31, డిసెంబర్ 2020, గురువారం

బ్రాహ్మణ కులం

 -: బ్రాహ్మణ కులం..శాఖలు..సమస్యలు:-


బ్రాహ్మణ కులం అంతా ఒకటేనని చాలా మంది అభిప్రాయం. కానీ బ్రాహ్మణులలో అనేక శాఖలు ఉన్నాయి.ఈ శాఖలు పుట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి.

బ్రాహ్మణ కులం ముఖ్యంగా వేదాల అధ్యయనం, ప్రచారం, పరిరక్షణ కొరకు ఏర్పడింది అని భావించవచ్చును.

          

వేదాల  అధ్యయనం , పరిరక్షణ, ప్రచారం కొరకు ఉద్భవించిన బ్రాహ్మణ కులంలో అనేక శాఖలు ఏర్పడినవి. ఋగ్వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేసే వారు ఋగ్వేద బ్రాహ్మణులనీ,యజుర్వేదాన్ని పఠించే వారిని యజుర్వేద బ్రాహ్మణులు అనీ అలాగన్న మాట.ఉత్తర , దక్షిణ భారతదేశంలో అనేక శాఖలు ఏర్పడినవి. ప్రాంతీయ భేదాలతో కూడా అనేక ఉప శాఖ లు ఏర్పడినవి. పూజించే దేవుళ్ళు ,వృత్తి భేదాలు, భాషా భేదాలు, తదితరాలు ఇందుకు కారణం ఐనాయి. కాలక్రమంలో వివిధ సాంప్రదాయాలు  కూడా పుట్టాయి. ఇవీ కొన్ని భేదాలకు కారణం ఐనాయి. ఇలా బ్రాహ్మణ కులం శాఖోపశాఖలుగా విభజనకు గురైంది.

 ఈనాడు ఉత్తర, దక్షిణ భారతదేశంలో అనేక శాఖలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో మళ్ళీ రాష్ట్రానికి ఒక్కో రకంగా విభజనలు ఉన్నాయి.

ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోఈ క్రింద చూపబడిన శాఖలు ప్రముఖంగా  మనకు కనిపిస్తాయి.


* కొన్ని బ్రాహ్మణుల శాఖలు వాటి ఉప శాఖలు*


*ద్రావిడ శాఖ*


1) ప్రధమ శాఖ ద్రావిడ 

2)ద్రావిడ 

3)పేరూరు ద్రావిడ 

4)పెద్ద ద్రావిడ 

5)దిమిలి ద్రావిడ 

6)ఆరామ ద్రావిడ 

7)పుదూరు ద్రావిడ 

8)కోనసీమ ద్రావిడ

9)ద్రావిడ వైష్ణవులు  

10)తుమ్మగంటి ద్రావిడ 

11)తుమ్మ ద్రావిడ 

12)ద్రావిడ నియోగుల

*వైష్ణవ బ్రాహ్మణ శాఖలు*

1)శ్రీవైష్ణవులు 

2)నంబులు

3)గోల్కొండ వ్యాపారులు

4)ఆచార్యులు 

5)మర్థ్యులు

6)వ్యాపారులు 

7)కరణకమ్మ వ్యాపారులు 

8)బడగల కరణకమ్మ 

9)మెలిజేటి కరణకమ్మ 

10)దారుకులు

11)యజ్ఞవల్క్యులు

12)యజుశ్యాఖీయులు

13)బడగ కన్నడలు

14)నంబూద్రి బ్రాహ్మలు

15)వైఖానసులు 

16)మధ్వలు

17)కాణ్వులు 

18)కాణ్వేయులు

19)నియోగి వైష్ణవులు

*శివార్చక బ్రాహ్మణ శాఖలు*

1)మహారాష్ట్ర చిత్సవనులు 

2)లింగార్చకులు

3)ఆదిశైవులు 

4)శివార్చకులు 

5)వీరశైవులు 

6)మోనభార్గవ శైవులు 

7)కాశ్యప శైవులు 

8)శైవులు 

9)ప్రధమ శాఖ శైవులు 

10)రుద్ర శైవులు 

11)పరమ శైవులు 

12) శివ పూజారులు 

13) శైవ స్మార్తులు 


*నియోగి బ్రాహ్మణ శాఖలు*


1)ప్రధమ శాఖ నియోగి 

2)ఆరువేల నియోగి 

3)నందవరీక నియోగి 

4)లింగధారి నియోగి 

5)ఉంత్కఖ గౌడ నియోగి 

6)ఆరాధ్య నియోగి 

7)అద్వైత నియోగి 

8)నియోగి వైష్ణవులు 

9)పాకనాటి నియోగి 

10)ప్రాజ్ఞాటి నియోగి 

11)పొంగినాడు నియోగి 

12)నియోగి ఆది శైవులు 

13)యజ్ఞవల్క్య నియోగి 

14)ఆరాధ్యులు 

15)వేమనారాధ్యులు 

16)తెలగాణ్యు నియోగి

17)కరణకమ్మ నియోగి 

18)బడగల కరణకమ్మ నియోగి 

19)కరణాలు


*వైదీక బ్రాహ్మణ శాఖలు*


1)వెలనాటి వైదీక 

2)వెలనాట్లు 

3)వెలనాటి పూజారులు 

4)కాసలనాటి వైదీక 

5)కాసలనాట్లు

6)ములకినాట్లు 

7)ములకినాటి వైదీక 

8)తెలగాణ్యులు 

9)వేగనాట్లు 

10)వేగనాటి వైదీక 

11)వెలనాటి అర్చకులు 

12)ప్రధమ శాఖ వైదీక 

13)కరణకమ్మ వైదీక 

తదితరాలు..


         ఐతే ఇవన్నీ అంతర్ వివాహ సమూహాలుగా మనకు కనిపిస్తాయి. అంటే ఒక శాఖ వారు ఇంకో శాఖ వారికి తమ అమ్మాయిని ఇవ్వరన్న మాట. అనేక వివాహ వేదికలు విఫలం కావడానికి ఇదో కారణం.మా శాఖయే గొప్ప అంటే మా శాఖయే గొప్ప అనే ఛాందసవాదులూ ఉన్నారు.మధ్య యుగాలలో మా శాఖ యే గొప్పదని పరస్పరం పోరాడిన ఉదంతాలూ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఈ శాఖల వలన అనేక వాదాలు, వివాదాలు కూడా ఏర్పడటం మనం గమనించవచ్చు. వివాహాలు విఫలం అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈమధ్య కాలంలో అనేక మార్పులు వస్తున్నప్పటికీ మరింత మార్పు బ్రాహ్మణ కులంలో రావలసిన అవసరం ఉంది. అసలే నిరుద్యోగం, రిజర్వేషన్ ల  లేమి వలన సమస్యలు ఎదుర్కొంటున్న బ్రాహ్మణులు ఈ శాఖల వలన మరింతగా నష్టపోతున్నారని చెప్పవచ్చును.తమలోని శాఖా భేదాలను తొలగించుకొని మారుతున్న సమాజంలో తమవంతు పాత్ర పోషించి అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది.

           (సశేషం)

ప్రాజ్ఞ్ముఖంగా

 #ముక్కోటిఏకాదశి అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తరం దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము axil అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విశ్వము దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపుకు anti clockwise తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపునుంచి దక్షిణానికి clockwise తిరుగుతుంది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్తనం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు.


ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు. ఇలా చెప్పి ఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము. కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా? అని సంసిద్దుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? - ఈ లోకంతో భవ బంధనాలనుంచి విముక్తి. మోక్షము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది.

యజ్ఞోపవీత మహిమ యజ్ఞోపవీత మహిమ

 యజ్ఞోపవీత మహిమ 


వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. 


దీనినే తెలుగులో ‘జ్యంద్యం’ అంటాం. 


ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు. 


ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతోనూ, కొందరు ఆచారం మీద మక్కువతోనూ, కొందరు ఇతరుల ముందు ప్రదర్శన కోసం, మరికొందరు అవసరార్థం ఉపయోగించేవారుగా కనపడతారు. 


యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. 


దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.


’సూచనాత్ బ్రహ్మతత్త్వస్య 


   వేదతత్త్వస్య సూచనాత్


తత్సూత్రముపవీతత్వాత్ 


బ్రహ్మసూత్రమితి స్మృతమ్’!!


బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.  


యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. 

అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని


 ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’


 అనే మంత్రం చెబుతోంది.  


యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి. 


ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం - 


‘ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ 

వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ 

ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ

తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా 

పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః

సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ 

సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః’!!


మొదటి తంతువులో ఓంకారం,

 రెండవ తంతువులో అగ్నిదేవుడు, 

మూడవ తంతులో నాగదేవత, 

నాలుగవ తంతువులో సోమదేవుత, 

ఐదవ తంతువులో పితృదేవతలు, 

ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, 

ఏడవ తంతువులో వాయుదేవుడు, 

ఎనిమిదవ తంతువులో సూర్యుడు, 

తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం. 


‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది. 


’తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్

కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’


ఈ శ్లోకంలో తాత్పర్యం ఇది. 


తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. 

అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం.


 ‘యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది. 


’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ

తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్’


నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. 


అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. 


గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం. 


యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది. 


’పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్

తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్

ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్

యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’!!


అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. 

దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.


బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.


యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. 


యజ్ఞోపవీతం ధారణ మంత్రం:-

💐💐💐💐💐💐💐💐💐💐💐


“ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్

ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజః


ఈ విధంగా జపిస్తూ క్రొత్త జంద్యం వేసుకోవాలి.


యజ్ఞోపవీతం విసర్జన మంత్రం:-

💐💐💐💐💐💐💐💐💐💐

 ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితం విసృజామి యశోబ్రహ్మవర్భో దీర్ఘాయురస్తుమే 

------------------------^--------

ఈ విధంగా జపిస్తూ పాత జంద్యం తీసి వేయాలి.

తీసువేసేటప్పుడు పాదాలకు తగలకుండా

నడుము నుంచి క్రిందకు తీసివేసి ఇంటి చూరుపై గాని చెట్లపై గాని ఎవరూ త్రొక్కకుండా ఉండేవిధంగా కానీ లేక ఏదైనా నదిలో గాని విసర్జన చేయాలి.


యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. 


ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి. యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు. 


ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి. 


ఇదే యజ్ఞోపవీత మహిమ!


ఓం తత్సత్......

సర్వేజనా సుఖినోభవంతూ.......


ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ

కర్త ఈశ్వరుడే

 అన్నింటికి కర్త ఈశ్వరుడే* 


గొడ్డలి కట్టెలను కొడుతుంది. గొడ్డలి గొప్పతనం కాదు. 
కలం గొప్ప గ్రంధాలను వ్రాస్తుంది. కలం గొప్పతనం కాదు. 
మనం గొప్ప గొప్ప పనులు చేస్తాం. మన గొప్పతనం కాదు...

అన్నింటికి కర్త అయిన ఈశ్వరునిదే ఆ గొప్పతనం. మనం కేవలం నిమిత్త మాత్రులం. ఈశ్వరుని చేతిలో పనిముట్లం.. అని భావిస్తూ సర్వ కర్మలను, కర్మ ఫలాలను ఈశ్వరుని యందు వదిలి భక్తుడు నిశ్చింతుడై యుండాలి...

ఓక రోజు.. కాశి వెళ్ళే ట్రైను కదిలింది. ఆదరాబాదరాగా పరుగెత్తుకుంటూ ఒక పల్లెటూరి వ్యక్తి రెండు పెట్టెలు నెత్తిమీద పెట్టుకొని ఎలాగో శ్రమపడి రైలు ఎక్కాడు. అతడు రొప్పుతూ రోజుతూ, చెమటలు పట్టి ఉన్నాడు. అటూఇటూ చూచి ఒకచోట సీటు ఉంటే కూర్చున్నాడు. కూర్చొని తాను తెచ్చిన పెట్టెలను తన తలపై ఉంచుకొని ప్రయాణం చేస్తున్నాడు. ప్రక్కన కూర్చున్న వ్యక్తి ఈ పల్లెటూరు ఆసామిని అడుగుతున్నాడు. అయ్యా! ఆ పెట్టెలను ఎందుకు నెత్తిమీద పెట్టుకొని మోస్తున్నావు..? నీ సీటు క్రింద పెట్టుకోవచ్చు గదా.. అన్నాడు. దానికా పల్లెటూరి ఆసామి అంటున్నాడు.. "బాబూ! నేను నాకే టికెట్టు తీసుకున్నాను. వీటిని రైలు మోస్తుందో మోయలేదో తెలియదు గదా.. అందుకే నేనే మోస్తున్నాను అని అన్నాడట. దానికా వ్యక్తి అతడి అమాయకత్వానికి నవ్వి.. నాయనా! నిన్నూ, నీ పెట్టెలను అన్నింటిని ఆ రైలే మోస్తుంది. నీవు నెత్తిమీద పెట్టుకున్నా వాటి బరువును రైలే మొయ్యాలి. ఎందుకు అనవసరంగా నెత్తిన పెట్టుకొని హైరాన పడతావు.. క్రింద పెట్టుకో.. ఏం ఫరవాలేదు అన్నాడు. 

అలాగే ... అన్ని భారాలు మోసేవాడు ఆ ఈశ్వరుడు. అనవసరంగా అహంకారాన్ని నెత్తిన పెట్టుకొని అన్నీ నేనే మోస్తున్నానని భ్రమ పడుతూ ఉండరాదు. అన్నీ నావల్లనే జరుగుతున్నవి అనుకోరాదు. ఇదంతా ఒట్టి అహంకారం. ఈ అహంకారాన్ని వదిలితేనే భగవంతుని సాన్నిధ్యం లభించేది.

కనుక కర్మలన్నింటిని ఈశ్వరుని యందే విడిచిపెట్టాలి. అంటే... 

ఈశ్వరుని స్మరిస్తూ కర్మలు ప్రారంభించు.
ఈశ్వరుని స్మరిస్తూనే కర్మలను కొనసాగించు.
ఈశ్వరుని స్మరణతోనే కర్మలను ముగించు...

కర్మఫలాలను గురించి ఆలోచించకు. లభించిన దానిని ప్రసాద బుద్ధితో స్వీకరించు. నేను నిమిత్తమాత్రుడను అని భావించు. కర్త ఈశ్వరుడే అనే నమ్మకంతో ఉండు. ఏమి జరిగినా నిశ్చితంగా ఉండు. నేను చేస్తున్నాను, ఇది నా వల్లనే జరుగుతుంది అనే అహంకారాన్ని వదులు. ఈ అహంకారాన్ని వదలటమే కర్మలను ఈశ్వరుని లో సన్యసించుట. అలాచేస్తే నీవు ఈశ్వరుని చేతిలో మురళివైపోతావు.

ఇలా సర్వ కర్మలను ఈశ్వరుని తో సన్యసించి, ఈశ్వరుని ధ్యానం నే లక్ష్యంగా పెట్టుకోవాలి...

*|| ఓం నమః శివాయ నమః //*

అద్వైతచైతన్యజాగృతి

 *43-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*16. వేదాంగములు : వ్యాకరణము*


((((((((((🕉))))))))))


*వేదపురుషుని ముఖస్థానము (నోరు) వ్యాకరణము. వ్యాకరణ సంబంధమైన రచనలెన్నో ఉన్నాయి. ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది - పాణిని రచన. అది సూత్రాలతో నిండి యుంటుంది. ఆ సూత్రాలకు విపులమైన వ్యాఖ్య (వార్తికం) రచించినది వరరుచి. పతంజలి మహర్షికూడ ఒక వ్యాఖ్యానం రచించాడు. ఈ మూడు గ్రంథాలూ వ్యాకరణ శాస్త్రంలో ముఖ్యములు. ఇతర శాస్త్రాలకీ వ్యాకరణానికీ భేదముంది. ఇతర శాస్త్రాలలో సూత్రాలు భాష్యాల కంటె ప్రధానాలు. వ్యాకరణం విషయంలో అట్లాకాదు. సూత్రాల కంటె భాష్యమే ప్రధానం. సూత్రాలు వివరణ ఇవ్వక సూచికల వలె ఉంటాయి. ప్రతి శాస్త్రానికీ భాష్యముంటుంది. ప్రతిభాష్యానికీ, విషయం బట్టి ఒక పేరుంటుంది. వ్యాకరణభాష్య మొక్కదానినే మహాభాష్య మంటారు, దాని ప్రాధాన్యతను బట్టి. ఈ మహాభాష్యాన్ని రచించినది పతంజలి మహర్షి. వ్యాకరణమూ, శివుడూ: శివాలయాలలో ''వ్యాకరణ దాన మండప'' మంటూ ఒక మండప ముండేది. ఇది ఉండటానికి కారణమేమిటి? వైష్ణవాలయాలలో ఉండక పోవటానికి కారణమేమిటి? భాషకీ శివునకీ, ఆ మాటకొస్తే వ్యాకరణానికీ శివునకీ, సంబంధమేమిటి? నిజానికీ, దక్షిణామూర్తి రూపంలో శివుడు మౌని. దీని గురించి.*



 *ఈ శ్లోకం చూడండి : ''నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్‌ ఏతత్‌ విమర్శే శివసూత్ర జాలం'' ''అచలుడై శివుడు మౌనంగా ఉంటాడు. నృత్యానంతరం శివుడు తన డమరుకాన్ని మ్రోగించినప్పుడు భాషాశాస్త్రం పుట్టింది'' ఈ శ్లోక తాత్పర్యమిది. నర్తనమాడే శివుని పేరు నటరాజు. ఆయనను మించిన నర్తకుడు లేడు. తాండవాధినేత ఆయన. మహానటుడాయన. నటరాజు ప్రతిమని చూస్తే ఆ తలనుండి ఏదో బయటకు వస్తున్నట్టు కనబడుతుంది - అది గంగతో, నెలవంకతో - అలంకృతం, అవే శివుని జడలు. శివుడు నాట్య మాడుతూన్నంత సేపూ ఆ జడలు కూడ తిరుగు తూంటాయి.నర్తన మాగిపోగానే ఆ జడలు రెండువైపులా పరచుకుంటాయి. ఆ క్షణాన్నే శిల్పి ఊహించి రాతి ప్రతిమగా, లోహపు ప్రతిమగా చెక్కుతాడు. నటరాజు చేతిలో డమరుకముంటుంది. మామూలుగా జోస్యం చెప్తూండే వాళ్ల చేతులలో ఉండేదాని కన్నా పెద్దదిగా ఉంటుంది. నర్తనం చేసేటప్పుడు శివుడు ఆ డమరుకాన్ని కూడ లయబద్ధంగా ఆడిస్తాడు.*



*పై శ్లోకంలో ''ననాదఢక్కాం'' అన్న మాటకిదే అర్థం. వాద్యాలనన్నిటినీ మూడు విధాలుగా విభజించ వచ్చు. అవి (1) చర్మవాద్యాలు - అంటే చర్మాన్ని ఉపయోగించేవి - ఢక్క, మృదంగం, మద్దెల, చెండ (కేరళలో) వంటివి. (2) తంత్రీవాద్యాలు - వీణ, వయోలిన్‌ వంటివి - తంత్రులనుపయోగించేవి. (3) వాయురంధ్ర వాద్యాలు - వీటిలో గాలిని కొన్ని రంధ్రాల ద్వారా బయటకు ఊదుతారు - వేణువు వంటివి. చర్మవాద్యాలను పలికించటానికి చేతివేళ్లనిగాని, కఱ్ఱలనిగాని ఉపయోగిస్తారు. వాద్యం అంతం కావస్తున్నప్పుడు వేగంగా వాయిస్తారు. ''చోపు'' అంటారు దీనిని. ఆ విధంగానే నృత్యం చివరికి వస్తున్నపుడు (''నృత్తావసానే'') చోపు ధ్వని వినబడింది. నటరాజు నృత్య మాడుతున్నప్పుడు సనక, పతంజలి వ్యాఘ్రపాదుడు వంటి ఋషులు తన్మయతతో తిలకిస్తూంటారు. వారు మహర్షులవటం వల్ల సామాన్యులు చూడలేని, ఆ నర్తనని చూడగలుగుతారు. నటరాజుని నర్తనం చూడటానికి దివ్యచక్షువులు కావాలి కదా! దేవతలు, ఋషులు, యోగులు తమ తపశ్శక్తి వల్ల నటరాజు నర్తనాన్ని చూచే శక్తిని సంపాదించారు. దేవుడ్ని చూడటానికి కావలసిన సామర్థ్యాన్ని ''దివ్యదృష్టి'' అంటారు. దీనినే భగవద్గీతలో ''దివ్య చక్షు'' వన్నారు.*




*సనకాది ఋషులు నటరాజు నర్తనాన్ని తమ కళ్లతోనే చూస్తూ ఆనందిస్తున్నారు. పెద్ద డోలుని విష్ణువు వాయిస్తూంటే, బ్రహ్మ తాళం వేస్తున్నాడు. నర్తనం పూర్తి కావస్తున్న సమయానికి ఢక్క నుండి, పధ్నాలుగు దరువులున్న ''చోపు'' వస్తుంది. పై శ్లోకంలోని ''నవపంచవారం''. అన్న పదం ఈ పధ్నాలుగు (తొమ్మిదికి అయిదు కలిపితే వచ్చేవి) దరువులనీ సూచిస్తుంది. డమరుకపు దరువుల విద్యలు కూడ పధ్నాలుగే. హిందూ ధర్మానికి ప్రాతిపదిక పధ్నాలుగు విద్యలైతే, నటరాజు కూడ డమరుకంతో పధ్నాలుగు దరువులనే ఇచ్చాడు. ఆ పధ్నాలుగు దరువులూ సనకాది ఋషులకు ఆధ్యాత్మిక ప్రగతిని ఇంకా కల్పించాయి అంటుంది ఈ శ్లోకం. ఈ సనకాదులెవరు? ఆలయాలలో దక్షిణామూర్తి చుట్టూ నలుగురు వృద్ధులు కూర్చున్నట్టుగా ప్రతిమలుంటాయి. ఆ నలుగురూ సనక, సనందన, సనాతన, సనత్‌ కుమారులనే మహర్షులు.*



*ఆ పధ్నాలుగు దరువులూ ఈ ఋషులకు శివరూప మెరగటానికి సోపానాలయాయి. ఆ శబ్దాలనే ''శివభక్తి సూత్రాలంటారు''. వీటిపై నందికేశ్వరుడొక భాష్యాన్ని వ్రాశాడు. ఆ శివతాండవాన్ని తిలకించిన వారిలో పాణిని ఒకడు. పాణిని గురించి కథా సరిత్సాగరంలో ఉంది. పాటలీపుత్రంలో (ఈనాటి పాట్నానగరం) వర్షోపాధ్యాయ, ఉపవర్షోపాధ్యాయ అని ఇద్దరుండే వారు. వారిలో రెండవవాడు చిన్నవాడు. అతని కుమార్తె ఉపకోశ్ల. పాణినీ, వరరుచీ వర్షోపాధ్యాయుని శిష్యులుగా విద్యనభ్యసిస్తూండేవారు. వీరిద్దరిలో పాణిని కొంచెం మందబుద్ధి. విద్య బాగా సాగలేదు. అందుచేత తపస్సు చేసుకోమని చెప్పి అతనిని హిమాలయాలకు పంపాడు గురువు. శిష్యుడు తపస్సు చేసి శివుని అనుగ్రహం సంపాదించాడు. నటరాజుని నర్తనాన్ని తన కళ్లతోనే చూడగలిగే భాగ్యాన్ని పొందాడు.*


🕉🌞🌏🌙🌟🚩

భగవంతుని ఇంద్రియములు

 భగవంతుని ఇంద్రియములు అంతటా ఉన్నాయి అని చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు ఇప్పుడు సరిగ్గా దానికి విరుద్ధంగా, ఆయనకు ఎటువంటి ఇంద్రియములు లేవని చెప్తున్నాడు. దీనిని మనం లౌకిక తర్కము ద్వారా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే, ఇది పరస్పర విరుద్ధమైనదిగా అనిపిస్తుంది. "భగవంతునికి అనంతమైన ఇంద్రియములు ఉండి మరియు ఆయన ఇంద్రియములు లేకుండా కూడా, రెండూ ఎలా సాధ్యం?" అని అనిపిస్తుంది. కానీ, ఇలాంటి లౌకిక తర్కము మనోబుద్ధులకు అతీతమైన ఆయన పట్ల వర్తించదు. భగవంతుడు అనంతమైన పరస్పర విరుద్ధమైన గుణములు ఒకే సమయంలో కలిగి ఉంటాడు. బ్రహ్మ వైవర్తక పురాణం ప్రకారం:


విరుద్ధ ధర్మో రూపొసా వైశ్వర్యాత్ పురుషోత్తమాః


"పరమేశ్వరుడు అసంఖ్యాకమైన పరస్పర విరుద్ధ గుణములకు నిలయము." ఈశ్లోకంలో, శ్రీ కృష్ణుడు, భగవంతునికి ఉన్న అనంతమైన పరస్పర విరుద్ధ గుణములలో కొన్నింటిని ఇక్కడ పేర్కొంటున్నాడు.


ఆయనకు మనకున్నటువంటి ప్రాకృతిక ఇంద్రియములు ఉండవు, అందుకే ఆయనకు ఇంద్రియములు లేవు అని చెప్పటం సమంజసమే. సర్వేంద్రియ వివర్జితమ్ అంటే "ఆయనకు ప్రాకృతిక ఇంద్రియములు లేవు." అని అర్థం, కానీ, ఆయనకు సర్వత్రా ఉండే దివ్యమైన ఇంద్రియములు ఉన్నాయి, అందుకే భగవంతుని యొక్క ఇంద్రియములు సర్వవ్యాప్తమై ఉన్నాయి అని అనుకోవటం కూడా సమంజసమే. 'సర్వేంద్రియ గుణాభాసం' అంటే "ఇంద్రియములకు ఉండే స్వభావాన్ని వ్యక్తపరిచి ఇంద్రియవస్తు విషయములను గ్రహిస్తాడు. ఈ రెండు లక్షణములను పొందుపరుస్తూ, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:


అపాణిపాదో జవనో గ్రహీతా పశ్యత్యచక్షుః స శృణోత్యకర్ణః  (3.19)


"భగవంతునికి ప్రాకృతిక చేతులు, పాదములు, కళ్ళు, మరియు చెవులు ఉండవు. అయినా సరే ఆయన అన్నీ అవగాహన చేసుకుంటాడు, నడుస్తాడు, చూస్తాడు, మరియు వింటాడు."


అంతేకాక, శ్రీ కృష్ణుడు తానే ఈ సృష్టిలోని జగత్తు అంతటినీ పోషించి, సంరక్షించేవాడిని, అయినా దాని నుండి విడిగా ఆసక్తి రహితంగా ఉంటానని చెప్తున్నాడు. తన యొక్క విష్ణుమూర్తి స్వరూపంలో, శ్రీ కృష్ణ భగవానుడు సమస్త సృష్టిని పోషిస్తూ నిర్వహిస్తూ ఉంటాడు. సర్వ భూతముల హృదయములో స్థితుడై ఉండి, వారి కర్మలను నోట్ చేసుకుంటూ, వాటివాటి ఫలితములను అందిస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి అధిపత్యమునకు లోబడి బ్రహ్మ దేవుడు, విశ్వమును నిలకడగా నిర్వహించటానికి, భౌతిక లౌకిక శాస్త్ర సూత్రములను మార్పు చేస్తూ ఉంటాడు. ఇంకా విష్ణుమూర్తి ఆధిపత్యములోని దేవతలు మనకు వాయువు, భూమి, నీరు, వర్షము మొదలైన, మన మనుగడకు అవసరమైన వాటిని సమకూరుస్తూ ఉంటారు. అందుకే, భగవంతుడే అన్నింటికీ నిర్వాహకుడు/పోషకుడు. అయినా, తనకు తానే పరిపూర్ణుడు అందుకే అందరితో విడివడి ఆసక్తిరహితముగా ఉంటాడు. వేదములు ఆయనను 'ఆత్మారాముడు' అని అంటాయి, అంటే "తనలో తానే రమించిపోయేవాడు, ఇంకా ఏ ఇతర అన్య బాహ్యమైనవి అవసరం లేనివాడు" అని అర్థం.


భౌతిక శక్తి అనేది భగవంతునికి యొక్క అధీనములో ఉండేది, అది ఆయనకు సేవ చేస్తూ ఆయన ప్రీతి కోసమే పనిచేస్తుంది. అందుకే ఆయన ప్రకృతి త్రిగుణముల యొక్క భోక్త. అదే సమయంలో, ఆయన నిర్గుణుడు (త్రిగుణములకు అతీతుడు), ఎందుకంటే ఈ గుణములు ప్రాకృతికమైనవి, కానీ భగవంతుడు దివ్యమైన వాడు.


  *కృష్ణం వందే జగద్గురుమ్*

శ్రీశనైశ్చరస్వామి మహత్మ్యం

 *🍇 శ్రీశనైశ్చరస్వామి మహత్మ్యం 🍇 4️⃣5️⃣వ భాగం :—* 🚩 సేకరణ :- పరమేశ్వర జానపాటి 🚩

👉 సమర్పణ : మహిమాన్విత

*🦅శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనైశ్చరస్వామి దేవస్థానము 🦅*

( 🪐రాష్ట్రం లోనే తొలిసారిగా  నిర్మితమౌతున్న సతీ సమేత (భార్యతో కూడిన) ఆలయం🪐 - సంగండెయిరి పాలకేంద్రం పక్కన , NRT రోడ్డు - వినుకొండ )

*📿పరమేశ్వర జానపాటి ( శివగురుస్వామి )*

📱Cell no :- 8520096175

👉👉👉 యుద్దరంగమునందు రక్తసిక్తమైన ఆయుధముతో సింహమువలే గర్జించుచూ నిలచివున్న  వర్థమానుడను చుాసి యువరాణి గిరిజాదేవి ఇలా పలికినది " ఓ వీరుడా ! అసమానశూరుడా !! ఎవరు నువ్వు ? నిన్ను చూచుచుంటె నీవు మారాజ్యమునకు చెందిన వాడివిలాలేవు, ఎచటివాడవు నీవు " అని పలుకగా వర్దమానుడు యువరాణికి గౌరవపూర్వక నమస్సులు అందించి ఇలా పలికాడు" ఓ యువరాణి నానామదేయము వర్దమానుడు. నాది ఈ రాజ్యమున పొలిమెరల వద్ద గల అరణ్య ప్రాంతం. ఇచ్చట ఉత్సవములు జరుగుచున్నవని తెలిసి తిలకించుటకు నా సహచరులతో విచ్చేసితిని." అని పలికాడు. 

               వర్థమానుడు గంభీరస్వరం విన్న గిరిజాదేవి " మీ పలుకులు ఓ యుద్దవీరుడను జ్ఞప్తికి తెస్తున్నవి. మీ రాజసము ఓ చక్రవర్తి ని తలపించుచున్నది.మీ ముఖ వర్చస్సు రాజవంశీకులవలే వున్నది. మీ కనులలోని ఎర్రని చారలు మీ ప్రతాప శౌర్యాలను చాటిచెప్పుచున్నవి. కోరుకోండి మీకు మానుండి ఏమి కావలయునో తప్పక ఇచ్చెదము" అని పలుకగా మహారాణి వారి పలుకులు విని సంతోషించి రెట్టింపైన ఆనందముతో వర్థమానుడు గిరిజాదేవి వైపు ప్రేమతో నిండిన చూపులతో ఇలా పలికెను " ఓ యువరాణి నేను ఉపాధి లేని పేదవాడను. మీరాజ్యములో చక్కని ఉపాధిని... మీ అనురాగ మమకారములు మాపై ప్రసరింపచేస్తే చాలు. మాబోటి నిరాశ్రయులకు ఇంకేమి కావలయును." అని పలుకగా గిరిజాదేవి వర్థమానుడి వైపు చిరుమందహాసం చేయుచూ " సరే మీ కోరికను మన్నించాము. ఇక నుండి మీరు మా అంగరక్షకుల వలే భాద్యతలు నిర్వర్తించవలయును." అని పలుకగా సభలోని పురప్రజలందరూ కరతళధ్వనులు చేసారు. వర్థమానుడు మిక్కిలి సంతసించాడు. వర్దమానుడి వైపు యువరాణి గిరిజాదేవి మోహంగా చూచుతూ సభనుండి నిష్క్రమించినది.

         పోరాట సభలో పాలుపంచుకున్న మిగిలిన యుద్దవీరులు వర్ధమానుడను జయజయనాధములతో కొనియాడారు. పూలవర్షములు కురిపించారు. గజరాజు పూలమాలను వర్థమానుడి మెడలో వేసాడు. ఆ దృశ్యములను అతిథుల భవనము పై అంతస్థు నుండి చూస్తూ గిరిజాదేవి తన్మయత్వమును పొందినది.ఎలాగైన వర్థమానుడను తన పతిగా పొందాలని తన మనస్సులో సంకల్పించుకున్నది. మధురమైన తన్మయత్వంలో మునిగి తెలిపోయినది. తన శరీరము వర్థమానుడి చేతి స్పర్శకోసం తహతహలాడినది. మధుర స్వప్నాలను  పొందుతున్నది. యువరాణి భావాలను గ్రహించిన  రాజకాంత స్త్రీలు,, చెలికత్తెలు అచ్చెరువునొందారు.


🦅 శ్రీశనైశ్చర మహత్మ్యం - 45 వ భాగం🦅 .... సమాప్తము.


సమర్పణ :— శ్రీశనీశ్వరాలయం నిర్మాణాభివృద్ది కమిటి - వినుకొండ.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥

❄ ముఖ్య విన్నపము :— 🦅 

*-శ్రీ జ్యేష్ఠలక్ష్మీ సమేత శ్రీశనైశ్చరస్వామి దేవస్థానము-* ( రాష్ట్రంలోనే మొట్టమొదటి సతీసమేత శనైశ్చరాలయం )

 {రిజిష్టర్డ్ నంబర్ 14/2018 .}

( ఆలయం నిర్మాణములో వున్నది)

*(సంగంపాలకేంద్రం పక్కన - నరసరావుపేటరోడ్ - వినుకొండ)*

👉 ఆలయ నిర్మాణమునకు సహకరించాలనుకునేవారు దేవస్థానము అకౌంటును పోస్టు చేయుచున్నాము.

(Andhra bank  { Vinukonda branch }


Name : *-Sri Jyesta Lakshmi Sametha Sri Shanaichara swami vari devasthanamu-*


A/C no : *-197910100094811-*


Ifsc code : ANDB0001979 )


Cell No : *-8520096175-*

💥💥💥💥💥💥💥💥💥💥💥💥

యజ్ఞం - ఓ పవిత్ర కార్యం

 🔥🔥🔥🔥🔥

యజ్ఞం - ఓ పవిత్ర కార్యం.

🔥🔥🔥🔥🔥

'యజ్ఞం' అనేది అనాదిగా వస్తున్న ఒక హిందూ సంప్రదాయం. వేదంలో యజ్ఞో వై విష్ణుః అని చెప్పబడింది. అనగా యజ్ఞం విష్ణు స్వరూపంగా భావించవచ్చు. ‘యజ్ఞం’ అను శబ్దం ‘యజ దేవపూజయాం’ అనుదాతువు నుంచి ఏర్పడింది. దైవపూజే యజ్ఞం.


మన దేశంలో పురాణకాలం నుంచి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. యజ్ఞం అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడమే. వారిని మెప్పించడమే. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో 'వేల్చినవి' దేవతలందరికి చేరుతాయని విశ్వాసం. 


యజ్ఞ విధానం 

వైదిక యజ్ఞంలో అధ్వర్యుడు ప్రధాన అర్చకుడు. అతని అధ్వర్యంలో అన్ని యజ్ఞ కార్యక్రమాలూ జరుగుతాయి. అతనికి సహాయంగా అనేక మంది అర్చకులు, పండితులు ఉంటారు. వేద మంత్రాలు చదువుతారు. యజ్ఞంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువగాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి అనేక సంభారాలు పోస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిముషాల నుంచి కొన్ని సంవత్సరాల వరకూ జరుగవచ్చు.


యజ్ఞాల్లో భాగంగా.. అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం, రాజసూయ యాగం,   సర్పయాగం, విశ్వజిత్ యాగం.. వంటి యాగాలున్నాయి. 

🔥🔥🔥🔥🔥

Siva








 

Auto balance scooter