18, మార్చి 2024, సోమవారం

రాశి ఫలితాలు

 18-03-2024

ఇందు వాసరః సోమవారం 

రాశి ఫలితాలు

********

మేషం 

సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

---------------------------------------

వృషభం

ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

---------------------------------------

మిధునం

పాత బుణాలు తీరి ఊరట పొందుతారు. నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు బయటపడతారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి. 

---------------------------------------

కర్కాటకం 

దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా ఉండదు. ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

---------------------------------------

సింహం

ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి.

---------------------------------------

కన్య

ధన వ్యవహారాలలో చిన్న పాటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. 

---------------------------------------

తుల

కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

వృశ్చికం

స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.

---------------------------------------

ధనస్సు 

వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.

---------------------------------------

మకరం

ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. ఆర్ధిక ఇబ్బందులు వలన ఒత్తిడి అధికమౌతుంది. నూతన ఋణ యత్నాలు అంతగా కలిసిరావు.

---------------------------------------

కుంభం

ఆర్ధికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పాత ఋణాలు తీరుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారము భాద్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు. 

---------------------------------------

మీనం

నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2023(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.18.03.2024

సోమ వారం (ఇందు వాసరే) 

*************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

శిశిర ఋతౌ 

ఫాల్గుణ మాసే శుక్ల పక్షే నవమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

ఇందు వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

శిశిర ఋతౌ 

ఫాల్గుణ మాసే 

శుక్లపక్షే నవమ్యాం

ఇందు వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.11

సూ.అ.6.06

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం 

శుక్ల పక్షం నవమి రా. 2.20 వరకు. 

సోమ వారం. 

నక్షత్రం ఆర్ద్ర రా. 9.47 వరకు.  

అమృతం ప.11.32 ల 1.10 వరకు. 

దుర్ముహూర్తం మ.12.32 ల 1.20 వరకు.

దుర్ముహూర్తం మ. 2.55 ల 3.43 వరకు. 

వర్జ్యం ఉ. 7.27 వరకు. 

యోగం సౌభాగ్య రా.8.10 వరకు. 

కరణం బాలవ మ.2.22 వరకు.  

కరణం కౌలవ రా. 2.20 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం ఉ. 7.30 ల 9.00 వరకు. 

గుళిక కాలం మ.1.30 ల 3.00 వరకు. 

యమగండ కాలం ఉ.10.30 ల 12.00 వరకు. 

*************

పుణ్యతిధి ఫాల్గుణ శుధ్ధ నవమి.

**************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2023(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

Joke














 

కృష్ణభక్తి

 *🙏\|/కృష్ణభక్తి - మాతృమూర్తి ఋణం\|/🙏* 

 *🙏🪷🌹🪷\|/🌹\|/🌹\|/🪷🌹🪷🙏* 

*కళ్యాణచక్రవర్తి జ్యోతిష్య - వాస్తునిలయం*

*బుచ్చిరెడ్డిపాళెం నెల్లూరుజిల్లా 9014612323*


*🙏\|/ ఆదిశంకరాచార్యులవారు సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వేళ్ళే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధ పడింది.*


*🙏\|/ "శంకరా, నువ్వు నాకు ఏకైక పుత్రుడువి కదా! నన్ను వదలి వెళ్ళి పోతున్నావు, ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు? నాకు దిక్కెవరు " అని దీనంగా ప్రశ్నించింది.*


*🙏\|/ "అమ్మా! ఏ సమయమైనా సరే, నీవు తల్చుకుంటే చాలు నీ ముందు వుంటాను." అన్నాడు శంకరుడు.*


*🙏\|/ భగవత్పాదులు శంకరాచార్యులవారి తల్లికి మరణకాలం సమీపించింది. మూసిన కళ్ళు తెరవలేదు.*


*🙏\|/ "నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు" అని మనసులోనే తలుచుకుంటూ వున్నది ఆర్యాంబ. తల్లి తలచుకుంటున్నదన్న విషయం ఆదిశంకరులు గ్రహించారు. వెంటనే శ్రీకృష్ణుని ధ్యానించారు.* 


*🙏\|/ శ్రీకృష్ణుడు ఏం కావాలని అడిగాడు. కురుపితామహుడు భీష్మాచార్యునికి మోక్షమిచ్చినట్లుగా నా మాతృమూర్తికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు శంకరాచార్యులవారు.*


*🙏\|/ అర్యాంబ , తలుచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తపిస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తున్న అలికిడయింది. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో వున్న ఆర్యాంబ చటుక్కున లేచి శంకరా అంటూ , అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని, గట్టిగా హృదయానికి హత్తుకుంది.*


*🙏\|/ బాలుని ఒంటి నిండా ఆభరణాలను గమనించిన ఆర్యాంబ‌, శంకరుడు సన్యాసి కదా ! యీ ఆభరణాలు ఎలావచ్చాయని అనుకున్నది. బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది ఆర్యాంబ.*


*🙏\|/ అక్కడ తను అను నిత్యం పూజించే గురువాయూరు శ్రీకృష్ణుడు సాక్షాత్కరించి నిలచివుండడం గమనించింది.*


*🙏\|/ గురువాయూరప్పని చూసిన ఆర్యాంబ మహదానందంతో " అప్పా! నోరు తెరిచి, నీ నామజపం చేసే శక్తి కూడా లేని యీ దీనురాలి ఆఖరిక్షణాలలో నను చూసేందుకు వచ్చావా? కృష్ణా " అని మెల్లిగా గధ్గదకంఠంతో పలికింది.*


*🙏\|/ శ్రీకృష్ణుడు వెంటనే "నీ పుత్రుని ఆదేశం. రాకుండా వుండగలనా ? అమ్మను చూడకుండా వుండగలనా " అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు.*


*🙏\|/ అదే సమయానికి శంకరాచార్యులవారు కూడా అక్కడికి వచ్చారు.* 


*🙏\|/ ఉప్పొంగిన ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో " నాయనా ! నా భాగ్యమేమని చెప్పను? నిన్ను పుత్రుని గా పొంది నేను తరించాను. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావుకదా, శంకరా!" అని కన్నీళ్ళు కార్చింది.*


*🙏\|/ గోపాలుని నేను నిలబెట్టడమేమిటి నేను జన్మించినది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు , కష్టాలకు బదులుగా నేనేమీ చేయలేకపోయాను. సాక్షాత్తు భగవంతుడే మానవరూపంలో పుట్టినా మాతృ ప్రేమకు సాటిగా , ఎంతటి సేవచేసినా కన్నతల్లి ఋణం అణువంతైనా తీరదు.*


*🙏\|/ నేనైనా అంతే. నేను చేయగలిగినదంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రమాణం ఒక్కటే "అని మాతృదేవత పాదాలముందు మోకరిల్లారు ఆదిశంకరాచార్యులవారు.*


*🙏\|/ మన తల్లి తండ్రులకు మనం చేసే సేవల వల్లనే వారి మనసు సంతృప్తిచెంది వారి దివ్యాశీస్సులు సదా తమ బిడ్డలకు ప్రసాదిస్తారని జగద్గురుఆదిశంకరాచార్యులవారు ఈ లోకానికి సందేశమిచ్చారు.*


*కళ్యాణచక్రవర్తిజ్యోతిష్య-వాస్తునిలయం*

*బుచ్చిరెడ్డిపాళెం నెల్లూరుజిల్లా*  

*9014612323 * 9391087299*

ప్రతిరోజు పంచాంగం, రాశిఫలాలు, జాతకవిషయాలు,వాస్తు విషయాలు, మరియు ఆధ్యాత్మిక భక్తి కధలు తెలుసుకొనుటకు క్రింది లింక్ ను నొక్కండి.మీ స్నేహితులు బంధువులు వాట్సాప్ గ్రూప్ లో క్రింది లింక్ ద్వారా చేరుటకు ఈమెసేజ్ ను షేర్ చేయండి.

https://chat.whatsapp.com/LTQgDSttuND308f3enLZR4

17, మార్చి 2024, ఆదివారం

చర్మవ్యాధుల గురించి

 చర్మవ్యాధుల గురించి సంపూర్ణ వివరణ - చర్మవ్యాధులు రావడానికి గల కారణాలు - 


  * విరుద్ధములగు అన్నపానములు తినటం అనగా పాలతో తయారైన సేమ్యా , కోవా , ఐస్ క్రీం తిని పెరుగన్నం తినటం లేదా చల్లని కూల్ డ్రింక్ ని వేడిఅన్నం , కూరలు కలిపి తినటం ఇలాంటి ఆహారపు అలవాట్లు పాటించటం . 


 * మలమూత్రాలను ఆపడం , అదేవిధముగా వాంతి వంటి సహజ వేగాలను బలవంతముగా నిరోధించడం . 


 * భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయుట , ఎండలో తిరుగుట చేయరాదు . 


 * ఎండలో తిరిగి వచ్చి చల్లని నీరు తాగరాదు . 


 * అతిగా శ్రమపడి వచ్చి వెంటనే నీటిని సేవించరాదు . 


 * అజీర్ణముగా ఉండగా మరలా భుజించరాదు . అనగా ముందు తిన్నది సంపూర్ణముగా అరగక ముందు మరలా భోజనం చేయరాదు . 


 * కొత్తబియ్యపు అన్నం , పెరుగు మరియు చేపలు కలిపి తినరాదు . 


 * అధికంగా పులుపు , ఉప్పు తినరాదు . 


 * మినుములు , ముల్లంగితో చేయబడిన వంటలు , పాలు నువ్వులతో చేసిన వంటలు ఎక్కువుగా తీసుకొనుట 


 * తినిన ఆహారం జీర్ణం కాకముందే దాంపత్యములో పాల్గొనుట చేయరాదు . 


 * పగలు నిద్రించరాదు . పగలు నిద్రించుట వలన శరీరం నందు శ్లేష్మము పెరిగి దానివలన రక్తప్రసరణకు అవరోధము కలిగి చర్మమునకు రక్తప్రసరణ సరిగ్గా జరగక చర్మవ్యాధులు సంభవించును . ఎండాకాలం కొంచంసేపు పగలు నిద్రించవచ్చు . 


        పైన చెప్పినవిధముగా విరుద్ధమైన ఆహారం , పనులు చేయుటవలన శరీరంలో చర్మము , రక్తము , మాంసము , లింప్ గ్రంథులు దోషమును పొంది రకరకాల చర్మవ్యాధులు కలుగును. 


  చర్మవ్యాధులు రావడానికి పూర్వము కనిపించు లక్షణములు - 


 * స్పర్శజ్ఞానం క్రమేపి తగ్గిపోవుట . 


 * చెమట ఎక్కువుగా పట్టుట లేదా చర్మవ్యాధి ప్రదేశము నందు అసలు చెమట పట్టకపోవును . 


 * శరీరవర్ణము మారి నల్లబారిపోవుట . 


 * దద్దుర్లు . 


 * పోట్లు . 


 * అలసట , వడలినట్లు అగుట. 


 * వ్రణములు లేచి అధికభాధతో కూడి శీఘ్రముగా  

      జనించి త్వరగా మానకుండా ఉండటం. 


 * తాపము ( చర్మం అంతా మంటలు ) . 


  అసాధ్య చర్మవ్యాధి లక్షణములు - 


 * రోగి బలహీనుడుగా ఉండి దప్పిక , మంట , అగ్నిమాంద్యములతో కూడి క్రిములు ఏర్పడిన అసాధ్యము . 


 * చర్మవ్యాధి ఏర్పడి 10 సంవత్సరాలు దాటిన     

      అసాధ్యము . 


  చర్మవ్యాధుల యందు చికిత్సాక్రమము - 


        శరీరము నందలి వ్యర్ధపదార్ధముల వలన చర్మవ్యాధులు వచ్చును . కాబట్టి వానిని వివిధరకాల పద్ధతుల ద్వారా వాంతి , విరేచనం మొదలగు శోధన పద్ధతులను ఉపయోగించి వ్యర్ధాలను బయటకి పంపుతూ ఔషధాలను ఇయ్యవలెను . 


  చర్మవ్యాధుల యందు పథ్యము - 


  * తేలికగా అరిగెడి ఆహారం తీసికొనవలెను . 


  * త్రిఫలములు - ఉశిరి , కరక్కాయ , తానికాయ 

       విరివిగా వాడవలెను . 

  

  * త్రిఫలా ఘృతము కూడా వాడవచ్చు . 


  * పాతధాన్యములు వాడవలెను . 


  * యవలు , చామలు , కొర్రలు , కందికట్టు , పెసర 

       కట్టు , మేకమాంసం వాడవలెను . 


  * బీరకాయ , పొట్లకాయ , దోసకాయ , పెరుగు 

      తోటకూర , పొన్నగంటికూర , మెంతికూర , ఆవు 

       నెయ్యి , తెల్ల గలిజేరుకూర , తేనె , నీరుల్లి . 


           పైన చెప్పిన పదార్ధాలు ఆహారంలో తప్పక భాగం చేసుకొనవలెను . 


  చర్మవ్యాధుల యందు అపథ్యము - 


 * చింతపండు పులుపు , అతిగా కారం , ఆవాలు , 

      గుమ్మడి , వెల్లుల్లి , పెరుగు , పాలు . 


 * బెల్లం , కల్లు , సారాయి , నువ్వులు .


 * మినుములు , చెరుకురసము , పానకము .


 * చేపలు , నీటిపక్షులు , కోడి మాంసం , పావురం .


 * అతిగా వ్యాయామం , స్త్రీసంభోగం చేయరాదు .  


          పైన చెప్పినవిధముగా ఆహారపు అలవాట్లు పాటిస్తూ సరైన వైద్యుడి పర్యవేక్షణలో ఔషధాలు సేవించుచున్న చర్మవ్యాధుల నుంచి త్వరగా బయటపడగలరు. ఇక్కడ మనం ముఖ్యముగా గుర్తు ఉంచుకోవాల్సిన విషయము ఏమిటంటే వ్యాధి సంప్రాప్తినిచ్చిన తరువాత ఔషధాలు సేవించుట కంటే వ్యాధి రాకుండా చూసుకోవడమే అత్యంత ప్రధానమైనది. 


 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

Panchaag

 


Voter ID Card

 *Voter ID Card: ఓటరు ఐడీ కార్డులో ఏదైనా తప్పులు ఉన్నాయా? ఈ విధంగా అప్‌డేట్ చేసుకోండి*


కొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు (2024). మరి ఓటరు గుర్తింపు కార్డు ఎంపిక ఎలా సాధ్యం? ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్ ఐడీ కార్డులో మీ చిరునామా తప్పుగా ఉంటే ఓటు వేయడం కష్టం. అందుకే ఇప్పుడు ఓటరు గుర్తింపు కార్డు చిరునామాను అప్‌డేట్ చేయడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. అయితే దీని కోసం మీరు మరెక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని గురించి డిటేయిల్డ్‌గా తెలుసుకుందాం


1. ఓటరు గుర్తింపు కార్డుపై చిరునామాను అప్‌డేట్ చేయడానికి, మీరు ముందుగా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.inకి లాగిన్ అవ్వాలి. అప్పుడు మీరు వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ఎలక్టోరల్ రోల్‌లో నమోదుల సవరణ కనిపిస్తుంది. ఆ విభాగంపై క్లిక్ చేయండి.

2. ఆ తర్వాత ఫారం-8పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ముందు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కొన్ని అవసరమైన వివరాలను నమోదు చేయాలి. ఇక్కడ మీరు సెల్ఫ్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

3. ఇక్కడ మీరు షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఎంపికను ఎంచుకోవాలి. మీ అడ్రస్ నియోజక వర్గం లోపల లేదా వెలుపల మారుతుందో లేదో కూడా మీరు ఎంచుకోవాలి. ఆ తర్వాత సరే క్లిక్ చేయండి.

4. అప్పుడు మీరు మీ రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంటరీ నియోజకవర్గం సమాచారాన్ని పూరించాలి. ఆ తర్వాత ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నంబర్, ఇమెయిల్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

5. తర్వాత మీ కొత్త అడ్రస్‌ ఎంటర్‌ చేసి ఓటరు ఐడీ కార్డ్‌లో అప్‌డేట్ చేయండి. పత్రాన్ని అప్‌లోడ్ చేసిన తర్వాత తదుపరి ఎంపికపై క్లిక్ చేయండి. తర్వాత క్యాప్చా కోడ్‌ని నమోదు చేసి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి.

6. ఆ తర్వాత మీ ఆన్‌లైన్ అప్లికేషన్ వెరిఫై చేయబడుతుంది. అయితే మీరు అప్లై చేసే ముందు అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా? లేదా అని తెలుసుకోవాలి. మీ ఓటర్ ఐడీలో కొత్త అడ్రస్‌ అప్‌డేట్ చేయడం జరుగుతుంది. దీని కోసం మీరు ఎటువంటి డబ్బు ఖర్చు చేయనవసరం లేదు.

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 57*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 166*


*అన్ని జాతులకును నాధారమైనట్టు*

*లున్న సామగాది మిన్న ఋషుల*

*నెన్ని జన్మములకు నెక్కడ గానము* 

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

అన్ని జాతులకు ఆధారమైన ఋషుల జన్మమును ఎక్కడను చూడలేము.

ఋషితత్వమలవడుట పురాకృతసుకృతము.


*💥వేమన పద్యాలు -- 167*


*అన్ని జాతులందు నధికుల మనుచును*

*యజ్ఞ పశువు జంపి యగ్ని నిడుచు*

*మల్ల మందు బెట్టి మాంసంబు దిందురు*

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

బ్రాహ్మణులు అన్ని జాతులకంటే తమ జాతే గొప్పదని పలుకుచు యజ్ఞయాగాదుల అగ్నిలో కాల్చి ప్రసాదముగా

తిందురు.


*💥వేమన పద్యాలు -- 168*


*అన్ని జాడ లుడుగ నానందకాముడై*

*నిన్ను నమ్మ జాలు నిష్ఠతోడ*

*నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయాన* 

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

ఆశలన్ని తీరిపోయాక దేవుని గూర్చి నమ్మబలికి , మానవుడు ముక్తి కాముకు డౌతాడని భ్రమపడుదురు.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 53*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*శృతివిప్రతి పన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా ।*

*సమాధావచలా బుద్ధిస్తదా యోగామవాప్స్యసి ।।*


*భావము:* 

కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందెదవు.


*వివరణ:*  

సాధకులు ఆధ్యాత్మిక పథంలో పురోగమించేటప్పుడు తమ మనస్సులో వారికి భగవంతునితో సంబంధం బలపడుతూ ఉంటుంది. ఆ సమయంలో, తాము పూర్వం చేసే వైదిక కర్మలు ప్రతిబంధకంగా, సమయం తీసుకునేవిగా అనిపిస్తాయి. తమ భక్తి తో పాటుగా ఇంకా పూజలు మొదలగునవి చేయాలా అని అనుకుంటారు మరియు పూజాది కార్యాలను వదిలి పూర్తిగా సాధన లో నిమగ్నమైతే ఏదైనా తప్పు చేసినట్టవుతుందా అని సంశయ పడతారు. ఇలాంటి వారు తమ సందేహానికి ఈ శ్లోకం లో జవాబు తెలుసుకొంటారు. కోరికలను తీర్చే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా సాధన లోనే నిమగ్నం అవటం తప్పు కాదని, పైగా అది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.


మాధవేంద్ర పూరి అనే 14వ శతాబ్ద ముని చాలా దృడంగా ఈ భావాన్ని వ్యక్తం చేస్తాడు. అతను విస్తృతమైన కర్మకాండ ఆచారాలు పాటించే ఒక వేద బ్రాహ్మణుడు, కానీ సన్యాసం తీసుకుని, పరిపూర్ణంగా శ్రీ కృష్ణభక్తి లో నిమగ్నమయిపోయాడు. తన జీవిత తదుపరి దశలో ఇలా అన్నాడు:


*సంధ్యా వందన భద్రమస్తు భవతే భోః స్నాన తుభ్యం నమః*

*భో దేవః పితరశ్చతరపణ విధౌ నహం క్షమః క్షమ్యతాం*

*యత్ర క్వాపి నిషద్య యాదవ కులోత్తాస్య కంసద్విషః*

*స్మారం స్మారమఘం హరామి తదలం మన్యే కిమన్యేన మే*


"అన్ని వైదిక ఆచారాలకి నా క్షమార్పణ అర్పిస్తున్నాను, ఎందుకంటే వాటిని పాటించటానికి ఇక నావద్ద సమయం లేదు. కాబట్టి ఓ ప్రియమైన, సంధ్యా వందనము (ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం పొందినవారు రోజుకు మూడు సార్లు చేసే వైదిక ప్రక్రియ), పుణ్య స్నానాలు, యజ్ఞయాగాదులు, పితృకర్మలు వంటివి, దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు, నేనెక్కడ కూర్చున్నా, కంస విరోధి అయిన శ్రీ కృష్ణ పరమాత్మ నే ధ్యానిస్తున్నాను, అది చాలు నన్ను ఈ భౌతిక బంధాల నుండి విడిపించటానికి".


శ్రీ కృష్ణుడు 'సమాధౌ-అచలా' అన్న పదాన్ని, భగవంతుని ధ్యాస లో ఉండే ధృఢ సంకల్పాన్ని సూచించటానికి, ఈ శ్లోకం లో ఉపయోగించాడు. 'సమాధి' అన్న పదం 'సమ్' (సమత్వము) మరియు 'ధి' (బుద్ది) అన్న మూలధాతువుల నుండి ఏర్పడింది, అంటే 'పరిపూర్ణ సమత్వ బుద్ధి స్థితి'. ఉన్నతమైన చైతన్యం లో స్థిర బుద్ది కలిగి, ప్రాపంచిక భౌతిక ప్రలోభాల పట్ల మోహితుడు కానివాడు ఆ యొక్క 'సమాధి' అంటే సంపూర్ణ యోగ స్థితిని పొందుతాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*షష్ఠ స్కంధం*


*సతతము కృష్ణ పాదజలజంబులయందు మనంబు నిల్పు సు*

*వ్రతులు తదీయ శుద్ధ గుణరాగులు కాలుని యుగ్రపాశ సం*

*హతుల ధరించు తత్సుభటవర్గములం గలలోన గానరే*

*గతులను దుష్టకర్మములు గైకొని వారల జెందనేర్చునే?*


రాజా ! శ్రీకృష్ణుడు పరమాత్మ. నామరూపాలులేని పరమాత్మ లోకాలను అనుగ్రహించటం పనిగా శ్రీకృష్ణమూర్తియై భూమికి దిగివచ్చాడు. ఆయన పాదపద్మాలయందు నిరంతరం మనస్సును నిక్షేపించాలి. అలా చేసేవారిని ‘సువ్రతులు’ అంటారు. ఆ మహాత్ముడు మానవులను ఉద్ధరించటంకోసం భూమిపై సంచరించిన కాలంలో కొన్ని గుణాలను లీలలుగా ప్రకటించాడు. మనం అట్టి అతని శుద్ధగుణాలయందు చెదరని అనురాగం కలవారమైపోవాలి. అలా అయిన వారు భయంకర పాశాల దెబ్బలను వడ్డించే యమభటుల గుంపులను కలలో కూడా చూడరు. ఎటువంటి ఘోరమైన కర్మముల చేయగల అధికార పురుషులైనా కృష్ణభక్తుల దాపునకు ఏవిధంగానూ రాలేరు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