7, మే 2026, గురువారం

కల్తీCB

 మనం తినే మామిడి పండ్లు నూటికి 90 శాతం కార్బెట్ తో పండించినవే అందులో అనుమానమే లేదు


 మనం తినే ఆహారంలో నిత్యం అనేక రకాలైన రసాయనాల కల్తీలతో ఉన్నవే అందుకే మనకు చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఇతర సమస్యలు వస్తున్నాయి 


ముఖ్యంగా మనం వాడే వంట నూనెలు చాలా మటుకు కల్తీ నూనెలే 


మీరు ఒక్క విషయం ఆలోచించండి ఒక కిలో పల్లీలు రెండు వందల రూపాయలు ఉంటే ఒక లీటరు పల్లీ నూనె 150 ,170 రూపాయలకు ఎలా ఇవ్వగలుగుతారు.అంటే అవి నిజంగా స్వచ్ఛమైన నూనెలు కావని వాళ్ళు ఒప్పుకున్నట్లేనా కాదా


 ఒక కిలో పల్లీలను నూనెగా తీస్తే ఒక పావు కిలో నూనె మాత్రమే వస్తుంది అంటే స్వచ్ఛమైన పల్లీలతోటి కిలో నూనె తీయాలంటే నాలుగైదు కిలోల పల్లీల అవసరపడతాయి.


అట్లా చేస్తే మీకు కిలో నూనె ఎనిమిది వందల రూపాయలకి తక్కువకి దొరకదు.


అదే విధంగా ఇతర నునెలలో కూడా  చాలా కల్తీలు ఉన్నాయి అని అంటున్నారు.


ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే మనం వాడే పాలలో యూరియా వంటి కెమికల్స్ తోటి తయారు చేస్తున్నారట.అది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి.


ఇది ఇట్లా ఉంటే నేను మాకు దగ్గరలో ఉన్న పశువుల షెడ్డు నుంచి అప్పుడే తీసిన పాలను తెచ్చుకుంటున్నాను అందులో ఎటువంటి కల్తీ లేదని కూడా మనం అనటానికి వీల్లేదు.


ఎందుకంటే గేదెలకు పాలు రావటానికి ఇంజక్షన్లు చేస్తున్నారు అలానే డ్రైనేజీ నీళ్లలో పెంచిన గడ్డి తినిపిస్తున్నారు.


దానివల్ల ఆ గేదల నుంచి వచ్చే పాలు పూర్తిగా కలిసికతమై ఉంటున్నాయి.


ఇంకా బియ్యానికి వస్తే మనం తినే బియ్యం స్టీమ్డ్ రైస్, హెచ్ఎంటి  బియ్యం లను పాత బియ్యంగా విక్రయిస్తున్నారు.


ఆ బియ్యమును పాలిష్ చేసి దాని మీద పూర్తిగా తౌడును తొలగించి తెల్లగా నిగలాడేరట్టు చేయటం వలన బియ్యంలోని పోషక విలువలు పూర్తిగా పోయి కేవలం పిప్పి మాత్రమే మిగులుతున్నది.


మనలో చాలామందికి బి కాంప్లెక్స్ లోపము ఏర్పడటానికి కారణం ఇదే.


మనం తినే ఆహారంలో సరైన విటమిన్లు, ప్రోటీన్లు విలువైన ఆహారపు విలువలు లేని కేవలం పిప్పిని మాత్రమే భుజిస్తున్నాము.


ఇక వాతావరణం విషయానికొస్తే మనం రోజు అనేక రకాల రేడియేషన్స్ కి గురి అవుతున్నాము.


కొన్ని మన ఇంట్లో మనమే సృష్టించుకుంటున్నాము.


ముందుగా బయట రేడియేషన్స్ తేల్చుకుందాం.


మన చుట్టూ అనేక మైక్రోవేవ్ రేడియేషన్లు సెల్ఫోన్ టవర్ల నుండి వెలువడుతున్నాయి.



ఇక రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఉండనే ఉన్నది.


మన ఇంట్లో మనం వైఫై ఏర్పాటు చేసుకొని ఆ రేడియేషన్కు కూడా గురి అవుతున్నాము.


ఇది చాలదు అన్నట్లు మనము బ్లూటూత్ పరికరాలను ఉపయోగించి బ్లూటూత్ రేడియేషన్ కూడా కొని తెచ్చుకుంటున్నాము.


ఈ రకమైన రేడియేషన్లు మన శరీరంలో ఉన్న నరాల మీద ప్రభావితం చూపెడతాయి ఇంకా మన రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ మీద కూడా చూపెడతాయి.


సెల్ఫోన్ టవర్లకి దగ్గరగా ఉన్న మానవులకి మైక్రోవేవ్ రేడియేషన్ వల్ల మెదడు లోపల అనేక చెడు లక్షణాలు కనబడుతున్నాయి.


మొదలుగా తలనొప్పి వస్తుంది తర్వాత నరాలకు సంబంధించిన అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది.


ఇక మనంతట మనమే కొని చేర్చుకున్న అలవాట్ల వల్ల కలిగే దుష్ప్రభావాలను ఒకసారి చూద్దాం.


మనం రోజు ఎక్కువ సమయం సెల్ ఫోను లాప్టాప్ టీవీ చూడటం లో గడుపుతున్నాము.


దానివల్ల అల్ట్రా వైలెట్ రేడియేషన్ కి ఇంకా ఎక్కువ ప్రకాశమైనా వెలుతురుని చూడటం వల్ల అది మన కంటిలోని రెటీనా మీద ప్రభావం చూపెట్టి కను గుడ్లు ఆరోగ్యాన్ని కోల్పోతున్నాయి.


చిన్న వయసులోనే పిల్లలకి కళ్ళజోళ్ళు రావడం మనం గమనిస్తున్నాము.


ఇంకా సెల్ ఫోనులో మన యొక్క పూర్తి ఏకాగ్రత ఉంచి వీడియోలు చూడటం వలన అవి మెదడు మీద ప్రభావం చూపుతున్నాయి.


ఇటువంటివి అనారోగ్య సమస్యలు ప్రతి వాళ్ళకి వస్తున్నాయి.


ఇట్లా ఉంటే వాహనాల  పొగ వలన వాతావరణంలో ఆక్సిజన్ శాతం రోజురోజుకీ తగ్గుతున్నది.


ఆక్సిజన్ని ఉత్పత్తి చేసే వృక్షాలను మానవులు కొట్టివేసి ఆ స్థలాలలో అనేక మల్టీస్టోరీడ్ బిల్డింగులు కట్టడం వలన ఆక్సిజన్ తక్కువ అవుతున్నది.


అందువలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతున్నది.


ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు మనుషులు పూర్తిగా అనారోగ్య పరిస్థితులలో ఉన్నారు అన్నది సత్యం.


ఇక శారీరిక దృఢత్వానికి వస్తే పూర్వకాలంలో ఆడవారు కానీ మగవారు కానీ బావిలో చేత వేసి నీళ్లు చేదుకునేవాళ్లు దానివల్ల వాళ్లకి చక్కటి వ్యాయామం అయ్యేది.


అప్పుడే పెతికిన పాలు తాగేవాళ్లు దంచిన బియ్యం తినేవాళ్లు దానివల్ల పూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి ఆహారము ఆరోగ్యకరమైనటువంటి అంటే వ్యాయామ కరమైనటువంటి అలవాట్లు ఉండేవి.


ఇప్పుడు ప్రతిదీ యాంత్రికం కావడం వలన శారీరిక శ్రమ పూర్తిగా తగ్గింది వంట ఇంట్లో ఆడవారు పిండి రుబటం లేదు.


మిక్సీలో పడుతున్నారు కట్టెలపై  పొయ్యి వెలిగించటం లేదు గ్యాస్ స్టవ్ మీద వండుతున్నారు.


కూర్చొని వండటం వల్ల చక్కగా ఆ వంట కుదురుగా ఉండి రుచికరంగా ఉండేది.


ఇప్పుడు వండటం నిల్చమని తినటం కుర్చీలో కూర్చొని.


ఇటువంటి అలవాట్ల వల్ల మనం తినే ఆహారం శరీరానికి సరిగా పట్టటం లేదు.


దానివలన అనేకమైన అనారోగ్యాలు వస్తున్నాయి ఇకపోతే శారీరకంగా ఏమాత్రం అలసట చెందకుండా తినంగానే వెంటనే పడుకోవటం వలన కడుపు ఉబ్బి లావుగా తయారవుతున్నారు.


ఆహారం సరిగా అరగటం లేదు  దానివల్ల అనేకమైన రుగ్మతలు వస్తున్నాయి.


ఇట్లా చెప్పుకుంటూ పోతే పుస్తకాలు పుస్తకాలు రాయవచ్చు.


ఒక్క మాటలో చెప్పాలంటే మనము పూర్తిగా అనారోగ్యకరమైన వాతావరణంలో ఉంటున్నాం తింటున్నాం  పడుకుంటున్నాము.


ఇది సత్యము సత్యము సత్యము ముమ్మాటికీ

కామెంట్‌లు లేవు: