16, డిసెంబర్ 2020, బుధవారం

గీత17:08**

 ఆయుః సత్త్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః ! రస్యాః స్నిగ్ధాః స్థిరాహృద్యా ఆహారాః సాత్త్విక ప్రియాః!! 


భావం: ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగువానిని అభివృద్ధి పరచు నవియు, పాలు, చక్కెర మొదలగు రసపదార్థములును, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములును, ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థములును, సాత్విక స్వభావమును పెంచు హృద్య పదార్థములును సాత్త్వికులకు ఇష్టమైనవి. **గీత17:08**

నవ్వుకుంటాం

 ☘️🍁☘️🍁☘️



మనం ఇతరుల ఇష్టాల్ని చూసి కొన్నిసార్లు నవ్వుకుంటాం. 

ఇతరుల కోర్కెల్ని చూసి అవి ఎంత అల్పమయినవి అనుకుంటాం.

 మన కోరికలు గొప్పవని, మన లక్ష్యాలు సాటి లేనివని విర్రవీగుతాం. 

ఉన్నత లక్ష్యాలని గమ్యాలని ఏర్పరచుకోవాలనుకుంటాం. 

పదేళ్ళలో ఒకడు పదికోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. 

ఆ పూట గడిస్తే చాలనుకునేవాడు అట్లాంటి ఆలోచన వైపే రాడు. 

పదికోట్ల లక్ష్యం పెట్టుకున్నవాడు వందకోట్ల లక్ష్యం పెట్టుకున్నవాణ్ణి చూసి ఈర్ష్యపడతాడు.


ఇతరుల్తో పోల్చుకోవడంలో ఎంత కోల్పోతామో ఇతరుల్ని తక్కువ చెయ్యడంలోనూ అంతే కోల్పోతాము. 

ఎవరూ ఆసంగతి గుర్తించరు. 

జీవిత గమ్యం అందం, ఆనందం, ప్రశాంతం అని చెబితే పిచ్చివాడనుకుంటారు. 

ఒక సముద్ర తీరంలో ఇద్దరు పిల్లలు ఇసుకతో ఆడుకుంటున్నారు. పరిగెడుతున్నారు. 

కిలకిలా నవ్వుతున్నారు, గంతులేశారు.

 కాసేపటికి ఇసుకలో కూచున్నారు.

 మెల్లగా ఇసుకతో ఆటలాడడం ప్రారంభించారు. 

ఇసుకతో కోటను తయారు చేశారు.

 ఎవరికి వాళ్ళు సొంత కోటను నిర్మించుకున్నారు. 

ఆ కోటలకు ద్వారాలు, బురుజులు తయారు చేశారు. 

అవి చాలా అందంగా ముచ్చటగా ఉన్నాయి.

 అంతలో ఒకడు “నాదే మంచికోట” అన్నాడు. 

రెండో కుర్రాడు “నాది బ్రహ్మాండమయిన కోట!” అన్నాడు. 

దాంతో ఇద్దరి మధ్య గొడవ మొదలయింది. 

ఒకరిమీద ఒకరికి కోపం వచ్చింది. 

జుట్లు పట్టుకుని కొట్టుకునే స్థాయికి పోట్లాట వచ్చింది. 

దాంతో మొదటి కుర్రాడు రెండో కుర్రాడి ఇసుక కోటను ఒక్క తన్ను తన్నాడు అది ఒక్కసారిగా కూలిపోయింది. 

దాంతో రెండో కుర్రాడికి ఏడుపు వచ్చింది. 

మొదటి కుర్రాడి కోట మీద కాలు పెట్టి పచ్చడి పచ్చడి చేశాడు. 

రెండు కోటలు ఇసుకలో కలిసిపోయాయి. 

తప్పు నీదంటే నీదని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

చివరికి ఎవరిది అన్యాయమో చెప్పమని రాజు గారి దగ్గరికి వచ్చారు.

 ఆ రాజుకు పిల్లలంటే ఇష్టం. అందుకని సమస్యలు  వచ్చే పిల్లలు స్వేచ్ఛగా తనవద్దకు రావచ్చని ఆయన చట్టం చేశాడు. 

ఆ పిల్లలిద్దరూ రాజు దగ్గరికి వచ్చారు. 

రాజు వాళ్ళిద్దరూ తినడానికి తినుబండారాలు తెప్పించాడు. 

పిల్లలు తింటూ ఉంటే సమస్య చెప్పమని అడిగాడు.

 కోట కూల్చేశాడని ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. 

రాజుకు నవ్వు వచ్చింది.

 ఇసుక కోటలు కూలినందుకు వీళ్ళు ఇంత గొడవపడుతున్నారా! 

అని రాజు బిగ్గరగా నవ్వాడు. 

దగ్గరే ఉన్న వివేక వంతుడయిన ఒక మంత్రి 

 “రాజుగారూ! ఈ పిల్లలిద్దరూ ఇసుక కోటల్ని కూల్చేసుకుని గొడవపడుతున్నారని మీరు నవ్వారు.

 కానీ ఇక్కడ నవ్వాల్సిన దేముంది. 

మీరు రాతి గోడల్ని అంటే రాతికోటల్ని పడగొట్టడానికి, ఆక్రమించడానికి నిద్ర లేకుండా నిరంతర యంత్రాంగంలో గడిపిన రోజులు మరచిపోయారా? 

నిజానికి వాటికీ వీటికీ తేడా ఏమైనా ఉందా? 

మీరే ఆలోచించండి” 

అన్నాడు.


            ఆ మాటల్తో రాజుకు కనువిప్పు కలిగింది. 

అధికారం కోసం అల్ప స్థాయిలోనయినా, ఉన్నత స్థాయిలోనయినా ఘర్షణలు జరుగుతాయి కదా!

 అని తెలుసుకున్నాడు.           


🌀🌀🌀🌀🌀🌀

మంగళసూత్రాన్ని

 *భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త సంపూర్ణ ఆయుష్యుతో జీవిస్తాడు, ప్రతి భార్యభర్తలు తెలుసుకోవాల్సిన విషయాలివి.*

🌻🌺🍀🌻🌺🍀🌻




*👌పెళ్ళైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళి బొట్టు భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త ఎందుకు తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి.?*


*👌 వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళి బొట్టు మాత్రమే కడతాడు.*


*👌సంసారం నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సాగాలనిఆ తర్వాత ఆడవారు మంగళ సూత్రంలో పగడాలు,ముత్యాన్నీ, చిన్న చిన్న విగ్రహాల్ని ధరిస్తారు. అలా ధరించడం ఫ్యాషన్ అని చాలా మంది అనుకుంటారు. అది పొరపాటు. అలాచేయకూడదు. అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక.*


*👌మంగళ అంటే శుభప్రదం, శోభాయమానం, సూత్రం అంటే తాడు, ఆధారమని అని అర్థం. వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో మూడుముళ్ళను వేస్తాడు. భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సాగాలని వధువు మెడలో మూడు ముళ్ళను వేయిస్తారు వేదపండితులు. ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్లు, దేవ దేవతలందరూ నూతన వధూవరులను దీవిస్తారని నమ్మకం.*


*👌అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలను పక్కనబెడుతున్నా, మంగళసూత్రం బదులుగా నల్లపూసల హారాన్ని, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్లుగా ఉన్న మంగళసూత్రాలను ఉపయోగిస్తున్నారు. దక్షిణాదిన మంగళసూత్రాన్ని తాళిగా పలుకుతున్నారు. నలుపు, బంగారువర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతి పరమేశ్వరులు కొలువై ఉంటారట.*


*👌 నలుపు రంగు వర్ణంలో శివుడు, బంగారు వర్ణంలో పార్వతిదేవి కొలువైఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా, వధువు సుమంగళిగా ఉండాలని పార్వతిపరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకొనే ఉంటారు. అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు. హృదయస్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వలన, ఆ స్త్రీ సుమంగళిగా ఉంటుంది.*


*👌మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి ఎక్కడలేని శక్తి, ఎక్కడైనా పోరాడగలను,నెగ్గగలను అనే ధైర్యసాహసాలు కలుగుతాయట. మంగళసూత్ర్రాలలో పసుపుతాడును వాడుతారు. వరుడు మూడు ముళ్ళు వేసిన తర్వాత ఒక్కో ముడికి కుంకుమను అద్దుతారు. మంగళసూత్రాలను బంగారువి చేయించుకున్నా, మధ్యలో తాడు మాత్రం పసుపుతాడునే వాడాలి. ఇతర ఏ లోహాలతో తయారుచేసినవి వాడకూడదు. పసుపు కుంకుమలలో సర్వమంగళాదేవి ఉంటుందట.*


*👌అయితే కొందరు మంగళసూత్రంపైన బొమ్మలు గీయించడం, రంగులు దిద్దిచడం వంటివి చేస్తుంటారు. కొంతమంది లక్ష్మీబొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారుచేసుకుంటారు. అసలు ఇలాంటివి చేయించవచ్చా లేదానని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తుకువచ్చేది సీతారాములు. సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీతే తన మంగళసూత్రంపై రాముల వారి బొమ్మగాని, రంగులు కానీ వేయించుకోలేదట. సీత ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేయించుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరిసంపదలు కలుగుతాయట.*


*👌కొంతమందికి వేంకటేశ్వరస్వామి అంటే ఇష్టం. మరికొందరికి దుర్గాదేవి అంటే ఇష్టం. ఇంకొంతమందికి మిగిలిన దేవుళ్ళంటే ఇష్టం. ఎవరికి ఇష్టమొచ్చిన దేవుడిని మంగళసూత్రంపై తయారుచేసి వేయించుకుంటుంటారు. అలా దేవుడి ప్రతిమలను అస్సలు మంగళ సూత్రాలపై వేసుకోకూడదట. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమను ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదట. ఒకవేళ వేసుకుంటే సిరిసంపదలు పోయి కష్టాలు ప్రారంభమవడం మొదలవుతాయట. కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవడం మంచిది.*


*👌వాస్తవానికి మంగళసూత్రాన్ని పత్తి నుంచి తీసిన దారంతో గానీ, పట్టునుంచి వచ్చిన దారంతో గాని చేయాల్సి ఉంది. దీనికి ఒక సంపూర్ణమైన శాస్త్రమే వుంది. దీనిని ఒక తాంత్రిక విధానంతో, ఒక నాడిని మీ వ్యవస్థ లోంచి, మరొకటి మీకు నిశ్చితార్థం అయినవారి దగ్గర నుంచి తీసి, ఈ సూత్రాన్ని తయారుచేసి కడతారు. ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక, ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది. ఈ దంపతులు ఎంతగా ఒక్కటైపోతారంటే, ఇంక ఆ బంధాన్ని విడదీయలేరు. ఒకరి నుంచి ఒకరిని విడదీయడమన్నది ఎంతో కష్టమైనది.*


*👌 అలాగే భార్య మెడలోని మంగళసూత్రం భర్తను అలాగే వివిధ రకాల దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది. మంగళసూత్రాల విషయంలో స్త్రీలు కచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్ధిస్తుంది.*


*👌ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజచేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఐదోతనాన్ని ఇచ్చే పార్వతి దేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకు పిన్నీసులు, ఏ ఇతర* *ఇనుముకిసంబంధించిన వస్తువులుపెట్టకూడదు.మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలంపూర్తిగా దాటి కిందకి ఉండాలి.*


*👌మంగళసూత్రాలకి ఎప్పుడు ఎరుపు (పగడం) నలుపు పూసలు ఉండాలి. పొరపాటున మంగలసూత్రం తెగిపోతే(పెరిగితే) వెంటనే 5 వరసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేత కాని భర్త చేత కాని వేయించుకోవాలి. ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు మళ్లీ మంగళసూత్రాన్ని (బంగారు తాళిని) వేసుకోవాలి. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది. వందేళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెపుతున్నాయి.*



*🌹🙏ఓం నమో వేంకటేశాయ🙏🌹*

*🙏లోకాసమస్తా సుఖినోభవంతు🙏*

🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉

*🍀🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🍀*

అష్టాక్షరీ మంత్ర

 *🚩అష్టాక్షరీ మంత్ర మహిమ.🚩*


” ఓం నమో నారాయణాయ ” అను ఎనిమిది అక్షరముల యొక్క మంత్ర స్మరణము అనంత పుణ్యప్రదం, 

అనంత పాప రాశి ని ద్వంసం చేయగల శక్తి కలిగినది.

ఇట్టి అష్టాక్షరి మంత్ర అధిష్టాన పురుషోత్తముడే 

శ్రీ మన్నారాయణుడు.


స్థితి కారకుడై అష్ట ఐశ్వర్యములను ప్రసాదించునప్పుడు లక్ష్మీనారాయణునిగా, 

విధ్యజ్ఞానము ప్రసాదించునపుడు లక్ష్మీ హయగ్రీవునిగా, ఆరోగ్య ప్రధాతగా నిలిచిన సమయాన ధన్వంతరిగా, సంకల్ప దీక్ష నొసగు లక్ష్మీ నారసింహునిగా, 

సమస్త మానసిక రుగ్మతలు తొలగించు 

లక్ష్మీ సుదర్శనునిగా, 

భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించు అనఘ దత్తత్రేయునిగా, 

సర్వ మంగళకరుడగు శ్రీ వేంకటనాయకుడైన వేంకటేశ్వరునిగా 

భక్తులకు సుఖ శాంతులను ప్రసాదించుచున్నాడు


మానవాళిని తరింపచేసే ఓ పవిత్ర మంత్రం గురించి ప్రత్యేకంగా వివరిస్తోంది నరసింహ పురాణం 

పదిహేడో అధ్యాయం. 

వ్యాసభగవానుడు తన కుమారుడైన శుక మహర్షికి 

ఆ మంత్రాన్ని గురించి వివరించాడు. 


సంసారబంధాల నుంచి విముక్తులు కావటానికి, మానవాళి జపించాల్సిన మంత్రం 

ఓంనమో నారాయణాయ అనేది. ఇది అష్టాక్షరి. 

అంటే ఎనిమిది అక్షరాలతో కూడుకొని ఉంటుంది. మంత్రాలన్నింటిలోకి ఎంతో ఉత్తమమైంది ఈ మంత్రం. నిత్యం దీన్ని జపిస్తే ముక్తి లభిస్తుంది. 

ఈ అష్టాక్షరిని జపించేటప్పుడు శ్రీమహావిష్ణువును మనసులో ధ్యానిస్తుండాలి. 

అలాగే పవిత్ర నదీప్రాంతాలలో, ఏకాంత ప్రదేశాలలో, జలాశయాల దగ్గర శ్రీమహావిష్ణు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని అష్టాక్షరిని జపించటం మేలు.


అష్టాక్షరిలో ఉండే ఒక్కొక్క అక్షరానికి 

ఒక్కో ప్రత్యేక వర్ణం ఉంది. వరుసగా..


ఓంకారం శుక్ల (తెలుపు) వర్ణం,

నకారం రక్త (ఎరుపు) వర్ణం,

మో అనే అక్షరం కృష్ణ (నలుపు),

నా అనే అక్షరం ఎర్రగానూ,

రా అనే అక్షరం కుంకుమరంగులోనూ,

య అనే అక్షరం పసుపుపచ్చని రంగులోనూ,

ణా అనే అక్షరం కాటుకరంగులోనూ ఉంటుంది.


ఓంనమోనారాయణాయ అనే ఈ మంత్రం 

ఇన్ని వర్ణాలతో విడివిడిగా ఉంటూ అన్ని వర్ణాల సమ్మిళితమైన తెల్లని రంగులో చివరకు కనిపించటం సత్వగుణ ప్రాధాన్యతను తెలుపుతుంది. 


ఈ మంత్ర ప్రభావం వల్ల స్వర్గ, మోక్ష ఫలాలతోపాటు కోరిన కోర్కెలు కూడా సిద్ధిస్తుంటాయి. 

దీనిలో సకల వేదార్థాలు నిండి ఉన్నాయని పండితులు విశ్లేషించి చెబుతుంటారు. 

ఈ మంత్రాన్ని స్నానం చేసి శుచి అయిన తర్వాత 

పవిత్ర ప్రదేశంలో కూర్చొని జపించాలి.


సర్వకాల సర్వావస్థలలోనూ తాను పవిత్రంగా ఉన్నాననుకొన్నప్పుడు భక్తుడు ఈ మంత్రాన్ని జపించవచ్చు. 

ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు, పని అయిన తర్వాత దీన్ని జపించటం మేలు. 


ప్రతి నెలలోనూ ద్వాదశినాడు శుచి అయి, ఓంనమోనారాయణాయ అనే ఈ మంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో వందసార్లు జపించాలి. 

అలా జపించిన వారికి మోక్ష స్థితులలోని సామీప్యస్థితి లభిస్తుంది. 


స్వామిని గంధపుష్పాలతో పూజించి ఈ మంత్రాన్ని జపిస్తే పాపాలు హరించుకుపోతాయి. 

అష్టాక్షరీ మంత్రజపంలో మొదటి లక్ష పూర్తి కాగానే ఆత్మశుద్ధి కలుగుతుంది. 

రెండో లక్ష పూర్తి అయ్యేసరికి మనశ్శుద్ధి, 

మూడో లక్ష పూర్తి అయినప్పుడు స్వర్గలోక అర్హత, నాలుగో లక్ష పూర్తికాగానే శ్రీహరి సామీప్యస్థితికి అర్హతలు లభిస్తాయి. 

అయిదు లక్షలసార్లు ఈ మంత్రజపం చేసిన వారికి నిర్మలజ్ఞానం కలుగుతుంది. 

ఆరో లక్షతో విష్ణులోకంలో స్థిర నివాస అర్హత, 

ఏడో లక్షతో స్వస్వరూప జ్ఞానం. 

ఎనిమిదో లక్షతో ముక్తి లభిస్తాయి. 


నిత్యజీవితంలో చేసుకొనే పనులు చేసుకుంటూనే 

అష్టాక్షరీ మంత్రాన్ని జపించవచ్చు.


నిత్యం ఈ మంత్రజపం చేసేవారికి దుస్వప్నాలు, పిశాచాలు, సర్పాలు, బ్రహ్మరాక్షసులు, దొంగలు, మోసగాళ్లు, మనోవ్యాధులు, వ్యాధులవల్ల బాధలుండవు. 


ఓంకారంతో మొదలయ్యే ఈ అష్టాక్షరీ మంత్రం ఎంతో విశేషమైందని వేదాలు కూడా వివరిస్తున్నాయి. 

జ్ఞానులు, మునులు, పితృదేవతలు, దేవతలు, సిద్ధులు, రాక్షసులు ఈ మంత్రాన్ని జపించి పరమసిద్ధిని పొందిన సందర్భాలున్నాయి. 


ప్రాణాన్ని విడిచే సమయంలో ఒక్కసారి ఈ మంత్రాన్ని అనుకున్నా వైకుంఠం లభిస్తుంది. 

వేదాన్ని మించిన శాస్త్రం, నారాయణుడిని మించిన దైవం లేదన్నట్లు ఈ మంత్రాన్ని మించిన మంత్రం మరొకటి లేదు. 


ఒక్కోసారి శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల జయంతులు. పూజలు వస్తూ ఉంటాయి. 

అలాంటి సందర్భాలలో ఆయా అవతారాలకు సంబంధించిన మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ తెలియనప్పుడు ఓంనమోనారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని నూటఎనిమిది సార్లు జపించినా 

ఆయా అవతారాల పూజాఫలితం దక్కుతుంది. 

అని ఇలా నరసింహ పురాణంలో సాక్షాత్తు వ్యాసభగవానుడే ఈ విషయాన్ని తన కుమారుడైన శుకయోగికి వివరించి చెప్పడంతో 

అష్టాక్షరీ మంత్ర ప్రభావం ఎంతటిదో తెలుస్తోంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీలలితా సహస్రనామ వివరణ🌹

 🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*55.సుమేరు మధ్య శృంగస్థా*


కామేశ్వరుని వామభాగములో వుండే దేవి వుండే ఇతర స్థానములు ఇప్పుడు చెప్పబడతవి. శ్రీమాత మేరుపర్వత మధ్యములో గల శిఖరముపై వెలసి వుంది. ఆ శిఖరమంతా. బంగారు శిఖరము. మేరుపర్వతాన త్రికోణములవలే మూడు శిఖరములు వున్నాయి. వాని మధ్యను నాలుగవ శిఖరంవుంది. అదే మాత నివాసస్థానం.


ఆ శిఖరమున గల బంగారు పొదరిళ్ళలో దేవతలు సంగీతము పాడుతుంటారు. దానికి తూర్పున నైరృతిదిక్కున, వాయువ్య దిక్కున మూడు శిఖరములు వున్నాయి. అవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల లోకములకు ఆధారమైనవి. వాటికి మధ్యన రత్న కాంతులతో దిక్కులన్నింటినీ వెలిగిస్తూవున్న శిఖరముపై శ్రీమాత నివసిస్తుంది .


మానవ శరీరమున వెన్నెముకను మేరువు అంటారు. బ్రహ్మరంధ్రము దానికి గల శిఖరమునకు పై భాగము "సహస్రారము”. ఆ సహస్రారము ఒక కమలము. ఆ కమలములో శ్రీమాత నివసిస్తుంది


కం|| ఘనమా సుమేరు మధ్యన, మనసారగ, నధివసించు మంగళగౌరీ వినగా నది సిరులొలికే

కనకమయపుశృంగ మహిమ కనగా వశమే!!


        లలితానామసుగంధం

                  M.s.s.k

తిరుప్పావై మొదటిపాశురము*

 🌹💐🌷🌾🥀🌸🌺


*తిరుప్పావై మొదటిపాశురము*


మార్ గళితిజ్ఞళ్ మదినిరైన్ద నన్నాళాల్ నీరాడ ప్పోదువీర్! పోదుమినో నేరిశైయీర్ శీర్ మల్ గుం ఆయ్ ప్పాడి శెల్వచ్చిఱుమీర్ కాళ్

కూర్ వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్ ఏరాకణ్ణి యశోదై యిళం శిఙ్గమ్ కార్మేని చెఙ్గజ్ణ్ కదిర్ మది యయ్బోల్ ముగత్తాన్ నారాయణనే నమక్కే పరై తఱువాన్ పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్



*మార్గశిర మాసాన మంచి వెన్నెల రోజు నీరాడ కోరువారు రారండి రమణులార శ్రీలు పొంగెడు వ్రేపల్లె పడుచులార! దివ్యాభరణములు దాల్చిన మేల్బంతులార వాడివేలము తోడిగాచు నందగోపసుతుడు సుందర లోచని యశోద కిశోర సింహం సూర్యచంద్రుల మించు శ్యామ సుందరుడు నారాయణుడె మనకె పరనిచ్చువాడుమంగళము కూర్చు మన శ్రీవ్రతము*


                M.s.s.k

🌹🌺🌸🥀🌾🌷💐

*ఇక తిరుప్పావై తొలి పాశురం 'మార్గళిత్తింగల్ మది నిరైన్దనన్నాళాల్' అర్ధము, అంతరార్ధము తెలుసుకుందాం*


 శ్రీ గోదా గోపిక వ్రత సంకల్పం చేస్తూ ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఏమి చేసి, ఎవరి వలన ఏ ఫలము పొందవచ్చునో మనకు వివరిస్తారు


*1. ఎప్పుడు ఈ వ్రతం చెయ్యాలి*


భగవంతునికి అత్యంత ప్రీతికరమైన మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో పెద్దలు నిర్ణయించిన విధంగా ధనుస్సంక్రమణం నాడు ఈ వ్రతారంభం చెయ్యాలి క్రమం తప్పకుండా 30 రోజులు కొనసాగించాలి *


*2. ఎవరు ఈ వ్రతం చెయ్యాలి?*


కోరిక వున్న వారందరూ, జాతి, కుల, వయో, లింగ, వర్గ భేదం లేకుండా. ఈ ప్రతంలో చేరవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆత్మయౌవ్వనులందరూ ఈ వ్రతం చెయ్యవచ్చు. పరమాత్మ చూచి ఇష్టపడే యౌవనం మన ఆత్మలకుంటే చాలు దీని అర్థం ఏమిటో మనం ముందుకు వెళ్ళే కొద్ది తెలుసుకుంటాం. ఆ ఇచ్ఛ ఉంటే చాలు, స్వేచ్ఛగా మనం మనసా, వాచా, కర్మణా ఆడపడచులం కావాలి. ఏ విషయంగా? భగవద్విషయపరంగా మాత్రమే! అసలు ఈ ప్రపంచంలో భగవద్విషయం కానిది ఏముంది

               M.s.s.k

*3. ఈ వ్రతం ఎక్కడ చెయ్యాలి?*


మన ఇళ్ళలో, వాకిళ్ళలో, గుడులలో, బడులలో,  మన గుండెలలో,


*4. ఈ వ్రతంలో మనం చెయ్యవలసినది ఏమిటి?*


ఇది స్నాన వ్రతం అందుకని మనం స్నానం చెయ్యాలి. మనం రోజూ చేసే బాహ్య స్నానం కాక అంతర స్నానం కూడా చెయ్యాలి. బయట చేసే స్నానం శరీరం శుభ్రం చేసుకోవటానికి, లోపలి స్నానం అంతఃకరణ శుద్ధికి. బాహ్య స్నానం రోజూ బ్రాహ్మముహూర్తం ముందు అంటే వేకువన నాలుగు గంటలకు. ఆ తరువాత తిరుప్పావైని నిత్యవ్రతంగా చేసుకుంటే అంతఃకరణ శుద్ధి అయిభగవదనుభవం అవుతుంది. భగవదనుభవమనే ఉత్పుల్ల పంకజ తటాకములో మునిగి, తాను వేరుగా తెలియకుండా ఉండుటే స్నానం అని ఉభయ వేదాంతాలు చెప్తున్నాయి. 


జీవులనే నదులు పరబ్రహ్మమనే సముద్రములో చేరి, దాని నుండి వేరు చేసి చూపుటకు వీలు కానట్లు సాయుజ్యము నందుటయే మోక్షము. 


ఈ వ్రతంలో స్నానం అంటే అర్ధం గోపికలు అందరూ కలసి నంద గోపభవనం చేరి కృష్ణుని కలుసుకోవటమే. పరమాత్మ సేవలలో తరించడమే.


*5. ఈ వ్రతం చేస్తే ఎవరి వలన ఏ ఫలము పొందుతాము?*


శ్రీ కృష్ణ పరమాత్మ మనకు కావలసిన ఇహపర సుఖములను అనుగ్రహిస్తాడు గోపికలకు వలె, మనతో నిత్య సంబంధము కలిగి, మనం చేసే కైంకర్యములను స్వీకరిస్తాడు


ఇవన్నీ పొందేందుకే గోదా గోపిక స్నానము చేసే కోరిక గల వారందరూ రండి అని పిలుస్తోంది. హాయిగా తానొక్కతే వ్రతం చేసుకొని, ఫలం పొందక అందరు గోపికలను ఎందుకు పిలవడం? అంటే - ఒక మంచికార్యం చేసేటప్పుడు పదిమందితో కలిసి చేస్తే అధిక ఫలం అని సంప్రదాయం. అట్లాగే 'ఏక స్వాదునభుంజీత' ఒక మంచి పదార్థాన్ని తానొక్కడే తినరాదు. నలుగురికీ పంచి తాను తినాలి. అందుకే గోదా గోపిక నంద ప్రజములోని కన్నెపడుచులందరినీ పిలుస్తోంది. 

                M.s.s.k

వారు భాగ్యవంతులట! వాడే వారి వాడైనాడు. శ్రీకృష్ణ కైంకర్యమే వారి ఐశ్వర్యము. వారు దివ్యాభరణములను దాల్చి ఉన్నారట. అదేమిటి? స్నానానికి వెళ్ళేవాళ్ళు మంచి ఆభరణములు ధరించడమేమిటి? అంటే వారు చేసేది సామాన్య స్నానం గాదనీ, వారు వేసుకునేవి సాధారణ ఆభరణములు కావనీ తెలుస్తుంది భగవత్ గుణానుభవ స్నానానికి కావలసిన ఆభరణాలు - జ్ఞానము, భక్తి, వైరాగ్యం ప్రాప్యత్వర మున్నగునవి. అందుకే వారిని 'నేర్కై యీర్' విలక్షణమైన ఆభరణములను ధరించిన వారలారా అని గోదా గోపిక పిలుస్తున్నది.


అయితే, ఆ కృష్ణుని చేరడం ఎలా? అతడు నంద గోపుని రక్షణలో నుండును. నంద గోపుడు వాడియైన వేలాయుధము (బల్లెము) పూని, తన కుమారుని సదా కాపాడుచుండును. తల్లి యశోదా దేవి ఒడిలో ఆ కిశోర కృష్ణ సింహము చెంగు చెంగున దుముకుచుండును. ఆమె అందమైన కనుసన్నలలో అతడు మెలగుచుండును.


ఇచట నంద గోపుడే ఆచార్యుడు. ఆయన ధరించే ఉపదేశముద్రయే వేలాయుధము. *మంత్రోమాతా, గురుః పితా - తల్లి యశోద మంత్రము. యశము నిచ్చునది యశోద, ఆనందము నిచ్చువాడు కృష్ణుడు, ఆనందమే కృష్ణుడు. అచార కృపతో మంత్రాధీనమైన భగవంతుడు మనకు అంది వస్తాడు. మనకు ఏది హితలు చూచి అందిస్తాడు.*


మన గోపికలు శ్రీకృష్ణుని రూపమును స్వభావమును స్తుతిస్తున్నారు. కార్మిని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్!' మేఘము వలె నల్లని శరీరము, తామరలు వలె ఎఱ్ఱని కన్నులు, సూర్య, చంద్రుల పోలు ముఖము కలవాడు. 


