*శ్రీమన్నారాయణీయము*
*88వ దశకము - అర్జున గర్వభంగము - రెండవ శ్లోకము*
*322. శ్రుతదేవ ఇతి శ్రుతం* *ద్విజేంద్రం బహులాశ్వం నృపతిం చ భక్తిపూర్ణమ్*
*యుగపత్ త్వమనుగ్రహీతుకామో మిథిలాం ప్రాపిథ తాపసైస్సమేతః*
*భావము :*
*ప్రభూ ! కంసుని చేతిలో చనిపోయిన తన ఆరుగురు పుత్రులను చూడాలనే కోరిక నీ తల్లియైన దేవకీదేవికి తీవ్రంగా ఉన్నది. మీ గురువైన సాందీపని పుత్రుడు చనిపోగా, అతనిని నీవు వరుణలోకము నుండి తీసుకొని వచ్చి మీ గురువుకు అప్పగించిన వృత్తాంతాన్ని ఆమె వినివున్నది. అందువలన తన పుత్రులను కూడా తీసుకొనిరమ్మని దేవకీదేవి నిన్ను కోరింది. అప్పుడు నీవు సుతలానికి వెళ్లావు. అక్కడ బలిచక్రవర్తి నిన్ను భక్తిశ్రద్ధలతో పూజించాడు. తరువాత అతడు సంతోషంగా వారిని అప్పగించగా, ఆ ఆరుగురిని ( దేవకీదేవి కుమారులను ) నీవు తీసుకొనివచ్చావు. వారందరూ పూర్వజన్మలో మరీచి మహర్షి యొక్క పుత్రులు. బ్రహ్మదేవుని శాపం వలన హిరణ్యకశిపుని యొక్క పుత్రులుగా, తరువాతి జన్మలో వసుదేవుని యొక్క పుత్రులుగా జన్మించి కంసుని వల్ల చనిపోయినారు. వారినందరినీ దేవకీదేవికి చూపించి వారిని వారి స్వస్థానానికి పంపావు.*
*దేవా ! మిథిలా నగరంలో 'శ్రుతదేవుడు' అనే ఒక బ్రాహ్మణోత్తముడున్నాడు. నిన్ను ఎల్లప్పుడూ పరిపూర్ణమైన భక్తితో అర్చించే 'బహుళాశ్వుడు' అనే రాజు కూడా ఆ నగరమందే ఉన్నాడు. నీవు ఆ ఇరువురినీ ఒకే పర్యాయం అనుగ్రహించదలచావు. అందులకై నీవు మహర్షులతో కూడి మిథిలా నగరానికి వెళ్లావు.*
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి