13, ఏప్రిల్ 2026, సోమవారం

ఈ ప్రశ్నకు బదులేది 19

 ఈ ప్రశ్నకు బదులేది 19



ఈరోజు మన ప్రశ్న ఆధ్యాత్మికత కు సంబంధించింది.

 

  ఉపనిషత్ అనగా ఏమిటి ? 

మొట్టమొదటిసారిగా వెలువడిన ఉపనిషత్తు పేరు ఏమిటి? 

అందులోని మొదటి మంత్రము ఏమి  చెబుతున్నది

 మీకు నచ్చిన ఉపనిషత్తు ఏది? 


వివరంగా వివరించగలరు

ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ

భగవంతుడు - పూజ - ధ్యానము*

  *భగవంతుడు - పూజ - ధ్యానము*


సభ్యులకు నమస్కారములు.


1) *సామాన్య భక్తి*

భక్తి అనగానే ఆ పరమాత్మను పువ్వులతో పూజచేసి, నారికేళాలు, కదళి ఫలాలు అర్పించి తీర్థ ప్రసాదాలు పంచుకుని ఆరగించడం. *కాని, సర్వమూ భగవద్రూపమే* అన్న విశ్వాసాన్ని పెంచుకోవాలంటే ఎన్నో మార్గాలు

2) *బద్నాతి ప్రీతిమితి బంధుః* 

భగవంతుడు జీవులకు సర్వ విధ బంధువు.

3) *ప్రీతి పూర్వ మను ధ్యానం భక్తి రిత్యాభిధియతే*. 

ప్రీతి (సంతోషము, ఇష్టము) తో నిరంతరము భావన చేస్తే, ఆ భావన సంపూర్ణ భక్తి అనబడుతుంది. తద్వారా మనకు భగవత్ అనుభవం కలుగుతుంది. భగవత్ పూజలు, ధ్యానము మ్రొక్కుబడిగానో, భయం చేతనో, కోరికలతో లేక ప్రేరణలతో చేయకుండా, ఇష్టముగా, మనః స్పూర్తిగా సంతృప్తి మరియు సంతోషాలతో చేయవలసి ఉన్నది, ఉంటుంది. ప్రార్థన లేక పూజ పూర్తి విశ్వాసము, ఇష్టము మరియు సంతోషములతో చేస్తే భగవంతుడిని కరిగిస్తుంది. భక్తులకు ధర్మాన్ని, బలాన్ని మరియు శుభాలను అందజేస్తుంది. 

4) *ఉపచారాపదేశేన్ కృతాన్ హర హర్మయా,*

*అపచారాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్య పురుషోత్తమ*

స్వామీ పురుషోత్తమా నీకు ఉపచారములు, పూజలు చేసే నెపంతో, ప్రతి రోజు నేను చేసే అపకారములను మన్నించి క్షమించగలవు. భక్తులు ప్రతి రోజు *పూజ లేక భగవత్ ధ్యానము తదుపరి, భగవంతుని పై విధంగా వేడుకొనుట ఒక మర్యాద మరియు సంస్కారము*.

5) *యోగ కర్మ సుకౌశలమ్*

 అంటే సంసారిక జీవనాన్ని అర్థం చేసుకుని, ఇందులో చిక్కుకొనని విధంగా, సర్వ విధ ప్రవృత్తుల్ని, చాలా మెళుకువతో, కౌశల పూర్ణంగా కొనసాగించడం.


పైన తెల్పిన గీతా వచనం బాగా అవగాహనలో ఉండటమే గాక ఆచరణలో ఉండడం గూడా మహానుభావుల విశేష లక్షణం. వీరికి తాము చేసే సంసారిక వ్యవహారాలన్నీ, తమకు అంటకుండా ఉండేలా చేసే విధానం పట్ల అవగాహన ఉన్నదను విషయం స్పష్టం. ఏమిటా అవగాహన.... చేసే ఏ కర్మైనా భగవత్ ప్రీతి కోసమే చేస్తున్నాం తప్ప, వ్యక్తిగత ప్రయోజనానికి కాదన్న భావన దృఢంగా ఉంటుంది. *అందువలననే తాము చేయవలసిన ధార్మిక, సమాజ హితకర పనులను ఎట్టి అవాంతరాలు ఏర్పడినా భయంతో మానడమొ లేక వైరాగ్య భావనతో పూర్తిగా విడిచి పెట్టడమొ చేయరు*. శాస్త్రం విధించిన సత్కర్మలు చెసి, ఫలాన్ని పరమాత్మకు విడిచిపెడతారు. ఈలా వివేచనతో కర్మాచరణ సాగించడమే వీరి విశిష్టత.


ధన్యవాదములు

*శ్రీ రామానుజ జయంతి* *22.04.2026, బుధవారం*



 *శ్రీ రామానుజ జయంతి* *22.04.2026, బుధవారం* 


*అద్వైతం అంటే రెండుగా లేకపోవడం. విశిష్టాద్వైతం అంటే ఒక్కటిగా ఉండేందుకు ప్రకృతిని ఉపాయంగా చేసుకోవడం.* *రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని ప్రవచించారు. శరణాగతి ద్వారా ఎవరైనా పరమాత్మను చేరుకుని, ఆయనతో ఒక్కటిగా కలిసి ఉండవచ్చని తెలిపారు. భగవంతుని దృష్టిలో అందరూ సమానులేనని, మోక్షం పొందడానికి ఎవరైనా అర్హులేనని చాటి చెప్పారు.* *ఒకనాడు రామానుజుడు లేకపోతే, ఈ నేలపై విగ్రహాలతో కూడిన ఆలయాలు లేవు. అనేకానేక ఆరాధనా పద్ధతులూ లేవు. ఈనాడు రామానుజుని స్ఫూర్తి మనలో లేకుంటే, సనాతన ధర్మనిష్ఠకు అర్థం లభించదు. ఆచరణ సాధ్యం కాదు...*


*వేయి సంవత్సరములకు పూర్వమే…* 


*మహోన్నతమైన మంత్రాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన సంఘసంస్కర్త వారు...!!!*


*సామాజిక వైషమ్యాలు ఎగచిమ్ముతున్న సమయంలో సమత్వ దృష్టితో, ప్రజలను “మనమంతా ఒక్కటే”నని మమైకం చేసినవారు.*


*వారు ప్రపంచాన్ని వసుదైవ కుటుంబంగా భావించి ఎన్నో అద్భుతమైన సంస్కరణలు చేసి ఆదర్శమయ్యారు.*


*ఒక దేశంలో ఉగ్రవాదం. ఒక దేశంలో వర్ణ వివక్ష. ఒక దేశంలో తీవ్ర దుర్భిక్షం. ఒక దేశంలో ఆటవిక న్యాయం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి సమస్యకూ, మానవాళిని కలవరపెడుతున్న ప్రతి సంక్షోభానికి.. శ్రీమత్‌ రామానుజాచార్యుల బోధనలో పరిష్కారం ఉంది.*


*శేషావతార రూపమశేషజనౌఘాఘహరణచరణాబ్జమ్‌ శ్రీభాష్యకార మమలం కలయే రామానుజం కృపాసింధుమ్‌*


*సముద్రమంత తన అపార కరుణ చేత అశేష జనుల పాపాలను హరించడానికి… శ్రీమన్నారాయణుని శయ్య అయిన ఆదిశేషుడే…. భగవద్రామానుజులుగా, శ్రీభాష్యకారులుగా రూపమెత్తాడు. ఆయన చరణారవిందాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.*

పూజ అంటే,*

  🙏*శుభోదయం*🙏


*పూజ అంటే,*

కేవలం చేతులు జోడించడం కాదు!.

ఆత్మను పరమాత్మతో అనుసంధానించే,

ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ!.


ఇందులో ప్రత్యేకమైన పాత్ర,

పోషిస్తాయి పువ్వులు!.

వాటి రంగు, పరిమళం, సున్నితత్వం,

శోభ వంటి నాలుగు ముఖ్యమైన

లక్షణాలూ అద్భుతంగా కలిసిపోయి,

దేవుడి పూజలో విశిష్టస్థానం పొందాయి!.


'పుష్పం దేవ ప్రియతరం' అని,

పురాణాలు చెబుతున్నాయి!.

దేవుడు పూలనే ఎక్కువ

ఇష్టపడతాడని దానికి అర్థం!.


పువ్వు మన హృదయ భావానికి ప్రతీక!.

ఆయుర్దాయం చాలా తక్కువైనప్పటికీ,

పువ్వు విరిసే క్షణం నుంచీ తన జీవన 

ప్రయోజనాన్ని నెరవేర్చుతుంది!.

భక్తుడి జీవితం కూడా

అలా ఉండాలని చెబుతుంది!.

భగవంతుడి పాదాలపై పూలను ఉంచినట్లు,

మన విశ్వాసాన్ని సమర్పించడమే భక్తిమార్గం!.


పూజలో పువ్వులను ఉపయోగించడానికి,

ప్రధాన కారణం సమర్పణభావం!.

ఆ సమయంలో భక్తుడు వాటి పరిమళాన్ని,

సౌందర్యాన్ని తిరిగి పొందాలని ఆశించడు!.

ఇది నిస్వార్ధమైన భక్తికి ప్రతీక!.


పువ్వు అందంగా, పరిమళభరితంగా 

ఉన్నా త్వరగా వాడిపోతుంది!.

మన శరీరమూ అలాగే అనిత్యమన్న,

గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది!.


ఎంత అందంగా, ఆరోగ్యంగా ఉన్నా,

ఈ భౌతిక శరీరం, ఏదో ఒకరోజు 

వాడిపోక తప్పదు!.

కాబట్టి శాశ్వతమైన ఆత్మపై...

దృష్టి సారించాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని 

పువ్వు అందిస్తుంది!.


తాత్కాలికమైన దేహంలోంచి...

నిత్యమైన భక్తి పుట్టాలని,

ఈ పుష్పార్చన మనకు బోధిస్తుంది!.

దేవుడు అంటే సృష్టి!. సృష్టి అంటే ప్రకృతి!!.

ప్రకృతి ఇచ్చిన దానితో పూజించడమే 

నిజమైన ఆరాధన!.

తెలుసుకుందాం

 *✅ తెలుసుకుందాం ✅*




*రాత్రివేళ పూల నుంచి సువాసనలేల? Good smell to flowers during nights?*


కొన్ని పూలకు ఆకర్షణీయమైన రంగులు ఉంటే మల్లె, నైట్‌క్వీన్‌(రాత్‌కీ రాణి) లాంటి పూలకు మధురమైన సువాసన ఉంటుంది. కొన్ని పూలకు రంగు, సువాసనా రెండూ ఉంటాయి. వీటి వెనుక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. క్రిమికీటకాలు, తేనెటీగలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు పూలలోని మకరందాన్ని పీల్చుకుని జీవిస్తాయి. ఇవి పూలపై వాలినపుడు వాటి కాళ్లకు, రెక్కలకు పూలలోని పుప్పొడి అంటుకుంటుంది.


ఈ కీటకాలు మరో పువ్వుపై వాలినపుడు పుప్పొడి రేణువులు ఆ పూవు అండాశయాన్ని చేరి ఫలదీకరణం జరుగుతుంది. అపుడే పువ్వు కాయగా మారుతుంది. అవే పండ్లుగా మారి వాటి గింజలు భూమిపై పడి మొలకెత్తి మొక్కలు పెరుగుతాయి. ఈ విధంగా మొక్కలు ఉత్పత్తి కావడానికి ఉపయోగపడే కీటకాలను ఆకర్షించేందుకే పూలకు అందమైన రంగులు, రకరకాల సువాసనలు ఏర్పడతాయి.


కీటకాల్లో కొన్ని పగలు సంచరిస్తే మరికొన్ని రాత్రివేళల్లో తిరుగుతుంటాయి. పగటి వేళ వీటిని ఆకర్షించడానికి వాటి రంగులు దోహదపడతాయి. రాత్రివేళ రంగులు కనబడవు కాబట్టి రాత్రి పూచేపూలు మరింత ఎక్కువగా సువాసనను వెదజల్లుతాయి.


సాయం వేళల్లో, రాత్రులలోని వాతావరణ పరిస్థితులకు మాత్రమే ప్రేరణ పొంది వికసించే జాజి, మల్లె, నైట్‌క్వీన్‌ లాంటి పూలకు మనోహరమైన సువాసన ఉండటానికి కారణం అదే. రాత్రిపూట రంగులతో పని ఉండదు కాబట్టి సాధారణంగా అలాంటి పూలు చీకటిలో కనిపించేందుకు వీలుగా తెల్లని రంగులో ఉంటాయి.

ఆలోచించే వాడు

  ఓ వైశ్య వ్యక్తి, ఓ రెడ్డిగారు , ఓ రావు గారు  ముగ్గురూ ఓ నౌకలో ప్రయాణిస్తున్నారు.సముద్రం మధ్యకి నౌక చేరగానే ఒక సముద్ర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్ష మయ్యాడు.మిమల్ని తినేస్తా అని పెద్దగా కేకలు 

పెడుతున్నాడు.


ముగ్గురూ భయంతో వణికి పోతున్నారు.వారు భయపడటం చూసిన రాక్షసుడికి ఒక చిలిపి ఆలోచన వ వచ్చింది.వాళ్ళతో యిలా అన్నాడు,మీ ముగ్గురూ మీకు తోచింది సముద్రం లోకి విసిరి వేయండి.

 

నేను తెచ్చి యిస్తే గెలుపునాదే.వస్తువు తేలేకపోతే గెలుపు మీది వాళ్ళని వదిలేస్తాను.వాళ్లకు నేను జీవితాంతము బానిసగా వుంటాను అన్నాడు.సరే నని 

ముందు రెడ్డిగారు  తన చేతి వజ్రపు ఉంగరం విసిరేశాడు.సముద్రం లో మునిగి కాసేపటికి రాక్షసుడు 

ఆ ఉంగరాన్ని తెచ్చి ఆ వ్యక్తిని మింగేశాడు. రావు గారు తన చేతికున్న ఖరీదైన వాచీ ని నీళ్ళలోకి విసిరేశాడు.


రాక్షసుడు సముద్రం లోకి దూకి దాన్నీ తెచ్చేసి అతన్ని మింగేశాడు.యింక వైశ్య వ్యక్తి వంతు వచ్చింది.


 

అతను కొంచెం యోచన చేసి తన దగ్గరవున్న నీళ్ళ సీసా మూత తీసి అందులోని నీళ్ళను సముద్రం లోకి ధారగా పోశాడు.నా మంచి నీళ్ళను నాకు తెచ్చి యివ్వు అన్నాడు.


ఆ దెబ్బకి రాక్షసుడికి దిమ్మ తిరిగి పోయింది.ఇది వైశ్యవాడిదెబ్బ  ఎలావుంది?అన్నాడు రాక్షసుడి తో.రాక్షసుడు తన ఓటమి ఒప్పుకొని 

అతనికి బానిసగా ఉండటానికి ఒప్పుకున్నాడు.నా స్నేహితుల నిద్దరినీ     బ్రతికించు అని ఆజ్ఞాపించాడు..వాడు వాళ్ళని కక్కేశాడు.


మంచి పని చేశావు.యింక ఎవ్వరినీ యిలా బాధించకుండా వుంటానంటే నిన్ను బానిసత్వం నుంచి విముక్తుడిని చేస్తాను అన్నాడు.రాక్షసుడు అలా చెయ్యనని ప్రమాణం చేసి సముద్రం లోకి దూకి మాయమయ్యాడు.

🙏 *ఎంతటి ఆపద వచ్చిన ఆలోచించే వాడు ఆర్యవైశ్యడు* 🙏

ప్రవృత్తి మార్గం=అభ్యుదయ నివృత్తి మార్గం=నిశ్రేయస

 ప్రవృత్తి మార్గం=అభ్యుదయ 

 నివృత్తి మార్గం=నిశ్రేయస 


🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

మనిషి జీవితం రెండు ప్రధాన వైఖరుల మధ్య సాగిపోతుంది – ప్రవృత్తి మరియు నివృత్తి. ఇవే మన దైనందిన జీవన ప్రయాణానికి మౌలిక ఆధారాలు.


ప్రవృత్తి మార్గం అంటే లోకంలో కకపదానికి మూలార్థం ప్రవర్తన. అంటే ఎవడైతే ఈ ప్రపంచంలో జీవిస్తూ, పనులు చేస్తూ, బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రవర్తించేవాడో, వాడికి తగిన మార్గమే ప్రవృత్తి మార్గం. ఈ మార్గంలో జీవుడు బాహ్య ప్రపంచపు వాసనలకు లోనై, భోగాల పట్ల ఆశతో, కోరికలతో, భావోద్వేగాలతో జీవిస్తాడు. “ఇది నా దానీ, నాకు అవసరం, నా స్వంతం” అనే భావాలతో అనుభూతులకు లోనవుతాడు. లౌకిక ఆలోచనలు, సంపాదనలు, పేరుప్రతిష్ఠలు, కుటుంబబాధ్యతలు—ఇవన్నీ ప్రవృత్తి మార్గానికి కలిసొచ్చే అంశాలు. దీనినే ప్రేయో మార్గంగా కూడా పిలుస్తారు.


