3, జూన్ 2024, సోమవారం

డొనెషన్లు

 డొనెషన్లు

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు +91 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 337*


⚜ *కర్నాటక  :-*


*కుక్కే - దక్షిణ కన్నడ ప్రాంతం*


⚜ *శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయం*


💠 పార్వతీదేవి, లయకారకుడు పరమేశ్వరుల రెండో పుత్రరత్నం శ్రీ సుబ్రమణ్యస్వామి. 

నెమలిని వాహనంగా వేలాయుధాన్ని చేతబూని యావత్‌ దేవతా సైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు. 

తన కంటే పెద్దవాడయిన విఘ్నేశ్వరునితో కలిసి అనేక శిష్టరక్షణ కోసం అనేక యుద్ధాలు చేశారు. షణ్ముఖుడికి దక్షిణ భారతంలో గుడులు ఎక్కువగా వున్నాయి.

 వీటిలో మహిమాన్వితమైనది కర్ణాటకలోని కుక్కెలో వెలసిన శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయం.


💠 సుప్రసిద్ద శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవస్థానం కర్నాటక రాష్ట్రం , దక్షిణ కన్నడ జిల్లా, సుల్ల్య తాలూకా లోని సుబ్రమణ్య అను గ్రామములో ఉన్నది. ఇక్కడ కార్తికేయుడిని సర్పదేవుడు సుబ్రమణ్యునిగా భక్తులు ఆరాధిస్తారు.


💠 ఈ సుబ్రహ్మణ్య ఆలయం గురించి ‘స్కాందపురాణం’లో సనత్కుమార సంహితలోని సహ్యాద్రికాండలోని తీర్ధక్షేత్రమహామణి పురాణంలో తెలుపబడింది.

తన దిగ్విజయ ధర్మయాత్రలో భాగంగా శ్రీ ఆది శంకరాచార్యూలవారు కొన్ని రోజులు ఇక్కడ గడిపినట్టు "శంకర విజయం" చెప్తున్నది.


🔆 స్థలపురాణం :


💠 పూర్వం తారకుడు, సూర పద్మాసురుడు అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు. అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని ధార నదిలో పరిశుభ్రంచేస్తారు. 

దీంతో ఈ నదిని " కుమారధార" అని పిలుస్తారు. 


💠 ఆ తరువాత ఈ కుమారధార పర్వతశ్రేణులలో గణపతి మున్నగు దేవతలతో కుమారస్వామి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఇంద్రుడు తన కుమార్తెను వివాహం చేసుకొమ్మని కోరగా ఆయన అంగీకరిస్తాడు

రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు.

 సాక్షాత్తూ స్వామివారి వివాహవేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం చెందింది. 


💠 నాగులకు రక్షకుడు: 

నాగులలో శ్రేష్టుడు వాసుకి. 

ఆయన క్షీరసాగర మథనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు. 

గరుత్మంతుడి బారినుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు అతనికి వరమివ్వాలని సుబ్రమణ్యస్వామిని ఆదేశిస్తారు. 

దీంతో స్కందుడు వాసుకికి ప్రత్యక్షమై కుక్కె క్షేత్రంలో నాగులకు రక్షణ వుంటుందని వరమిస్తాడు. దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది. 

ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. సుబ్రమణ్య మందిరంలో అనేక పుట్టలు వుంటాయి.


💠 ప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు, వాసుకిల పైన వుండి పూజలను అందుకుంటారు. 

సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. సర్ప సంస్కార, నాగ ప్రతిష్ట, ఆశ్లేషబలి తదితర పూజలను నిర్వహిస్తారు.


💠 శ్రీ సుబ్రమణ్యస్వామి, దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీజలాలను దేవతలు కుమారధారలో కలిపారు. 

స్వామివారి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.


💠 ఈ ఆలయంలో అనేక పండుగలు జరుపుకుంటారు. 

షష్ఠి, కీరు షష్టి, నాగ పంచమి, నాగారాధనే పండుగలకు ఎంతో గౌరవం ఉంటుంది. 

అంతే కాకుండా ఉగాది, దీపావళి, మకర సంక్రాంతి ముఖ్యమైన పండుగలు.


💠 కుక్కే సుబ్రమణ్య ఆలయంలో సర్ప (పాము) దోషం (శాపం) లేదా సర్పముల వలన వచ్చే ప్రతికూల బాధలు తొలగిపోతాయి. 

ఈ శాప విముక్తి కోసం చాలా మంది భక్తులు ఈ పూజలో పాల్గొంటారు. 

సంతానం లేని దంపతులకు సంతానాన్ని ప్రసాదించడానికి నాగప్రతిష్ట పూజ కూడా చేస్తారు. 

కాబట్టి ఈ ఆలయంలో సర్పాల వల్ల జీవితంలో ఎలాంటి సవాళ్లు వచ్చినా అవి తొలగిపోతాయని నమ్ముతారు.


🔆 ఆశ్లేష బలి పూజ:


💠 శ్రీ క్షేత్రం కుక్కే సుబ్రమణ్య దేవస్థానంలో జరిగే అతి పెద్ద కాలసర్ప దోష పూజ ఈ ఆశ్లేష బలి పూజ. సుబ్రమణ్య స్వామి కాల సర్ప దోషము మరియు కుజ దోషముల నుండి భక్తులను రక్షిస్తాడు.


💠 ఆశ్లేష బలి పూజ ప్రతి నెల ఆశ్లేష నక్షత్ర దినాలలో జరప బడుతుంది. భక్తులు శ్రావణ, కార్తీక, మృగశిర మాసాలను ఈ పూజ చెయ్యటానికి అత్యంత పవిత్రంగా భావిస్తారు. 


🔆 సర్ప సంస్కార / సర్ప దోష పూజలు : 


💠 సర్ప దోషము నుంచి విముక్తి పొందటానికి భక్తులు ఈ పూజను చేస్తారు. ఒక వ్యక్తి ఈ జన్మలో కానీ లేక గత జన్మలో కానీ , తెలిసి కానీ, తెలియక కానీ పలు విధములలో ఈ సర్ప దోష భాధగ్రస్టుడు అయ్యే అవకాశం ఉంది. 

సర్ప దోష బాధితులకు పండితులు ఈ సర్పదోష నివారణ పూజను విముక్తి  మార్గంగా సూచిస్తారు.


💠 స్వామి వారికి జరిగే మడెస్నానం ఒక ముఖ్యమైన సేవ. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించే చంపా షష్టి వేడుక లేదా ఉత్సవం నాడు మూడు రోజులపాటు 'మాడే స్నాన' జరుపుతారు.

ఇక్కడ లభించే మట్టి ప్రసాదం చాలా విశేషం.


💠  ఎలా చేరుకోవచ్చు..

బెంగుళూరు నుండి కుక్కే సుబ్రమణ్య 280 కి.మీ మరియు మంగళూరు నుండి 105 కి.మీ. 

Panchaag

 


వశిష్ట మహర్షి బోధ !"

 "శ్రీరమణీయం"

"శ్రీరామచంద్రుడికి వశిష్ట మహర్షి బోధ !"


*"శ్రీరామచంద్రుడు : బ్రహ్మము శుద్ధము, అతని నుండి మాయ పుట్టుట ఏమి ? అతనినే మాయ కప్పుటేమి !?"*


*"వశిష్ట మహర్షి : గాఢ వైరాగ్యమున్న శుద్ధమనసులో ఈ ప్రశ్న జనించదు. నిజమును అద్వైత వాదంలో జీవ, ఈశ్వర, మాయకు తావులేదు. తనలో తాను మునుగగా, వాసనలు పూర్తిగా నష్టమై ఈ ప్రశ్నలకు సందివ్వవు.*


"శ్రీరామచంద్రుడు : ఆత్మ నుండి జీవుడేట్లు కలిగినాడు ?"


*"వశిష్ట మహర్షి : నీ యదార్ధస్థితిని తెలుసుకో, నీకీ ప్రశ్న రాదు. తాను వేరని ఎవరైనా ఎందుకు అనుకోవలె ? పుట్టుక పూర్వం తానెట్లున్నాడు ? చనిపోయిన తర్వాత ఎట్లుండబోతాడు ? ఇట్టి ప్రశ్నలతో కాలం వృధా పోవటం ఎందుకు ? నిద్రలో నీ రూపేమి ?* *నిన్ను నీవొక వ్యక్తిగా ఎందుకు భావిస్తున్నావు ?"*


"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}

హోమం యొక్క ప్రాముఖ్యత*

 *హోమం యొక్క ప్రాముఖ్యత*

1. ఫ్రాన్స్కు చెందిన ట్రైలే అనే శాస్త్రవేత్త హోమం మీద పరిశోధన చేశారు. దీనిలో ఆయనకు తెలిసింది: హోమం ప్రధానంగా మామిడి చెక్కపై జరుగుతుందని, మామిడి కలప కాలినప్పుడు, ఫార్మిక్ ఆల్డిహైడ్ అనే వాయువు ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రమాదకరమైన బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మ జీవులను చంపి వాతావరణాన్ని 5 శుభ్రపరుస్తుంది. ఈ పరిశోధన తరువాతే శాస్త్రవేత్తలకు ఈ వాయువు గురించి మరియు దానిని తయారు చేసే విధానం గురించి తెలిసింది. బెల్లం కాల్చినప్పుడు కూడా ఈ వాయువు ఉత్పన్న మువుతుంది.

2. టౌటీక్ అనే శాస్త్రవేత్త హోమంపై తాను నిర్వహించిన పరిశోధనలో కనుగొన్నది ఏమనగా, అర్ధగంట సేపు హోమంలో కూర్చున్నా లేదా హోమం నుండి వెలువడే పొగలచే ఈ శరీరము సంపర్కం చెందినా టైఫాయిడ్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను వ్యాప్తి చేసే సూక్ష్మ జీవులు కూడా చనిపోతాయి మరియు శరీరం కూడా శుభ్రపడుతుంది.

3. హోమము యొక్క మహత్వమును దృష్టిలో వుంచుకొని లక్నో కి చెందిన రాష్ట్రీయ వనస్పతి అనుసంధాన సంస్థ శాస్త్రవేత్తలు కూడా ఒక పరిశోధన చేసారు. హోమము చేయడము వలన వాతావరణ శుద్ధి జరుగుతుందా లేదా మరియు జీవాణువులు నాశనము అవుతాయా లేదా అన్న అంశము పైన పరిశోధన జరిపారు. వీరు గ్రంథాలలో వర్ణించబడిన హోమ సామాగ్రిని కలిపి మండించడము ద్వారా ఈ విషకణములు నశిస్తాయని తెలుసుకున్నారు. తరువాత వీరు విభిన్నరకాల పొగల మీద పని చేసారు. కేవలం ఒక కిలో మామిడి కర్రను మండించడము వలన గాలిలో వ్యాపించి ఉన్న విషాణువులను మరీ ఎక్కువగా తగ్గించలేదని, కానీ ఎప్పుడైతే దాని మీద అరకిలో హోమసామాగ్రిని పోసి మండించగా ఆ కక్ష లోని బాక్టీరియా స్థాయి గంట వ్యవధిలో 94% తగ్గిందని నిర్ధారించారు. ఇది మాత్రమే కాకుండా ఆపైన, కక్ష తలుపులు తెరిచి పొగలు విడుదలైన 24 గంటల తరువాత కూడా జీవాణువుల స్థాయి సాధారణము కంటే 96% తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తరువాత కూడా అనేక సార్లు పరీక్షించిన పిమ్మట హోమపు పొగల యొక్క ప్రభావము నెల రోజుల వరకు ఉంటుందని నిర్ధారించారు. 30 రోజుల తరువాత కూడా ఆ కళ్లలోని విషాణువుల స్థాయి

సాధారణం కంటే చాలా తక్కువ ఉన్నట్లు వెల్లడించారు. ఎథ్నోఫార్మాకాలజీ (ఎథోనోఫార్మా కాలజీ 2007 యొక్క రీసర్చ్ జర్నల్) యొక్క పరిశోధనా పత్రంలో ఈ నివేదికను డిసెంబరు 2007లో ప్రచురింప బడినది..

హోమము చేయుట వలన మనుష్యులకే కాకుండా చెట్లకు మరియు పంట పొలములకు హాని కలిగించే బాక్టీరియా కూడ నశిస్తాయని ఈ నివేదిక వెల్లడించింది.

ఇందువలన పొలములలో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించవచ్చు.

హోమం కొరకు ఏ కలప వాడుతారు?

సమిధల రూపంలో మామిడి కలపను వాడటం సర్వ సాధారణమే, కానీ ఇతర కలపలను కూడా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. సూర్యుని కొరకు జిల్లేడు యొక్క కలప, చంద్రునికి మోదుగ, మంగళ గ్రహానికి ఖైర్ (ఖదిరము) యొక్క కలప, బుధునికి ఉత్తరేణి, బృహస్పతికి రావి, శుక్రునికి మేడి, శనికి షామి (జమ్మి), రాహువుకి దుర్వా దర్భ మరియు కేతువుకి కుషా దర్భ అనే వివిధ వృక్షాల కలపలను గుర్తించారు.జిల్లేడు సమిధ వ్యాధిని నాశనం చేస్తుంది. మోదుగ సర్వ కార్యములను సిద్ధింప చేస్తుంది, రావి సమిధలు సంతానం కలిగిస్తుంది, జమ్మి పాపాలను నశింప చేస్తుంది, దుర్వా దీర్ఘాయువును ఇస్తుంది మరియు కుషా అన్ని సమస్యలను దూరం చేస్తుంది మరియు కోరికలను తీరుస్తుంది.


హోమంలో వాడే ద్రవ్యాల రకాలు :

ప్రతీ ఒక్క ఋతువులో ఆకాశంలో వాయు మండలాలు వివిధ రకాలుగా మారుతూ వుంటాయి. చలి, వేడి, తేమ, గాలి బరువుగా లేక తేలికగా వుండుట, దుమ్ము , పొగ, మంచు మొదలైన వాటితో ఆకాశము నిండి వుంటుంది. వివిధ రకాల సూక్ష్మ జీవుల పుట్టుక, పెరుగుదల మరియు మరణం యొక్క క్రమం కొనసాగుతూనే ఉంటుంది. అందువలన, వాతావరణం కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉంటుంది. మరి కొన్నిసార్లు అనారోగ్యంగా మారుతుంది. అటువంటి మలినాలను తొలగించి, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి, హోమంలో ఇలాంటి ఔషధ గుణాలున్న

ద్రవ్యములను ఉపయోగిస్తారు. ఈ ప్రయోజనం బాగా ఉపయోగపడుతుంది.


హోమం యొక్క ద్రవ్యాలు :


హోమ-ద్రవ్యాలు లేదా హోమ- సామాగ్రి అనగా మండ గలిగే పదార్ధాలు అని అర్ధం. వాటిని యజ్ఞం (హోమం) యొక్క అగ్నిలో మంత్రాలతో పాటు సమర్పిస్తారు..


1. సుగంధ ద్రవ్యాలు : కుంకుమ, అగర్, టగర్, గంధపు చెక్క, ఏలకులు, జాజికాయ, జాపత్రి


2. నిశ్చిత ద్రవ్యాలు : కరిగించిన వెన్న, గుగ్గులు, ఎండిన పండ్లు, బార్లీ, నువ్వులు, బియ్యం, తేనె మరియు కొబ్బరి మొదలైనవి.


3. పటిక బెల్లం, ఎండు ద్రాక్ష మొదలైనవి.


4. వ్యాధి నాశక ద్రవ్యాలు: తిప్ప తీగ, జాజికాయ, సోంపల్లి సాంబ్రాణి, తులసి, ఎండు కొబ్బరి, నువ్వులు, ఉసిరి, మల్కంగ్ని, బే ఆకు, ప్రెంఖానము, కుంకుమ, తెల్ల చందనము, తగర మొదలైనవి.


పైన పేర్కొన్న నాలుగు రకాల వస్తువులను తప్ప కుండా హోమంలో వాడాలి. ఆహార ధాన్యాలని హోమంలో వాడుట వలన మేఘాలు ఎక్కువగా వర్తిస్తాయి. అందువలన ధాన్యం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. సుగంధ పదార్ధాలతో ఆలోచనలు శుద్ధి చేయబడతాయి, తీపి పదార్థాలు శరీరానికి పుష్టినీ మరియు ఆరోగ్యాన్ని అందిస్తాయి, కావున నాలుగు రకాల పదార్ధాలకు సమాన ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఒకవేళ ఇతర వస్తువులు అందుబాటులో లేని ఎడల, ఎప్పుడూ వుండే నువ్వులు, బార్లీ, బియ్యంతో మాత్రమే హోమం తలపెట్టవచ్చు.


సాధారణంగా వాడే ధూప సామాగ్రి:


నువ్వులు, బార్లీ, తెలుపు గంధపు పొడి, అగరు, టగరు, గుగ్గులు, జాజికాయ, దాల్చినచెక్క, తాలిసపత్రి, పనాడి, లవంగాలు, పెద్ద ఏలకులు, గోలా, ఎండు ద్రాక్ష, ఇంద్ర బార్లీ, కర్పూరం కల్తీ, ఉసిరి, తిప్ప, జాజికాయ, బ్రాహ్మి.

సుందరకాండ

 *🌹 మన సమస్యలకి సుందరకాండ పరిష్కారాలు 🌹*


*సుందరకాండ అద్భుతమైన పారాయణం, ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు.. ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం కాండం మొత్తం పారాయణ చేయలేరు, అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది. పారాయణ నియమాలతో ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.*


*🌻 1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి*

-----------------------------------

*శ్లోకం :* *ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్*

 *లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||*


*21 దినములు , 108 సార్లు , శక్తి కొలది తమలపాకులు, అరటిపళ్ళు నివేదన చేయాలి.*


*🌻 2. విద్యాప్రాప్తికి*

----------------------

*ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను . 3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన*


*🌻 3. భూతబాధ నివారణకు*

--------------------------------

*3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు 30 దినములు పారాయణ చేయవలెను . 1 కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన*


*🌻 4. సర్వ కార్య సిద్దికి*

------------------------

*64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు 40 దినములు పారాయణ చేయవలెను .శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను*


*🌻 5. శత్రు నాశనముకు*

--------------------------

*51 వ సర్గ అతినిష్ఠతో 2 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను .*


*🌻 6. వాహనప్రాప్తికి*

---------------------

*8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు 27 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను .*


*🌻 7. మనశాంతికి*

--------------------

*11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .*


*🌻 8. స్వగృహం కోరువారికి*

------------------------------

*7వ సర్గ ఏకాగ్రతతో 1 సారి 40 దినములు పారాయణ చేయవలెను. అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను .*


*🌻 9. యోగక్షేమాలకు*

------------------------

*13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 27 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను.*


*🌻 10. ఉద్యోగప్రాప్తికి*

-----------------------

*63 వ సర్గ నిష్ఠతో 5 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను . శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను .*


*🌻 11. రోగ నివారణకు*

------------------------

*34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము , 21 దినములు పఠించవలెను. శక్తి కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను .*


*🌻 12. దుఃఖనివృత్తికి*

-------------------------

*67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను*


*🌻 13. దుస్వప్న నాశనానికి*

---------------------------------

*27వ సర్గ ఏకాగ్రతతో 1 సార్లు ప్రతిదినము పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .*


*🌻 14. దూరముగా ఉన్న ఆప్తులు క్షేమమునకు*

------------------------------------

*33 నుండి 40 వ సర్గ వరకు 1 సారి , 21 దినములు నిష్ఠతో పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .*


*🌻 15. ధనప్రాప్తికి*

-------------------

*15వ సర్గ ఏకాగ్రతతో 1 సారి 40 దినములు పఠించవలెను.*

*అరటిపళ్ళు, పటిక బెల్లం , మరియు రామాయణం లో అయోధ్యకాండలో యాత్రాదానము 32 వ సర్గ 1 సారి , 40 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయవలెను . ( అగస్త్య , పరాశర , ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది ).* 


*🌻 16. దైవాపచారా ప్రాయశ్చిత్తం*

------------------------------------

*38 వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు 27 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనస నివేదన చేయవలెను .*


*🌻 17. బ్రహ్మజ్ఞానము కలుగుటకు*

------------------------------------

*19 వ అతినిష్ఠతో రోజుకు ఒకసారి 1 సంవత్సరము పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.*


*🌻 18. ఏలిననాటి శనీ దోష పరిహారమునకు*

----------------------

*సకల రోగ నివృత్తికి - సర్వ పాప నివృత్తికి*

------------------------------------

*మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 దినాలలో 1సారి 68 రోజులు చదువవలెను. నివేదన రోజూ కొబ్బరికాయ సత్ఫాలితమునిచ్చును .* 


*🌻 19. కన్యా వివాహమునకు*

--------------------------------

*9 దినములలో ఒకసారి పూర్తిగా 68 దినాలలో పఠించవలెను. సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు ప్రతిరోజు పఠించవలెను. అప్పాలు , పాలు , పంచదార నివేదన చేయవలెను .*


*🌻20. విదేశీ యానమునకు*

-----------------------------

*1 వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5 సార్లు 30 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .*


*🌻 21. ధననష్ట నివృత్తికి*

----------------------------

*55వ సర్గ నిష్ఠతో 3 సార్లు 30 దినములు పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, పనస నివేదన చేయవలెను.*


*🌻 22. వ్యాజ్యములో విజయమునకు*

-----------------------------------

*42 సర్గ అతి ఏకాగ్రతతో 3 సార్లు , 21 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్ష , దానిమ్మ నివేదన చేయవలెను .*


*🌻 23. వ్యాపారాభివృద్ధికి*

---------------------------

*15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు 21 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను .*


*🌻 24. పుత్ర సంతానానికి*

---------------------------

*ప్రతిదినం 7 వ సర్గ నిష్ఠతో 68 రోజులు పారాయణ చేయవలెను . శక్తి కొలది అరటిపళ్ళు , కొబ్బరికాయ , నివేదన చేయవలెను. శక్తి కొలది తమలపాకులతో అర్చన చేయవలెను . సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చును .*


*🌻 25. ఋణ విముక్తికి*

--------------------------

*28 వ సర్గ చాలా నిష్ఠగా , రోజుకి 1 సారి 41 రోజులు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను .*

🌹 🌹 🌹 🌹 🌹

పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు

 *రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు*

*శివ పంచానన స్తోత్రం*


రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు

న్యాసంలో ప్రస్తావించబడ్డాయి. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహాన్యాస వివేచనము రావణ ప్రోక్త న్యాస ప్రక్రియలోనిది. దీనినే శివ పంచానన స్తోత్రం అని కూడా అంటారు.


*తత్పురుష ముఖ ధ్యానమ్* 🙏


*ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి |*

*తన్నో రుద్రః ప్రచోదయాత్ ||*


*సంవర్తాగ్ని తటిప్రదీప్త కనక - ప్రస్పర్ధితేజోరుణం*

*గంభీర ధ్వని సామవేద జనకం - తామ్రాధరం సుందరం*

*అర్ధేందుద్యుతిలోలపింగళజటా  - భారప్రబద్ధోరగం*

*వందే సిద్ధ సురాసురేంద్రనమితం - పూర్వం ముఖం శూలినః*


*ఓంనమోభగవతే రుద్రాయ పూర్వాంగముఖాయ నమః* 🙏


తాత్పర్యము: ప్రళయ కాలము నందలి అగ్ని తేజము తోనూ, మెరపుల తేజముతోను, బాగా కరిగిన బంగారు కాంతితోను పోటీ పడే తేజములే తన రూపముగా కలది, గంభీరధ్వనితో మిశ్రితము అగుటతో పాటు భయంకరమైన అగ్ని వలె ప్రకాశించు ఎర్రని పెదవి కలదియు, చంద్ర ఖండ కాంతితో చక చక మెరయు పింగళ వర్ణపు జడల గుంపును, దాని చుట్టూ గట్టిగా చుట్టిన సర్పములు కలదియు, సిద్ధులు, సురాసురుల చేత నమస్కరించబడుతున్న, శూలికి సంబంధించిన తూర్పున ఉన్న ముఖమును నమస్కరించుచున్నాను. (రజో గుణ ప్రధానమైన సృష్టి తత్వమును ఈ శ్లోకములో స్తుతి చేయబడినది)


*అఘోర ముఖ ధ్యానమ్* 🙏


*ఓం అఘోరేభ్యో థఘోరేభ్యో గోర ఘోర తరేభ్యః సర్వేభ్యం* *సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః*


*కాలాభ్రభ్రమరాంజనద్యుతినిభం - వ్యావృత్తపింగేక్షణం*

*కర్ణోద్భాసితభోగిమస్తకమణి - ప్రోద్భిన్న దంష్ట్రాంకురం*

*సర్పప్రోత కపాలశుక్తి శకల - వ్యాకీర్ణతాశేఖరం*

*వందే దక్షిణమీశ్వరస్య వదనం - చాతర్వనాదోదయం*


*ఓంనమోభగవతే రుద్రాయ దక్షిణాంగముఖాయ నమః* 🙏


తాత్పర్యము: నల్లని మేఘములు, తుమ్మెదల కాటుక - వీటి కాంతిని పోలిన కాంతితో ప్రకాశించునదియు, మిక్కిలి మిట్టగా తిరుగుచుండు పింగా వర్ణపు కన్నులు కలదియు, చెవుల యందు మిక్కిలి ప్రకాశించుచుండు సర్ప శిరోరత్నములతో బాగా కలిసిపోవుచున్న కోరల మొలకలు కలదియు, సర్పములతో పాటు (హారముగా) కూర్చబడిన కపాలములతో, ముత్యపు చిప్పల ముక్కలతోను, ఎగుడు దిగుదగుచున్న నడకను పొందినదియు, వంకరలుగా నున్న కను బొమ్మల ముడులతో భయంకరముగా నున్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించు చున్నాను. (తమో గుణ ప్రధాన లయ కర్త తత్వము ఇక్కడ స్తుతి చేయబడింది)


*సద్యోజాత ముఖ ధ్యానమ్* 🙏


*ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయవై నమోనమః* *భవేభవే నాతి భవేభవ స్వమాంభవోద్భవాయ నమః*


*ప్రాలేయాచల మిందుకుంద ధవళం - గోక్షీరఫేన ప్రభం*

*భస్మాభ్యంగమనంగ దేహదహన - జ్వాలావళీలోచనం*

*విష్ణు బ్రహ్మ మరుద్గణార్చిత  పదం - ఋగ్వేద నాదోదయం*

*వందేహం సకలం కళంకరహితం - స్థాణోర్ముఖం పశ్చిమం*


*ఓంనమోభగవతే రుద్రాయ పశ్చిమాంగముఖాయ నమః* 🙏


తాత్పర్యము: హిమవత్పర్వతము, చంద్రుడు, మల్లే పూవు - వీని వలె తెల్లనిదియు, ఆవుపాల మీద నురుగు వలె తెల్లని కాంతి కలదియు, విభూతి పూయబదినదియు, మన్మథుని శరీరమును దహించు జ్వాలల పంక్తితో నిండిన కన్ను కలదియు, స్తోత్రము చేయుచున్న బ్రహ్మేన్ద్రాది దేవ సమూహముల చేతను, యోగుల చేతను శ్రద్ధతో అర్చించ బడుచున్నదియు, నిర్మలమైన నిండు వాదనముతో కనబడుచున్నదియును అగు శివుని పశ్చిమ నమస్కరించు చున్నాను. (సత్వ గుణ ప్రధాన రక్షణ కర్త తత్వమును ఈ శ్లోకములో స్తుతించ బడినది)


*వామదేవ ముఖ ధ్యానమ్* 🙏


*ఓం వామదేవాయ నమోజేష్టాయనమః శ్రేష్టాయ నమోరుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమోబలవికరణాయ నమోబలాయ నమోబల ప్రమథనాయ నమః  సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమః*


*గౌరం కుంకుమ పంకితం సుతిలకం - వ్యాపాండు మండ స్థలం*

*భృవిక్షేప కటాక్ష వీక్షణలసత్ - సంసక్త కర్ణోత్పలం*

*స్నిగ్ధం బింబ ఫలాధరం ప్రహసితం - నీలాల కాలం కృతం*

*వందే యాజుష వేద ఘోష జనకం - వక్త్రం హరస్యోత్తరం*


*ఓం నమోభగవతే రుద్రాయ ఉత్తరాంగముఖాయ నమః* 🙏


తాత్పర్యము: గౌర (ఎరుపుతో కలిపిన తెలుపు) వర్ణము కలదియు, కుంకుమ పూ పూతతో నిండినదియు, అందమగు తిలకము కలదియు, విశేషముగా తెల్లదనము కల చెక్కిళ్ళు కలదియు, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి చూపుతో ప్రకాశించుటతో పాటు, చెవికి అలంకారముగా నున్న తెల్ల కలువ పూవు కలదియు, నున్నని దొండపండు పోలు ఎర్రని క్రింద పెదవిపై స్పష్టమగు నవ్వు కలదియు, నల్లని ముంగురులచే అలంకరించబడిన, నిండు చంద్రుని మండలమును పోలుచు ప్రకాశించునదియు అగు శివుని ఉత్తరాముఖమును నమస్కరించు చున్నాను. (గుణ త్రయ మిశ్రమమగు ఈశ్వర తత్త్వము ఇక్కడ స్తుతించ బడినది)


*ఈశాన ముఖ ధ్యానమ్* 🙏


*ఓం ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి: బ్రాహ్మణోధి పతి: బ్రహ్మశివోమే అస్తు సదాశివోమ్.*


*వ్యక్తావ్యక్త నిరిపితించ పరమం - శస్త్రింశతత్వాధికం*

*తస్మాదుత్తర తత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః*

*ఓంకారాది సమస్త మంత్ర జనకం  - సూక్ష్మాతి సూక్ష్మంపరం*

*వందే పంచమమీశ్వరస్య వదనం - ఖవ్యాపి తేజోమయం*


*ఓం నమోభగవతే రుద్రాయ ఊర్ధ్వంగముఖాయ నమః* 🙏


తాత్పర్యము: వ్యక్తము, అవ్యక్తము (స్పష్ట రూపము కలది, స్పష్ట రూపము లేనిది) అణు రెండు రెండు లక్షణముల కంటెను ఇతరమగు లక్షణము కలదియు, ముప్ఫై ఆరు తత్వముల రూపమున పరిణమించు నదియు, సకల తత్వముల కంటెను ఉన్నతమైనదియు అగు అనుత్తరము అను అక్షర (అకార) తత్వమును ఎల్లప్పుడును యోగులచే ధ్యానించబడ దగినదియు,  తమో గుణ రహితంను, మూడు కన్నులు కలదియు, సూక్ష్మాతిసూక్ష్మమగు దాని కంటే గోప్పదియు, శాస్తమును, ఆకాశము నంతటనూ వ్యాపించు తేజమే తన రూపముగా కలదియు అగు ఈశ్వరుని ముఖమును నమస్కరింతును (గుణాతీత బ్రహ్మ తత్వమును ఇక్కడ స్తుతించబడినది)

శివైక్యం

 శు  భో  ద  యం🙏

శివైక్యం!


ఒకపుష్పంబు భవత్పద ద్వయముపై నొప్పంగ సద్భక్తి రం/

జకుఁడై పెట్టిన, పుణ్యమూర్తికి పునర్జన్మంబులేదన్న, పా/

యక కాల త్రితయోపచారముల నిన్నర్చించున్ పెద్ద నై/

ష్ఠికుడై యుండెడువాడు,నీవగుట తాచిత్రంబె ! సర్వేశ్వరా!


సర్వేశ్వర శతకం:- చిమ్మపూడి అమరేశ్వరుడు.

స్వామీ! సర్వేశ్వరా!

నీపాదాలపై భక్తితో ఒకపువ్వుంచి,ప్రార్ధించిన వాడికి మళ్ళాజన్మంటూ ఉండదటే! రోజూత్రి సంధ్యలా మహానిష్ఠతో నిన్నర్చించేవాడు నీలో ఐక్యమైపోతే ఆశ్చర్యమేమున్నది?అనిభావం.

       ఈశ్వరార్చనకు ఫలితం జన్మరాహిత్యమనీ, యీశ్వరసాయుజ్యమనీ చెప్పే యిపద్యం అపురూపమైనదిగదా!

పవిత్రమైన కార్తీకమాసం

శివనామస్మరణ, శివపూజను మరువకండి!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

వైశాఖ పురాణం - 26

 వైశాఖ పురాణం - 26


26వ అధ్యాయము - భాగవత ధర్మములు


నారదుడు అంబరీషమహారాజుతో నిట్లు చెప్పుచున్నాడు. శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజుతో శంఖవ్యాధ సంవాదమును వివరించుచు నిట్లనెను.


స్వామీ! బ్రహ్మజ్ఞానీ! ప్రభువగు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేలకొలదిగానున్న జీవులు విభిన్నకర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై యున్నారు. దీనికి కారణమేమి? నాకు దీనిని వివరింపుడని యడిగెను.


అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సత్వరజస్తమో గుణత్రయముననుసరించి జీవులు యేర్పడిరి. రాజసులు రాజసకర్మలను, తామసులు తామసకర్మలను, సాత్వికులు సాత్వికకర్మలను చేయుచుందురు. ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలనుబట్టి సత్వరజస్తమో గుణముల పాళ్లు యెక్కువ తక్కువలగుచుండును. అందువలన వారు యెక్కువ కర్మకు యెక్కువ ఫలమును తక్కువ కర్మకు తక్కువ ఫలమును పుణ్యపాపముల రూపమున సుఖదుఃఖముల నందుచుందురు. ఈ జీవులు తాము చేసిన కర్మలననుసరించి ఒకప్పుడు దుఃఖమును మరొకప్పుడు సుఖమును యింకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు. వీరు మాయకులోబడి యీ మూడు గుణములకును బద్దులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచు మాయకులోబడి మరల కర్మలను గుణానుకూలముగ చేయు తగిన ఫలితములనందుచున్నారు. మాయకులోబడి వారి గుణకర్మల వలని మార్పులుచేర్పులు ఆ జీవులకే గాని మాయకేమియు మార్పులేదు. తామసులైన వారు పెక్కు దుఃఖముల ననుభవించుచు తామస ప్రవృత్తి కలవారై యుందురు. నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవింతురు. వారు రాక్షస జన్మమొదలుకొని పిశాచ జన్మాంతముగ తామసమార్గమునే చేరుచుందురు.


రాజసప్రవృత్తులు మిశ్రమబుద్దితో పుణ్యపాపములను రెండిటిని చేయుచుందురు. పుణ్యము నధికముగ చేసిన స్వర్గమును, పాపమెక్కువయైన నరకమును పొందుచుందురు. కావున నీరు నిశ్చయజ్ఞానము లేనివారై మంద భాగ్యులై సంసారచక్రమున భ్రమించుచుందురు.


సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణవిశిష్టులై శ్రద్ద కలిగినవారై యితరులను జూచి అసూయపడనివారై సాత్విక ప్రవృత్తి నాశ్రయించియుందురు. వీరు తేజశ్శాలురై గుణత్రయశక్తిని దాటి నిర్మలులై యుత్తమ లోకములనందుదురు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్నకర్మలు కలవారు, విభిన్న భావములు కలవారు, విభిన్న విధములు కలవారు నగుచున్నారు. ప్రభువగు శ్రీహరి జీవుల గుణకర్మలననుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు. జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడగుచున్నాడు.


సంపూర్ణకాముకుడైన శ్రీహరికి భేదబుద్ది దయ స్వభావము లేవు. సృష్టిస్థితి లయములను సమముగనే జీవులగుణకర్మల ననుసరించి చేయుచున్నాడు. కావున జీవులందరును తాము చేసిన గుణకర్మల ననుసరించియే తగిన ఫలములను, శుభములను - అశుభములను, సుఖమును - దుఃఖమును, మంచిని - చెడును పొందుచున్నారు. తోటను నాటినవాడు అన్ని మొక్కలకును సమముగనే నీరు మున్నగు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగ యెత్తుగను, పొట్టిగను, లావుగను, సన్నముగను వివిధ రీతులలో పెరుగును. అచటనాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును. పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును. ఇచట గమనింప వలసిన విషయమొకటి కలదు. జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో నతని కర్మానుభవము వలన ముండ్ల చెట్టు విత్తనమగును. కర్మలు మంచివైనచో నతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును. భగవంతుని రక్షణమునకుండును. కాని మనము ముండ్ల చెట్లమా, పండ్ల చెట్లమా యన్నది మన కర్మలను, గుణములను అనుసరించి యుండును. తోటకాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును. కాని ఆ చెట్ల తీరు వేరుగానుండుటకు తోటకాపరి వాని గుణములు కారణములు కావు. ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా! అని శంఖుడు వివరించెను.


కిరాతుడు స్వామీ! సంపూర్ణజ్ఞానసంపద కలవారికి సృష్టిస్థితిలయములలో నెప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని యడిగెను. శంఖుడిట్లనెను. నాలుగువేల యుగములు బ్రహ్మకు పగలు, రాత్రియు నాలుగువేల యుగములకాలమే. ఇట్టి ఒక రాత్రి, ఒక పగలు బ్రహ్మకు ఒక దినము. ఇట్టి పదునైదు దినములోక పక్షము. ఇట్టి రెండు పక్షములోక మాసము. రెండు మాసములొక ఋతువు. మూడు ఋతువులొక ఆయనము. రెండు ఆయనములోక సంవత్సరము. ఇట్టి సంవత్సరములు దివ్యములు నూరైనచో దానిని బ్రహ్మకల్పమందురు. ఒక బ్రహ్మకల్పము ముగియగనే ప్రళయమేర్పడును అని వేదవిదులందురు. మానవులు అందరును నశించినప్పుడు మానవప్రళయము బ్రహ్మమానమున నొకదినము గడువగా వచ్చిన ప్రళయము. దినప్రళయము. బ్రహ్మ మానమున నూరు సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మప్రళయము అని ప్రళయమును మూడు విధములని చెప్పిరి. బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడచినదో మనువునకు ప్రళయమగును. ఇట్టి ప్రళయములు పదునాలుగు గడచినచో దీనిని దైనందిన ప్రళయమని యందురు.


మన్వంతరమున మూడు లోకములు మాత్రమే నశించును. అందు చేతనములు మాత్రము నశించి అచేతనములగు లోకములు నశింపవు. జలపూర్ణములై యుండును. మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును. పెరుగును మధించి సారభూతముగ వెన్నను స్వీకరించునట్లు అన్ని ధర్మముల సారము వైశాఖధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాలసముద్రమున నున్నప్పుడు చెప్పెను.


బాటసారులకు మార్గమున నీడ నిచ్చునట్టి మండపములను, చలివేంద్రముల నేర్పరుచుట విసనకఱ్ఱలతో విసరుట మరియు నుపచారములను చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము, దానమిచ్చుట, వైభవమున్నచో వాపీకూప తటాకములను త్రవ్వించుట, సాయంకాలమున పానమును, పుష్పములను ఇచ్చుట తాంబూల దానము. ఆవుపాలు మొదలగు వానినిచ్చుట, ఉప్పు కలిసిన మజ్జిగను బాటసారులకిచ్చుట, తలంటిపోయుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప, కంబళి, మంచము, గోవు మున్నగువానిని నిచ్చుట తేనె కలిసిన నువ్వులనిచ్చుట యివన్నియు పాపములను పోగొట్టును. సాయంకాలమున చేరకుగడ నిచ్చుట, దోసపండ్ల నిచ్చుట పండ్లరసములనిచ్చుట పితృదేవతలకు తర్పణలిచ్చుట యివి వైశాఖధర్మములు అన్ని ధర్మములలోనుత్తమములు. ప్రాతఃకాలమున స్నానమాచరించి విహితములగు సంధ్యావందనాదుల నాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానముల చేయవలెను. వైశాఖము తలంటిపోసుకొనరాదు. కంచుపాత్రలో భుజింపరాదు. నిషిద్ధములగు ఉల్లి మొదలగువానిని భక్షింపకుండుట, పనికిమాలిన మాటలను, పనికిమాలిన పనులను వైశాఖమున చేయరాదు. సొరకాయ, వెల్లుల్లి, నువ్వులపిండి పులికడుగు, చద్దియన్నము, నేతిబీరకాయ మున్నగు వానిని వైశాఖమున నిడువవలెను. బచ్చలకూర, ములగకాడలు పండని, వండని పదార్థములు, ఉలవలు, చిరుశెనగలు వీనిని తినరాదు. ఒకవేళ పైన చెప్పబడినవానిలో దేనిని భుజించినను నూరు మార్లు నీచ జన్మమునందును. తుదకు మృగమై జన్మించును. ఇందు సందేహములేదు.


ఈ విధముగ శ్రీహరి ప్రీతిని గోరి వైశాఖమాసమంతయు వ్రతము నాచరింపవలెను. తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యధాశక్తి వైభవముగా బ్రాహ్మణునకీయవలెను. వైశాఖ బహుళ ద్వాదశినాడు పెరుగు కలిపిన అన్నమును, జలకలశమును తాంబూల దక్షిణలను యిచ్చిన యమ ధర్మరాజు సంతసించెను.


శ్లో|| వైశాఖేసితద్వాదశ్యాం దద్యాద్దద్ధ్యన్నమంజసా |

సోదకుంభంసతాంబూలం సఫలంచసదక్షిణం |

దదామి ధర్మరాజాయ తేవప్రీణాతువైయమః ||


పితృదేవతల గోత్రనామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరి యిచ్చిన పితృదేవతలు సంతసింతురు.


శ్లో|| శీతలోదకదధ్యన్నం కాంస్యపాత్రస్థముత్తమం |

సదక్షిణంసతాంబూలం సభక్ష్యంచ ఫలాన్వితం ||

తదామివిష్ణవేతుభ్యం విష్ణులోక జిగిషయా |

ఇతిదత్వాయధాశక్త్యాగాంచదద్యాత్కుటుంబినే ||


చల్లని యుదకమును పెరుగు కలిపిన అన్నమును, కంచుపాత్రలోనుంచి దక్షిణ తాంబూలము భక్ష్యములు ఫలములు నుంచి పిల్లలుగలవానికి/బ్రాహ్మణునకు యిచ్చి గోదానము చేసిన శ్రీహరి లోకము కలుగును. ఆడంబరము కపటము లేకుండ వైశాఖ మాస వ్రతము నాచరించినచో వాని సర్వపాపములును పోవుటయేకాక, వాని వంశమున నూరుతరములవారు పుణ్యలోకములనందుదురు. వైశాఖవ్రతము నాచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును, శ్రీహరిలోకమును చేరుదురు.


అని శంఖముని కిరాతునకు వైశాఖధర్మములను వివరించుచుండగా అయిదు కొమ్మలు గల మఱ్ఱిచెట్టు నేలపై బడెను అందరు ఆశ్చర్యపడిరి. ఆ చెట్టుతొఱ్ఱలో నుండి పెద్దశరీరము కల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తలవంచి నమస్కరించి నిలిచెను.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను.


వైశాఖ పురాణం 26వ అధ్యాయం సమాప్తం.

నేడు వ‌రల్డ్ సైకిల్ డే*

 జై శ్రీమన్నారాయణ..

03.06.2024, సోమవారం



*ఆయుష్షు పెంచే ఆరోగ్య సాధనం 'సైకిల్'..* 

*నేడు వ‌రల్డ్ సైకిల్ డే*


‘చలో చలో సైకిల్‌.. బిరబిర బిరబిర బిరబిర పరుగులు తీసే చలో చలో సైకిల్‌.. ఆనంద సీమలకు హాయిహాయిగా చలో చలో సైకిల్‌’ పాట 1945 నాటి ‘స్వర్గసీమ’ సినిమాలోది. ఇప్పుడు బైక్‌, కార్లు ఛేజింగ్‌ మాదిరిగానే అప్పటి సినిమాల్లోనూ సైకిల్‌ ఛేజింగ్‌ దృశ్యాలుండేవి. ఇప్పటి తరానికి ఆ అనుభూతి లేకపోవచ్చును గానీ, సైకిల్‌ ఓ మధురమైన జ్ఞాపకం. ఇక, సైకిల్‌ నేర్చుకోవడానికి పడిన తంటాలు, తిన్న గాయాలు తియ్యని జ్ఞాపకాలే. దాదాపు 20ఏళ్ల క్రితం వరకు యువతరానికి ఇదో మోజు. సొంత సైకిల్‌ ఉందంటే అదో హోదా. స్కూలు, కాలేజీలకు డాబుగా సైకిల్‌పై వెళ్లడం…. బెల్‌ గణగణమంటూ మోగిస్తూ… వలయాకారంలో తిప్పుతూ రకరకాల ఫీట్లు చేయడం… కిర్రుమని బ్రేకులు వేయడం ఒకప్పటి సరదా. ఎక్కడ చూసినా సైకిళ్లే కనిపించేవి. సూర్యోదయానికి ముందే ఇంటి ముందు ట్రింగ్‌…ట్రింగ్‌ మని సైకిల్‌ బెల్‌ మోగిందంటే… పేపర్‌ బోయ్ అని, మరికాసేపటికి అదే శబ్దం వస్తే పాలుపోసే వ్యక్తి అనో, కాస్త పొద్దెక్కిన తర్వాత వినిపిస్తే పోస్ట్‌మ్యాన్‌ అనో బెల్‌ శబ్దాన్ని బట్టి పోల్చుకోగలిగేంతగా సైకిల్‌ జన జీవనంలో మమేకమైపోయింది.


జూన్‌ 3వ తేదీన ప్రపంచ సైకిల్‌ దినోత్సవం జరుపుకొంటారు. 2018 ఏప్రిల్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతి సంవత్సరం జూన్‌ 3న ప్రపంచ సైకిల్‌ దినోత్సవంగా ప్రకటించింది.

ప్రస్తుత రూపంలో ఉన్న సైకిలును 1817లో కనిపెట్టారు.


మధుమేహం కంట్రోల్‌


డయాబెటిస్ సమస్యలు ఉన్నవారికి శారీరక వ్యాయామాలు చాలా ముఖ్యమైనవి. రోజూ దాదాపు 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది


సైకిల్‌ తొక్కడం ద్వారా మంచి వ్యాయమం..


ఇక సైకిల్‌ తొక్కడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. శారీరక వ్యాయమానికి సైకిల్‌ తొక్కడం ఎంతో మంచిది. బీపీ, మధుమోహం లాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. రోజుకు ఐదారు కిలోమీటర్లు సైకిల్‌ తొక్కినట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. అంతేకాదు సైకిల్‌ తొక్కడం వల్ల శరీరం హుషారుగా పని చేస్తుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఆరోగ్యం పది కాలాల పాటు పదిలంగా ఉంటుందని చెబుతుంటారు పెద్దలు...


ఊపిరితిత్తులు బలోపేతం


సైక్లింగ్ ఊపిరితిత్తులను బలపరుస్తుంది. వాస్తవానికి సైకిల్ తొక్కేటప్పుడు సాధారణం కంటే ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ ఎక్కువగా చేరుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును బలపరుస్తుంది. దీంతో ఊపిరితిత్తులు బలోపేతం అవుతాయి.


సమాజంలో సైక్లింగ్‌ సంస్కృతిని ఎంతో డెవలప్‌ చేయడానికి, ప్రోత్సహించడానికి కావాల్సిన ఉత్తమ పద్దతులను సరైన మార్గాలను అవలంబించేలా సభ్య దేశాలను ప్రోత్సహిస్తుంది. రహదారి భద్రతను మెరుగుపర్చడానికి సభ్య దేశాలను ప్రోత్సహించడమే కాకుండా పాదచారుల భద్రతను కాపాడడానికి సైకిల్‌ వాడకాన్ని ఎంతో ప్రోత్సహిస్తుంది...