8, జులై 2022, శుక్రవారం

పుట్టగానే శిశువు

 పుట్టిన శిశువు పాలు తాగకుండా ఉంటే  - 


       పుట్టగానే శిశువు పాలు తాగకుండా ఉంటే వెంటనే ఉసిరికబెరడు , కరక్కాయ బెరడు , సైంధవ లవణం సమంగా కలిపిన పొడిని ఒక చిటికెడు అనగా రెండు వ్రేళ్ళకు వచ్చినంత పొడి ఒక చుక్క తేనె రెండు చుక్కల నెయ్యి కలిపి నాలుకకు అంటిస్తే వెంటనే శిశువు పాలు తాగుతాడు .


 

మృష్టాన్నభోజనం

 మృష్టాన్నభోజనం


ఈరోజుల్లో టీవీలలో ఎన్నో వంటల కార్యక్రమాలు వస్తున్నాయి. ఆ కార్యక్రమాల్లో ఇచ్చే సూచనలను  సరిగ్గా అర్థం చేసుకుని వండితే, చివరగా తయారయ్యే పదార్ధం తినడానికి యోగ్యంగా ఉంటుందా? అది అనుమానమే.


కొత్త వంటకాలు ఏవీ లేకపోతె, సాధారణంగా చేసే మునక్కాయ సాంబారు లేదా బెండకాయ తాలింపు చేసే విధానాన్నే ఉపయోగించి కొత్త వంటలు చేస్తారు.


స్వామివారు పూర్వాశ్రమంలో ఎన్నడూ వంటింటికి వెళ్ళలేదు; సన్యసించిన తరువాత ఇక వెళ్ళాల్సిన అవసరం లేదు. కాని స్వామివారికి నలభీమపాకంలోని మెళకువలన్నీ తెలుసు. అంతేకాక కొత్త కొత్త వంటలు ఎలా చెయ్యాలో కూడా మంచి నేర్పు.


మేము పండరీపురం నుండి తిరిగొస్తున్నాము. అయిదారు చిన్ని గుడిసెలు ఉన్న ఒక కుగ్రామానికి చేరుకున్నాము. ఒక పెద్ద చెట్టు కింద మకాం ఏర్పాటుచేసుకున్నాము.


పరమాచార్య స్వామివారు భిక్ష పూర్తిచెయ్యగానే, మాకోసం కాస్త ఎక్కువగా వండిన పదార్థాలను ఆరగించి మా భోజనం కూడా పూర్తిచేశాము. అది మధ్యాహ్న విశ్రాంతి సమయం.


హఠాత్తుగా పెద్ద కోలాహలంతో ఇరవై మంది వ్యక్తులు వచ్చారు. వారందరూ చెన్నై ప్రాంతం వారు. శ్రీమఠం మకాం కాబట్టి శ్రీ చంద్రమౌళీశ్వర ప్రసాదంగా మంచి ఆహారం దొరుకుతునదన్న నమ్మకంతో అక్కడకు వచ్చారు.


కాని అప్పుడు శ్రీమఠం ఒక పెద్ద చెట్టు కింద మకాం చేసి ఉంది. వండడానికి కావాల్సిన సరుకులు, పాత్రలు కూడా లేవు. ఇటువంటి విషయాల గురించి మహాస్వామివారు ఎక్కువగా కలతచెందేవారు కాదు. ఆకలితో వచ్చిన వారి కడుపు నింపడమే స్వామివారి లక్ష్యం.


బ్రహ్మచారి రామకృష్ణన్ అని స్వామివారి ఆంతరంగిక సేవకుడు ఉండేవాడు. “అందరికి ఆహారం తయారుచెయ్యి” అని అతణ్ణి ఆదేశించారు స్వామివారు.

రామకృష్ణన్ చేతులు నలుపుతూ నిస్సహాయంగా నిలబడి, “మనం మన మకాం తరువాతి ఊరికి వెళ్ళినతరువాత వారికి వండి పెడతాను” అని తెలిపాడు.

ఇబ్బంది ఉందని పరమాచార్య స్వామివారు అర్థం చేసుకుని, “బియ్యం ఉందా?” అని అడిగారు.


“ఉంది; కాస్త పెసర పప్పు కూడా ఉంది”


“అయితే ఇంకేం! నువ్వు ఏం చేస్తావంటే, బియ్యాన్ని నానబెట్టి కడుగు, ఆ నీటిని మరొక పాత్రలో సేకరించు. డానికి కొద్దిగా ఉప్పు వేసి, నిమ్మకాయ పిండి, నారత్తై ఆకులను కత్తిరించి వెయ్యి. ఇది మజ్జిగ అవుతుంది.


పెసర పప్పుని ఎక్కువగా నీరు పోసి ఉడికించు. నీటిని పప్పును వేరుచేసి, ఆ వేడినీళ్ళకు నిమ్మకాయ వెయ్యి. ఇది రసం అవుతుంది.


ఇప్పుడు ఉడికించిన పెసర పప్పు ఉంది కదా! దానికి కాస్త ఉప్పు, కత్తిరించిన మిరపకాయలు వెయ్యి. అది తాళింపు అవుతుంది” అని ఆదేశించారు.


అరగంటలో మొత్తం సిద్ధం అయ్యింది. ఈలోగా మేము అతిథులకి భోజనానికి ఆకులు, నీరు సమకూర్చాము. మొత్తానికి షడ్రుచుల నాలుక కోసం అన్నం, పెసర పప్పు తాళింపు, రసం, మజ్జిగ తయారుచేసాము.


“ఇది మృష్టాన్న భోజనం” అన్నారొక అతిథి.


“దేవామృతం” అని మరొకరు చెప్పారు.


“ఇంతటి రుచికరమైన భోజనాన్ని ఇంతకుముందెన్నడూ తినలేదు” అన్నారు మూడవవారు.


ఆ మాటలను విని మాలో మేము నవ్వుకున్నాము. అది పరమాచార్య స్వామివారి వాక్కు వల్ల కలిగిన రుచి అని మాకు తెలుసు.


ఆతిథ్యం అన్నది పరమాచార్య స్వామివారిని చూసే నేర్చుకోవాలి. అది ఒక అక్షయ పాత్ర.


--- శ్రీమఠం బాలు. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 4


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఉత్కృష్టమైన మార్గం

 *ఉత్కృష్టమైన మార్గం*


"ఈ ప్రపంచంలో జీవించటానికి ఉత్కృష్టమైన మార్గమేది?" అని ఒక శిష్యుడు గురువుగారిని  అడిగితే దానికి ఆయన ఇలా జవాబు చెప్పారు "నీ విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు, నీ మనసును మాత్రం ఆ భగవంతునిపైనే నిలకడగా ఉంచి సాధన చెయ్యి. నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు. వాళ్ళు నీకెంతో ప్రియాతి ప్రియమైన వాళ్ళుగానే వ్యవహరించు. నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు. 


ఒక ధనికుడి ఇంట్లో పని మనిషి అన్ని పనుల్నీ అంకిత భావంతో చేస్తుంది, ఆమె దృష్టి మాత్రం తన ఇంటిపైనే ఉంటుంది. తన యజమాని పిల్లలకు అన్ని సేవలూ చేస్తుంది. తన కన్న బిడ్డలన్నంత మమకారంతో వారిని సాకుతుంది. "నా బాబువి కదూ, నా తల్లివి కదూ" అని వాళ్ళను ప్రేమగా పిలుస్తూ తన చేత్తో అన్నం తినిపిస్తుంది. కాని ఆమెకు తెలుసు ఆ పిల్లలెవరూ తన వాళ్ళు కాదని.


తాబేలు నీళ్ళల్లో ఈదుకుంటూ పోతున్నా దాని మనస్సంతా గట్టు మీదే, తాను భద్రంగా అక్కడ దాచుకున్న గుడ్ల మీదే ఉంటుంది. అలాగే నీ ప్రాపంచిక కర్మలన్నీ నిర్విఘ్నంగా సాగనియ్యి. నీ మనసును మాత్రం ఆ భగవంతుడి పైనే లగ్నం చెయ్యి.


బాల్యంలోనే దైవారాధన అనే సదాచారం నీకు అలవడకపోతే సంపదలు, సౌకర్యాలు, సుఖాలు పోగేసుకునే వ్యామోహంలో పడి ఆ భగవంతుణ్ణి పూర్తిగా మరచిపోయే ప్రమాదం ఉంది. సర్వ సమర్థుడినన్న అహంకారం, ఆశించినవి అందటం లేదన్న దుఃఖం, అంతుపట్టని అసంతృప్తి నిన్ను పూర్తిగా ఆక్రమించుకుని అశాంతి పాలు చేసే విపత్తు పొంచి ఉంటుంది.


ప్రపంచం నీళ్ళ లాంటిది. మనస్సు పాల లాంటిది. పాలను నీళ్ళలో పోస్తే అదంతా కలిసి ఏకమవుతుంది. వెన్నని నీళ్ళల్లో వేస్తే అది తేలుతుంది. అలాగే, ఆధ్యాత్మిక శిక్షణకు ఏకాంత సాధన కావాలి. జ్ఞానమనే వెన్నను చిలికి తెచ్చుకోవాలి. ఒకసారి అది లభించాక ప్రపంచమనే నీటిలో ఉంచినా అది కలవదు.


*శుభంభూయాత్*

7, జులై 2022, గురువారం

ఏకాంత సాధన

 *ఉత్కృష్టమైన మార్గం*


"ఈ ప్రపంచంలో జీవించటానికి ఉత్కృష్టమైన మార్గమేది?" అని ఒక శిష్యుడు గురువుగారిని  అడిగితే దానికి ఆయన ఇలా జవాబు చెప్పారు "నీ విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు, నీ మనసును మాత్రం ఆ భగవంతునిపైనే నిలకడగా ఉంచి సాధన చెయ్యి. నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు. వాళ్ళు నీకెంతో ప్రియాతి ప్రియమైన వాళ్ళుగానే వ్యవహరించు. నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు. 


ఒక ధనికుడి ఇంట్లో పని మనిషి అన్ని పనుల్నీ అంకిత భావంతో చేస్తుంది, ఆమె దృష్టి మాత్రం తన ఇంటిపైనే ఉంటుంది. తన యజమాని పిల్లలకు అన్ని సేవలూ చేస్తుంది. తన కన్న బిడ్డలన్నంత మమకారంతో వారిని సాకుతుంది. "నా బాబువి కదూ, నా తల్లివి కదూ" అని వాళ్ళను ప్రేమగా పిలుస్తూ తన చేత్తో అన్నం తినిపిస్తుంది. కాని ఆమెకు తెలుసు ఆ పిల్లలెవరూ తన వాళ్ళు కాదని.


తాబేలు నీళ్ళల్లో ఈదుకుంటూ పోతున్నా దాని మనస్సంతా గట్టు మీదే, తాను భద్రంగా అక్కడ దాచుకున్న గుడ్ల మీదే ఉంటుంది. అలాగే నీ ప్రాపంచిక కర్మలన్నీ నిర్విఘ్నంగా సాగనియ్యి. నీ మనసును మాత్రం ఆ భగవంతుడి పైనే లగ్నం చెయ్యి.


బాల్యంలోనే దైవారాధన అనే సదాచారం నీకు అలవడకపోతే సంపదలు, సౌకర్యాలు, సుఖాలు పోగేసుకునే వ్యామోహంలో పడి ఆ భగవంతుణ్ణి పూర్తిగా మరచిపోయే ప్రమాదం ఉంది. సర్వ సమర్థుడినన్న అహంకారం, ఆశించినవి అందటం లేదన్న దుఃఖం, అంతుపట్టని అసంతృప్తి నిన్ను పూర్తిగా ఆక్రమించుకుని అశాంతి పాలు చేసే విపత్తు పొంచి ఉంటుంది.


ప్రపంచం నీళ్ళ లాంటిది. మనస్సు పాల లాంటిది. పాలను నీళ్ళలో పోస్తే అదంతా కలిసి ఏకమవుతుంది. వెన్నని నీళ్ళల్లో వేస్తే అది తేలుతుంది. అలాగే, ఆధ్యాత్మిక శిక్షణకు ఏకాంత సాధన కావాలి. జ్ఞానమనే వెన్నను చిలికి తెచ్చుకోవాలి. ఒకసారి అది లభించాక ప్రపంచమనే నీటిలో ఉంచినా అది కలవదు.


*శుభంభూయాత్*

భగవద్గీత

 *1.* భగవద్గీతను లిఖించినదెవరు?

=విఘ్నేశ్వరుడు.

*2.* భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?

= భీష్మ పర్వము.

*3.* గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?

=మార్గశిర మాసము.

*4.* గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?

=హేమంత ఋతువు.

*5.* ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వసంత ఋతువు.

*6.* భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?

=శ్రీకృష్ణుడు అర్జునునికి.

*7.* భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?

=కురుక్షేత్ర సంగ్రామము.

*8.* భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?

=కౌరవ పాండవులకు.

*9.* పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?

=అర్జునుడు.

*10.* వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=సామవేదము.

*11.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?

=పాంచజన్యము.

*12.* భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?

=పద్దెనిమిది (18)

*13.* “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?

= వినోబా భావే.

*14.* “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

= మహాత్మా గాంధీ.

*15.* భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?

= సంజయుడు.

*16.* సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కుమారస్వామి.

*17.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?

=దేవదత్తము.

*18.* భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?

= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)

*19.* భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?

=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.

*20.* ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= శ్రీరామచంద్రుడు.

*21.* భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=అచ్యుత, అనంత, జనార్ధన.

*22.* భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=ధనుంజయ, పార్ధ, కిరీటి.

*23.* శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?

=గీతా గానం.

*24.* “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?

=ఎడ్విన్ ఆర్నాల్డ్.

*25.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?

=పౌండ్రము.

*26.* ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=శంకరుడు.

*27.* “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

=మహాత్మాగాంధీ.

*28.* భగవద్గీత ఏ వేదములోనిది?

=పంచమ వేదం-మహాభారతం.

*29.* భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?

=11వ అధ్యాయము

*30.* ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=విష్ణువు

*31.* భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?

=అర్జున విషాద యోగము.

*32.* భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?

=పదివేలమంది.

*33.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?

=అనంతవిజయము.

*34.* భగవద్గీత  మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?

= “ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభమయినది.

*35.* ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?

=సంజయుడు.

*36.* భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?

=దృష్టద్యుమ్నుడు.

*37.* ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వజ్రాయుధము.

*38.* మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?

=వజ్ర వ్యూహం.

*39.* గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?

=భీష్ముడు.

*40.* సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాసుకి.

*41.* అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= అనంతుడు.

*42.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?

=సుఘోషము.

*43.* అర్జునుని ధనస్సు పేరేమిటి?

=గాండీవము.

*44.* జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి)

*45.* నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గంగానది.

*46.* ఆత్మ యెట్టిది?

=నాశరహితమైనది.

*47.* కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?

=నిష్కామ కర్మ.

*48.* మనుజునకు దేనియందు అధికారము కలదు?

=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)

*49.* అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?

=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)

*50.* వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?

= రావిచెట్టు.

*51.* పంచభూతములచే నాశనము పొందనిది ఏది?

=ఆత్మ.

*52.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?

=మణిపుష్పకము.

*53.* ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?

=ఆత్మయందు.

*54.* మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?

=హనుమంతుడు.

*55.* పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గరుత్మంతుడు.

*56.* ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?

=తాబేలు.

*57.* కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?

=చేయుటయే మేలు.

*58.* బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?

=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)

*59.* వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?

=లోక క్షేమం కొరకు.

*60.* ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కామధేనువు.

*61.* స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?

=స్వధర్మము.

*62.* పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?

=కామము చేత.

*63.* దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?

= కామము యొక్క ప్రేరణచే.

*64.* భగవంతుడెపుడు అవతరించును?

=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.

*65.* అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ప్రహ్లాదుడు.

*66.* గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= చిత్రరథుడు.

*67.* హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?

=జ్ఞానతపస్సు.

*68.* జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?

=పరమశాంతి.

*69.* ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?

=గాలిలేనిచోట గల దీపంతో.

*70.* ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?

=అభ్యాసము, వైరాగ్యము.

*71.* భయంకరమైన మాయను దాటుట ఎట్లు?

=భగవంతుని శరణుపొందుట వలన.

*72.* భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?

=నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)

*73.* భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు?

=అజ్ఞానులు.

*74.* విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?

=బ్రహ్మవిద్య.

*75.* మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= భృగు మహర్షి.

*76.* బ్రహ్మవిద్యకు అర్హత యేమి?

=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.

*77.* ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?

=పరమాత్మయందు.

*78.* గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?

=పరమాత్మయందు అనన్యభక్తిచే.

*79.* ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?

=భగవంతుని భక్తుడు.

*80.* సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?

=సాక్షాత్తు పరమాత్మయే.

*81.* ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మనస్సు.

*82.* పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మేరువు.

*83.* పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=బృహస్పతి.

*84.* వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=ఓం కారము.

*85.* యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?

=జప యజ్ఞము.

*86.* ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఐరావతము.

*87.* గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఉచ్ఛైశ్శ్రవసము.

*88.* శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?

= మూడు (సాత్విక, రాజస, తామసాహారము)

*89.* దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= నారదుడు.

*90.* సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కపిల మునీంద్రుడు.

*91.* భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?

= మోక్షసన్యాస యోగము.

*92.* లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కాలము.

*93.* జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మొసలి.

*94.* ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?

= సత్త్వ, రజ, తమో గుణములు.

*95.* వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాయువు.

*96.* భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 35.

*97.* విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఆధ్యాత్మ విద్య.

*98.* రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాదము.

*99.* అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= "అ"-కారము.

*100.* భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?

= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)

*101.* మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మార్గశిరము.

*102.* క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 20 (ఇరువది).

*103.* శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 26 (ఇరువదియాఱు).

*104.* శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 6 (ఆఱు).

*105.* తపస్సులెన్ని రకములు?

= మూడు (శారీరక, వాచిక, మానసిక)

*106.* పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?

= మూడు (ఓమ్, తత్, సత్).

*107.* మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?

= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.

*108.* సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను?

వేదవ్యాసుడు.

ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏🙏🙏

ఆధ్యాత్మికం..ఆత్మ విద్య

 ఆధ్యాత్మికం..ఆత్మ విద్య.. ఎవరికి కావాలి? (అంతర్మధనం)

...............................

ప్రవాహంలో కొట్టుకు పోతున్న వాడికి గడ్డిపోచ ఆధారంగా దొరికినా గట్టెక్కుతాడు. అదే ఆధ్యాత్మిక విద్య. ఆ ఆరాటం పోరాటమైతే నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం జరిగి ఆత్మ వైపు మళ్ళితే అది ఆత్మ విద్య. ఆత్మ పరమ లక్ష్యం పరమాత్మను సాధించు కోవడమే.


ఆచార్య వాణి..

....................

ఆచార్యుల అనుగ్రహం లేకుంటే ఏదీ అర్థం కాదు, ఏదీ సాధించ లేము. ఆచార్యుల అనుగ్రహంతో గ్రహించిన రెండు విషయాలు అవలోకిద్దాం.  త్రిమతాచార్యులు చెప్పిన విషయాలు లౌకికులు అర్థం చేసుకున్నా ఇట్టే మరచిపోతారు. సాధకులు అనుభవించి తెలుసు కుంటారు. తపస్సే ఏ సాధనకైనా మూలం. తపస్సు యోగమై ఆహార శుద్ధి కలుగుతుంది. అప్పుడు రాగం.. విరాగమై.. శరీరానికి, ఆత్మకు అనుసంధానమైన పరమాత్మ..అంటే ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది.


అహం బ్రహ్మాస్మి..

..... ..............

ఇది శంకర భగవత్ పాదుల ఉవాచ. నిజానికి ఇది ఉపనిషత్ వాక్యమే. నేను - నువ్వు ఒకటే అంటే..ఆత్మే పరమాత్మ అన్నమాట. అయితే ఇది తపస్సు ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. అంతే కానీ నేనూ, నువ్వు ఒకటే అని తేలిగ్గా అనేసుకుంటే అహంకారమే మిగులుతుంది. శంకరాచార్యుల భాష్యానికి  విపరీత అర్థం తీసుకో కూడదు. శంకరాచార్యుల వారి అద్వైతం..ఆ రెండూ ఒకటే అంటుంది. ఆ రెండూ..ఆత్మ, పరమాత్మ. సాధనతో ఆత్మను తెలుసుకుంటే అది యోగమై పరమాత్మతో అనుసంధానమై ఆ రెండు ఒకటై పోతాయి. అంటే మిగిలేది ఒక్కటే.  శ్రీ రామానుజుల వారు రెండు కాదు..మూడు అన్నారు. అవి..శరీరం, ఆత్మ, పరమాత్మ. శరీరం లేదా ప్రకృతి..అంటే పాంచ భౌతిక దేహం చిత్ అన్నమాట. ఆత్మ శాశ్వతం. శరీరం పతనమైతే వేరే ఉపాధి తీసుకుంటుంది. శరీరం, ఆత్మకు ఆధారమైనది పరమాత్మ. ఆ విధంగా పరమాత్మను తెలుసుకోవాలి. ఆత్మకు సాక్షీభూతం పరమాత్మ. ఇదే.. విశిష్ట అద్వైతం. ఇక..మూడవది ద్వైతం. ఆత్మ వేరు..పరమాత్మ వేరు అంటారు     మధ్వాచార్యుల వారు. ఏది ఏమైనా త్రిమతాచార్యుల వారి తత్మం ఒక్కటే. ఆ ఈశ్వర ప్రాప్తే జీవుడి చరమ లక్ష్యం కావాలి. నశించి పోయే శరీరమే నేను అనుకోకుండా.. ఎప్పటికీ నశించని ఆత్మ స్వరూపులై.. ఈశ్వర ప్రాప్తి పొందాలి. ఆచార్యుల వాణి మనకు అలాంటి స్థితి కలిగించు గాక. స్వస్తి.// ఆదూరి వేంకటేశ్వర రావు.🙏


సంగీతము సాహిత్యము

 శ్లోకం:☝️

*సంగీతమపి సాహిత్యం*

   *సరస్వత్యాః పదద్వయం l*

*ఏకమాపాత మధురమ్-*

   *అన్యమాలోచనామృతం ll*

    - సంగీతరత్నాకరం


భావం: సంగీతము సాహిత్యము సరస్వతీ దేవి యొక్క పాద పద్మములు. ఒకటి చెవులకు మధురంగా ఉంటుంది. రెండవదైన సాహిత్యం ఆలోచించే కొలదీ అమృతం ఊరుతుంది. ఈ రెంటినీ ఉపాసించినవాడు సరస్వతీ కటాక్షానికి పాత్రుడవుతాడు. సరస్వతీ కటాక్షం ఉంటే రెండూ అబ్బుతాయి! (పై శ్లోకంలో *పదద్వయం* బదులుగా *స్తనద్వయం* అన్న పదం వాడుకలో ఉంది.🙏

అమ్మవారికి అలంకరణ

 అమ్మవారి పూజలో ముఖ్యమైనది అలంకరణ.. 

అవునండి నిజంగా మీ పూజ ఫలించాలంటే అమ్మవారిని చక్కగా అలంకరించి ఆ తర్వాత మీరు కూడా అమ్మవారి వలే అలంకరించుకోవాలి..

ఎందుకంటే మనం పూజ చేస్తున్నప్పుడు అమ్మని చూస్తూ అమ్మవారి వలే ఎలా కనిపించాలని అనుకుంటామో అలాగే అమ్మవారు కూడా పూజ సమయంలో మనలోనిని తనను చూసుకుంటూ మురిసిపోతుంది..

అందుకే ఆ సమయం లో మీ ముఖంలో ఏదో తెలియని కళ,శక్తి కనిపిస్తాయి అంటే అమ్మ మీ చేతులతో పూజ చేయిస్తూ తనని మీలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది..

సాక్షాత్తు ఆ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులే అమ్మవారిని దర్శించుకోవడానికి స్త్రీ రూపంలో అలంకరించుకొని దర్శించుకుంటారు..అంటే అమ్మవారికి అలంకరణ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది.

6, జులై 2022, బుధవారం

గురుకులములు

 ఇంగ్లాండ్‌లో మొదటి పాఠశాల 1811లో ప్రారంభించబడింది. ఆ సమయంలో భారతదేశంలో 7,32,000 గురుకులములు ఉన్నాయి. 


మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో,  గురుకుల అభ్యాసం ఎలా ముగిసిందో తెలుసుకుందాం.

గురుకుల సంస్కృతిలో (సనాతన సంస్కృతిలో)  ఈ క్రింది విషయాలను బోధించారు.


01 అగ్ని విద్య (లోహశాస్త్రం)

02 వాయు విద్య (గాలి)

03 జల్ విద్య (నీరు)

04 అంతరిక్ష విద్య (స్పేస్ సైన్స్)

05 పృథ్వి విద్య (పర్యావరణం)

06 సూర్య విద్య (సౌర అధ్యయనం)

07 చంద్ర మరియు లోక్ విద్య (చంద్ర అధ్యయనం)

08 మేఘ విద్య (వాతావరణ సూచన)

09 ధాతు ఉర్జా విద్య (బ్యాటరీ శక్తి)

10 దిన్  రాత్ విద్య.

12 శ్రద్ధా విద్యా (అంతరిక్ష పరిశోధన)

13 ఖాగోళ విజ్ఞానం (ఖగోళ శాస్త్రం)

14 భుగోళ విద్య (భౌగోళిక)

15 కాల విద్యా(సమయ అధ్యయనాలు)

16 భూగర్బ విద్య (జియాలజీ & మైనింగ్)

17 రత్నాలు మరియు లోహాలు 

18 ఆకర్షణ విద్య (గురుత్వాకర్షణ)

19 ప్రకాశ విద్య (శక్తి)

20 సంచార విద్య (కమ్యూనికేషన్)

21 విమాన విద్య (విమానం)

22 జలయన్ విద్య (నీటి నాళాలు)

23 అగ్నియా ఆస్ట్రా విద్య (ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి)

24 జీవవిజ్ఞాన విద్య (జీవశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం)

25 యజ్ఞ విద్య


ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ. ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి తెలుసుకుందాం!*


26 వ్యాపార్ విద్య (వాణిజ్యం)

27 కృషి విద్య (వ్యవసాయం)

28 పశు పాలన విద్య (పశుసంవర్ధక)

29 పక్షి పాలన (బర్డ్ కీపింగ్)

30 యాన విద్య (మెకానిక్స్)

32 వాహనాల రూపకల్పన

33 రతంకర్ (రత్నాలు & ఆభరణాల రూపకల్పన)

36 కుమ్హార్ విద్యా (కుమ్మరి)

37 లఘు (లోహశాస్త్రం & కమ్మరి)

38 తక్కలు

39 రంగ్ విద్యా (డైయింగ్)

40 ఖాట్వాకర్

41 రజ్జుకర్ (లాజిస్టిక్స్)

42 వాస్తుకర విద్యా (ఆర్కిటెక్చర్)

43 ఖానా బనానే కి విద్యా (వంట)

44 వాహన్ విద్యా (డ్రైవింగ్)

45 జలమార్గాల నిర్వహణ

46 సూచికలు (డేటా ఎంట్రీ)

47 గౌషాలా మేనేజర్ (పశుసంవర్ధక)

48 బాగ్వానీ (హార్టికల్చర్)

49 వాన్ విద్యా (అటవీ)

50 సహోగీ ( పారామెడిక్స్).


ఈ విద్య అంతా గురుకులం లోనే బోధించబడింది, కాని కాలంతో పాటు, గురుకులాలను  అదృశ్యము చేసి బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటిని కనుమరుగయ్యేలా చేశారు! ఇది మెకాలేతో ప్రారంభమైంది. ఈ రోజు, మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత  భవిష్యత్తు ఇప్పటికీ నాశనం అవుతోంది.


భారతదేశంలో గురుకుల సంస్కృతి ఎలా ముగిసింది?

కాన్వెంట్ విద్య పరిచయం గురుకులాన్ని నాశనం చేసింది. భారతీయ విద్యా చట్టం 1835 లో ఏర్పడింది (1858 లో సవరించబడింది). దీనిని 'లార్డ్ మెకాలే' రూపొందించారు.


మెకాలే ఇక్కడ విద్యావ్యవస్థపై ఒక సర్వే నిర్వహించగా, చాలా మంది బ్రిటిషర్లు భారతదేశ విద్యా విధానం గురించి తమ నివేదికలను ఇచ్చారు. బ్రిటిష్ అధికారి ఒకరు జి.డబ్ల్యు. లూథర్ మరియు మరొకరు థామస్ మున్రో! వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలను వేర్వేరు సమయాల్లో సర్వే చేశారు. ఉత్తర భారతదేశం (ఉత్తర భారత్) ను సర్వే చేసిన లూథర్, ఇక్కడ 97% అక్షరాస్యత ఉందని, దక్షిణ భారతదేశం (దక్షిణ భారత్) ను సర్వే చేసిన మున్రో ఇక్కడ 100% అక్షరాస్యత ఉందని రాశారు.


భారతదేశం (భారత్) శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే, దాని ′ ′ *దేశీయ మరియు సాంస్కృతిక విద్యావ్యవస్థ*  పూర్తిగా కూల్చివేయబడాలి మరియు దాని స్థానంలో ′ ′ ఆంగ్ల విద్యా విధానం  ఉండాలి అని మెకాలే స్పష్టంగా చెప్పారు మరియు అప్పుడే భారతీయులు శారీరకంగా భారతీయులు అవుతారు , కానీ మానసికంగా ఇంగ్లీష్ వారు అవుతారు. 


వారు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఇంగ్లీష్ విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు, వారు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు పని చేస్తారు.

మెకాలే ఇలా చెప్పాడు -  ఒక పంటను నాటడానికి ముందు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా దున్నుతున్నట్లే, దానిని దున్నుతూ ఆంగ్ల విద్యావ్యవస్థలో తీసుకురావాలి.  అందుకే అతను మొదట గురుకులము చట్టవిరుద్ధమని ప్రకటించాడు. అప్పుడు అతను సంస్కృతాన్ని చట్టవిరుద్ధం అని ప్రకటించి గురుకుల వ్యవస్థకు నిప్పంటించాడు, అందులో ఉన్న ఉపాధ్యాయులను కొట్టి జైలులో పెట్టించాడు.


1850 వరకు భారతదేశంలో '7 లక్షల 32 వేల' గురుకుల & 7,50,000 గ్రామాలు ఉన్నాయి. దాదాపు ప్రతి గ్రామంలో గురుకులము ఉంది మరియు ఈ గురుకులములన్నీ  'ఉన్నత విద్యా సంస్థలు' గా ఉండేవి.  గురుకులములు  ప్రజలు మరియు రాజు చేత  కలిపి నడుపుబడేవి.

విద్యను ఉచితంగా ఇచ్చారు.

గురుకులాలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది. ఆ సమయంలో దీనిని 'ఉచిత పాఠశాల' అని పిలిచేవారు. ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం & మద్రాస్ విశ్వవిద్యాలయం సృష్టించబడ్డాయి. ఈ మూడు బానిస యుగ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి!


మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశారు. ఇది చాలా ప్రసిద్ధ లేఖ, అందులో అతను ఇలా వ్రాశాడు: " కాన్వెంట్ పాఠశాలలు భారతీయుల మాదిరిగా కనిపించే పిల్లలను బయటకు తీసుకువస్తాయి కాని వారి మెదడు ఇంగ్లీషు భావజాలంతో నిండి ఉంటుంది


మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు. వారి సంస్కృతి గురించి వారికి ఏమీ తెలియదు, వారి సంప్రదాయాల గురించి వారికి తెలియదు, వారి జాతి గురించి వారికి తెలియదు, అలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు, బ్రిటిష్ వారు వెళ్లినా, ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు".  ఆ సమయంలో రాసిన లేఖ లో ఉన్న నిజం ఈనాటికీ మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య ద్వారా మన స్వంత భాష మాట్లాడటం మరియు మన స్వంత సంస్కృతిని చూసి సిగ్గుపడటం, మనల్ని మనం తక్కువగా భావిస్తున్నాము. 


