24, ఫిబ్రవరి 2025, సోమవారం

తెలుగు మన భాష

 తెలుగు మన భాష

తెలుగు మన సంస్కృతి

తెలుగు మన గుర్తింపు

తెలుగు మన అస్తిత్వం


ఇట్టి తెలుగు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటుంది. పాఠశాలల నుండి తెలుగు మాధ్యమం తరిమివేయ బడింది. కార్పరేట్ కళాశాలల ప్రభావం వలన ఇంటర్మీడియట్ లో తెలుగుకు బదులు మార్కుల కొరకు సంస్కృతం వచ్చి చేరింది. డిగ్రీ కళాశాలలో కూడా అదే పరిస్థితి. కొన్ని కళాశాలల్లో మాత్రమే తెలుగు అంశం బోధించబడుతుంది.


ఇక యువకులు చాలా వరకు తెలుగు వార్తాపత్రిక కూడా చదవలేని పరిస్థితి, వ్రాయడం ఇంకా కష్టమైన అంశం. తెలుగు మాట్లాడ గలుగుతారు. అదీ ఎన్నో ఉచ్ఛారణ దోషాలతో. ఇక పద్యమైతే మరచిపోవాలి. ఇప్పుడు యువత పరిస్థితి ఏమిటంటే తెలుగును ఆంగ్ల అక్షరాలలో వ్రాసుకొని చదువుకుంటారు. సినిమా పాటలు లిరిక్ ఎడిషన్ ఆంగ్ల అక్షరాలతో వస్తుంది గమనించండి. ఈ పరిస్థితులలో ఒక రెండు తరాల తరువాత తెలుగు అక్షరం కనుమరుగై పోతుందని భయంగా వుంది. 


ఈ పరిస్థితి ఎదుర్కొని తెలుగును ఫరిడవిల్లేలా చూసే బాధ్యత మనందరిపై ఎంతైనా ఉంది. అందరు కలిసి తెలుగు భాషకై ప్రజలను చైతన్య పరచి కృషి చేయడం ఎంతైనా అవసరం.

భోజనం, టిఫిన్స్ అందజేస్తాం.

 దూరప్రాంతాలు ప్రయాణం చేసే ప్రయాణికులకు కూడ భోజనం, టిఫిన్స్ అందజేస్తాం.

మీరు చేయవలసిందల్ల ఒక రోజు ముందు తప్పక తెలియ చేయండి

విజయవాడ: 9346021045

సికింద్రాబాద్: 9346747694

వరంగల్: 9703100005

రాజమండ్రీ: 6304049434

ఒరిస్సా: 7008179751

విజయనగరం: 7675883368

అనంతపూర్: 8374392377

రేణిగుంట: 9441218771

వైజాగ్: 8008390978

గుంటూరు: 6300070049

షిరిడి: 9511111585

తిరుపతి; 9949189087

వారణాసి: 8985667737

బెంగుళూరు 9448605879

కర్నూల్ 9885777077

నాగపూర్: 9403302715

వారణాసి: 7318366814

Housur( తమిళనాడు)

Mallur (కర్ణాటక) బోర్డర్

9944799931

మాఘ మాసంలోనే శివరాత్రి

 మాఘ మాసంలోనే శివరాత్రి ఎందుకు చేసుకోవాలి.?


🌷🕉🌷


అమవాస్య ముందురోజైన కృష్ణపక్ష చతుర్దశి అంటేనే శివునికి మాహా ప్రీతికరమైన రోజు. అందుకే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాసశివరాత్రి అని పిలుచుకుంటారు. ఆ రోజున శివుని భక్తితో కొలుచుకుంటారు. ఏడాది పొడవునా వచ్చే శివరాత్రులలో మాఘమాసంలో వచ్చేది మహిమాన్వితమైనది కాబట్టి, దీన్ని మహాశివరాత్రి అంటూ ఓ పెద్ద పండుగలా భావిస్తారు. పండుగ అన్న మాట వినగానే మనకు పిండివంటనే గుర్తుకువస్తాయి. కానీ శివరాత్రి మాత్రం శరీరానికి కాదు, మనసుకే పండుగ! ఉపవాసజాగరణలతో శివసాయుజ్యానికై తపించే వేడుక! అలాంటి శివరాత్రితో ముడిపడి ఉన్న కొన్ని అంశాలు... వాటి వెనుక ఉన్న విశేషాలు...


చతుర్దశి విశేషం!


పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న పక్షాన్ని కృష్ణపక్షం అంటాం. ఈ తిథులలో ఒకో రోజూ గడిచేకొద్దీ చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు. అందుకే ఆయనను క్షీణ చంద్రుడు అని కూడా పిలుస్తారు. జ్యోతిషశాస్త్ర ప్రకారం చంద్రుడు మనఃకారకుడు. అమావాస్య నాటికి, ఆయన మనసుని నిస్తేజంగా మార్చేస్తాడని ఒక నమ్మకం. తద్వారా మనుషుల ఆలోచనా తీరు, వారిలోని ఉత్సాహం మందగిస్తాయట. ఇలాంటి సమయంలో భగవంతుని మీద మనసుని లగ్నం చేయడం వల్ల రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి- నిస్తేజంగా ఉన్న మనసు భగవన్నామంతో ఉత్తేజితం అవుతుంది. రెండు- ఎటువంటి కష్టం వచ్చినా, వాటిని ఆ భగవంతుని మీద భారం వేసే నమ్మకం కలుగుతుంది. మర్నాడు నిస్సత్తువగా గడవాల్సిన అమావాస్య కూడా ఉత్సాహంగా సాగిపోతుంది.


మాఘ శివరాత్రే ఎందుకు!


శివరాత్రినాటికి చలి, శివశివా అని వెళ్లిపోతుందంటారు పెద్దలు. రథసప్తమినాటికి మొదలయ్యే సూర్యకిరణాల తీక్షణత మరుసటి వారంనాటి శివరాత్రికి వేడినందుకుంటాయి. అంటే శివరాత్రినాటికి చలి, వేడి ఒకేస్థాయిలో ఉంటాయన్నమాట. ఎండాకాలం ఉపవాసం ఉండటం కష్టం. చలికాలం జాగరణ చేయడం కష్టం. ఈ రెండూ ఇష్టంగా చేసేందుకు వాతావరణం కూడా కాస్తా అనుకూలించాలి కదా! అలాంటి సమశీతోష్ణ స్థితి ఉండేది మహాశివరాత్రినాడే!


 


ఉపవాసం, జాగరణ


శరీరానికి ఎప్పటికప్పుడు ఆహారం అందిస్తున్నంతసేపూ అది సుఖంగా ఉంటుంది. సుఖపడే శరీరం మనసుని కూడా జోకొడుతుంది. కానీ ఒక్కరోజున కనుక శరీరాన్ని ఎండపెడితే, నేనంటూ ఒకదాన్ని ఉన్నానంటూ అది మనకి గుర్తుచేస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటూ మనసు విచారణ సాగిస్తుంది. ఉపవాసజాగరణలతో శరీరం, మనసు రెండూ మెలకువతో ఉంటాయి. మనసావాచా శివుని ధ్యానించేందుకు ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది!


బిల్వ పత్రం


శివరాత్రినాడు శివుని బిల్వపత్రంతో పూజించాలని చెబుతారు. మూడుకొసలుగా చీలి, చూడగానే త్రినేత్రుని గుర్తుకుతెచ్చే బిల్వం (మారేడు) మన దేశంలోనే పుట్టిన ఒక ఔషధి వృక్షం. బిల్వవృక్షం ఎదిగేందుకు ఎలాంటి ప్రత్యేక వాతావరణం అవసరం లేదు. కోసిన తరువాత కూడా సుదీర్ఘకాలం నిల్వ ఉండే ఈ దళాలు, ఆరోగ్యపరంగా దివ్యౌషధాలు. అందుకే బిల్వ పత్రానికి ‘మృత్యు వంచనము’ అన్న పేరు కూడా ఉంది. సుదీర్ఘకాలంపాటు శివలింగం చెంతనే ఉన్నా ఈ పత్రాలు చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేస్తాయే కానీ, గాలిని కలుషితం గావించవు. మరి శివుని బిల్వ పత్రాలతో కాకుండా మరే పత్రాలతో పూజించగలం!


అభిషేకం


విగ్రహాన్ని స్పర్శించడం ద్వారా భగవంతుని పూజించుకునే గొప్ప మార్గం... అభిషేకం! అందునా శివుని అభిషేక ప్రియుడు అంటారు. పళ్లు, పూలు ఏవీ దొరక్కపోయినా కాసిని బిల్వపత్రాలతో పూజించి, లింగానికి అభిషేకం చేస్తే తృప్తి పడిపోతాడు భోళాశంకరుడు. శివలింగం గుడిలో ఉంటే నిరంతరం పైనున్న ధారాపాత్ర నుంచి నీటి ధార పడుతూ ఉండాల్సిందే! అభిషేకం అంటేనే ప్రక్షాళన చేయడం అన్న అర్థం వస్తుంది. శరీరాన్ని ఎలాగైతే నీటితో శుద్ధి చేసుకుంటామో, మనసుకి అంటిన మలినాన్ని తొలగించేందుకు సూచనగా సాగే ఆచారమే అభిషేకం.

                  అరుణాచలశివ 🌹


ఓం నమః శివాయ🙏


🌷🕉

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం

సాంఖ్యయోగం: శ్రీభగవానువాచ


హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్

తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః(37)


సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జాయాజయౌ

తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి(38)


అర్జునా... ధర్మయుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు. శత్రువులను జయిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తావు. అందువల్ల కృతనిశ్చయంతో యుద్ధానికి నడుం బిగించు. సుఖదుఃఖాలూ, లాభనష్టాలూ, జయాపజయాలూ సమానంగా భావించి సమరం సాగించు. అప్పుడు నీకు పాపం కలగదు.

మాఘ పురాణం - 27

 _*మాఘ పురాణం - 27 వ అధ్యాయము*_


🌅🏞️🌅🌊🌅🏞️🌅

*🙏ఓం నమో భగవతే నారాయణాయ*


*సులక్షణ మహారాజు కథ*

*🌅🛕📚TVBC📚🛕🌅*

**************************

🕉️📚🕉️📚🕉️📚🕉️📚

గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. జన్మ సంసారమను అను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాసవ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరియొక కథను వినుము. పూర్వము ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షణ రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు. బలపరాక్రమములు కలవాడు ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి నూరుగురు భార్యలున్నను సంతానము మాత్రము లేదు. రాజులందరును వానికి సామంతములై కప్పములు చెల్లించుచున్నను సంతానము లేదను విచారము మాత్రము రాజునకు తప్పలేదు.


నేనేమి చేసిన కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును , పెద్దలు పుత్రులు లేనివారికి దరిద్రునికి , కృతఘ్నునకు , వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదనియందురు. పుత్రులు లేని నేను మహర్షుల యాశ్రమమునకు పోయి అచట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైన ఉపాయము చెప్పగలరేమో ? ప్రయత్నించి చూచెదను అని నిశ్చయించెను. అనేకమంది మహర్షులు కల నైమిశారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిశారణ్యమునకు వెళ్లెను , అచట మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి యిట్లనిరి. రాజా ! వినుము నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు , సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రధసప్తమి నాడు కూష్మాండ దానమును చేయలేదు. అందువలన నీకీ జన్మలో సంతానము కలుగలేదు. ఇందువలననే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానము కలుగలేదు అని చెప్పిరి. అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయము చెప్పుడని వారిని ప్రార్థించెను. అప్పుడా మునులు ఓక ఫలమును మంత్రించి రాజునకిచ్చిరి. దీనిని నీ భార్యలందరికిని పెట్టుము. ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చెను. రాణులు సంతోషముతో వారికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషముతో స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యా గృహమునుంచెను. స్నానము మున్నగునవి చేయవలెనని లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగలించి తానొక్కతియే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులను , రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదనిరి , తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. రాజు యేమియు చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకామె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య యిట్లు గర్భవతి యగుట మిగిలిన భార్యలకిష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములను చేసిరి. కాని దైవబలమున అవి అన్నియు వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన గర్బపాతమునకిచ్చిన మందుల వలన చిన్న భార్య మతిచెడెను. ఎవరికి తెలియకుండ అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు ఆమె అలసెను ఒక పుత్రుని కని యొడలు తెలియకపడియుండెను. గుహలోనున్న పులి బాలింతను యీడ్చుకొని పోయి భక్షించెను.


🌅🏞️🌅🌊🌅🏞️🌅

*⛳🛕ॐ•TVBC•卐🛕⛳*

•••••••••••••••••••••••••••••

*🪀📖courtesy by📲🙏*.

*🛕卐ॐ•TVBC•ॐ卐🪔*•••••••••••••••••••••••••••

http://www.youtube.com/c/TVBCTelanganavenkateshwaraBhakthichannel

🕉️📚📚📚📚🕉️


అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి యెండ మున్నగువాని బాధ ఆ శిశువునకు లేకుండ చేసినది. తేనె పండ్ల గుజ్జు మున్నగువానిని బాలునకు పెట్టి ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటనే తిరుగుచుండెను. అచటి సరస్తీరమున అతడాడుకొనుచుండగా హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్రదినమగుటచే  సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి , అట్లు వచ్చినవారిలో ఇద్దరు భార్యలుండి సంతానను లేని గృహస్థు ఒకడు వారితో బాటు స్నానమునకు వచ్చెను. అచట తిరగాడుచున్న బాలుని చూచి ముచ్చటపడి ఇంటికి గొనిపోవలెను అని తలచి ఈ బాలుడెవరు యెవరి సంతానము అడవిలో యేల విడువబడెను అని యెంత ఆలోచించినను వారికి సమాధానము దొరకలేదు , వనమున , జలమున , గర్భమున నెచటనున్న వానినైనను రక్షించి పాలించు వాడు శ్రీమన్నారాయణ మూర్తియే కదా ! ఆయనయే నాకీ బాలుని యిట్లు చూపినాడని తలచెను. బాలుని ఇంటికి గొనిపోయెను. సవతులైన వాని ఇద్దరు భార్యలు ఎవరికి వారు వారే ఆ బాలుని పెంచవలెను అని పరస్పరము వివాద పడుచుండిరి ఈ విధముగా రెండు సంవత్సరములు గడచెను. ఒకనాడు ఆ గృహస్థు ఇంట లేని సమయములో పెద్ద భార్య ఆ బాలుని అడవిలో విడచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుని యెంత వెదకినను కనిపించలేదు.


అడవిలో విడువబడిన బాలుడేడ్చుచు వింటివలెనున్న తులసి పొదవద్దకు వెళ్ళెను అచటె పండుకొనెను. తులసీ స్పర్శవలన బాలునకా వనమున యెట్తి ఆపదయు రాలేదు. శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడచినది యెవరును లేని ఆ బాలుడు యేడ్చుట తప్ప మరేమి చేయగలడు. వాని దైన్యము , నిస్సహాయత ఆ అడవిలోనుండు పశుపక్ష్యాదులలోని జీవలక్షణమునకు విలువైనది. అడవిలో గల ప్రాణులు , మృగములు , పక్షులు అచటికి వచ్చినవి , బాలుని నిస్సహాయత ధైర్యము వానిలోని దివ్యలక్షణములను మేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులును కన్నీరు కార్చినవి. ఒకరి బాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్ష్యాదులు యిట్టి సహానుభూతి నందినప్పుడు మరియొక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా ! అట్లే బాలుడును పక్షియోమృగమైనప్పుడు వాని దుఃఖము యెట్లుండునో కదా , బాలుడు పశుపక్ష్యాదులు  విభిన్నజాతులవారైనను వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒక చోటనుండి రేవునుండి వచ్చినదే. అదియే దివ్యత్వము , కాని విచిత్రమేమనగా బాలునికి తనజాతిదే అయిన స్త్రీ వలన ఆపదవచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య , ఆమెలోని దివ్యత్వము లోపించినది. సృష్టి విచిత్రమని యనుకొనుట తప్ప మనకే సమాధానమును తోచదు. ఇదియే భగవంతుని లీల , అట్లు వచ్చిన పక్షులు , మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు యెండ వానిపై బడకుండ రెక్కలతో నీడను కల్పించినవి , తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి మరల్చినవి. మృగములును. తేనె , ముగ్గినపండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు పక్షులు వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు , పక్షులు వానికి తాము చేయగలిగిన యుపచారములను చేసి వాని దుఃఖములను  మాన్పించి తమ యుపచారములచే వాని ఆకలిని తీర్చినవి. బాలుడు తులసి పాదౌలో నుండుట , తులసిని జూచుట , తాకుట మున్నగు పనులను ఆతర్కితముగ చేయుటచే పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహము నాతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్ష్యాదుల సానుభూతిని , యుపచారములను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారము వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగల్గెను. అప్రయత్నముగ వాని నోటి నుండి కృష్ణ , గోవింద ,  అచ్యుత మున్నగు భగవన్నామముల ఉచ్ఛారణ శక్తి కలిగినది. అతడా మాటలనే పలుకుచు తులసి పాదులో నివసించుచు , ఆడుకొనుచు కాలమును గడుపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన యొక బాలునకట్టి దయను పశుపక్ష్యాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన ఇండ్లలోనుండి మనచే పూజింపబడిన మనపై యెట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు. తులసి మన ఇంట నుండుట వలన మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహము కలిగి మరెన్నియో ఇహపరలోక సుఖములనంద వచ్చును. పాపములను పోగొట్టుకొనవచ్చును. భగవదనుగ్రహమును మరింత పొందవచ్చును.


*🌳రాజకుమారుని పూజ - శ్రీహరి యనుగ్రహము🌳*


సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్యయేమైనదో తెలిసుకొనవలెనని సేవకులను పంపి వెదకించెను. కాని ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి యూరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందువలెనే శ్రీహరినామస్మరణ చేయుచు పశుపక్ష్యాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి , తండ్రి , తాత , సోదరుడు యిట్టి బంధువుల నెరుగడు. కేవలము శ్రీహరి నామోచ్ఛారణము శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యెను. శ్రీహరి దర్శనము కలుగలేదు అని విచారము వానికి కల్గెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేరు. ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతము నాచరింపుమని వానికి చెప్పెను. రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటల ననుసరించి మాఘస్నానము పూజ మున్నగు వానిని ప్రారంభించెను.


మాఘశుక్ల చతుర్దశినాడు రాజకుమారుని పూజాంతమున శ్రీహరి వానికి దివ్యదర్శనమునిచ్చెను. శుభమును కలిగించు బాహువులలో బాలుని కౌగిలించుకొనెను. ఓ బాలకా నాభక్తుడవైన నీకు వరమునిత్తును కోరుకొమ్మని పలికెను. బాలుడును నాకు నీపాద సాన్నిధ్యమును చిరకాలమనుగ్రహింపుమని కోరెను. శ్రీహరి బాలకా ! నీవు రాజువై యీ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకుము , పుత్రపౌత్ర సమృద్ధిని , సంపదలను , భోగభాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకుపొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను , సర్వసమృద్దులను , సర్వసుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడువక చేయుము. ఆ తరువాత నా సన్నిధిని చేరుమని పలికెను. అచటనున్న సునందుడను వానిని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చుమని చెప్పెను. సపరివారముగ అంతర్దానమందెను. సునందుడును రాజకుమారుని దీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించెను. పుత్రుని వానికి అప్పగించెను తన స్థానమునకు తాను పోయెను.


సులక్షణ మహారాజు ఆశ్చర్యమును , ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పెరిడెను. బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలును సమాగమనము చేసి పరలోకమునకు భర్తననుసరించి తరలిరి. సుధర్ముడు భక్తితో తండ్రికి , తల్లులకు శ్రద్ధతో శ్రార్ధకర్మల నాచరించెను. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగ ప్రజారంజకముగ చిరకాలము రాజ్యమును పాలించెను. పుత్రులను , పౌత్రులను పెక్కు మందిని పొందెను. అతడెప్పుడును మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోను , మనుమలతోను , భార్యలతోను కలసి జీవించియున్నంతవరకు మాఘమాస వ్రతము నాచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.


జహ్నుమునీ ! ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడువక ఆచరింప వలయును. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు యెట్టి భయమునుండదు. ఈ వృత్తాంతమును వినినవాడును విష్ణుభక్తుడై మాఘమాసవ్రతము నాచరించి విష్ణుప్రియుడై ఇహపరలోక సుఖములనంది శ్రీహరి సాన్నిధ్యమునందును. సందేహము లేదు అని జహ్నుమునికి గృత్నృమదమహర్షి చెప్పెను.

*-❀꧁❀-TVBC❀-꧂❀-*


🟨🟥🟨🟥🟨🟥🟨🟥

*🙏స్వస్తి 🙏*

📚🕉️📚🕉️📚🕉️

*FOR MORE DAILY "DEVOTIONAL UPDATES"  & SPIRITUAL INFORMATION 📖 WATCH 🪀 AND SUBSCRIBE TO TVBC ON YOUTUBE.🤳*

🟨🟥🟨🟥🟨🟥🟨🟥

పన్నియూర్ శ్రీ వరాహమూర్తి ఆలయం

 🕉 మన గుడి : నెం 1030


⚜ కేరళ : పట్టాoభి - పాలక్కాడ్


⚜ పన్నియూర్ శ్రీ వరాహమూర్తి ఆలయం



💠 శ్రీ విష్ణువు యొక్క ' వరాహ ' అవతారాన్ని పూజించే దేవాలయాలు కేరళలో చాలా తక్కువ . 

ఈ ఆలయంలో శ్రీ శివుడు ('వడకోవిల్'), శ్రీ అయ్యప్ప , శ్రీ దుర్గాభగవతి , 

శ్రీ గణపతి , శ్రీ సుబ్రమణ్య మరియు 

శ్రీ లక్ష్మీ నారాయణుడు వంటి ఉపదేవతలను కూడా ఆరాధిస్తారు . 

ఈ ఆలయానికి చిత్రగుప్తుడు మరియు యక్షి ఆశీస్సులు కూడా ఉన్నాయని చెబుతారు . 


 💠 పన్నీర్ శ్రీ వరాహమూర్తి ఆలయం భారతదేశంలోని కేరళలోని పాలక్కాడ్ జిల్లా, పట్టంబి తాలూకాలోని కుంబిడి వద్ద ఉన్న పురాతన హిందూ దేవాలయ సముదాయం.  

ఈ ఆలయం దాదాపు 4000 సంవత్సరాల క్రితం పరశురామునిచే ప్రతిష్టించబడిన కేరళలో మొట్టమొదటి ఆలయంగా నమ్ముతారు.  


💠 ఈ ఆలయంలో హిరణ్యాక్షుడిని చంపిన తర్వాత భూదేవితో ఉన్న విష్ణువు యొక్క మూడవ అవతారం అయిన వరాహమూర్తి ఉన్నాడు.


💠 పూర్వం 800 (బ్రాహ్మణుల కుటుంబాలు కేరళను పాలించినప్పుడు) సుమారుగా 1300 సంవత్సరాల పాటు కేరళలోని ప్రఖ్యాత గ్రామమైన పన్నియూర్‌ను పరిపాలించిన దేవుడైన శ్రీ వరాహ మూర్తిని పూజించారని కూడా చెబుతారు.


 🔆 ఆలయ చరిత్ర 

 


💠 క్షత్రియులపై విజయం సాధించిన తరువాత, పరశురాముడు తాను గెలిచినదంతా కశ్యపునికి దానం చేశాడు.  

అతను తన ధ్యానాన్ని కొనసాగించడానికి ఒక భూమిని కోరుకున్నాడు మరియు దాని కోసం అతను సముద్రం నుండి ఒక చిన్న భాగాన్ని బయటకు తీశాడు.  

ఈ చిన్న చిన్న భూభాగమే ఇప్పుడు కేరళగా ఉందని చరిత్ర చెబుతోంది. 


💠 పరశురాముని భూభాగం పెరగడం మరియు విస్తరించడం ప్రారంభించింది. కలవరపడిన పరశురాముడు నారదుని సహాయం కోరాడు.  

విష్ణువును ప్రార్థించమని నారదుడు అతనికి సలహా ఇచ్చాడు.  

కాబట్టి పరశురాముడు విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి తన ధ్యానాన్ని ప్రారంభించాడు.  


💠 విష్ణువు అతని ముందు ప్రత్యక్షమై, "ఒకసారి నేను ప్రపంచాన్ని రక్షించడానికి వరాహమూర్తిగా అవతరించాను. 

నా రూపాన్ని ఆరాధించండి మరియు ఈ ప్రదేశంలో 'త్రిమూర్తి' అనుగ్రహం లభిస్తుంది" అని చెప్పాడు.


💠 విష్ణువు సలహాను అనుసరించి, పరశురాముడు తన భూభాగం మధ్యలో శ్రీ వరాహమూర్తిని స్థాపించాడు మరియు దానిని ఉంచడానికి ఒక ఆలయాన్ని నిర్మించాడు.  

అతను అక్కడ అన్ని పూజా కార్యక్రమాలను సక్రమంగా ప్రారంభించాడు. 

 ఆ దివ్య దేవాలయమే నేటి పన్నియూర్ మహాక్షేత్రం.


💠 మహాపండిత్ అప్పత్ అదీరి 600 సంవత్సరాల క్రితం రాగి ముక్కలపై తన ఆత్మకథను వ్రాసాడు, అందులో అతను భవిష్యత్తు కోసం తన అంచనాలను రూపొందించాడు.  

ఈ ముక్కలు ఇటీవల కనుగొనబడ్డాయి మరియు గ్రంథాలు మలయాళంలోకి అనువదించబడ్డాయి.  

పన్నియూర్ మహాక్షేత్రం కోల్పోయిన వైభవాన్ని మరియు కీర్తిని ఖచ్చితంగా తిరిగి పొందుతుందని మహాపుండిత్ అంచనా వేశారు.  

అతను తన రచనలలో సూచించిన సమయం ఇప్పుడు పండింది.  


💠 శుభదినం వచ్చినప్పుడు, శ్రీ వరాహమూర్తిని విశ్వసించే ప్రతి ఒక్కరికీ 'అభీష్ట కార్య సిద్ధి' (అనగా తాను ప్రార్థించిన ప్రతి విషయం యొక్క సాక్షాత్కారం) దీవించబడుతుందని అతను ముందే చెప్పాడు.  

ఆపదలో ఉన్నప్పుడు 'వరాహమూర్తి రక్షకణే' (నన్ను రక్షించు, వరాహమూర్తి) అనే పదాన్ని మూడుసార్లు ఉచ్ఛరిస్తే,

 శ్రీ వరాహమూర్తి రాబోయే అన్ని ఆపదల నుండి రక్షిస్తాడని భక్తుల నమ్మకం.


🔅 దేవప్రశ్నంగల్ 


💠 1983 నుండి ఇక్కడ జరుగుతున్న 'దేవప్రశ్నంగల్' లో ఈ ఆలయం గురువాయూర్ మరియు శబరిమల వంటి గొప్ప దేవాలయాలతో సమానంగా ప్రతిష్ట మరియు ప్రాముఖ్యతను పెంచుతుందని సూచిస్తుంది.  

ప్రతి ఒక్కరినీ అనుగ్రహించడానికి శ్రీ వరాహమూర్తి ఈ ఆలయంలో ఉన్నటు స్పష్టమవుతుంది. 


💠 శ్రీ వరాహమూర్తి యొక్క ఆశీర్వాదం మరియు మహిమాన్వితమైన ఉనికిని అనుభవించినట్లు చాలా మంది భక్తులు పేర్కొన్నారు.  

శ్రీ వరాహమూర్తి భక్తులందరికీ 'అభీష్ట కార్య సిద్ధి' అనుగ్రహించబడుతుందని చెప్పబడింది.  

దీంతో శ్రీ వరాహమూర్తి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.


💠 ఇక్కడ నిర్వహించబడే వివిధ పూజలలో అత్యంత ముఖ్యమైనది 'అభీష్ట సిద్ధి పూజ'.  

ఈ పూజ ఖర్చు రూ.101/- మరియు 'అభీష్ట కార్య సిద్ధి'కి మార్గం సుగమం చేస్తుందని నమ్ముతారు.


💠 శ్రీ వరాహమూర్తి అనుగ్రహం పొందడానికి 'సంధ్య దీపారాధన' అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది.  

గంధపు చెక్కతో కప్పబడి, మెరిసే ఆభరణాలతో అలంకరించబడిన శ్రీ వరాహమూర్తి యొక్క దివ్య రూపం ప్రతి మనస్సును ఆలింగనం చేసుకోవడానికి మరియు సాంత్వన పొందేలా ఉంది.


💠 ఎలా చేరుకోవాలి ? 

సమీప రైల్వే స్టేషన్ కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుట్టిప్పురం వద్ద ఉంది.

 ప్రసిద్ధ గురువాయూర్ దేవాలయం కేవలం 33 కి.మీ దూరంలో ఉంది.


రచన

©️ Santosh Kumar

14-01-గీతా మకరందము

 14-01-గీతా మకరందము

        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


శ్రీ భగవద్గీత 

అథ చతుర్దశోఽధ్యాయః 

పదునాల్గవ అధ్యాయము 

గుణత్రయ విభాగయోగః

గుణత్రయ విభాగయోగము 

 

శ్రీ భగవానువాచ :-

పరం భూయః ప్రవక్ష్యామి 

జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ | 

యజ్జ్ఞాత్వా మునయస్సర్వే 

పరాం సిద్ధిమితో గతాః || 

 

తాత్పర్యము:- శ్రీ భగవంతుడు చెప్పెను - (ఓ అర్జునా!) దేనిని తెలిసికొని మునులందఱును ఈ సంసారబంధమునుండి (విడివడి) సర్వోత్తమమగు మోక్షసిద్ధినిబడసిరో అట్టి పరమాత్మవిషయకమైనదియు, జ్ఞానములలోకెల్ల నుత్తమమైనదియునగు జ్ఞానమును మఱల చెప్పుచున్నాను.


వ్యాఖ్య:- ‘భూయః’ -  ‘క్రిందటి అధ్యాయమున చెప్పబడిన అఖండ జ్ఞానమును మఱల చెప్పుచున్నాను వినుము’ - అని పలుకుటచే భగవానునకు భక్తుల యెడల యెంత కరుణగలదో, వారిని తరింపజేయవలెనను కుతూహలమెంతకలదో విశదమగుచున్నది. ఉత్తముడగు గురువు విశ్వాసపాత్రుడగు శిష్యునకు మనస్సునకెక్కుటకై ఒకే బోధను మఱల మఱల చెప్పుచుండును.


 "వక్ష్యామి" అని చెప్పక "ప్రవక్ష్యామి” (లెస్సగా వచించుచున్నాను) అని చెప్పుటవలన ఈ అధ్యాయమందు తెలుపబడిన విషయములు భగవంతునిదృష్టిలో ఎంత ముఖ్యమైనవో యోచించుకొనవచ్చును.

‘జ్ఞానానాం జ్ఞానముత్తమమ్’ - ప్రపంచములో అనేక జ్ఞానములు (భౌతిక జ్ఞానము, సంగీతజ్ఞానము, శిల్పజ్ఞానము, గణితజ్ఞానము మున్నగునవి) ఉన్నను, వానియన్నింటిలోను భగవానునిదృష్టిలో ఆధ్యాత్మికజ్ఞానమే సర్వశ్రేష్ఠమైనదని ఈ వాక్యముద్వారా, మఱియు ‘పరమ్’ అను పదముద్వారా స్పష్టమగుచున్నది.

‘యజ్జ్ఞాత్వా మునయః సర్వే’ - ఈ జ్ఞానమును తెలిసికొని పూర్వము మునులందఱును బంధవిముక్తులైరని ఇట తెలుపబడినది. ఔషధముయొక్క శ్రేష్ఠత్వము రోగులపై అది కలుగజేయు ఫలితముమీద ఆధారపడియుండును. దేని సేవనముచే రోగము శమించునో ఆ ఔషధము చాల గొప్పదని అర్థము. అట్లే పూర్వము మునులందఱును ఈ జ్ఞానమును సేవించుటవలన బంధరహితులై శాశ్వత మోక్షపదము నొందిరని యిట తెలుపుటచే ఆ జ్ఞానముయొక్క మహిమ వెల్లడియగుచున్నది. ప్రత్యక్షఫలితమును జూపుటద్వారా భగవానుడు జనులకు జ్ఞానముపై పరమ విశ్వాసమును కలుగజేయుచున్నారు. ‘సర్వే’ అని చెప్పుటచే ఈ జ్ఞానము నెఱింగినవారిలో ఒకరు కూడ ముక్తినిబడయక నుండలేదనియు అందఱును తరించిపోయిరనియు తెలియుచున్నది. అయితే ‘మునయః’ = (మననశీలురు) అని పేర్కొనుటవలన, వారందఱును తత్త్వమును బాగుగ మననముచేసియే తరించిరిగాని, వాచాజ్ఞానముచే గాదని స్పష్టమగుచున్నది.

‘పరాం సిద్ధిమ్’ - మోక్షస్థితి అన్నిటికంటెను గొప్పపదవి - అని చెప్పబడుటచే, చిన్నచిన్న ప్రాపంచికపదవులను, గతులను గొప్పగ తలంచి మురిసిపోక వానికంటె ఎన్నియోరెట్లు ఆనందకరమైనట్టి పరమాత్మపదమును జ్ఞానసముపార్జనముద్వారా పొంది ధన్యులు కావలయును.


ప్రశ్న:- భగవానుడు చెప్పబోవు జ్ఞానమెట్టిది?

ఉత్తరము:- (1) జ్ఞానములన్నిటిలోను ఉత్తమమైనది (2) దాని నెఱుంగుటవలన మునులందఱును మోక్షస్థితిని బడసిరి.

ప్రశ్న:- మోక్షస్థితి యెట్టిది?

ఉత్తరము:- ప్రపంచములో అన్నిపదములకంటెను సర్వోత్తమమైనది.

తిరుమల సర్వస్వం -159*

 *తిరుమల సర్వస్వం -159*

*స్వామి పుష్కరిణి -6*



 *పరీక్షిన్మహారాజు* 


 ద్వాపరయుగంలో ఒకానొకప్పుడు అర్జునుని మనుమడు అభిమన్యుని పుత్రుడు అయిన పరీక్షిత్తు మహారాజు సుదీర్ఘ సమయం పాటు వేటాడడంతో అలసిపోయి, పరివారానికి దూరమై, దప్పికతో అలమటిస్తూ శమీకమహర్షి ఆశ్రమానికి సమీపించి త్రాగునీటికై అర్థిస్తాడు. ధ్యానమగ్నుడైన ఋషిపుంగవుడు క్షత్రియుని రాకను గమనించక పోవడంతో కోపోద్రిక్తుడైన మహారాజు యుక్తాయుక్త విచక్షణ మరచి, ఆ ఋష్యాశ్రమంలో చచ్చిపడియున్న సర్పాన్ని తన వింటికోపుతో తీసి, ఋషి మెడలో వేసి వెనుదిరుగుతాడు. ఈలోగా సమిధల కోసం వనానికేతెంచిన శమీకుని కుమారుడు 'శృంగి' ఆశ్రమానికి తిరిగి వచ్చి, తండ్రి కంఠము నందున్న మృతసర్పాన్ని గాంచి కృద్ధుడై, తండ్రిగారిని ఆ విధంగా అవమానించిన వాడు ఏడు దినాలలో 'తక్షకుడు' అనే విషసర్పపు కాటుతో మరణిస్తాడని శపిస్తాడు. ఈ వార్తను తెలుసుకున్న పరీక్షిత్తు పాముకాటును తప్పించుకోవడానికి మంత్రుల సలహా మేరకు ఒంటిస్తంభపు భవనంలో నివసిస్తూ, కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేసుకొని, భాగవత శ్రవణంతో కాలం గడుపుతుంటాడు.


 ఇంతలో, 'కాశ్యపుడు' అని పిలువబడే మహిమాన్వితుడైన విప్రుడు, తన మంత్రశక్తితో పరీక్షిత్తు మహారాజును తక్షకుని విషం నుంచి రక్షించి, మహారాజు నుండి భూరి కానుకలను పొందే నిమిత్తం ఆఘమేఘాలపై ప్రయాణించి, సరిగ్గా ఏడవనాటి ఉదయానికి పరీక్షిత్తు మహారాజు నివసించే నగర శివార్లకు చేరుకుంటాడు. మునిపుత్రుని శాపాన్ననుసరించి, ఆరోజే పరీక్షిత్తు మృత్యువాత పడాల్సి ఉంది.


 సరిగ్గా అదే సమయానికి మహారాజును తన విషపు కోరలకు బలి కావించి, మునిపుత్రుని శాపాన్ని నిజం చేసే ఉద్దేశ్యంతో తక్షకుడు కూడా నగర పొలిమేరలకు చేరుకుని, కశ్యపునికి తారసపడతాడు. కశ్యపుని ద్వారా అతని అంతరార్ధాన్ని గ్రహించిన తక్షకుడు ఆ విప్రుని మహిమను పరీక్షింప గోరి, దగ్గరలోనున్న ఒక మహావృక్షాన్ని తన విషపు కోరలతో భస్మీపటలం గావించి, దానిని పునర్జీవింప జేయవలసిందిగా కశ్యపుని కోరుతాడు.

బూడిదకుప్పగా మారిన మహావృక్షాన్ని తన మంత్రశక్తితో తిరిగి బ్రతికించిన కశ్యపుని దివ్యశక్తికి అచ్చెరువొందిన తక్షకుడు, ఆ విప్రునితో, కశ్యపుడు నిస్సందేహంగా మహా మహిమాన్వితుడని, అయితే ఋషిపుత్రుని శాపం అనృతం కాకూడదని, అందువల్ల తాను ఇచ్చే అమూల్యమైన ధనరాశులను స్వీకరించి రాజు గారిని రక్షించే ప్రయత్నాన్ని విరమించుకొన వలసిందిగా ప్రార్థిస్తాడు. ధనాశకు లోనైన కశ్యపుడు తన మహిమతో పరీక్షిత్తు మహారాజు పూర్వాపరాలనెరిగి, అల్పాయుష్కుడైన మహారాజును రక్షించడం వ్యర్థమని తలచి, తక్షకుడు ఇచ్చిన విశేషమైన సంపదను స్వీకరించి, స్వస్థలానికి వెనుదిరుగుతాడు. తత్ఫలితంగా, ఆరోజు సాయం సమయంలో తక్షకుని కాటువల్ల పరీక్షిత్ మహారాజు మరణిస్తాడు.


 తదనంతరం, దురాశాపరుడై తన విద్యుక్తధర్మాన్ని విస్మరించి, మహారాజు మరణానికి కారకుడైన కశ్యపుని ఉదంతాన్ని ఆనోటా ఆనోటా విన్న రాజ్య పౌరులందరూ అతనిని అసహ్యించుకొని సభ్యసమాజం నుండి బహిష్కరిస్తారు. ఇలా అందరూ తనను వెలివేయడంతో, నడిమంత్రపు సిరిగా వచ్చిన ధనాన్ని ఏం చేసుకోవాలో తోచని కశ్యపుడు, 'శాక్యముని' తో తన గోడును వెల్లడించు కుంటాడు. తన దివ్యదృష్టి ద్వారా జరిగిన వృత్తాంతాన్నంతా తెలుసుకున్న మహర్షి ప్రజలందరికీ రాజు పితృతుల్యుడని, అటువంటి భూపాలుణ్ణి సర్వకాల సర్వావస్థలయందు రక్షించు కోవలసిన బాధ్యత పౌరులందరిపై ఉందని, అడియాసకు లోనై తన బాధ్యతను విస్మరించిన కశ్యపుడు ఘోరాపరాధానికి ఒడిగట్టాడని, ఆ పాపం కశ్యపుణ్ణి అనేక జన్మల పాటు పీడిస్తుందని శెలవిచ్చాడు. ఇంతటి మహాపరాధానికి ప్రాయశ్చిత్తం లేదని కూడా చెబుతాడు. అయితే, దారి-తెన్ను గానని కశ్యపుడు పరిపరివిధాల ప్రాధేయ పడడంతో, ధర్మశాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, కశ్యపుని పాపనివృత్తి చేయడానికి స్వామిపుష్కరిణి స్నానమొక్కటే మార్గమని తరుణోపాయం సూచిస్తాడు.


‌ పరమానంద భరితుడైన కశ్యపుడు ఇంకెంత మాత్రం ఉపేక్షించకుండా, హుటాహుటిన బయలుదేరి, తిరుమలక్షేత్రాన్ని చేరుకుని భక్తిప్రపత్తులతో స్నానమాచరిస్తాడు. తదనంతరం శ్రీవేంకటేశ్వరునికి ప్రణమిల్లి తనను పాపవిముక్తుణ్ణి చేయవలసిందిగా వేడుకొంటాడు.



‌ అలా స్వామిపుష్కరిణి మహిమతో పాపాన్ని పరిహరించుకొని, స్వస్థలానికి చేరుకున్న కశ్యపుణ్ణి, పురజనులందరూ జరిగినదంతా మరచి మునుపటి వలె ఆదరించి అక్కున జేర్చుకుంటారు. 

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము*


*298 వ రోజు*


*అభిమన్యుడిని కపటోపాయముతో చంపమని ద్రోణుడు చెప్పుట*


అప్పుడు ద్రోణుడు కర్ణుని చూసి " కర్ణా ! నేను అర్జునుడికి కవచధారణ విద్య ఉపదేశించాను. దానిని అర్జునుడు తన కుమారుడికి ఉపదేశించాడు. ఆ కవచ ధారణ విద్య వలన అతడి శరీరంపై ఎవరూ శరములు నాట లేరు. ఎదో వంచన చేసి అతడిని మనం చంపాలి. అభిమన్యుని చేతిలో విల్లు ఉన్నంతవరకు మనం అతడిని చంపలేము. యోధులంతా అతడిపై దాడి చేసి ఒకరు అతడి విల్లును త్రుంచాలి, వేరొకరు అతడి సారధిని చంపాలి, మరొకరు అతడి రథం విరుగ కొట్టాలి కాని ఇవన్నీ ఏక కాలంలో జరగాలి. నీకు చేతనైతే అభిమన్యుని ఈ కపటోపాయంతో చంపు " అన్నాడు. అది విని కర్ణుడు ఆలోచించి అక్కడి యోధులను కూడగట్టుకుని ఒక్కుమ్మడిగా అభిమన్యునిపై లంఘించాడు. కొంత మంది అతడి విల్లు విరిచారు, ద్రోణుడు అతడి రథాశ్వములను చంపాడు, కృపాచార్యుడు అతడి రథసారథిని చంపాడు, అభిమన్యుడు నిరాధయుడు విరధుడు అయ్యాడు. అదే తగిన సమయమనుకుని బాహ్లికుడు, శకుని, శల్యుడు,  అశ్వత్థామ, కృతవర్మ 

అతడి మీద బాణవర్షం కురిపించారు. అభిమన్యుడు ఖడ్గము డాలు తీసుకుని రథము మీద నుండి కిందకు దూకి గాలిలో గిరగిరా తిరుగుతూ కౌరవ యోధులను ఖండించాడు. అభిమన్యుడు ఎప్పుడు తన తల ఖండిస్తాడో అని యోధులంతా అక్కడి నుండి పారి పోయారు. ద్రోణుడు ఒక బల్లెము తీసుకుని అభిమన్యుడి ఖడ్గం విరిచాడు. కర్ణుడు అభిమన్యుని డాలు విరిచాడు. అప్పుడు అభిమన్యుడు రథములోని చక్రాయుధం తీసి దానిని గిరగిరా త్రిప్పుతూ శత్రు సేనలను చంపుతూ సింహనాదం చేసాడు. రక్తసిక్తమైన అతడి ముఖమును చూసిన శత్రు సేనలు భయభ్రాంతం అయ్యాయి. అభిమన్యుడు తన చక్రాయుధంతో శత్రువులు వేస్తున్న బాణములు ఖండిస్తూ శత్రుసంహారం చేస్తున్నాడు. ద్రోణుని వైపు దూసుకు పోతున్నాడు. అడ్డు వచ్చిన కౌరవ సైన్యాన్ని చీల్చి చెండ్డాడుతున్నాడు. ఆ సమయమున శకుని, కృతవర్మ, కృపాచార్యుడు, శల్యుడుమొదలైన యోధులు ఒకటిగా కూడి అభిమన్యుని చక్రయుధం ఖండించారు. అప్పుడు అభిమన్యుడు తన గదను తీసుకుని అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అభిమన్యుని దెబ్బకు భయపడి అశ్వత్థామ రథం నుండి దూకి రథం వెనక్కు పోయి దాక్కున్నాడు. అప్పుడు అభిమన్యుడు అశ్వత్థామ సారథిని, రథాశ్వలను చంపాడు. అభిమన్యుడు శకుని మీద లంఘించి అతడికి సాయంగా ఉన్న ఇరవై ఏడు మంది యోధులను గదాయుధంతో చంపాడు. గజములపై పది మంది యోధులు అభిమన్యుని ఎదుర్కొన్నారు అభిమన్యుడు వారిని గజములతో సహా యమపురికి పంపాడు. కేకయరాజులను ఏడుగురిని ఒక్క సారిగా యమపురికి పంపాడు. ఇంతలో దుశ్శాసనుడి కుమారుడు అభిమన్యుని ఎదుర్కొని అభిమన్యునిపై

అనేక శరములు గుప్పించాడు. అభిమన్యుడు అతడు వేసిన బాణములను గదాదండంతో అడ్డుకుని అతడి అశ్వములను, సారథిని చంపి అతడి రథమును విరుగకొట్టాడు. దుశ్శాసనుడి కుమారుడు గదాయుధంతో అభిమన్యుని ఎదుర్కొన్నాడు. వారిరువురి మధ్య పోరు ఘోరంగా సాగింది. ఇరువురి శరీరం నుండి రక్తం ధారగా కార సాగింది. యోధులంతా యుద్ధం మాని వారి పోరు చూస్తున్నారు. అభిమనుడు దుశ్శాసన కుమారుడు గదలతో మోదుకుని కిందపడ్డారు. గాయపడిన వారి శరీరముల నుండి ప్రాణములు వేరయి స్వర్గలోకం చేరాయి. అప్పటికీ కసి తీరని కౌరవ యోధులు చుట్టుముట్టి కత్తులతో పొడిచి పొడిచి చంపారు. సూర్యుడు అస్తమించాడు. పాండవుల కీర్తిని ఇనుమడింప చేస్తూ అభిమన్యుడు కౌరవయోధులతో అత్యంత పరాక్రమంతో పోరాడి వీరస్వర్గం అలంకరించాడు. ధృతరాష్ట్ర మహారాజా ! ఆ విధంగా యోధాను యోధుడైన అభిమన్యుడు రణరంగమున మరణించగానే కౌరవసేనల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ఆ సమయాన అక్కడ చేరిన భూతగణాలు " అభిమన్యుని అమానుషంగా అధర్మ యుద్ధంలో అన్యాయంగా పలువురు కలిసి వధించారు " అని ఆక్రోశించాయి. అభిమన్యుడు మరణించగానే పాండవ సేనలు పారిపోయాయి. ఇదంతా దూరం నుండి చూస్తున్న ధర్మరాజు " మన అభిమన్య కుమారుడు దుర్భేద్యమైన వ్యూహంలో ప్రవేశించి హయములను, గజములను చంపి రధములను విరిచి, పదాతి దళమును తనుమాడి. అనేక సైనిక ప్రముఖులను చంపి ద్రోణుడు మొదలైన మహాయోధులను భయభ్రాంతులను చేసి వీరస్వర్గం అలంకరించాడు. అటువంటి మహాయూధుని మరణముకు చింతించ పని లేదు " అన్నాడు. అప్పటికే చీకట్లు కమ్మాయి. ఆ రోజుకు యుద్ధము మాని వారి వారి శిబిరాలకు వెళ్ళారు. కౌరవ సేనలో ఆనందోత్సాహాలు నిండగా పాండవ యోధుల్లో విషాద ఛాతలు కమ్ముకున్నాయి.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


  శ్లో𝕝𝕝 *కలిః శయానో భవతి* *సంజిహానస్తుద్వాపర*

 *ఉత్తిష్ఠే త్రేతా భవతి* 

*కృతం సంపద్యతే చరన్*


తా𝕝𝕝  *నిద్రపోతుంటే కలియుగం, లేచి కూర్చుంటే ద్వాపర, లేచి నిలబడితే త్రేతా, లేచి తన లక్ష్యం వైపు అడుగులు వెయ్యడం సత్యయుగం*. *లక్ష్య ప్రాప్తి కొరకు అడుగులు వెయ్యాలి..... ముందుకు వెళ్ళాలి.....*


✍️💐🪷🌹🙏