ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
12, మే 2024, ఆదివారం
రాశిఫలాలు
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏
*13-05-2024 / సోమవారం / రాశిఫలాలు
గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు
మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి
సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును
మేషం
నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ పరుస్తాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన కలుగుతుంది.
---------------------------------------
వృషభం
వ్యాపారపరంగా బాగస్తులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి. సంతానం విద్యా విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
---------------------------------------
మిధునం
చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్ధిక పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
---------------------------------------
కర్కాటకం
చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి.
---------------------------------------
సింహం
అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు నుండి ఊహించని ఆహ్వానాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
---------------------------------------
కన్య
కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు రావలసిన అవకాశాలు చేజారుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.
---------------------------------------
తుల
సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
---------------------------------------
వృశ్చికం
పాత రుణాలు తీర్చగలుగుతారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు పెద్దల సహాయం పొందుతారు.
---------------------------------------
ధనస్సు
అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో మరోసారి నిరాశ తప్పదు.
---------------------------------------
మకరం
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార వ్యవహారాలలో స్థిర నిర్ణయాలు చేయలేరు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
---------------------------------------
కుంభం
కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.
---------------------------------------
మీనం
రాజకీయవర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువుల కలయికతో ఆనందం కలిగిస్తుంది. మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
🍁 *శుభం భూయాత్* 🍀
తల్లి కి చేయదగిన కర్మ
*2017*
*కం*
సన్యాసము సాధించియు
మాన్యంబగు మాతృకర్మ మరువని విధిగన్
ధన్యంబగు సందేశము
విన్యసమౌ(సుడౌ) శంకరసుధ(ధి) విమలము(విమలుడు) సుజనా.
*భావం*:-- ఓ సుజనా! సన్యాసం సాధించి కూడా అత్యంత గొప్పదైన తల్లి కి చేయదగిన కర్మ మరువరాని విధి(బాధ్యత) అనే గొప్ప సందేశం నిర్మితమై ఉన్న శంకరాచార్యుల వారి అమృతవాక్కులు విశేషమైనవి{అంత గొప్ప సందేశం ఇచ్చిన శంకరుడు (శంకరాచార్యులు) అనబడే విద్వాంసుడు (సుధి)} విశేషమైన వారు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
భ భా భి భీ భు భూ....?
X2.X2.A-6.2209b-8.130524-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*భ భా భి భీ భు భూ....?*
➖➖➖✍️
*ధారానగరంలో ‘భుక్కుండుడు’ అనే ఓగజదొంగ వుండే వాడు. నగరంలో దొంగతనాలు చేసి చేసి వేరే రాజ్యానికి వెళ్లి పోయి మరీ సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి మరీ దొంగతనాలు చేసేవాడు.*
*కానీ వాడు ధనవంతుల ఇళ్ళలోనే దొంగతనం చేసే వాడు. ఆ సొమ్ములో చాలా భాగం బీదలకు పంచే వాడు. పైగా అంతో ఇంతో సంస్కృత పాండిత్యం వున్నవాడు కూడా.*
*రాజ సైనికులు ఎంత ప్రయత్నించినా అతనిని పట్టుకొనలేకపోయే వారు.*
*ఒకసారి ఒకరింటికి కన్నం వేస్తూ దొరికి పోయాడు. భటులు వాడిని రాజ సభ లో ప్రవేశ పెట్టినారు., ఎన్నో సంవత్సరాలుగా దొంగతనాలు చేసిన భుక్కుండుడికి మరణ శిక్ష విధించాలి అని మంత్రి, యితర సభ్యులు రాజును కోరారు. తనకు రాజు మరణ శిక్ష వేస్తాడేమో నని వాడికి భయం వేసింది. యుక్తిగా ఈ శ్లోకం చెప్పాడు…*
*"భట్టిర్నష్టః, భారవి శ్చాపి నష్టః*
*భిక్షుర్నష్టః భీమసేనోపి నష్టః*
*భుక్కుండో హం భూపతిః త్వం రాజన్*
*భబ్భావళ్యామ్ అంతకః సం నివిష్టః*
అర్థము:-- *రాజా! నన్ను శిక్షించండి. కానీ నాకు ఒక్కటే భయం. మీరు గమనించారో లేదో భట్టి చనిపోయాడు, భారవి కవి కీర్తి శేషుడయ్యాడు, ఆ వెనకే భిక్షుకవి కూడా మరణించాడు, ఇటీవలే భీమకవి కూడా కాల ధర్మం చెందాడు, మరి నేను భుక్కుండుడిని. ఈ యమధర్మ రాజు 'భ' గుణింతాన్నే పట్టుకొని భట్టినీ, భారవిని, భిక్షు కవినీ, భీమ కవినీ తీసుకెళ్ళి పోయాడు. తర్వాత వాడిని నేను భుక్కుండుడిని. నన్ను తీసుకొని పొతే భ భా భి భీ భు తర్వాత భూపతివి నీవు, నీ పేరులో కూడా 'భ' కారం వుంది నా తర్వాత నీ వంతే నేమోనని, యింత మంచి రాజు మరణిస్తే ప్రజలకు గతి ఏమి? అని నేను భయ పడుతున్నాను. (పైన చెప్పిన కవులంతా భోజుడి ఆస్థానం లోని కవులే) అన్నాడు.*
*రాజ దండన పొందబోతూ కూడా ఇలా చమత్కారంగా శ్లోకం చెప్పడం రాజుకు నచ్చింది, నవ్వు వచ్చింది.*
*నవ్వు ఆపుకుంటూ “సరే! భుక్కుండా ఈ సారికి నిన్ను వదిలేస్తున్నాను. అని వాడికి కావలిసి నంత ధనం యిచ్చి యిక ముందు దొంగతనాలు చేయ కుండా మంచిగా బ్రతుకు!” అని మందలించి వదిలేశాడు.*
*(భబ్భావళి అంటే 'భ' గుణింతం అంతక= యమ ధర్మరాజు, సంవిష్ట: అంటే దృష్టి పెట్టిన వాడు)* .
*భలే బావుంది కదూ!*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం...
*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.
లింక్ పంపుతాము.🙏
శంకరుని జీవిత విశేషాలు
ఆది శంకరుని జీవిత విశేషాలు -
ఈ ప్రపంచములో అన్ని దేశాల సంస్కృతులకు మూలము ఆర్ష భూమియైన ఈ భారత దేశమే. మానవుడు పుట్టిన తొలినాళ్ళ నుండీ , కొండకోనల్లో తిరుగాడిన నాటి నుండీ సంస్కృతీ వికాసం పొందేవరకు సర్వం ఈ ఆర్షభూమిలో జరిగినవే . అట్టి భరత ఖండంలో కాలక్రమేణా కలిలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి, ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. ఆయన జీవిత కాలం మీద అనేక అపోహలు ఉన్నాయి. ఇప్పటికీ అనేక పుస్తకాలలో మనం ఏడవ శతాబ్దానికి చెందినవారిగా మాత్రమే చదువుతున్నాము. శంకరుని కాలం గూర్చి టి ఎస్ నారాయణ్ శాస్త్రి గారు అనేక పరిశోధనలు చేసి రచించిన " ద ఏజ్ అఫ్ శంకర " అనే పుస్తకములో శంకరుని కాలం గూర్చి అనేక వివరాలతో బాటు పీఠాల వివరాలు .. వివిధ కాలాల్లో ఆయా పీఠాలు అధిష్టించిన పీఠాధిపతుల పేర్లు సర్వం అందులో వ్రాసియున్నారు. శంకరుని జీవిత కాల విశేషాలు మీ అందరికోసం ఇక్కడ.
శంకర భగవత్పాదులు కలి అబ్ది 2593 సంవత్సరం అనగా బిఫోర్ కామన్ ఎరా 509 లో పరశురామ క్షేత్రం అయిన నేటి కేరళలోని కాలడి గ్రామములో ఆర్యాంబ శివగురు అనే పుణ్య దంపతులకు వైశాఖ శుక్ల పంచమి నందన నామ సంవత్సరములో జన్మించి ఆ తల్లిదండ్రులకు ఆనంద కారకుడయ్యాడు.
