29, ఆగస్టు 2020, శనివారం

వ్యవహారికం- ఆత్మా జ్ఞ్యానం

*పూర్వం ఒక పట్టణంలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతడికి దైవ భక్తి ఎక్కువ. సాధుపురుషులు ఎవరైనా కనిపిస్తే ఇంటికి తీసుకువెళ్లి విశేషమైన మర్యాదలు చేస్తుండేవాడు. ఒకసారి ఓ సాధువును ఇంటికి తీసుకొచ్చాడు శ్రీమంతుడు. తన స్థాయికి తగినట్టుగా అతిథి సత్కారాలు చేశాడు. భోజనం కోసం రకరకాలైన పిండి వంటలు చేయించాడు. ప్రత్యేకంగా పాయసం కూడా చేయించాడు.*
*

*పూర్వం ఒక పట్టణంలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతడికి దైవ భక్తి ఎక్కువ. సాధుపురుషులు ఎవరైనా కనిపిస్తే ఇంటికి తీసుకువెళ్లి విశేషమైన మర్యాదలు చేస్తుండేవాడు. ఒకసారి ఓ సాధువును ఇంటికి తీసుకొచ్చాడు శ్రీమంతుడు. తన స్థాయికి తగినట్టుగా అతిథి సత్కారాలు చేశాడు. భోజనం కోసం రకరకాలైన పిండి వంటలు చేయించాడు. ప్రత్యేకంగా పాయసం కూడా చేయించాడు.*


*సాధువుతో పాటు శ్రీమంతుడు కూడా భోజనానికి కూర్చున్నాడు. సాధువుతో.. ‘‘స్వామి! మా ఇంట్లో పాయసం అమృత సమానంగా ఉంటుంది. తప్పకుండా తీసుకోండి’’ అని అన్నాడు. సాధువు చిరునవ్వు నవ్వి ‘‘అలాగే’’ అన్నాడు. రెండు గ్లాసుల్లో పాయసం తెచ్చి అక్కడుంచారు. శ్రీమంతుడు ఒక గ్లాసు తీసుకుని అపురూపంగా పాయసం తాగాడు! ఇది గమనించిన సాధువు.. ‘‘పాయసం ఎలా ఉంది నాయనా!’’ అన్నాడు. ‘అమృత సమానంగా ఉంది’ అన్నాడు శ్రీమంతుడు. వంటవాడు రెండో దఫా పాయసం తెచ్చాడు. శ్రీమంతుడు మళ్లీ తాగాడు. ‘‘ఎలా ఉంది?’’ అన్నాడు సాధువు. ‘‘ఫర్వాలేదు’’ అన్నాడు.*


 *సాధువు వంటవాడిని పిలిచి మరో గ్లాసు పాయసం తేవాల్సిందిగా చెప్పాడు. శ్రీమంతుడితో దానిని కూడా తాగమన్నాడు. అయిష్టంగానే తాగాడు. ‘‘ఎలా ఉంది?’’ అన్నాడు. ‘‘విష తుల్యంగా’’ ఉందన్నాడు శ్రీమంతుడు. భోజనాలు పూర్తయిన తర్వాత సాధువు, శ్రీమంతుడు బయట వరండాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు.*


*సాధువు ఆత్మ, జ్ఞానం తదితర అంశాల గురించి అనేక విషయాలు చెబుతున్నాడు.*


*శ్రీమంతుడు మాత్రం ఇందాక చేసిన భోజనంలోని వంటకాల విశేషాల గురించి చెప్పసాగాడు.*


 *సాధువు కల్పించుకొని.. ‘‘నాయనా! మొదట పాయసం తాగినపుడు అమృతంగా ఉందన్నావు. రెండోసారి ఫర్వాలేదన్నావు. మూడోసారి విషంగా ఉందన్నావు! పాయసం అమృతం అయితే.. ఎన్నిసార్లు తాగినా అమృతంగానే ఉండాలి కదా!*


 *కాబట్టి విషయం బాహ్య వస్తువులో లేదు. మన భావనే వస్తువులలో సుఖాన్ని కల్పిస్తోంది. ప్రాపంచిక విషయాలు ఒకసారి గొప్పగా కనిపిస్తాయి, మరోసారి వృథాగా అనిపిస్తాయి. జీవుడు బాహ్య వస్తువులపై విరాగం కలిగి ఉండి.. ఆత్మస్థితిలో ఆనందాన్ని కలిగి ఉండాలి’’ అని బోధించాడు.*

🕉🌞🌏🌙🌟🚩

*అందుకే ఆది శంకరులు తమ భజగోవిందం లో ఇలా అంటారు.....*

 *మాకురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్కాలః సర్వం |*

*మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||*

*ధనము, పరివారము, యోవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటినన్నిటిని కాలము హరించును. ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము.*
*సాధువు ఆత్మ, జ్ఞానం తదితర అంశాల గురించి అనేక విషయాలు చెబుతున్నాడు.
*******************

వరాహమిహిరుని గురించి

వరాహమిహిరుడు తన భార్య ప్రసవ సమయము నందు ప్రసూతి గృహమునందు ఉన్నప్పుడు మంత్రసానికి నిమ్మపండునిచ్చి
BLN మూర్తి కధలో చెప్పనట్లుగా సూచనలను చేసారు. మిగిలిన కధ అంతా వారు చెప్పి నట్లుగా జరిగినది. అప్పుడు జన్మించిన ఆడశిశువు జాతకం పరిశీలించి ఆమే వివాహం జరిగిన రాత్రే వైధవ్యం కలుగనని గ్రహించి ఆయన తన కుమార్తె కువివాహము జరిగిన రాత్రి మనఃశ్శాంతి కరువై పిచ్ఛివానివలే ఆ ఊరు వదిలి దేశసంచారము గావించేను.
ఆ తరువాత కొంత కాలమునకు తన గ్రామమునకు సంచారిగా వచ్చినపుడు తన కుమార్తె సుమంగళిగా ను సంతాన ముతో తన భర్తతో జీవించడము విని చూసి తను వ్రాసిన జ్యోతిష్య గ్రంధములన్నీ తప్పులుగా ఎంచి తన రచనల వలన ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నానని భావించి ఆ గ్రంథములన్నింటిని కాల్చి వేయాలని భావించి వాటిని ఒక బండి పై ఊరి బయటికి తరలించుచుండగా ఆ బండి చక్రముక్రింద ఒక ముదుసలి స్త్రీ పడినది. ఆమె నుపరిశీలించగా ఆమెనే తన భార్య ప్రసవసమయమునందు పనిచేసిన మంత్రసానిగా గుర్తించి ఆమె ద్వారా అసలు విషయము తెలుసుకొనినాడు.
సరస్వతీ దేవి యే మంత్రసాని రూపం లో వచ్చి ఈయన రచనలను అగ్నికి ఆహుతి కాకుండా కాపాడినట్లు తెలియజేసారు.

🙏వరాహమిహిరుడి గురించి🙏

ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రీ.శ 4 వ శతాబ్దంలో ఆదిత్యదాసుడనే జ్యోతిశ్శాస్త్ర పండితునకు జన్మించాడు మిహిరుడు. తండ్రి వద్ద గణిత జ్యోతిశ్శాస్త్రములు నేర్చుకున్న మిహిరుడు పాట్నాలో నాటి సుప్రసిద్ధ గణీత శాస్త్రవేత్త ఆర్యభట్టును కలుసుకొని ఆయనతో శాస్త్ర చర్చ జేశాడు. అనంతరము ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలను అధ్యయనం జేయాలని నిర్ణయించుకొని అసాధారణ కృషి సలిపారు. ఆయన నిరంతర అధ్యయన ఫలితాలు అతని గ్రంథాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

శాస్త్రాలే గాక, పత్యేకించి గ్రీకు శాస్త్రాలు అధ్యయనం జేసినట్లు అక్కడకు వెళ్ళీ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో గణిత శాస్త్రజ్ఞుడైనా అనేక శాస్త్ర విషయాలను వివరించారు.

(మిహిరుడు వరాహ మిహిరునిగాసవరించుకోండి)

అనతి కాలంలో ఉజ్జయిని గొప్ప విద్యా కేంద్రము, అక్కడ కళలు, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రము అనే అంశాలలో ప్రసిద్ధులైన ఎందరో పండితులు సుదూరాల నుంచి వచ్చేవారు. పరస్పర భావ వినిమయం వుండేది. అచ్చటి శాస్త్ర చర్చలలో మిగిరుని శాస్త్ర పటిమ తెలియ వచ్చిన రెండవ విక్రమాదిత్య చంద్ర గుప్తుడు తన ఆస్థాన మండలి నవరత్నములలో నొకనిగా ఆయనకు గౌరవించాడు. దీనికి సంబంధించిన ఒక సంఘటన చెప్తారు. విక్రమాదిత్యుని కుమారుడు వరాహము కారణంగా మరణిస్తాడని మిహిరుడు జ్యోతిషము చెప్పగా రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతో కట్టుదిట్టము చేసినా శాస్త్ర ప్రకారము చెప్పిన సమయానికి, చెప్పిన కారణముగానే రాకుమారుడు మరణిస్తే విక్రమాదిత్యుడు తన కుమారుని గతికి విలపించినా మిహిరుని ప్రతిభను శ్లాఘించి మగధ సామ్రాజ్య గౌరవ చిహ్నము వరహముద్రాంకితముతో సత్కరించాడు. నాటి నుంచి ఆ జ్యోతిః శాస్త్ర వేత్త వరాహమిహిరుడుగా పిలువబడ్డాడు. వేదాలన్నీ చదివి ఎంతో పండితుడైనా మానవాతీత శక్తులను గ్రుడ్డిగా నమ్మేవాడు కాడు. అతనొక అద్భుత శాస్త్రవేత్త!
🙏🙏🙏**************

Srimadhandhra Bhagavatham

-- 101 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవరికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించారన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించారన్నది ప్రధానం అవుతుంది. ఎవరికి ఐశ్వర్యం ఉన్నదో వారే  పండితులు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో  ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమం సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములకు వెళ్లి కాళ్ళు పెట్టాలి.  మహా పురుషుల మూర్తులను సేవించాలి.  అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు.  నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల. అది  మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకోవాలి. దీనినుంచి దాటాలని  అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు వెళ్ళాలి. కలియుగంలో నామమును గట్టిగా పట్టుకోవడం నేర్చుకోవాలి. ఈశ్వర నామమును విడిచిపెట్టకూడదు. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము, ఇంద్రియ నిగ్రహము, జపము, తపస్సు, మంత్రమును అనుష్ఠానము చేయుట, భగవన్మూర్తి ముందు కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలుపెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు. అందరూ వీటిని ప్రారంభించాలి. వీటిని చేస్తే క్రమంగా వారికి నేను ఇంద్రియములకు లొంగని స్థితిని ఇస్తాను. ఆశ్రమములన్నిటిలో నేను గృహస్థాశ్రమయి ఉన్నాను. గృహస్థాశ్రమంలో వేదము చెప్పిన ఇంద్రియ సుఖము ధర్మబద్ధమయినది. వేదము ఎలా చెప్పిందో అలా ఇంద్రియ సుఖమనుభవించవచ్చు.
 సుఖములా కనపడుతున్నది సుఖము కాదనే సత్యమును  తెలుసుకోగలగాలి. అలా తెలుసుకొన్ననాడు  ఇంద్రియములకు లౌల్యము ఉండదు. సుఖము సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రయనీయము గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమములో ఉండి ఆ ఆశ్రమము యథార్థ ధర్మములను పాటిస్తూ ఇంద్రియములకు లొంగనివాడు ఎవడు ఉన్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు. కంచుతోకాని, సీసంతో కాని, వెండితో కాని, బంగారంతో కాని నా మూర్తిని తీసి ఇంట పెట్టుకో. సాత్త్వికమయిన మూర్తిని తీసుకు వచ్చి  పెట్టి పువ్వులు వేయడం మొదలుపెడితే మొదట్లో నీవు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నదని, నీవు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటుందని అనుకుంటావు. అది క్రమంగా అహంకారమును ఆ మూర్తి తినెయ్యడం మొదలుపెడుతుంది. క్రమక్రమంగా నీవు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు. మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధనం అనేది ఒక ఆలంబన. కొన్నాళ్ళకి ప్రతి జీవి గుండెలలోను పరమాత్మ ఉన్నాడనే సత్యమును గ్రహించగలుగుతావు.
 ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపములతో దర్శనం అవుతాడు. జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు వానిలో వున్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది. వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు  వాడు నాయందే చేరిపోతున్నాడు.  ఉద్ధవా! నీవు ఈ పని ప్రారంభించు. కలియుగం వచ్చేస్తోంది. బదరికాశ్రమమునకు చేరిపో’ అన్నాడు. ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమమునకు వెళ్ళిపోయాడు.
ముందు బలరాముడు వెనుక పరమాత్మ నడిచి వెడుతున్నారు. బలరాముడు నడుస్తూ నడుస్తూ తన శరీరమును విడిచి పెట్టేసి తన చైతన్యమును అనంతునిలో కలిపివేశాడు. బలరాముడి శరీరం నేలమీద పడిపోయింది.  కృష్ణ పరమాత్మ ఒక పొదచాటుకు వెళ్లి నేలమీద పడుకొని మోకాలు మీద రెండవ కాలు పెట్టి పాదమును కొద్దిగా కదుపుతూ పడుకున్నారు. దూరంనుంచి బోయవాడు వేటకై వచ్చి అక్కడ పొదలలోకి చూశాడు. ఒక పొదలో జింక చెవి కదులుతున్నట్లుగా కనపడింది. ఆ జింక చెవిమీదికి బాణం వేస్తే  తలలోకి గుచ్చుకుంటుందనుకుని బాణమును కృష్ణ పరమాత్మ కాలిమీద ప్రయోగించాడు. ఈ ముసలపు ముక్క ఏ శ్రీపాదములు ఈ గోపాల బాలురను అలరించాయో, లోకమునంతటినీ పవిత్రం చేశాయో, ఏ పాద చిహ్నములను స్వామి ఈనేల మీద మోపాడో, ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథం మీద కూర్చుని గీతోపదేశం చేశాడో, ఏ  పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడు అయ్యాడో,  ఏ పాదమును పట్టుకుని కొన్ని కోట్లమంది మోక్షమును పొందారో, ఆర్తితో పిలిచినా వాళ్ళ దగ్గరకు పరుగెత్తుకుని వచ్చి ఏ శ్రీపాదములు దర్శనము ఇచ్చాయో అటువంటి పాదముల బొటనవ్రేలి దగ్గరికి ఆ బాణం వెళ్ళి గుచ్చుకుంది. కృష్ణ పరమాత్మ ‘హా’ అని అరిచారు. బోయవాడు అయ్యో మనుష్యుడిని కొట్టానని పరుగెత్తాడు. కృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నారు. రక్తం ధారలా కారుతోంది. అయ్యో! ఎంత పొరపాటు చేశాను స్వామీ నా జన్మకు నిష్కృతి లేదు అని నేలమీద పడి ఏడ్చాడు. కృష్ణ పరమాత్మ ‘నాయనా నీవు నిమిత్తమాత్రుడవు. నా మరణమును ఎవరూ తప్పించలేరు. ఎంతటివాడయినా కూడా ఒకసారి ఈ శరీరంలోకి వచ్చిన తరువాత ఈ శరీరమును వదిలి పెట్టవలసిందే. నేను కూడా పెద్దల వాక్కును పాటించాను. అందుకని కాలికి బాణం తగిలితే ప్రాణం విడిచి పెడుతున్నాను’ అన్నారు.
దారుకుడు పరుగుపరుగున అక్కడికి వచ్చాడు. ఏమిటి స్వామీ ఈ పరిస్థితి? మీరిలా పడిపోవడమా? కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా! అని విలపించాడు.  కృష్ణుడు ‘నా అవతారం పరిసమాప్తి అయిపోతున్నది. ఈ గుర్రములు, రథములు అన్నీ అదృశ్యం అయిపోతాయి. ఇప్పుడు యాదవులు అందరూ కొద్ది క్షణములలో మరణించబోతున్నారు’ అని చెప్పారు.
యాదవుల అంతమొందుట
ఆడుకుంటున్న యాదవులు అకారణంగా రెండు పక్షములుగా విడిపోయి ‘యుద్ధం చేసుకోవడం మొదలుపెట్టి చిట్టచివర మిగిలిన వారు వాళ్ళు అరగదీసిన  ఇనప రోకలి లోంచి పుట్టిన తెట్టు కలిపినపుడు పుట్టిన రెళ్ళు దుబ్బులు కోసి తెచ్చి వాటితో కొట్టుకుని ప్రాణములు వదిలేశారు. యాదవ కులం నాశనం అయిపోయింది. బలరాముని భార్యలు, కృష్ణుని భార్యలు చితులలోనికి ప్రవేశించారు. మిగిలినవారు ఎవరో కొద్దిమంది ఉంటే  వారిని ఇంద్రప్రస్థం తీసుకు వెడదామని అర్జునుడు  గాండీవము పట్టుకుని వారిని తీసుకువెడుతున్నాడు. చిత్రం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అవతారం చాలించగానే పదిమంది గోపబాలుర చేతిలో గాండీవము ఉన్న అర్జునుడు ఓడిపోయాడు. ఆ విషయమును వచ్చి ధర్మరాజుకి చెప్తాడు. ‘గాండీవం ఉన్నది, పాశుపతాస్త్రం ఉన్నది గెలిచాననుకున్నాను. ఆ కృష్ణ పరమాత్మ సారధ్యం వలన గెలిచానని అనుకోలేదు. ఆ మహానుభావుడు నా సఖుడు వెళ్ళిపోయాడు అన్నాడు.  ధర్మరాజు గారు ‘అటువంటి మహానుభావుడు వెళ్ళిపోయిన తరువాత మనం ఈ భూమండలం మీద ఉండవద్దు. రండి వెళ్ళిపోదాం అని పిచ్చివానిలా జుట్టు విరబోసుకుని ఆభరణములు అన్నీ తీసి పక్కన పెట్టేసి ఉత్తరాభిముఖుడై వెళ్ళిపోయాడు. మిగిలిన పాండవులు ద్రౌపది, కుంతి అంతా శరీరములు విడిచిపెట్టారు. కలియుగం ప్రవేశించింది.
ఫలశ్రుతి
కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఒకమాట చెప్పారు. ‘ఎవరు ఈ భాగవత కథ వింటున్నారో వాళ్ళందరూ కూడా చెవుల ద్వారా అమృతమును పానము చేసినట్లే. వాళ్ళందరూ నన్నే చేరుతారు. నేను అభయం ఇస్తున్నాను’ అన్నారు.
అటువంటి వారు కన్ను మూసినపుడు కన్ను తెరిచినపుడు కృష్ణ దర్శనమే అగుట కొరకు పోతనగారు మనకొక భిక్ష పెట్టారు. వ్యాసుడు సంస్కృతంలో చెప్పిన శ్లోకమును యథాతథంగా తెలుగులోకి అనువాదం చేశారు. అది భాగవతమునకు జీవనాడి. భాగవత పఠన ఫలితమును కోరుకున్న వారందరూ ఈ పద్యములను తప్పనిసరిగా పఠించాలి. మనుష్య జన్మకు ఇంతకన్నా ప్రయోజనం వేరొకటి ఉండదు. ఎవరు ఈ పద్యమును పఠిస్తారో వారు మాత్రమే భాగవతమును వినడం వలన కాని, చదవడం వలన కాని కలిగే శుభఫలితములు పొందగలరని ఫలశ్రుతి చెప్పబడింది.
నగుమొగమున్ సుమధ్యమును నల్లనిదేహము లచ్చి కాట ప
ట్టగు నురమున్ మహాభుజము లంచితకుండలకర్ణముల్ మదే
భ గతియు నీల వేణియు గృపారసదృష్టియు గల్గు వెన్ను డి
మ్ముగ బొడసూపు గాత గనుమూసిన యప్పుడు విచ్చినప్పుడున్.
‘ఈశ్వరా! నా కన్ను మూసినప్పుడు, నా కన్ను తెరిచినప్పుడు నువ్వు నాకు ఎలా కనపడాలో తెలుసా! నవ్వు ముఖముతో, సన్నని నడుముతో, నల్లని శరీరంతో, లక్ష్మీదేవికి స్థానమయిన వక్షస్థలముతో, మమ్మల్ని రక్షించగలిగిన భుజ స్కంధములతో, కుండలములు దాల్చిన కర్ణ యుగళితో ఏనుగు నడకవంటి నడకతో, నల్లని వెంట్రుకలతో, కృప వర్షించే కన్నులతో, నాయందు అనుగ్రహించి నా కోరిక తీర్చుగాక! నిద్రపోయినప్పుడు నీ అనుగ్రహమునే సమాధిలో నేను అనుభవించాలి. కళ్ళు తెరుచుకుని ఉదయం లేచిన దగ్గరనుంచి నీవే నాకు సారధియై నడిపించాలి. చిట్టచివర నా కన్నులు మూతపడిపోయినప్పుడు నీవే అనుగ్రహించి నాకు మోక్షమును ఇవ్వాలి. వేరొకసారి నాకు జన్మవద్దు. స్వామీ నన్ను యిలా అనుగ్రహించు’ అని గొప్ప పద్యమును మనకు పోతనగారు భిక్షపెట్టి పూర్తిచేస్తూ అంటారు
ఈ కథ విన్నను వ్రాసిన, బ్రాకటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగుం
జేకొని యాయువు ఘనుడై, లోకములోనుండునరుడు లోకులు వొగడన్.
‘ఎవరయితే భాగవతంలోని ఈ ఆఖ్యానమును వింటున్నారో ఇది విన్న వాళ్ళకు, ఇది వ్రాసిన వాళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సిరిసంపదలు కలుగుతాయి. ఆయుర్దాయం కలుగుతుంది. ఏమయినా ప్రమాదములు ఉంటే తప్పిపోతాయి. వాళ్ళు బ్రతికిన బ్రతుకు ఎలా ఉంటుందంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయనతో కలిసి ఉండాలని, ఆయనను చూడాలని, ఆయన వద్ద వినాలని కోరుకునేటట్లుగా జన్మ సార్థకత పొంది నడుస్తుంది. అటువంటి కీర్తిని కృష్ణ పరమాత్మ కటాక్షిస్తారు’ అని ఈ ఆఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పబడింది.

భాగవత ప్రవచన పాఠం నేటితో సమాప్తం
*****************

తెలుగు సంవ‌త్స‌రాలు

_మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు ఇస్తున్నాను..మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి._*

_*Know the Telugu Year you born*_

*( 1867, 1927,1987,)*: ప్రభవ
*(1868,1928,1988)*: విభవ
*(1869,1929,1989)*: శుక్ల
*(1870,1930,1990)*: ప్రమోదూత
*(1871,1931,1991)*: ప్రజోత్పత్తి
*(1872,1932,1992)*: అంగీరస
*(1873,1933,1993)*శ్రీముఖ
*(1874,1934,1994)*: భావ
*(1875,1935,1995)*: యువ
*(1876,1936,1996)*: ధాత
*(1877,1937,1997)*:  ఈశ్వర
*(1878,1938,1998)*: బహుధాన్య
*(1879,1939,1999)*: ప్రమాది
*(1880,1940,2000)*: విక్రమ
*(1881,1941,2001)*: వృష
*(1882,1942,2002)*: చిత్రభాను
*(1883,1943,2003)*: స్వభాను
*(1884,1944,2004)*: తారణ
*(1885,1945,2005)*: పార్థివ
*(1886,1946,2006)*:  వ్యయ
*(1887,1947,2007)*: సర్వజిత్
*(1888,1948,2008)*: సర్వదారి
*(1889,1949,2009)*: విరోది
*(1890,1950,2010)*: వికృతి
*(1891,1951,2011)*: ఖర
*(1892,1952,2012)*:  నందన
*(1893,1953,2013)*: విజయ
*(1894,1954,2014)*: జయ
*(1895,1955,2015)*: మన్మద
*(1896,1956,2016)*: దుర్ముఖి
*(1897,1957,2017)*: హేవిళంబి
*(1898,1958,2018)*: విళంబి
*(1899,1959,2019)*: వికారి
*(1900,1960,2020)*: శార్వరి
*(1901,1961,2021)*: ప్లవ
*(1902,1962,2022)*: శుభకృత్
*(1903,1963,2023)*: శోభకృత్
*(1904,1964,2024)*: క్రోది
*(1905,1965,2025)*: విశ్వావసు
*(1906,1966,2026)*: పరాభవ
*(1907,1967,2027)*: ప్లవంగ
*(1908,1968,2028)*: కీలక
*(1909,1969,2029)*: సౌమ్య
*(1910,1970,2030)*:  సాదారణ
*(1911,1971,2031)*: విరోదికృత్
*(1912,1972,2032)*: పరీదావి
*(1913,1973,2033)*: ప్రమాది
*(1914,1974,2034)*: ఆనంద
*(1915,1975,2035)*: రాక్షస
*(1916,1976,2036)*: నల
*(1917,1977,2037)*: పింగళ
*(1918,1978,2038)*: కాళయుక్తి
*(1919,1979,2039)*: సిద్దార్థి
*(1920,1980,2040)*: రౌద్రి
*(1921,1981,2041)*: దుర్మతి
*(1922,1982,2042)*: దుందుభి
*(1923,1983,2043)*: రుదిరోద్గారి
*(1924,1984,2044)*: రక్తాక్షి
*(1925,1985,2045)*: క్రోదన
*(1926,1986,2046)*: అక్షయ

దయచేసి షేర్ చెయ్యండి మన తెలుగు వారు అందరూ తెలుసుకోవాలి

బ్యాటరీతో నడిచే మాస్క్ సిద్ధం చేసిన ఎల్‌జీ*



ముఖానికి ధరించే పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌ మాస్క్ ను సిద్ధం చేసినట్లు ఎల్‌జీ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్యూరికేర్ వియరెబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇప్పుడున్న మాస్కుల కన్నా మరింత ఎక్కువగా వడపోత ప్రక్రియ చేపడుతుందని ఎల్‌జీ కంపెనీ పేర్కొన్నది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్లలో ఫిల్టర్లను ఎప్పటికప్పుడు మార్చుకునే వీలుంటుంది. శ్వాస తీసుకోవడంలో సహాయపడటానికి బ్యాటరీతో నడిచే రెండు ఫ్యాన్లను కలిగివుంటుంది. ఈ మాస్క్ ధరించినవారు ఊపిరి పీల్చుకున్నప్పుడు లేదా వెలుపలికి వదిలేప్పుడు గుర్తించేందుకు సెన్సార్లను అమర్చారు. పూరికేర్ ధరించగలిగే ఎయిర్ ప్యూరిఫైయర్ రెండు H13 HEPA ఫిల్టర్లను ఉపయోగిస్తుంది. అవసరమైనప్పుడు వాటిని మార్చుకోవచ్చు. మాస్క్ లోపల ఉండే రెండు ఫ్యాన్లు శ్వాసను మరింత సహజంగా చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే వేర్వేరు స్థాయిల్లో వేగాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.
ఎలక్ట్రానిక్ పరికరం కావడం వల్ల, దీనిని ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటిలోని బ్యాటరీ రెండు గంటలు హై మోడ్‌లో, ఎనిమిది గంటలు తక్కువ మోడ్‌లో పనిచేస్తాయి. మాస్కులో చిక్కుకున్న హానికరమైన సూక్ష్మక్రిములను చంపే సందర్భంలో ఆల్ట్రావయోలెట్ కాంతి వస్తుంది. ఫిల్టర్లను మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా గుర్తించి మనకు సంకేతాలను ఇస్తుంది. ఫేస్ మాస్క్‌లతో ప్రజలు కలిగి ఉన్న ఆందోళనలలో ఒకటి సౌకర్యం, రెండోది గాలి బయటకు రాకుండా సరిపోయేలా పూరీకేర్‌ను రూపొందించినట్లు ఎల్‌జీ పేర్కొన్నది. చివరికి ఎక్కువ గంటలు ధరించేంత సౌకర్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. పూరికేర్ వియరెబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఎల్జీ యొక్క వర్చువల్ ఐఎఫ్ఎ 2020 ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనునన్నారు. దీని ధర ఎంతో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
*******************

రామాయణమ్.. 45


...
దశరధుడు బ్రతిమాలుతున్న కొద్దీ బెట్టు చేయడం ఎక్కువ అయ్యింది కైకకు ! .ఆవిడ ఆయనకు ప్రియసతి ! ఆవిడ మనసుకు కొంచెం కష్టం కలిగినా సహించి భరించలేడు ఆ రాజు ! .
.
మెల్లగా ఆవిడ కేశాలు తన చేతిలోకి తీసుకుని కైకా!  నీ కన్నా రాముడికన్నా! ప్రియమైన వారు ఎవరున్నారు నాకు ఈ లోకంలో ! .
.
నా రాముడి మీద ఒట్టు వేసి చెపుతున్నాను నీ కేమి కావాలో చెప్పు ,క్షణంలో తీరుస్తాను !.
.
నామీద నీకు ఎంత అధికారమున్నదో నీకు తెలుసు ,నేను చేసిన పుణ్యము మీద ఒట్టుపెట్టి చెపుతున్నాను నీ కోరిక చెల్లిస్తాను!.
.
ఇన్ని రకాలుగా హామీలు తీసుకున్నతరువాత కైక తన మనసులో గల కోరిక వెల్లడించడానికి ఉద్యుక్తురాలయ్యింది !.
.
హఠాత్తుగా వచ్చి పడిన మృత్యువులాగ ఆవిడ నోట మాట బయల్పడింది !.
.
పంచభూతాలు  ,సూర్యచంద్రుల ,గంధర్వులు ,దేవతలు అందరూ కూడా నీవు పెట్టిన ఒట్లు విన్నారు ! మహారాజా నీవు నాకు మునుపు ఇచ్చిన రెండు వరములు ఇప్పుడు కోరుకో దలచుకొన్నాను . ...వాటిని సత్యసంధుడవైన నీవు ఇప్పుడు చెల్లించవలెను లేని పక్షమున నా ప్రాణములు విడువ గలదానను అని పలికింది ....అవి..
.
దశరధుడు కామముతో కప్పబడిన మనస్సుకలవాడై ,పాశములో చిక్కిన లేడిలాగ అయిపోయాడు.
.
రాముని అభిషిక్తుని చేయుటకు నీవు సకల సంభారములు సమకూర్చుకున్నావు కదా ! వాటితో రాముని బదులుగా భరతుని అభిషేకించు !
.
రెండవ వరము....రాముడు పదునాల్గు సంవత్సరములు నారచీరలు ,మృగాజినము ,జటలు ధరించి దండకారణ్యములోముని వృత్తి నవలంబించుచూ  నివసించవలె.
.
ఏ శత్రుబాధలేని రాజ్యము భరతునకు లభించుగాక!.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
********************

TAKE CARE OF YOURSELF*



1. The *STOMACH* is injured when you do not have breakfast in the morning.

2. The *KIDNEYS* are injured when you do not even drink 10 glasses of water in 24 hours.

3. The *GALLBLADDER* is injured when you do not even sleep until 11 o'clock and do not wake up to the sunrise.

4. The *SMALL INTESTINE* is injured when you eat cold and stale food.

5. The *LARGE INTESTINES* are injured when you eat more fried and spicy food.

6. The *LUNGS* are injured when you breathe in smoke and stay in polluted environment of cigarettes.

7. The *LIVER* is injured when you eat heavy fried food, junk, and fast food.

8. The *HEART* is injured when you eat your meal with more salt and cholesterol.

9. The *PANCREAS* is injured when you eat sweet things because they are tasty and freely available.

10. The *Eyes* are injured when you work in the light of mobile phone and computer screen in the dark.

11. The *Brain* is injured when you start thinking negative thoughts.

12. The *SOUL* gets injured when you don't have family and friends to care and share with you in life their love, affection, happiness, sorrow and joy.

*All these parts are NOT easily available in the market*. So take good care and keep your body parts healthy.

*Happy 😊 Day*
*********************

ఒక పిల్లన గ్రోవి కథ .🔻



✍🏿అనగనగా అవి సీతారాముల వనవాసపు రోజులు. సీతమ్మవారొక రోజు చెరువులో జలకాలు ఆడుతున్నదట. స్నానం కానిచ్చి ఒడ్డుకి వచ్చి పర్ణశాలకి దారి తీస్తుండగా, దార్లో ఓ ముల్లు ఆవిడ కాల్లో గుచ్చుకుందట. బహు సుకుమారి. కళ్లంట జివ్వున నీళ్ళు చిప్పిల్లాయి.
అల్లంత దూరాన ఉన్న రాముల వారిని " స్వామీ..!" అని పిలిచి, పక్కనే ఉన్న రాయి మీద కూర్చుండిపోయిందట.

*పరుగున వచ్చిన రాముల వారు ఎర్రగా కందిపోయిన అమ్మవారి మొహాన్ని చూసి కంగారు పడ్డారట.
ఇంకొకింత ఎర్రగా కందిన అరికాలిని చూసి బెంబేలు చెందారట. ఎలాగో తంటాలు పడి నెమ్మదిగా
ఆ ముల్లును బయటకు లాగి, సీత మొహం వైపు చూసారట.ముల్లు దిగిన కంటే పైకి లాగిన బాధ ఎక్కువగా ఉందేమో! జలజలా నీటి బొట్లు ఎర్రటి చెక్కిళ్ళ మీద జారిపోతుండగా "వచ్చేసిందా?" అన్నట్టు చూస్తోందట ఆయన వైపు.

*ఏడు మల్లెలెత్తు రాకుమారిని అడవులంట తిప్పుతున్నానే అనే బాధలో అసలే మునిగి ఉన్నారేమో రాముల వారు, చేతిలో ఉన్న ముల్లు వైపు క్రోధంగా చూసారట.
అది చూపా? అనల బాణమా? ముల్లు భగ్గున మండి బూడిదైపోయిందట.
*ఇదంతా చూస్తున్న సీతమ్మ వారు " అయ్యో, ఏలే దొరలే కినుక చూపితే ఇంక దిక్కెవరు ప్రాణులకు? మండుట అగ్ని లక్షణం. అలాగే గుచ్చుట ముల్లు లక్షణం. ఇంత పెద్ద శిక్షా ప్రభూ?" అని వాపోయిందట.

*మహాత్ముల కోపం తాటాకు మంట కదూ! చప్పున చల్లారిన రామయ్య నొచ్చుకున్నాడు. బూడిదయిన ముల్లుని దయగా చూసాడు. కాల్చిన చూపే కరుణించి ఏం వరమిచ్చిందయ్యా ముల్లుకి అంటే..
*మరుజన్మలో వెదురై పుట్టి కృష్ణుడి చేతిలో పిల్లనగ్రోవి అయిందట. సంతోషంతో మధురంగా మ్రోగిందిట..
******************

30వ పద్యం

30వ పద్యం
మ.
అడుగం బో నిక నన్యమార్గరతులన్ బ్రాణావనోత్సాహినై,
యడుగంబోయిన బోదు నీదు పద పద్మారాధకశ్రేణి యు
న్నెడకున్, నిన్ను భజింపగా గనియు నాకేలా పరాపేక్ష? కో
రెడి దింకేమి? భవత్ర్పసాదమె తగున్ శ్రీకాళహస్తీశ్వరా!
: 👆31వ పద్యం
మ.
మదమాతంగము లందలంబులు హరుల్ మాణిక్యముల్ పల్లకుల్
ముదితల్ చిత్రదుకూలముల్ పరిమళంబుల్ మోక్షమీ జాలునే!
మదిలో వీని నపేక్షచేసి నృపధామద్వారదేశంబు గా
చి దినంబుల్ వృథపుత్తు రజ్ఞు లకటా! శ్రీకాళహస్తీశ్వరా!

*విదేశీ ప్రయాణం - నివాసం* -

ఒక జాతకుడు విదేశాలకు వెళతాడా? వెళ్లలేడా అనేది చూడాలంటే అతని రాహువు, లగ్న, తృతీయ, చతుర్థ, నవమ, ద్వాదశ స్థానాలు వాటి అధిపతుల స్థితియుతులను బట్టి నిర్ణయించాలి. 

3 తక్కువ దూరపు లేదా తక్కువ కాలపు ప్రయాణం, దేశంలోపలి ప్రయాణాలు మాత్రమే ఉంటాయి.

4 స్వదేశం, జన్మ స్థలాన్ని సూచిస్తుంది

9 దూర ప్రయాణం

12 నష్టం అంటే తన వ్యక్తిత్వాన్ని, అస్థిత్వాన్ని కోల్పోవడం ( దూర దేశాలలో స్థిరనివాసం )

లగ్నాధిపతి కనుక 9,12 లలో ఎక్కడ ఉన్నా అతనికి విదేశీ యాన యోగం ఉంటుందని చెప్పవచ్చు.

4 వ భావాధిపతి కనుక బలంగా ఉండి, శుభ సంబంధం ఉంటే స్వదేశంలో ఉండడం జరుగుతుంది, అది అతనికి క్షేమం కూడా. చతుర్థాధిపతి బలహీన పడి, 9 లేక 12 భావాలతో సంబంధం ఏర్పడితే ఆవ్యక్తి తప్పక విదేశాలకు వెళతాడు. 4వ భావాధిపతి 6,8 లలో ఉన్నా జన్మస్థలంతో సంబంధం దెబ్బతింటుంది.

లగ్న నవమాధి పతులు ఒకరి స్థానంలో ఒకరున్నా, పరివర్తన చెందినా తప్పక విదేశీయానం, అక్కడ ఎక్కువకాలం నివసించడం ఉంటుంది.

లగ్న ద్వాదశాధిపతులు ఒకరి స్థానంలో ఒకరున్నా, పరివర్తన చెందినా తప్పక విదేశీయానం, అక్కడే స్థిరపడడం ఉంటుంది. 

తృతీయాధిపతి ఆ జాతకుని ప్రయాణాలను తెలియజేస్తాడు. తృతీయాధి పతి 9, 12 లలో ఉంటే అతనిక తప్పక విదేశీ యానం ఉంటుంది.

ఇవే నియమాలు కేపీ లో కూడా , కాకపోతే భావాధి పతి అని ఉన్న చోటల్లా, ఆభావ సబ్ లార్డ్ అని మార్చి చదువుకోవాలి.

ఉదాహరణకు లగ్న సబ్ లార్డ్ లేదా తృతీయ భావ సబ్ లార్డ్ కు కనుక 9,12 భావాలలో స్థితి గానీ, ఆభావాధిపతులతో యుతి గానీ, అభావాధి పతుల వీక్షణ గానీ కలిగితే ఆవ్యక్తి తప్పక విదేశీ యానం చేస్తాడు.

మీ
 *R VIJAY SHARMA* 
9000532563
rvj.astropandit@gmail.com