2, అక్టోబర్ 2023, సోమవారం

నాగమణిగారి నియమం..

 *నాగమణిగారి నియమం..*


"ఈరోజు నాగమణి గారి పేరుతో అన్నదానము అని రిజిస్టర్ లో ఉన్నది..కానీ ఇతర వివరాలేమీ లేవు..బోర్డ్ మీద అన్నదానానికి విరాళం ఇచ్చిన దాత తాలూకు గోత్రము, పేరు..ఊరు..వ్రాయాలి కదా..ఇక్కడ కేవలం నాగమణి గారు అని మాత్రమే ఉన్నది..కనీసం వారి సెల్ నెంబర్ కూడా లేదు..ఈరోజు ఇక్కడ అన్నదానం జరిపించామని వారికి తెలియచేయాలి కదా?..వారి గోత్రనామాలతో అర్చన చేయించాలి..ఇప్పుడెలా?.." అని మా సిబ్బంది నన్ను అడిగారు..నేను రిజిస్టర్ తెప్పించుకుని చూసాను..నిజమే..ఒక్క పేరు తప్ప మరే వివరాలు లేవు.."ఇది నమోదు చేసింది ఎవరు?.." అని అడిగాను.."మీరు నా పేరు వ్రాసుకోండి..ఆతేదీకి నేను వస్తాను..అన్ని వివరాలు ఇస్తాను.." అని ఆవిడ చెప్పింది సార్..ఎంత ఖర్చు అవుతుంది..అని అడిగింది..చెప్పాను..అంత మొత్తము ఇచ్చింది..రసీదు ఇచ్చాను..ఎలాగూ ఆవిడ వస్తానన్నారు కదా అని నేను మిగిలిన వివరాలు అడగలేదు..." అని సిబ్బందిలో ఒకరు చెప్పారు.."సరే..ఇప్పుడు సమయం ఏడు గంటలేకదా..?..తొమ్మిదిన్నర కు వచ్చే బస్సులో వేస్తారేమో వేచి చూద్దాము.. మరో రెండుగంటలు చూద్దాం..అన్నదానం మాత్రం నిర్వహిద్దాము.." అని చెప్పాను..


స్వామివారి ప్రభాతసేవ పూర్తి కాగానే..మా సిబ్బంది మైకు ద్వారా..అన్నదానం ఉందన్న సంగతి అందరు భక్తులకూ తెలియచేశారు..ఆరోజు మంగళవారం..ఉదయం తొమ్మిదిన్నర సమయం లో వచ్చిన బస్సులో కొందరు భక్తులు వచ్చారు కానీ..అన్నదానానికి విరాళం ఇచ్చిన నాగమణి గారు మాత్రం రాలేదు..మరో అరగంట గడిచింది..స్వామివారి మందిరం ముందు ఒక కారు వచ్చి ఆగింది..అందులోనుండి దంపతులు దిగారు..వారి వెనకాలే నాగమణి గారు కూడా వచ్చారు..మందిరం లోపలికి వచ్చి..కాళ్ళూ చేతులూ కడుక్కొని..నేను కూర్చున్న స్థలం వద్దకు వచ్చి.."నా పేరు నాగమణి అండీ..ఈరోజు ఈ స్వామివారి సన్నిధిలో అన్నప్రసాదం ఏర్పాటుకు నాకు అవకాశం దొరికింది..అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తామని మీ సిబ్బంది చెప్పారు.." అన్నారు.."అమ్మా..ఉదయం నుంచీ మీ గురించే మేము మథనపడుతున్నాము..మీ తాలూకు వివరాలేవీ మా వద్ద లేవు..ఈకార్యక్రమం జరుపుతున్నామని మీకు తెలియచేయాలి కదా..అలాగే మీ గోత్రనామాలతో అర్చన చేయడానికి కూడా ఇబ్బంది వచ్చింది..మీరే వచ్చారు కనుక ఇక మాకు బాధలేదు.." అన్నాను..నాగమణి గారు నా వైపు చిరునవ్వుతో చూసి.."నేను వస్తానని చెప్పే వెళ్ళాను బాబూ..ఆరోజు మీరు లేరు.." అన్నారు..


తనతో వచ్చిన దంపతులను నాకు చూపిస్తూ.."వీళ్ళిద్దరూ నా తమ్ముడూ మరదలూనూ..అసలు వీళ్ళగురించే నేను ఈ స్వామిదగ్గరకు వచ్చాను..వీడిపేరు రాజేశ్వరరావు..అమ్మాయి ప్రసూనాంబ..అమెరికా లో వుంటారు..వీళ్లకు ఇద్దరు పిల్లలు.. మూడేళ్ళ క్రితం వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు..వీడి చిన్ననాటి స్నేహితుడు ఒకడు కలిసాడు..మాటల్లో రెండు మూడు రకాల వ్యాపారాలు చెప్పాడు..కొద్దిగా పెట్టుబడి పెడితే..ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మబలికాడు..మా తమ్ముడు ఆశ పడ్డాడు..సరే అన్నాడు..ఆ స్నేహితుడి మాటలు నమ్మి..ఏ కాగితాలూ లేకుండా కొంత డబ్బు ఇచ్చాడు..ముందు కొద్దిగా పెట్టుబడి చాలు అని చెప్పిన ఆ స్నేహితుడు..వీడి నుంచి దాదాపు కోటి రూపాయలు వసూలు చేసాడు..ఆ తరువాత ముఖం చాటేశాడు..తీరా వీడు ఇక్కడికి వచ్చి విచారిస్తే..మోసపోయానని తెలుసుకున్నాడు..ఆ స్నేహితుడి వద్ద కొన్ని భూముల తాలూకు పత్రాలు తప్ప మరేమీ లేవు..ఆ భూముల కాగితాలు వీడి చేతిలో పెట్టి..ఇంతకంటే ఏమీ చేయలేను..అని తేల్చి చెప్పాడు..అవి ఎవరూ కొనే భూములు కూడా కాదు..మావాడు బాగా దిగులు పడ్డాడు..అప్పుడు నేనే సలహా ఇచ్చాను.."నాయనా మనం ఒకసారి మొగిలిచెర్ల వెళ్లి ఆ దత్తాత్రేయుడి ని శరణు వేడదాము..ఏదో ఒక దారి చూపిస్తాడు..నువ్వు దిగులుపడకు..నీ కష్టార్జితం అయితే ఎక్కడికీ పోదు.." అని చెప్పాను..వీళ్లిద్దరి తరఫున నేనే ఇక్కడికి వచ్చాను..మొత్తం పదకొండు ఆదివారాలపాటు ఒక నియమం అనుకోని ..ప్రతి ఆదివారం ఈ స్వామివద్దకు సాధారణ భక్తులతో పాటు వచ్చి..స్వామివారి సమాధిని దర్శించుకొని..వీళ్ల గురించి ప్రార్ధించి వెళ్ళాను..స్వామివారు ఖచ్చితంగా పరిష్కారం చూపుతారు అని నా మనసుకు తోచింది..అందుకు తగ్గట్టుగానే..పోయిన నెలలో ఈ అవధూతకు మామీద దయ కలిగింది..అనుకోకుండా వీడి వద్ద ఉన్న భూముల కు రేటు వచ్చింది..అగ్రిమెంట్ అయింది..కొంత డబ్బూ చేతికి వచ్చింది..అందుకే ఈరోజు అన్నదానం చేయిస్తానని మొక్కుకొని..వీళ్ళిద్దరినీ పిలిపించాను..ఈరోజు మంగళవారం అయినా..ఈరోజే అన్నదానం చేయడానికి కారణం ఉంది..ఈరోజు వీడి పుట్టినరోజు..స్వామివారి దయవల్ల మా తమ్ముడు నిరాశ లోంచి బయటపడ్డాడు.." అని చెప్పారు..


నాగమణి గారు పదకొండు ఆదివారాలు.. స్వామివారి మందిరానికి వచ్చి వెళ్లిన విషయం మేమెన్నడూ గమనించలేదు..


ఆరోజు అన్నదానానికి బోర్డ్ మీద తమ పేర్లు ఏవీ రాయవద్దని నాగమణి గారు కోరారు..స్వామిచూపిన కరుణ తమ మీద ఎల్లకాలమూ ఉంటే చాలని..తమ పేర్లు ప్రచారం చేసుకోవాలని అనుకోలేదని చెప్పారు..అందరూ ఆరోజు అర్చన చేయించుకున్నారు..ఆరోజు మధ్యాహ్నం నాగమణి గారు తిరిగి వెళ్లిపోయేముందు నా వద్దకు వచ్చి.."స్వామివారు కరుణించబట్టి మావాడికి తన సొమ్ము లభించింది..ఈ క్షేత్రం అభివృద్ధికి సహాయం చేయమని సలహా ఇచ్చాను..నలుగురికి ఉపయోగపడే ఏ కార్యక్రమమైనా నాకు తెలియచేయండి..తప్పకుండా మా వంతు సహకారం మేము అందిస్తాము.." అన్నారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

మంచితనం

 💐 *

    🪷 *మంచి మాటలు* 🪷

🎄 “డబ్బు”ఆస్తులను సంపాదించి పెడుతుంది కానీ,”మంచితనం” మనుషుల్ని సంపాదించి పెడుతుంది. మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికం రావొచ్చేమో కాని, “ఒంటరితనం” ఎప్పటికీ రాదు. హద్దులకు మించి “ఆశలు” ఉన్నట్లయితే శక్తికి మించి కష్టాలు పడాల్సి ఉంటుంది. అందుకే ఏదైనా అదుపులో ఉంటేనే మంచిది.”


🎄“తెలివి తేటలు ఎక్కువ, తక్కువ అందరికీ ఉంటాయి. కాని, అవి ఎదుటి వారి మనసును గెలుచుకోవాలి. అప్పుడే,మన “గొప్పతనం”తెలుస్తుంది. మోసేది “బరువు” అనుకుంటే దించి వేయాలనిపిస్తుంది, “బాధ్యత” అనుకుంటే మోయాలనిపిస్తుంది. “కర్తవ్యం” అనుకుంటే చేయాలనిపిస్తుంది మరియు. “ఇష్టం” అనుకుంటే కష్టమనిపించదు.”


🎄 “ఎక్కడైతే అవసరానికి కాకుండా ఆత్మీయతకు చోటుంటుందో, ఎక్కడైతే చేసిన తప్పుకు క్షమాపణ అడిగితే మన్నించే వీలుంటుందో మరియు ఎక్కడైతే   పట్టింపులకు ప్రాధాన్యత లేకుండా ఉంటుందో, అక్కడ  “బంధాలు” బలంగా ఉంటాయి. అంతేకాదు,అక్కడ మనుషులతో   పాటు మనసులు కూడా మాట్లాడతాయి.”

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Wisdom evergreen *

 {{{{{ ఆలోచనాలోచనాలు }}}}} *** Wisdom evergreen ***.                    ***** My riches consist not in the extent of my possessions , but in the fewness of my wants. --- J. Brother ton.                                      ***** One person's candle is light for many. --- Babylonian Talmud.                              ***** Love means exposing yourself to the pains of being hurt, deeply hurt by someone you trust. --- Reira Weems.                   ***** You must have bird in your heart before you can find it in the bush. --- John Burroughs.                        ***** We ourselves feel that we are doing is just a drop in the ocean. But the ocean would be less because of that missing drop. --- Mother Teresa.                 ***** Success is the sum of small efforts , repeated day in and day out. --- Robert Collier.                                ***** Things work out best for those who make the best of how things work out. --- John Wooden.                  ***** We can't stop the waves , but we can surf them. --- Jonathan Kabat-Zinn.      ***** The whole life is now, is today, is this eternal moment. --- Jalaluddin Rumi.              ***** The cure of the part should not be attempted without the cure of the whole. --- Plato.                                 Dt 2--10--2023, Monday, Good morning.

బ్రాహ్మణ భోజనం విజయవాడ

 హల్లో అండి 

బ్రాహ్మణ భోజనం విజయవాడ 9182554800 విజయవాడలో అన్ని రకాల శుభకార్యాలకి కేటరింగ్ చేయబడును మాసికాలకి,సంవత్సరికలకి, ఇంట్లో చేసుకోవడానికి వీలు లేని వాళ్ళకి మడిగా చేసి క్యాటరింగ్ పద్ధతిలో ఇవ్వబడును

మేము,జర్నీ లో వెళ్లే వాళ్ళకి కూడా భోజనం అందజేస్తాం (బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ) జర్నీ లో వెళ్ళే వాళ్ళు ఒకరోజు ముందుగా తెలియచేయగలరు.🙏

ఈ రోజు వంటలు

దోసకాయ పప్పు

దొండకాయ కూర

ఆలూ ( అల్లం పచ్చిమిర్చి,నిమ్మకాయ ) వేసి కూర

సాంబార్

,టమోటో రోటిలో నూరిన పచ్చడి

దయచేసి ఆర్డర్ ముందు రోజు చెప్పవలెను అప్పటికప్పుడు అడగవద్దు🙏🙏 మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9182554800



Disclaimer.  This blogger is not responsible for the above content. Vewers are requested to enquir before proceed. 

సంచలన వార్త

 జైభారత్ జైశ్రీరామ్ 🙏🚩🌹 మల్లికార్జున ఖర్గే పార్లమెంటులో మోదీజీకి ఒక ప్రశ్న లేవనెత్తారు

 “దళితులైన మా కోసం - మీరు కుటుంబానికి కనీసం ఒక సెంటు భూమిని కేటాయించాలి!  మేము  కూడా బ్రతకాలి కదా?


 మోదీజీ కొంత సమయం తీసుకుని సీటు నుంచి లేచారు


 “నువ్వు స్వయంగా దళితుడవు కాదా?” అని ఖర్గేని అడిగాడు


మీ ఆధీనంలో ఎంత భూమి ఉందో తెలుసా?

 వివరించండి..మోడీ అన్నారు..


ఆ స్థలంలో రూ.50 కోట్ల విలువైన బంగ్లా ఉంది!


 ➡️కెంగేరిలో రూ.40 కోట్ల విలువైన ఫామ్‌హౌస్!


 ➡️రామయ్య కాలేజీ దగ్గర రూ.25 కోట్ల విలువైన భవనం!


 ➡️బెంగళూరు R.Tలో మరో బంగ్లా ఉంది.  నగరం!


 ➡️బళ్లారి రోడ్డులో 17 ఎకరాల వ్యవసాయ భూములు!


 ➡️బెంగళూరులోని బన్నారఘట ప్రాంతంలో మీకు రూ.500 కోట్ల విలువైన వాణిజ్య సముదాయం ఉంది.


 ➡️చిక్‌మగ్గలూరులో 300 ఎకరాల విస్తీర్ణంలో కాఫీ ఎస్టేట్ ఉంది.


 ➡️ బెంగళూరులోని ఇందిరా నగర్‌లో మూడు అంతస్తుల భవనం!


 ➡️బెంగుళూరు సదాశివ నగర్‌లో 2 బంగ్లాలు!


 ➡️పైనవి కాకుండా - మైసూర్‌లో ఉన్న మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తుల జాబితాను నేను చదవాలా;  గుల్బర్గా;  చెన్నై;  గోవా;  పూణే;  నాగ్పూర్;  ముంబై మరియు ఢిల్లీ ??

 మల్లికార్జున ఖర్గే ముఖం పాలిపోయింది!

సింహన్ని దూరం నుండి చూసి ఆనందించు తప్పుకాదు సింహం జూలుతో అడితే కను రెప్పపాటులో చస్తావు సంకరజాతి మాటలు రాహుల్ దగ్గర,మీపార్టీ పెంట తింటున్న బొకడా ప్రాంతీయ పార్టీల దగ్గర మాట్లాడు వింటారు..

 మీడియా ఈ సంచలన వార్తను ఎందుకు బయటకు తీసుకురాలేదు??🤷‍♂️...జైహింద్

శర్మద గారికి ఘనసన్మానము






 నిన్న మేడిపల్లి-హైదరాబాద్ లో బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారు జరిపిన జ్యోతిషసభలో మన ఆత్మీయ సభ్యులు శ్రీ శర్మద గారికి జరిగిన ఘనసన్మానము యొక్క చిత్రం.

 మేడిపల్లి-హైదరాబాద్ లో బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారు జరిపినజ్యోతిషసభలో *జ్యోతిష ప్రముఖ* అను బిరుదముతో ఘనసన్మానము చేయటమైనది.

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -63🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -63🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*🌷తిరుపతి గంగమ్మ జాతర:🌷*


ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్కసారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది.ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది.


అన్ని గ్రామాలకూ ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.


పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. 

యుక్తవయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట.


 దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. 


వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు.


తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రినెల చివరి మంగళవారం రోజున చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి, వడిబాలు కడతారు.


 సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కులపెద్దల నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాల సారెను తీసుకువస్తారు. ఈ పసుపుకుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు వూరి ప్రజలెవరూ పొలిమేరలు దాటరాదంటూ చాటింపు వేస్తారు.


మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. అలనాడు పాలెగాణ్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు.


 • ఈ క్రమంలో వెుదటిరోజున బైరాగివేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగివేషం వేసిందని భక్తుల నమ్మిక. 


• రెండోరోజు బండవేషం. మానవుడు కష్టనష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు.


 • మూడోరోజు తోటివేషం. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు.


 • నాలుగోరోజు దొరవేషం. డప్పులు, వాయిద్యాల సందడి మధ్య దొరవేషదారులు వూరంతా వూరేగుతారు. 


స్థలపురాణం ప్రకారం శనివారంనాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తుంది.


నాలుగోరోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్య వాచకాలు చెబుతుందట.


 దీనిని గుర్తుచేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. ఆరోరోజు సున్నపుకుండల వేషం వేస్తారు. ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. 


గోపురాన్ని పోలిన సప్పరాలను(వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాల వేషం వేస్తారు.


ఇక చివరిరోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తారు. 


బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రినుంచే పడిగాపులు కాస్తారు.


పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది.


గంగమ్మతల్లి తిరుమల వేంకటేశుడికి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో తితిదే నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర నాలుగోరోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపుకుంకుమలూ శేషవస్త్రాలూ గంప, చేట తదితర మంగళద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు.


 పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట. ఈ విషయం తెలిసినవారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు.


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *41వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *41వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*బుధగ్రహ జననం - 4*


విద్యార్థులు కళ్ళు మూసుకుని వేదసూక్తాన్ని వల్లెవేస్తున్నారు. బృహస్పతి అరమోడ్పు కళ్ళతో ఏకాగ్రతగా ఆలకిస్తున్నాడు.


చంద్రుడు కళ్ళు మూసుకోలేదు. వల్లె వేయడం లేదు. ఆలకించడమూ లేదు. అతని చూపులు ఆశ్రమ వాతాయనం మీదే ఉన్నాయి. వాతాయనం ముందు వయ్యారంగా నిలుచుని , తన వైపే చూస్తున్న తార మీదే ఉన్నాయి. తనను చూస్తున్న తార కళ్ళు నవ్వుతున్నాయి. పెదవులూ నవ్వుతున్నాయి...


*"చంద్రా !"* బృహస్పతి కంఠస్వరం చంద్రుణ్ణి ఉలిక్కిపడేలా చేసింది.


చూపుల్ని తిప్పి , ఆందోళనగా చూశాడు చంద్రుడు గురువుగారి వైపు. 


బృహస్పతి కళ్ళు తీక్షణంగా అతన్నే చూస్తున్నాయి. *"నీ మనసు పాఠం మీద లేదు..."*


*"క్షమించండి గురువుగారూ..."* చంద్రుడు సిగ్గుపడుతూ అన్నాడు.. *"విద్యార్జనలో ఏకాగ్రత అవసరం !"* బృహస్పతి మందలింపుగా అన్నాడు. *"జాగ్రత్త సుమా !"*


*"తారా ! ఇవాళ ఇంద్రసభకు వెళ్తున్నాను. "* పూజ ముగించిన బృహస్పతి అన్నాడు. *"ఎప్పుడు తిరిగొస్తారు ?"* తార ఆయన వైపే చూస్తూ అంది.


*"రాత్రి భోజనం వేళకు వచ్చేస్తాను ! ఆ... చంద్రుడు విద్యార్థుల్ని చూసుకుంటాడు..."* 


*"ఎవరో ఒకరు చూసుకోవడం మంచిది. లేకపోతే ఒకటే అల్లరి చేస్తారు. చిన్నపిల్లలు కదా !"* తార నవ్వుతూ అంది. 


*"నువ్వు జాగ్రత్త సుమా... పుంజికస్థల చేత పనులు చేయించుకో..."* నీరసంగా కనిపిస్తున్న తారను చూస్తూ అన్నాడు బృహస్పతి. 


*"అలాగే.... మీరు జాగ్రత్త స్వామీ !”* అంది తార.


నైవేద్యం పెట్టిన ఫలాలను అల్పాహారంగా స్వీకరించి , బృహస్పతి వెళ్ళిపోయాడు. తార వాతాయనం ముందు నిలబడి చూస్తోంది. విద్యార్థులందరూ వరుసలుగా కూర్చుని , ఏవో మంత్రాలు పఠిస్తున్నారు. చంద్రుడు వాళ్ళ ముందు నిలబడి - గురువుగారి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు.


తారలో రకరకాల ఆలోచనలు తేనెపట్టులోంచి తేనెటీగల్లా లేస్తున్నాయి. ఆలోచనల్లోంచి తేరుకున్న ఆమె పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. వాతాయనం ముందు నుంచి కదిలింది.


తార నీళ్ళ పాత్రల ముందు నిలుచుంది. నవ్వుతూ ఒక పాత్రను అందుకుంది. వెలుపలికి వెళ్ళి పాత్రలోని నీటిని చెట్టుపాదులో పోసింది. ఆ పాత్రను అక్కడే పెట్టి ,

 *"పుంజికా !"* తార బిగ్గరగా పిలిచింది. ?“ఓ పుంజికస్థలా ! ఎక్కడున్నావ్ ? ఇలారా !"* క్షణంలో పుంజికస్థల అక్కడికి వచ్చింది. *"అమ్మా... పిలిచారా ?"*


*"ఆ ! నీళ్ళు ఎందుకో కలుషితంగా ఉన్నాయి. పాదుల్లో పోసేశాను. నదికి వెళ్ళి నీళ్ళు తీసుకురా ! పిల్లలందరికీ త్రాగటానికి కావాలిగా. అన్ని పాత్రల నిండా ఉండాలి. నీళ్ళు !"*


*“సరే... అలాగే తీసుకొస్తాను..."* అంటూ పుంజికస్థల పాత్రను అందుకుంది. తమ దగ్గరగా వస్తున్న గురుపత్నిని చూస్తు విద్యార్థులు మంత్రపఠనం ఆపారు. విద్యార్థుల చూపుల్ని గమనించిన చంద్రుడు తల తిప్పి తార వైపు చూశాడు. తార అతని వైపు చూడడం లేదు.


విద్యార్థుల ముందు నిలబడి తార చిరునవ్వుతో చూసింది. *"ఇవాళ గురువుగారు లేరు కదా ! మీరు ఒక పని చేయాలి. వంటచెఱకు అయిపోవస్తోంది. అరణ్యంలోకి వెళ్ళి వంటచెఱకూ , సమిధలూ ఏరి తీసుకురండి. సనాతనుడు మీకు నాయకత్వం వహిస్తాడు. అతను చెప్పినట్టు నడుచుకోండి !"*


*"ఇవాళ మాకు నాయకుడిగా చంద్రుణ్ణి నియమించారమ్మా గురువుగారు !"* సనాతనుడు లేచి నిలుచుని , వినయంగా అన్నాడు. 


*"నాకు తెలుసు ! చంద్రుడు ఆశ్రమంలో , తోటలో కొన్ని పనులు చేయాలి. ఆ పనులు మీరూ , నేనూ చేయలేం. మీరు అరణ్యానికి వెళ్ళండి !”*


విద్యార్థులు ఉత్సాహంగా లేచారు.


చంద్రుడు అనుమానిస్తూ తార వైపు చూశాడు. *"గురువుగారు నన్ను..."*


*"ఏ పనికి నియోగించారో నాకు తెలుసు చంద్రా ! గురుశుశ్రూష ఎంత ముఖ్యమో , గురుపత్నీ సేవ కూడా అంతే ముఖ్యం !"* అంటు తార ఉత్సాహంగా అరణ్యం వైపు ఉరకలు పెడుతున్న విద్యార్థుల్ని చూస్తూ ఉండిపోయింది.


చంద్రుడు ఆమె వైపే చూస్తున్నాడు. ఎదురుగా చూస్తే ఎంత అందంగా ఉందో , ప్రక్కవాటంగా కూడా అంతే అందంగా , ఆకర్షణీయంగా ఉంది ఆమె. ఎందుకో తెలీదు గానీ , అందరు విద్యార్థులూ పిలుస్తున్నట్టు ఆమెను 'అమ్మా' అని పిలవాలనిపించడం లేదతనికి , ఆశ్రమంలో ఆడుగు పెట్టిన నాటినుంచీ !


తార తటాలున అతని వైపు తిరిగింది. చిరునవ్వు ఆమె పగడాల పెదవుల్ని కొద్దిగా విడదీసి , ముత్యాల్ని కొద్దిగా చూపించింది. *“చంద్రా.... నువ్వు నన్ను అందరిలాగా . 'అమ్మా !' అనడం లేదు ! ఎందుకు ?”*


చంద్రుడి గుండె దడదడ కొట్టుకుంది. తార ఎదుటివారి ఆలోచనల్ని చదువుతుందా ?


*"చెప్పు ! ఎందుకు ?"* తార నవ్వుతూ అడిగింది.


ఏం చెప్పాలో తేల్చుకోలేని చంద్రుడు నాలుకతో తడి ఆరుతున్న పెదవుల్ని తడుపుకున్నాడు.


*"చెప్పు ! ఎందుకు ?"* తన వెనక వైపు నుంచి బిగ్గరగా వినిపించిన ప్రశ్న , తారనే చూస్తున్న చంద్రుణ్ణి ఉలిక్కిపడేలా చేసింది. చంద్రుడు భయాందోళనలతో వెనుదిరిగి చూశాడు. ఎవ్వరూ లేరు ! ఇందాక వెనకబాటుగా తనని ఉద్దేశించి ఆ ప్రశ్నను పలికిందెవరు ?


*“చెప్పు ! ఎందుకు ?”* తార అడిగిన ప్రశ్న మళ్ళీ చంద్రుడి చెవుల్ని పగలేసింది. ప్రశ్న అడిగిన చిలక చెట్టు మీద రెక్కల్ని టపటపలాడించింది. 


తార కిలకిలా నవ్వింది. 

*“నువ్వు సమాధానం చెప్పేదాకా అది అలా అడుగుతూనే ఉంటుంది !"*


చంద్రుడు కంగారుగా చూశాడు. తార చెయ్యి చాపి , చంద్రుడి చేతిని పట్టుకుంది.


*"ఇక్కడొద్దులే ! అక్కడ తోటలో చెబుదువుగానిలే రా !"* అంటూ లాగింది. చంద్రుడు గుటకలు మింగాడు.


*"రా , చంద్రా !”* తార లాగుతూ అంది.


*"రా, చంద్రా !"* అంది చెట్టు మీది చిలక.


చంద్రుడు ఉలిక్కిపడి కదిలాడు. తామరతూడులాగా నాజూకుగా ఉన్న తార చెయ్యి ప్రణయపాశంలా అతన్ని లాగుతోంది. *'రా , చంద్రా !', 'రా , చంద్రా !'* అంటూ వల్లె వేస్తున్న పిలుపు అతన్ని వెంటాడుతోంది. ఎందుకో అతని అడుగులు తడబడ్డాయి.


*"రా !”* తార తలతిప్పి వాలుగా చూస్తూ , చిరునవ్వుతో అంది , లాగుతూ. 


వెనక చిలక , ముందు చిలకల కొలికి ! చంద్రుడు అప్రయత్నంగా నవ్వుకున్నాడు..


అర్ధరాత్రి దాటింది. నిద్రపట్టని చంద్రుడు అటూ , ఇటూ దొర్లుతున్నాడు. తనను తోటలోకి తార లాక్కెళ్లినప్పటి దృశ్యాలు మూసుకున్న కళ్ళ ముందు పునర్దర్శనమిస్తున్నాయి. చంద్రుడికి.


*'రా !"* అంటూ తనను చెయ్యి పట్టి తీసుకెళ్తున్న తార వయ్యారాల నడక కాస్సేపట్లో పరుగుగా మారింది. ఒక గుబురు పొదరిల్లు సమీపంలోని చెట్టు నీడలో ఆగింది తార. నవ్వుతూ అతని వైపు చూసింది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చంద్రుడికి కనిపిస్తున్నాయి , సమ్మోహనకరంగా.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 52*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 52*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


ప్రకృతికి నియమాలున్నాయి. మొక్కలలో పువ్వులు ముందు పూస్తాయి, పిదప పిందె వస్తుంది - ఇది అలాంటి నియమాలలో ఒకటి, కాని ఈ నియమాలు కొన్ని చోట్ల, కొన్ని సమయాలలో ఉల్లంఘనమవడమూ కద్దు. గుమ్మడి మొక్కలలో మొదట పిందె వస్తుంది. ఆ తరువాతే పువ్వు పూస్తుంది. ఈశ్వరకోటులైన తమ శిష్యులకు దీనిని ఉదాహరణగా పేర్కొనేవారు శ్రీరామకృష్ణులు. 


సాధారణంగా ఆధ్యాత్మిక సాధనలు, తపస్సు అనుష్ఠించి భగవదనుభూతి పొందుతారు. ఇది నియమం కాని ఈశ్వరకోటుల విషయంలో ఈ నియమం మారుతుంది. వారు ముందుగానే ఆధ్యాత్మిక అనుభూతులను పొందివుంటారు. పిదప తపస్సు ఇత్యాదులు ఒనరించి తద్వారా ఆధ్యాత్మిక అనుభవాలు సంతరించుకొని, ముందుగానే తాము పొంది వున్న ఆధ్యాత్మిక అనుభూతులతో వాటిని పోల్చి చూసుకొంటారు.


ఈశ్వరకోటులలో అగ్రతాంబూలం నరేంద్రునిదే. అతడు ఇప్పటికే కొన్ని అత్యున్నత అనుభవాలు పొందడం చూశాం. కాని అతడూ ఆధ్యాత్మిక సాధనలు అనుష్టించాడు. శ్రీరామకృష్ణులు అతడికి అనేక సాధనలలో శిక్షణలిచ్చారు.


ఆధ్యాత్మిక సాధనా శిక్షణలలో మొదటి మెట్టు మంత్రదీక్ష. సామాన్యంగా గురువు శిష్యుని అర్హతకు తగిన ఒక మంత్రాన్ని ఉపదేశించడం ద్వారా దీక్ష ప్రసాదిస్తాడు. అంటే ఆధ్యాత్మిక జీవితానికి మార్గం చూపుతాడన్నమాట. ఈ మంత్రం సిద్ధమంత్రమై ఉండాలి. సిద్ధమంత్రం అంటే జాగృతం కలిగించే మంత్రం అని అర్థం. అంటే గురువు ఆ మంత్రాన్ని జపించి తద్వారా, ఆ మంత్రానికి చెందిన దేవత అనుగ్రహం పొందినవాడై ఉండాలి. అలాంటి గురువు ఒసగే మంత్రదీక్ష మాత్రమే ఫలవంతమవుతుంది. 


ఎందుకంటే మంత్రంతోపాటు ఆ మంత్రాన్ని జపించడానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తాడు కనుక. అందుకే గ్రంథాల్లో చదివి, ఆ మంత్రాలను జపించ కూడదు, గురువు ద్వారా పొందిన మంత్రాన్నే జపించాలని వక్కాణిస్తారు. ఈ మంత్రదీక్షకి ప్రత్యేక నియమ నిబంధనలు ఉన్నాయి.


కాని పరిపూర్ణ స్థితిని సంతరించుకొన్న గురువు నియమాలను ఉల్లంఘించి, తాను అభిలషించే రీతిలో దీక్ష నివ్వడం కద్దు. ఆధ్యాత్మిక శక్తిని శిష్యునిలో ప్రసరింపజేయడమే దీక్ష ఉద్దేశం. దీనిని వారు తమకు నచ్చిన రీతిలో నెరవేరుస్తారు. ఇలాంటి దీక్షను తంత్రశాస్త్రాలు శాంభవీదీక్ష అని పేర్కొంటాయి. శ్రీరామకృష్ణులు నరేంద్రునికి ఇలాంటి దీక్షనే ప్రసాదించారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 41*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 41*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


  *తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా*

  *నవాత్మానం మన్యే నవరస మహాతాణ్డవనటమ్ |*

  *ఉభాభ్యామేతాభ్యా ముదయవిధి ముద్దిశ్య దయయా*

  *సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమ జ్జగదిదమ్ ‖*


ఇదొక అద్భుతమైన శ్లోకం. మూలాధార చక్రములో శివ శక్తులు ఎలా వున్నారో చెప్తున్నారు ఇందులో. కుండలిని శక్తికి మూలాధారం ప్రధానం. తీగకు పాదు వలె. మనిషిలో ఏ స్పందనైనా ముందు మెదడులో మొదలై విద్యుత్ వేగంతో మూలాధారానికి వెళ్లి, అక్కడ నుండి మళ్ళీ పైకి ప్రయాణించి మెదడును చేరుతుందని యోగశాస్త్రాలు చెప్తున్నాయి.


తవాధారే మూలే = నీదైన ఈ మూలాధార చక్రంలో

 శరీరం నాది కాదు అమ్మదే అనే భావనతో


సహ సమయయా లాస్యపరయా = ఇక్కడ అమ్మవారు *సమయ* అనే పేరుతో లాస్యం చేస్తూ ఉంటారట. లాస్యం కోమలంగా పద ఘట్టనం లేకుండా ఉంటుంది. 


నవాత్మాన మన్యే = శివుడు నవాత్మకుడు. 

మన శరీరము ఈ విశ్వము కూడా నవాత్మకమే. వీటిని వ్యూహములని కూడా అంటారు. వ్యూహమునకు వ్యుత్పత్తి  *ఊహ వితర్కే* విశేషముగా విచారింపబడునది. *వ్యూహో నా బలవిన్యాస నిర్మాణ నికురుంబయో: ఇతి రుద్రః* అని అమరం.

రుద్రుని  వ్యూహములు

కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కల, జీవ. వ్యూహములు ఈశ్వర విభూతులూ, అంశలు. అవతార విశేషముల వంటివే వ్యూహములు.   సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేస్తూ జీవుల గతులను నిర్దేశించే నవగ్రహాలు, నృత్యంలో నవరసములు, నవావరణాలు ఇవన్నీ ఇలాటివే.


నవరస మహాతాండవ నటమ్ = స్వామి, నటరాజుగా నవరసాలొలికిస్తూ మహాతాండవ నృత్యం చేస్తూ వుంటారు. తాండవమనేది ఉద్ధృతంగా ఉంటుంది. ఈ తాండవాన్ని *ఆర్భటీ వృత్తి* అంటారు. వృత్తి అంటే వర్తించేది.ఒక నడక/నడవడి. వీటిని కావ్య వృత్తులంటారు. ఇవి కైశికి, ఆర్భటి, సాత్వతి, భారతి. 

అమ్మవారి లాస్యము కైశికి వృత్తి. ఈ కౌశికీ, ఆర్భటీ వృత్తుల సమన్వయమే శరీరం.


 జనకజననీమ జ్జగదిదమ్ =  శరీరం లోనే కాదు, విశ్వంలో కూడా ఈ రెండిటి సమన్వయం అవసరం.


ఉభాభ్యా మేతాభ్యా ముదయవిధి ముద్దిశ్య దయయా

సనాథాభ్యాం జజ్ఞే = ఈ విధంగా వీరిద్దరూ ప్రపంచానికి తల్లి తండ్రులుగా వున్నారు. కనుక మేము అనాథలం కాము, సనాధలము.


ఈ శ్లోకంలో అమ్మవారి నామాలు *లాస్యప్రియా లయకరీ లజ్జా  రంభాది  వందితా* , *మహేశ్వర మహాకల్ప  మహా తాండవ సాక్షిణి* దర్శించవచ్చు.


మూలాధార చక్రం భూమి తత్త్వం. భూమిపై  జీవించే మానవులు అరిషడ్వార్గాలకు లోనయి ధర్మమును పాటించక భ్రష్టత్వం పొందుతుంటే పార్వతీ పరమేశ్వరులు తమ తాండవ/లాస్యములతో వారికి జ్ఞానేచ్ఛను కలిగించి యోగసాధనకు ప్రోత్సహిస్తారని భావం.


పరమేశ్వరుడు స్థాణువు. *స్థిరః స్థాణుః* అని శివ సహస్ర నామాలు ప్రారంభం. అమ్మవారు ఆయనను కార్యోన్ముఖులను చేస్తుందట. ఆయన నవరసాలతో కూడిన మహా తాండవ నృత్యం చేస్తుంటే ఆవిడ విలాసంగా చూస్తూ తరువాత తన మృదువైన లాస్యంతో ఆయన ఉద్ధృతిని తగ్గిస్తుందట. ఈ మహా తాండవాన్ని మహాప్రళయం కాలంలో ఆయన ప్రదర్శించి సర్వ జగత్తును మహాగ్నిలో భస్మీపటలం  చేస్తుంటే ఆమె సాక్షిణిగా చూస్తూ వుంటుందట. అనంతరం తన కరుణారస దృష్టులతో చల్లదనాన్ని వర్షించి ఆనందభైరవిగా తన లాస్యంతో పునః సృష్టికి ఆయనకు సహకరిస్తుంది. ఆయన ఆనంద భైరవుడు ఆమె ఆనందభైరవి. 


ఈ స్తోత్రము మొదలుపెట్టినప్పుడు అందమే ఆనందం అని అన్నాను. ఏమిటి ఈ రెండూ? 

ఒకటి నుండి ఈ 41 వ శ్లోకం వరకు *ఆనంద లహరి* గా పిలుస్తారు. వీటిలో, సచ్చిదానంద తత్త్వమును ప్రతిపాదించే దివ్యమైన మంత్ర, తంత్ర, యోగ, ఉపాసనా రహస్యములు అనేకం చెప్పబడ్డాయి. అందుకని ఆనందలహరి. వీటివలన కలిగిన సంస్కారంతో మిగిలిన 59 శ్లోకాలను పఠించి అర్థం చేసుకోవాలి. వీటిని *సౌందర్యలహరి* అంటారు. వీటిలో అమ్మవారి కేశముల నుండి పాదముల వరకు సౌందర్య వర్ణన ఉంటుంది. ఇవన్నీ వేదాంతపరమైన అనేక విషయములను సూచిస్తాయి. ఏది ఆనందమును కలిగిస్తుందో అది అందము. కాళిదాసు రఘువంశ కావ్యంలో చెప్పినట్లు , *వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే  జగతః పితరౌ వన్దే పార్వతీ పరమేశ్వరౌ* 🙏🏻


 *తాండవం నటనం నాట్యం లాస్యం నృత్యం చ నర్తనే* అని నృత్య రీతులు.

*తాడ్యతే భూమిఃఅనేన ఇతి తాండవం* దీని చేత భూమి కొట్టబడును. పాదఘట్టనలు

*నట్యతే నటనం* నటించుట నటనం

*నటస్య కర్మ నాట్యం* నటుడు చేసేది నాట్యం 

*లసనం లాస్యం* లలితముగా లావణ్యముతో క్రీడించుట లాస్యము.

*నృతీ గాత్ర విక్షేపే నృత్యం నర్తనం* గాత్రమునకు చేయు నృత్యము నర్తనం.



           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