3, అక్టోబర్ 2023, మంగళవారం

ఒక సూటి ప్రశ్న


 

Pravachan


 

దత్తాత్రేయ సంబంధ 10 పుస్తకాలు(PDF) ఒకేచోట

 *దత్తాత్రేయ  సంబంధ 10  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము www.freegurukul.org/g/Dattatreya-1


గురు తత్త్వము www.freegurukul.org/g/Dattatreya-2


నవనాధ చరిత్ర-నిత్య పారాయణ www.freegurukul.org/g/Dattatreya-3


శ్రీదత్త గురుచరిత్ర www.freegurukul.org/g/Dattatreya-4


గురు చరిత్రామృతము www.freegurukul.org/g/Dattatreya-5


దత్త భాగవతాద్వైతము www.freegurukul.org/g/Dattatreya-6


నృసింహ సరస్వతి మహారాజ్ www.freegurukul.org/g/Dattatreya-7


శ్రీ గురు దేవదత్త www.freegurukul.org/g/Dattatreya-8


గురుమూర్తి నృసింహ సరస్వతి చరితము www.freegurukul.org/g/Dattatreya-9


గురులీల www.freegurukul.org/g/Dattatreya-10


ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

లాల్ బహద్దూర్ గారి జయంతి

 🇮🇳✊

ఒక  తొమ్మిది 10 ఏళ్ల క్రితం వరకూ అక్టోబర్ 2 కేవలం ఒకాయన జయంతి మాత్రమే జరిపేవారు..

వీరయోద్ధ లాల్ బహద్దూర్ గారి జయంతి ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు..ఆరోజు ఏదో మొక్కుబడిగా తప్పనితద్దినంగా ( దివంగత ప్రధాని కాబట్టి ) అధికారులు విజయ్ ఘాట్ దగ్గర కాసిని పూలు చల్లి ఓ నాలుగు పాటలు పాడి వెళ్లిపోయేవారు..

సైనిక ప్రధానకార్యాలయాల్లో మటుకు శ్రీ లాల్ బహద్దూర్ శాస్త్రి గారికి ఘనంగా నివాళి అర్పించేవారు..తర్వాత కాలంలో పైన వున్న వాళ్ళకి ఎక్కడ పెయిన్ వస్తుందో అని అది కూడా తూతూ మంత్రంగా జరిపేవారు..

సోషల్ మీడియా దేశంలో పుంజుకున్న తర్వాత..సోషల్ మీడియాలో జాతీయవాదుల పట్టు బిగిసినతర్వాత..

సోషల్ మీడియాను అల్మోస్ట్ జాతీయవాదులు శాసిస్తున్న సమయం అంటే 2013 నుంచీ అక్టోబర్ 2 అంటే శాస్త్రి గారి పుట్టినరోజు కూడా అని ఈరోజును వైరల్ చేసింది జాతీయవాదుల సోషల్ మీడియా బృందం.. విజయం కూడా సాధించింది..

మామూలు విజయం కాదు..అద్భుతమైన విజయం.. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి మొత్తం గూగుల్ సెర్చ్ చేసి మనకి తెలియని ఆయన త్యాగమయ జీవితం..

యుద్ధ రంగంలో ఆయన పాకిస్తాన్ కొమ్ములు విరిచేసిన సంగతులూ..భారత సైన్యం తన అరివీర భయంకర వీర విక్రమ పరాక్రమాలతో పాక్ లోని రాముడి కొడుకు లవుడు కట్టించిన ' లాహోర్ ' లో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన అపురూప క్షణాలను కూడా వెలికి తీశారు నేటి తరం..

చాలామంది యువతకు తెలియదు నాడు లాహోర్ దాకా మన భారత సైనికుల విజయయాత్ర సాగిందనీ పాక్ మనకు సాగిలపడిందనీ..

చరిత్రను నేటి యువత తవ్వుతున్నది..ఎన్నో ఎన్నెన్నో దాచిపెట్టిన నగ్నసత్యాలు వెలికితీయబడుతున్నాయి..

మహావీరుల త్యాగాలు వారి వీర గాధలు బయటపడుతున్నాయి..

మనం దేబిరిస్తే స్వతంత్రం రాలేదు..అడుక్కుంటే రాలేదు రాస్ బీహారీ బోస్ దగ్గరనుంచి అరివీర భయంకరుడు స్వతంత్ర భారత తొలిప్రధాని ఫస్ట్ కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ / ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడు శ్రీ సుబాష్ చంద్ర బోస్ లాంటి వారి జీవితాలు తృణప్రాయంగా ఎంచి భరతమాత పాదాలకు మువ్వలుగా మారిన త్యాగమయ జీవితాలవలన మనం స్వేచ్ఛగాలులు పీలుస్తున్నాం..మహావీరులైన మనల్ని ఒక పిరికి జాతిగా మార్చడానికి చేసిన కుట్ర అహింసా పరమో ధర్మః.. మనకి ఇంతవరకే భోదించారు.. ధర్మహింసా తదైవచ ఇది చెప్పలేదు..

చరిత్రను తిరగరాద్దాం..ప్రపంచంలోనే ఒక గొప్పజాతి మనది..తిరిగి పునర్వైభవం సాదిద్దాం..ధర్మం కోసం ధనస్సు ఎక్కుపెట్టిన రాముడు మనకి ఆదర్శం..అడుక్కుంటే విజయాలు రావు..రాముడు రావణుడిని బ్రతిమిలాడలేదు..యుద్ధం చేసి గెలిచి అజేయుడయ్యాడు...మన గ్రంధాలు ధర్మం కోసం యుద్ధం చేయమన్నవే గాని..అలిగి అన్నం మానేసి బతిమిలాడమనలేదు..అలా తిన్నది వీరభోజ్యం అనరు..అడక్క తినడం అంటారు..అర్ధం అయితే మంచిది..అర్ధం కాకపోతే మరీ మంచిది..🙏

*JaiJawan*

*JaiKisan*

*దసరా నవరాత్రులు 2023*

 *దసరా నవరాత్రులు 2023*


(శరన్నవరాత్రులు - అక్టోబర్ 15 నుంచి 23 వరకు)

*గోగులపాటి కృష్ణమోహన్*


*1 శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి*

15-10-2023, ఆదివారము

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి


*2 శ్రీ గాయత్రి దేవి*

16-10-2023, సోమవారము

ఆశ్వయుజ శుద్ధ విదియ


*3 శ్రీ అన్నపూర్ణ దేవి*.

17-10-2023, మంగళవారము

ఆశ్వయుజ శుద్ధ తదియ


*4 శ్రీ మహాలక్ష్మీ దేవి*

18-10-2023, బుధవారమ

ఆశ్వయుజ శుద్ధ చవితి


*5 శ్రీ మహా చండీ దేవి*

19-10-2023, గురువారము

ఆశ్వయుజ శుద్ధ పంచమి


*6 శ్రీ సరస్వతీ దేవి*

20-10-2023, శుక్రవారము

ఆశ్వయుజ శుద్ధ షష్ఠి


*7 శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి*.

21-10-2023, శనివారము

ఆశ్వయుజ శుద్ధ సప్తమి


*8 శ్రీ దుర్గాదేవి దేవి*, 

22-10-2023, ఆదివారము

ఆశ్వయుజ శుద్ధ అష్టమి


*9 శ్రీ మహిషాసురమర్ధినీ ' ఉదయం*

*10 శ్రీ రాజరాజేశ్వరీ దేవి : సాయంత్రం*

23-10-2023, సోమవారము

ఆశ్వయుజ శుద్ధ నవమి 


దసరా, శరన్నవరాత్రి శుభాకాంక్షలతో... 

*గోగులపాటి కృష్ణమోహన్*

అధ్యక్షులు

శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం 

9700007653

సుఖం పొందుతారు.

 🚩🔯🌸🌄⚛🌅🌸🔯🚩

🌸🌼ಬೆಳಗಿನ 🌅 ಸೂಳ್ನುಡಿ🌼🌸 


*ಅನಾಗತವಿಧಾತಾ ಚ*

*ಪ್ರತ್ಯುತ್ಪನ್ನಮತಿಸ್ತಥಾ |*

*ದ್ವಾವೇತೌ ಸುಖಮೇಧೇತೇ*

*ಯದ್ಭವಿಷ್ಯೋ ವಿನಶ್ಯತಿ ||*

(ಪಂಚತಂತ್ರ)


ವಿಪತ್ತು ಬರುವ ಮೊದಲೇ ಪ್ರತಿಕ್ರಿಯೆ ಮಾಡುವವನು ಹಾಗೂ ಸಮಯಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ಬುದ್ಧಿಯನ್ನೋಡಿಸುವವನು - ಇವರಿಬ್ಬರೂ ಸುಖವನ್ನು ಪಡೆಯುತ್ತಾರೆ. ಆದದ್ದಾಗಲಿ ಎನ್ನುವವನು ನಾಶಹೊಂದುತ್ತಾನೆ.


*🌷🌺🙏 ಶುಭದಿನವಾಗಲಿ! 🙏🌺🌷*


విపత్తు రాబోతుందని ముందే జాగ్రత్త పడేవాడు, సమయస్ఫూర్తి తో విపత్తు ని తప్పించు కునేవాడు - వీరిద్దరూ సుఖం పొందుతారు. జరిగేది జరగనియ్యి అని కూర్చునేవాడు నాశనమవుతాడు.

శ్రీనాధ కవితా వైభవం!



శ్రీనాధ  కవితా వైభవం!


          శా:  "  కుక్షి ప్రోద్భవ  నిష్ఠుర క్షుధిత దు ష్క్రోధాంధకారంబు నన్ ,


                    జక్షుల్  రెండును  జిమ్మచీఁకటులుగా , సంరంభ  శుంభద్గతిన్ ,


                    బ్రేక్ష ఛ్ఛాత్రులు  భీతిఁబొందఁ , గడు నుద్రేకించి ,హట్టంబునన్ ,


                     బిక్షాపాత్రము  రాతిమీఁద  శతధా  భిన్నంబుఁగా   వైచితిన్ .


                       శ్రీ భీమేశ్వర పురాణము - 2 ఆ:  102 వ  పద్యము. కవిసార్వభౌమ  శ్రీనాధుడు.


           


               కఠిన  పదములకు  అర్ధము: కుక్షిప్రోధ్భవ- పొట్టనుం డిపుట్టిన ;నిష్ఠుర: కఠినముగా; క్షుధిత:  ఆకలిపీడగలిగిన; దు ష్క్క్రోధ :చెడ్డదియైనకోపమనే

; అంధకారంబునన్: చీకటిచేత ; చక్షుల్ రెండును- రెండుకన్నులును : చిమ్మచీకటులుగా- గాఢాంధకారముకాగా ; సంరంభ-తొందరపాటు చే నేర్పడిన; శుంభద్గతిన్- వేగముతో ; ప్రేక్షత్ -చూచుచున్న ;ఛాత్రులు- శిష్యులు ; భీతిఁబొంద-భయపడగా ; కడునుద్రేకించి- మిక్కిలి నుద్రేకముతో; హట్టంబునన్- వీధిలో (రోడ్డుమీద) భక్షాపాత్రము- బిచ్చమెత్తుకొను గిన్నె (మట్టిగిన్నె)  రాతిమీద ; శతధా-నూరుముక్కలుగా:భిన్నంబుగా వైచితిన్-పగులునట్లు నేలకు గొట్టితిని;


           భావము:  కడుపున  నాకలిరేగ నాయాకలి వలన గలిగిన కోపమనే గ్రుడ్డితనమున కన్నులు రెండును మూసుకొనిపోగా(కనులకు చీకటికమ్మ)  కడువేగముగా , పరిసరములందున్న శిష్యులెల్ల  భయమందగా  

మిక్కిలి యుద్రేకముతో  చేతనున్న భిక్షాపాత్రను  నూరుముక్కలగునట్లు  వీధిలో  నేలకు గొట్టితిని; అనిదీని భావము.


                    వ్యాసుడు కాసిని వీడివచ్చుటకు గల కారణమును  అగస్త్యునకు వివరించు సందర్భము. ఒకరు లోకహితార్ధియై వింధ్యపర్వత గర్వముడుప ( అగస్త్యుడు) కాశిని వీడిరాగా, మరియొకరు (వ్యాసుడు) ఆకలి కాగలేక కాశిని శపింప బూని ,పరమేశ్వరాగ్రహమునకు లోనయి కాశిని వీడవలసివచ్చినది. వీరిరువురి కలయిక ఒక అపూర్వము.ఒక దివ్యసందేశము.


              కోపమెంత దుర్గుణమో కదా!  దానికి యాకలియు తోడైనది. ఇంకేమున్నది? పుణ్యాలరాసి కాశిని వ్యాసుడుశపింప బూనినాడు.చివరకు కాశినుండి బహిష్కరింప బడినాడు. వ్యాసునకు మూజురోజులు భిక్షదొరుక కుండుట పరమేశ్వరుని మాయయే!

కాని యతడద్దానిని తెలిసికొనలేక పోయినాడు.


                         వ్యాసు డెట్టివాడు? పరమ సంయమి.తపస్వి . విజ్ఙాని, మహఋషి. అట్టియుత్తముడే  ఆకలి ,కోపములకు లొంగి పామరుని వలె ప్రవర్తించెను. కారణము? కోపము.కోపమెంతచెడ్డది?. దానిని అందరూ జయింప వలెనని  దీని సందేశము.


                  రామాయణ కావ్యం సుందరకాండలో  లంకా దహనానంతరం  హనుమంతు డెంతో విచారిస్తాడు. "కోపంతో యెంతపనిచేశాను.లంకంతా కాల్చేశాను. సీతామాత కేమైనా ప్రమాదం కలగలేదుగదా! కోపాన్ని జయించినవారు యెంత ఘనులోగదా! .కోపం చాలా చెడ్డది.దానివల్ల యుక్తాయుక్తములు మరచిపోతాం. కాబట్టి దానికి దూరంగా ఉండాలి అని"- నిజమే!


                   వ్యాసుని కోపావేశాన్ని ,ఆఉద్రేకాన్ని , ఆరౌద్రమూర్తిని ,శ్రీనాధమహాకవి  ఈపద్యంలో  ఆరభటీ వృత్తితో నిరూపించాడు. కఠిన సమాన పదజాలం, పెద్దపెద్ద సమాసాలు ఆరభటీ వృత్తికి పోషకాలు. ఈవిధంగా ఈపద్యంలో భయానక రసాన్ని పోషించి శ్రీనాధుడు

తన రసోచిత రచనను మనకు చవి చూపాడు.కోపంకూడదని  సందేశించాడు. 


                                                                స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🌷🌷

భక్తిసుధ

 🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

ॐ卐 *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐


*వందే దివ్యమచింత్యమద్వయమహం వందేఽర్కదర్పాపహం౹* 

*వందే నిర్మలమాదిమూలమనిశం వందే మఖధ్వంసినం౹*

*వందే సత్యమనంతమాద్యమభయం వందేఽతి శాంతాకృతిం౹* 

*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹*


శివస్తుతి - 3


దివ్యమైన వాడు, అచింత్యుడు (మన ఆలోచనకు అందని వాడు), రెండవ సాటి లేని వాడు,   సూర్యుని దర్పమును నాశనము చేసిన వాడు, మచ్చలేని వాడు, ఆరంభమునకు మూలమైన వాడు, నాశనములేని వాడు, దక్షుని యజ్ఞమును నాశనము చేసే వాడు, సత్యమైన వాడు, అనంతమైన వాడు, మూలమైన వాడు, భయము లేని వాడు, శాంత స్వరూపుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

నాయకుడి లక్షణం

 🌻🌻🌻🌻🍁🍁🍁

*_నాయకుడంటే ముందు నడిచేవాడు కాదు, నేనున్నానే అభయం ఇచ్చి తనను నమ్ముకున్న ప్రజలను ముందుకు నడిపించేవాడు._*


 _*నాయకత్వం అంటే ఒక హోదా కాదు, ఒక బాధ్యత. ఇది ఎవరో ఇచ్చే కిరీటం కాదు. నలుగురి మంచి కోసం తనకు తానుగా ఎంచుకున్న ముండ్లబాట.*_ 


 _*నిజమైన నాయకుడు అపజయం పాలైతే తనదిగా స్వీకరిస్తాడు. విజయం సాధిస్తే ప్రజలదిగా భావిస్తాడు. ఇదే నికార్సయిన నాయకుడి లక్షణం, లక్ష్యం.*_

🙏🙏🙏

Sree ramaa