🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*శనివారం 21 మార్చి 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
`` *32వ భాగo*``
*మత్స్యావతారకథ(3) సోమకాసుర సంహారం - వేదాల రక్షణ*```
విష్ణువు సప్త ఋషుల నావను వేగంగా ప్రళయ జలథి జలరాశిని చీల్చుకుంటూ మందుకు వెళ్లసాగాడు. మత్స్య వేగానికి జలరాశులు ఉధృతంగా కదులుతూ నీటిలో అలజడి సృష్టించ సాగింది. ఆ అలజడికి నీరు అంతర్భాగంలో దాగి ఉన్న సోమకాసురుడి నవరంధ్రాలలో జొరబడి ఉక్కిరిబిక్కిరి చేశాయి.
సోమకాసురుడు ఊపిరి అందక, బాధ భరించలేక నీటిని చీల్చుకుంటూ పైకి వచ్చాడు. వేల యోజనాల పొడవు గల చేపను చూసి ఆశ్చర్యపోయాడు. తరువాత ఆ మత్స్యావతారంలో వచ్చింది శ్రీమహావిష్ణువు అని, తన నుంచి వేదాలను తీసుకు వెళ్లడానికి వచ్చాడు అని గ్రహించాడు.
“ఓ నారాయణా నన్ను సంహరించ డానికి వచ్చినట్టున్నావు. నాకు దేవ దానవ మానవ జాతుల వలన గాని, మృగ పశు పక్షి వృక్ష పర్వత సర్ప క్రిమికీటాదులవలన గాని మరణం లేకుండా నా తండ్రి విశ్వావసువు వరం ఇచ్చాడు. అంతేకాదు బ్రహ్మ వంశస్థుడి వరం పొందిన నన్ను సంహరిస్తే బ్రహ్మహత్యా మహాపాతకం నీకు చుట్టుకుంటుంది. వెనక్కి వెళ్లి పో” అని హెచ్చరించాడు.
శ్రీహరి ఆ మాటలకు ఆగ్రహించి “సోమకాసురా! నీ తండ్రి నీకు వరమిచ్చే సమయంలో నీటిలో సంచరించే జలచరాలను మరచి పోయాడు. అంతేకాదు పృధ్వి, వాయువు జలం అగ్ని ఆకాశం వలన నీకు మరణం లేకపోవచ్చు ను. కానీ వాటి సృష్టికర్త అయిన నా చేతిలో మరణం రాదని నీకు ఇచ్చిన వరములో లేదు.
కనుక మత్స్యావతారి యైన నేను నిన్ను సంహరించడం బ్రహ్మ ధిక్కారం, బ్రాహ్మణ వర ధిక్కారం కాదు. కనుక నాకు బ్రహ్మహత్య పాతకం రాదు!” అని నావను వదిలి సోమకాసురుని పై దూకి తన కొమ్ముతో అతడిని నిట్టనిలువుగాచీల్చి సంహరించాడు. ఆకాశంలో దేవతలు జయ జయ ధ్వానాలు చేస్తుండగా వేదాలు వచ్చి మత్స్యావతార విష్ణువు హస్తాన్ని అలంకరించాయి.
బ్రహ్మకు రాత్రి ముగిసి మరో రోజు ఆరంభమైంది. ప్రళయాంధకారం తొలగిపోయింది. పగలు రాగానే నిద్రాదేవి బ్రహ్మను వదిలి వేయడంతో ఆవులిస్తూ నిద్ర లేచాడు. సూర్యుని కాంతులు నలుదిశల వ్యాపించ సాగాయి. సరస్వతీ దేవి మేల్కొని బ్రహ్మ పక్కన గల తన ఆసనము స్వీకరించింది. ప్రాతస్సంధ్య సమయంలో గాయత్రీదేవిని ప్రసన్నం చేసుకుంటూ దేవర్షులు మహాగాయత్రి మంత్రానుష్ఠానం ఆరంభించారు.
సృష్టి కార్యం ఆరంభించాలి అను కున్న బ్రహ్మదేవుడు చుట్టూ జలరాశిని చూసి విస్తుబోయాడు. భూమి లేకుండా సృష్టి ఎలా చేయాలి అని ఆందోళన పడుతున్న బ్రహ్మ వద్దకు మత్స్యావతార విష్ణువు వచ్చాడు. శ్రీమన్నారాయణుని గుర్తించి
బ్రహ్మ నమస్కరించాడు.
బ్రహ్మకు వేదాలను అప్పగిస్తూ "బ్రహ్మదేవా!త్వరలో సూర్యకాంతి కి నీరు ఇంకిపోయి భూమి బయటకు వస్తుంది. అప్పుడు నీవు సృష్టి ఆరంభించ వచ్చును. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ మునిమనవడు సోమకాసురుడు నీవు నిద్రపోయే సమ యంలో వేదాలను నీ నుంచి అప హరించి నీటిలో దాక్కున్నాడు. అతనికి దేవదానవాదిజాతులవలన,
మృగ పశు వృక్షాదుల వలన మరణం లేకుండాసోమకాసురుని తండ్రియైన విశ్వావసువు వరం ఇచ్చాడు.దేవతల కోరిక పై.
వరంలో లేనిజలచరమైనమత్స్య రూపం దాల్చి సంహరించి తస్క రించిన వేదాలను కాపాడి నీకు అప్ప చెప్పాను.అందుకనిlహెచ్చ రిస్తు న్నాను. బ్రహ్మల మన్న అహం కారంతో నీవు గాని, నీ మానస పుత్రులు గాని, వారి వంశజులు గాని "అసుర జాతి" కి అలవికాని వరాలు ఇచ్చి ధర్మా నికి,లోకానికిఇక్కట్లు,ఇబ్బందులు కలిగించ వద్దు. అలా చేస్తే మీకు, మీ వంశ జులకు వంశక్షయము, పుత్ర శోకము తప్పదు. జాగ్రత్తగా ఉండండి!" అని హెచ్చరించి అదృశ్య మయ్యాడు.
మత్స్యావతారంలో విష్ణువు చేసిన హెచ్చరిక పులస్త్య బ్రహ్మ భార్య హవిర్భువుకి నచ్చలేదు. అసుర జాతి తన భర్త పులస్త్య బ్రహ్మ నుంచి ఉద్భవించింది. తమ వంశం వారికి వరాలు ఇవ్వడంలో హెచ్చరిస్తాడా శ్రీహరి అని కోపించి "నారాయణా!బ్రహ్మ వంశానికిఆదిపురుషుడివైన నీవే బ్రహ్మవంశనాశనం,వంశక్షయం చేస్తానంటవా!
ఏ అసురజాతికివరాలుఇవ్వవద్ద న్నావో, ఆఅసురజాతివలననీవు వైకుంఠానికి దూరమైఇబ్బందులు పడతావుఒక్క అసురజాతిలో తప్ప ఇతర జాతులలో జన్మించి అసురుల వలన అనేక కష్టాలు అనుభ విస్తావు. ఇది నా శాపం" అని శపించింది.ఆమహాపతివ్రత శాపం శ్రీహరి అనేక అవతారాలు ధరించడానికి కారణంఅయ్యింది. శ్రీమహావిష్ణువు ధరించిన అనేక అవతారాలలోఇరవైఒక్కఅవతారా లు ముఖ్యమైనవి. ఇరవై ఒక్క అవతారాలలోప్రాముఖ్యత,ప్రాచుర్యంపొందినవిదశావతారాలు.
దశావతారాలలో మొదటిదైన మత్స్యావతార కథ మీకు విని పించాను" అని సూత మహర్షి ఆనాటి మహావిష్ణు పురాణ పారా యణం ముగించాడు.
```
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారా వు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి