21, జులై 2024, ఆదివారం

మన లెక్కల

 *


*మన లెక్కల, ఫిజిక్స్ పంతుళ్ళ పని కొంచెం తేలిక చేశారు . . .😊*


అమ్మ చేసిన రొట్టె *వృత్తము*

సగానికి మడిచిన దోసె *అర్ధ వృత్తము*


మనం కూర్చునే స్టూల్ *చతురస్త్రం*

పడుకునే మంచం *దీర్ఘ చతురస్త్రం*


మనకిష్టమైన లడ్డూఒక  *గోళము*

సగం మన మిత్రునికిస్తే *అర్ధ గోళము*


మన తరగతి గది ఒక *ఘనం*

మనం కూర్చునే బెంచీ ఒక *దీర్ఘ ఘనం*


మన జెండా కర్ర ఒక *స్థూపం*

కొడవలి మలుపు ఒక *చాపం*

ధాన్యపు రాశి ఒక *శంఖువు*


రూపాయి రూపాయి కలిపితే *కూడిక*

కొనడానికి కొంత తీస్తే *తీసివేత*

తలా పది పంచితే *భాగహారం*

హెచ్చిస్తే *గుణకారం*


కూర్చుంటే *జడత్వం*

కదిలితే *చలనం*

పరిగెత్తితే *వేగం*

ఆగి ఆగి పరుగు తీస్తే *త్వరణం*

పడిపోతే *ఆకర్షణ*

విడిపోతే *వికర్షణ*

తన చుట్టూ తాను తిరిగితే *భ్రమణం*

గుడి చుట్టూ తిరిగితే *పరిభ్రమణం*


మాట్లాడడానికి *శక్తి*

పనిచేయడానికి *బలం*

గంటకు ఎంతపని చేస్తావో అది *సామర్థ్యం*


వింటున్నా మంటే *శబ్దం*

చూస్తున్నామంటే *వెలుగు*

రంగులన్ని *వర్ణ పటం*


ఆహారం అరగడం *జీవక్రియ*

అరిగిన ఆహారం శక్తిగా మారడం *రసాయన క్రియ*

ఉచ్వాస నిశ్వాసాలు *శ్వాస క్రియ*


నేను చూశాను *భూతకాలం*

నేను చూస్తున్నా *వర్ధమాన కాలం*

నేను చూడ బోతున్నా *భవిష్యత్ కాలం*

నాకు తొంభై తొమ్మిది ఏళ్ళు ... ఇక *పోయే కాలం*


బతుకుల్లో లేనిది ఏముంది శాస్త్రాల్లో ..

సరిగా అర్థం చేసుకుంటే మన బతుకే ఒక శాస్త్రం...

మనిషిని, ఇతర ప్రాణుల్ని , ప్రకృతిని గురించి తెలుసుకోవడం తప్ప.

భయమెందుకు నీకు ...

నీకంటే ప్రపంచంలో ఎవరు గొప్ప...

తెలుసుకో పదిలంగా

నేర్చుకో సులభంగా...!   


*అదే మన తెలుగు భాష గొప్పదనం*.  


భలే ఉంది కదా ...

సర్వేజన సుఖినోభవంతు...

🌹💐💐🎉🎉💐💐🌹

శ్రీ గురువుకి నమస్కారము

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 *గురు/వ్యాస పూర్ణిమ* శుభాకాంక్షలు తెలియజేస్తూ...


 శ్లో𝕝𝕝  *గురు మధ్యే స్థితం విశ్వం* 

        *విశ్వమధ్యే స్థితో గురుః*।

        *విశ్వరూపో విరూపోసౌ*

        *తస్మై శ్రీ గురవే నమః*॥


తా𝕝𝕝 ఈ ప్రపంచమంతా గురువులో ఉంది... విశ్వమంతటిలోను గురువు ఉన్నారు.... ఆయన విశ్వరూపుడు... ఆయన రూపరహితుడు. అట్టి శ్రీ గురువుకి నమస్కారము

~~~~~~~~~~~~~


శ్లో𝕝𝕝  *ఏకమేవాక్షరం యస్తు*

       *గురుశ్శిష్యం ప్రబోధయేత్*|

       *పృథివ్యాం నాస్తి తద్రవ్యం*

       *యద్దత్వా చా ఽనృణీ భవేత్*॥


తా𝕝𝕝 గురువుగారి వద్దనుండి ఒక్క అక్షరమంత జ్ఞానం పొందినా ఆ ఋణము నుండి విముక్తిని పొందడానికి గురుదక్షిణగా ఇవ్వగలిగిన ద్రవ్యము ఈ ధరణిలో లేదు.

మానవ జన్మ*

 *మానవత్వం*




మానవుడు అనేక జన్మల ఎత్తుతూ ఉండవచ్చు, *కాని సమాజానికి  తనవల్ల ప్రయోజనము ఏమిటి అనే విషయము ఆలోచించడము లేదు.*  సమాజము వల్ల తనకేమి లాభము అని ఆలోచించినంత కాలము అతను అజ్ఞానములో ఉన్నట్లే.  *సమాజానికి  ఏదో  సేవ చేయాలని భావిస్తున్నంత కాలము మనము  భగవంతునికి దగ్గరగా ఉంటాము, అనుగ్రహము పొందుతూనే ఉంటాము*. ఈలా దైవానికి దగ్గరగా ఉండటాన్ని గూడా మనము, ఆ కరుణను దైవానికి ఆపాదిస్తూనే ఋణపడి ఉన్నాము. ఎందుకంటే దైవము అపార కారుణ్య మూర్తి. దైవము అనేక విధాలుగా మనపై దయ చూపిస్తున్నాడు. ఆ దయ మూలంగానే మనము సుఖ సంతోషాలతో, శాంతులతో ఉన్నాము.


మనకు కష్టాలిచ్చినప్పుడు, మనలను శిక్షిoచ్చినప్పుడు, శిక్షిస్తున్నప్పుడు కూడా మనను దోష రహితులుగా శుద్ధిపరుస్తున్నట్లే. *కష్టాలు కష్టాలు కావు. మనకు ఇచ్చిన కష్టాలన్నీ కూడా మనలను కల్మష రహితులను చేయటమే*.  బాధలను అనుభవించిన తర్వాత అంతకు పూర్వము కన్నా నిర్మలంగా ఉంటాము. *కష్టాల తర్వాత మనము నిర్మలమైన, ఉన్నతమైన వ్యక్తిత్వముతో జీవనము సాగిస్తున్నందుకు మనము సంతోష పడాలి*, అంతే కాదు *కష్టాలను సరైన దృష్టితో అర్థం చేసుకుంటూ ఎల్లవేళలా ఇతరులకు సేవ చేయాలి, చేస్తూనే ఉండాలి*. కష్టాల బాధ మనకు తెల్సు కాబట్టి. 


ఆ సేవ ఇతరులకొరకు అనుకుంటాము కాని అది మనకోసమే. *ఈ కారణంగా భగవంతుడు మనకు కావల్సింది ఇవ్వడానికి ఇష్టపడతాడు*. మనము చేసే, చేయబోయే సేవ/సేవలు, మనకు రాబోయే అదృష్టానికి, పుణ్యానికి పెట్టుబడి/పెట్టుబడులు మాత్రమే. పూర్వ కాలంలోనే గాదు ఇప్పుడు కూడా ధర్మాత్ములు అన్న సత్రములు, ధర్మశాలలు స్థాపించి ఆర్తులకు కావల్సిన వసతులు కల్పిస్తున్నారు. 


*దాన ధర్మాలు అవిశ్రాంతంగా నిర్వహించిన మన పూర్వీకుల సంస్కృతి గొప్పది కావటము చేత ఈ రోజు మనము గొప్పగా, గర్వంగా చెప్పుకుంటున్నాము*. ఆ గొప్ప గుణాలను మనము మనసులో మాత్రమే దాచుకోకుండా, మనము  కూడా  వాటిని వారసత్వంగా స్వీకరిస్తే,  మన కొచ్చే కీర్తి ప్రతిష్టలతో బాటు, *మన వారసులు కూడా అంత గొప్పవారు కావడానికి మనము బీజము వేసినట్లే*. 


చాలా మందికి తెల్సు ఎలా సంపాదించాలో, ఎలా దాచుకొవాలో, *కాని దాన్ని ఎలా సద్వినియోగము చేయాలో అని తెలిసిన వాళ్లు కొద్దిమంది మాత్రమే*.


సమాజంలో ప్రతి పౌరుడు దాన కర్ణుడి లాగా, శిభి చక్రవర్తి లాగా ఆర్థుల సేవలో నిలవాలి, ఎదగాలి.  *గాలి బలం ప్రపంచానికి తెల్వదు సుడిగాలై చుట్టెంత వరకు, నీటి బలం తెల్వదు ఉప్పన అయి పోటెoత్త వరకు, విత్తు బలం తెల్వదు మొలకెత్తి మాను అయ్యేంత వరకు, ఆలాగే వ్యక్తులకు తెల్వదు సేవా రంగములో అడుగిడి సేవలకు ఉపక్రమించి విజయాలు సాధించే వరకు*. పరోపకారమే పుణ్యము, పుణ్య ఫలితమే సుఖము.


*చివరిగా.....* 

"స్వ పర హిత యోగ్యతాం జన్మ"

*తన హితముతో బాటు ఇతరుల హితము కొరునదే మానవ జన్మ*

ధన్యవాదములు.

20, జులై 2024, శనివారం

అజ్ఞానపు తిమిరంబును

 *2041*

*కం*

అజ్ఞానపు తిమిరంబును(చీకట్లను)

విజ్ఞాన పు కాంతి చేత వెలిగించుటకై

సుజ్ఞాన బోధలొనరెడి

ప్రజ్ఞావంతుడు గురువిల(గురువగు) పదపడి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అజ్ఞానం అనే చీకటి ని విజ్ఞానమనే కాంతి తో వెలిగించడానికి మంచి జ్ఞానం బోధించగలిగే సమర్థుడే గురువు.


*అందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు.*

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Panchaag


 

జూలై 21, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        🌞 *ఆదివారం*🌞

   🌹 *జూలై 21, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                   


 *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - గ్రీష్మ ఋతౌః*

 *ఆషాఢమాసం - శుక్లపక్షం*


*తిథి : పౌర్ణమి* మ 03.46 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*

వారం :*ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం : ఉత్తరాషాడ* రా 12.14 వరకు ఉపరి *శ్రవణం*

*యోగం : విష్కుంబ* రా 09.11 వరకు ఉపరి *ప్రీతి*

*కరణం : బవ* మ 03.46 *బాలవ* రా 02.31 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు* 

 *ఉ 07.30 - 09.00  మ 12.30 - 04.00*

అమృత కాలం :*సా 06.15 - 07.45*

అభిజిత్ కాలం :*ప 11.48 - 12.40*

*వర్జ్యం : ఉ 09.17 - 10.47 & రా 03.55 - 05.24*

*దుర్ముహుర్తం : సా 04.59- 05.51*

*రాహు కాలం :సా 05.06 - 06.43*

గుళిక కాలం :*మ 03.28 - 05.06*

యమ గండం :*మ 12.14 - 01.51*

సూర్యరాశి : *కర్కాటకం* చంద్రరాశి : *ధనుస్సు/మకరం*

సూర్యోదయం :*ఉ 05.45* 

సూర్యాస్తమయం :*సా 06.43*

*ప్రయాణశూల :‌ పడమర దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.45 - 08.20*

సంగవ కాలం :*08.20 - 10.56*

మధ్యాహ్న కాలం :*10.56 - 01.32*

అపరాహ్న కాలం :*మ 01.32 - 04.07*

*ఆబ్ధికం తిధి : ఆషాఢ పౌర్ణమి/బహుళ పాడ్యమి*

సాయంకాలం :*సా 04.07 - 06.43*

ప్రదోష కాలం :*సా 06.43 - 08.55*

నిశీధి కాలం :*రా 11.52 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.17 - 05.01*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


☀️ *ఓం సూర్యాయ నమః* ☀️

త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరఞ్చి నారాయణ శఙ్కరాత్మన్ ॥ ౧ ॥


యన్మణ్డలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాదిరూపమ్ ।

దారిద్ర్యదుఃఖక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ ౨ ॥


🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


           🌷 *సేకరణ*🌷

         🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

        🌷🍃🌞🌞🍃🌷

        🌹 🌷🌞🌞🌷🌹

సత్కర్మలే

 _*💫 సత్కర్మలే (మంచి పనులే)..*_ 

       _*ఎందుకు చేయాలి..!?  🫵*_

*꧁♪•••┉┅━❀❀━┅•••♪꧂*

*_కర్మ అంటే ఏమిటి ❓_* 

*_సత్కర్మ అంటే ఏమిటి ❓♪._* 


*_🪷 మొదట వీటి గురించి తెలియాలి♪. కర్మ అంటే మనం చేసే అన్ని పనులను కర్మలు అంటారు♪. అవి ఏవైనా కావచ్చు. కాని, చేసే పనులలో ప్రావీణ్యత వుండాలి. అప్పుడు అవి నీకు సత్ఫలితాన్ని ఇస్తాయి♪._* 


*_కర్మలలో ప్రావీణ్యత అంటే..❓_*  

*_🪷 మనం జ్ఞానాన్ని కలిగి వుండి కర్మలను ఆచరించడాన్ని కర్మలలో ప్రావీణ్యత అంటారు♪. జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకం. నేను ఎవరు? దేవుడు ఎవరు? ఈ ప్రకృతి ఏంటి? దీని కర్త ఎవరు? ఇలా విచక్షణ జ్ఞానాన్ని కలిగి వుండడమే జ్ఞానం•._* 


*_🪷 ఇక్కడ మనకు కావలసింది - సత్కర్మలే (మంచి పనులే) ఎందుకు చేయాలి♪?_* 


*_🪷 అవును, మంచి పనులే చేయాలి, ఎందుకంటే, ఇక్కడ ప్రకృతికి కొన్ని సహజ గుణాలు వున్నాయి♪. అవి భగవంతుడు సృష్టితో పాటు ఇచ్చాడు♪._* 


*_🪷 నువ్వు మంచి పని చేస్తే, నీకు మంచి ఫలితాన్ని, అదేవిధంగా చెడు చేస్తే ఫలితం కూడ అదేలా వుంటుంది. ఇక్కడ కర్మ ఫలితాలను అనుభవించడమే కాకుండా నీవు ఈ శరీరాన్ని వదిలిన తరువాత కూడ వాటిని అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే,  'నేను' అనే భావంతో.. అజ్ఞానంతో.. అహంకారంతో అన్ని పనులు చేస్తూ వుంటావు కావున._*  


*_🪷 అయితే, మంచి పనులు చేసి మంచి చేస్తున్నాను అని అనుకొని ఉంటే స్వర్గానికి వెళ్లి ఆ కర్మ ఫలితాలను దేవతలతో సమానంగా అనుభవిస్తావు♪. అవే చెడు అయితే నరకానికి వెళ్లి అనుభవిస్తావు♪. ఇక్కడ కర్మ భూమిలో అయితే స్థూల శరీరం వుంటుంది. అదే అక్కడ అయితే నీవు అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలే ఒక సూక్ష్మ శరీరంగా ఏర్పడి ఆ సూక్ష్మ శరీరం వాటిని అనుభవిస్తుంది♪. అంతే తప్ప వీటి అన్నిటితో ఆత్మకు ఎటువంటి సంబంధం ఉండదు♪. అంటే నువ్వు చేసే రెండు కూడా నీకు (అంటే ఆత్మకు) బంధనాలే అవి మంచి అయితే బంగారు జైలు అదే చెడు అయితే ఇనుప జైలు అన్నమాట♪. రెండును నిన్ను (అంటే ఆత్మను) బందీ చేసేవే♪._* 


*_🪷 మరి ఈ రెండింటి నుండి తప్పించుకోవడం ఎలా? ఎలా అంటే ఇక్కడ యోగాన్ని అవలంబించాలి, అప్పుడు మనం చేసే కర్మలను యోగం ద్వారా చేయాలి దానినే కర్మయోగం అంటారు. మనకు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కర్మయోగం గురించి చాల విపులంగా తెలియజేసాడు♪. మనం చేసే ప్రతి పనిని భగవదర్పణ బుద్దితో, ఫలాపేక్షరహితంగా, కర్మలను ఆచరిస్తూ వుంటే నిదానంగా నీ మనస్సు అంతఃకరణ శుద్ధి అవుతుంది. ఇలా శుద్ధి అయిన అంతఃకరణ భగవంతుని అన్వేషిస్తుంది♪. అప్పుడు నీలో సత్వ గుణం అధికమవుతుంది♪. అంతే కాకుండా చేసే కర్మలు నిష్కల్మషంగా కూడ వుండాలి అంటే చేసే పనులలో ఏ కల్మషం లేకుండా చేస్తే నువ్వు అప్పుడు కర్మలలో ప్రావీణ్యత సాధించినట్లు♪._* 


*_🪷 మరి మంచి పనులే ఎందుకు చేయాలి ?_* 

*_అంటే మంచి పనులు చేస్తూ వుంటే నీకు తెలియకుండానే నీ అంతఃకరణ (నీ మనస్సు) పరిశుద్దమవుతుంది. అప్పడు నీకు భగవంతుని తత్వం బోధపడుతుంది. (అర్థం అవుతుంది) లేకపోతే నీకు భగవంతుని తత్వం తెలియదు అప్పుడు నువ్వు ఇట్లే ఈ జనన మరణ చట్రంలో తిరుగుతూనే వుంటావు. ఒకవేళ దుష్కర్మలు ఆచరిస్తే నీకు పతనం తప్పదు. అది ప్రకృతి సహజ గుణం._* 


🙏✅👉 *_అందువలన ఈ రోజు నుండే నీవు మంచి పనులు మాత్రమే చేయాలి అని భీష్మించుకొని నీ మనస్సును స్థిరపరచు. అయితే, నువ్వు చేసే పని ఎలా వుండాలి అంటే,  కుడి చేత్తో చేసే పని నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనే విధంగా వుండాలి. అప్పుడు మానవుడు మాధవుడు అవుతాడు♪._*


*_🙏 ఇలా అందరూ మంచి పనులు చేసి, వారి అంతఃకరణను శుద్ధి పరచుకొని, భగవంతుని తత్వాన్ని తెలుసుకొని, గ్రహించి ఆ దేవదేవుని గురించి తెలిసికొని జ్ఞానాన్ని సంపూర్ణంగా సముపార్జించి అందరూ మీమీ  స్వస్వరూపాలను తెలుసుకోవాలని నా మనవి అదే విధంగా సాధన (ధ్యానం) చేసి మహాత్ములుగా మారాలని ఆ విధంగా మీ మనస్సులను ఆ భగవంతుని మీదకు మరల్చాలని నేను ఆ దేవదేవుడైన పరమాత్ముని ప్రార్ధిస్తున్నాను._* 🙏

               *_-(సూరి నాగమ్మ)._*

      ❀┉┅━❀ 🕉️ 

🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️

గత స్మృతులు

 🔴సెలవలు కి తాతయ్య గారి ఊరు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు....


🔵ఎవరికి తెలియకుండా అమ్మమ్మ మన చేతిలో కుక్కిన పది రూపాయల కాగితం విలువ ఏన్ని లక్షలు చేస్తుందో లెక్క కట్టగలరా...


🟢తాతయ్య ప్రేమ తో స్వయం గా పొలం వెళ్లి కోయించి తెచ్చిన తాటి ముంజలు,ఈత పళ్ళ రుచి అమృతం కన్న తియ్యనిది.


⚫మామయ్య సైకిల్ ఎక్కి ఊరంతా కలయ తిరుగుతుంటే పుష్పకవిమానం ఎక్కినట్లు వుండేది.


🟡అమ్మమ్మ ఎదురింటి వాళ్ళ బర్రె జున్ను పాలను అడిగి మరి తెచ్చి చేసి పెట్టిన జున్ను రుచి ఇప్పటికీ నోట్లో నానుతూ వుంటుంది.


🔵కొత్త  మామిడి ఆవకాయ  పచ్చడి వేస్తున్నప్పుడు,చివరిలో మిగిలిన కారం లో అన్నం వేసి కలిపి తలో ముద్ద తినిపించిన తీరు వర్ణనాతీతం.


🟠అత్త కుట్టిచ్చిన రంగు రంగుల పూల చొక్కా వేసుకుంటే,పట్టు పీతాంబరాలు ధరించిన అనుభూతి కల్గి,ఆ చొక్కా చిరిగిపోయినప్పుడు పడ్డ భాద ఆపడం ఎవరితరం కాదు.

✍✍ *మూర్తి's కలం గత స్మృతులు*...

కాలమిస్ట్,9985617100.

ఆపాదించుకోదగిన

  

మహా 

... నేటికీ ఆపాదించుకోదగిన గ్రంథం. శకుంతల దుష్యంతుల కథ, తరవాత వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ, వీటికి ఈ తరంతో పోలిక... హిడింబ భీముల  ప్రణయం, అందుకు కుంతీ దేవి ఎలా కారణమైంది.... ద్రౌపదిని పాండవులు వివాహం చేసుకోవడానికి ప్రధాన కారణం. ఇలా ఎన్నో అంశాలకు సమాధానాలు ఉషశ్రీ ఉపన్యాసంలో లభిస్తాయి. నలభై ఏళ్లకు ముందు విజయవాడ కొత్త గుళ్ళు ప్రాంగణంలో చేసిన ఈ ప్రవచనం అనేక సందేహాలను నివృత్తి చేస్తుంది. ఆసాంతం వినండి. మీ సన్నిహితులకు, స్నేహితులకు షేర్ చెయ్యండి.

అహంకారం

 *అహంకారం పనికిరాదు అది వ్యక్తి పతనానికి దారితీస్తుంది* 


ఒక వ్యక్తి యొక్క అహంకారానికి అతని డబ్బు, పాండిత్యం లేదా బలం అతనిని గర్వించేలా చేస్తుంది, అయితే ఈ అహంకారమే వాస్తవానికి శత్రువు అని మనిషి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది అతన్ని చాలావిధంగా ఇబ్బందులకు చేస్తుంది మరియు తప్పులలో మునిగిపోయేలా చేస్తుంది. 


తనను ఎవరూ ఎదిరించలేరని తప్పుగా భావించి అలా చేస్తాడు. కానీ అతని చెడు కర్మ కారణంగా అతను ఖచ్చితంగా బాధపడతాడు. అహంకారాన్ని విడిచిపెట్టడం ద్వారా ఇవన్నీ నివారించవచ్చు. 


 *భగవత్పాద శంకరులు* 

డబ్బు, యవ్వనం, పాండిత్యం కారణంగా మనిషి అహంకారంతో ఉండకూడదు. కాలం అన్నింటినీ దూరం చేస్తుంది. అవి నిలకడగా లేవని ఆయన చెప్పారు.


భగవత్పాదుల వంటి మహర్షులు ఎంతటి జ్ఞానసంపన్నులైనా వారికి అహంకారం ఉండేది కాదు. అందుకే వారిని మహాపురుషులుగా అభివర్ణించారు. 


అందుచేత మనిషి ఏ కారణం చేతనైనా అహంకారానికి లోనుకాకుండా సరళంగా జీవించాలి. 


తనకు శత్రువైన, కంఠంలో ముల్లులా ఉన్న ఈ అహంకారాన్ని నాశనం చేయడానికి జ్ఞానాన్ని కోరుకునేవాడు, ఆత్మనిగ్రహం యొక్క ఆనందాన్ని పొందుతాడని ఖచ్చితంగా తెలుసు.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతితీర్ధ మహాస్వామి వారు*