7, మే 2026, గురువారం

పంచాంగము 🌓 07.05.2026

 🕉️


పంచాంగము 🌓 07.05.2026


🪔 శ్రీ రమాత్రివిక్రమాయనమః‌ 🪔


అష్టావింశతి మహాయుగే 


కలియుగం: 5128


విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ


శక సంవత్సరం: 1948 పరాభవ


ఆయనం: ఉత్తరాయణం 


ఋతువు: వసంత


మాసం: వైశాఖ 


పక్షం: కృష్ణ - బహుళ 


తిథి: పంచమి ఉ‌.07:05 వరకు

తదుపరి షష్ఠి 

 

వారం: గురువారం - బృహస్పతివాసరే

 

నక్షత్రం: పూర్వాషాఢ ప‌.03:43 వరకు 

తదుపరి ఉత్తరాషాఢ


యోగం: సాద్య రా.01:12 వరకు

తదుపరి శుభ

 

కరణం: తైతుల ఉ‌.07:05 వరకు

తదుపరి గరజ‌ రా. 07:52 వరకు

తదుపరి వణిజ


వర్జ్యం: రా.12:29 - 02:14 వరకు


దుర్ముహూర్తం: ఉ‌.10:04 - 10:55

మరియు ప‌.03:12 - 004:03


రాహు కాలం: ప‌.01:49 - 03:25


గుళిక కాలం: ఉ‌.08:59 - 10:36


యమ గండం ఉ‌.05:47 - 07:23

 

అభిజిత్: 11:47 - 12:37


సూర్యోదయం: 05:47


సూర్యాస్తమయం: 06:38


చంద్రోదయం: రా.11:30


చంద్రాస్తమయం: ఉ‌.09:53


సూర్య సంచార రాశి: మేషం


చంద్ర సంచార రాశి: ధనుస్సు


దిశ శూల: దక్షిణం


🚩 శ్రీ కశ్యప ఋషి జయన్తి 🚩


🏳️ సంత్‌ చౌఖమేలా పుణ్యతిథి‌🏳️


🎊 శ్రీ భువనేశ్వరి పాటోత్సవ్ 🎊

(గొండాల్ - గుజరాత్)


🛕చెన్నై శ్రీ కేశవ పెరుమాళ్

రథోత్సవం 🛕


🪄 శ్రీనివాసమంగాపురం శ్రీ 

 కల్యాణ వేంకటేశ్వరస్వామి 

 వసంతోత్సవారంభం‌  🪄


🛕తిరువల్లికేణి శ్రీ పార్థసారథి

 పెరుమాళ్ రథోత్సవం 🛕


🇮🇳 అల్లూరి సీతారామరాజు

స్మృతి దినం 🇮🇳


⚛️


వైశాఖే కృష్ణపక్షే తు 

పంచమ్యాం ఋషిసత్తమః |

కశ్యపః ప్రాదురభవత్ 

లోకానాం హితకామ్యయా ||


మరీచిః కశ్యపం తస్మాత్ 

సర్వలోక పితామహమ్ |

సృష్టవాన్ సర్వభూతాని

సదేవాసుర మానుషాన్ ||

మరీచి కుమారుడైన కశ్యపుడు,

దేవతలు, అసురులు మరియు

మనుష్యులతో సహా సమస్త

భూతజాలాన్ని సృష్టించిన లోక

పితామహుడు.


వైశాఖే మాసి సంభూతం

మరీచికుల నందనమ్ |

కశ్యపం సర్వలోకానాం 

పితరం ప్రణమామ్యహమ్ ||


మరీచేః కశ్యపో జజ్ఞే 

కశ్యపాత్తు సురాసురాః |

శశాంకవంశ్యాః సూర్యాశ్చ 

తథాన్యే చ చరాచరాః ||

మరీచి నుండి కశ్యపుడు

జన్మించాడు. కశ్యపుడి నుండే

దేవతలు, అసురులు,

చంద్రవంశీయులు,

సూర్యవంశీయులు మరియు

ఇతర చరాచర ప్రాణులు

ఉద్భవించాయి.


కశ్యపస్య ప్రభావన లోకాః

సృష్టాశ్చరాచరాః |

తస్మాత్ సర్వమయం లోకం

కశ్యపం పరిచక్షతే ||

కశ్యపుని ప్రభావం వల్లనే ఈ

చరాచర జగత్తు సృష్టించబడింది.

అందుకే ఈ లోకమంతా

కశ్యపమయము.


అదితిర్దితిస్తథా దనుః కాష్ఠా 

అరిష్టా సురసా ఇలా |

మునిః క్రోధవశా చైవ తాసాం 

భర్త్రే నమో నమః ||"

కశ్యపుని భార్యలైన అదితి, దితి

మొదలైన వారిని పేర్కొంటూ,

సమస్త జీవరాశికి తండ్రి అయిన

కశ్యపునికి నమస్కారం.


కశ్యపాయ నమస్తుభ్యం

సర్వభూత హితైషిణే |

మరీచిపుత్ర ధర్మజ్ఞ 

గృహాణార్ఘ్యం మయా దత్తమ్ ||

సర్వ భూతాల మేలు కోరేవాడా,

మరీచి పుత్రుడా, ధర్మం తెలిసిన ఓ

కశ్యప మహర్షీ! నేను సమర్పిస్తున్న

ఈ అర్ఘ్యాన్ని స్వీకరించు.


🔯


కామెంట్‌లు లేవు: