అతి మూత్ర వ్యాధి - Daibetis
అతిమూత్ర వ్యాధి రావడానికి గల కారణాలు -
• అధికమైన ఆలోచనలు , ఆందోళన .
• మద్యం అధికంగా సేవించడం .
• సిఫిలిస్ , గనేరియా వంటి లైంగిక వ్యాదులు.
• శరీరంలో విషరసాయనాల ఉత్పత్తి .
వ్యాధి లక్షణాలు , దశలు -
ఈ వ్యాధి ప్రారంభ దశలో అతిమూత్రం , అతి మూత్ర విసర్జన కలుగుతాయి . శరీరం అంతా నీరసంగా యే పని చేయడానికి ఉత్సాహం లేకుండా పోతుంది . క్రమంగా దేహం అంతా శుష్కించి పోతుంది . వ్యాధి తీవ్రదశకు చేరేకోలది మొఖం అంతా వాడిపోతుంది. నుదురు మీద ముడతలు పడతాయి. వ్యాధి ముదిరే కొద్ది రోజుకి 150 నుంచి 200 ఔన్సుల వరకు మూత్రం పోతూ ఉంటుంది. ఆకుపచ్చ , పసుపుపచ్చ కలిసి మిశ్రపు రంగుతో మూత్రం నుంచి చక్కర బయటకు వెళ్ళడమే ఈ వ్యాదికి నిదర్శనం . మూత్రం పోసినచోట ఎక్కువుగా ఈగలు మూగుతాయి. మూత్రం నేలలో ఇంకిపోయిన తరువాత తెల్లటి మరక కనిపిస్తుంది. ఈ లక్షణాలు బట్టి వ్యాధిని ఎవరికీ వారే గుర్తించ వచ్చు. డబ్బు వృధా చేసి మూత్ర పరిక్షలు చేసుకోవలసిన అవసరం లేదు . వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది మూత్రం ద్వారా అల్బుమిన్ అనే శ్వేత ధాతువు ఎక్కువుగా విసర్జించ బడుతుంది. క్రమంగా చర్మం ఎండిపోయి నట్టు మారి సౌందర్యం దెబ్బ తింటుంది. ముఖం కళ తప్పుతుంది. కురుపులు , పుండ్లు, రాచ పుండ్లు పుడుతుంటాయి. నోరు బాగా ఎండిపోతుంది. దీర్గవ్యాది గ్రస్తులకు పంటి చిగుళ్లు ఉబ్బిపోతాయి. పిప్పి పళ్ళు ఏర్పడుతాయి. రోగిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి బలహీనం అయ్యే కొద్ది కడుపులోని జట రాగ్ని మందగిస్తుంది. అజీర్ణం కలుగుతుంది. అధికంగా వొళ్ళంతా చెమటలు పడుతుంది. పాదాలు వాస్తాయి . గుండె బలహీనం అవుతుంది. కంటికి పొరలు కమ్ముతాయి. ఆడవారిలో శరీరం అంతా దురదలు కలిగి సంభోగ వాంచ పెరుగుతుంది. మగవారిలో సంభోగ వాంచ పూర్తిగా క్షీణిస్తుంది .
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి