30, మే 2023, మంగళవారం

పద్యపరిమళము

 🪷🌸🌸🪷🕉️🪷🌸🌸🪷

            *పద్యపరిమళము*


కం.

పద్యపరిమళము లెగయగ 

హృద్యంబుగ వ్రాయవలయు నింపును గొలుపన్ 

పద్యంబుల; గద్యములకు 

పద్యంబుల సొబగు రాదు పాటును బడినన్ 


కం.

పద్యమ్మున గమకమ్ములు 

వేద్యమ్మగు ప్రాస వళులు విందులు గూర్పన్ 

సద్యస్స్ఫూర్తిన్ మెఱసెడి 

హృద్యాలంకారరాజి యింపును నింపున్ 


కం.

అందుకె కావలె పద్యము 

బందీలను జేసి జనులు బానిసలగుచున్ 

విందుల రసముల జుఱ్ఱుచు 

పొందిక నానంద మొంద మ్రోలక దెచ్చున్ 

*~శ్రీశర్మద* 

+91 8333844664

చమత్కారముగా



❤ వ్యాకరణంలో సంబాషణ!

.

*ఈ కథ చాలా పాతకాలందిలెండి.!

ఒక పండితుడు ఇంకో పండితుడి గ్రామానికి బస్సు లో వస్తున్నానని కబురు చేశాడు.తన ఇంటికి వస్తున్నఆ పండితుడిని ఆహ్వానించడానికి ఈయన బండి కట్టుకొని ఆ బస్సు వచ్చే చోటికి వెళ్తాడు.అది గ్రామానికి 3,4 మైళ్ళ దూరంలో వుంది..వెళ్లి ఆ పండితుడిని సాదరంగా ఆహ్వానించి బండి లో కూర్చో బెట్టి బయల్దేరాడు . 

త్రోవ బాగా లేకపోవడం వల్ల బండి కుదుపులతో నడుస్తూ వుంది.కుదుపులు ఎక్కువవడం తో . 

పోరుగూరినుంచి వచ్చిన శాస్త్రి గారు 'అబ్బబ్బ 

వెధవ బండి' అన్నాడు. 

దానికి ఆ బండి యజమాని శాస్త్రి గారూ 

మీరంటున్నది షష్టీ తత్పురుష మా లేక కర్మధారయమా?

అన్నాడు నవ్వుతూ 

షష్టీ తత్పురుషము అంటే వెధవ యొక్క బండిఅనే అర్థము వస్తుంది 

కర్మధారయ మైతే 'వెధవ యైన బండి' అని అర్థము వస్తుంది.

(బండి యొక్క యజమాని వెధవనా?బండి వెధవదా?) 

ఆ శాస్త్రి గారు నవ్వుతూ యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి. 

(అంటే వెధవ కొరకు యిలాంటి బండి) అన్నాడు.

యిద్దరూ హాయిగా నవ్వుకున్నారు.. ఆ కాలం పండితులు అలాంటి చెణుకులు విసురుకునేవారు.

....

ఒక శిష్యుడు గురువుగారి దగర విద్య నభ్యసించి,పెళ్ళిచేసుకొని ఊరిబయట ఇల్లు కట్టుకొని స్థిరపడినాడు.

ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద ఆ దారిలో వెడుతూ శిష్యుడి యింటికి వచ్చినారు.శిష్యుడు అతడి భార్య 

ఆయనకు చక్కని ఆతిథ్య మిచ్చి పంచల చాపు యిచ్చి కాళ్ళకు నమస్కారము చేసినారు.అప్పుడు గురువు 

ఒక శార్దూల వృత్తము(పద్యము) లోమధ్యలో ఒక వేదమంత్రము వచ్చేట్టుగా చెప్పి ఆశీర్వదించారు.

అప్పుడు శిష్యుడు నవ్వుతూ గురువుగారూ! మా ఆతిథ్యము స్వీకరించి మా యింట శార్దూలమును(పులిని) విడిచి 

వెళ్ళుట మీకు న్యాయమేనా?అన్నాడు. గురువు గారు నవ్వుతూ ఆ శార్దూలమును మంత్రించి వదిలానులే 

నీకు యేమీ అపకారము చెయ్యదు.పైగా నీవు ఊరిబయట ఇల్లు కట్టుకున్నావు.పంచమీ తత్పురుషము

లేకుండా ఈ షష్టీ తత్పురుషము కాపలా పెట్టాను..అన్నారు.

పంచమీ తత్పురుషము నకు అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగ వలన భయము' షష్టీ తత్పురుషము నకు 

ఉదాహరణ 'కుక్క యొక్క కాపలా' ఈ గురువుగారు దొంగ వలన భయము లేకుండా శార్దూలము యొక్క కాపలా పెట్టారు. 

ఇప్పటి లాగా అప్పటి వాళ్ళు గుమ్మం దగ్గరనుండే టాటా బై బై చెప్పేవారు కాదు.గురువుగారిని బండీలో ఎక్కించి మీరు మళ్ళీ మా యింటికి దయచేయ్యాలి అన్నాడు శిష్యుడు. 

అందుకు గురువు గారు నవ్వుతూ 

నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే అన్నాడట.ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ 

'భార్యా భర్తలు' 'తల్లిదండ్రులు'యిస్తారు మామూలుగా.ద్వంద్వా తీతుడంటే 

మీ భార్యాభర్తలు తల్లిదండ్రులైనప్పుడు అంటే మీకు సంతానము కలిగినప్పుడు మళ్ళీ వస్తాను.అని అర్థము.పూర్వము అంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.


*సేకరణ* 👆

దశపాపహరదశమి

 నేడు జ్యేష్టశుద్ధ దశమి

                        దశపాపహరదశమి


  దశమి తిధితో సంబంధపడి మనకు రెండు పెద్ద పండగలు కనిపిస్తున్నాయి.

  ఒకటి జ్యేష్తశుద్ధ దశమి, రెండు ఆశ్వీయుజ శుద్ధ దశమి, మొదటిది దశపాపహరదశమి.  రెండవది విజయదశమి.  రెండూ కూడ పది రోజులు పర్యాస్తమయ్యే పాడ్యమి తిదులతో ప్రారంబమై దశమితిధితో ముగిసే పర్వాలు.

    దశపాపహర దశమి అనగా పది పాపాలను పోగొట్టే దశమి అని అర్ధము.  పది పాపాలను పోగొట్టడానికి సమర్ధమైన ఈ వ్రతము జ్యేష్ట శుక్ల పాడ్యమి నుండి దశమి వరకు చేస్తారు.

    ఈ పాడ్యమి నాటి వివరాలలో మన పంచాంగములో 'దశహరాదశాశ్వమేధేస్నానం, ఇత ఆతభ్య్హదశమీపర్యంతమి ' అని ఉంటుంది.

    ఈనాడు ఏనదిలో చేసినా స్నానం విశేషఫలప్రదమైనది.  అందులో గంగానదిలో చేస్తే గొప్ప విశేషం. అందులో కాశీలోని దశాశ్వమేధఘట్టంలో గంగా స్నానం మరీ విశేషం.

దేవతలు - వారి వాహనములు*

 *కొందరు దేవతలు - వారి వాహనములు*


1) విష్ణువు –గరుడుడు

2) లక్ష్మీదేవి –గుడ్ల గూబ

3) రతి మన్మదులు=కీరం(చిలుక)

4) హనుమంతుడు=ఒంటే

5) శివుడు =వృషభం

6) పార్వతి దేవి=సింహం

7) వినాయకుడు=మూషికం

8) కుమారస్వామి=నెమలి

9) బైరవుడు=శునకం

10) బ్రహ్మ=హంస

11) సరస్వతి=హంస

12) అశ్వినినులు=కంచర గాడిదలు

13) రావణుడు=గాడిదలు.

14) లలితాదేవి=వరాహం (కిరిచక్ర రధారూఢ)

15) శీతలా దేవి=గాడిద

16) గంగాదేవి=మకరం

17) యమునాదేవి=కూర్మం

18) అయ్యపస్వామి=పులి

19) కాలునుకి=మహిషం

20) నముచి=ఉచ్చైశ్రవము

21) అలమేలుమంగ అమ్మవారు=చాతకం

22) వాస్తుపురుషుడు=గండభేరుండం

23) కల్కి=గుఱ్ఱం

24) చండి=వరాహం

25) చాముండి=గుడ్లగూబ

26) విశ్వకర్మ=నక్క 

27) మానసా దేవి=సర్పం

28) ఇంద్రుడు=ఐరావతం

29) అగ్ని=మేషం/గొర్రె 

30) యముడికి=మహిషం

31) నైరుతి=శవ వాహనం

32) వరుణుడు=మకరం

33) వాయువు=కృష్ణ మృగం

34) కుబేరుడు=నర వాహనం

35) ఈశానుడు=వృషభం

36) సూర్యుడు=సప్త అనే పేరు గల అశ్వం

37) చంద్రుడు=జింక/10 శ్వేత అశ్వములు 

38) కుజుడు=మేషం

39) బుధుడు=గుఱ్ఱం

40) గురుడు=ఏనుగు

41) శుక్రుడు=గుఱ్ఱం / మకరం

42) శని=కాకి

43) రాహువు=పులి

44) కేతువు=చేప

పలుసార్లు కాదు.


          _*సుభాషితమ్*_


శ్లో𝕝𝕝 

*సకృజ్జల్పన్తి రాజానః*

*సకృజ్జల్పన్తి పండితాః॥*

*సకృత్కన్యాః ప్రదీయన్తే*

*త్రీణ్యేతాని సకృత్సకృత్‌॥*


తా𝕝𝕝 

రాజు లొక్కసారే ఆజ్ఞాపింతురు..... 

పండితు లొక్కసారే చెప్పుదురు.... 

కన్యాదాన మొక్కసారే చేయబడును.....

ఈ మూడు నొక్కక్కసారే చేయబడును. పలుసార్లు కాదు.


: 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*న వైరముద్దీపయతి ప్రశాంతం*

*న దర్పమారోహతి నాస్తమేతి॥*

*న దుర్గతోsస్మీతి కరోత్యకార్యం*

*తమార్యశీలం పరమాహురార్యాః॥*

                    ~భార. ఉద్యో.33-117.


తా𝕝𝕝 

వైరమను అగ్నిని ప్రకోపింపజేయక శాంతముగా నుండువాడును, గర్వము (దురభిమానము) లేనివాడును, హీనత్వమును కనబరచనివాడు, నేను ఆపదలో చిక్కుకొంటినని నీచకార్యములు చేయనివాడును, ఇట్టి శ్రేష్ఠగుణములు గలవానిని ఆర్యుడందురు.

తొలితరం కవులు

 శుభోదయం🙏

            చొప్పకట్ల.


అ ధి క్షే పం !

   తొలితరం కవులు విమర్శకులు అధిక్షేపణల్లో కూడా హుందాతనం పాటించేవారు.

      జలసూత్రం రుక్మణీనాధశాస్త్రిగారు.(జరుక్ శాస్త్రి.) విశ్వనాధకవిత్వాన్నెత్తిపొడుస్తూ,పైపద్యాన్ని ప్రవచించారట!

        చివరి సంబోధన "పాషాణపాకప్రభూ!"-చదువుకున్నవిశ్వనాధ ఫక్కున నవ్వుకున్నారట!

         చిత్తగించండాపద్యం.విశ్వనాధకవితకు తగినజోడీ!


కించిత్తిక్త కషాయ షాడబరసక్షేపాతిరేకాతి వా

క్సంచార ప్రచయావకాశములలో కవ్యుద్ఘ

గండాశ్మముల్

చంచల్లీల నుదాత్తవాగ్గరిమతో సాధించి వేధించుమా!

పంచారించి ప్రవహ్లికాకృతి కృతిన్ పాషాణపాకప్రభూ!!

                      -జరుక్ శాస్త్రి.


        కవితాశైలులను ఆలంకారికులు,

1ద్రాక్షాపాకం.

 2కదళీపాకం.

  3నారికేళపాకం.

అనిమూడురీతులుపేర్కొన్నారు.

          శిలాపాకం!వాటన్నిటినీ మించిందింది.యెమతప్రయత్నించినా అర్ధమవ్వదనిసారాశం!

        చూశారా?కవులు ఒకరినొకరెంతచక్కగా తిట్టుకుంటారో??


👆మరో సమూహములో అవధాని మిత్రులు శ్రీ రాయపెద్ది వారు పంచుకొన్నది..🙏🙏🙏

వారిసౌజన్యంతో-

అమ్మ అనెడి పిలుపు

 175వ రోజు: (జయ వారము) 30-05-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


అమ్మ అనెడి పిలుపు అమృతము వలెనుండు 

నాన్న యనెడి పిలుపు వెన్న సమము 

అమ్మ నాన్న పిలుపు లాప్యాయతల్ పెంచు 

తెలిసి మెలగ మేలు తెలుగు బాల


అమ్మ అనే పిలుపు అమృత సమానము. భగవంతుడు దేవతలకు అమృతమును ఇచ్చి మానవులకు అమ్మ పిలుపును ప్రసాదముగా ఇచ్చెను. నాన్న అనే పిలుపు వెన్నతో సమానము. అమ్మ నాన్న పిలుపులు ప్రేమ ఆప్యాతలను వృద్ది (పెంపొందించును) చేయును. 

 

ఈ రోజు పదము. 

ఏనుగు తొండము (Trunk): కరము, కేలు, నాగవాస, శుండము, హస్తము. 

ఏనుగు కుంభస్థలము: కింకిరము, కుండలు.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 75*

 .    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 75*


ఆనాడు రాక్షసమాత్యునికి అన్నీ దుశ్శకునములే ఎదురయ్యాయి. నందులతో సత్సంబంధాలు తగ్గిపోయి చాలా కాలమైంది. ఇప్పుడు నందులకు బౌద్ధక్షిపణకుడు జీవసిద్ధి అత్యంత సన్నిహితుడైనాడు. అతని మాట నందులకు వేదవాక్కు. 


నందులు ఇప్పుడు రాక్షసుని మాటలకు విలువ ఇవ్వడం మానేశారు. "యధారాజా తథా ప్రజా" అన్నట్లు భలభద్ర, బాగురాయణాది ప్రముఖ రాజోద్యోగులు కూడా ఇప్పుడు రాక్షసునికి తగిన గౌరవం ఇవ్వడం లేదు. ఇంకొకవైపు పాటలీపుత్రంలో నంద వ్యతిరేకత తీవ్రాతి తీవ్రమైంది. రాజగురువు సుబంధుడు వూరూవాడా తిరుగుతూ నందుల దురాగతాలను యండగడుతూ త్వరలో చంద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్టించి ప్రజల కష్టాలను తీర్చగలడంటూ ప్రచారాన్ని చేయసాగాడు. బ్రాహ్మణాది వర్ణాలన్నీ సుబంధుడికి బాసటగా నిలవడం చేత అతనికే హాని తలపెట్టినా ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వస్తుందన్న భయంతో సుబంధుడిని శిక్షించడానికి వెనకాడాడు రాక్షసుడు. 


ఇక చారుల వలన తెలుస్తున్న వార్తలు రాక్షసునికి మనశ్శాంతిని దూరం చేశాయి. చంద్రగుప్తునితో పాంచాల, సింహపుర దేశాధీశులు బాంధవ్యం కలుపుకుని తమ రాజ్యాలను అతనికి కట్టబెట్టారనీ, పర్వతక, కళింగ, ఆంధ్రరాజుల సహాయ సహకారాలతో చంద్రుడు మగధపై యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నాడనీ, వారందరు కలిసికట్టుగా ఏ రోజైనా మగధపై దండెత్తి రావచ్చుననీ... వార్తలు మీద వార్తలు వస్తున్నాయి. 


ఆ వార్త విశేషాలన్నింటినీ, తన భయాలు సలహాలతో జోడించి రాక్షసుడు ఒకనాడు నందులకు తెలియపరచాడు. నందుల చెంతనే ఉన్న జీవసిద్ధి నవ్వి "మహాబలోపేతమైన మగధ పైకి దండయాత్రా ... ? ఆ వృషలుడికి అంత ధైర్యమా ? మా సుకల్పనందుడు ఒక్కసారి కన్నెత్తి చూస్తే ఆ కంటి మంటల జ్వాలకి శత్రుసైన్యాలన్నీ మాడి మసైపోవూ...?" అన్నాడు. 


రాక్షసుడికి ఒళ్ళు మండి "మంత్రాలకు చింతకాయలు రాలవు మహానుభావా... మనం కూడా యుద్ధ ప్రయత్నాలు చేసుకోవాలి. వాళ్ళు ఏ నిమిషాన్నాయినా యుద్ధానికి రావచ్చు" అన్నాడు వుక్రోషంగా. 


"రానివ్వండి చూద్దాం... ఇప్పటినుంచే యుద్ధ ప్రయత్నాలు ఏమిటి ? డబ్బు దండగ" అన్నాడు జీవసిద్ధి నిర్లక్ష్యంగా. నందులు అతన్ని సమర్ధించడంతో విధిలేక వెనక్కి తగ్గాడు రాక్షసుడు. 


ఈనాడు .... రాక్షసుని భయాలన్నీ నిజమయ్యాయి. ప్రాతఃకాలన్నే మేల్కొన్న అమాత్యునికి వరసగా అన్నీ దుశ్శకునాలే తారసిల్లాయి. 'వాటి పర్యావసానం ఏమవుతుందా ?' అని ఆలోచిస్తుండగానే ప్రతీహారి ఒకడు రాక్షసుని దర్శనం చేసుకొని "జయము, జయము అమాత్యులవారికి... నందప్రభువులు మంత్రాంగ మందిరంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమరిని తక్షణం రావాల్సిందిగా కోరుతున్నారు" అని మనవి చేశాడు. 


రాక్షసుడు సాలోచనగా తల పంకించి "సమావేశ విశేషాలు ఏమిటో తెలిపారా ?" అని అడిగాడు. 


ప్రతీహారి తలతిప్పి "లేదు..." అని చెప్పి ఓసారి అటూ ఇటూ చూసి "చంద్రగుప్త మౌర్యులవారి వద్ద నుండి యుద్ధసందేశం వచ్చినట్లు మంత్రులు గుస గుస లాడుకుంటున్నారు" అని చెప్పాడు తగ్గు స్వరంతో. 


రాక్షసుడు అదిరిపడ్డాడు. 


'అనుకున్నంతా అయ్యింది' అనుకుంటూ అతడు తక్షణమే రాజభావనానికి బయలుదేరాడు. మంత్రాంగం మందిరంలో వడివడిగా ప్రవేశించి అక్కడి సన్నివేశాన్ని చూసి నిర్విణుడయ్యాడు.

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వాల్మీకి రామాయణం

 *వాల్మీకి రామాయణంలో లేని కల్లబొల్లి అసత్యపు అంశాలను మన వాళ్లు అనేకం పుట్టించారు. అందులో‌కొన్ని ఇక్కడ ఇస్తున్నాను.*


🌹రావణుడు మరణించే లోగా అతని వద్ద రాజనీతి పాఠాలను నేర్చుకుని రమ్మని లక్ష్మణుని రాముడు పంపాడు అన్నది కూడా ఒక అబద్ధపు సృష్టి.


🌹గుహుడు రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి అని పాటలు పాడి మరీ రాముడి కాళ్లు కడిగినట్లు రామాయణంలో కనిపించదు.


🌹సీతా స్వయంవరానికి రావణాసురుడు రావడం శివ ధనుస్సు పైన వేసుకుని అవమానం పాలు కావడం రామాయణంలో లేదు.


🌹లక్ష్మణ రేఖ రామాయణంలో కనిపించదు.


🌹అహల్యను గౌతముడు శిలగా మారమని శపించినట్లు రామాయణంలో లేదు. నిరాహారి భస్మ శాయి అదృశ్య రూపిగా పడి ఉండమని, ఆశ్రమానికి రాముడి రాక  ఆమెను పాప విముక్తురాలిని చేస్తుందని చెప్పినట్టు మాత్రమే  ఉన్నది. అది ఆమెకు ప్రాయశ్చిత్తమే గాని శాపం కాదు.


🌹సీత నిలబడి ఉన్న భూమిని పెళ్లగించి ఆ భూమి గడ్డతో సహా సీతను తీసుకుపోయినట్టు రామాయణంలో లేదు


🌹శబరి రాముడికి ఎంగిలి పండ్లు తినిపించినట్టు రామాయణంలో లేదు.


🌹రావణాసురుడి గర్భంలో అమృత కలశం ఉన్నట్లు, దానిని కాల్చి వేయడానికి రావణుడి నాభి భాగంలో బాణం వేయమని విభీషణుడు సూచించగా రాముడు అది ధనుర్విద్యా ధర్మానికి, నీతికి వ్యతిరేకమని చెప్పినట్లు, హనుమంతుడు తన తండ్రి వాయుదేవుడిని ప్రార్థించి రామబాణాన్ని కొద్దిగా కిందికి వంచి నాభిలో గుచ్చుకునేటట్లు చేశాడు అన్నది కూడా ఒక అబద్ధపు సృష్టి.


ఇలా తమ కల్పనా చాతుర్యం కొద్ది అనేకమంది రచయితలు అనేక కల్పితాలను పుట్టించి ఇవి వాస్తవాలే అని మనతో భ్రమింప చేశారు.

సత్యం తెలుసుకోవాలంటే దయచేసి తెలుగు అనువాదంతో సహా వాల్మీకి రామాయణం గోరఖ్పూర్ ప్రింటింగ్ ప్రెస్ వారి గీతా ప్రెస్ లో లభిస్తున్నది, చదవండి చదివి ఆ తరువాత అనుమానాలను అడగండి. అంతేగాని మూలంలో ఏముందో తెలియకుండా ఎవరు ఏది చెబితే అది దాన్ని గుడ్డిగా నమ్మేయడం ధర్మం కాదు.

భజగోవిందం

 ॐ                 भज गोविन्दं

                    భజగోవిందం 

                 (మోహముద్గరః) 

            BHAJA GOVNDAM   

 

      (श्रीमच्छंकरभगवतः कृतौ 

       శ్రీమచ్ఛంకరభగవత్పాద కృతం 

           BY SRI ADI SANKARA)


                           శ్లోకం : 7/31

                   SLOKAM : 7/31

                    

बालस्तावत् क्रीडासक्तः,

तरुणस्तावत् तरुणीसक्तः।

वृद्धस्तावच्चिन्तासक्तः,

परमे ब्रह्मणि कोऽपि न सक्तः॥७॥ 

                    ॥भज गोविन्दं॥ 


బాలాస్తావతీ క్రీడాసక్తః 

తరుణస్తావత్తరుణీసక్తః |

వృద్ధస్తావాచ్చింతాసక్తః

పరమే బ్రహ్మణి కోఽపి న సక్తః ||7|| 

                    ॥భజ గోవిందం॥ 


మానవుడు

  - బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు, 

  - యౌవనం లో స్త్రీల  పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, 

  - వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. 

    కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తిని చూపే వారెవరూ లేరు కదా!!! 


అనువాదం 


ఆట పాటలందు బాల్య  

                 మలవోక గడచు 

భామ తళుకులం దొరుగును 

          యవ్వనము తృటిన 

తీరని కోర్కెల చింత చివరి 

                   ఘడియ జేర్చు 

మిగులదో క్షణమును నిను 

             నీవు దెలిసి కొనగ. 


    बचपन में खेल में रूचि होती है I 

    युवावस्था में युवा स्त्री के प्रति आकर्षण होता है I 

    वृद्धावस्था में चिंताओं से घिरे रहते हैं I 

    पर प्रभु से कोई प्रेम नहीं करता है॥७॥


    In childhood we are attached to sports, 

    in youth, we are attached to woman. 

    Old age goes in worrying over every thing. 

    But there is no one who wants to be engrossed in Govind, the parabrahman at any stage. 


https://youtu.be/ImWKhB_PMiw 


                          కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

            భద్రాచలం