అల్లారు ముద్దుగా పెరిగిన శంకరునికి అయిదవ యేట కలి అబ్ది 2598 లో అనగా బిఫోర్ కామన్ ఎరా 504 లో ఉపనయనం చేసి విద్యాభ్యాసం చేయించారు . చిన్నతనం నుండే ఏక సంథాగ్రాహి అయిన శంకరుడు సర్వము ఇట్టే గ్రహించేవాడు . ఎనిమిదేళ్లు వచ్చేసరికి వేద వేదాంగాలు స్మృతులు , ఇతిహాసాలు, పురాణాలు అన్నింటి మీద శంకరునికి పట్టు ఏర్పడింది .
కలి అబ్ది 2601 లో అనగా బిఫోర్ కామన్ ఎరా 501 లో శంకరుని తండ్రి శివగురువు శివసాయుజ్యం పొందారు. అప్పటికి శంకరుని వయస్సు ఎనిమిదేళ్లు. తండ్రికి సంస్కారాలు అవీ చేసాక శంకరుడు కొన్నాళ్ళు తల్లితోనే జీవించాడు .
తండ్రి మరణించాక ఏడాది గడవగానే శంకరుడు కలి అబ్ది 2602 లో అనగా బిఫోర్ కామన్ ఎరా 500 లో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఫ్లవా నామ సంవత్సరములో తల్లి అనుమతితో సన్యాసం దీక్ష స్వీకరించాడు . సన్యాసం దీక్ష స్వీకరించిన శంకరుడు జ్ఞానార్థియై కాలి నడకన నర్మదా నదీ తీరములో ఉన్న గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరికం కలి అబ్ది 2603 లో అనగా బిఫోర్ కామన్ ఎరా 499 లో చేసారు . అక్కడే క్రమ సన్యాసం చేసిన శంకరుడు నాలుగేళ్ళ పాటు వేదాంత శాస్త్రములో అక్కడ విద్యాభ్యాసం కలి అబ్ది 2605 వరకు అనగా బిఫోర్ కామన్ ఎరా 497 వరకు చేసారు .
వేదాంత శాస్త్రాధ్యయనం తరువాత శంకరుడు కాలి నడకన హిమవత్పర్వత ప్రాంతానికి చేరుకొని బదరికాశ్రమములో ఉన్న గౌడపాదాచార్యులను కలసి ఆయనను పరమగురువుగా స్వీకరించారు . అక్కడ నాలుగేళ్ళ పాటు గౌడ పాదాచార్యుల శిష్యరికంలో సర్వమూ నేర్చారు. అప్పటికి గౌడ పాదాచార్యుల వయస్సు 120 సంవత్సరాలు. శ్రమ అన్నది లేక అయన స్వయంగా అనేక మర్మాలు , సర్వ శాస్త్రాలు కలి అబ్ది 2605 నుండీ అనగా బిఫోర్ కామన్ ఎరా 497 నుండీ కలి అభ్ది 2609 వరకు అనగా 493 వరకు భోదించారు. బదరికాశ్రమములో శంకరుడు తన గురువు అయిన గౌడ పాదాచార్యుని శిష్యరికంలో తన గురువు గారి బోధనలు అయిన గౌడపాద కరికలు మీద భాష్యం వ్రాసారు. ఆ పిమ్మట ప్రస్థాన త్రయం మీద పదహారు భాష్యాలు వ్రాసారు.
శంకరుడు సన్యాసం దీక్ష వహించిన తరువాత ఆతని వెన్నంటి ఎపుడూ అనుసరించినవాడు విష్ణు శర్మ అనే సహాధ్యాయి .కాలడి నుండి ఆతను శంకరునితోనే నర్మదా తీరం, బదరికాశ్రమము అన్నింటా అతనే శంకరునితో ఉండేవారు. బదరికాశ్రమములో విష్ణు శర్మ కూడా సన్యాసం దీక్ష వహించాడు . అతడినే చిత్సుకాచార్య అని కూడా సంభోదించేవారు. శంకరుని జీవితములో జరిగిన వాటన్నింటికీ ప్రత్యక్ష సాక్షి ఈ చిత్సుకాచార్యులే. వీరే శంకర బృహత్విజయం అని శంకరుని జీవిత విశేషాలను ఆయన సాధించిన విజయాలను అందులో వ్రాసారు. కానీ ఆ గ్రంథం నేడు అలభ్యం.
