8, ఏప్రిల్ 2021, గురువారం

మొగలిచెర్ల

 *భక్తికి వశం..*


"మీతో మాట్లాడాలి..ఎప్పుడు వీలవుతుంది?.." అని ఒకతను నన్ను అడిగాడు.."మీరు చూస్తూనే వున్నారు కదా..ఖాళీగా వున్నాను..ఇప్పుడే మాట్లాడుకుందాము.." అన్నాను..అతను సందేహిస్తూ చుట్టూ చూసి.."నా ఉద్దేశ్యం మీ ఒక్కరితోనే మాట్లాడాలని.." అన్నాడు.."సరే..రండి..ఆ మంటపం లో కూర్చుని మాట్లాడుకుందాము.." అన్నాను..ఆరోజు బుధవారం..మందిరం లో భక్తులు లేరు..నేను, మా సిబ్బంది..అర్చకస్వాములు..అందరం కలిసి..రాబోయే శివరాత్రి కి చేయాల్సిన ఏర్పాట్ల గురించి ముచ్చట చేస్తున్నాము..ఆ సమయం లో ఇతను వచ్చాడు..


ఇద్దరమూ మంటపం లో ఓ ప్రక్కగా కూర్చున్న తరువాత.."ఇప్పుడు చెప్పండి.." అన్నాను.."మాది నెల్లూరు జిల్లా చెన్నాయపాలెం అండీ..ఆక్వా సాగు చేసి బాగుపడ్డాము..అప్పుడప్పుడూ అందులో ఒడిదుడుకులు ఎదురైనా..తట్టుకొని నిలబడ్డాము..నాకు ఇద్దరు అబ్బాయిలు..పెద్దవాడికి రెండేళ్ల క్రితం వివాహం చేసాను..రెండోవాడు చెన్నై లో ఉద్యోగం చేస్తున్నాడు..గత ఆరునెలలుగా ఒక సమస్యతో బాధపడుతున్నాము..మా అబ్బాయికి కోడలికి మధ్య విబేధాలు వచ్చాయి..ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది..మా కుల పెద్దల వద్ద పంచాయితీ పెట్టించాము..కానీ ఆ అమ్మాయి కానీ..వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈ పంచాయతీలకు మేము రాము...అని చెప్పారు..పైగా మామీద వరకట్నం కేసు కూడా పెట్టారు..వ్యవహారం కోర్టుకు చేరింది..మాకు మనోవేదన పెట్టుకున్నది..ఆ పిల్లను బంగారం లాగా చూసుకున్నాము..మా పరంగా ఏ లోటూ చేయలేదు..పైగా పెళ్లి అయిన మరుసటి నెలలోనే..మా అబ్బాయిని కోడలిని నెల్లూరు లో ఇల్లు తీసి..అందులో కాపురం పెట్టించాము..నేనూ నా భార్యా వాళ్ళ సంసారం లో జోక్యం చేసుకోలేదు..అటువంటిది ఆ పిల్ల నా భార్య మీద కూడా కేసు పెట్టి..మూడురోజులు జైల్లో పెట్టించింది..బెయిల్ తీసుకొని బైటకు తీసుకువచ్చాము..మాకెందుకీ ఖర్మ పట్టింది అని కుమిలి పోతున్నాము..ఏ దిక్కూ తోచక నాలుగు వారాల నుంచీ ఈ స్వామివారి వద్దకు వస్తున్నాము..ప్రతి బుధవారం ఉదయం వచ్చి..గురువారం సాయంత్రం వెళుతున్నాము..స్వామివారు మమ్మల్ని గట్టున పడేస్తే అదే చాలు..గౌరవంగా ఉన్న వాళ్ళము..ఈ రకంగా బాధ పడాల్సివస్తుందని అనుకోలేదు.." అన్నాడు.."ఇప్పటికి నాలుగు వారాలు ఇక్కడికి వచ్చాము..ఇంకొక్క వారం వస్తే ఐదు వారాలు అవుతాయి.." అన్నాడు.."మీ భార్య కూడా వచ్చిందా..?" అన్నాను.."ఈ స్వామివారి వద్దకు రావడానికి ఆమె కారణం..తానే పట్టుబట్టి ఇక్కడకు తీసుకొచ్చింది.." అని చెప్పి..తాను లేచి వెళ్లి..మంటపానికి అవతల వైపు ఉన్న ఆడమనిషిని వెంట పెట్టుకొని వచ్చాడు..ఆమెను పరిచయం చేసాడు..


"అయ్యా..మాకు ఏమీ వద్దయ్యా..ఆ అమ్మాయి వాళ్ళు మాకు కట్నంగా ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా వెనక్కు ఇస్తాము..మేము పెట్టిన బంగారం వదులుకుంటాము..మా మీద కేసు లేకుండా ఉంటే..విడాకులు ఇచ్చేస్తాము..ఈ స్వామివారిని మేము కోరేది అదొక్కటే.." అన్నది..


"సరే..మరో వారం రండి..స్వామివారిని పరిపూర్ణంగా నమ్మితే..పరిష్కారం చూపకుండా వుండరు..ఇక మీ సమస్య ఎప్పుడు తీరుతుందో చూద్దాము.." అన్నాను.."అయ్యా..మీరు కూడా మా తరఫున స్వామివారికి ప్రార్ధన చేయండి..అందుకోసమే మిమ్మల్ని ఇలా ప్రక్కకు రమ్మనమని పిలిచాను..ఆ ఒక్క సహాయం మా కోసం చేయండి.." అన్నారు.."మీ గోత్రనామాలు ఇవ్వగలరా..రేపటి నుంచి ఉదయం స్వామివారి హారతులు కాగానే..మీ గోత్రనామాలతో అర్చన జరిపిస్తాను..చూద్దాము..స్వామివారు మీ వేదన తీరుస్తారనే నమ్మకం ఉంది.." అన్నాను.."తప్పకుండా ఇస్తాము.." అని ఒక కాగితం మీద వాళ్ళ గోత్రము..పేర్లు..వ్రాసి ఇచ్చారు..అర్చకస్వామిని పిలిచి..ఆ గోత్రనామాలతో ప్రతిరోజూ ప్రభాతసేవ అనంతరం అర్చన చేయమని ఇచ్చాను..సరే అన్నారు..


ఆ మరుసటి వారం..ఆ దంపతులు స్వామివారి మందిరానికి వచ్చారు..వాళ్ళ ముఖాల్లో మునుపటి నిరుత్సాహం లేదు..ఇద్దరూ కాళ్ళూ చేతులు కడుక్కొని..స్వామివారి మందిరం చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి..టికెట్ కొనుక్కొని..స్వామివారి సమాధి దర్శించుకొని..ఆ తరువాత నా దగ్గరకు వచ్చారు.."అయ్యా..చాలా వరకూ మా సమస్య తీరిపోయింది..ఆ అమ్మాయి వాళ్ళు పంచాయతీ కి వచ్చారు..మేము తీసుకున్న కట్నం డబ్బు మేము వెనక్కు ఇచ్చేతట్టు..మా బంగారం మాకు వాళ్ళు ఇచ్చేందుకు..ఒప్పందం జరిగింది..విడాకుల పత్రం కూడా రాసుకున్నాము..మామీద తప్పుడు కేసు పెట్టినట్టు బహిరంగంగా ఒప్పుకున్నారు..కోర్టులో కూడా కేసు వెనక్కు తీసుకున్నారు..కోర్టు నుంచి విడాకుల కాగితాలు రాగానే మా అబ్బాయిని తీసుకొని ఇక్కడకు వస్తాము..ఇక వాడికి మళ్లీ పెళ్లి చేయాలి..ఈ స్వామివారి దయ ఉంటే..అది కూడా త్వరలో జరుగుతుంది.." అని చెప్పారు..ఆరోజు కూడా స్వామివారి సన్నిధి లో వుండి..ప్రక్కరోజు వాళ్ళ ఊరు వెళ్లిపోయారు..


మరో ఆరేడు నెలల తరువాత..తమ పిల్లవాడికి వివాహం చేసి..కొడుకు కోడలు ను తీసుకొని స్వామివారి సన్నిధికి వచ్చారు.."అయ్యా..మా ప్రారబ్ధమో..పిల్లవాడి ఖర్మో ..తెలీదు కానీ..మాకు పట్టిన శని ఆరోజుతో వదిలింది..ఇప్పుడు లక్షణంగా ఉన్నాము..అంతా స్వామి దయ.." అని భక్తిగా చెప్పారు..తమ రెండో కుమారుడి వివాహం స్వామివారి సన్నిధిలో చేస్తామని మొక్కుకొని..అదే విధంగా మరుసటి సంవత్సరం ఆ రెండో కుమారుడి పెళ్లి..మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి సన్నిధి లో చేశారు..అప్పటి నుంచీ ప్రతి సంవత్సరం లో రెండు సార్లు తమ కొడుకులు కొడళ్లు మనుమలతో సహా స్వామివారి వద్దకు వచ్చి అన్నదానం చేసి వెళుతుంటారు..


వాళ్ళు కోరుకునే కోరిక ఒక్కటే.."మమ్మల్ని చల్లంగా చూడు స్వామీ.." అని..ఆ పని స్వామివారు తప్పక చేస్తారు..ఎందుకంటే వాళ్లలో ని భక్తికి స్వామివారు వశం అయ్యారు కదా..!!


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)


 

Natural cure


 


 

7, ఏప్రిల్ 2021, బుధవారం

అచ్చమైన పొడుపు కథ.!

 అచ్చమైన పొడుపు కథ.!


ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు?

వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు.

ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.

.

“ రాముడెవ్వానితో రావణు మర్దించె? 

పర వాసు దేవుని పట్నమేది ? 

రాజమన్నారుచే రంజిల్లు శరమేది ? 

వెలయ నిమ్మ పండు విత్తునేది? 

అల రంభ కొప్పులో అలరు పూదండేది? 

సభవారి నవ్వించు జాణ యెవడు? 

సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది? 

శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు? 

.

అన్నిటను జూడ ఐదేసి యక్షరములు 

ఈవ లావాల జూచిన నేక విధము 

చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి” 

లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !”

.

పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు. 

తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.(క్లూస్) 

మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని, 

నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన.

ఇక జవాబుల సూచికలు-

ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి,

ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. (ఉదా;- “ కిటికి”వలె ).

1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు?

2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి?

3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఎమిటి?(శరము=బాణము)

4. నిమ్మ పండు విత్తనం పేరు ఏది?

5.రంభ జడలో పెట్టుకొన్న పూలదండ పేరు?

6.సభలో నవ్వించే కవిపేరు ఏది?

7.సీత పెండ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? ( ఓలి=శుల్కం)

8.శ్రీకృష్ణుడు ఎవరి యింట పెరిగేడు?

ఈ క్రింది జవాబులు చూడండి.

.

1.తోకమూకతో! ( వానరాలకి ఇంకొక పేరు.)

2.రంగనగరం! ( శ్రీరంగం )

3.లకోల కోల! ( కోల= బాణం)

4.జంబీర బీజం! ( జంబీరం=నిమ్మపండు. బీజం=విత్తనం)

5.మందార దామం! ( దామం అంటే దండ)

6.వికట కవి! ( హాస్యకవి తెనాలి రామ కృష్ణుడు)

7.పంచాస్య చాపం! ( శివుని విల్లు)

8.నంద సదనం! ( నందుని ఇల్లు)

-

పై జవాబులు ఐదు అక్షరాలతో, ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటాయి. 

అదే ఈ చాటు పద్యంలోని చమత్కారం. ఇట్టి చాటువుల ద్వారా భాషా జ్ఞానం, పద జ్ఞానం వృద్ది చెందుతాయి. ఇలాంటివి ఇంకా చదవాలని కుతూహలం పెంచుతాయి.

పెద్దలు చదివి, పిల్లలకి కూడా తెలపగలరు.

slave nation

 British officers who served in India were not given public posts/responsibilities when they returned to England.

 

The argument was that you have ruled over a slave nation which may have made a difference in your attitudes and behaviour. 


If you are given such a responsibility here, you will deal with the independent British nation in the same way.


Read the following event with this brief introduction...


A British woman whose husband was a civil service officer in Pakistan and India during the British rule, spent many years of her life in different parts of India. 


On her return, she wrote a beautiful book based on her memoirs.


The woman wrote that when my husband was the deputy commissioner of a district, my son was about four years old and my daughter was one year old.  We lived in a multi-acre residence allotted to the Deputy Commissioner.


Hundreds of people were busy serving DC's house and family. There would be parties every day, the big landlords of the district would be proud to invite us to their hunting programs, and whoever we went to would consider it an honour. 


Our luxuries were such that even the Queen and the royal family in Britain could hardly afford them.


During the train journey, a luxurious box adorned with Nawabi luxury was reserved for the family of the Deputy Commissioner. 


When we boarded the train, the white-clad driver would stand in front of us with both hands tied and asked permission to start the journey. The train would start running only after getting permission.


Once we boarded the train for the journey, according to tradition, the driver came and asked for permission. Before I could speak, my son was in a bad mood for some reason. He told the driver not to drive. The driver, while executing the order, said that the order was made, little sir. After a while, the whole staff, including the station master, gathered and begged my four-year-old son, but he refused to allow the train to run. 


Eventually, with great difficulty, I persuaded my son to run the train on the promise of several chocolates, and the journey began.


A few months later, she returned to the UK to visit friends and relatives. We arrived in London by ship, our destination was a county in Wales for which we had to travel by train. 


I sat my daughter and son on a station bench and went to get a ticket. It was too late because of the long queue, which made my son very upset.


When we got on the train, seeing the first-class seats instead of the luxurious compound, my son started to get angry again.


When the train started its journey on time, the son started screaming regularly. He was saying out loud, what a potato muscle driver he is. He has started running the train without our permission. I will tell Dad to put on his shoes.


It was difficult for me to explain to him that this is not his father's district, it is a free country. 


Even the Prime Minister and the King do not have the power to humiliate the people to satisfy their ego.



*P.S. Today it is clear that we have expelled the British. However, slavery could not be eradicated*.


*Even today, many deputy commissioners, SPs, ministers, advisers and politicians humiliate the people on the streets for hours just to satisfy their ego*. ‏

🙏🏻💐

పుల్లాపంతుల సోదరులు-*

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

*పుల్లాపంతుల సోదరులు-* 

ముక్కు తిమ్మనగారి తలనొప్పి

      (వింజమూరి వెంకట  

      అప్పారావుగారి పోస్టు)

                😡                          

           🌷🌷🌷

👉ఒకసారి నంది తిమ్మన గారికి విపరీతమైన తలనొప్పి పట్టుకుంది.

అది వచ్చినప్పుడు పిచ్చి పట్టినట్టుగా వుండేది (మైగ్రేన్)

రాయలవారు ఎంతో మంది వైద్యులకు చూపించారు ఎన్నో మందులు వాడారు.

అప్పటికి ఉపశమనమే తప్ప మళ్ళీ కొన్నాళ్ళకు వచ్చేది.

ఇలా కాదు కాశీకి వెళ్లి చూపించుకుంటాను, అని తన పరివారంతో సహా కాశీకి ప్రయాణం కట్టారు. అలా వెడుతూ వెడుతూ మధ్యలో 

శిరోభారం ఎక్కువైపోయి నెల్లూరి ప్రాంతానికి చెందిన దరిశి మండలములో 

వున్న 'బోదనంపాడు' అనే గ్రామ శివార్లలో డేరాలు వేసుకొని బస చేశారు.

తిమ్మన గారికి తలనొప్పి ఎక్కువై పోయి పెద్దగా మూలగా సాగారు. అది విని ఆదారిలో వెళుతున్న యిద్దరు వైద్య సోదరులు ఆ డేరా దగ్గరికి పోయి అక్కడ కాపలాగా వున్నవారిని మేము ఘన వైద్యులము, యిక్కడెవరో బాధతో మూలుగుతున్నారు, మేము లోపలి వెళ్లి చూస్తాము అన్నారు. మేము యిద్దరూ అన్నదమ్ములం. ఈ బోదనంపాడు గ్రామానికి చెందిన వాళ్ళం. మాపేర్లు పుల్లాపంతుల పుల్లన్న, సూరన్న. యిక్కడెవరో జబ్బు పడినట్టున్నారు, మూలుగులు బయటికి వినిపిస్తున్నాయి.

మేము వారికి వైద్యం చేస్తాము అన్నారు.

సరే ఆశీనులు కండి అని సైగ చేస్తూ నాకీ శిరోవేదన చాలా ఏళ్ళుగా వుంది. ఈ మధ్య మరీ ఎక్కువగా వుంది.

ఒక్కోసారి తల గోడకేసి బద్దలు కొట్టుకోవాలని పిస్తుంది. తలలో ఏదో తొలుస్తున్నట్టు బాధ, అన్నారు తిమ్మన.

మీరు సెలవిస్తే మేము మిమ్మల్ని పరీక్షిస్తాం. మాకున్న పరిజ్ఞానంతో, మా పూర్వీకుల ఆశీస్సులతో మీకు మంచి వైద్యం అందించ గలమని 

మా నమ్మకం. అన్నాడు పుల్లన్న. ఆయన వేదన సోదరులకు అర్థమైంది.

ఆర్యా! ఆ బాధ నిజంగా వర్ణనాతీతం. గజరాజు కుంభస్థలం లోకి పాము ప్రవేశించినప్పుడు ఆ గజం ఎంతగా విల విల లాడి పోతుందో, అది ఎన్ని కొండల్ని ఢీకొంటుందో, అందుకు వెయ్యి రెట్లు వుంటుందీ శిరోవేదన. భరించడం ఎవరికైనా కష్టమే.

ఒకసారి చెయ్యి యివ్వండి నాడి పరీక్షిస్తాం. అన్నాడు సూరన్న.

తిమ్మన చెయ్యి అందించారు. సూరన్న, అతి జాగ్రత్తగా నాడి పరీక్ష చేశాడు. విషయం పుల్లన్నకు వైద్య పరి భాషలో వివరించాడు. ఆ రోజునుంచీ వరుసగా మూడు రోజులు ఆ వైద్య సోదరులు తిమ్మన ముక్కులో చుక్కల పసరు పిండుతూ వచ్చారు. నాలుగో రోజు ఆ వైద్యానికి కావలిసిన 

పదార్థాలన్నీ ఒక జాబితా తయారు చేసి యిచ్చారు. అందులో విశేషంగా వైద్యానికి మాకు కావలిసిన వస్తువులేమీ లేవు. పుట్టెడు బియ్యం మాత్రం కావాలన్నారు.

"పుట్టెడు బియ్యమా? అంటూ వూరందరికీ సమారాధన చేస్తారా? ఏమి" అన్నాడు రాజవైద్యుడు వెటకారంగా.

కాదు అవసరం వుంది తెప్పించండి. అలాగే 20 మంది వంటవాళ్లు కూడా కావాలి అన్నారు వైద్య సోదరులు. "ఉప్పు,పప్పు కూరగాయలు కూడా తెప్పించండి. వండి వూళ్ళో పోలేరమ్మ జాతర జరిపించండి సరిపోతుంది దెప్పి పొడిచాడు" రాజవైద్యుడు. కాదు, కాదు 

మా వైద్యానికి ఇది చాలా అవసరం అన్నాడు పుల్లన్న.

ఏమి అవసరమో యేమో! మా తిమ్మన గారితో ముక్కు పట్టించి మూడు చెరువుల 

నీళ్ళు త్రాగిస్తున్నారు.

మరుదినం గాలి కూడా చొరరాని దట్టమైన బాగా ఎత్తైన గుడిసె నొక దానిని నిర్మించారు. బయట వంటవాళ్ళతో పుట్టెడు బియ్యం వండిస్తున్నారు.

అనదరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. తిమ్మనను గుడిసె లోకి పిలుచుకొని వెళ్ళారు, సోదరులు. మిమ్మల్ని ఈ గుడిసె లో తలక్రిందులుగా వేలాడ దియ్యాల్సి వుంటుంది అన్నారు. తిమ్మనకు దిక్కు తోచలేదు. భయపడకండి, ఇది వైద్య ప్రక్రియలో భాగమే, అన్నారు వైద్య సోదరులు సరే వైద్యానికి ఒప్పుకున్నాక తప్పుతుందా ఏదైతే అది అవుతుంది అని కానివ్వండి అన్నారు తిమ్మన. వెంటనే ఆయనకు లావు కంబళ్ళు శరీరమంతా చుట్టి తలకు ముక్కు మాత్రం బయటకు ఉండేలా ఒక దట్టమైన తొడుగు తగిలించి ఆ గుడిసెకు ఒక మూలగా ఆయన్ను తలక్రిందులుగా వేలాడ దీశారు.

ఒక్కో వంటవాడు అప్పుడే హండాలలో వండి వార్చిన అన్నాన్ని గుడిసె లో గుమ్మరించారు, వారి సహాయకులు. గుడిసె అంతా ఆవిరి సెగలతో నిండిపోయింది.

తిమ్మన శరీరం ముక్కు పుటాల ద్వారా వేడి వేడి అన్నపు ఆవిరి సెగలు 

నషాళానికి అంటాయి. రెండు క్షణాలలోనే ఆయన ముక్కు పుటాలనుంచి, రెండు విష క్రిములు గిజ గిజ లాడుతూ ఆ అన్నపు రాశి పై పడ్డాయి. వెంటనే స్మృతి తప్పిన ఆయన్ను క్రిందికి దించి బయటకు తీసుకొని వచ్చి శీతలోపచారాలు చేశారు.

క్రమంగా ఆయనను తెలివిలోకి తెచ్చారు. రెండు వారాల్లో పూర్తిగా కోలుకునేలా మంచి మందు లిచ్చారు.

క్రమేపీ కవిగారి శిరోభారం తగ్గి రోగం నయమైంది. ఈ శుభ సమాచారాన్ని రాయలవారికి 

అండ జేశారు. రాయలు ఎంతో సంతోషించి రాజసభకు ఆహ్వానించి తీసుకొని రావలిసిందని తిమ్మనకు కి కబురు పంపారు.

పుల్లాపంతుల వైద్య సోదరుల ఖ్యాతి అప్పటికే విజయనగరం పరిసర ప్రాంతాలకు పాకిపోయింది.

ఆ వైద్యులను దర్శించు కోవడానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చారు. కాసేపటికి కృష్ణదేవరాయల వారూ వచ్చారు.

వైద్యులిద్దరూ రాయలవారిని ప్రస్తుతించారు.

"శ్రీ వేంకటగిరి వల్లభ

సేవా పరతంత్ర హృదయ! చిన్నమదేవి 

జీవితనాయక! కవితా 

ప్రావీణ్య ఫణీశ కృష్ణ రాయ మహీశా!

ప్రభూ మేము వైద్యులమేగానీ కవులము కాదు. అందుకే ముక్కు తిమ్మన గారి 

పద్యాన్నే ఒప్పజెప్పాం. అందుకు మమ్మల్ని మన్నించండి. వంశ పారంపర్యంగా వస్తున్న వైద్య వృత్తినే సేవాధర్మంగా భావించి మా బోదనంపాడు లోనే నిర్వహిస్తున్నాం. మా గ్రామం తమరి ఏలుబడిలోని నెల్లూరు ప్రాంతానికి చెందిన దరిశి మండలంలో వుంది.

ఈ నాటికి ఆ గ్రామానికి ఖ్యాతి రావడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తూంది.

తిమ్మన గారంతటి వారికి వైద్యం చేసే మహద్భాగ్యం కలగడం మా పూర్వీకుల వల్ల మాకు లభించిన పుణ్య ఫలం. వారి ఆశీస్సులు మాకు సదా వుండగలవని విశ్వసిస్తూ మా వైద్య విద్య యిలాగే రాయలవారి అనుగ్రహం తో పదికాలాలపాటు శాశ్వత కీర్తి పొందాలని విన్నవించు కుంటున్నాము. అన్నారు,

పుల్లాపంతుల సోదరులు.

ప్రభువుల ఆజ్ఞతో తిమ్మన లేచి ప్రభూ శతాధిక వందనాలు.

"కాశ్యాన్తు మరణానురక్తి" అని నిశ్చయించుకొన్న నేను ఈ ఘన వైద్యుల చలువతో పునర్జన్మ ఎత్తాను వీళ్ళు నా పాలిట అశ్వినీ దేవతలే.

పర్వతము తేవలిసిన పని వుండేది కాదేమో. కుగ్రామం లో నిస్వార్థంగా 

వైద్యసేవల నందిస్తూ గ్రామములో వారినందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచుతున్న వీరి సేవకి ఎంత యిచ్చినా తక్కువే వీరి ఋణం ఎలా తీర్చుకోగలం?రాయలవారు వీరిని తమ ఆస్థాన వైద్యులుగా నియమిస్తే సాహిత్యం తో బాటు వైద్యశాస్త్రాన్ని కూడా పోషించి నట్లుంటుంది అని నా అభిప్రాయం. ఆ తర్వాత రాయలవారి చిత్తం అన్నారు.

కవీశ్వరుల సూచన ఆమోదదాయకమే మరి వారి సమ్మతం మాకు సంతోషదాయకం అన్నారు రాయలవారు. సభలో కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి.

"ప్రభూ! మీ ఆజ్ఞ శిరోధార్యమే కానీ మా వంశీకుల నియమానుసారం మేము స్వస్థలం లోనే వైద్యం చెయ్యాలి. మరో చోటుకు పోగూడదు. ధన సంపాదనకూ, స్వలాభాపేక్షకు లోనుకాకూడదు. మా గ్రామం వైద్యానికి పెట్టింది పేరుగా శాశ్వత కీర్తి ఆర్జించాలని మా పెద్దల ఆశయం. దీన్ని ప్రభువులు వేరుగా తలచరాదని ప్రార్థన" అన్నారా సోదరులు.

భేష్ ! మీ పూర్వీకుల ఆశయం మన్నింప దగిందే. వైద్యుడి కోసం రోగి అన్వేషించడమే ధర్మం. అప్పుడే వైద్యానికి విలువ. మీ గ్రామాన్ని వైద్య కేంద్రంగా పరిగణిస్తూ బోదనంపాడును ఓ అగ్రహారంగా మీకు దాన శాసనంతో వ్రాయించి ఇస్తున్నాం. సంతోషమే కదా! అన్నారు రాయలు గంభీరంగా. సభలో మరోసారి హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. తర్వాత వైద్య సోదరులను ఘనంగా సత్కరించారు, రాయలవారు. ఆశీర్వాద నవరత్న పద్యమాలికలతో ఆ సోదరులను మెప్పించి తన ఋణం తీర్చుకున్నారు తిమ్మన. ఆనాటి నుంచీ బోదనం పాడు అగ్రహారంలో పేరు నిల్పగల వైద్యులు 'మడుగుపట్టు చెలమ' అన్నట్టు ఖ్యాతి వహించారు.

అందుకే వేమన యిలా అన్నాడు.

మాటలాడ గల్గు మర్మము లెరిగిన 

పిన్న పెద్దతనము లెన్నవలదు 

పిన్నచేతి దివ్వె పెద్దగా వెలుగదా

విశ్వదాభిరామ వినురవేమ 

🤲

తక్కువవాడని ఎవరినీ హేళన చెయ్యరాదు. చిన్నవాడి చేతిలోని దీపముకూడా వెలుగు నిస్తుంది కదా! వేమన నోటినుండి ఈ ఆటవెలది రాక పూర్వమే ఈ నీతికి పట్టం గట్టే ఈ చారిత్రిక గాథకు తెలుగునేల వేదికైంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

చిట్టికథ

 ✍️...  చిట్టికథ


     

       నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భం గా...


కృష్ణాపురం లో భాగ్యరాజు,సోమరాజు మిత్రులు ఉండేవారు.


ఇద్దరూ కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు.


తిరుగు ప్రయాణంలో వారు ఒక అడవి మార్గాన వస్తూంటే వారికి ఒక గుట్ట మీద దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఒక యోగి కనిపిస్తాడు.


ఇద్దరూ వెళ్లిఆ యోగికి సాష్టాంగ దండ ప్రణామం చేశారు


.ఆ యోగి ఏ కళనున్నాడో ఆ ఇద్దరకు మేలు చేయదలిచాడు."భక్తులారా! ఈ గుట్టకు ఉత్తర దిక్కుగాఉన్న సరస్సులో స్నానం చేస్తే మీకు మీ కుటుంబానికి సిరిసంపదలు కలుగుతాయి.తూర్పుదిక్కుగా ఉన్న సరస్సులో స్నానం చేస్తే ఆరోగ్యం సమకూరుతుంది.


స్నానం చేసే ముందు రెండునియమాలు పాటిస్తామని మనసులో ప్రమాణంచేసుకోవాలి.


ఒకటో నియమం - ఒక సరస్సులోమాత్రమే స్నానం చేయాలి. దురాశతో రెండు సరస్సుల్లో స్నానం చేస్తే ఏ ఫలితమూ దక్కదు.


రెండో నియమం - ఇక్కడ నేనున్నానన్న విషయంఎవరితో చెప్పకూడదు. ఒకవేళ చెప్పేరా ఈ వర ఫలితం దక్కదు అని చెప్పి తపస్సులో మునిగిపోతాడు యోగి.


అనుకోకుండా వచ్చిన అదృష్టానికి ఇద్దరు మిత్రులు ఆనందించారు. 


అంతా భగవంతుని లీల అనుకుంటూ గుట్ట దిగారు.


 భాగ్యరాజు " ఐశ్వర్యం కలిగితే అన్నీ సమకూర్చుకోవచ్చు.

ఉత్తర దిక్కు నున్న సరస్సు లో మునుగుదాం రా"అని సోమరాజు తో అన్నాడు.


 సోమరాజు అప్పుడు " ఆరోగ్యమే మహాభాగ్యం.దానిని మించిన భాగ్యం లేదని నా విశ్వాసం. తూర్పు దిక్కుకే పోదాం రా" అంటాడు ఇద్దరూ ఒక మాటకు రాలేకపోయారు.


 భాగ్యరాజు ఉత్తర సరస్సులోను సోమరాజు తూర్పు సరస్సులోను స్నానం చేసి ఇంటికి బయలుదేరారు. 


నగరం చేరాక భాగ్యరాజు ఏ పని చేసినాఅదృష్టం వరించేది.వ్యాపారంలో లాభాలు వచ్చిపడుతున్నాయి.

అంతా యోగి మహిమని యోగికి మనస్సులో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.


ఇక సోమరాజు విషయానికి వస్తే ఎప్పుడూ మంచం పట్టి మూలుగుతూ వుండే అతడి భార్య ఆరోగ్యంతో కళ కళ లాడి కనిపించింది. పిల్లలు పుష్టిగ తయారయ్యారు. సోమరాజుకు అపుడపుడువచ్చే అనారోగ్యం మాయమయింది.


 వైద్యులువద్దకు వెళ్ళే అవసరం రాలేదు. సోమరాజు యోగిని కృతజ్ఞతతో తలచుకున్నాడు.


కొంత కాలంగడిచింది. 


ఒకరోజు అంగడిలో ఇద్దరు మిత్రులు కలుసుకున్నారు. భాగ్యరాజు దిగులుగా కనిపించాడు.


ఏమలా ఉన్నావని అడిగాడు సోమరాజు. అప్పుడు భాగ్యరాజు యోగి ఇచ్చిన వరం ఎంచుకోవడంలో నేను పొరబడ్డాను.ఆరోగ్యంలేనప్పుడు ధనమెంత ఉన్నా ప్రయోజనం లేదు.రెండు ముద్దలు తిని అరిగించు కోలేకపోతున్నాను.జిహ్వచాపల్యాన్ని బలవంతంగా అణచుకుంటున్నాను.ఇంట్లో ఎవరికో ఒకరికిఅనారోగ్యం ఉంటూనే ఉంది. సంపాదనంతావైద్యానికే సరిపోతుంది. సుఖశాంతులు లేవు.ఈ పరిస్థితుల్లో ఉత్సాహం ఎలా వుంటుంది మిత్రమా? " అని బాధపడ్డాడు.


 సోమరాజు నుపట్టుకుని ఏడ్చాడు. 


సోమరాజు అప్పుడు "సంతోషమే సగం బలం. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. దిగులు పడితే ప్రయోజనం లేదు."అని మిత్రుడిని ఓదార్చాడు.


🌷🧘🏻‍♀️🌷🧘🏻‍♀️🌷🧘🏻‍♀️🌷🧘🏻‍♀️🌷🧘🏻‍♀️


 *వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖం ।* 

 *ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనం ॥* 

వ్యాయామము వలన ఆరోగ్యము చేకూరును. దీర్ఘాయుష్షు, బలము, సుఖము కలుగును. ఆరోగ్యమే మహా భాగ్యం. స్వాస్థ్యము సర్వార్థాలకి సాధనము.


🌷🧘🏻‍♀️🌷🧘🏻‍♀️🌷🧘🏻‍♀️🌷🧘🏻‍♀️🌷🧘🏻‍♀️🌷

శ్రీరమణీయం* *-(137)*_

 _*శ్రీరమణీయం* *-(137)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"నా ప్రమేయం లేకుండా నా శరీరంలో జరిగే పనులకు కర్త ఎవరు ?"*_


_*అది తెలుసుకునేందుకే ఆత్మవిచారణ ! ఆధ్యాత్మిక సాధనలోని కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాలన్నీ ఆత్మవిచారణలో సమన్వయాన్ని పొందుతాయి. "యోగః కర్మసు కౌశలం" అనే ఉపదేశంలో 'కర్మలోని కౌశలమే యోగం' అనే అర్థం ఇమిడి ఉంది. కర్తవు నీవు కాదని గుర్తించటమే నిజమైన కౌశలం. అప్పుడే ఫలం కోసం ఎదురు చూడని పనులను మనం చేయగలుగుతాం. శరీరంతో చేసే పనులన్నీ మనవేనని భావిస్తూ కర్తృత్వాన్ని పెంచుకుంటాం. మన ప్రమేయం లేకుండా శరీరంలో జరిగే అనేక పనులకు మనం కర్తలం కాదు. ఆకలి, నిద్ర, శ్వాస, హృదయ స్పందన ఇవన్నీ మన ఆధీనంలో లేనప్పుడు శరీర క్రియలు మాత్రం మనవి ఎలా అవుతాయి ? ఇక్కడ కర్తృత్వమే అజ్ఞానంగా ఉంది. అంటే ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునే జ్ఞానం లేకుండా పోయింది అన్న మాట !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'ఆత్మవిచారణతో అన్ని మార్గాలు సమన్వయం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

Covid only in Nose

 *We trust when Tata's do it* Covid Three stages:


1. Covid only in Nose - recovery  time is half a day. (Steam inhaling), vitamin C. Usually no fever. Asymptomatic. 


2. Covid in Throat - sore Throat, recovery time 1 day (hot water gargle, warm water to drink, if having temp,  then Paracetamol. Vitamin C, Bcomplex. If severe then Antibiotics.


3. Covid in Lungs- coughing and breathlessness 4 to 5 days. (Vitamin C, B complex, hot water gargle, Oximeter, Paracetamol, Cylinder if severe, lot of liquid required, deep breathing exercise.


Stage when to approach hospital : 

Monitor the oxygen level. If it goes near 93 (normal 98-100) then you need oxygen cylinder. If available at home, then no hospital else admit.


*Stay healthy, Stay Safe!*


Tata Group has started good initiative, they are providing free Doctor's Consultation online through chats. This facility is started for you so that you need not to go out for doctors and you will be safe at home.


Below is the link, I request everyone to take benefit of this facility.


https://www.tatahealth.com/online-Doctor- consultation/general-physician


+91 74069 28123: 


Advice from inside isolation hospitals, we can do at home

Medicines that are taken in isolation hospitals


1. Vitamin C-1000


2. Vitamin E


3. sitting in the sunshine for 15-20 minutes.


4. Egg meal once ..


5. take a rest / sleep a minimum of 7-8 hours


6. drink 1.5 liters of warm water daily


7. All meals should be warm (not cold).


And that's all we do in the hospital to strengthen the immune system


Note that the pH of Corona Virus varies from 5.5 to 8.5


Therefore, all we have to do to eliminate the Virus is to consume more Alkaline foods above the acidity level of the virus.


Such as :


Bananas 

Green lemon - 9.9 pH

Yellow Lemon - 8.2 pH

Avocado - 15.6 pH

* Garlic - 13.2 pH

* Mango - 8.7 pH

* Tangerine - 8.5 pH

* Pineapple - 12.7 pH

* Watercress - 22.7 pH

* Oranges - 9.2 pH


How to know that you are infected with Corona Virus?


1. Itchy Throat

2. Dry Throat

3. Dry cough

4. High temperature

5. Shortness of breath

6. Loss of smell ....


And Lemon with warm water eliminates the virus in the beginning itself, before reaching the Lungs ...


Do not keep this information to yourself. Provide it to all.