అది ఇంకా బాగుండాలంటే ఎలా చెప్పాలి? ఒక మేఘముపై రెండు తామరపూవులు, రవి చంద్రుడు ఒకేసారి వికసించారట! ఎందుకండీ? ఇంత గొప్పగా మనం భగవంతుని. కీర్తించడం? మన తక్కువతనాన్ని తెలుసుకోవడానికేనట! ఆ హద్దు ఈ హద్దును తెలుపుతుంది! 


మేఘము తాపహరము, సుశీలము, జీవనప్రదము. శ్రీకృష్ణుడట్టివాడు అతని నేత్రములు స్తుతి పాత్రములు. అవి ఆర్తిని, వాత్స్యలమును, స్వామిత్వమును ప్రకాశింపజేయును. 

              M.s.s.k

ఇక శ్రీకృష్ణుని దివ్యముఖమండలమున సూర్యచంద్రులిరువురు ఒకేసారి కన్పట్టిరట. అంటే భక్తులకు చల్లగా, భక్త విరోధులకు వేడిగా తోచునట! ఆయన అత్యంత సులభుడు, అత్యంత దుర్లభుడు కూడానట.


అట్టి అనంత కల్యాణ గుణములుగల - 'నారాయణనే నమక్కెపరై తరువాన్' నారాయణుడే మనకే 'పర'ను (పురుషార్ధమును) ఇచ్చువాడు. 'పర' అనగా వ్రతము లను కావలసిన వాద్యము. మనకు ఇహపరాలు ఇచ్చేవాడు ఆ నారాయణుడే ఆ శ్రీకృష్ణుడే! నారాయణుడంటే అన్ని పదార్ధముల లోపల వెలుపల వ్యాపించి, వాటిని తనయందు నిలుపగలిగినవాడు.. *'అంతర్ బహిశ్చతత్ సర్వం వ్యాష్య నారాయణ స్థితః, ఆయన 'మనకే' అని నొక్కివక్కాణించడం* ఎందుకంటే - ఆ శ్రీమన్నారాయణుడే మాకు ఉపాయము ఉపేయము అని గట్టిగా నమ్మే ప్రపన్నులకు మాత్రమే తనంతతానుగా అందివచ్చి, నిత్య కైంకర్య భాగ్యమును అందించును.


*పైగా, మనం ఈ వ్రతం చేస్తే అందరూ చూసి ఆనందిస్తారు. రండి:*


కల్యాణం చేకూర్చే ఈ వ్రతము మనందరము కలిసి చేద్దాము అని మనల్ని ఆండాళ్ 

ఆహ్వానిస్తోంది.


                M.s.s.k

గోదాదేవి ప్రార్థన*

 🌹🌺🌸🥀🌾🌷💐


*గోదాదేవి ప్రార్థన*


నీళాతుంగ స్తనగిరితటీసుప్త ముద్బోధ్యకృష్ణమ్ పారార్థ్యమ్ స్వమ్ శ్రుతిశతశిరస్సిద్ధ మధ్యాపయన్తీ స్వోచ్ఛిష్టాయామ్ స్రజనిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే గోదాత స్యైనమ ఇదమిదమ్ భూయ ఏవాస్తు భూయః !


అన్నవయల్ పుదువై యాణ్ఞాళ్ అరంగర్కు

పన్ను తిరుప్పావైప్పల్ పదియమ్ - ఇన్నిశైయాల్

పాడిక్కొడుత్తాళ్ నఱ్పామాలై, పూమాలై


శూడిక్కొడుత్తాళైచ్చొల్

శూడిక్కొడుతత్తశుడర్కొడియే తొల్పావై పాడి యరుళవల్ల పల్ వళై యామ్ -- నాడినీ

వేంగడవర్కెన్నై విదియెన్ర విమ్మాత్తమ్ నాంగడవావణ్ణమే నల్గు 

        

                   M.s.s.k

రవివర్ణనమ్

 .

             ॥ రవివర్ణనమ్ ‌॥


-97- శ్లోకము :


ద్వీపే యోఽస్తాచలోఽస్మిన్భవతి 

ఖలు స ఏవాపరత్రోదయాద్రి-


ర్యా యామిన్యుజ్జ్వలేందుద్యుతి 

రిహ దివసోఽన్యత్ర తీవ్రాతపః 


సఃయద్వశ్యౌ దేశకాలావితి నియమ యతో నో తు యం దేశకాలా-


వవ్యాత్సస్వప్రభుత్వాహిత

భువన హితో హేతురహ్నామినో వః ॥



-97- మత్తేభము :


ఎది యీ దీవిని గ్రుంకుమెట్ట యది

వేర్ద్వీపంబునన్‌ బొడ్పుగ


ట్టెది జాబిల్లి వెలుంగు రేయిటనదే

యింకొక్కచోనుండు మం


డుదినంబెవ్వడు దేశకాలముల

నేఁడున్‌ లోఁచు లోఁగాకహ


మ్మొదవన్‌ హేతువు లోకభద్రకరుఁడా

యుష్ణాంశుడేలున్‌ మిమున్‌✋️🤚



టీకా : 


[ ఇందు కవి గారు 

   సూర్యభగవానుని దేశ కాలము

   లకు అతీతునిగా

   చెప్పుచున్నారు..]


ఎ(..ఏ)ది , యీ , దీవి ని = ద్వీపము పై , (గ్రుం)క్రుంకు = అస్తమించు , మెట్ట = 

కొండయో ,  (య)అది , వేర్ = వేరొక ,  

+ ద్వీపంబునన్ , ‌ (బొ)పొడ్పు = ఉదయించు , గట్టు = కొండ ;

+ ఎ(..ఏ)ది ,  

< జాబిల్లి వెలుంగు రేయి >  = చంద్రకాంతి తో వెన్నెల రాత్రి , + ఇటన్ =

ఇక్కడనో ,  + అదే , 

< (యిం)ఇకొక్క చో(..ట)న్ ,  + ఉండు , మండు దినంబు > = ఇంకొక చోట

ఎండలో మండునట్టి పగలు ;

+ ఎవ్వడు , (ఈ రీతిగా వేరు వేరుగా తోచు ఆ యా ..) దేశ కాలములన్ = దేశము , కాలములను , 

+ ఏడు న్‌ = (కాలమునకు సంకేతమైన ..) సంవత్సరము (..పొడవునా క్రమము తప్పక ) , 

లోఁచు = (తన..) అధీనమున నుంచుకొనుచు ,  ( వాటికి తాను..) లోఁగాక = అధీనుడు కాకుండా , 

+ అహమ్ము = పగలు / దినము , 

+ ఒదవన్‌ = అగుటకు , హేతువు = 

కారణము (..అయిన) , లోక(..మునకు) , భద్రకరుఁడు = శుభము గూర్చువాడు , 

+ ఆ ,  (యు)ఉష్ణ = వేడి , 

+ అంశుడు = కిరణములవాడు - సూర్యుడు , +[ఏలున్‌ ] , మిమున్ , ఏలున్ = కాచును గాక ..‌✋️🤚



భావము : 


[ ఇందు కవి గారు 

   సూర్యభగవానుని దేశ కాలము

   లకు అతీతునిగా

   చెప్పుచున్నారు..]


ఏది యీ ద్వీపమున అస్తమించు కొండయో - అది వేరొక 

ద్వీపంబున ఉదయించు కొండ ;

ఏది యిక్కడ చంద్రకాంతితో వెన్నెల రాత్రియో  -  అదే ఇంకొక చోట

ఎండలో మండునట్టి పగలు ;

ఎవ్వడు ఈ రీతిగా వేరు వేరుగా 

తోచు ఆ యా దేశము , కాలములను సంవత్సరము పొడవునా క్రమము తప్పక 

తన అధీనమున నుంచుకొనుచు - వాటికి తాను అధీనుడు కాకుండా ..

పగలు అగుటకు 

కారణమయినవాడో ..

లోకమునకు శుభము గూర్చువాడు - 

వేడి కిరణములవాడు - ఆ సూర్యుడు మిమ్ములను కాచును గాక ..‌✋️🤚

భగవద్గీత

భగవద్గీత పిడిఎఫ్ కోసం కింద లింకుని ప్రెస్ చేయండి. 


https://drive.google.com/file/d/1zEOs_CBg70Z9irw3f_Hn3WQtmu3g9zYX/view?usp=sharing

ధనుర్మాస

 మిత్రులందరికీ "ధనుర్మాస ప్రారంభోత్సవశుభాకాంక్షలు"

సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి "ధనుర్మాసం"ప్రారంభ మవుతుంది. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసంమొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగు స్తుంది.

కార్తీక మాసం,మాఘమాసం, శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు.  కానీ.. ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలా మందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాస మంతా.. ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. దీపారాధన చేయడం వల్ల "మహాలక్షి" కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయి.

'ధనుర్మాసం' వైష్ణవులకు చాలా ప్రత్యేకమైనది.

 తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. 'సుప్రభాతం' బదులు "తిరుప్పావై" గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని 'బాలభోగం' అంటారు.  ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతు లలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది.ధనుర్మాసం వచ్చిందంటే.. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది.సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించ డం చాలా మంచిది.

ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు, దరిద్రం దూరమవుతుంది. ఈ నెలలో ప్రతి రోజు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి.

ధనుర్మాసంలో విష్ణువును 'మధుసూధనుడు' అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్ధోజనం అర్పించాలి.

పెళ్లికాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్ల తో  పూజలు చేయటం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి "మార్గళి వ్రతం" పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.

ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పర లోక మోక్షం పొందుతారు. ఆత్మపరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు.

మన మిత్రులందరికీ ఆ " విష్ణుమూర్తి "కటాక్ష ప్రాప్తిరస్తు  ........