మాతృభాష నుండి దూరం కాబడిన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మరియు ఇది మెకాలే యొక్క వ్యూహం! నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు. భారతీయ సంస్కృతిని గొప్పతనం తెలుసుకోండి.


 మన భారతీయ సంస్కృతి , వారసత్వాన్ని   తిరిగి పొందే సమయం ఇది.


_మెగా మైండ్స్

'నౌకాగ్రకాకవత'

 'నౌకాగ్ర కాకవత'

కాకులకు గల సహజ గుణం ఒకచోట వాలి కొంతసమయం ఉండి మరల లేచి ఇంకొక చోటికి వెళ్ళుతాయి.  అంటే ఒకచోట స్థిరంగా వుండవు.  అలాగే ఒక కాకి ఒక నౌకమీద అంటే నౌకమీద వుండే స్తంభం మీద వాలిందట కొంతసమయం అది అక్కడ వున్నది.  కానీ కాకికి తెలియకుండా ఒక సంఘటన జరిగింది అదేమిటంటే  ఆ నౌకని నడిపే నావికుడు అతివేగంగే నౌకను సముద్రంలోకి తీసుకొని వెళ్ళాడు. ఈ విషయం తెలియని కాకి తన స్వభావానుసారం నౌక స్తంభం మీదినుంచి లేచి ఇంకొక చోటికి వెళ్ళటానికి యెగిరి వెళ్ళింది.  కానీ దానికి ఆ స్తంభం తప్పించి ఆ పరిసరాలలో ఎత్తయిన ప్రదేశం అంటే భవంతులు కానీ, చెట్లు కానీ ఏవి కనుచూపు మేరలో కనిపించలేదు.  అంతే కాదు చుట్టూ లోతయిన సముద్రం.  పొరపాటున సముద్రంలో పడితే అంతం తప్పదు. కొంచం సేపు గాలిలో యెగిరి మరలా ఆ నౌక స్తంభంమీదనే వాలింది. కొద్దిసేపయినా తరువాత తన సహజ స్వభావంతో మరల గాలిలో యెగిరి అంతటా తిరిగి చూసింది కానీ పరిస్థితి అట్లానే వున్నది. అలాగ మరలా మరలా తిరిగి తిరిగి చివరకు తెలుసుకున్నది తనకు ఆ నౌక స్తంభం తప్ప వేరే ఆధారం లేదని.  కానీ ఈ విషయం తెలుసుకోవటానికి ఆ కాకి చాలాసార్లు ఆ నౌక స్తంభం మీది నుంచి లేచి గాలిలో ఎన్నో సార్లు తిరిగిన తరువాత కానీ తనకు ఆ నౌక స్తంభం తప్ప వేరే గతి లేదని తెలుసుకోగలిగింది. కాబట్టి 

సాధక మన మనస్సు కూడా ఆ కాకి లాంటిదే ఎప్పుడు ఒక చోట నిలువదు ఒకచోటి నుండి ఇంకొక చోటికి అంటే ఒక విషయం మీదనుండి ఇంకొక విషయం మీదకు వెళుతూ ఉండటం దాని సహజ లక్షణం.  ఆ లక్షణాన్ని వదిలి దానికి భగవంతుడు తప్ప ఇతర విషయాలు లేవనేవిధంగా సాధకుడు సద దైవ జ్యానంలో ఉండాలి ఎలాగంటే కాకికి ఒక్క నౌక స్తంభం తప్ప ఇంకొకటి కనపడనట్లు సాధకుని మనస్సుకు భగవంతుడు తప్ప ఇంకొక విషయం లేదు అనే విధంగా సాధకుడు ప్రవర్తిస్తే సాధకుని మనస్సు సదా భగవంతుని మీదనే  ఉంటుంది. కాకపొతే ఇది చెప్పినంత సులువు కానే  కాదు. అతి కఠోరమైన, నిరంతమైన కఠోర తప్పస్సు చేస్తేనే అది సాధ్యం.  నేను ఆలా చేయగలనా అనే సందేహం ప్రతి సాధకునికి కలుగుతుంది.  కానీ మిత్రమా నిత్య దీక్షాపరుడైన సాధకుడు తప్పకుండా సాధించగలడు. అరిషడ్వార్గాలను వదిలి ఇప్పుడే సాధన మొదలు పెట్టు తప్పకుండా నీ లక్ష్యం నెరవేరుతుంది.  ఎందుకంటె సదా సర్వేశ్వరుడు సాధకునితోటె ఉంటాడు.  

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః