11, జూన్ 2023, ఆదివారం

సర్వభూత గణామేయ సౌహార్దాయ

 

సర్వభూత గణామేయ సౌహార్దాయ

                ➖➖➖✍️


```శ్రీమఠంలో ప్రతిరోజూ సాయంత్రం, ఏనుగులకు బెల్లం కలిపిన అన్నాన్ని పెద్ద పెద్ద ముద్దలు బంతులుగా పెట్టడం అలవాటు. మావటి ఆ అన్నం ముద్దలను చేతిలోకి తీసుకుని, నేరుగా ఏనుగు నోట్లో పెట్టేవాడు.


ఒకరోజు ఏనుగులకు అన్నం పెట్టే సమయంలో పరమాచార్య స్వామివారు మామూలుగా అటువైపు వచ్చారు. ముద్దలుగా చేసిన అన్నాన్ని చూశారు. దగ్గరలోనే ఉన్న సహాయకునితో, “ఈ అన్నం ముద్దలను ఏనుగుకు తినిపించవద్దు అని మావటికి చెప్పు” అని చెప్పి వెళ్ళిపోయారు.


వెంటనే మేనేజరుని పిలిచారు స్వామివారు.


“ఏనుగుకు పెట్టే అన్నాన్ని సరిగ్గా ఉడికించలేదు. పొడిగా, తరకలుగా విరిగిపోతోంది. ఇంత అశ్రద్ధతో, ఇలా దానికి ఆహారం పెట్టరాదు. అది మాటలురాని ఒక జంతువు, దానికి ఇలా సగం ఉడికిన అన్నం పెడతారా? మావటికి చెప్పు. ఈ ఏనుగుకు పెట్టే ఆహారం సాక్షాత్ గజముఖునికి పెట్టే నైవేద్యం లాగా ఉండాలి. అంత భక్తి ఉండాలి. అంత శ్రద్ధ ఉండాలి. మరలా అన్నం వండి, ఏనుగుకు పెట్టండి” అని చెప్పారు.


మాటలురాని ఒక జంతువుపై స్వామివారికి ఉన్న కారుణ్యాన్ని చూసి శిష్యులు కరిగిపోయారు.


మహాస్వామి వారు ఆ అన్నం ముద్దల్ని చేతిలోకి తీసుకుని పరిశీలించలేదు. అంతెందుకు, అసలు ఒక్క క్షణం అక్కడ నిలబడి వాటివైపు కూడా చూడలేదు. మరి అది సరిగ్గా ఉడకలేదని, తరకలుగా అయిపోయిందని స్వామివారికి ఎలా తెలుసు?


ఇంత చిన్న విషయాల్లో కూడా స్వామివారు తమ సర్వజ్ఞత్వాన్ని చూపేవారు.✍️```


--- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్-దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


https://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

వాల్మీకి రామాయణం:

 27.

రామాయణం...

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది...


             వాల్మీకి రామాయణం:

                   27 వ  భాగం:

                  ➖➖➖✍️



అటుపక్క దశరథుడు పట్టాభిషేకానికి చెయ్యవలసిన పనులని పురమాయిస్తూ తనకి అత్యంత ప్రియమైన కైకేయికి స్వయంగా తానే ఈ శుభవార్త చెప్పాలని కైకేయి మందిరానికి వచ్చాడు. ఎప్పుడూ నెమళ్ళు, హంసలు, సంగీత ధ్వనులు, పాటలు పాడేవాళ్ళు, హంసతూలికాతల్పాలు, ముత్యాలతో కట్టిన పరదాలతో రమణీయంగా ఉండే ఆ మందిరంలో కైకేయి ఎక్కడా కనపడలేదు. 


కైకేయి కనపడకపోయేసరికి అక్కడున్న దాసిని అడుగగా, కైకమ్మ ఎందుకనో కోపగృహంలో నేలమీద పడి ఉందన్నారు ఆ దాసీలు. 


దశరథుడు గబగబా ఆ కోపగృహం వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్లేసరికి కైకేయి నేలమీద పడిఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు దశరథుడు కైకేయితో ఇలా అన్నాడు...

"కైకేయ, నీకు ఏమన్నా వ్యాధి వచ్చిందా, అనారోగ్యంతో ఉన్నావా, మన రాజ్యంలో ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు, వాళ్ళందరిని పిలిపిస్తాను, నువ్వు అలా పడిఉంటే నా హృదయం చాలా తల్లడిల్లిపోతోంది, నీ మనస్సులో ఏదన్నా కోరిక ఉంటే చెప్పు, తప్పక తీరుస్తాను.”


అవధ్యో వధ్యతాం కో వా కో వా వధ్యో విముచ్యతాం |

దరిద్రః కో భవేదాఢ్యో ద్రవ్యవాన్వాప్యకిఞ్చనః ||


ఒకవేళ చంపవలసిన వ్యక్తి మీద నువ్వు ప్రసన్నురాలివైతే చెప్పు వాడిని వదిలిపెట్టేస్తాను. అలాగే చంపవలసిన అవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పు వాడిని చంపేస్తాను. నీకు ఒక దరిద్రుడి మీద ప్రసన్నత కలిగితే చెప్పు వాడిని ఐశ్వర్యవంతుడిని చేస్తాను. ధనవంతుడి మీద నీకు కోపం వస్తే చెప్పు వాడిని క్షణంలో దరిద్రుడిని చేస్తాను. నేను, నా భార్యలు, నా రాజ్యం, నా పరివారం అందరం నీ అధీనం కైకా. నీ కోరికేంటో చెప్పు, దాన్ని తప్పకుండా తీరుస్తాను" అన్నాడు.


“నా కోరిక ఏంటో నీకు చెప్తే, నువ్వు ఇలాంటి కోరిక కోరావేంటని అంటావు, కాబట్టి ముందు నా కోరికలని తీరుస్తానని ప్రమాణం చేస్తే అప్పుడు నా కోరికేంటో చెప్తాను” అని కైకేయి అంది.


అప్పుడు దశరథుడు "ఎవరిని నేను ఒక్క క్షణం చూడకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో, ఎవరిని విడిచి ఉండలేనో, ఎవరి మాట నా చెవిన పడకపోతే నా ప్రాణాలు ఉండవో అటువంటి రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను కైకా, నువ్వు అడిగిన కోరికలు తప్పకుండా తీరుస్తాను" అన్నాడు. 


అప్పుడా కైక..."రాజు చెప్పిన మాటని మీరు వింటున్నారు కదా ఓ రాత్రి దేవతలారా,పగటి దేవతలారా, గృహ దేవతలారా!, సూర్యుడా, చంద్రుడా, సమస్త దేవతలారా, భూమి, అష్టదిక్పాలకులారా, మీరందరూ నా తరపున సాక్షి. నేను కోరికలు కోరిన తరువాత ఆ కోరికలు తప్పకుండా ఇస్తానని రాజు నాకు మాట ఇచ్చాడు. రాజా, జ్ఞాపకం తెచ్చుకో, ఒకనాడు శంబరాసురుడు మీదకి యుద్ధానికి వెళ్ళాము, అప్పుడు నేను నిన్ను రెండు సార్లు రక్షించాను, అప్పుడు నువ్వు నాకు రెండు వరాలిచ్చావు. ఆ రెండు వరాలని ఇప్పుడు అడుగుతున్నాను అని...


అభిషేకసమారంభఓ రాఘవస్యోపకల్పితః |

అనేనైవాభిషే కేణ భరతో మేభిషిచ్యతాం |

నవ పఞ్చ చ వర్షాణి దణ్డకారణ్యమాశ్రితః |

చీరాజినజటాధారీ రామో భవతు తాపసః |

భరతో భజతామద్య యౌవరాజ్యమకణ్టకం ||


"ఏ రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామని నువ్వు సమస్త సంభారములు తెచ్చి సిద్ధం చేసావో అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. పట్టాభిషేకం చేయించుకోవలసిన రాముడు తొమ్మిది+అయిదు సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్లి నారచీర, జటలు కట్టుకొని, మాంసాహారం తినకుండా, తపస్వి లాగ బతకాలి" అని అంది.


(త్రేతాయుగ ధర్మం ప్రకారం 14 సంవత్సరాలు రాజ్యానికి దూరమైన వ్యక్తి తిరిగి రాజు కాలేడు, అందుకని కైక రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళమంది. కాని ఎవరియందు కామ క్రోధాలు అతిగా ప్రకాశిస్తాయో, వాళ్ళని దేవతలు ఆవహించి దైవకార్య నిమిత్తము వాడుకుంటారు. అందుకే దేవతలు కైకేయిని ఆవహించి ఆమెతో 14 అనిపించకుండా 9+5(నవ పఞ్చ చ వర్షాణి) అనిపించారు, కైకేయి అలా అనడం వల్ల రాముడు రావణసంహారణ అనంతరం రాజారాముడిగా పట్టాభిషేకం పొందాడు అని పెద్దలు చెప్తారు.)


అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న దశరథుడు ఈ మాట వినగానే స్పృహ కోల్పోయి ఉన్న చోటనే కూలబడ్డాడు. తరవాత అక్కడినుంచి నేల మీద పడ్డాడు. ఆయన అలా పడిపోతే కైకేయి కనీసం లేపలేదు. కొంతసేపటికి తేరుకున్న దశరథుడు...

"ఎంతమాట అన్నావు కైక. జీవితంలో ఇటువంటి మాట వినవలసి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. రాముడు నీకు చేసిన అపకారమేమిటి. రాముడు ఎన్నడూ కౌసల్యని ఒక్కదాన్నే మా అమ్మ అని సేవ చెయ్యలేదు, కౌసల్యని చూసినట్టే నిన్ను, సుమిత్రని చూశాడు. ఎన్నడూ మాట తప్పలేదు రాముడు. రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఈ కోసల దేశంలో ఎవరూ లేరు. నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి, నాకు భరతుడికి రాముడికి తేడా లేదు అనేదానివి కదా, మరి ఇప్పుడు నువ్వు ఎవరి చెప్పుడు మాటలు విని ఇలా మాట్లాడుతున్నావు? గురువులకి ఎంతో సేవ చేసిన నా రాముడు హాయిగా హంసతూలికా పాన్పులమీద నిదురించవలసిన వాడిని నువ్వు ఎందుకని తపస్వి లాగ జటలు కట్టుకొని అడవుల్లో దొరికే తేనె, కందమూలాలు తిని, చెట్ల కింద పడుకొమ్మని కోరుకున్నావు. ఇదంతా ఊహించి నేను బతకగలనా. నేను ఇప్పుడు జీవితంలో చిట్టచివరి దశకి వచ్చాను కైకా, అందుకని రాముడిని విడిచిపెట్టి నేను ఉండలేను, కావాలంటే కౌసల్యని వదిలిపెట్టమను, సుమిత్రని వదిలిపెట్టమను, నా ప్రాణాలే వదిలెయ్యమను, నన్ను సింహాసనం మీద నుంచి దిగిపొమ్మను, ఈ కోరికలన్నీ తీరుస్తాను. నీ పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను కైకా, రాముడిని పధ్నాలుగు ఏళ్ళు పంపించెయ్యమని అనద్దు.


రాముడిని నేను పంపించేస్తే, సీతమ్మ నా దగ్గరకు వచ్చి, “మామగారూ నా భర్త ఏ తప్పు చేసాడని ఆయనని అడవులకు పంపించారు” అని ఏడుస్తూ నన్ను ప్రశ్నిస్తే, నేను ఏ సమాధానం చెప్పగలను. రాముడే కనుక అడవులకు వెళితే నేను బతకలేను, శవమై కిందపడతాను , నువ్వు వైధవ్యాన్ని పొంది దిక్కులేని దానివి అవుతావు. కావున నన్ను, నీ మాంగళ్యాన్ని కాపాడుకో. రాముడు భరతుడికి ఏ అపకారము చెయ్యడు. నిన్ను కన్నతల్లిని చూసినట్టు చూస్తాడు. నీకు ఎవరో లేనిపోని విషయాలు నూరిపోశారు. నేనే కనుక రాముడిని అడవులకు పంపితే, “ఏ తప్పు చెయ్యని రాముడిని అడవులకు ఎలా పంపగలిగావు, నిన్ను మేము ఎలా నమ్మము” అని సుమిత్ర అంటుంది, అప్పుడు నేను ఏ సమాధానం చెప్పను. అరవై వేల సంవత్సరాలు రాజ్యపాలనం చేసిన నేను బయటికి వెళుతుంటే, పట్టపగలు సురాపానం చేసిన బ్రాహ్మణుడు నా పక్కన వెళుతూ, యవ్వనంలో ఉన భార్య మాటకోసం ధర్మాత్ముడైన కొడుకుని అడవికి పంపించి బతుకుతున్నవాడు ఈ దశరథుడని దెప్పిపొడుస్తాడు. ఆనాడు నేను బతికినా చనిపోయినట్టే, నాకు అటువంటి అపకీర్తి తేవద్దు. నన్ను ఒక తల్లి-బిడ్డని చూసినట్టు, ఒక అక్క-చెల్లెలు అన్నదమ్ములని చూసినట్టు, ఒక దాసి యజమానిని చూసినట్టు చూసింది కౌసల్య. అపారమైన సుగుణాభి రాముడికి తల్లి అయ్యింది కౌసల్య, అయినా నేను కౌసల్యని ఒక్కనాడూ సత్కరించలేదు. ఎందుకో సత్కరించలేదో తెలుసా, నీకు కోపంవస్తుందని సత్కరించలేదు. నేను ఎన్నడూ వారి గృహాలకి వెళ్ళలేదు, కేవలం నీయందే ప్రీతి పెట్టుకొని బ్రతికాను. నేను వృధ్యాప్యంలోకి వెళుతున్నాను కనుక ఎక్కువ కాలం బతకలేను అందుకని రాముడికి పట్టాభిషేకం చెయ్యడానికి ఒప్పుకున్నాను.


ఆ రాముడే అరణ్యాలకి వెళ్ళిననాడు నేను మరణిస్తాను, నేను మరణించానని తెలిసి కౌసల్య కూడా మరణిస్తుంది, నేనూ కౌసల్య మరణించాక ఈ రాజ్యం సంతోషంగా ఉండలేదు. నువ్వు భరతుడికి రాజ్యం ఇవ్వాలని చూస్తున్నావు, కాని భరతుడు రాజ్యం తీసుకుంటాడని నేనూ అనుకోను. చిట్టచివరికి అందరిచేత అపవాదు పొందిన దానివై, దిక్కులేని దానివై, నీ బాధ చెప్పుకోడానికి భర్త లేక విధవవైపోతావు. రాముడిని అడవులకు పంపితే నేను చనిపోతాను. నేను చనిపోయాక స్వర్గానికి వెళితే, అక్కడున్న ఋషులు, మహర్షులు నన్ను పిలిచి రాముడెలా ఉన్నాడని అడిగితే నేను ఏమి చెప్పగలను. నువ్వెవడివి నాన్నా నన్ను అడవులకు పంపించడానికి అని నన్ను రాముడు ఖైదు చేస్తే, నేను చాలా సంతోషపడిపోతాను. కాని నా రాముడు అలా చెయ్యడు, ‘నాన్నా! నువ్వు చెప్పావు అందుకని నేను అరణ్యాలకి వెళుతున్నాను’ అని అంటాడు, అది నేను తట్టుకోలేను, రాముడు అరణ్యాలలో కష్టాలు పడుతుంటే నేను ఇక్కడ సుఖంగా ఎలా ఉండగలను. నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్ళిపోవడం భరతుడి కోరికే అయితే, నా శరీరం పడిపోయాక నాకు తర్పణ పెట్టకూడదు, ఉదకక్రియ చెయ్యకూడదు, నువ్వు నా శవాన్ని ముట్టుకోకూడదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ రెండు కోరికలని ఉపసంహరించుకో, నేను అడుగుతున్నానని కాదు, ఒక ముసలివాడు, ఎందుకూ పనికిరాని వాడు అడుగుతున్నాడని నాకు నువ్వు బిక్ష పెట్టు, రాముడిని చూస్తూ చనిపోయే అదృష్టాన్ని నాకు ఇవ్వు ", దశరథుడు అలా చెప్పుతూ కైకేయి పాదాల మీద పడబోగా, తన పాదాల మీద పడుతున్నాడని తెలిసి కైకేయి పక్కకు జరగగా, దశరథుడి శిరస్సు నేలకు తగిలి, స్పృహ కోల్పోయి పక్కుకు దొర్లి పడిపోయాడు.✍️

రేపు...28వ భాగం...


                      🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

    


🍀

శివభక్తుడు

          *శివభక్తుడు...*

          *అమర్నీతి నాయనారు.*

                  ➖➖➖✍️


అమర్నీతి నాయనారు చోళరాజ్యమున ప్రసిద్ధినందిన పజైయ్యరాయికి చెందిన 

వైశ్య కులజుడు. ఆ గ్రామం చాలా సారవంతమైనది. చుట్టూ తోటలతో లతలతో పచ్చగా శోభాయమానంగా ఒప్పుతూండేది. 


*అమర్నీతి నాయనారు* బంగారం, 

రత్నాలు, పట్టు వస్త్రముల వ్యాపారి. విదేశాలనుండి వస్తువులను తెప్పించి వ్యాపారం చేస్తుండేవాడు. ఆయన ఆర్జన ఎంతో నీతిమంతముగా ఉండేది. 

వ్యాపారం కలిసి రావడంతో మంచి ధనవంతుడయ్యాడు. 


వ్యాపారము చేస్తున్నా, ఇహలోక వ్యాపకాలున్నా, నాయనారు మనసు 

శివుని మీదే వుండేది. పరమశివ 

భక్తుడు. శివభక్తులను తన గృహమునకు పిలిచి వారిని అర్చించేవాడు. వారలకు కౌపీనము, దుస్తులు మొదలగునవి ఇచ్చి, సుష్టుగా భోజనము పెట్టి, ఏమైనా కానుకలు ఇచ్చి, వారు సంతసించునట్లుగా చేసి సాగనంపేవాడు.


పండుగలలో పబ్బాలలో తిరునల్లూరు దేవాలయమునకు దైవ దర్శనమునకు వెళ్లేవాడు. అక్కడ శివుని ముందు భావయుక్తంగా పంచాక్షరిని జపిస్తూ 

శివుని అర్చించేవాడు. 


కొన్నాళ్లకి పండుగలకు మాత్రమే తిరునల్లూరు దేవాలయమునకు వెళ్ళటంతో సంతృప్తినందక - ఆ వూరిలోనే నివసిస్తే - నిరంతరము శివ దర్శనము చేయవచ్చని, శివభక్తుల సేవకు వీలవుతుందని తలచి - తిరునల్లూరుకు తన బంధువులతో సహా వెళ్లి, అక్కడే స్థిరపడి - దైవదర్శనమునకు వచ్చెడి శివభక్తులకు వుండుటకు వీలుగా ఒక మఠం కట్టించాడు. 


ప్రతి దినము వారిని తన ఇంటికి పిలిచి, వారలకు కౌపీనము మొదలగునవి ఇచ్చి సంతసింపజేసేవాడు.



నాయనారు భక్తితత్పరతకు పరమశివుడు పరవశించి పోయాడు. ముఖ్యముగా కౌపీనములను ఇచ్చుచుండుట, శివభక్తులయెడ వాత్సల్యము, ఔదార్యము శివుని ఆకర్షించినవి. 


అతని ఔదార్యాన్ని అందరిచేత ప్రశంసింపజేయాలని, అతనికి తన శుభాశీస్సులను ఇయ్యటానికి శివుడు నిశ్చయించాడు. 


అందుకని ఒకరోజున బ్రహ్మచారి వేషంతో జటతో, విభూతి పుండ్రములు, భుజం మీద దండంతో శివుడు అమర్నీతి నాయనారు మఠంకి విచ్చేశాడు. బ్రహ్మచారి దండానికి చివర 2 కౌపీనములు, విభూతిసంచి కట్టబడి వున్నాయి. ఆయన ముఖం తేజోవంతంగా ఉంది. కళ్లు ప్రకాశమానంగా వున్నాయి. 

ఠీవిగా మఠంలోకి ప్రవేశించాడు. 


అమర్నీతి నాయనారు పరమానందంతో అతిథిని ఆహ్వానించి అర్చించాడు. 



బ్రహ్మచారి - అమర్నీతి నాయనారుతో, "మీరు మహాత్ములు. ప్రతి ఒక్కరు మీ దానాలకి, ముఖ్యముగా కౌపీనముల దానాలకు మిమ్మలను అభినందిస్తున్నారు. మీ దర్శనానికి వచ్చాను." అని అన్నాడు. 


అమర్నీతి నాయనారు - బ్రహ్మాచారిని తన వద్దనుండి బిక్షను స్వీకరించవలసిందిగా అర్థించాడు. బ్రహ్మచారి ఒప్పుకొని, "నేను నదికెళ్లి స్నానము చేసి నిత్యకర్మానుష్టానము చేసి వస్తాను. వర్షము వస్తోంది. వర్షమునకు నా కౌపీనములు తడిసిపోయాయి. అందుకని ఈ పొడి కౌపీనమును జాగ్రత్త పరచండి. నేను వచ్చి తీసుకుంటాను. అది చాలా విలువైంది, ప్రత్యేకమైనది గూడ. అందుచే దానిని భద్రముగా ఉంచండి" అని చెప్పి స్నానానికి నదికి వెళ్లాడు.


బ్రహ్మచారి నదికి వెళ్లాడు. అమర్నీతి నాయనారు ఆ కౌపీనమును భద్రపరిచాడు. పరమశివుడు దానిని మాయం చేశాడు. 


బ్రహ్మచారి స్నానము చేసి వచ్చి, తన పొడి కౌపీనమును ఈయమని కోరాడు. తన రెండో కౌపీనము వానకు తడిసిపోంది. అందుకని పొడిదానిని అడిగాడు. 


అమర్నీతి నాయనారుకు తాను భద్రపరచినచోట కౌపీనము కనిపించలేదు. అంతటా వెదికాడు. ఎక్కడా కనిపించలేదు. అందుకని వణుకుతూ బ్రహ్మచారికి ఇంకొక కౌపీనముతో నిలబడి పరిస్థితిని చెప్పాడు. 


బ్రహ్మచారి నాయనారు మాటలను అంగీకరించలేదు. వినలేదు. నాయనారు చాలాధనము దానికి బదులుగా యిస్తానన్నాడు. 


బ్రహ్మచారి, "ధనాన్ని నేనేమి చేసికొంటాను? అవసరం లేదు, నా అవసరం కౌపీనము మాత్రమే" అన్నాడు. బ్రహ్మచారి ఇంకా ఇలా అన్నాడు. "మీకు కౌపీనము కనిపించనిచో, నా ఇంకో కౌపీనమునకు సరితూగే వేరొక కౌపీనమును ఈయండి" అన్నాడు. 


అమర్నీతి నాయనారుకు కొంచెం స్వస్థత కలిగింది. వెంటనే త్రాసును తెప్పించాడు. బ్రహ్మచారి కౌపీనమును ఒక తక్కెటలో ఉంచాడు. రెండో తక్కెటలో తాను ఇవ్వదలచిన కౌపీనమును పెట్టాడు. బ్రహ్మచారి కౌపీనమే ఎక్కువ బరువు చూపింది. 


అమర్నీతి నాయనారు ఏమిపెట్టినను బ్రహ్మచారి కౌపీనమే బరువుగా కనిపించింది. అమర్నీతి నాయనారుకు ఆశ్చర్యము కలిగింది. ఇదంతా శివలీలయని గ్రహించాడు. తన సంపద యావత్తు బ్రహ్మచారి కౌపీనమునకు సరితూగలేదు. పరమ శివుని కౌపీనము వేదమును తలపింపజేస్తుంది. దాని పోగులు శాస్త్రాలు.


అమర్నీతి నాయనారుకు ఏమీ పాలుపోలేదు. బ్రహ్మచారి కాళ్లమీద పడ్డాడు. "స్వామీ! నన్ను, నా భార్యను, నా పుత్రుని గూడ మీ కౌపీనమునకు సమమవుతాయేమో తూచండి" అని అర్థించాడు. 


బ్రహ్మచారి అందుకు అంగీకరించాడు. అమర్నీతి నాయనారు తన కుటుంబముతో సహా తక్కెటలో కూర్చుంటూ, "నేను శివభక్తులను భక్తితో, చిత్తశుద్ధితో, సేవించుచున్నట్లయితే, ఈ త్రాసు ఇప్పుడు సరితూగుగాక" అన్నాడు. 


త్రాసు ఆశ్చర్యకరంగా సరితూగింది. అమర్నీతి నాయనారు పుణ్యం బ్రహ్మచారి కౌపీనమూనకు తుల్యమయింది. 


అచ్చట చేరిన ప్రజలందరూ ఆశ్చర్య చకితులయ్యారు. వారు అమర్నీతి నాయనారు పాదములపైబడి ప్రశంసించారు. దేవతలు ఆ కుటుంబముపై పారిజాత సుమ వృష్టి కురిపించారు. బ్రహ్మచారి అంతర్థానమైనాడు. పార్వతీపరమేశ్వరులు వృషభ వాహనముపై ప్రత్యక్షమై, నాయనారును అనుగ్రహించారు. పరమేశ్వరుడు అమర్నీతి నాయనారును ఉద్దేశించుచు, "నీ కౌపీన దాతృత్వము, శివభక్తుల నిరుపమాన సేవ మమ్మల్ని అలరించాయి. నీవు, నీ భార్య, నీ పుత్రుడు - ముగ్గురూ నా లోకంలో శాశ్వతంగా నివసించండి" అన్నారు. 


శివానుగ్రహం వల్ల తక్కెడ దివ్యవిమానంగా మారి, అమర్నీతి నాయనారును, అతని భార్యను, మఱియు అతని పుత్రుని శివలోకానికి చేర్చింది.✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

తెలంగాణం

 తెలంగాణం.


ప్రకాశపు కాంతులీడిన  ప్రాంతాన

కమ్మిన చీకటిని చీల్చేను సమస్తాన

భారతమాత మోము చిరునవ్వున

ఆ నవ్వు చిందించేది తెలంగాణం.


పాడి పంటల రాశి దేశానికే వాసి

రైతు మోమున సంతోషాల హోలీ

నవ భగీరధుడి అద్బుత సృష్టి

నేల పారేను జలసిరుల తెలంగాణం.


ప్రజారోగ్యానికి అండగా నిలబడే

ఇంటింట కంటి వెలుగును చూపే

అడుగడుగునా సంక్షేమ ఫలం

ప్రజారాజ్యము మన తెలంగాణం.


ఆడబిడ్డకు అండగా నిలిచే

పుట్టిన శిశువుకి భద్రతా కిట్

పుస్తే సమయాన కళ్యాణ కానుక

మహిళకు భరోసానిచ్చే తెలంగాణం.


సరస్వతి బిడ్డలకు కొండంత అండ

విజ్ఞాన కాంతి విరజిల్లే రాష్ట్రమంత

విలాసిల్లే ఉత్పత్తి, ఉపాధి రంగం

విలక్షణ సంపద తెచ్చే తెలంగాణం.


కళ కళ లాడుతుందీ ప్రాంతం  

జల నడకన సిరి మోము వైనం

ఆసాంతం చూస్తుంది యావత్ దేశం

అభివృద్దికి దిక్సూచిగా తెలంగాణం.


పేద ప్రజల ఆత్మ గౌరవ జీవనం

డబుల్ బెడ్రూం ఇచ్చేను నివాసం 

ఇరుకు పోయి తెచ్చేను పదిలం 

గృహస్తుల ఆనందపు తెలంగాణం.


దళితుల అభివృద్ధికి దళితబంధు

చేతి వృత్తులకు ఆపన్న సాయము

కులమతాల మధ్య సామరస్యము

ఆధ్యాత్మిక ప్రాంతం తెలంగాణం.


కల్లోల కాలంలో రోగాలకు బెదరక

జనం మేలుగాంచి  చేసేను సేవన

ధీర్ఘ రోగులకు సి.యం.రిలీఫ్ ఫండ్

సమస్త ఆరోగ్య కాంక్షిచే తెలంగాణం.


మిషన్ కాకతీయ, భగీరధ పధకాలు

ఊరూరా సాగు నీరు, తాగు నీరు

ప్రతి ఇంట కులాయి నీటి ధారలు

అన్నింట పధకాల తెలంగాణం.


కల్లాల్లో సంతోషాల కనులు

ధరణిన తొలిగేను భూ సమస్యలు

ప్రతి పొలం గట్టును చేసేను భద్రం

నవ వ్యవస్థీకరణతో తెలంగాణం.


రంగమేదైనా ప్రోత్సాహ వైనం

పెరిగేను సాప్ట్వేర్ ఉద్యోగ రంగం

వనరులన్నీ పెంచే ఆదాయం

సంపద పెంచి పంచే తెలంగాణం.


కళలకు కళాకారులకు తోరణం

గానాలకు గాత్రాలకు ఆస్థానం

చిత్రమైన చిత్రాలకు నిలయం

కళామతల్లి సౌధం తెలంగాణం.


కారుచీకటి రోజులు పోయేను

పున్నమి కాంతులు తెచ్చేను

ముప్పై ఒక్క జిల్లాల సముదాయం

అధికార వికేంద్రీకరణ తెలంగాణం.


పాలనలో అభివృద్దే ముఖ్యం

ప్రజాక్షేమమే పాలకుల ధ్యేయం

ఎదురు చూస్తుంది యావత్ దేశం

రాజ్యానికే ఆదర్శం తెలంగాణం.


స్వయం పాలనలో పదేండ్ల రాష్ట్రం

సొంతమయ్యే ఆనంద ప్రాంతం

సౌభ్రాతృత్వ తత్వం  సకల జనం

సుజల సుఫల సురక్ష తెలంగాణం.


తెలంగాణా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలతో...


సాహిత్య దినోత్సవం.


అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

9391456575,


33-54, టి.యస్.ఆర్ నగర్,

బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్

బాలాపూర్ మండలం, 

రంగారెడ్డి జిల్లా, తెలంగాణా.

దేహం తండ్రి ప్రసాదం*

 

          *దేహం తండ్రి ప్రసాదం*

                  ➖➖➖✍️



*’దేహం తండ్రి ప్రసాదం’ అని వేదం స్పష్టంగా చెప్పింది.*


*‘పురుషే హవా అయిమదితో గర్భో…’ అని మొదలయ్యే ఐతరేయ మంత్రం- శుక్రం రూపంలో, అంటే వీర్యంగా పురుషుడు  స్త్రీ యందు ప్రవేశించడం వల్ల దేహధారణ జరుగుతుందని వివరించింది.*


*తండ్రి బింబం అయితే, తనయుడు ప్రతిబింబమని దీని అర్థం.*


*తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు చేసిన అపూర్వ త్యాగాన్ని రామాయణం విస్తారంగా చర్చించింది.*


*తండ్రి యయాతికి తన యౌవనాన్నే ధారపోసిన పూరుడి కథను భాగవతం వర్ణించి చెప్పింది.*


*తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి చివరికంటా బ్రహ్మచర్యం పాటించిన భీష్మ పితామహుడి గాథను భారతం వివరించింది.*


*‘పుత్ర శబ్దానికి – తన మంచి పనులతో ప్రీతి కలిగించేవాడు, పితృభక్తి గలవాడు మాత్రమే అర్హుడు’ అని మన పెద్దలు నిర్వచించారు.*


*‘భార్య, భర్త అనే రెండు తాళ్లు ముడివేస్తే, ఆ ముడి- సంతానం’ అంటాడు భర్తృహరి.*

*దాన్నే ‘సుతాకారపు ముడి’ అని చెబుతారు.*


*అది పేగు బంధం. ఆ బంధం శిథిలమైతే బతుక్కి అర్థం ఉండదు.*


*వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన ‘శ్రవణ కుమారుడు’ …*


*అనుక్షణం తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న ‘ప్రవరాఖ్యుడు’ …*


*అమ్మ ఆర్యమాంబకు ఇచ్చిన మాట కోసం సన్యాస దీక్ష నుంచి దిగివచ్చి అమ్మకు అంత్యక్రియలు నిర్వహించిన శంకరులు …*


*ఇలాంటివారే పుత్ర శబ్దానికి అర్హులు.*


*అంతేకాని- వృద్ధులైన అమ్మానాన్నలను సేవించడం కంటే, వృద్ధాశ్రమాల్లో పెట్టి పోషించడం సౌకర్యంగా ఉంటుందనుకునేవాళ్లు, పుత్రులు అనిపించుకోరు.*


*అమ్మను ఇంట్లో ఉంచుకుందాం దేనికైనా ‘పని’ కొస్తుందని, అమ్మానాన్నలను విడదీసేవారికి ‘తల్లిదండ్రులు’ అనే పదం గురించి బొత్తిగా తెలియదని అర్థం.*


*ఆ పదం సమాసరీత్యా ద్వంద్వమే కానీ, స్వభావరీత్యా ఏకవచనమే!*


*కాబట్టే విగ్రహవాక్యం – ‘ తల్లియును తండ్రియును ’ అంటూ ఏకవచనంలో చెప్పాలంది వ్యాకరణ శాస్త్రం.*

*‘వారు ఇద్దరు కారు, ఒక్కరే’ అనే భావనను మనలో పెంపొందించడానికే – భారతీయ తత్వచింతన అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదించింది.*


*కుటుంబ వ్యవస్థకు, గృహస్థుధర్మ నిర్వహణకు ఆధారపీఠాలుగా నిలిచిన నాలుగు మూల స్తంభాల్లో ‘మాతృదేవోభవ’ ‘పితృదేవోభవ’ లను మొదటి రెండుగా చెబుతారు.*


*వీటిలో అమ్మకు- పెరట్లో తులసి మొక్క గూట్లో కాంతులీనే ప్రమిద దీపం ప్రతీక!*


*ఇంటి వాకిటా వికాసాన్ని వెదజల్లే వీధిగడప దీపం నాన్నకు ప్రతీక!*


*లోకంలో అమ్మలపై వచ్చినంత కవిత్వం నాన్నల గురించి రాకపోవడంలో విచిత్రం ఏమీ లేదు.*


*అమ్మ ప్రేమ పారదర్శకం, నాన్న ప్రేమ గుంభనం కావడమే దానికి కారణం. అమ్మది ఆప్తవాక్యం, నాన్నది గుప్తధనం!*


*అమ్మ ప్రేమలో వైశాల్యం ఎక్కువ. నాన్న ప్రేమకు లోతెక్కువ.*


*ఆత్మీయత, వాత్సల్యం వంటి విషయాల్లో ఇద్దరి స్వభావాలూ ఒక్కటే అయినా- నాన్న అంత తొందరగా బయటపడడు కాబట్టి, అమ్మతో ఉన్నంత చనువు నాన్నతో లేకపోవడం లోక సహజం!*


*అమ్మ జన్మదాత, నాన్న జీవనదాత. పిల్లలకు రక్షణ, పోషణ విషయంలో నాన్నే ఆలంబన.*


*శ్రమ విషయంలో కొడుకు తనకన్నా తక్కువ కష్టాలతో గట్టెక్కాలని, స్థాయి విషయంలో తనకన్నా చాలా ఎత్తుగా ఉండాలని తపన పడని తండ్రి ఉండడు. దానికోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడటం నాన్న లక్షణం !!*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



జన్మ లక్ష్యం…*

 100623j1913.      120623-6.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


        *మానవ జన్మ లక్ష్యం…*

              *బ్రహ్మ జ్ఞానం!*

                ➖➖➖✍️


*మన జన్మ లక్ష్యం బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడం, జన్మను సార్ధకత చేసుకోవడం..!*


*విశ్వమంతా బ్రహ్మం ఉంది, బ్రహ్మం తప్ప మరేమీ లేదు.*

*అయినా, అది ఎక్కడ చూసినా కనిపించదు, వినిపించదు.*


*బ్రహ్మం - సత్యం - జ్ఞానం - అనంతం..!*

*ఇదీ ఉపనిషత్తులు ఇచ్చిన అర్థం. బ్రహ్మం అంటే సత్యం,*

*సత్యం అంటే జ్ఞానం,*

*జ్ఞానం అంటే అనంతం...*

*అంటే.. ఇవేవీ వేర్వేరు కాదు. అన్నీ ఒకటే.*


*స పర్యగా చ్ఛుక్రమకాయ మవ్రణమ్ అస్నావీరమ్ శుద్ధమపాపవిద్ధమ్ కవిర్మనీషీ పరిభూః స్వయమ్భూః యాథాతథ్యతోర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః*


*ఎవరైతే బ్రహ్మ జ్ఞానం పొందుతారో వారు బ్రహ్మన్(పరమాత్మ) స్థాయికి చేరుతారు.        బ్రహ్మన్ అంటే పరమాత్మ, ఆయన 'చ్ఛుక్రమ్' పరిశుద్ధమైనవాడు, స్వచ్చమైన వాడు.*

*జీవుడు ముక్తి పొందాక కర్మ తొలగి ఇలాంటి స్థితిని పొందుతాడు.*

*పరమాత్మ దయ వల్లే ఇది లభించాలి తప్ప మరొక మార్గం లేదు.*


*'అకాయమ్' ఆయన దేహం లేనివాడు, అంటే మన వంటి మురికి స్రవించే పాంచభౌతిక దేహం కాదు, ఆయనది పంచ ఉపషణ్మయ దివ్య మంగళ విగ్రహం.*

*'అవ్రణమ్' రోగాలు, వ్యాధులు అంటని శరీరం.*


*'అస్నావీరమ్'.. ప్రేగులు నరాలు ఉండే దేహం కాదు. కనుక 'శుద్ధమపాపవిద్ధమ్' ఆయన దేహం పాప పుణ్యాలకు అతీతమైనది.*


*పరమాత్మ తత్త్వాన్ని ఎవడైతే గుర్తిస్తాడో వాడూ అట్లాంటి స్థితినే పొందుతాడు. వాడు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు దర్శించగలుగుతాడు.*

*కర్మ తొలగుతుంది కాబట్టి అట్లాంటి స్థితి ఏర్పడుతుంది, కర్మ వల్ల ఏర్పడ్డ శరీరానికి హద్దులు ఎన్నో.   మనం కంటితో అన్నింటినీ గుర్తించగలమా? మన ఇంద్రియాలకు, ఊహకు ఉన్న శక్తి సంకుచితమైనది.*


*ముక్తి పొందిన జీవుడికీ పరమాత్మ మాదిరిగా జ్ఞానం అంతటా విస్తరించి వుంటుంది. సూక్షమైన జ్ఞానం కలిగి ఉంటాడు.*

*వాడు జ్ఞానం కోసం తపిస్తూనే ఉంటాడు. వాడి మనస్సు పూర్తి నియంత్రణలో ఉంటుంది.*

*వాడికీ కోరికలు ఉంటాయి, కానీ అవి పరమాత్మ మయమై ఉంటాయి. భగవంతుని సేవ చేయాలని కోరిక ఉంటుంది. వాడికీ కోపం ఉంటుంది, ఇతరత్రమైన విషయాల యందు.* 

*అట్లాంటి వాడికి మరణం అనేది ఉండదు, ఆ స్థితినుండి దిగజారడం అనేది ఉండదు. కర్మ బంధాలు తొలగి భగవత్ అనుభవాన్ని ఎప్పటికీ అనుభవిస్తూ ఉంటాడు.*


*గురువు మనకు ఇది చెప్పాలంటే.. మనకు నాలుగు అర్హతలు కావాలి. 1. వైరాగ్యము. 2. వివేకము. 3. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం  అనే ఆరు సంపదలు 4. ముముక్షత్వం.. ఈ 4 మీలో ఉంటే.. గురువు మిమ్మల్ని పరీక్ష చేసి బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు.* 


*వరుణుడు తన కొడుకైన భ్రృగువును, ఎన్నో రకాలుగా పరీక్ష చేసి బ్రహ్మ జ్ఞానం తెలుసుకోనేటట్టు చేస్తాడు.*


*నిజానికి బ్రహ్మజ్ఞానం పొందడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందనే విషయం చెప్పలేం. ఒక్క ఘడియలో రావచ్చు. ఒక్క రోజులో రావొచ్చు. ఒక్క సంవత్సరంలో రావొచ్చు. ఒక్క జన్మ కావొచ్చు. కొన్ని జన్మలు కూడా పట్టొచ్చు. ఇదే బ్రహ్మ విద్య. బ్రహ్మ జ్ఞానం రావడం కాదు. మీరే బ్రహ్మంగా మారిపోతారు. మారడమేకాదు. అసలు మీరెప్పుడూ బ్రహ్మ గానే ఉన్నారు - అని తెలుసుకొంటారు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺

దిలీపుడు

 *రఘు వంశం ...*


                 *దిలీపుడు!*

                 ➖➖➖✍️


*శ్రీరాముని తండ్రి దశరధుడు! మరి దశరధుని తండ్రి అజుడు!అయితే అజుని తండ్రి రఘు మహారాజు!*

*సరే, రఘు మహారాజు తండ్రి దిలీపుడు!*

*అంటే దిలీపుని మునిమనవడే శ్రీరాముడు!*

*సూర్య వంశానికే వెలుగు తెచ్చిన వాడు దిలీపుడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నా కడుపున పుట్టిన వారు లేరు. దానికీ కారణం ఉంది. ఇంద్రలోకం వెళ్ళి దేవేంద్రుణ్ని దర్శించి వస్తున్నాడు దిలీపుడు. ధర్మ సంరక్షణ కోసం భార్య సుదక్షిణాదేవి దగ్గరకు వెళ్ళే తొందరలో కానవచ్చిన కామధేనువును పూజించడం మరిచిపోయాడు. అవమానంగా భావించిన కామధేనువు శపించింది. సంతానం లేకుండా అయిపొమ్మని. ఐరావత ఘీంకారం వల్ల ఆ మాట దిలీపునికి వినిపించలేదు.* 


*ఇవేవీ తెలియక పిల్లలు లేరని దుఃఖంతో రాణీ సమేతుడై వశిష్ఠుని ఆశ్రయించాడు.*


*వసిష్ఠుడు దివ్య దృష్టితో శాపమూలం తెలుసుకున్నాడు. కాని కామధేనువు పాతాళ లోకంలో ఉండడంతో – తన ఆశ్రమంలో ఉన్న “నందినీ ధేనువు”ని సేవించమన్నాడు. అలా సేవిస్తే సంతానం కలుగుతుందనన్నాడు.*


*దిలీపుడు సర్వ సుఖాలూ వదిలి గోవుల కాపరి అయ్యాడు. నందినీ సేవకుడయ్యాడు. సతీసమేతంగా ఆ గోవుని కన్న బిడ్డకన్నా ఎక్కువ మమకారంతో చూసుకున్నారు.* 


*అలా ఇరవై రోజులు గడిచాయి. నందిని కూడా రాజ దంపతులను గమనిస్తూనే ఉంది.*


*ఒకరోజు నందిని కావాలని దారి తప్పింది. మేస్తూ మేస్తూ హిమవత్పర్వతమున్న ప్రాంతం చేరింది. ఒక గుహలోకి దూరింది. వెన్నంటే ఉన్న దిలీపుడు పరిసరాల ప్రకృతి అందాలకు మైమరచి పోయాడు. సింహపు గాండ్రింపు విని ఉలిక్కి పడ్డాడు. గృహలోకి చొరబడ్డాడు. అప్పటికే నందిని మీదకి సింహం ఉరికింది.*


* దిలీపుడు క్షణాల్లో బాణాన్ని అందుకోబోయి అలాగే నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఎందుకంటే సింహం మనిషిలా మాట్లాడడం మొదలు పెట్టింది.*


*ఆ పరిసర ప్రాంతాల రక్షకుడిగా శివకింకరుడిగా చెప్పుకుంది. అక్కడకు వచ్చిన జంతువులను చంపితినే అధికారం తనకుంది అంది. శివుని ఆజ్ఞగా చెప్పుకుంది సింహం. ఆవు ఆహారమై పోనుందని చెప్పి దిలీపుణ్ని వెళ్ళిపోమంది.*


*దిలీపుడు చేతులు జోడించి సింహరాజుని వేడుకున్నాడు. తనని ఆహారంగా స్వీకరించమన్నాడు. నందినీ గోవుని విడిచి పెట్టమన్నాడు. గురువు గారి ప్రాణంగా చెప్పాడు. తన ప్రాణం తీసుకోమన్నాడు. అపకీర్తిని అంట గట్టొద్దన్నాడు. ఈ శరీరం ఎప్పుడైనా నశించేదే అన్నాడు. తనకు తానే ఓ మాంసపు ముద్దలా ముడుచుకుపోయి సింహం నోటి ముందు నిలబడ్డాడు.*


*మూసినకళ్ళు తెరిచేసరికి సింహం మాయమయ్యింది. నందిని నవ్వింది. అంతా తను పెట్టిన పరీక్షంది. పరీక్షలో గెలిచావంది. సంతానం కలుగుతుంది అంది. అందుకు తన పాలను స్వీకరించమంది.*


*దిలీపుడు ఎంతో సంతోషపడినా పాలను స్వీకరించలేనన్నాడు. నీ పాలు గురువుగారి యాగ కార్యాలకు వినియోగించాక, నీ బిడ్డలకు ఇచ్చాక మిగిలితే… అందుకు గురు దేవులు వసిష్టమహర్షి అనుమతిస్తే… అన్నాడు.* 


*అతని ధర్మ నిరతికి వసిష్ఠుడు మెచ్చుకుని అనుమతినీ ఆశీర్వాదాన్నీ అందించాడు.*


*ఆ దంపతులు పాలను సేవించారు. ఆ తర్వాత పండంటి బిడ్డను కన్నారు. అతడే రఘు మహారాజు!*


*దిలీపుడు తిరుగులేని మహారాజుగా తొంభై తొమ్మిది అశ్వమేధయాగాలు చేసి, నూరో యాగం తలపెట్టేసరికి ఇంద్రుడు భయపడ్డాడు. అశ్వాన్ని మాయం చేసాడు.*


*అది తెలిసి కొడుకు రఘుని పంపుతాడు. నందిని తోడు వెళుతుంది. ఇంద్రుడు యుద్ధంలో వజ్రాయుధాన్ని విసురుతాడు. అది ఏ ప్రభావమూ చూపలేకపోతుంది.*


*అప్పుడు ఇంద్రుడు అశ్వమేధ యాగానికి అడ్డుచెప్పడు. అశ్వాన్నీ ఇవ్వడు. రఘు తిరిగి రాజ్యానికి వస్తాడు. రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు!*

✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

వైటమిన్ బి12 డెఫిషియెన్సీ

 *ఎక్కువ స్ట్రెస్‌కి గురయ్యే ఉద్యోగాల్లో ఉన్న వారికి తరచూ వైటమిన్ బి12 డెఫిషియెన్సీ ఏర్పడుతూ ఉంటుంది. మానసిక వత్తిడి శరీరంలో పెద్దమొత్తంలో బి వైటమిన్స్‌కి ఖర్చుచెయ్యడం దీనికి ప్రధాన కారణం.అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*


         శరీరంలో అసమతౌల్యత ఏర్పడింది అని ఈ సంకేతాలను బట్టి అర్థం చేసుకోవాలి. చాలామందికి దీనికి పరిష్కారంగా ఎక్కువ డోసుల్లో బి కాంప్లెక్స్ టాబ్లెట్లని తీసుకుంటూ ఉంటారు. సమస్య సాల్వ్ అయినట్లు ఉంటుంది గానీ, సమస్య అసలు కారణాలు అర్థం చేసుకోకుండా తాత్కాలికంగా ఉపశమనం పొందితే ఉపయోగం ఉండదు.


*సమస్య మూలాల్లోకి వెళితే..*

           వత్తిడి అనేది మనస్సు, శరీరాలను ఒక స్థాయికి మించి అలసటకు గురిచేస్తే ఏర్పడేది. అది విపరీతంగా ఆలోచించడం కావచ్చు.. శారీరక కష్టం చెయ్యడం కావచ్చు. శరీరం, మనస్సు యొక్క సామర్థ్యాలకు మించి వాటిని వాడితే అది రాజసిక గుణాన్ని శరీరంలో పెంచుతుంది. అంటే ఒక వెహికిల్‌కి దానికి ఉద్దేశించబడిన స్పీడ్ కన్నా విపరీతమైన స్పీడ్‌తో నడపడం లాంటిది అన్నమాట.


🛑 *విటమిన్ డి లోపాన్ని గుర్తించే లక్షణాలు*


🛑 *కండరాల బలహీనత:*


 ఎలాంటి కారణం లేకుండా కండరాల పరిమాణం తగ్గడం, అనవసరంగా నొప్పిగా అనిపించడం విటమిన్ డి లోపానికి సంకేతం. నాడీ కణాలకు సరిగా విటమిన్ డి అందనప్పుడు అలాంటి సమస్య మొదలవుతుంది.  


🛑 *డిప్రెషన్:*


 విటమిన్ డి లోపిస్తే డిప్రెషన్ వేధిస్తుంది. అనవసరంగా డిప్రెషన్ కు లోనవడం, చిన్న విషయానికి ఎక్కువగా చింతించడం వంటి లక్షణాలు విటమిన్ డి లోపాన్ని సూచిస్తాయి. 


🛑 *నొప్పి:*


 ఎక్కువగా నొప్పులకు గురవుతున్నారంటే జాగ్రత్త వహించడం మంచిది. ఎన్ని రోజులైనా.. తలనొప్పి, కండరాల నొప్పి వంటివి తగ్గడం లేదంటే.. ఒకసారి విటమిన్ డి టెస్ట్ చేయించుకోవడం మంచిది. 


🛑 *ఎముకలు:*


 విటమిన్ డి కి ఎముకల ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధముంది. విటమిన్ డి లోపిస్తే.. ఎముకల ఆరోగ్యం క్షీణిస్తుంది.  


🛑 *బీపీ:*


 విటమిన్ డీ లోపిస్తే.. బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశముంది. గుండె ఆరోగ్యంలో విటమిన్ డి ప్రధానం. ఒక వేళ బీపీ పెరిగిందని అనిపించినా.. చిన్న విషయాలకూ చిరాకు పడుతున్నా.. విటమిన్ డిపై శ్రద్ధ వహించాలి. వెంటనే డాక్టర్ ని సంప్రదించి జాగ్రత్త పడాలి.  


🛑 *చిరాకు:*


 చీటికి మాటికి చిరాకులకు, కోపానికి గురవుతున్నారా.. అయితే మీ శరీరంలో విటమిన్ డి స్థాయిలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. విటమిన్ డి లోపిస్తే.. మెదడులో మానసిక ఒడిదుడులపైపై ప్రభావం


*దీన్ని సరిచెయ్యాలంటే లక్షణాలు కనిపించగానే వైటమిన్ టాబ్లెట్స్ వేసుకుని సమస్యని దాచిపెట్టడం కాదు..*


          మన మానసిక వత్తిడిని తగ్గించుకోవడం సరైన పరిష్కారం.

*ధన్యవాదములు 🙏*

*మీ నవీన్ నడిమింటి*

ఫోన్ -9703706660

This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group

ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి డాక్టర్స్ సలహాలు కోసం మాత్రమే .👇

 


            *ఆచార్య సద్బోధన:*

                ➖➖➖✍️


```కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది. ఎంత గట్టిగా కొడితే తిరిగి అంతే గట్టిగా మన వైపు వస్తుంది.


బంతి దెబ్బనుండి తప్పించుకోవచ్చునేమో కానీ కర్మ దెబ్బ నుండి మాత్రం తప్పించుకోలేం! 


పామరుడు అయినా పండితుడు అయినా సరే తాను చేసిన ప్రతీ కర్మకు ఇప్పుడో మరెప్పుడో ఫలం అనుభవించాలి.


కనుక కర్మ చేసినపుడు,              ఇది మంచిదా? చెడ్డదా? అని ఆలోచించి చేయాలి.


మనకు లాభం వస్తుంది కదా అని ఏది పడితే అది చేసేస్తే కర్మ కూడా తన పని తాను చక్కగా చేసుకుపోతుంది. 


కనుక విచక్షణతో కర్మలను ఆచరించాలి. 


దేవుణ్ణి మనసు నిండుగా నింపుకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి నిజముగా ప్రేమించినవాడే కర్మకు భయపడి ఉంటాడు. 


ఎందుకంటే వారు చేసిన పనికి దేవుడు క్షమించినా కర్మ వదిలిపెట్టదు అని వారికి బాగుగా తెలుసు కనుక!


అయితే దేవుడంటే లెక్క చేయని వారికి అది అంత సులువైన పని కాదు! వాళ్ళు తమ బుద్ధులను మార్చుకుని దేవునివైపు తిరిగితే తప్ప వాళ్ళను రక్షించడం సృష్టి కర్త వలన కూడా కాదు!✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

అనన్య చింతన*

 *అనన్య చింతన*


తానే సర్వస్వం అని, తనని అనన్య చింతనతో స్మరించుకునే వారి యొక్క యోగ క్షేమాన్ని తాను అన్నీ చూసుకుంటాను అన్న భరోసా శ్రీకృష్ణుల వారు. 


యాంతి దేవవ్రతా దేవాన్ 

పితౄన్ యాంతి పితృవ్రతాః । 

భూతాని యాంతి భూతేజ్యా 

యాంతి మద్యాజినోఽపి మామ్ ।। 

ఆ.9 శ్లో.25 


దేవతలను పూజించే వారు దేవతల యందు జన్మిస్తారు, పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరకి వెళ్తారు, భూతప్రేతములను అర్చించువారు అలాంటి వాటిల్లో పుడతారు, మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు.


ఈ శ్లోకంలో స్వామివారు అత్యున్నత ఆధ్యాత్మిక పురోగతి సాధించటం కోసం మనము ఆ పరమాత్మనే ఆరాధించాలి అని చెప్తున్నారు.

.

ఇంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, అగ్ని వంటి వారిని ఆరాధించేవారు స్వర్గాది లోకాలకు వెళతారు. ఆ తర్వాత వారి యొక్క పుణ్య ఫలములు తరిగిపోయిన తరువాత వారు స్వర్గము నుండి పంపించి వేయబడుతారు. పితృదేవతల పట్ల కృతజ్ఞతా భావన ఉండటం మంచిదే, కానీ వారి అతి చింతన నష్టదాయకమై మరణించిన పిదప పూర్వీకుల లోకాలకు వెళతారు.


తామస గుణ ప్రధానంగా ఉన్నవారు, భూతప్రేతములను పూజిస్తూ భూతప్రేతములలో జన్మిస్తారు అని శ్రీ కృష్ణుడు అంటున్నారు. 


తమ మనస్సులను పరమేశ్వరుడైన భగవంతుని యందే నిమగ్నం చేసినవారే సర్వోన్నత భక్తులు. తదుపరి జన్మలో ఆయన దివ్య ధామానికి చేరుకుంటారు.


పత్రం పుష్పం ఫలం తోయం 

యో మే భక్త్యా ప్రయచ్ఛతి । 

తదహం భక్త్యుపహృతమ్ 

అశ్నామి ప్రయతాత్మనః ।।

అ.9 శ్లో. 26


నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తుని చే ప్రేమతో ఇవ్వబడిన దానిని, నేను సంతోషంగా ఆరగిస్తాను.


పరమేశ్వరుడిని ఆరాధించటం ఎంత సులువైనదో శ్రీ కృష్ణుడు వివరిస్తున్నారు. వేదాలు దేవతల మరియు పితృదేవతల ఆరాధనకై ఆచరించవలసిన ఎన్నో నియమాలని చెప్తాయి. కానీ శ్రీకృష్ణుల వారి ఈ శ్లోకం లో ప్రేమ నిండిన హృదయంతో తో సమర్పించబడిన ఏదైనా స్వీకరిస్తాను అని తెలియ చేస్తున్నారు. కాపొతే అది ప్రేమ/భక్తితో ఇవ్వబడాలి. ముఖ్యంగా గ్రహించాల్సింది భక్తుని యొక్క భక్తి మాత్రమే భగవంతుడిని ప్రసన్నం చేస్తుంది. దీని ద్వారా స్వామివారి కరుణాపూరిత స్వభావం తెలుస్తోంది.

 

తులసీ దళ మాత్రేణ 

జలస్య చులుకేన చ! 

విక్రీణీతే స్వం ఆత్మానం 

భక్తేభ్యో భక్త-వత్సలః!!

(హరి భక్త విలాస్ 11.261)


"భగవంతునికి నిజమైన ప్రేమతో, ఒక తులసి ఆకు మరియు మీ దోసిట్లో పట్టేంత నీరు సమర్పిస్తే, బదులుగా ఆయన తననే మీకు సమర్పించుకుంటాడు, ఎందుకంటే ఆయన ప్రేమకు వశమైపోతాడు." 


అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అనిర్వచనీయమైన మహాద్భుత గుణములు కలవాడు, ఎవరి సంకల్ప మాత్రం చేతనే అనంతమైన బ్రహ్మాండాలు సృజించబడి, లయమై పోతుంటాయో, ఆయన తన భక్తునిచే నిజమైన ప్రేమతో సమర్పించబడిన అత్యల్పమైన దాన్ని కూడా స్వీకరిస్తాడు. 


కాకపోతే "కల్మషములేని పవిత్ర హృదయం (మనస్సు) తో ఉన్న వారు సమర్పించే దానిని స్వీకరిస్తాను" అని శ్రీమద్భాగవతం (10.81.4) లో సుదాముని వద్ద అటుకులు తినేటప్పుడు, శ్రీ కృష్ణుడువివరించాడు.


శ్రీ కృష్ణుడు, కౌరవులు, పాండవుల మధ్య సంధికై హస్తినాపురం వెళ్లినప్పుడు దుర్యోధనుడు గర్వంతో యాభై-ఆరు విభిన్న వంటకాలతో విందు ఏర్పాటు చేసాడు. కానీ, శ్రీ కృష్ణుడు ఈ ఆథిధ్యాన్ని వద్దని సామాన్యమైన విదురని ఇంట్లో కేవలం అరటి పండ్లే ఉండి, ప్రేమభావనలో అయోమయంతో పండు పడేసి, తొక్కలు తినిపిస్తుంటే, అక్కడ భక్తి ని చూసిన శ్రీ కృష్ణుడు, ప్రపంచంలో అదే అత్యంత రుచికరమైనదన్నట్టు, పరమానందంతో ఆ తొక్కలు తిన్నాడు. 


 *అనన్య భక్తి*


భగవంతుడిని సేవించటానికి, తెలుసుకోవటానికి ఎన్నో మార్గాలు, పద్ధతులున్నాయి. అందులొ ఒకటి “భక్తి” మార్గం.

ఈ భక్తిని సాధన చేయటానికి తొమ్మిది పద్ధతులు పెద్దలు చెప్పారు. వాటినే, ” నవ విధ భక్తి ” అని అంటారు. 


శ్రీ నారద “భక్తి సూత్రాల”లొ, భక్తిని గురించి ‘” సా త్వస్మిన్ పరమప్రేమరూపా ” అని చెప్పారు:


దీని అర్ధం : పరమాత్మపై అపారమైన ప్రేమ కలిగియుండుటయే భక్తి. అచంచల విశ్వాసము ప్రేమకు పునాది. అది అనంత తత్త్వావలోకమునకు అనాది. విశ్వసించినవానికి విశ్వేశ్వరానుగ్రహము అరచేతి ఉసిరిక.


పై అర్ధాన్ని కొంచెం వివరంగా చెప్పుకుందాం. ఎవరిపైన మనకు అచంచల విశ్వాసముంటుందో, వారిపైన మనకు ప్రేమవుంటుంది. అంటే, ముందుగా, మన పైన మనకు విశ్వాసమున్నట్లేగదా!! ఈ విశ్వాసమన్నది ఒక పూమొగ్గ. ఆ మొగ్గ, రెక్కలు తొడిగి, విచ్చుకొని, తరువాత, ఒక కాయ రూపంగా మార్పు చెందుతుంది. 


అదే ప్రేమ. ఆ ప్రేమ అపారంగా, అచంచలంగా వృద్ధిచెందిన ప్పుడు, అది “భక్తి” అనే పండుగా మారుతుంది. పరమాత్మపై మనకు అచంచల విశ్వాసమున్నపుడు, అది ప్రేమగా, భక్తిగా మారుతుంది. 


అయితే, దీని ఆంతర్యం ఏమిటి? లేదా దీని “తత్త్వం” ఏమిటి? అతి సులభంగా చెప్పాలంటే, పరమాత్మ అనేవాడు ఒకడు వున్నాడు అని మనం నమ్మినట్లైతే, పరమాత్మ సర్వవ్యాపి అనే సూత్రాన్ని మనం నమ్మాలి. సర్వవ్యాపి అయిన పరమాత్మ, సర్వ ప్రాణులలో వున్నట్లేగదా!! అంటే, పరమాత్మను మనం విశ్వసించి, ప్రేమిస్తున్నట్లైతే, సర్వ ప్రాణులను మనం ప్రేమిస్తున్నట్లేగదా!! 


విశ్వంలోని ప్రతి ప్రాణిని మనం ప్రేమిస్తున్నప్పుడు, మనని, మనం ప్రేమించుకున్నట్లే గదా. ఈ “విశ్వప్రేమే”, “విశ్వశాంతి”ని కలుగచేస్తుంది; అనంతమైన ఆనందాన్ని మన మనసుల్లో సృష్టిస్తుంది. మన ” మనసులొ కలిగే ఈ ఆనందాన్నే ఆనందమయకోశం” అంటారు. అనంతమైన ఈ ఆనందాన్ని పొందటమే, మోక్షమని అంటారు. మరి దీనికి మూలకారణం ” భక్తే “గదా!!


ఈ భక్తికి సంబంధించి ఒక గొప్ప కథను ఇప్పుడు చెప్పుకుందాం:


ఒకసారి, నారదుడు బృందావనం వెళ్ళినప్పుడు, అక్కడ గోపికలందరు ఒక చోటకూడి తమలోతాము చాలా తీవ్రంగా ఏదో విషయంపై చర్చించుకోవటాన్ని గమనించాడు. గోపికలకు, కృష్ణుడంటే, అపారమైన ప్రేమ, భక్తి. కృష్ణుడులేనిదే, వారికి లోకమేలేదు. నారదుని చూసి, గోపికలందరూ, ఆయనకు నమస్కరించి, ఆహ్వానించి కూచోబెట్టారు. ఆ తరువాత, వారు, మరల తమలోతాము వాదించుకోసాగారు. 


అప్పుడు, నారదుడు, మీ వాదులాట దేనిగురించి అని అడిగాడు. గోపికలందరూ, ఒక్కమాటగా, ఒకమాట చెప్పారు. 


” మనుషులను సృష్టించిన ఆ భగవంతుడికి, అంటే, బ్రహ్మకు అసలు బుద్ధిలేదని”. 


అది విన్న నారదుడు, వారిని వారించి, భగవంతుడుని తిట్టటం పాపమని బోధించాడు. అయినా, గోపికలు వారి వాదనను వదిలిపెట్టలేదు. 


అప్పుడు, నారదుడు, సరే, భగవంతుడికి బుద్ధిలేదని మీరు ఏవిధంగా చెప్పగలరని ప్రశ్నించాడు. 


దానికి వారు బదులిస్తూ, మనుషుల కళ్ళకు రెప్పలు పెట్టి, బ్రహ్మ చాలా పెద్ద పొరపాటుచేసాడు అని చెప్పారు. 


దానికి, నారదుడు, కళ్ళల్లో దుమ్ము,ధూళి పడకుండా కాపాడటానికేగదా ఆ బ్రహ్మ కనురెప్పలు పెట్టాడు; అది తప్పు ఎట్లాఅవుతుంది అని ప్రశ్నించాడు. 


అప్పుడు, గోపికలు “ ఓ నారదా, మేము, మా ప్రేమస్వరూపుడైన కృష్ణుడుని ఒక్క క్షణంకూడా చూడకుండా వుండలేము. అయితే, క్షణ,క్షణానికి, కనురెప్పలు మూసి, తెరుచుకోవటంవల్ల మేము మా కృష్ణుడిని నిరంతరంగా చూడలేకపోతున్నాము. అదేగానీ, బ్రహ్మ కనురెప్పలు పెట్టకుండావుండివుంటే, మేము మా కృష్ణుడిని తదేకంగా చూడగలిగేవారంకదా!! కనురెప్పలవల్ల, మా ఆనందానికి అవరోధం కలుగుతున్నది” అని చెప్పారు. 


అదివిన్న నారదుడు, నేనే గొప్ప భక్తుడిని అనుకుంటే, ఈ గోపికలు నన్ను, అందరిని మించిపోయారు 

గదా అని ఆశ్చర్యపోయాడు. వారి అనన్య “భక్తి” కి తలవంచాడు.


అందుకే, గోపికలందరూ, ఆనంద-బ్రహ్మస్వరూపాలు. ముక్తి సాధకులు. ఇదే భక్తి-తత్త్వం యొక్క రహస్యం.

*