 


ఇదుకు విరుద్ధంగా, నివృత్తి మార్గం లోకానికి వ్యతిరేకత కాదు గాని లోకంలో ఉండీ లోకానికి అసక్తిగా, అంతర్ముఖంగా జీవించే మార్గం. ఈ దారిలో జీవుడు తన మనస్సును అంతర్గతంగా మళ్లించి, ఇంద్రియాలను నియంత్రించి, ధ్యానం, పరిశీలన, పరమార్ధం వైపు ప్రయాణిస్తాడు. నిజమైన ఆనందం బాహ్య లోకంలో కాకుండా, అంతర్లీనంగా ఉన్న పరబ్రహ్మ స్వరూపానికే చెందిందని తెలుసుకుని, లోపల అన్వేషణ ప్రారంభిస్తాడు.


ఈ మార్గంలో అడుగుపెట్టాలంటే మొదటగా మన ఇంద్రియాల స్వేచ్ఛను అణచాలి. ప్రపంచ విషయాలపై ఆకర్షణను తగ్గించాలి. ఏది నిజంగా నిలిచేది? ఏది క్షణికంగా మాయమవేది? అన్న ప్రశ్నలను మనసులో కలిగించాలి. ?మన? కలిసిపోయే దుఃఖాలు, అపార్థాలు మనసు లోతుల్లో వేరుకాలిపోతూ బాధలు కలిగిస్తాయి. వాటిని గుర్తించడానికి జాగ్రత్త అవసరం. వాటి ప్రభావం నుంచి బయటపడాలంటే సంకల్పబలం, ధైర్యం, పట్టుదల అవసరం.


 


నివృత్తి మార్గంలో జీవుడు “నేను ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు, నేను పరబ్రహ్మ స్వరూపుడను” అనే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. ఈ బోధకు మూలం సద్గురువు మార్గదర్శనం. అలాగే ఇంద్రియ నియమనం, విషయాలపై నిరాసక్తత, ధ్యానంలో స్థిరత వంటి లక్షణాల ద్వారా ఆత్మశుద్ధి ఏర్పడుతుంది. ఈ మార్గంలో నడిచేవాడికి దైవ అనుగ్రహం లభిస్తుంది. అతడు భయాలూ, అపార్థాలూ లేకుండా జీవించి, ఫలితాలపై ఆశ లేకుండా, కేవలం భగవత్ ప్రీతి కోసం కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. శాంతి, సమత, పరితృప్తి – ఇవే అతని అసలైన సంపదలు.


చివరగా, ప్రవృత్తి – నివృత్తి అనే రెండు మార్గాలు పూర్తిగా విరుద్ధాలు కాదు. అవి ఒకరినొకటి తిరస్కరించవు. జీవితంలో ఇవి పరస్పర అనుసంధానంతో సమతుల్యతను ఏర్పరచుతాయి. స్వార్థాన్ని త్యజించి, ఆత్మబలాన్ని పెంపొందించుకుంటూ, గురువు కృపతో జీవించినవాడే జీవన పరమార్థాన్ని తెలుసుకునే ఆదర్శ జీవి. నివృత్తి మార్గమే అసలైన లోపలి శాంతికి, పరబ్రహ్మానందానికి దారి చూపే మార్గం.


తిరస్కరించవు. జీవితంలో ఇవి పరస్పర అనుసంధానంతో సమతుల్యతను ఏర్పరచుతాయి. స్వార్థాన్ని త్యజించి, ఆత్మబలాన్ని పెంపొందించుకుంటూ, గురువు కృపతో జీవించినవాడే జీవన పరమార్థాన్ని తెలుసుకునే ఆదర్శ జీవి. నివృత్తి మార్గమే అసలైన లోపలి శాంతికి, పరబ్రహ్మానందానికి దారి చూపే మార్గం.

దండం దశగుణం భవేత్

 〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️

*దండం దశగుణం భవేత్' అనే వాక్యార్ధము గురించి వివరణ:*


ఈ వాక్యానికి మూడు అర్ధాలు స్ఫురిస్తాయి. మొదటి అర్ధం : దండం (కర్ర) లాగా నేలమీద పడి, సాష్టాంగ నమస్కారం చేస్తే, ఎదుటివారిలో పది మంచి గుణాలు కలిగి, కార్యం సానుకూలం అయ్యే అవకాశం ఉంది. అలా ప్రణిపాతం చెయ్యక, తలవంచి దండం (నమస్కారం) పెట్టినా, ఎదుటివారు, దణ్ణం పెట్టిన వారిని ఆదరించి పనులు చక్కపెట్టవచ్చు ! 


ఇక రెండవ అర్ధంలో దండం (కర్ర) పట్టుకుని నాలుగు వడ్డిస్తే, అలా శిక్షపడిన వాడిలో వినయం, భయం, భక్తి వంటి పది గుణాలు ఆవిర్భవించి పనులు చకచకా పూర్తయ్యే అవకాశం ఉండవచ్చు. చాలామంది ఈ అర్ధంతోనే ఈ వాక్యాన్ని ఉపయోగిస్తూంటారు. 


ఇక మూడవ అర్ధంవచ్చే శ్లోకం ఒకటుంది.


*“విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషుచ అంధ్యే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్.”* ఈ శ్లోకం ప్రతిపదార్ధం చూద్దాం.


వి=పక్షి, శ్వ=కుక్క, అమిత్ర= శత్రువు, అహి=పాము, పశుషు=పశువులను కట్టడి చెయ్యడంలోను, కర్దమేషు=బురదలోను, జలేషుచ=నీటిలోను, అంధ్యే=గ్రుడ్డితనం లోను, తమసి=చీకటిలోను, వార్ధక్యే=ముసలితనంలోను, దండం=కర్ర, దశగుణం భవేత్= ఈ పదివిధాల పనికివస్తుంది. అందువల్ల, కర్ర ఒకటి చేతిలో పట్టుకుంటే, ఆహారం ఎండబెట్టుకుంటే దానిమీద వాలే కాకులవంటి పక్షుల్ని కొట్టవచ్చు. వీధికుక్కల్ని తరిమికొట్టవచ్చు. శత్రువులను భయపెట్టవచ్చు. పాములను, పశువులను కొట్టవచ్చు. బురదలోను, వరద నీటిలోను నడిచి వెళ్ళడానికి ఉపయోగించుకోవచ్చు. అంతేనా, గ్రుడ్డితనంలోను, చీకటిలోను, ముసలితనంలో కూడా కర్రతో నడిచి వెళ్ళవచ్చు. మహాకవి కాళిదాసు అంతఃపుర ఉద్యోగులు చేతితో పట్టుకొనే దండంతో ధర్మాన్ని పోల్చాడు. దానితో అన్ని వయసుల్లో అన్ని కాలాల్లో పని ఉన్నా లేకపోయినా దాన్ని చేతిలో ధరిస్తే, అది అవసరమైన సమయాల్లోను, ముసలితనంలోను మనల్ని కాపాడుతుంది. అలాగే ధర్మంకూడా ! ధర్మాన్ని ఆచరించేవాడిని, ఆ ధర్మమే రక్షిస్తుంది.

〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️

సోమవారం🕉️* *🌹13ఏప్రిల్2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   *🕉️సోమవారం🕉️*

*🌹13ఏప్రిల్2026🌹*  

    *దృగ్గణిత పంచాంగం*  

             

          *ఈనాటి పర్వం*

              *సర్వేషాం* 

        *వరూధిన్యేకాదశి*


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - కృష్ణ పక్షం* 


*తిథి : ఏకాదశి* రా 01.08 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం  : ధనిష్ఠ* సా 04.03 వరకు ఉపరి *శతభిషం*

*యోగం : శుభ* సా 05.17 వరకు ఉపరి *శుక్ల*

*కరణం  : బవ* మ 01.18 *బాలువ* రా 01.08 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00-07.00 & 11.00-12.00 సా 04.00-06.00*               

అమృత కాలం  : *శేషం ఉ 06.57 వరకు*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.33*

*వర్జ్యం    : రా 11.16 - 12.52*

*దుర్ముహూర్తం  : మ 12.33 - 01.23 & 03.03 - 03.53*

*రాహు కాలం   : ఉ 07.27 - 09.01*

గుళికకాళం      : *మ 01.42 - 03.15*

యమగండం    : *ఉ 10.34 - 12.08*

సూర్యరాశి : *మీనం*                     

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం :*ఉ 06.02*

సూర్యాస్తమయం :*సా 06.32*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 05.54 - 08.23*

సంగవ కాలం     :*08.23 - 10.53*

మధ్యాహ్న కాలం   :*10.53 - 01.23*

అపరాహ్న కాలం   :*మ 01.23- 03.53*

*ఆబ్ధికం తిధి  :చైత్ర బహుళ ఏకాదశి*

సాయంకాలం     :*సా 03.53- 06.22*

ప్రదోష కాలం       :*సా 06.22- 08.40*

రాత్రి కాలం        :*రా 08.40 - 11.45*

నిశీధి కాలం       :*రా 11.45 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.07*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        🌷*ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


         *కరచరణకృతం*  

 *వాక్కాయజం కర్మజం వా*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*ఆదివారం 12 ఏప్రిల్ 2026*


      *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *55వ భాగం*``


*దత్తాత్రేయ అవతారం*```


బాల దత్తాత్రేయుడు మునులకు

గురువుగా ఉండటానికి తిరస్కరిస్తూ మునులకు దూరంగా వెళ్లిపోసాగాడు. మునులు వదలకుండా వెంటపడ్డారు. దత్తుడు వారికి దొరకకుండా చాలా దూరం వెళ్లి ఒక సరస్సు పైకి నడచుకుంటూ వెళ్లి మధ్యలో నీటిపై నిలుచున్నాడు.


వెంటపడ్డ మునులు సరస్సు తీరానికి చేరి సరస్సు మధ్యలో నీటిపై నిలిచిన బాల దత్తాత్రేయుని లీల చూసి ఆశ్చర్యంతో కీర్తించసాగారు. ఈత వచ్చిన కొందరు ఋషులు వదలకుండా నీటిలో దిగి ఈదుతూ దత్తాత్రేయుని చేరుకోవడానికి సరస్సు మధ్యకి వెళ్లారు. వారు సమీపానికి రాగానే దత్తుడు మెరుపు మెరసినట్లు అదృశ్యమయ్యి నీటిలోకి వెళ్లిపోయాడు.


అక్కడకి చేరిన మునులు నీటిలో ఎంత వెదికినా దత్తుడి దర్శనం లభించలేదు. తీరానికి తిరిగి వచ్చి ఎలాగైనా దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవాలి అని అక్కడే ధ్యానంలో కూర్చున్నారు. కొంతమంది మునులు దత్తాత్రేయుడిని అన్వేషిస్తు భూమండలమంతా పర్యటించటానికి వెళ్లారు. కానీ దత్తాత్రేయుడి జాడ తెలుసు కోలేకపోయారు.


సరోవరం ఒడ్డున ధ్యానం చేస్తున్న మునులకు తపస్సులో నూరు సంవత్సరాలు గడచిపోయాయి. సరోవరం లోపల అడుగున సమాధి స్థితిలో ఉన్న దత్తాత్రేయుడు సమాధి స్థితి నుండి బయటకు వచ్చి నీటిపైకి వచ్చారు. తన శరీరంలో మూలాధార చక్రంనుండి సహస్రార చక్రం వరకు సప్త చక్రాలలో యోగశక్తి రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మిని సంకల్పించి వెలుపలికి రమ్మన్నాడు.


శ్రీమహాలక్ష్మి ఋషికన్య రూపంలో దత్తాత్రేయుడి శరీరం నుండి బయటకు వచ్చి ఆయనకు నమస్కరించింది. దత్తాత్రేయుడు ఆమెను ‘అనఘా’ అని సంభో దిస్తూ "నీవు నా శక్తివి. నా లోపల యోగశక్తిగా నీవు ఉన్నప్పుడు నేను "దత్తాత్రేయ యతి" గా ఉంటాను. నేను ఇలా గృహస్థ రూపం ధరించినప్పుడు నీవు నా అర్ధాంగి "అనఘాదేవి" ఔతావు. నేను "అనఘుడను" అవుతాను.


