారు. ఇంకా మీకు ఏదైనా పోస్ట్ నచ్చితే మీ కామెంట్ పెట్టగలరు. లేక ఈ బ్లాగు నిర్వహణలో ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని  మీరు అనుకుంటే ఆ విషయం కూడా పెట్టగలరు.
మీరు ఏమైనా మంచి విషయాలు ఈ బ్లాగు ద్వారా ప్రపంచానికి తెలియ చేయాలని అనుకుంటే మీరు వ్రాసిన రచనలు, లేక ఏమైనా గొప్ప విషయాలు, కేవలం సాహిత్యపరమైనవే కాకుండా, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, హిందూ ధర్మ పరమైనవి లేక ఆధునిక సైన్సుకి సంబందించిన విషయాలు కూడా మీరు ఇక్కడ వ్రాయవచ్చు. 

సర్వ జనులకు విజ్ఞానదాయకమైన విషయాలను స్వాగతిస్తున్నాము. మీరు తెలుగులోనే మీ రచనలను పంపాల్సిన అవసరం లేదు, హిందీ, ఇంగ్లీష్ బాషలలో కూడా మీరు వ్రాయవచ్చు. అటువంటి వాటిని గూగులు అనువాదంతో అనువదించి ఆ అనువాదాన్ని కూడా క్రింద ఉంచబడుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఇస్కాన్ వారు హరే రామ హరే కృష్ణ ఉద్యమంతో ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మాన్ని, హిందూ సంప్రదాయాలను విశ్వవ్యాప్తి చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాల విషయాలను కూడా స్వాగతిస్తున్నాము.

ఇప్పుడు ప్రపంచం శాస్త్రీయంగా ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. కంప్యూటర్ టెక్నలాజి, ఇంకా ఇతర టెక్నాలజీలు అనేక రకాలుగా అభివృధి చెందుతున్నాయి. అలంటి కొత్త విషయాలు కూడా ఇక్కడ వ్రాయవచ్చు.

మీ స్పందనలను మేము ఆహ్వానిస్తున్నాము. 
ఇంకా మీరు ఏమైనా మీ వ్యాపారానికి సంబందించిన ప్రకటనలు చేయదలిచిన ఇక్కడ కామెంటు రూపంలో సంప్రదించవచ్చు, మీ వాట్సాప్ నెంబర్, మీ ఇమెయిల్ ఇవ్వటం మరవద్దు. అటువంటి కామెంట్లు ఈ బ్లాగులో కనపడవు. కేవలం బ్లాగు నిర్వాహకులకు మాత్రమే చేరుతాయి. తరువాత మీరు బ్లాగులో ఎరకమైన ప్రకటన ఇవ్వదలిచారో నిర్వాహకులతో సంప్రదించి ఇవ్వవచ్చు. 
*********************

శ్రీవారి ధ్వజస్తంభం

*తిరుమల లో శ్రీవారి ధ్వజస్తంభం వెనుక ఉన్న  కథ మీకు తెలుసా...?*
*కర్ణాటక దండేలీ అడవుల్నుంచి 75 అడుగుల పొడవున్న 6 టేకుమానులు తీసుకుని 16 చక్రాల ట్రాలీ బయలుదేరింది. ఇంత భారీ వాహనం చేరాల్సిన గమ్యం 430 కిలోమీటర్లు!*

*డ్రైవర్ రెండు చేతులూ జోడించి దేవుని ప్రార్ధించాడు.*
*వందల కంఠాలు "గోవిందా! గోవిందా!" అంటూ ప్రతిధ్వనించాయి. అతన్ని ఏ శక్తి నడిపిందో మరుసటిరోజు సాయంత్రానికి గమ్యానికి చేరువలో అలిపిరి వద్దకు ఆ ట్రాలీ చేరుకుంది*

*డ్రైవర్ దిగి కొండవేపు చూశాడు.*  *కలియుగ దైవం వేంచేసివున్న సప్తగిరి... చుట్టూ చూశాడు. వేలాది యువతులు*
*హారతులిచ్చి, గోవిందా.. గోవిందా.. అంటూ తన్మయులైనారు*

*అక్కడే ఉన్న టి.టి.డి.చైర్మన్ నాగిరెడ్డి గారికి, ఎక్జిక్యూటివ్*  *ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారికి*
*నమస్కరించి  "ఘాట్ రోడ్డు 18 కిలోమీటర్లు, ఏడు ఎనిమిది* *క్లిష్ఠమైన మలుపులున్నాయి.*
*ఇది నా జీవితంలోనే గొప్ప సాహసం. ఎట్టి పరిస్థితుల్లోనూ*  *ట్రక్కును ఆపకుండా కొండ*
*మీదకు తీసుకుపోతాను.* *మధ్యలో పిట్టగోడలు దెబ్బతినొచ్చు,అంచులు తగిలి* *బండరాళ్లు దొర్లిపడవచ్చు, మీరు హామీ ఇస్తే పైకి చేర్చి*
*తీరుతాను అన్నాడు" వారు డ్రైవరుతో పైకి చేర్చే బాధ్యత* *నీది. మిగిలిన బాధ్యతలు మావి*
*అని అభయం ఇచ్చారు*

*వాహనాల రాకపోకలను, పాత ఘాట్ రోడ్డుకు మళ్లించారు. ట్రక్కు బయలుదేరింది.వెనుకే* *వాహనాల్లో అందరూ*
*బయలుదేరారు. ఒక్కో మలుపు తిరుగుతుంటే*
*మానులు తగిలి, బండలు* *ఊడిపడ్డాయి. పిట్టగోడలు కూలిపడ్డాయి. ట్రాలీ లోయలో*  *పడిపోతుందేమో అని వెనుక వారికి భీతి కలిగేది.* *ఇలా గుండెలు ఉగ్గబట్టుకుని, ఫీట్లు చేసుకుంటూ* *సంభ్రమాశ్చర్యాల మధ్య 55 నిమిషాల్లో..*
*సూర్యాస్తమయం లోగా*
*ట్రాలీ తిరుమల చేరిపోయింది"*

*వేలాది భక్తుల ఆనందోత్సాహాలతో*
*గోవిందా..గోవిందా..*
*నామస్మణతో తిరుమల కొండ* *ప్రతిధ్వనించింది!*

*☘స్వామి వారి ధ్వజస్తంభం కోసం దండేలీ అడవుల్లోపుట్టి* *300 ఏళ్ల వయసున్న*
*ఈ 6 టేకుమానులు స్వామి* *వద్దకు క్షేమంగా చేరుకున్నాయి*

*🍀ఏమిటీ ధ్వజస్తంభం కథ?*

*నాగిరెడ్డిగారు మర్రి చెన్నారెడ్డి ఆదేశాల మేరకు టిటిడి చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.*

*తిరుమలలో అనేక మరమ్మత్తులు చేపట్టారు. అందులో భాగంగానే ధ్వజస్థంభానికి బంగారు*
*తాపడానికి పాలిష్ చేయడం.*
*నాగిరెడ్డి గారికి తోడుగా సమర్ధుడైన ఐ.ఏ.ఎస్ అధికారి* *పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు*
*ఎక్జిక్యూటివ్ ఆఫీసరుగా వున్నారు. ఈ పనులన్నీ ప్రసాద్* *గారు చిత్తశుద్ధితో చేసేవారు!*
*అప్పటి ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరామయ్య! ఇలా*  *ధ్వజస్తంభం చుట్టూ* *వున్న నాలుగు వరుసల*
*గోల్డ్ ప్లేట్లు విప్పి పాలిష్ చేసే* *సమయంలో అసలు విషయం బయటపడింది*. *ధ్వజస్తంభాన్ని టేకుతో చేస్తారు. చూస్తే*
*ఆ మానంతా పుచ్చిపోయివుంది. భూమిలో*
*ఉండాల్సిన భాగం అసలే కనిపించడం లేదు? మరి ఏ* *ఆధారంతో ధ్వజస్తంభం నిలిచి ఉంది? కేవలం ఆ బంగారు ప్లేట్ల ఆధారంతో అది ఉంది. రేపో మాపో అది* *కూలిపోవచ్చు!*
*మరి ఇప్పుడేం చేయాలి? ఏం* *చేయాలి?వేరే వారైతే దాన్ని* *తాత్కాలికంగా ఏదో*
*చేసేయ్యండి. 75 అడుగుల* *టేకుమానులు బజారులో* *దొరకవు అని సర్దుబాటు* *చేసేవారు! కానీ ఇక్కడ* *ఉన్నది..నాగిరెడ్డి, పివిఆర్కే* *ప్రసాద్! స్వామి వారి సేవలో అచంచల భక్తి వున్నవారు.*
*స్వామివారికి, ఆయన* *భక్తులకు ఏ చిన్న లోపం*
*జరిగినా ఆ పాపం తమదే అని విశ్వసించే వారు*
*అందుకే "ధ్వజస్తంభాన్ని* *పునర్మిద్దాం"*
*అని ప్రకటించారు......*
*ప్రకటించారు సరే..అసలు కథ ఇప్పుడే మొదలైంది!*

*🛑ధ్వజస్తంభం వాడే మానుకి ఆగమశాస్త్రం ప్రకారం నిర్ణీత లక్షణాలు ఉండాలి.!*

*ఆ మానుకి,ఎలాంటి తొర్రలు,పగుళ్లు,వంకలు,*
*కొమ్మలు ఉండకూడదు.75 అడుగుల ఎత్తున్న ఒకే మాను* *కావాలి. వందేళ్లకు పైగా మన్నిక*
*కల్గిన టేకు చెట్టు అయివుండాలి*

*ఎక్కడ? ఎక్కడ?*

*ఈ లక్షణాలున్న చెట్లు* *దొరుకుతాయి?*
*పాత మాను గురించి* *తెలుసుకుంటే దొరుకుతుంది అని 190 సంవత్సరాల*
*రికార్డులన్నీ పరిశీలిస్తే..*
*ఎక్కడా ఈ ధ్వజస్తంభం* *ప్రస్తావన లేదు. మరో వేపు* *నాగిరెడ్డిగారు, ప్రసాద్ గారు ఇద్దరి నియామకాల గడువు* *పూర్తి కానున్న తరుణం.*
*ఈ కొద్ది రోజుల్లో మనం*
*ఇది చేయగలమా????ప్రశ్నలు???*

🍀  *ఆ సమయంలో బెంగుళూరు నుండి వచ్చిన*
*ఓ భక్తుడు వారిని కలిసి" అయ్యా! మీరు*
*ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నట్లు* *రేడియోలో విన్నాను. అటువంటి మానులు కర్ణాటక దండేలీ అడవుల్లో ఉన్నాయి.*
*మీరు అనుమతిస్తే నేను ఆ పనిచేసి పెడతాను! వారంలోగా ఆ భక్తుడు వంద చెట్లను* *పరిశీలించి, అందులో నిర్ణీత ప్రమాణాలకు* *అనుకూలంగా*
*ఆరు చెట్లను ఎంపిక* *చేశారు.అదే వారంలో*
*కర్ణాటక ముఖ్యమంత్రి* *గుండూరావు గారు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వచ్చారు..ఆయన* *ముందు ఈ ప్రతిపాదన ఉంచారు.* *ఆయన ఆనందంగా మహద్భాగ్యం అన్నారు.* *ధ్వజస్థంభానికి ఒక్కమాను* *సరిపోతుంది. అయినా*
*ముందు జాగ్రత్తగా 6 చెట్లనూ* *తీసుకున్నారు.* *సమస్య అక్కడితో అయిపోలేదు*
*దట్టమైన అడవిలో, కొండ* *వాలులో ఉన్న వీటిని*
*మొదటికంటా తీయించి 8* *కిలోమీటర్ల కిందికి తీసుకు రావడం చిన్న పనికాదు. రోడ్డు* *నిర్మించే బాధ్యత చీఫ్ కన్జర్వేటర్ తీసుకుంటే..* *సోమానీ పేపర్ మిల్లు వారు ఈ భాగ్యం మాకు ప్రసాదించండి అని..దుంగల్ని క్రేన్ల సహాయంతో రోడ్డు వరకూ* *చేర్చారు"*

*ట్రాలీకి 70,000 రూపాయల అద్దె! ట్రాలీ బయలుదేరింది. ఎటువంటి ఆటంకాలు*
*లేకుండా తిరుమల చేరుకుంది!*
*1982 జూన్ 10వ తేదీన*
*ధ్వజస్థంభాన్ని ప్రతిష్టించారు!*

*🍁ఉత్సవం చివరన నాగిరెడ్డి గారు ట్రైలర్ యజమానికి 70 వేల రూపాయల చెక్కును* *అందించారు! యజమాని..*
*"స్వామివారి సేవకు నాకు బాడుగా? 5 రోజులు  ఆయనతో వున్న నేను కదా చెల్లించాలి!"*
*అని దానిని తిరస్కరించారు!*

*డ్రైవరును స్వామివారి సమక్షంలో సత్కరించారు.*
*స్వామి వారి సన్నిధిలో నాగిరెడ్డి, పివిఆర్కె ప్రసాద్,*
*ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట్రామయ్యను*
*సత్కరించి, ఆయన చేతిలో ఓ కవర్ ఉంచారు!అది విప్పి* *చూసిన వెంకట్రామయ్య కళ్ళలో కన్నీళ్లు.. ఏడేళ్లుగా ఎదురు* *చూస్తున్న తన ప్రమోషన్* *ఆర్డర్ అది! ఇలా..స్వామివారి*
*సన్నిధిలో.. ఎందరికి* *ప్రాప్తం?..అనుకుంటూ..*
*ఆయన రెండు చేతులూ జోడించి ఆనందడోలికల్లో మునిగిపోయారు!*

*🙏🏽💐ఓం నమో వెంకటేశాయ* 💐🙏🏽

*సుధాశశి కుమారి*
*మాచవరం*

*భక్తి శ్రద్ధలతో చదివేవారు ఇంకా కొంతమందితో పంచుకోండి*
**************************

వేదాలు! వేదాలు!

వేదాలు! వేదాలు! వేదాలు! వేదాలు! ఈ మాట చాలా చిన్నతనం నించీ అప్పుడప్పుడూ వింటూ వున్నదే. ఈ చెవితో విని, ఆ చెవితో వదిలేస్తున్నదే. వేదాల్ని ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం దేవుళ్ళే స్వయంగా చెప్పారనీ, అది సంస్కృత భూయిష్టం అయిన ప్రాచీన సాహిత్యం అనీ, దాన్ని అర్ధం చేసుకోవడం మహా భక్తులైన పండితులకు కూడా చాలా కష్టం అనీ, అదనీ - ఇదనీ, ఇక్కడా అక్కడా చిట్టి పోట్టి వార్తలు చదివి, ''వేదం'' అన్న పేరు చెవిన పడగానే జడుసుకుంటూ వున్నదే.

వేద నిర్వచనము

హిందూమతంలో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు అని కూడా అంటారు.

ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా,, (ఇష్టప్రాప్తి, అనిష్టపరిహారం ) కావల్సిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకూండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం.
భద్రమరాజు శ్రీనివాసరావు
**************

అతనికే మోక్షం ఎందుకు?

త్రిలోకసంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణుభక్తులను పలకరించేందుకు బయల్దేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్లాడు.
‘అయ్యా! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు. విష్ణుభగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా?’ అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని. ‘విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు. నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను,’ అంటూ బదులిచ్చారు నారదులవారు. ‘అయితే స్వామీ! ఈసారి మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి’ అని వేడుకున్నాడు ఆ ముని. సరేనంటూ నారదులవారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. ‘మిమ్మల్ని చూస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామీ! ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?’ అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుని ముంచెత్తాడు.
‘స్వామి బాగానే ఉన్నారు. నేను మళ్లీ అక్కడికే వెళ్తున్నాను. నీ గురించి ఏమన్నా అడగమంటావా!’ అన్నారు నారదులవారు. ‘అడగడానికి ఇంకేముంది తండ్రీ! ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు’ అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. అలాగేనంటూ నారదులవారు తిరిగి వైకుంఠానికి బయల్దేరారు. వైకుంఠంలో నారదులవారు స్వామిని చూసిన వెంటనే, తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు. ‘నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి. కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ’ అన్నారు విష్ణుమూర్తి.
స్వామివారి మాటలు విన్న నారదులవారు అయోమయంలో పడిపోయారు. నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటి? అన్న ఆలోచనలో మునిగిపోయాడు. నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. ‘నీ అనుమానం తీరే ఉపాయం ఉంది. నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు, ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని వాళ్లు అడుగుతారు కదా! అప్పుడు ‘ఆయన సూది బెజ్జంలోకుండా ఏనుగుని పంపిస్తున్నారు’ అని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది. ఎవరు గొప్ప భక్తులో!’ అన్నారు స్వామి.
విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయల్దేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదులవారిని కుశలప్రశ్నలు అడుగుతూ, పనిలో పనిగా ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు ముని. ‘ఆ ఏముంది! వేలెడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘భలేవారే! సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం. మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు’ అన్నాడు ముని చిరునవ్వుతో. నారదులవారు అక్కడి నుంచి సాగిపోయారు. మరికొంత దూరం వెళ్లాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు.
‘అయ్యా! దయచేయండి! ఎక్కడి నుంచి రాక? ఈ మధ్య కాలంలో వైకుంఠానికి వెళ్లారా? స్వామివారు ఎలా ఉన్నారు?’ అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను. ‘అంతా బాగానే ఉందయ్యా! నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూదిబెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘మంచిది మంచిది. స్వామివారు తల్చుకుంటే సాధ్యం కానిది ఏముంది!’ అన్నాడు భక్తుడు. ‘అదేంటీ! స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా!’ అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు.
‘భలేవారే భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది. ఇదిగో ఈ మర్రి పండుని చూడండి. ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా! ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారతాయి కదా! పోనీ అక్కడితో ఆగుతుందా… ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసినదానిలో ఆశ్చర్యం ఏముంది. సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా!’ అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదులవారికి అర్థమైంది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసివచ్చింది.
*******************

పి తృ దో షం !

పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం "
పితృ దోషం' ...
మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ...
అలాగే...
తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.
మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.
అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు -
 మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే.
అదే
" పితృ దోషం "
ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం.
అందుకే ఈ పోస్టు పెడుతున్నాను.
పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.
ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.
వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.
పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...
చిన్న వారు అకాలమరణం పొందడం
శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.
అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం మన ప్రమేయం లేకుండా
ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం
మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం
ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం కారణం
దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం.
స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే ...
అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.
1. కాశీ
2. పాపనాశి  ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)
అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.
విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు .
అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం -
స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే....
పాలు అన్నముతో చేసిన పాయసం,
అన్నము, ముద్దపప్పు, నేయి,
వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ! ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని  స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు .
స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.
ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును )
అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్ల ను దర్శనం చేసుకున్న తరువాత ఈ  స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.
ఈ ఆలయ ప్రాముఖ్యము మా గురువు గారు అయిన తంత్ర గురు "భరణి స్వామి " ద్వారా తెలుసుకోవడం జరిగింది ' ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !
ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు . అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని గ్రూపులో పెట్టడం జరిగింది !
చేరుకొనే విధానం :
అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం "
ఇంకొక ముఖ్య విషయం : స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశిశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు . ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి !
ఈ ఆలయ విశేషాల గురించి ' స్మశాన నారాయణుడి పూజ గురించి సంప్రదించవలసిన ఆలయ పూజారి నంబర్లు :
9182883807,
7995464344.

పదిమందికి ఉపయోగపడే విషయం .
సర్వేజనా సుఖినోభవంతు
శ్రీ గురుభ్యోన్నమః
***************

శ్రీవీరేశ్వర స్వామి ఆలయం

#భద్రకాళి సమేత #శ్రీవీరేశ్వర స్వామి ఆలయం మురమళ్ళ.*



 #వివాహం కాని వారికి వివాహమవుతుంది.
స్వామి ని దర్శించి స్వామి వారికి  కళ్యాణం జరిపించు కుంటే వారికి కళ్యాణం జరుగుతుంది దర్శించండి తరించండి

#శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయము.

త్వరిత వివాహ కోరిక తో ఎంతోమంది ఇక్కడ స్వామి వారి కల్యాణం చేయించుకుంటారు.

ఎంతోమందికి వివాహాలు జరిగినవి.

ఐ.పోలవరం మండలానికి చెందిన మురమళ్ళ గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం జిల్లాలోని ఒక చారిత్రక ప్రదేశం.స్వామి వారు నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంన్నారు ఇక్కడ కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది వివాహ సాంప్రదాయం వైదిక స్మార్తాగమం ప్రకారం పురోహితులు నిత్యకళ్యాణం జరిపిస్తారు .

దీనితొపాటు ఆలయ అర్చకులు యక్షగానం పాడటం మరోవిశేషం . ఇక్కడ స్వామి వారికి రోజువారీ నిత్యకల్యాణం నిర్వహిస్తారు. ప్రతిరోజు దాదాపు వందల మంది యాత్రికులు వారి పూజలు నిర్వహించడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు.

ప్రతి రోజు  స్వామి వారి కల్యాణములు చేయబడుతాయి.

#స్థల పురాణం.

దక్షయజ్ఞము అనంతరము వీరభద్రుడు శ్రీ
మహావిష్ణువు కోరికపై దక్షునకు మేక తలను తగిలించి దక్షుని పునర్జీవుని గావించి ఆయనచే వేదోక్తముగా దక్ష యజ్ఞమును పూర్తి గావించెను.

కాని సతీదేవి అగ్నిని పుట్టించుకుని ఆహుతి అవుటచే కలిగిన కోపము ఎందరు ప్రయత్నించిననూ ఎంతకునూ శాంతించపోవుటచే త్రిమూర్తులతో కూడి దేవతలు ఆదిపరాశక్తిని ప్రార్థించగా జగన్మాత తన శోడష కళలలో ఒక కళను భద్రకాళి నామమున వీరభద్రుని శాంతింప చేసేందుకు పంపించెను.

భద్రకాళి ఎంత ప్రయత్నించిననూ వీరభద్రుని క్రోధము చల్లారకుండుటచే 'అశ్శరభ శరభ' అనుచూ ప్రక్కనే గల తటాకమునందు మునిగి భీకరమైన భద్రకాళీ రూపమునుండి అందమైన కన్యగా ప్రత్యక్షమై వీరభద్రునకు కనిపించెను.

అంతట వీరభద్రుడు శాంతించుటతో దేవతలు మునులు వారిరువురికీ గాంధర్వ పద్ధతిన
మునిమండలి ప్రాంతమున వివాహము చేసిరి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అదేరీతిన గాంధర్వ కళ్యాణం జరుగుతున్నది.
ఆలయ నిర్మాణము
ఈ కథాగమనము జరిగిన పిమ్మట ఆ పరంపరలో పూర్వదేవాలయము ఏర్పడినది.

మురమళ్ళ, అమలాపురం నుండి 25 కి.మీ., కాకినాడ నుండి 38 కి.మీ., (వయా యానాం), రాజమహేంద్రవరం నుండి 105 కి.మీ. (రావులపాలెం ద్వారా) దూరంలో ఉంది.
******************

*హారేరామ హారేరామ రామారామ హరేహరే.....*



*భజన అనే మాట చాలా పవిత్రమైనది. భజించడం, కీర్తించడం భగవంతుడికే వర్తిస్తాయి. నోరారా భగవన్నామాన్ని పాడి హృదయాలను రంజింపజేయడం భక్తి కార్యాల్లో ముఖ్యమైనది. నారద భక్తి సూత్రాల్లోని నవ విధ భక్తి మార్గాల్లో మొదటి రెండు.. శ్రవణం, కీర్తనం.*

*శ్రవణం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని నిరూపించిన వాడు పరీక్షిత్తు మహారాజు.*

 *శుకమహర్షి లాంటి విజ్ఞాన ఘని దొరికితే చాలదు, పరీక్షిత్తు వంటి శ్రోత ఉండాలి.*

*పరిప్రశ్న అనేది భగవద్గీతలో కృష్ణుడు పలికిన మాట. ప్రశ్నించడం అంటే తెలుసుకోవాలనే కుతూహలంతో అడగడం. పరిప్రశ్న అంటే కుతూహలం సరిపోదు జిజ్ఞాస ఉండాలి. తెలుసుకున్న దాన్ని ఆచరించే కార్యాచరణ కావాలి.*
*పరీక్షిత్తు అలాంటివాడు. అందుకే శ్రవణం మోక్షానికి రాజమార్గమైంది.*

*ఒక్కరే భగవంతుడి నామాన్ని గానం చేస్తే అది కీర్తనం. సామూహిక గానం సంకీర్తనం అని పెద్దలు చెబుతారు.*

*భజనలు నాలుగు విధాలు...*
**************