20, మే 2023, శనివారం

శ్రీమద్రామాయణము

 శ్రీమద్రామాయణము 

బాలకాండము

మొదటి సర్గము  లోని ‘సంక్షిప్త రామాయణం’ (2/5)

(పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణం నుండి)


*నారదుడు వాల్మీకికి రామకథ సంక్షిప్తముగా తెలుపుట.*


ముల్లోకసంచారి యగు నారదుడు , వాల్మీకి మాటలను విని సంతోషించి “చెప్పెదను వినుము.” అనుచు ఇట్లు చెప్పెను.

“ఓ వాల్మీకిమునీ! నీవు చెప్పిన అనేకమైన ఈ సద్గుణములు సామాన్య మానవులకు దుర్లభమైనవి. అయిననూ అట్టి గుణములన్నీ ఉన్న ఒక మహాపురుషుని గుర్తించి చెప్పెదను. వినుము.


_రాముని గుణవర్ణన_

ఇక్ష్వాకువంశమునందు జన్మించిన రాముడు లోకమంతటా ప్రసిద్దుడు. అతడు మనోనిగ్రహవంతుడు. గొప్ప పరాక్రమము, కాంతి, ధైర్యము కలవాడు. ఇంద్రియములను వశములో ఉంచుకొన్నవాడు. 

రాముడు బుద్ధి, నీతి, మాటలాడుటలో నేర్చు, ఐశ్వర్యము కలవాడు. శత్రువులను నశింపచేయువాడు. అతని మూపులు విశాలమైనవి. బాహువులు దీర్హములై బలిసి ఉన్నవి. కంఠము శంఖమువలె ఉండును. చెక్కిళ్ళ పైభాగము ఉన్నతముగా ఉండును. అతని వక్షస్థలము చాల విశాలమైనది. అతడి ధనుస్సు చాల గొప్పది. అతని మూపుల సంధులు పైకి కనబడవు. శత్రుసంహారకుడైన అతని బాహువులు మోకాళ్ళను స్పృశించునంతగా దీర్హమైనవి. అతడి నడక చూడముచ్చటగా ఉండును. అతడి శిరస్సూ, లలాటమూ కూడ మంచి లక్షణముతో ఒప్పుచుండును. 


అతడి శరీరము హెచ్చు తగ్గులు లేక సమముగా విభజింపబడిన అవయవములతో శోభించును. అతని శరీరము, మరీ పొట్టిగా గాని, పొడవుగా గాని కాకుండగా సమముగా ఉండును. అతడి శరీరపు ఛాయ చాల చక్కనిది. తేజస్సు ప్రశంసనీయమైనది. వక్ష్యస్టలము కండలు తేరి ఉండును. నేత్రములు విశాలమైనవి. అవయవాల శోభ ప్రశస్తమైనది. సాముద్రిక శాస్త్రములో చెప్పిన శుభలక్షణములన్నీ ఆతని శరీరములో కనబడును. 

అతడు సకల ధర్మములు తెలిసినవాడు. ఆడిన మాట తప్పనివాడు. ఎల్లప్పుడూ ప్రజల హితమునే కోరుచుండును. అతడు యశస్సు కలవాడు. అన్ని విషయములు తెలిసినవాడు. పరిశుద్ధమైనవాడు-వ్యవహారములలో ఎన్నడూ ఎవరినీ మోసము చేయనివాడు. 

శ్రీమంతుడైన ఆ రాముడు బ్రహ్మదేవునితో సమానుడు. అందరినీ పోషించువాడు. శత్రువినాశకుడు. సమస్త ప్రాణీసముదాయమును రక్షించువాడు. ధర్మసంరక్షకుడు. 

అతడికి వేదవేదాంగముల రహస్యములన్నీతెలుసు. ధనుర్వేదములో అతడి ప్రావీణ్యము సాటిలేనిది. 

సకల శాస్త్రముల సారము తెలిసిన ఆ రాముని జ్ఞాపకశక్తి, ప్రతిభ చాల ప్రశంసనీయమైనవి. అతడు సకల ప్రజలకు ఇష్టుడు. సాధుస్వభావం కలవాడు. మనస్సులో ఎన్నడూ దైన్యమెరుగనివాడు. పనులలో మంచి నేర్పు కలవాడు.


నదులు సముద్రమును చేరినట్లు సత్పురుషులందరు ఎల్లవేళలా అతనిని చేరుచుందురు. ఈ విధముగా అతడు ఆర్యుడు, అనగా ప్రతి ఒక్కరూ దగ్గరికి చేరవలసిన పురుషుడు. అందరివిషయమునందు సమముగా ప్రవర్తించువాడు. అతడి దర్శనము అందరికీ, ఒకే విధముగా, ఎల్లవేళలా ఆనందజనకమైనది. 

కౌసల్యానందవర్ధనుడైన ఆ రాముదొక్కడే సకలగుణములకు నిలయమైనవాడు. అతడు గాంభీర్యములో సముద్రమువంటివాడు. ధైర్యములో హిమవత్పర్వతమువంటివాడు. ఆతని మనస్సులోని భావము ఏమిటో ఎవ్వరూ గ్రహింపజాలరు. అతని మానసిక స్థైర్యాన్ని ఎవరూ కదల్పజాలరు. 


అతడు పరాక్రమములో విష్ణువుతో సమానుడు. చూచువారికి ఆనందము కలిగించుటలో చంద్రునివంటివాడు. క్రోధము వచ్చినచో ప్రళయకాలాగ్నితో సమానుడు. ఓర్పులో భూమితో సమానుడు. దానం చేయుటలో కుబేరునివంటివాదు. సత్యము విషయంలో సాక్షాత్తు రెండవ ధర్మదేవతయే. శ్రీమద్రామాయణము 

బాలకాండము

మొదటి సర్గము  లోని ‘సంక్షిప్త రామాయణం’ (3/5)

(పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణం నుండి)


*నారదుడు వాల్మీకికి రామకథ సంక్షిప్తముగా తెలుపుట.*


*కైక వరములు*

దశరథుడు ప్రజలకు హితము చేయవలెనను కోరికతో, సమస్త సద్దుణసంపన్నుడును, అమోఘములగు బలపరాక్రమములు కలవాడును, ఎల్లప్పుడును ప్రజల హితమునే కోరుచుందువాడును, తనకు ప్రీతిపాత్రుడును అగు జ్యేష్టకుమారుడైన రాముని యువరాజుగా చేయగోరెను. 