నన్ను పూజించే పుణ్యాత్ములకు ‘ఋషిపత్ని’ గా నాతో కలసి దర్శనమిస్తావు" అని ఆమెను తన అంకపీఠం మీద కూర్చో బెట్టుకుని నీటిపై తేలుతూ దత్తాత్రేయుడు తీరానికి చేరుకున్నారు. 


దత్తాత్రేయుడు పరబ్రహ్మమని, అవతార పురుషుడు అని విశ్వసించి చిత్తశుద్ధితో తపస్సు చేసిన వారికి దత్తాత్రేయుడు ‘సచ్చిదానంద సద్గురు బ్రహ్మము’ గా, అనఘాదేవి దత్త యతీశ్వరుల అర్ధాంగిగా దర్శనమిచ్చారు.


చిత్తశుద్ధి లేని మునులకు దత్తుడు అనఘాదేవి సామాన్య దంపతులుగా కనిపించారు. వారు దత్తుడి దర్శనం కోసం అనవసరంగా సమయం వ్యర్థం చేసుకున్నామని అనుకుంటూ వెళ్లిపోయారు. పర బ్రహ్మముగా, అవతార పురుషుడిగా భావించి దర్శించిన మునులు దత్తదంపతులకు పాదాభివందనం చేశారు.


శ్రీ గురుదత్తులు దివ్యాశీస్సులు ఇస్తూ "మునులారా! గురువే బ్రహ్మము, గురువే విష్ణువు, గురువే శివుడు. కనుక త్రిమూర్తుల స్వరూపమైన గురువు నిరంజన నిరాకార పరబ్రహ్మ స్వరూపుడు అవుతాడు. ఈవిధంగా గురువుని భావించి ఆత్మార్పణ చేసుకున్న వారే ఉత్తమ శిష్యులు అవుతారు.


సద్గురువుకి శిష్యుడు, శిష్యుడికి సద్గురువు తప్ప మిగిలిన ప్రపంచం అంతా నిమిత్తమాత్రంగా కనిపిస్తుంది. ఇటువంటి భావనతో నన్ను విశ్వసించి పూజించే భక్తులను నేను దత్తత చేసు కుంటాను. నా భక్తులు ప్రపంచం లో ఎక్కడ ఉన్నా నిర్మల భక్తితో నన్ను స్మరించిన వెంటనే దర్శనమిస్తాను. కష్టాలు తొలగిస్తాను. వారి అంత్యదశలో మోక్షము ప్రసాదిస్తాను.


నన్ను విశ్వసించని విశ్వాసరహితులకు నా దర్శనం లభించదు. బ్రహ్మకల్ప మహాప్రళయం సంభవించే వరకు నేను విశ్వమంతా ఉంటూ నా భక్త జనులను కాపాడుతాను" అని అనుగ్రహ భాషణం చేశారు. మునులందరు "జయహో దత్తగురు దేవా! శ్రీ గురుదత్తా!" అంటూ తన్మయత్వంతో నమస్కరించారు. 


దత్తాత్రేయుడు వారిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.


అప్పటి నుంచి శ్రీ గురుదత్తులు సహ్యాద్రి పర్వతం నివాసం చేసుకుని ఉన్నారు. ప్రతిరోజు ప్రదోషం కాలములో కాశీనగరంలో గంగా స్నానం చేసి గాణుగాపురంలో ధ్యానం చేస్తారు. తిరిగి కుఱుక్షేత్రంలో ఆచమనం చేసి వచ్చి మధ్యాహ్నం గాణుగాపురంలో అనుష్ఠానం చేస్తారు.


ధూతపాపేశ్వరంలో భస్మధారణం, కరహాటలో సంధ్యావందనము, కొల్హాపురంలో భిక్ష, పండరీపురంలో తిలకధారణ, పాంచాలేశ్వరంలో భోజనం, బదరికాశ్రమంలో శ్రవణం, గార్నర్ లో విశ్రాంతి, పశ్చిమ సముద్ర తీరంలో సాయంసంధ్య ఆచరిస్తూ దత్తాత్రేయుల వారు నిత్యసంచారియై నిరంతరం తన భక్తులను అనుగ్ర హిస్తుంటారు...


              *(సశేషం)*

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