15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

తెలివైన వ్యక్తి

 🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝


   *_యస్య కృత్యం న జానన్తి*

 *మన్త్రం వా మన్త్రితం పరే౹*

 *కృతమ ఏవాస్య జానన్తి*

*స వై పణ్డిత ఉచ్యతే||_*


భావం: *ఒక పనిని నెరవేర్చిన తర్వాత వారి చర్యలు, ప్రవర్తన, గోప్యత మరియు ఆలోచనల గురించి అవగాహన కలిగి ఉన్న వ్యక్తి తెలివైన వ్యక్తికి పర్యాయపదంగా ఉంటాడు*.....


🧘‍♂️🙏🪷 ✍️🙏

జీవితమనే పయనమ్ముకు

 *1909*

*కం*

జీవితమనే పయనమ్ముకు

చావు చివరి గమ్యమౌను జనులెల్లరికిన్.

చావకమునుపొనరించిన

పావనకర్మలకు నీవు బ్రతుకుదు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! జీవితం అనే ప్రయాణం లో చావనేది చివరి గమ్యం. చనిపోయే లోపుగా నీవు చేసి న పవిత్ర కర్మల వలన నీవు మళ్ళీ బ్రతుకుతావు.

*సందేశం*:-- మనిషి చనిపోయిన తరువాత బతికేది అతను చేసి న మంచిపనులే. అందుకే బతికి ఉన్నప్పుడే మంచి పనులు చేయాలి.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Blood donation

 BLOOD  ఎవరికయినా  కావాలంటే , Sri A.Venkat Rao గారు ,Advocate, Phone no.955 31 12233., వీరు Blood donation Group కలదు ,దయచేసి ,వీరిని  Contact చేయ్యండి .

భారతమాతను

 శ్లోకం:☝️

*రత్నాకరాధౌతపదాం*

  *హిమాలయకిరీటినీమ్ |*

*బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం*

  *వందే భారతమాతరం ||*


భావం: అమూల్యమైన రత్నాలతో నిండిన (హిందూ మహా) సముద్రముచే తన పాదాలు కడుగబడేది, హిమాలయ పర్వతశ్రేణులే కిరీటముగా అలంకరించబడినది, బ్రహ్మర్షులు, రాజర్షులు వంటి తపస్వీ రత్నాలు సమృద్ధంగా ఉన్న భారతమాతను నేను పూజిస్తున్నాను.🙏

పంచాంగం 15.09.2023 Friday,

 ఈ రోజు పంచాంగం 15.09.2023 Friday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస కృష్ణ పక్ష: అమావాస్య తిధి భృగు వాసర: ఉత్తరఫల్గుని నక్షత్రం శుభ యోగ: నాగవం తదుపరి కింస్తుఘ్నం కరణం ఇది ఈరోజు 

అమావాస్య ఉదయం 07:08 వరకు.

ఉత్తరఫల్గుని ఈ రోజు పూర్తిగా ఉంది .

సూర్యోదయం : 06:07

సూర్యాస్తమయం : 06:15

వర్జ్యం : మధ్యాహ్నం 12:53 నుండి 02:40 వరకు.

దుర్ముహూర్తం : పగలు 08:33 నుండి 09:21 వరకు తిరిగి మధ్యాహ్నం 12:35 నుండి 01:24 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00  వరకు.


యమగండం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

voters

 An appeal to voters of the Hyderabad District to verify their and family members names in the electoral rolls by visiting https://voters.eci.gov.in or Voter Helpline App and if found any family members are in different polling stations or required any correction in name, relation name, DOB, house no. & photo etc., are requested to apply in Form-8 through the above website or App or at ERO Office.

DEO-Hyderabad & Commissioner, GHMC

శివపార్వతులమధ్య

 శివపార్వతులమధ్య వ్యత్యాసము!



కవిసామ్రాట్ విశ్వనాధ!


11. నీవో యౌవనమూర్తి వౌదు వసురానికంబు మ్రదించు శి

క్షావైశద్యము పొల్చు నీతనువు నీశా! అన్నపూర్ణాంబికా

దేవిం జూచిన వృద్ధవోలె మదికిన్ దీపించు దాంపత్య మీ

భావం బెవ్వఁ డెఱుంగు శైలతనయా ప్రాణేశ! విశ్వేశ్వరా


ఓ విశ్వేశ్వరా! పార్వతీప్రాణనాథా!

ఈశా!

నీవా- అసురసమూహములను శిక్షించు స్పష్టతగల యౌవనము

గల శరీరముగలవాడవు.

అన్నపూర్ణమ్మతల్లియో- తలపండినవృద్ధ!అనిపించును.

మీదాంపత్య రహస్యంబెరిగినవాడెవ్వరయ్యా?!


దేవదేవుడవు.

సదాత్రిదశులకు ఆదిదేవుడవు.

యౌవనముగూడుగట్టినదొరవి.

రాక్షసశిక్షా దక‌్షుడవు. వారినిమ్రందించుబలశాలివి.

కనుక యౌవనము రూపుగట్టిన దార్ఢ్యమునీది!

ఇక అన్నపూర్ణమ్మ --

శ్రీనాథుడనినట్లు---

"వేదపురాణశాస్త్రపదవీనదవీయసియైన పెద్దముత్తైదువ!"

 యుగయుగాలుగాఎందరు జీవులకో ప్రాణదాత్రియై తలపండిన వృద్ధ!

తిలతండులన్యాయమునచెప్పదగు కేశపాశమనినాడు కవిసార్వభౌముడు!

కాశీ క్షేత్రంలో శివునికే‌అన్నభిక్ష ఇడిన మహామాత- అన్నపూర్ణాదేవి!

ఎంత వింత దంపతులుమీరు!


విశ్వేశ్వర శతకము-


రసజ్ఙభారతి సౌజన్యంతో!

తిట్లలో దీవెన!


తిట్లలో దీవెన!


"ఆలినొల్లకయున్నవానమ్మమగని,

అందులోపలనున్న వానక్క మగని,

నమ్మినాతనిజరచు దానమ్మసవతి,

సిరులు మీకిచ్చు నెప్పట్ల గరుణతోడ;

             -అజ్ఙాత చాటువు.

అమ్మమగడు,అక్కమగడు, దానమ్మమగడు, అంటూపరుషోక్తులు

వినిపించినా,పైపద్యం చాలా చమత్కార 

భాసురమైనది.శ్రీమహాలక్ష్మిపరంగా ఆశీర్వదిస్తూ చెప్పిన ప్రస్తుత పద్యంలో చాలా విశేషార్ధం దాగియుంది.

          ఫలానా వారు మాకు దూరపు బంధువులు అనిచెప్పుకుంటూఉండటంలోకంలోకంలదుగదా! ఆవ్యక్తియొక్కబంధుత్వాన్ని వివరించాలంటే,అతనిజెందిన యెంతోమందిని ప్రస్తావించవలసివస్తుంది.

                  అలాగే ఇక్కడ లక్ష్మీ దేవిని చెప్పటానికి ఎంతోమందినిపేర్కొంటూ,వారివారి సంబంధ బాంధవ్యాలను చెప్పుకుంటూ వచ్చాడీకవిగారు. ఈసంబంధాలనేపధ్యంలో యెన్నోదివ్యచరితలు మనకు మనస్సుల్లోమెదలుతాయి.ఆయాపౌరాణిక సన్నివేశాలు స్ఫురణకు రాగానే మనస్సులోదివ్యమైన భక్తిభావం పరిమళిస్తుంది.

                     ఇంతకీ ఇందులోనున్న చమత్కారమేమిటో అర్ధమవటంలేదుగదూ? దాని మర్మ మిది.

             ఆలినొల్లనవాడు-భీష్ముడు;వానియమ్మ-గంగమ్మ;ఆమెమగడు-సముద్రుడు.

అందులోపలనున్న(వాడు)-సముద్రంలోదాగినమైనాకుడు; వానియక్క-పార్వతి;ఆమెమగడు-శంకరుడు;అతనినమ్మినవాడు-రావణుడు;అతనిచెరచునది-అతనిచావుకు కారణమైనది సీత;ఆమెతల్లి-భూదేవి;ఆమెకుసవతి-

శ్రీమహాలక్ష్మి; దయతో-కరుణతో ;నెప్పట్ల-నెల్లవేళల; సిరులనిచ్చుత-సంపదలనొసంగుగాక!(శ్రీమహాలక్ష్మి మీకు నెల్లపుడు సంపదల నిచ్చుగాక! 

                    

                               అని ఆశీస్సులు!!🌷🌷🌷🌷🙏💐🙏🙏🌷🌷

Answers please


 

14, సెప్టెంబర్ 2023, గురువారం

Demudu