19, ఫిబ్రవరి 2021, శుక్రవారం

భృగు మహర్షి

 మన మహర్షులు- 26


భృగు మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷


భృగు మహర్షి బ్రహ్మగారి హృదయంలోంచి పుట్టాడు. 

భృగువు నవ ప్రజాపతులలో ఒకడు. సప్తర్షులలో ఒకడు.


 ఈయన వంశంని భృగువంశమంటారు. ఈ వంశంలో పుట్టినవాళ్ళు చ్యవన, జమదగ్ని, శుక్ర, దధీచి మొదలైనవాళ్ళు. విష్ణుమూర్తి అవతారం పరశురాముడు కూడ ఈ వంశమే.


 దక్షుని కుమార్తె ఖ్యాతి భృగుమహర్షి  భార్య..

దక్షుని అల్లుడు గనుక, దక్షయజ్ఞం సమయంలో భృగువుకూడా ఉన్నాడని వాయుపురాణం చెప్తోంది.


భృగుమహర్షి మరొకభార్య పులోమని ఒక రాక్షసుడు ఎత్తుకు పోవాలని ఆమె ఎక్కడ వుందని అగ్నిదేవుణ్ణి అడిగాడు. అగ్ని భృగుమహర్షి ఆశ్రమంలో వున్న ఈమే పులోమ అని చెప్పాడు.


ఆ రాక్షసుడు పులోమని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు..


 భృగుమహర్షి అగ్ని దేవుణ్ణి ఇదంతా జరగడానికి కారణం నువ్వే కాబట్టి ఏది కనిపిస్తే దాన్ని తింటూ సర్వభక్షకుడిగా వుండమని శపించాడు.


 అగ్నిదేవుడు బ్రతిమాలుకుంటే సర్వభక్షకుడివైనా అందరితో గౌరవించబడ్డావన్నాడు.


సరస్వతీ నదీ తీరంలో మహర్షులందరూ కలిసి ఒక యాగం చేస్తుండగా వాళ్ళల్లో ఒకళ్ళకి ఒక సందేహం వచ్చేసింది.  త్రిమూర్తు లలో ఎవరు గొప్పవారు అని భృగు మహర్షిని తేల్చి చెప్పమన్నారు.


భృగు మహర్షి బయల్దేరి ముందు బ్రహ్మలోకం వెళ్ళాడు. బ్రహ్మ నిండు సభలో ఉన్నాడు. భృగు మహర్షి వెళ్ళి మాట్లాడకుండ నిలబడ్డాడు. భృగు మహర్షి స్తోత్రం చెయ్యలేదని బ్రహ్మగారికి కోపం వచ్చింది. అక్కడ నుంచి బయలదేరి కైలాసానికి వెళ్ళాడు భృగుడు.


 శివుడు పార్వతీ సమేతంగా విశ్రాంతి తీసుకుంటూ భృగు మహర్షిని చూసి లేచి వచ్చాడు కానీ భృగు మహర్షి మాట్లాడలేదు. శివుడు కోపంతో శూలంతీశాడు. పార్వతి అడ్డుపడింది.


వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని కలిసాడు భృగు మహర్షి. వెంటనే విష్ణుమూర్తి లేచివచ్చి నువ్వు రావడం చూడలేదు .. నువ్వు రావడం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను అన్నాడు- విష్ణుమూర్తి. 


విష్ణుమూర్తిని ఆనంద భాష్పాలతో అభిషేకం చేసి మళ్ళీ ఆశ్రమానికి వచ్చి తన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి విష్ణుమూర్తే గొప్పవాడని చెప్పాడు భృగు మహర్షి.


భృగువు, భరద్వాజ మహర్షులు సమకాలికులని మహాభారతం పేర్కొంటోంది.


భృగుమహర్షి జ్యోతిష్య శాస్త్ర పితామహుడు.  ఈయన  జ్యోతిష్య శాస్త్ర గ్రంథం 'భృగుసంహిత ' లో  సృష్టిలోని దాదాపు అన్ని రకాల జీవుల గురించి వ్రాయబడ్డాయి. అనగా దాదాపు 50 లక్షల ప్రాణుల జాతకాలు పొందుపర్చబడ్డాయి. ఒక పరిశీలన ప్రకారం ఇప్పుడు కేవలం 01 శాతం జీవులు మాత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

తేనె గురించి

 తేనె గురించి సంపూర్ణ వివరణ - 1 . 



    తేనెలోని రకాలు  - 


  *  అర్ఘ్యమను తేనె . 


  *  చాద్ర అనే తేనె . 


  *  చిన్ని పువ్వు తేనె . 


  *  జిద్దాల అనే తేనె . 


  *  జుంటి తేనె . 


  *  దండజం అనే తేనె . 


  *  పుట్ట తేనె . 


  *  పాత్రికం అనే తేనె . 


  *  పౌష్పికం అనే తేనె . 


  *  భ్రామరం అనే తేనె . 


  *  మాక్షికం అనే తేనె . 


  *  సౌషిరం అనే తేనె . 


  *  క్షౌద్రం అనే తేనె . 


  *  సామాన్యపు తేనె . 



      తేనె తియ్యగా రుచిగా ఉండి వేడి పుట్టించి శరీరంను ఆర్చును . త్రిదోషాలను హరించును . విరేచనం , బలమును కలిగించును . హిక్కా , శ్వాస , కాస , వమనము , పిత్త సన్నిపాత రోగములు , విషదోష , విదాహం , చర్ది , రక్తపిత్తము , కుష్ఠు , అతిసారం , శీతపిత్తము , పక్షవాతం , మలమూత్ర బద్దకం , కంటిజబ్బులు , అశ్మరీ , మూత్రాశ్మరీ మొదలగు సమస్యలను నివారించును. 


         సాధారణముగా మన వైద్యులు వాడు మందులలో తేనెని అనుపానంగా ఇవ్వడం జరుగును . దీనిని వైద్యుడు తన యుక్తిని అనుసరించి శాస్త్రానుభవసారముగా దీనిని ఉపయోగించినచో అనేక రోగాలు పుట్టుటకు కారణం అగును. కనుక దీనికి విరుగుళ్లు తెలుసుకుని ఉండవలెను . తేనెకి విరుగుడు వస్తువుగా నెయ్యి , నిమ్మకాయ , మాదీఫలము , ధనియాలు , దానిమ్మకాయ అను వీనిలో ఏదైనా ఒకటి తీసుకుని సేవించిన ఉపశాంతి కలుగును. తేనె వ్రణములను , గాయములను మాన్పును  . 



          తేనె గురించి మరింత విలువైన విషయాలు మరియు తేనెలొని రకాలు వాటి లక్షణాల గురించి తరవాతి పోస్టులలో సంపూర్ణముగా వివరిస్తాను . 



  

    గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

ఎవరో కొందరు చేసిన దానికి

 ఎవరో కొందరు చేసిన దానికి


 ఎవరో కొందరు చేసిన దానికి మొత్తం ముస్లిమ్లనందరినీ ఎలా నిందిస్తారు, అని ఈరోజున ముస్లిం సమాజం బాధపడుతోంది. వారి బాధ అర్ధం చేసుకోదగినదే. అయితే మరీ ఎప్పుడో ఎవరో చేశారు అనే అనుమానంతో ఇప్పటికీ బ్రాహ్మణులను బాపనోడు, పిలక పంతులు అని వారి వేషాలను, భాషని, అలావాట్లని ఇలా వారికి చెందిన అన్నిటినీ దాదాపు వంద సంవత్సరాలుగా అవమానిస్తున్నారే మరి వాళ్ళని ఏమనాలి? 


ఎప్పుడో 3500 సం. ల క్రితం ఆర్యులు అని ఎవరో వచ్చారని, వాళ్ళేదో చేశారని, వాళ్లే బ్రాహ్మణులు అని ఒక కట్టుకథని సృష్టించి, వాళ్ళ పిలకలు లాగి, పంచలు లాగి, యజ్ఞోపవీతాలు తెంపి, వందల, వేల సినిమాలలో బ్రాహ్మణులను వారు వృత్తులను, వారి భాషను, పనిగట్టుకుని అవమానించారు కద? దానికి వారెంత బాధపడి ఉండాలి? 


పోనీ ఈ ఆర్యన్ సిద్ధాంతం కథ ఏమైనా నిజమా అంటే అదీ కాదు. ఏ ఆధారమూ లేకుండా సృష్టించబడిన ఒక కట్టు కథ. అయినా సరే, కేవలం తమకి అది నచ్చింది కనుక కొందరు దానిని నిజం అని నమ్ముతున్నారు. పోనీ కొంతసేపు అదంతా నిజమే అనుకుందాం. నిజమే అయినా, ఎప్పుడో 3500 సం. ల క్రితం ఎవరో చేసిన దానికి మీరు ఇప్పటి వారిని ఎలా బాధ్యులను చేస్తారు? 


బ్రాహ్మణుల మీద ఇంతలా గత రెండు వందల సంవత్సరాలుగా దాడి జరగడానికి ఒక్కటే కారణం. బ్రాహ్మణ్యం పోతే హిందూత్వం కూడా నాశనం అవుతుంది అని మన ప్రత్యర్థులకు స్పష్టంగా తెలియడం. అందుకే వారి మీద ఇన్నిరకాల దాడులు. వారు అనుకుంది కొంత మేర సాధించారు కూడా. ఆ కారణం వల్లనే తెలివైన బ్రాహ్మణులలో చాలా వరకూ ఎవ్వరూ బ్రాహ్మణ వృత్తులు స్వీకరించడం లేదు. అటు డబ్బూ లేక, ఇటు గౌరవమూ లేకపోతే మాకెందుకు ఈ కంచి గరుడ సేవ అనుకుని చాలా మంది సుబ్బరంగా ఉద్యోగ వ్యాపారాలు చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు.


బ్రాహ్మణుల పట్ల సమాజంలో గౌరవం పెరగడం చాలా అవసరం. అప్పుడే వారు మళ్లీ బ్రాహ్మణ వృతులైన వేదాధ్యయనం, పౌరోహిత్యం, ప్రవచనం వంటి వృత్తులను స్వీకరిస్తారు. హిందూ ధర్మం బలపడాలి అంటే అది చాలా ముఖ్యం. ఈ విషయాలు ఏ బ్రాహ్మణుడూ చెప్పలేడు, నిజానికి చాలా మందికి ఈ విషయాలు తెలుసు అనికూడా నేను అనుకోను.  డబ్బు రాకపోయినా, ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అని తెలిసినా ఎందరో బ్రాహ్మణులు మన సంస్కృతికి ఆధారమైన విద్యలు కాపాడారు అంటే కారణం, అది ఈశ్వరుడు తమకు అప్పగించిన బాధ్యత అని వాళ్ళు నమ్మడమే. అలా వారు నమ్మకపోయి ఉంటే, అది అందరి బాధ్యత అని వారు అనుకుని ఉంటే, అంటే మన దేశంలో వర్ణ వ్యవస్థ లేకపోయి ఉండి ఉంటే, భారతదేశానికి కూడా ఇస్లాం, క్రైస్తవాలు అడుగుపెట్టిన తరువాత వర్ణవ్యవస్థ లేని మిగిలిన దేశాలకి ఏ గతి పట్టిందో, అదే గతి పట్టేది. ఆ రెండు మతాలూ అడుగుపెట్టిన తరువాత కూడా తమ సంస్కృతిని, ధర్మాన్ని, నాగరికతని నిలువుకున్న ఏకైక దేశం మనదే. నాకు తెలిసినంత వరకూ ఆఫ్ఘనిస్తాన్ అంత త్వరగా ఇస్లామీకరించబడింది అంటే అందుకు కారణం అక్కడ బౌద్ధం ఎక్కువ అవ్వడమే (ఈ విషయంలో నాది పొరపాటు అయితే తెలియచెయ్యగలరు) 


కనుక బ్రాహ్మణ్యం మన బలం. అజ్ఞానంతో దానిని మనం పోగొట్టుకుంటున్నాం. నిజంగా బ్రాహ్మణ వ్యవస్థ మన బలహీనత అయితే ముఘలులు, బ్రిటిష్ వాళ్ళు, తరువాత వచ్చిన కాంగ్రెస్/కమ్యూనిస్టులు బ్రాహ్మణ వ్యవస్థని బలపరచాలే కానీ బలహీనపరచ కూడదు. 


ఒక బ్రాహ్మణుడు ఈ పోస్ట్ లైక్ చెయ్యాలి అన్నా, షేర్ చెయ్యాలి అన్నా 10 సార్లు ఆలోచిస్తాడు. వారి ఆత్మవిశ్వాసాన్ని అంతలా తూట్లు పొడిచారు. ఒక్కసారి ఈ విషయాన్నీ అందరూ కొంత విశాల దృక్పధంతో ఆలోచించండి

తల్లితండ్రుల పుణ్యఫలం

 🙏!శుభోదయమ్!!*✨🌷

🌸 *卐ॐ!! _సుభాషితమ్_!!ॐ卐* 🌸


శ్లో|| సుశీలోమాతృపుణ్యేన 

పితృపుణ్యేన చాతుర

ఔదార్యం వంశపుణ్యేన

ఆత్మపుణ్యేన భాగ్యవాన్.


తా|| తల్లితండ్రుల పుణ్యఫలం వలన మంచి గుణాలు, చాతుర్యం పొందుతాము. అలాగే వంశ పుణ్యాన ఉదారత్వం లభిస్తుంది. కానీ, స్వంత పుణ్యఫలం ఉంటేనే భాగ్యవంతులు కాగలరు. అందుకని అందరం సత్కర్మలు అంటే ఇతరులకు ప్రయోజనం కలిగించే పుణ్యకార్యాలు చేయాలి....... 

🙏✨💖🌷

సాధు దర్శనం..*

 *సాధు దర్శనం..*


"అయ్యా..ఏడుగురు సాధువులు మందిరం వద్దకు వచ్చారు..వాళ్లకు తెలుగు రాదు..హిందీ లో మాట్లాడుతున్నారు..మన సిబ్బంది లో ఎవరికీ హిందీ లో మాట్లాడటం రాదు..మీరొక్కసారి వాళ్ళతో మాట్లాడి..విషయం కనుక్కుని చెపితే..మేము అందుకనుగుణంగా నడుచుకుంటాము.." అని మా సిబ్బంది నాకు ఫోన్ చేసి అడిగారు..వాళ్ళ చేతికి ఫోన్ ఇచ్చి మాట్లాడించమని చెప్పాను..వాళ్ళతో మాట్లాడిన తరువాత..ఆ సాధువులు హరిద్వార్ వద్ద ఉంటారని..వాళ్ళు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో వుండే క్షేత్రాల ను దర్శించుకుంటూ తిరుగుతున్నారని..గొలగమూడి వెంకయ్య స్వామి మందిరానికి వెళ్ళినప్పుడు..మొగిలిచెర్ల లో కూడా ఒక అవధూత మందిరం వున్నదని విని..దర్శించుకోవడానికి వచ్చారని అర్ధమైంది..ఆ సాధువులు ఆ రాత్రికి స్వామివారి మందిరం వద్ద ఉండడానికి ఏర్పాట్లు చేయమని మా సిబ్బందికి చెప్పాను..తమ ఆహారం తామే తయారు చేసుకుంటామని కూడా వాళ్ళు చెప్పారు..


ఆరోజు రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి మందిరం వద్ద ఉన్న భక్తులు భజన చేస్తూ వున్నారు..ఏడుగురు సాధువులూ ఆ భజనను ఆసక్తిగా విన్నారు..మరి కొద్దిసేపటికి వాళ్ళు కూడా హిందీ లో భజన చేయడం ప్రారంభించారు..అందరూ స్వామివారి ముఖ మంటపం లోనే పడుకున్నారు..తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి..స్నానాదికాలు ముగించుకొని మళ్లీ మంటపం లోకి వచ్చి ధ్యానం చేసుకోసాగారు..ఆరోజు ఉదయం ఏడు గంటలకు నేను స్వామివారి మందిరం వద్దకు వెళ్ళాను..ఆ సమయానికి సాధువులందరూ స్వామివారి హారతి కళ్లకద్దుకొని..తీర్ధం తీసుకుంటూ వున్నారు..నన్ను నేను పరిచయం చేసుకొన్నాను..


"నిన్న సాయంత్రం ఐదారు గంటల వేళ మేము ఇక్కడికి వచ్చాము..మీరు మీ సిబ్బందికి చెప్పిన తరువాత..వాళ్ళు మమ్మల్ని స్వామివారి సమాధి దర్శించుకునే అవకాశం కల్పించారు..స్వామివారి సమాధి వద్దకు వెళ్ళాము..మాకు తెలీకుండానే..మా వళ్ళంతా జలదరింపులు వచ్చాయి..ఇక్కడ అఖండమైన తపో శక్తి నిక్షిప్తమై ఉన్నది..కేవలం మా అదృష్టవశాత్తూ ఇటువంటి అవధూత మందిరాన్ని దర్శించుకున్నాము..తరువాత ఇక్కడ భజన లో పాల్గొని..మేము కూడా పారవశ్యం తో భజన చేసాము..ఆ మంటపం లోనే రాత్రి పడుకున్నాము..ఇప్పుడు సమయం తక్కువగా ఉన్నందున ఈరోజు మేము వెళ్లిపోతున్నాము..కానీ అతి త్వరలోనే ఇక్కడికి వచ్చి..కనీసం పదిహేను రోజులపాటు ధ్యానం చేసుకుంటూ గడుపుతాము..మాకొఱకు ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లూ వద్దు..మా ఆహారం మేమే వండుకుంటాము.." అని చెప్పి.."మా భాష అర్ధం కాకపోయినా..మీ సిబ్బంది బాగా సహకరించారు..మా సైగలు వాళ్ళు అర్ధం చేసుకున్నారు.."అని చెప్పారు..వాళ్ళు తెచ్చుకున్న కొద్దిపాటి సామాను సర్దుకొని..తిరిగి వెళ్లేముందు..స్వామివారి సమాధిని మరొక్కసారి దర్శించుకుంటామని అడిగారు..అలాగే వెళ్ళిరండి అన్నాను..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చి మూకుమ్మడిగా అందరూ "జై గురుదేవ్..జై దత్తాత్రేయ.." అని పెద్ద స్వరం తో పలికి..ఒక ఐదు నిమిషాలు కళ్ళుమూసుకుని నిలబడ్డారు..ఆ తరువాత ఇవతలికి వచ్చి..దత్తపాదములు ఉన్న చిన్న మందిరం వద్దకు వెళ్లి నమస్కారం చేసుకున్నారు..ఒక్కొక్కరుగా తమ శిరస్సులను దత్తపాదములకు ఆనించి.."జై దత్తాత్రేయా.." అని పలికి ఇవతలికి వచ్చేసారు..


"ఈ స్వామివారు మమ్మల్ని అనుగ్రహిస్తే..అతి త్వరలో మళ్లీ ఇక్కడికి వస్తాము.." అని చెప్పారు..మరో గంట తరువాత సాధువులు వెళ్లిపోయారు..


స్వామివారి సమాధిని ఎందరో సాధువులు, సాధకులు, సన్యాసులు దర్శించుకుంటూ వుంటారు..ఇక్కడ స్వామివారి తపశ్శక్తి నిక్షిప్తమై ఉన్నది అని వారందరూ తరచు చెపుతూ వుంటారు..ఆ తపోమహిమ ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా అనుభవానికి వస్తుంది..అలా అనుభూతి పొందిన వారు మరలా మరలా ఈ క్షేత్రానికి వచ్చి వెళుతుంటారు..అలాటి సాధు సన్యాసుల దర్శనం కూడా స్వామివారి వలన మాబోటి వారికి లభిస్తున్నది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

18, ఫిబ్రవరి 2021, గురువారం

మాఘ పురాణం*_🚩 🚩 _*7 వ అధ్యాయము*_

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*7 వ అధ్యాయము*_🚩


      *గురువారం*

*ఫిబ్రవరి 18, 2021*



🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలము*


🕉️☘☘☘☘☘☘🕉️


వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు యిట్లు తెలియజేసెను. పార్వతీ ! చాలాకాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అసంతవాడయను నామముగల పెద్దనగరముండెను. అందు బంగారుశెట్టి అను వైశ్యుడొకడు వుండెను. అతని భార్యపేరు తాయారమ్మ. బంగారుశెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది , కాని , అతడు ఇంకనూ ధనాశకలవాడై తనవద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కాని ఒక్కనాడైననూ శ్రీహరిని ధ్యానించుటగాని , దానధర్మాలు చేయుటగాని యెరుగడు. అంతేకాక బీదప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు ఋణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి , వారి ఆస్తులు సైతము స్వాధీన పరచుకొనేవాడు. ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళెను , ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూచి , *"తల్లీ ! నేను ముసలివాడను నా గ్రామము చేరవలయునన్న యింకనూ పది ఆమడలు వెళ్ళవలసియున్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది , ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద రాత్రి గడుపనిమ్ము నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్భ్రాహ్మణుడను , సదాచారవ్రతుడను ప్రాతఃకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయెదను"* అని బ్రతిమలాడెను.


తాయారమ్మకు జాలికలిగెను వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి , అందొక తుంగచాపవేసి , కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను. ఆమె  దయార్ద హృదయమునకు ఆ వృద్ద బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి , *"ఆర్యా మాఘస్నానము చేసి వెళ్ళెదనని యన్నారు కదా ! ఆ మాఘస్నానమేమి ?* *సెలవిండు వినుటకు కుతూహలముగా నున్నది"* అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటికప్పుకొని , *"అమ్మా మాఘమాసము గురించి చెప్పుట నాశక్యము కాదు , ఈ మాఘమాసములో నది యందు గాని , తటాకమందు గాని లేక నూతియందుగాని సూర్యోదయము అయిన తర్వాత చన్నీళ్ళు స్నానము చేసి విష్ణుమందిరనికి వెళ్ళి తులసి దళముతోను , పూలతోను పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను , తరువాత మాఘపురాణము పఠించవలెను.* ఇట్లు ప్రతిదినము విడువకుండా నెలరోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన , దానధర్మములు చేయవలెను. ఇట్లు చేసినయెడల మానవునికి రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. *ఒకవేళ ఈ నెలరోజులూ చేయలేనివారూ , వృద్దులూ , రోగులు ఒక్కరోజయినను అనగా ఏకాదశినాడు గాని , ద్వాదశినాడు గాని లేక పౌర్ణమినాడు గాని పై ప్రకారము చేసినచో సకలపాపములు తొలగి సిరిసంపదలు , పుత్రసంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను"* అని చెప్పగా , ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడ ప్రాతఃకాలమున బ్రాహ్మణునితో బాటు నదికిపోయి స్నానము జేయుటకు నిశ్చయించుకొనెను.


అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారుశెట్టి యింటికిరాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టికి కోపమువచ్చి , వంటినిండా మంటలు బయలదేరినట్టుగా పళ్ళు పటపటాకొరికి *"ఓసీ వెర్రిదానా ! ఎవరు చెప్పినారే నీకీ సంగతి ? మాఘమాసమేమిటి ? స్నానమేమిటి ? వ్రతము , దానములేమిటి ? నీకేమైనా పిచ్చి పట్టినదా ? చాలు చాలు అధిక ప్రసంగముచేసినచో నోరునొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికిని ఒక్కపైసాకూడా వదలకుండా వడ్డీలు వసూలుచేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా ? చలిలో చన్నీళ్ళు స్నానముచేసి , పూజలుచేసి , దానములుచేస్తే వళ్ళూ యిల్లూ గుల్లయి , నెత్తి పైన చెంగు వేసుకొని 'భిక్షాందేహీ' అని అనవలసినదే జాగ్రత్త ! వెళ్ళి పడుకో"*, అని కోపంగా కసిరాడు.


ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు. యెప్పుడు తెల్లవారునా యెప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని యింటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి , మగనికి చెప్పకుండ నదికిపోయి స్నానముచేయుచున్నది. ఈలోగా బంగారుశెట్టి పసిగట్టి  ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికిపోయి నీళ్ళలోదిగి భార్యను కొట్టబోవుచుండగా , ఆ యిద్దరూ కొంతతడవు నీళ్ళలో పెనుగులాడిరి అటుల మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారుశెట్టి భార్యను కొట్టి యింటికి తీసుకువచ్చినాడు.


కొన్ని సంవత్సరములు తరువాత ఒకనాడు ఇద్దరకూ ఒకవ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారుశెట్టిని తీసుకొనిపోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసికొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రధముపై ఎక్కించుకొని తీసికొనిపోవుచుండిరి. అపుడు తాయారమ్మ యమభటులతో యిట్లు పలికెను.


*"ఓ యమభటులారా ! ఏమిటీ అన్యాయము ? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి ? నా భర్తను యమలోకమునకు తీసుకొనిపోవుట  ఏమిటి ? ఇద్దరమూ సమానమేగదా"* అని వారి నుద్దేశించి అడుగగా , ఓ అమ్మా ! నీవు మాఘమాసములో ఒక దినమున నదీస్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కానీ , నీ భర్త అనేకులను హింసించి , అన్యాయముగా ధనార్జన చేసి అనేకులవద్ద అసత్త్యములాడి నరకమన్న భయములేక భగవంతునిపై భక్తిలేక వ్యవహరించునందులకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి.


ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. *"నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్తకూడా నీటమునిగినాడు కదా ! శిక్షించుటలో యింత వ్యత్యాసమేలకలుగెను ?"* అని అనగా  ఆ యమభటులకు సంశయము కలిగి , యేమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని , ఆమె వేసిన ప్రశ్ననూ తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టికచూడగా , ఇద్దరకూ సమానమైన పుణ్య ఫలము వ్రాసియున్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారుశెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి యేమయ్యెనో యని ఆతృతతో ఉండగా , బంగారుశెట్టిని పుష్పకవిమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యా భర్తలిద్దరూ మిక్కిలి సంతోషమందిరి. రాజా ! వింటివా ! భార్యవలన భర్తకు కూడా యెటుల మోక్షము కలిగెనో భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్యా యధాలాపముగా ఒక్కరోజు మాఘమాసస్నానము చేసినందున యిద్దరికిని వైకుంఠప్రాప్తి కలిగినదిగా ! గనుక మాఘస్నానము నెలరోజులు చేసినచో మరింత మోక్షదాయకమగుటలో సందేహములేదు.


*ఏడవ అధ్యాయము సమాప్తం*

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

భరద్వాజ మహర్షి

 మన మహర్షులు- 25


భరద్వాజ మహర్షి 


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


 భరద్వాజ మహర్షి సప్తఋషులలో ఒకరు.

సప్త ఋషుల గురించి మహాభారతంలోనూ, పురాణాలలోనూ కూడా ప్రస్తావించబడింది.


ఈయన తపస్సు చేసిన ఆశ్రమం పేరు 'భరద్వాజతీర్థ'


దేవతల గురువైన బృహస్పతి కుమారుడు 'భరధ్వాజుడు'. 


మహాభారతం లో కురుపాండవుల గురువైన ద్రోణాచార్యుడు భరద్వాజుని కుమారుడే...

 ద్రోణుడికి అశ్వత్థామ పుట్టాడు. ఇలా భరద్వాజ వంశం వృద్ధి అయింది.


భరద్వాజుడు భృగుమహర్షిని అడిగి  పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి..సృష్టి ఎలా జరిగింది ..వంటి అనేక విషయాలు తెలుసుకున్నాడు.


చరక సంహిత ప్రకారం, ఈతడు వైద్య శాస్త్రాన్ని దేవతల రాజు అయిన ఇంద్రుని వద్ద అధ్యయనం చేసాడు.


 భరద్వాజుడు మూడు కాలాలు తెలుసుకోకలిగిన జ్ఞానంతో గొప్ప తపశ్శక్తితో చాలామంది శిష్యుల్తో తన ఆశ్రమంలో వున్నాడు.


రామాయణంలో భరతుడు తన అన్న అయిన రాముణ్ణి  అయోధ్యకు తిరిగి తీసుకురావడానికి అయోధ్య ప్రముఖులతో, మంత్రులతో, పురజనులతో, చతురంగ బలాలతో అడవికి బయలు దేరతాడు. భరధ్వాజ మహర్షి ఇతని భాతృభక్తిని పరీక్షించి, ప్రశంసించి భరతునితో పాటు వచ్చిన అందరికీ తన తపశ్శక్తితో షడ్రసోపోతమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. శ్రీరాముడు వనవాస సందర్భంగా భరద్వజ దంపతులను దర్శించి వారి ఆశీర్వచనాలు తీసుకుంటాడు. 


 భరద్వాజుడు తీర్థయాత్రలు చేస్తూ వ్రేపల్లె వచ్చి యమునానదిలో స్నానం చెయ్యాలనుకుని అక్కడున్న వాళ్లని రేవు చూపించమన్నాడు. వాళ్ళు ఆయన్ని ఆటలు పట్టించారు

గోపాల బాలకులతోనూ, బలరాముడితోనూ అందరితో కలిసి అక్కడ తిరుగుతున్న శ్రీకృష్ణుడు పరుగుపరుగూ వచ్చి మహర్షికి నమస్కారం చేసి ఆతిథ్యం తీసుకోమన్నాడు.


 భరద్వాజుడు అతణ్ణి శ్రీకృష్ణుడయిన విష్ణుమూర్తి అవతారంగా తెలుసుకుని స్తోత్రం చేశాడు.


 భరద్వాజుడు రాజధర్మాల్ని చెప్తూ రాజుకి గద్ద చూపు, కొంగ వినయం, కుక్క విశ్వాసం, సింహ పరాక్రమం, కాకి సంశయం, పాము నడక ఉండాలని, ధర్మకార్యక్రమాలు

ఎలా చెయ్యాలో, దోషుల్ని ఎలా దండించాలో కూడా శత్రుంజయుడనే రాజుకి చెప్పాడు


 ఒకసారి గొప్పగొప్ప మనులందరూ భరద్వాజుడి దగ్గరకొచ్చి శాస్త్రోక్తంగా ఉదయం ముఖం కడుక్కోవటం దగ్గర్నుంచి పడుక్కునే వరకు అన్ని పనులు ఎలా చెయ్యాలో తెలుసుకున్నారు. ఏ కొత్త పని మొదలు పెట్టినా తూర్పువైపు తిరిగే మొదలుపెట్టాలని అన్ని విషయాలు వివరంగా చెప్పాడు భరద్వాజుడు. ఈ గ్రంధాన్నే 'భరద్వాజ స్మృతి' అన్నారు.


అన్నిటికంటే  ఆశ్చర్యం కలిగించే విషయం...


 భరద్వాజుడు వైమానిక శాస్త్రం' అంటే విమానాలు ఎలా తయారు చెయ్యాలి అని, ఒక గ్రంథం రాశాడు. ఈ పుస్తకంలో ఎనిమిది అధ్యాయాలున్నాయి


మనం ఇప్పుడు తెలుసుకుంట్నుది భరద్వాజ మహర్షికి ఎపుడో తెలుసన్నమాట. 

ఈ విమానం ఎలా వుంటందంటే విరగనిది కోసినా తెగకుండా కాలిపోకుండా ఉండేది నాశనంకాకుండానూ వుంటుంది. .

. ఈ విమానంలో శత్రువుల మాటలు వినగలిగేలా, ఫోటోలు తీసుకోగలిగేలా,

శత్రువిమానం రాకపోకలు తెలుసుకోగలిగేలా పైలట్లని మూర్చపోయేలా చెయ్యకలిగేవి

చాలా పరికరాలుంటాయి. అంటే ఇవి యుద్ధవిమానాలేమో.


విమానానికి 31 భాగాలుండాలనీ. విమానం నడిపే వాళ్ళకి వేరువేరు బట్టలుండాలనీ, కాలాన్ని బట్టి తినడానికి మూడు రకాల ఆహార పదార్థాలుండాలనీ వాటి వల్ల గాలిలో ఉండే ఇరవై అయిదు రకాల విషాలు ఏం చెయ్యకుండా వుంటాయనీ రాశాడు.


పదహారు రకాల లోహాలో తయారు చేస్తే ఏ వాతావరణానికయినా తట్టుకుని చెక్కు చెదరకుండా వుంటుందిట. 

ఈ విమానం తయారు చేసే పద్ధతి అద్భుతంగా వుంది కదూ..


జ్ఞాననిధులు మన మహర్షులు ..🙏🙏🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

సూర్యుడు రథం మారుతాడు

 ధర్మసందేహాలు-సమాధానం


🍁🍁🍁🍁


ప్ర: సూర్యుడు రథం మారే రోజు కాబట్టి రథసప్తమి అని పేరు వచ్చింది అంటారు. ఇది అజ్ఞానం కాదా? సూర్యునికి రథం ఉందా? సూర్యుడు రథం మార్తాడా?




జ: వేదభాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. రథము అనే మాటకి అర్థం - గమన లక్షణము కలది రథము. ఇక్కడ గమనం అంటే కాంతి.


సూర్యునికి ఉదయాస్తమయాలు లేవు. మనం ఉన్న స్థితి బట్టి అలా కనబడుతుంది అనే విషయం సృష్టిలో మొట్టమొదటిగా చెప్పినది వేదం. 


ఎలాంటి పరికరాలు లేకుండానే యుగాల క్రిందటే ఈ విషయం చెప్పిన మన మహర్షులకి ఇంత చిన్న విషయాలు తెలియవా?


 ఇదొక్కటి ఆలోచిస్తే మన హైందవ ధర్మం గొప్పదనం తెలుస్తుంది.


పూర్తి వైజ్ఞానిక స్పృహతోనే సూర్యారాధన చేసిన జాతి భారత జాతి. కేవలం నమ్మకం కాదు. విశ్వాసానికి కారణం ఒక విజ్ఞానం. సూర్యున్ని కేవలం ప్రకృతిలో ఉన్న ఒక మండుచున్న అగ్నిగోళము అని దర్శించకుండా ఒక చైతన్య స్వరూపమైన భగవంతుని ఆకారం అనే ఉదాత్త భావన మన విజ్ఞానంతో కూడిన విశేషం. ఆ విజ్ఞానాన్ని ఆధారం చేసుకొనే మన విశ్వాసం ఆధారపడి ఉంది.


సూర్యుడు రథం మారుతాడు అంటే సూర్యుని కాంతి యొక్క గమనము మారుతుంది అని చెప్పడం దీనిలో ఉన్న ఆంతర్యం. ఆ మార్పు వచ్చిన సప్తమిని రథసప్తమి అని వ్యవహరిస్తాం. 


వేదభాష సంకేత భాష. అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలే తప్పా అజ్ఞానం అని తోసేస్తే మన అజ్ఞానం బయటపడుతుంది.


🍁🍁🍁

సైనసైటిస్ కొరకు కొన్ని సులభ యోగాలు -

 సైనసైటిస్  కొరకు కొన్ని సులభ యోగాలు   -


 *  రోజు మంచి పలుచటి వేపనూనె రెండు ముక్కు రంధ్రాలలో ఒక్కో బొట్టు వేస్తుంటే క్రమంగా సైనస్ దూరం అవుతుంది.


 *  తులసి ఆకులని నీడలో ఎండబెట్టి తరువాత బాగా దంచి చూర్ణం చేయాలి . ముందు జల్లెడ పట్టి ఆ తరువాత వస్త్రగాలితం చేయాలి . అంటే పలుచని నూలుబట్టలో వేసి మెత్తటి చూర్ణం కిందికి దిగేలా చేతితో కలబెట్టాలి. ఈ చూర్ణం ని కొద్దికొద్దిగా నస్యం లాగా పీలుస్తుంటే ముక్కుకి సంబందించిన సైనసైటిస్ , వూపిరి ఆడకపోవడం , తుమ్ములు , శ్లేష్మం , నీరు , రక్తం ధారగా కారడం , దగ్గు , పడిశం, రొంప , విపరీతమైన తలనొప్పులు కంటి మసకలు ఇలాంటి వ్యాధులు అన్ని ఎంతకాలం నుంచి మనలని వేధిస్తున్నా కొద్దిరోజులలోనే మటుమాయం అయిపొతాయి.


 గమనిక  - 


        కఫాన్ని కలిగించే ఆహారపదార్థాల అయిన చల్లని నీరు , కూల్ డ్రింక్స్ , మినుములు , బచ్చలికూర, గొంగూర, పనసకాయ , ఖర్జూరం , కొబ్బరినీరు , తీపి , పులుపు , ఉప్పు పదార్థాలు, అజీర్తి కలిగించేవి వంటి పదార్థాలు నిషిద్దం .


      పెసరపప్పు , ఉలవలు , బార్లీ , పొట్లకాయలు, కాకరకాయలు, నక్కదోసకాయలు, అరటిపువ్వు , శెనగలు, కంద, వాము , బూడిదగుమ్మడి , దాల్చినచెక్క, నిమ్మపండు, పసుపు,మిరియాలు , మునగాకులు తప్పక ఆహారం లో ఉండేలా చూసుకోండి.


       నీరు తాగినప్పుడల్లా గోరువెచ్చని నీరు తాగండి. 

 

       పై నియమాలు పాటించటం వల్ల వీలయినంత తొందరలో సైనసైటిస్ సమస్య తీరును .


 


         మరిన్ని సులభయోగాలు నా గ్రంథాల యందు ఇవ్వడం జరిగినది.

 

    గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

రథసప్తమికి జిల్లేడకుకి

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*రథసప్తమికి జిల్లేడకుకి సంబంధం ఏమిటి?*


రథసప్తమినాడు స్నానసమయంలో నెత్తిపై జిల్లేడాకు పెట్టుకోవాలి. ఆ ఆకునే ఎందుకు పెట్టుకోవాలి? ఏ తమలపాకో చిక్కుడాకో ఎందుకు పెట్టుకోకూడదు అన్నసందేహమూ వస్తుంది.


దీని వెనుక ఒకకథ ఉంది. పూర్వం అగ్నిష్వాత్తులు అనే పండితులు మహానిష్ఠతో చాలా యజ్ఞాలు చేశారు.


ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది, వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవవిమానం పంపించాడు. ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిష్వాత్తులు. ఆ దేవవిమానం చూసిన సంభ్రమంలో వారు ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు.


అయితే ఆసమయంలో పెద్దగాలిరావడంతో కొంత వేడివేడి నెయ్యి ప్రక్కనే ఉన్న ఒకమేకపై పడింది. ఆ వేడికి మేకచర్మం ఊడిపోయి మరణించి, దాని ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవవిమానంలో కూర్చుంది. ఆచర్మం ప్రక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది.


అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్త్వం మారిపోయి, మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది.


అలా జిల్లేడాకు యజ్ఞంత సమయంలో ఆజ్యధారలు ధరించడంతో పరమపవిత్రం అయ్యింది. జిల్లేడు ఆకును ముట్టుకొంటే మేకచర్మంలా మెత్తగా ఉంటుందందుకే! జరిగిన దానికి అగ్నిష్వాత్తులు బాధపడ్డారు. అప్పుడు ఆకాశవాణి, "మీరు దుఃఖించాల్సిన పనిలేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి, దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది.


ఈ జిల్లేడు మేకచర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారింది" అని పలికింది. ఆ మాట అగ్నిష్వాత్తుల్ని సంతోషపరిచింది. అది మాఘశుద్ధ సప్తమీతిథి.


అప్పటి నుండి రథసప్తమినాడు నెత్తిపై జిల్లేడాకు పెట్టుకుని, సూర్యప్రీతి కోసం స్నానం చేసేవారికి లేశమాత్రం యజ్ఞఫలం లభిస్తోంది. ఏడుజన్మల పాపాలు పోతున్నాయి.

🙏🙏🙏