పదహారేళ్ళ ప్రాయములో బదరికాశ్రమములో ఉన్న శంకరునికి తల్లి ఆర్యాంబ గుర్తుకు రాగా కాలడి బయలు దేరి వెళ్లారు. ఆర్యాంబ కలి అబ్ది 2608 అనగా బిఫోర్ కామన్ ఎరా 492 ఫ్లవంగ నామ సంవత్సరం లో జీవన్ముక్తి పొందారు. అదే సంవత్సరములో శంకరునికి వేదాంత విద్యను గఱపిన గోవింద భగత్పాదులు కూడా కార్తీక పౌర్ణమి నాడు విష్ణు సాయుజ్యం పొందారు .
ఆలోచనా విధానాలు
ఆలోచనా విధానాలు
ఒక సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కోవిధంగా పరిష్కారం కోసం ఆలోచిస్తారు. కానీ అందరి ఆలోచనలు ఒక్కొక్క రీతిలో ఉంటాయి. కొందరి ఆలోచనలతో పరిష్కారం సులభంగా దొరుకుతుంది. ఇంకొందరి ఆలోచనలతో పరిష్కారం కష్టతరంగా ఉంటుంది. ఇంకా కొంతమంది ఆలోచనలతో పరిష్కారం దొరకకపోగా ఇంకొక కొత్త సమస్య ఉద్బవించవచ్చు కూడా. ఒకమనిషి ఆలోచనా విధానం అతని మేధస్సుమీద ఆధారపడి ఉంటుంది. సమస్యను కూలంకుషంగా సత్వరం అర్ధం చేసుకొని వెనువెంటనే సరైన పరిష్కారం చెప్పటం అనేదానినికి సూక్ష్మగ్రాహ్యత సమయస్పూర్తి కావాలని పెద్దవారు చెపుతారు. ఒకే విధమైన నెలజీతం పొందుతున్న ఇద్దరు ఉద్యోగస్తుల జీవన విధానం ఒకే విధంగా వుండాలని లేదు ఒకరు అనేక అప్పులు చేస్తూ అనవసరమైన డాంబికాలు పోయి అనేక ఇక్కట్లు పడవచ్చు ఇంకొకరు తనకు వున్న వనరులను ఒక ప్రణాళికా బద్దంగా ఉపయోగించుకొని జీవితంలో ఎలాంటి లోపం లేకుండా జీవించవచ్చు. ప్రస్తుత సమాజం బాహ్య డాంబికాలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో తనకు మించిన ఖర్చులు చేస్తూ తగిన ఆదాయంలేక అప్పులు చేస్తూ ఆ అప్పులు తీర్చలేక కస్టాలు పడుతూ చివరకు ఆత్మహత్యలు చేసుకున్న వారి గూర్చి నిత్యం మనం వార్తల్లో చదువుతున్నాము, చూస్తూన్నాము . వాటన్నిటికీ కారణం ఆలోచనా విధానం మాత్రమే.
సరయిన నిర్ణయం తీసుకోవటం ఒకని మేధాశక్తికి నిదర్శనం. అంతే కాదు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాలలో నిర్ణయం సరైనది అయినా కూడా సరైన సమయంలో తీసుకోక పోవటం అనేక కష్టాలను కొని తెస్తుంది. వ్యాపారస్తులు కొన్ని సరుకులు అనేక కారణాలవల్ల పేరుకొని ఉంటే తాను కొన్న ధరకాన్న తక్కువ ధరకు అమ్ముతారు, దానికి కారణం ఒకటి ఆ వస్తువు ఎక్కువ ధరకు అమ్మచూస్తే అది అమ్మటానికి చాలాసమయం పట్టవచ్చు, రేండు ఎక్కువ సమయం వేచి చుస్తే ఆ సరకు చెడిపోయి ఏమాత్రం ద్రవ్యం రాకపోవచ్చు. అదే ముందుగా తక్కువ ధరకు అమ్మి వచ్చిన ద్రవ్యాన్ని ఇంకొక జనప్రదాన్యత వున్న సరకు మీద వెచ్చిస్తే దానిమీద ఎక్కువ లాభం రావచ్చు. ఇటువంటి నిర్ణయాలు సత్వరం తీసుకోవాలి అప్పుడే వ్యాపారస్తుడు లాభిస్తాడు. స్వల్ప నష్టాన్ని గూర్చి ఆలోచిస్తే ముందు వచ్చే అధిక లాభాన్ని కోల్పోతాడు.
ఒక కంపెనీలో అందుకే మేనేజర్లకు ఎక్కువ జీతం ఇచ్చి నియమించుకుంటారు. మేనేజరులు తీసుకునే నిర్ణయం పైనే ఆ కంపెనీ లాభాలు ఆధారపడి ఉంటాయి.
సమయస్పూర్తి: సీతాపహరణ తరువాత సుగ్రీవుని రాజ్యంలోని వానరులను సీతాదేవిని వెతకటానికి నియమించారు ఆ వరువడిలోనే హనుమంతులవారిని కూడా నియమించారు. హనుమంతులవారు లంకకు చేరారు, సీతామాతను తెలుసుకున్నారు. నిజానికి ఆయనకు కేటాయించిన పని పరిసమాప్తం అయ్యింది. వెంటనే వచ్చి సీతాదేవి జాడని శ్రీ రామచంద్రులకు తెలిపితే తన నియమిత కార్యం అయిపోయినట్లే కానీ సీతజాడతోటి హనుమంతులవారు ఊరుకోలేదు సీతాదేవిని రావణుడినుండి విడిపించుటకు శ్రీరాముడు యుద్ధం చేయవలసి ఉంటుంది. కాబాట్టి రావణాసురుని బలం అతని రాజ్య విషయాలను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు రావణుని దర్శనం చేసుకోవాలి అది యెట్లా సాధ్యం తాను రాజప్రాసాదానికి వెళ్ళితే అక్కడి భటులు రావణాసురుని చూడనీయరు. అందుకే ఆయన అశోకవనాన్ని ధ్వంసం చేశారు. నిరోధించటానికి వచ్చిన వీరులను ఓడించారు. అప్పుడు తప్పనిసరై హనుమంతులవారిపై బ్రహ్మస్త్రాన్ని ఇంద్రజిత్ ప్రయోగించి రావణుని సభకు తీసుకొని వెళతారు. ఇక మిగిలిన కధ మనందరికీ తెలిసిందే. ఇక్కడ మనం గమనించాలసింది హనుమంతులవారి ఆలోచనా విధానం సమయ స్ఫూర్తి. సమయ స్ఫూర్తి ఉంటే ఎటువంటి ఆపద నయినా సులభంగా దాట వచ్చు.
జ్యోతిష్య శాస్త్రంలో ప్రావిణ్యం వున్న ఒక జ్యోతిష్కులవారు ఒక రాజుగారి వద్దకు వెళ్లారట అయన రాజుగారి జాతకాన్ని పరిశీలించి అది చాలా బాగుందని ఇలా చెప్పారట " మీ వాళ్ళందరూ మీ ముందే చనిపోతారు" అది విన్న ఆ రాజుగారు కోపోద్రేకుడై అతనికి బహుమానాలు ఇవ్వటం అటుంచి మరణ శిక్ష విధించారట. ఒకటి రెండు రోజులలో శిక్ష అమలు అనగా ఈ విషయం తెలుసుకున్న ఇంకొక జ్యోతిష్య పండితులు రాజుగారి దర్శనం చేసుకున్నారు. రాజు జ్యోతిష్యం అంటేనే కోపంగా వున్నారు ఆ విషయం మన జ్యోతిస్యులవారికి తెలుసు ఆయన అత్యంత లౌక్యము చూపించి అనేక పొగడ్తలతో రాజుగారిని ప్రశంసించి ఆయన జాతకాన్ని చూసి "మహారాజా మీరు అత్యంత మహార్జాతకులు మీరు ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలిస్తారు. నిజానికి మీ వారి అందరికన్నా ఎక్కువ కాలం మీరు జీవిస్తారు. ఏ కొద్దీ మందికో మీలాగా జాతకం ఉండదు" అని తెలిపారు. దానికి ప్రసన్నులైన మహారాజు నీవు చాలా మంచిగా నా జాతకాన్ని తెలిపావు నీకు ఏమి కావాలో కోరుకో అని అన్నారు. మహారాజా నా శిష్యుడు తెలిసి తెలియని జ్ఞానంతో మీ వద్దకు వచ్చి మీ ఆగ్రహానికి గురి అయి మరణ శిక్ష విధింపబడ్డాడు. దయచేసి అతనిని క్షమించి విడిపించవలసిందిగా ప్రార్ధించారు. అతని మాటలకు రాజుగారు మొదటి జ్యోతిస్యుల శిక్షను రద్దుచేశారట. మన రెండవ జ్యోతిషేలవారు మొదటివారిని కలుసుకొని నీవెందుకు అలా చెప్పావు అని అడిగితె నేను చెప్పింది నిజంకాదా అని ప్రశ్నించారట. నీవు చెప్పింది నిజం నేను అదే చెప్పాను కానీ చెప్పే విధానం బట్టి మనము అనుగ్రహ, ఆగ్రహాలకు పాత్త్రులము అవుతాము అని అన్నారట.
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః!
జిహ్వాగ్రే మిత్రబాంధవాః!
జిహ్వాగ్రే బంధనప్రాప్తిః!
జిహ్వాగ్రే మరణం ధృవం!!
అని అన్నారు కాబాట్టి మనం నోటిని జాగ్రత్తగా అంటే మాటలను సమయానుకూలంగా వాడాలని హితవు చెప్పి పంపారట. బుద్ది కర్మానుసారినే అనే నానుడి ఊరికే రాలేదేమో అనిపిస్తుంది.
ఒక కేసువిషయంలో చాలా తీవ్రంగా ఒక లాయరుగారు వాదిస్తున్నారట ఆయన వాదనకు జడ్జిగారు కూడా ముగ్దులు అయ్యారట. ఇక వాదనను ముగించపోవగా ప్రక్కనే వున్నా జ్యునీయరు లాయరుగారు మన లాయరుగారి చెవిలో ఏదో చెప్పారట వెంటనే మన లాయరు గారు దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని నేను చెప్పింది బహుశా డిఫెన్సు లాయరుగారు చెప్పవచ్చు కానీ అది ఎంతమాత్రమూ సబబుకాదు ఇప్పుడు నా వాదనను వినండి అని తానూ ముందు చెప్పిన వాదనకు వ్యతిరేకంగా చెప్పి జడ్జిగారిని మెప్పించి కేసు గెలిపించారట. ఇంతకూ ఆ జూనియరు లాయరు గారు చెవిలో చెప్పింది ఏమిటి అంటే అయ్యా మీరు మన క్లయెంటు గూర్చి కాకుండా అవతలి పార్టీకి సపోర్టుగా వాదిస్తున్నారు అని. ఆక్షణంలోనే సర్దుకొని తన వాదనను పూర్తిగా మార్చుకున్నారు సీనియర్ లాయరు గారు అదే సమయ స్ఫూర్తి అంటే. ఇవ్వన్నీ మనం తెలుసుకున్నవి, నిత్యం చూస్తూవున్నవి. ఇక అసలు విషయానికి వస్తే మానవుడు తన జీవిత లక్ష్యం అయిన మోక్ష సాధన చేయటానికి చక్కటి ఆలోచనా విధానం వుండాలి అంతేకాదు తనకు దైనందిక జీవితంలో ఎదురుపడే అనేక ఒడిదుడుకులను ఎదుర్కునే సమయస్ఫూర్తి కావలి. సాధకుని చూసి సామాన్యులు అనేక విధములుగా మాట్లాడవచ్చు అటువంటి మాటలకు, విమర్శలకు ఏమాత్రం చలించకుండా నిత్యం తన లక్ష సాధనవైపు ద్రుష్టి సాగించి లక్ష్యాన్ని ఈ జన్మలోనే సాదించాలి.
నాకు ఈ జన్మలోనే మోక్షం వస్తుందా అది ఎంతో దుర్లభం ఏదో దైవ జాసలో, నామ స్మరణతో కాలం గడుపుదాం అని చెప్పే అనేకులు మనకు తారసపడతారు. అంతే కాకుండా అయన సద్గురువు, ఈయన సద్గురువు అని చెప్పి మీ వద్ద వలసినంత ద్రవ్యాన్ని వసూలు చేసేవారు కూడా వుంటారు. కాబట్టి ఎవ్వరిని అనుసరించకుండా నీ సాధన నీవు కొనసాగించు. వారి మాటలను పరిగణలోకి తీసుకొన్నామంటే మన సాధనకు పూర్తిగా అవరోధం కలుగుతుంది. కాబట్టి మిత్రమా మోక్షం అంటే సామాన్యమైన విషయం కాదు అత్యంత కృషి, సాధన, అకుంఠిత దీక్ష ఉంటేనే సాధించగలం. ఈ మానవ జన్మ ఎంతో దుర్లభమైనది దీనిని ఇక్కడే,ఇప్పుడే సార్ధకట్చేసుకోవాలి.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
మీ భార్గవ శర్మ
అమ్మేకద మనదైవం
*మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో...*
అమ్మేకద మనదైవం
బమ్మయె గుండెగుడిని కొలువై నిలచు సదా
అమ్మేకద మనకఖిలము
అమ్మేప్రత్యక్ష దైవమగునిల కృష్ణా!
*గోగులపాటి కృష్ణమోహన్*
మాతృ దినోత్సవo
*మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో...*
అమ్మేకద మనదైవం
బమ్మయె గుండెగుడిని కొలువై నిలచు సదా
అమ్మేకద మనకఖిలము
అమ్మేప్రత్యక్ష దైవమగునిల కృష్ణా!
*గోగులపాటి కృష్ణమోహన్*
అంతర్జాతీయ నర్సుల దినోత్సవo
*మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలతో...*
నర్సుల సేవ
1) నర్సులెంతగానొ నాజూకుగనడిచి
సేవచేయుదురుగ సేదలేక
రొక్కమెంతనడుగు దుఃఖమే వారికి
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల
2) ఆసుపత్రిలోనికడగు పెట్టినయంత
నర్సు గుచ్చు సూది నరమునకును
వరుస బెట్టి యిచ్చు నరముకింజక్షన్లు
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల
3) బీపి మిషను దెచ్చి బీపీని చెక్ చేసి
పరగతాపమాని జ్వరము గొలిచి
రకరకముల జేయు రక్తపరీక్షలు
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల
4) కష్టకాలమందు నష్టాలనోర్చుచు
నిష్ఠ తోడ చేయు నిష్టముగను
సిస్టరన్నతానె సేవకు మార్పేరు
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల
*గోగులపాటి కృష్ణమోహన్*
_శ్రీ శాంకరచరితము
*_𝕝𝕝 ॐ 𝕝𝕝 12/05/2024 - శ్రీ శంకర భగవత్పాద జయన్తీ 𝕝𝕝 卐 𝕝𝕝_*
*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*
*_శ్రీ శాంకరచరితము!_*
శ్లో𝕝𝕝 ఆర్యాంబా జఠరేజని ర్ద్విజసతీ దారిద్య్రనిర్మూలనమ్l
సన్యాసాశ్రయణం గురూపసదనం శ్రీ మండనాదేర్జయఃl
శిష్యౌఘగ్రహణం సుభాష్యవచనం
సర్వజ్ఞ పీఠాశ్రయఃl
పీఠానాంరచనేతి సంగ్రహమయీ
సైషాకథాశాంకరీll
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః
దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు....
(- శివరహస్యము నుండి).
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా
శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు....
(కూర్మపురాణం నుండి)
అష్ట వర్షే చతుర్వేదీ
ద్వాదశే సర్వ శాస్త్రవిత్
షోడశే కృతవాన్ భాష్యం
ద్వాత్రింసే మునిరభ్యగాత్!!
*_𝕝𝕝 ॐ 𝕝𝕝 శ్రీ శఙ్కర భగవత్పాద జయన్తీ శుభాకాంక్షలు 𝕝𝕝 卐 𝕝𝕝_*
*_𝕝𝕝 ॐ 𝕝𝕝 శ్రీ జగద్గురు శఙ్కరాచార్య దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం 𝕝𝕝 卐 𝕝𝕝_*
*_𝕝𝕝 ॐ 𝕝𝕝 జయ జయ శఙ్కర హర హర శఙ్కర 𝕝𝕝 卐 𝕝𝕝_*
*_𝕝𝕝 ॐ 𝕝𝕝 శ్రీమతే శఙ్కరాచార్య నమః 𝕝𝕝 卐 𝕝𝕝_*