దశరథుని రాణులలో కైకేయి ఒకతె. పూర్వమెప్పుడో దశరథుడు ఆమెకు రెండు వరములు ఇచ్చియుండెను. రామాభిషేకముకొరకు సేకరించిన సంభారములను చూచి ఆమె తనకిచ్చిన వరములలో ఒక వరముగా రాముని అరణ్యమునకు పంపవలెననియు, రెండవ వరముగా భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెననియు దశరథుని కోరెను. 


దశరథుడు సత్యవాక్పాలన నియమము గలవాడు. అందుచే ధర్మపాశబద్దుడై తన ప్రియపుత్రుడైన రాముని అరణ్యములకు పంపెను. రాముడు, కైకేయికి సంతోషము కలిగించుటకై తండ్రి మాటమా(త్రముగా చెప్పినంతనే దానిని ఆజ్ఞగా గ్రహించి, తన ప్రతిజ్ఞను నిలుపుకొనుచు అరణ్యమునకు వెళ్ళెను. 


లక్ష్మణుడు రామునికి చాల ఇష్టుదైన తమ్ముడు. అతనియందు సహజమైన ప్రేమ కలవాడు. వినయసంపన్నుడు. అతడు తన భ్రాతృస్నేహమును చూపుచు అరణ్యమునకు పోవుచున్న ఆ రామునివెంట వెళ్లెను. ఇట్లు ఉత్తమమైన కార్యము చేయుటచే తల్లియగు సుమిత్రకు కూడ ఆనందమును వృద్ధిపొందించెను. 


*సీత వర్ణన*

జనకుని వంశమునందు పుట్టినదియు, రామునికి భార్యయు, దశరథునికి కోడలు అయిన సీత రామునకు చాల ఇష్టురాలు. ప్రాణము వంటిది. ఆమె సర్వదా రామునకు హితమునే చేయుచుండును. రాక్షసులను మోహింపచేయుటకై సృజింపబడిన దేవమాయవలె లోకోత్తరమైన సౌందర్యము కలది. సాముద్రికశాస్తములో చెప్పిన మంచిలక్షణము లన్నియు ఆమెయందు ఉన్నవి. స్త్రీలలో ఉత్తమురాలైన ఆ సీత కూడ, రోహిణి చంద్రుని అనుసరించినట్లు, ఆ రామచంద్రుని అనుసరించి వెళ్లిను. 


*రాముడు అయోధ్యను వీడుట*

పౌరులును, దశరథుడును వనవాసమునకు వెళ్ళుచున్న రామునివెంట చాల దూరమువరకు వెళ్ళిరి. ధర్మాత్ముడైన రాముడు గంగాతీరమునందు, శృంగిబేరపురము అనెడు పట్టణములో బోయజాతివారికి ప్రభువైన గుహుని కలుసుకొనెను. అచటినుండి రాముడు తన సారథియెన సూతుని వెనుకకు పంపివేసెను. 

సీతారామలక్ష్మణులు ఒక వనమునుండి మరొక వనము చేరుచు, గొప్ప గొప్ప నదులను దాటుచు, భరద్వాజమహర్షి ఆదేశము ప్రకారము చిత్రకూటపర్వతమును చేరిరి. అచట పర్ణశాల నిర్మించుకొని దేవగంధర్వులవలె సుఖముగా నివసించిరి. 


రాముడు చిత్రకూటమునకు వెళ్ళిన పిమ్మట దశరథుడు పుత్రశోకముచేత పీడితుడై, పుత్రునిగూర్చి విలపించుచు స్వర్గస్థుడయ్యెను. 


దశరథుడు మరణించిన పిదప వసిష్టాదులు రాజ్యము చేయుమని భరతుని ఆజ్ఞాపించిరి. తనకు రాజ్యము చేయు సామర్ధ్యమున్నను, భరతుడు రామునిపై నున్న గౌరవముచే రాజ్యమును పాలించుటకు ఒప్పుకొనలేదు. 


రాగద్వేషాదులు జయించిన భరతుడు రాముని అనుగ్రహింప చేసుకొనుటకై అరణ్యమునకు వెళ్ళి, వినయముతో సుమహాత్ముడును, సత్యవ్రతుడును, తన సోదరుడును అగు రాముని చేరి, “నీవు సమస్తధర్మములు తెలిసినవాడవు. అందుచేత నీవే రాజువు కావలెను.” అని ప్రార్ధించెను.


రాముడు తనను ఆశ్రయించినవారి పట్ల సుముఖుడై వారి కోరికలన్నియు తీర్చును. అంతటి మృదుస్వభావుదైనను రాముడు, తండ్రియాజ్జను అనుసరింపవలెనను దీక్షవహించి యుండుటవలన భరతుడు ఎంత ప్రార్ధించినను రాజ్యమును స్వీకరించుటకు అంగీకరించలేదు. 

“నేను వచ్చునంతవరకును నా పాదుకలను నా ప్రతినిధిగా భావించి రాజ్యము చేయుటకై నీవద్ద ఉంచుకొనుము.” అని చెప్పి, తన పాదుకలను భరతునకిచ్చి, రాముడు అతనికి అనేకవిధముల బోధించి అయోధ్యకు పంపెను. 


రాముని తిరిగి తీసికొని వెళ్లవలెనన్న కోరిక తీరని భరతుడు ఆ రామపాదుకలనే సేవించుచు, రాముడు సుఖముగా తిరిగి రావలెనని మనస్సులో కోరుకొనుచు, అయోధ్యాసమీపమున నున్న నంది గ్రామము అనెడు గ్రామములో నివసించి రాజ్యపాలనము చేసెను. శ్రీమద్రామాయణము 

బాలకాండము

మొదటి సర్గము  లోని ‘సంక్షిప్త రామాయణం’ (4/5)

(పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణం నుండి)


*నారదుడు వాల్మీకికి రామకథ సంక్షిప్తముగా తెలుపుట.*


*దండకారణ్యము*

భరతుడు వెళ్లగానే రాముడు, అయోధ్యాపౌరులును భరతాదులును మాటిమాటికి ఆ చిత్రకూటపర్వతమునకు వచ్చుచుందురు అని ఊహించి, పిత్రాజ్ఞాపాలనమునందు సావధానుడై దండకారణ్యమున ప్రవేశించెను. 

దండకారణ్యమును ప్రవేశించిన వెంటనే రాముడు విరాధుడను రాక్షసుని చంపి, శరభంగ - సుతీక్ష్ణ - అగస్త్యమహర్షులను, అగస్త్యుని సోదరుని చూచెను. అగస్త్యుడు తనకు ఇంద్రుడిచ్చిన ధనుస్సును, ఖద్గమును, తరగని బాణములుగల అమ్ములపొదులను రామున కీయగా అతడు సంతోషముగా వానిని గ్రహించెను. 

రాముడు శరభంగమహర్షి ఆశమములో నివసించుచుండగా ఆ చుట్టుప్రక్కలనున్నబుషులందరును, “అసురులను, రాక్షసులను సంహరింపుము.” అని ప్రార్ధించుటకై ఆతనివద్దకు వచ్చిరి. 

రాక్షసనివాసమైన ఆ అరణ్యములో అచ్చటి బుషులు చేసిన ప్రార్ధనను రాముడు అంగీకరించెను. “యుద్ధములో రాక్షసులను సంహరించెదను.” అని అగ్నితుల్యతేజస్సులైన ఆ దండకారణ్యవాసులైన మునులకు మాట ఇచ్చెను. 


*శూర్పణఖ*

దండకారణ్యములో జనస్థానము అను ప్రదేశములో నివసించు కామరూపిణియగు శూర్చణఖ అను రాక్షసిని ముక్కుచెవులు కోసి విరూపిణిగా చేసెను. 


శూర్చణఖ విరూపితయైన పిమ్మట ఆమె మాట విని యుద్ధమునకు వచ్చిన ఖరుని, త్రిశిరసుని, దూషణుని, వారి అనుచరులైన సకలరాక్షసులను రాముడు యుద్ధమునందు సంహరించెను. దండకారణ్యమునందు నివసించునపుడు రాముడు జనస్థానములో నివసించు రాక్షసులలో పదునాలుగువేలమందిని సంహరించెను. 

తన జ్ఞాతుల మరణవార్త వినిన రావణుడు మిక్కిలి కోపించి తనకు సాహాయ్యము చేయుమని మారీచుడను రాక్షసుని కోరెను, 


“రావణా! బలవంతుడైన రామునితో వైరము పెట్టకొనకుము.” అని మారీచుడు రావణుని అనేక పర్యాయములు వారించెను. మృత్యువు సమీపించి ఉండుటచే రావణుడు మారీచుని మాటలు వినలేదు. అతనిని వెంటబెట్టుకొని రాముని ఆశ్రమమునకు వెళ్లెను. 


*సీతాపహరణ*

మాయావియైన మారీచునిద్వారా రామలక్ష్మణులను పర్జశాలనుండి చాలదూరము వెళల్లిపోవునట్లు చేసి, రావణుడు రాముని భార్యయగు సీతను అపహరించెను. ఆమెను విడిపించుటకై వచ్చిన జటాయువును వధించెను. 

ప్రాణములు విడుచుటకు సిద్ధముగా ఉన్న జటాయువును రాముడు చూచెను. సీతను రావణుడు అపహరించినట్లు జటాయువు చెప్పగా విని, రాముడు మిక్సిలి దుఃఖితుదై ఇంద్రియములను వశములో ఉంచుకొనజాలక విలపించెను. 

రాముడు జటాయువునకు దహనసంస్కారము చేసెను. 


*కబంధుడు*

పిమ్మట సీతకై వెదకుచు, ఆ వనములో వికృతమైన ఆకారముతో, భయంకరముగా ఉన్న కబంధుదనెడి రాక్షసుని చూచెను. బలిష్టములైన బొహువులుగల రాముడు ఆ కబంధుని చంపి దహనసంస్కారము చేయగా అతడు స్వర్గమునకు వెళ్లెను. 


అతడు స్వర్గమునకు పోవుటకు ముందు, “రామా! ధర్మమును ఆచరించుటయందు నేర్పు కలదియు, ధర్మమును ఆచరించునదియు అగు ఒక శబర స్రీ సన్న్యాసాశమమును స్వీకరించి ఈ ప్రాంతమునందే యున్నది. ఆమె వద్దకు వెళ్ళుము.” అని చెప్పెను. 

రాముడు శబరి వద్దకు వెళ్లెను. శబరి ఆ రాముని చక్కగ పూజించెను. 


*హనుమత్సుగ్రీవుల పరిచయము*

రాముడు పంపాసరోవరతీరమున హనుమంతునితో పరిచయ మేర్చరచుకొని పిదప ఆతని మాట ప్రకారము సుగ్రీవునితో స్నేహము చేసికొనెను. రాముడు తన వృత్తాంతమునంతను మొదటి నుండియు సుగ్రీవునకు, హనుమంతునకు చెప్పెను, సీతావృత్తాంతమును విశేషించి తెలిపెను. సుగ్రీవుడు రాముని వృత్తాంతమంతయు విని, అగ్నిసాక్షికముగా రామునితో మైత్రి చేసికొనెను. 


“నీకును వాలికిని విరోధమెట్లు ఏర్పడినది?” అని రాముడు ్రశ్నింపగా, సుగ్రీవుడు దుఃఖించుచు, స్నేహముతో రామునకు ఆ వృత్తాంతమునంతయు తెలిపెను. వాలిని చంపెదనని రాముడు ప్రతిజ్ఞ చేసెను. సుగ్రీవుడు కూడ రామునకు వాలియొక్క బలమును వర్ణించి చెప్పెను.


*రామునికి పరీక్షలు*

సుగ్రీవుడు రాముని చూచినది మొదలు, “ఇతడు వాలిని చంపుటకు సమర్ధుడో, కాడో” అని సందేహించుచుందెను. అతడు రాముని విషయమున తనకు నమ్మకము కలుగుటకై, కొండవలెనున్న దుందుభి యను రాక్షసుని కళేబరమును రామునకు చూపెను.


ఊహింపరాని బలము కల రాముడు ఎముకల పోగయి ఉన్న ఆ దుందుభి కళేబరమును చూచి, “ఇది ఎంత?” అన్నట్లు నవ్వి దానిని తన కాలి బొటనవేలితో ఎత్తి పదియోజనముల దూరము పడునట్లు విసరెను. సుగ్రీవునకు ఇంకను నమ్మకము కలుగుటకై ఒకే బాణముచే ఏడు మద్దిచెట్లను, ఒక పర్వతమును, పాతాళమును కూడ భేదించెను. 

రాముడు ఆ పనులు చేసిన పిమ్మట సుగ్రీవునకు నమ్మిక కుదిరెను. తనకు రాజ్యము లభించునని అతడు సంతసించి, రాముని వెంటబెట్టుకొని గుహవలె నున్న కిష్కింధాపట్టణమునకు వెళ్లిను. 


*వాలివధ*

కిష్కింధ ప్రవేశించి సుగ్రీవుడు గర్జించెను. ఆ మవానాదమును విని వాలి గృహమునుండి బయటకు వచ్చెను. యుద్ధమునకు వెళ్లవద్దని నివారించుచున్న తారను ఒప్పించి, వాలి సుగ్రీవునితో యుద్ధమునకు తలపడెను. అచట రాముడు ఒక్క బాణముతో వాలిని చంపెను. అనంతరము సుగ్రీవుని వానరరాజ్యమునందు పట్టాభిషిక్తుని చేసెను.

విభూతి ( భస్మం )....!

 🎻🌹🙏 విభూతి ( భస్మం )....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿హోమంలో దర్బలు, ఇతర హోమ వస్తువులు దహించగా మిగిలిన హోమభస్మాన్ని విభూతి అని కూడా అంటారు. చాలా పవిత్రంగా భావించబడే విభూతి ( భస్మం ) ప్రతి శివాలయంలోనూ తప్పక ఉంటుంది.


🌸వేదములు, పురాణములు ఏకకంఠముతో విభూతి యొక్క మాహిమను చాటుచున్నవి. భస్మ స్నానము చేసినవారు సర్వతీర్ధాలు చేసినవారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగ్ను. బాహ్య ప్రపంచ జ్ఞానం కలుగును. 


🌿విభూది నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిచుచుండిన లలాటమున్ బ్రహ్మవ్రాసిన వ్రాత కూడా తారుమారగును.


🌸అగ్నికి దహించే గుణం ఉంది. కట్టెలు, పిడకలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉద్భవించిన విభూతి, ఆ రెండు గుణాలనూ త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది. 


🌿విభూతి దహించదు, దహనమవదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంది. హోమగుండంలో హోమం చేసినప్పుడు, ధునిలో కొబ్బరికాయలు మొదలైనవి భస్మం అయినప్పుడు వచ్చిన బూడిదను విభూతి అంటారు.


🌸 హోమగుండం, ధుని – రెండూ పరమ పవిత్రమైనవి. హోమగుండంలో మోదుగ, రావి సమిధలు, ఆవునెయ్యి ఉపయోగిస్తారు. ధునిలో పీచు తీయని కొబ్బరికాయలు (Hairy Coconuts), పిడకలు (cakes made of cows dung), రావి, తులసి, మేడి చెట్ల కొమ్మలు (Pieces of Peepal, Tulasi and Medi), నవధాన్యాలు (Nine different grains), 


🌿గంధపుచెక్కలు (Pieces of Sandal wood), నేరేడు (Camphor ), సాంబ్రాణి (Sambrani), ఆవునెయ్యి (Cows ghee ), సాంబ్రాణి sambrani powder), అగరొత్తులు (Incense Sticks) వేస్తారు. ఇవన్నీ కాలగా మిగిలిన బూడిద విభూతి. విభూతిని విషెషమైన ఐష్వర్యము అని అందురు.


🌸విభూతి ధరించే విధానం

కుడిచేతి మధ్యమ, అనామికా వేళ్ళ సాయంతో విభూతిని చేతిలోకి తీసుకోవాలి. నుదుటిపై పెట్టుకోవడం కూడా ఎడమవైపు నుండి కుడివైపుకు విభూతి రేఖలు తీర్చిదిద్దాలి. 


🌿అప్పుడు అంగుష్టముతో విభూతి రేఖలపై కుడివైపు నుండి ఎడమవైపుకు మూడు రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం. 


🌸విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని కనుబొమ్మల క్రిందికిగాని ధరించకూడదు. విభూతిధారణ దేవతాపూజ, జపము, యజ్ణ్జము, హోమము, శుభకార్యముల్లో ధరించిన కార్యములు సిద్ధించును. తప్పక ధరించవలెను. విభూతి భస్మం, తిలకం కాని నొసట ధరించనిదే భగవంతుని తీర్ధప్రసాదములు స్వీకరించ కూడదు.


🌷విభూతి పేర్లు - వర్ణములు🌷


🌿1. భస్మం - శ్వేత వర్ణము


🌸2. విభూతి - కపిల వర్ణము,


🌿3. భసితము -కృష్ణ వర్ణము


🌸4. క్షారము - ఆకాశ వర్ణము


🌿5. రక్షయని - రక్త వర్ణము


🌸కొన్ని విశ్వాసాలు

హోమ భస్మం (విభూతి) ధారణతో నవగ్రహ బాధలు తొలగిపోతాయి.


🌿హోమ భస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడతాయి.

హోమ భస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పనులు నిరాటకంగా జరుగుతాయి.


🌸భస్మ ధారణతో అన్ని రకాల గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాలు తొలగిపోతాయి.

వివిధ హోమభస్మాలు చేసే మేలు:


🌷1.శ్రీ మహాగణపతి 🌷


🌿హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి.


🌷2.శ్రీ సుబ్రహ్మణ్య స్వామి 🌷


🌸హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది.


🌷3.శ్రీ దుర్గా 🌷


🌸హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు.


🌷4.శ్రీ ధన్వంతరి 🌷


🌿 హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్రసమానంగా మారుతుంది.


🌷5.శ్రీ నవగ్రహ  🌷


🌸హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు.


🌷6.శ్రీ మహా మృత్యుంజయ 🌷


🌿హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి.


🌷7.శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి హోమం, 🌷


🌸శ్రీ చక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి వుంటారు.


🌷8.శ్రీ సుదర్శన 🌷


🌿 హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది.


🌷9.శ్రీ లక్ష్మీ నారాయణ  🌷


🌸హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి.


🌷10.హోమ 🌷


🌿 భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు.


🌸గమనిక : హోమభస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు.


🌷విభూతి స్నానం :🌷


🌿స్నానం అంటే ఒంటి మీద నీళ్ళు పోసుకోవడం. ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు.


🌸ఏ వస్తువైనా సంపూర్ణంగా కాలితే మిగిలేది భస్మం, లేదా బూడిద. కాలడానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్థం.


🌿 రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి ఉండాలి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా ఉండాలి. అప్పుడు ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం.

19, మే 2023, శుక్రవారం

కర్మ - జన్మ*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*కర్మ - జన్మ*  

                                               

                      

1891లో ఓ వర్షం రాత్రి ఒంటిగంటకి అమెరికాలో ఫిలడెల్ఫియలోని బ్రాడ్ స్ట్రీట్లో ఉన్న డిలియన్ హోటల్లోకి విలియం, తన భార్యతో వెళ్ళి ఓ గది కావాలని అడిగాడు.


"సారీ! మా హోటల్లోని ఇరవై నాలుగు గదులు ఫిలప్ అయిపోయాయి. మీరు ముందే రిజర్వేషన్ చేసుకోవాల్సింది." జవాబు చెప్పాడు హోటల్ మేనేజర్ జార్జ్ సి బోల్ట్.


ఆ దంపతులు ఇద్దరూ కాసేపు తమలో తాము ఏం చెయ్యాలని చర్చించుకుని తలుపు వైపు వెళ్తుంటే జార్జ్ వాళ్ళతో చెప్పాడు.


"వర్షంలో ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తారు? మీరు నా గదిలో ఈ రాత్రికి


విశ్రమించి రేపు వేరే హోటల్ చూసుకోండి."


వారిద్దరూ కౌంటర్ వెనక ఉన్న అతని చిన్న గదిలోని మంచం మీద ఆ రాత్రి నిద్రపోతే, జార్జ్ రిసెప్షన్ హాల్లోని సోఫాలో నిద్రపోయారు. మర్నాడు ఉదయం అతనికి ఆ దంపతులు తమ కృతజ్ఞతలని తెలియచేసి వెళ్తుండగా భర్త చెప్పాడు."ఓ పెద్ద హోటల్ని నడిపే సామర్ధ్యం గల వ్యక్తివి నువ్వు, నీకోసం ఓ హోటల్ని కట్టి నిన్ను దానికి మేనేజర్ని చేస్తాను."


అది జోక్ అన్నట్లుగా ముగ్గురూ నవ్వు కున్నారు. రెండేళ్ళ తర్వాత పోస్టులో జార్జికి వచ్చిన ఓ ఉత్తరంలో, ఆ వర్షం రాత్రి అతను తమ మీద చూపించిన దయని గుర్తు చేస్తూ, తన మాట ప్రకారం ఓ హోటల్ని కట్టానని, ఓసారి. న్యూయార్కి రమ్మని ఆహ్వానిస్తూ విలియం రాసిన ఉత్తరం ఉంది. దానికి ఫిలడెల్ఫియా నించి న్యూయార్కి రిటర్న్ టిక్కెట్ కూడా జత చేసి ఉంది. జార్జ్ అది ప్రాక్టికల్ జోక్ అనుకున్నాడు కాని, టిక్కెట్ ఉండటంతో వెళ్ళిరావడంలో తప్పు లేదనుకుని వెళ్ళి విలియంని కలిసాడు. విలియం అతన్ని న్యూయార్క్ ఫిఫ్త్ అవెన్యూ, తర్టీ ఫోర్త్ స్ట్రీట్లో ఉన్న ఎర్ర రాయితో కట్టిన ఓ పెద్ద భవంతిని చూపించి చెప్పాడు.


"జార్జ్  నీ కోసం కట్టిన హోటల్ ఇదే. నిన్ను దీనికి మేనేజర్ని చేస్తున్నాను."


అది హోటల్ వాల్డ్రోఫ్ . అదే నేటి న్యూయార్క్ లోని నాలుగు వందల గదులు, వెయ్యి మంది ఉద్యోగస్థులు గల ఫైవ్ స్టార్ హోటల్ వాల్ డ్రోఫ్ ఆస్టర్ హోటల్. ఓ చిన్న హోటల్లో మేనేజర్ గా పని చేసిన జార్జ్ ఓ వర్షం రాత్రి చేసిన ఓ నిస్వార్ధ సేవ ఫలితం తర్వాతి జన్మలకి వాయిదా పడకుండా ఈ జన్మలోనే దాని ఫలితాన్ని చూపించింది. అనువైన వాతావరణం ఉంటే కర్మ ఎప్పుడూ వాయిదా పడదు.


త్వరలోనో లేదా కొద్ది కాలం తర్వాత మనం పాతిన విత్తనం నించి వచ్చిన పైరుని మనం తప్పక కోసుకుంటాం అని,  ప్రేమని నాటితే ప్రేమని, మంచితనాన్ని నాటితే మంచితనాన్ని, ద్వేషాన్ని నాటితే ద్వేషాన్ని, సహాయాన్ని నాటితే సహాయాన్ని కోసుకుంటాం అని ఆనాటి ఈ రెండు సంఘటనలు ఋజువు చేస్తున్నాయి.

*సేకరణ:- హందాడి గణేశ్ వాట్సాప్ పోస్ట్.*

అందరితో కలిసి దర్శనం చేసుకుంటే

 1) VIP & VVIP దర్శనాలు రద్దు చేయాలి. కారణం వారికి అందరితో కలిసి దర్శనం చేసుకుంటే సామాన్య ప్రజల సాధక, బాధకాలు తెలుస్తాయి.

2) అన్య మతస్థులను హిందూ దేవాలయాల నుండి వేరొక శాఖకు బదిలీ చేయాలి. వారి స్థానంలో పేద హిందూ కుటుంబాలకు అవకాశం కల్పించాలి.

3) హిందూ దేవాలయాలలో రాజకీయ జోక్యం ఉండరాదు.

4) దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది రద్దు చేయాలి.

5 ) అర్చకులకు, వేదపండితులను ప్రతి దేవాలయంలోను నియమించాలి.

6) జీర్ణమవుతున్న పురాతన దేవాలయాలను పునరుద్ధరణ చేయాలి.

7) ప్రతి దేవాలయంలో " గోశాలల" ఏర్పాటు చేయాలి. అలాగే "వేదపాఠశాలలు" ఏర్పాటు చేయాలి.

8) ప్రతి గ్రామంలో అర్చకులని సరైన వేతనాలతో నియమించాలి.

9) ఉచిత దైవదర్శనం ఏ ఆలయంలోనైనా ఉండాలి. దీనిపై పన్ను విధించరాదు.

10) ఆలయ పరిశుభ్రత,పరిరక్షణ గురించి అందరికీ అవగాహన కల్పించాలి.

11) బాగా ఆదాయం వస్తున్న ఆలయాల మిగులు ధనంతో గ్రామీణ ప్రాంత ఆలయాలను ఉన్నత స్థాయికి తీసుకురావాలి.

12) దేవాలయ మాన్యాలు అన్నీ రక్షించాలి.

అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్త వహించాలి.

13) ప్రతి దేవాలయం నిత్యం ధూప,దీప, నైవేద్యాలతో కళకళలాడుతూ ఉండాలి.

14) ప్రతి దేవాలయానికి పుష్కరిణి ఏర్పాటు చేయాలి.

15) యాత్రికులకు వసతి సౌకర్యాలు కల్పించాలి.

16) ప్రతి దేవాలయ నిర్మాణం ఆగమశాస్త్ర పండితులతో, మఠాధిపతిలతో సలహాలు సూచనలు తప్పకుండా పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగాలి.

17) పెద్ద దేవాలయాలలో E.O లు చక్కగా చదువుకున్నవారు, హైందవ సనాతన ధర్మాన్ని గురించి తెలిసినవారిని నియమించాలి.

18) సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాల గురించి, శ్లోకాలను ప్రతి దేవాలయం గోడలపై చెక్కించాలి.




https://kutumbapp.page.link/KkWqDsNZ6A1MQBkG7?ref=F4LTY

వైకుంఠమే

 *శ్రీకృష్ణ అవతారంలోని సమస్త వైభవం*


*సమస్త దేవతలు ఈ భూమి పైకి వచ్చారు* 

*శ్రీకృష్ణ అవతారంలో*


1 బ్రహ్మ మానస పుత్రిక  దేవకి

2 వేదములే .వాసుదేవుడు

3 వేదార్థ మే  శ్రీకృష్ణుడు

4 గోవులు గోపికలు  రుక్కులు

5 గోవులని కట్టే కర్ర బ్రహ్మ

6 ఎదురు కర్ర రుద్రుడు

7 శిఖరం ఇంద్రుడు

8 దేవతలు స్నేహితులు

9 గోకుల వాసమే వైకుంఠం

10 అన్ని చెట్లు మహారుషులు

11 రాక్షసులు లోభము క్రోధము భయము

12 తిరస్కరింపబడేవాడే కలి

13 మాయా రూపం ధరించిన గోపుడు  శ్రీహరి

14 బలరాముడు  ఆదిశేషుడి

15 శాశ్వత పరబ్రహ్మమే శ్రీకృష్ణుడు

16 పదహారు వేల మంది స్త్రీలు రుక్కులు

17 చాణురామల్లుడే ద్వేషం

18 ముష్టి కుడే మాత్సర్యం

19 కువలయ పిడమనే ఏనుగు దర్పం 

20 బకాసురుడే గర్వం 

21 దమయే రోహిణి మాత

22  సత్యభామ భూదేవి

23 ఆఘసూరుడే  మహా వ్యాధి

24 కంస రాజు కలి దేవత

25 సుధాముడు శమం 

26 అక్రూరుడు సత్యం 

27 ఉద్భవుడు  ధమము

28 పాలసముద్రంలో పుట్టినది శంఖము మేఘ ధ్వని

29 శ్రీలక్ష్మి విష్ణువులే పాలసముద్రం

30 పాల సముద్రం మీద క్రీడించు వాడు బాలుడు శ్రీహరి శత్రుసంహారం నిద్ర సంరక్షణ భూతదయ గలవాడు

31 చమరం ధర్మదేవత

32 ప్రజ్వలించే కట్టడమే మహేశ్వరుడు

33 రోలు కశ్యపుడు 

34 తాడు ఆదితి

35 గధ సర్వ శత్రు సంహారిణి కాళికాదేవి

36 తన మాయే శరణమని ధనస్సు

37 శరత్ కాలమే భోజనం

38 తామర కాడ జగత్తుకు భీజంగా వివరించబడినది

39 గరుడడే కల్పవృక్షం

40 నారదుడే సుధాముడు

41 బృంద దేవి భక్తి

42 భార్య సర్వ జంతు ప్రకాశినీ యగు బుద్ధి


 43 అంతా పరమాత్మ స్వరూపమే వైకుంఠమే ఈ భూమిపైకి ఈ విధంగా వచ్చింది.


 *ఓం నమః శివాయ. శివాయ గురవే నమః*

ఇష్టమైన పూలు*



    *భగవంతునికి  ఇష్టమైన పూలు*

                 ➖➖➖✍️


*"అహింస  ప్రథమం  పుష్పం  పుష్పం  ఇంద్రియ  నిగ్రహః*                                       

*సర్వ భూత  దయా పుష్పం  క్షమా  పుష్పం  విశేషతః*                                                     

*జ్ఞాన  పుష్పం  తపః పుష్పం      శాంతి  పుష్పం  తథైవ  చ*                                           

*సత్యం  అష్ట విధం  పుష్పో: విష్ణో హో  ప్రీతి కరం  భవేత్"*



*1. అహింసాపుష్పం: *

*ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమే దేవునికి సమర్పించే ‘ప్రధమ పుష్పం.’*



*2. ఇంద్రియ నిగ్రహం: * 

*చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే దేవునికి అందించాల్సిన రెండో పుష్పం!’*


*3.  దయ: *

*కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.  ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.*


*4.  క్షమ: * 

*ఎవరైనా మనకి అపకారం చేసినా,  ఓర్పుతో సహించడమే క్షమ.  ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.*


*5. ధ్యానం: *

*ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం. ఇది దేవుని అందించే ఐదవ పుష్పం!*


*6. తపస్సు: * 

*మానసిక ( మనస్సు), వాచిక (మాట), కాయక ( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు.  ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.*


*7. జ్ఞానం: *

*పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం.  ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.*


*8.సత్యం: *

*ఇతరులకు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం.  ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.* 


*ఇవన్నీ చాలా అరుదైన పుష్పాలే, అవన్నీ మీ తోటలో లేవంటారా.  మరేం పరవా లేదు, ఇవాళే మొక్కలు నాటండి. త్వరలోనే మిగతా పూలు పూయించండి. *✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

రాజలక్ష్మి మెడికల్ కాలేజీ హాస్పిటల్.*



🔷స్టార్ హోటల్ లాంటి హాస్పిటల్*


 

 🔷చెన్నై శ్రీపెరంబుదూర్ సమీపంలో ఉంది! అది రాజలక్ష్మి మెడికల్ కాలేజీ హాస్పిటల్.*


🔷 శారీరక సమస్య కారణంగా, ఒక వ్యక్తి స్నేహితుడితో వెళ్లాడు! మీరు ప్రవేశించిన వెంటనే, అడ్మిషన్ నుండి స్పెషలిస్ట్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లడానికి ఇద్దరు సిబ్బంది ఉన్నారు.*


🔷ఒక్కో విభాగానికి కనీసం 4 మంది వైద్యులు. ఫస్ట్ క్లాస్ చికిత్స అంటే ఏమిటో ఇక్కడ తెలుసుకోండి!*


🔷అతన్ని చాలా ఆశ్చర్యపరిచిన విషయం..*


🔷1. వైద్య రుసుము లేదు.*


🔷2. ప్రవేశ రుసుము లేదు.*


3. అడ్మిషన్ తర్వాత, రోగి ఇంటికి వెళ్లే వరకు ఆహారం మరియు మాత్రల గది ఉచితం. ఆహారమే కాదు రుచికరమైన ఆహారం.*


4. ఎక్స్ రే, డిజిటల్ ఈసీజీ, వీడియో ఎండోస్కోపీ, యాంజియోగ్రామ్ అన్నీ ఉచితం.


5. అన్ని శస్త్రచికిత్సలు ఉచితం.*


మందులు కూడా ఉచితం


🔷చాలా పరిశుభ్రమైన ఆసుపత్రి. అద్భుతమైన సంరక్షణ.*


🔷నా స్నేహితుడికి చిన్నపాటి ఆపరేషన్ అవసరమని చెప్పారు. 4 రోజులు ఉండాలి. అపోలోలో లక్షన్నర. పోరూర్ రామచంద్రలో 84,000, మరో చిన్న ఆసుపత్రిలో 45,000. అయితే ఇక్కడ ఇది ఉచితం మరియు స్కాన్, ECG, మందులు ఇలా అన్నీ ఉచితం*


 *దయచేసి ప్రచారం చేయండి.*


🔷రాజలక్ష్మి మెడికల్ కాలేజీ హాస్పిటల్ - చెన్నై (శ్రీపెరంబుదూర్) -


 🔷 ప్రజలందరూ ఆసుపత్రికి వెళ్లేందుకు అన్ని గ్రామాల నుండి ఉచిత బస్సును నడుపుతున్నారు మరియు ఆపరేషన్లు పూర్తిగా ఉచితం.*

*(ఫోన్:- 6364109600

* 9994648533) ************************* _*దయచేసి దీన్ని ఫోరమ్ గ్రూపులకు పంపడం ద్వారా సహాయం చేయండి... ధన్యవాదాలు ..*_

ద్వైతం, అద్వైతం,

 *ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం వీటిలో ప్రస్తుత కాలానికి ఏది అనుసరణీయం...!!*


1, ద్వైతం అనేది వ్యావహారికం, అద్వైతం అనేది పారమార్ధికం భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన ఉంటేగాని మనం భగవంతుడిని పూజించలేము...

జ్ఞానం వచ్చేంతవరకు ద్వైతం ఉపయోగపడుతుంది. 

జ్ఞానం వచ్చిన తరువాత అద్వైతం ఉంటుంది.

కలగంటున్న వరకు అది కల అని తెలియదు, బాహ్యస్మృతి లోకి వచ్చాక మాత్రమే అది కల అని తెలుస్తుంది. 

ద్వైతంలో ఉన్నా, విశిష్టాద్వైతంలో ఉన్నా చివరికి అద్వైతంలోకి రావలసిందే, ఎందుకంటే జగత్తు అంతా మిధ్య, బ్రహ్మం ఒక్కడే అంటే అందరూ అర్థం చేసుకోలేరు.

ఈ ఉపాసనలు, ఆరాధనలు అద్వైతం కోసమే. 

కనుక ద్వైతంలోనే ఉంటూ చివరికి అద్వైతంలోకి చేరుకోవలసినదే.


2. ఏకేశ్వరోపాసన, బహు దేవతారధనలలో ఏది మంచిది...


ఏకేశ్వరోపాసన చేసినా, అనేకమంది దేవతలను పూజించినా ఏ వ్యత్యాసము లేదు. ఎందుకంటే.. భగవంతుడు ఒక్కడే కాని రూపాలు, నామాలు అనేకం ఉన్నాయి. 

ఆ రూపాల వెనుక ఉండే చైతన్యం మాత్రం ఒక్కటే, మనం ఈశ్వరుడిని ఆరాధించినా, విష్ణువుని ఆరాధించినా ఫలంలో ఎటువంటి తేడా ఉండదు. ఈశ్వరుడు ఎటువంటి ఫలాన్ని ఇస్తాడో, విష్ణువు అదే ఫలాన్ని ఇస్తాడు. ఇతర దేవతలు అదేవిధమైన ఫలాన్ని ప్రసాదిస్తారు.


౩. హిందు మతంలో ఇందరు దేవుళ్ళు, ఇన్ని సంప్రదాయాలు ఎందుకు ఉన్నాయి...


మనం వినాయకచవితికి గణపతిని, నవరాత్రికి అమ్మవారిని, శివరాత్రికి శివుడిని ఇలా ఏ పర్వదినానికి తగ్గట్లు ఆ దేవుడు, దేవత రూపాన్ని పూజిస్తాం. 

అలాగని మనం నలుగురు దేవతలని ఆరాధించినట్లు కాదు. 

ఓకే దేవుడిని నాలుగుసార్లు పూజించి నట్లు, మరి ఎందుకని అన్ని రూపాలు అంటే, సాధకులను అనుగ్రహించడం కోసం భగవంతుడు ఎవరి స్థాయిలో వారికి, వారికి రుచించిన రూపంలో వస్తాడని. అందుకనే ఇన్ని రూపాలు అని ఆదిశంకరులు చెబుతారు.


4. మన సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి అంటే ఏమి చేయాలి...


ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడమే, అందుకోసం చిన్నప్పటి నుండి పిల్లలకు మంచి సంస్కారాన్ని అందించే రామాయణ, మహాభారత, భాగవతాల కథలు తెలియజేయాలి.

అందువలన ఆ కథల వలన వారిలో మంచి సంస్కారం ఏర్పడుతుంది. 

బాల్యం నుండి స్వధర్మాన్ని అలవరచాలి. పిల్లలు కూడా శ్రద్దగా నేర్చుకోవాలి. వారు విననప్పుడు పెద్దలు దండన మార్గాన్ని అనుసరించి అయినా స్వధర్మాన్ని అలవారచాలి.


5. మాధవసేవ చేస్తే పుణ్యం వస్తుంది, మరి మానవసేవ వలన ప్రయోజనం ఏమిటి...


ఉపకార గుణం అనేది మనిషిలో ప్రాథమికంగా ఉండవలసిన లక్షణం. 

అది లేకపోతే మనిషి తాను మనిషి అనుపించుకోవడానికి కూడా యోగ్యుడు కాదు. కష్టాలలో ఉన్నవారికి ఎన్నో రకాల సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి. 

అయితే సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మనస్సులో పరిశుద్దమైన భావన ఉండాలి, ప్రఖ్యాతి కోసం చేయకూడదు. నాకేదో ఫలం లభించాలి, నేను చేసింది ప్రపంచం మొత్తం తెలియాలి అని ఆలోచించకూడదు. 

అప్పుడు భగవంతుడు మనల్ని ఇష్టపడతాడు, అయన అనుగ్రహ ఫలమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు...

సేకరణ......

               *_🌹శుభమస్తు🌹_*

 ఇన్నివానలా ?


1. గాంధారివాన = కంటికి ఎదురుగా ఉన్నది  కనిపించనంత జోరుగా కురిసే వాన

2. మాపుసారివాన = సాయంత్రం కురిసే వాన

3. మీసరవాన = మృగశిరకార్తెలో కురిసే వాన

4. దుబ్బురువాన = తుప్పర/తుంపర వాన

5. సానిపివాన = అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వాన

6. సూరునీల్లవాన = ఇంటి చూరు నుండి ధార పడేంత వాన

7. బట్టదడుపువాన = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన

8. తెప్పెవాన = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన

8. సాలువాన = ఒక నాగలిసాలుకు సరిపడా వాన

10. ఇరువాలువాన = రెండుసాల్లకు & విత్తనాలకు సరిపడా వాన

11. మడికట్టువాన = బురదపొలం దున్నేటంత వాన

12. ముంతపోతవాన = ముంతతోటి పోసినంత వాన

13. కుండపోతవాన = కుండతో కుమ్మరించినంత వాన

14. ముసురువాన = విడువకుండా కురిసే వాన

15. దరోదరివాన = ఎడతెగకుండా కురిసే వాన

16. బొయ్యబొయ్యగొట్టేవాన = హోరుగాలితో కూడిన వాన

17. రాళ్లవాన = వడగండ్ల వాన

18. కప్పదాటువాన =  అక్కడక్కడా కొంచెం కురిసే వాన

19. తప్పడతప్పడవాన = టపటపా కొంచెంసేపు కురిసే వాన.

20. దొంగవాన = రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన

21. కోపులునిండేవాన = రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన

22. ఏక్దారవాన = ఏకధార కురిసే వాన

23. మొదటివాన = విత్తనాలకు బలమిచ్చే వాన

24. సాలేటివాన = భూమి తడిసేంత భారీ వాన

25. సాలుపెట్టువాన = దున్నేందుకు సరిపోయేంత వాన.

శ్రవణము చేసిన తర్వాతనే

 శ్లోకం:☝️

*శ్రుత్వా ధర్మం విజానాతి*

 *శ్రుత్వా త్యజతి దుర్మతిమ్ ।*

*శ్రుత్వా జ్ఞానమవాప్నోతి*

 *శ్రుత్వా మోక్షమవాప్నుయాత్ ॥*

  - చాణక్యనీతి


భావం: ఈ శ్లోకంలో ఉపనిషత్తులో చెప్పిన *శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యః'* అనే సాధనములలో *శ్రవణము* యెక్క ప్రాధాన్యతను చెప్పుచున్నాడు చాణక్యుడు.

ఒక వ్యక్తికి వేద శాస్త్రములను శ్రవణము చేసిన తర్వాతనే ధర్మం బోధపడుతుంది. జ్ఞానుల మాటలు విన్న తర్వాతే తప్పుడు ఆలోచనలను వదిలివేస్తాడు. గ్రంధాలను అధ్యయనం చేయడం లేక వినటం ద్వారా జ్ఞానం లభిస్తుంది. తుదకు వేదాంత శ్రవణము ద్వారానే మోక్షం కూడా లభిస్తుంది.🙏