తేనె గురించి సంపూర్ణ వివరణ - 1 .
తేనెలోని రకాలు -
* అర్ఘ్యమను తేనె .
* చాద్ర అనే తేనె .
* చిన్ని పువ్వు తేనె .
* జిద్దాల అనే తేనె .
* జుంటి తేనె .
* దండజం అనే తేనె .
* పుట్ట తేనె .
* పాత్రికం అనే తేనె .
* పౌష్పికం అనే తేనె .
* భ్రామరం అనే తేనె .
* మాక్షికం అనే తేనె .
* సౌషిరం అనే తేనె .
* క్షౌద్రం అనే తేనె .
* సామాన్యపు తేనె .
తేనె తియ్యగా రుచిగా ఉండి వేడి పుట్టించి శరీరంను ఆర్చును . త్రిదోషాలను హరించును . విరేచనం , బలమును కలిగించును . హిక్కా , శ్వాస , కాస , వమనము , పిత్త సన్నిపాత రోగములు , విషదోష , విదాహం , చర్ది , రక్తపిత్తము , కుష్ఠు , అతిసారం , శీతపిత్తము , పక్షవాతం , మలమూత్ర బద్దకం , కంటిజబ్బులు , అశ్మరీ , మూత్రాశ్మరీ మొదలగు సమస్యలను నివారించును.
సాధారణముగా మన వైద్యులు వాడు మందులలో తేనెని అనుపానంగా ఇవ్వడం జరుగును . దీనిని వైద్యుడు తన యుక్తిని అనుసరించి శాస్త్రానుభవసారముగా దీనిని ఉపయోగించినచో అనేక రోగాలు పుట్టుటకు కారణం అగును. కనుక దీనికి విరుగుళ్లు తెలుసుకుని ఉండవలెను . తేనెకి విరుగుడు వస్తువుగా నెయ్యి , నిమ్మకాయ , మాదీఫలము , ధనియాలు , దానిమ్మకాయ అను వీనిలో ఏదైనా ఒకటి తీసుకుని సేవించిన ఉపశాంతి కలుగును. తేనె వ్రణములను , గాయములను మాన్పును .
తేనె గురించి మరింత విలువైన విషయాలు మరియు తేనెలొని రకాలు వాటి లక్షణాల గురించి తరవాతి పోస్టులలో సంపూర్ణముగా వివరిస్తాను .
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి