20, జూన్ 2021, ఆదివారం

గంగావిర్భావ దినం.

 గంగావిర్భావ దినం.

జ్యేష్ఠ శుక్ల పక్ష దశమి - ఆదివారం  20.06.2021

🌹🌹🌹🌹🌹🌹


*జ్యేష్ఠమాసి సితే పక్షే దశమీ హస్త సంయుతా*

*హరతే దశపాపాని తస్మార్దశ హరా స్మృతా* - స్కాంద పురాణం



జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష దశమిని *దశ పాపహర దశమి*  అని పిలుస్తారు. ఈ రోజు గంగామాత అవతరించిన రోజు. శాస్త్ర విహితంగా కొన్ని విధులను పాటిస్తూ పండుగను జరుపుకోవడం వల్ల పది రకాలైన పాపాలు అంటే దశ పాపాలు తొలగిపోతాయి. కనుక ఈ రోజు ‘దశపాపహర దశమి’గా ప్రసిద్ధి పొందింది. 


గంగానది ఆవిర్భవించిన రోజు కనుక ఉత్తరాదిన *గంగా దశహర గంగోత్సవం* గా పిలుస్తారు. గంగాదేవి ఆరాధనకు ఇది ప్రీతిపాత్రమైన రోజు.


గంగాదేవి మాహాత్మ్యాన్ని గురించి స్కాంద పురాణంతో సహా పలు పురాణాలు, స్మృతి కౌస్తుభం, వ్రత నిర్ణయ కల్పవల్లి, వాల్మీకి రామాయణం, మహా భారతంలో గాంగేయుని (భీష్ముని) వృత్తాంతంలో వర్ణించడం జరిగింది. వనవాసానికి వెళ్తూ, సీతాదేవి గంగను పూజించి, తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుతానని మొక్కుకున్నట్టు రామాయణ కథ.

 

ఈ రోజు గంగా స్నానం, పూజ దశ విధాలైన పాపాల నుండి విముక్తి కలిగిస్తుంది. లోకంలో మనుషులు తెలిసీ, తెలియక పాపాలను చేయడం సహజం అయితే వాటి నుండి వచ్చే ఫలాలను అనుభవించినప్పుడు కాని పరిస్థితి అర్థం కాదు. అప్పుడు మాత్రమే అశుభాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదృష్టం కొద్దీ మనం చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి ఎన్నో ఉపాయాలను మన పూర్వులు శాస్త్రాల రూపంలో మనకు అందించారు. వాటిని ఆచరించి విముక్తి పొందవచ్చు. అటువంటి అవకాశమే ‘దశ పాపహర దశమీ వ్రతం’.

 

పది పాపాలూ..  ఏమిటంటే.?  అవి శారీరక, వాచిక, మానసిక సంబంధం కలిగి ఉంటాయి.

 

*శారీరకంగా చేసే పాపాలు* మూడు. అవి: 


అపాత్రదానం, శాస్త్రం అంగీకరించని హింస చేయడం, పరస్త్రీ లేదా పురుషుని వ్యామోహం కలగటం. 


*వాచికంగా (నోటిద్వారా) చేసే పాపాలు*  నాలుగు. అవి: 

 

పరుషంగా మాట్లాడడం,  అసత్యం పలకడం, చాడీలు, వ్యర్థ ప్రలాపాలు చేయడం, సమాజం వినలేని భాషను ఉపయోగించడం. 

 

*మానసికంగా (మనస్సుద్వారా) చేసే పాపాలు*  మూడు. అవి: 

పర ద్రవ్యాన్ని తస్కరించాలనే దుర్బుద్ధి,  ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం,  వ్యర్థమైన అహంకారాన్ని కలిగి ఉండడం. 


 ఈ రోజున గంగాస్నానం చేయడం వల్ల ఆ పాపాలన్నిటినీ గంగాదేవి హరిస్తుందని స్కాంద పురాణం చెప్పింది. వాస్తవానికి ఇది పది రోజులు ఆచరించవలసిన వ్రతం. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకూ అనుష్ఠించవలసి ఉంది. అందరికీ ఇలా చేయడం కుదరకపోవడంతో ఒక్క రోజుకే- అంటే చివరి రోజైన దశమి నాటికి పరిమితమైంది.



పవిత్రమైన దశపాపహర దశమి రోజున గంగా నదిలో స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. అది కూడా శివుని నివాస స్థానమైన కాశీ క్షేత్రంలోని *దశాశ్వమేథఘాట్లో* చేస్తే విశేషమైన ఫలితాన్నిస్తుందని పేర్కొంటోంది. అందుకు వీలుపడని పక్షంలో మరేదైనా నదిలో కానీ, కాలువలో లేదా చెరువులో కానీ, అదీ కుదరకపోతే ఇంటిలోని బావి వద్ద గంగా స్తోత్రం చేస్తూ, భక్తి శ్రద్ధలతోచేయాలి.


*మమ ఏతజ్జన్మ జన్మాంతర సమూద్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నాన మహం కరిష్యే*’- అని సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. 



స్నానం చేశాక- పితృ తర్పణాలు, నిత్యానుష్ఠానాలను యథావిధిగా నిర్వర్తించాలి. తరువాత తీర్థ పూజ చేయాలి. పూజలో ‘‘నమశ్శివాయైు, నారాయణ్యై, దశపాపహరాయైు, గంగాయైు!’’ అనే మంత్రం చెబుతూ నారాయణుణ్ణీ, రుద్రుణ్ణీ, బ్రహ్మనూ, సూర్యుణ్ణీ, భగీరథుణ్ణీ, హిమవంతుణ్ణీ ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించాలని శాస్త్రవచనం.



*దశపాపహర వ్రతం చేయడానికి వీలుకానివారు*  గంగామాత ద్వాదశనామాలు- ‘‘నందినీ, నళినీ, సీతా, మాలినీ, మహాపగా, విష్ణు పాదాబ్జ సంభూతా, గంగా,  త్రిపథగామినీ, భాగీరథీ, భోగవతీ, జాహ్నవీ, త్రిదశేశ్వరి’’ అనే పన్నెండు నామాలను తలచుకుంటూ అందుబాటులో ఉన్న జలవనరులలో మునకలు వేస్తే- గంగానదీ స్నానాన్నీ, వ్రతాన్నీ నిర్వహించగా ప్రాప్తించే ఫలానికి సమానమైన ఫలం పొందుతారని శాస్త్రం చెబుతోంది.


దశపాపహర వ్రతం చేసినా, నాడు స్కాంద పురాణయుక్తంగా గంగాస్తవం చేస్తూ గంగలో స్నానం చేసినా సకల సౌభాగ్యాలతోపాటు అష్టైశ్వర్యాలనూ... కరుణాంతరంగ... గంగామాత అనుగ్రహిస్తుందంటారు. ఇహలోక సుఖాలతో పాటు మోక్షం కూడా లభిస్తుందని స్కాంద పురాణ వచనం.🙏🌹🙏

అక్షర సూరీడు

 అక్షర సూరీడు అడుగో వస్తున్నాడు

పెత్తందారీ గుండెల్లో పిడుగై

పేద కార్మిక కర్షక వర్గ ప్రజల ఆశా జ్యోతి యై

శ్రమ శక్తికి బాసటగా

అగ్ని జలపాతమై ఎగుస్తూ

శ్రమ దోపిడీని నిరసిస్తూ

చే జారని గెలుపుకై

చేయి చేయి కలుపు కుంటు

మును ముందుకు పయనిస్తూ

దేశ పురోగతికి పురోగ మిస్తూ

మునుముందు పయనించ మని

శ్రమైక్య జీవన సౌందర్యాన్ని చాటిన వాడు

సుత్తి,కొడవలితో పాటు సహజీవనం

చేసి

బాధా సర్ప దస్టులకు ఆరాధ్య దైవమై

కడకు శ్రీ శ్రీ అంటే చైతన్యానికి సంకేతం

శ్రీ శ్రీ అంటే సదా అంబరాన ఎగిరే

అరుణ పతాకం

శ్రీశ్రీ అంటేనే ఓ  అగ్నికణం

అంటూ ఈ జగతికి చాటిన వాడు

అందుకే అరుణ పతాకాన నింగిన

నక్షత్రమై ఎగసాడు

అంబరాన్ని చుంబిద్దామని

తన యశస్సు తో....


వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీకి  అరునాక్షర నివాళులు.


దోస పాటి.సత్యనారాయణ మూర్తి.

9866631877

తలుపులు

 తలుపులు

----------- 


మాట గొంతును గదిలో

ఎవరో గట్టిగా నొక్కేసినట్టున్నారు

తలుపు తెరుచుకుని వచ్చిన మౌనం 

బోరవిరుచుకు తిరుగుతోంది

నిశ్శబ్దపు దేవిడీలో 


పలుకు కరువైపోయిన 

బతుకు బరువైపోయిన పరిస్థితిలో

భావాలూ ఉద్వేగాలూ

కళ్ళజంటను ఆశ్రయించాయి 

కదలికల నాట్యంతో బహిరంగమవ్వాలనీ

పెదవులపై వాలిపోయాయి

వంపులతో వణుకులతో వ్యక్తమైపోవాలనీ 


ఓ తలుపు మూసుకుంది, సరే..!

మరో రెండు తెరుచుకున్నాయి, గమనించారా..?



        ...... శ్రీధర్ చౌడారపు (19.06.2021)

నాన్నే దైవము

 ఫాథర్స్ డే సందర్బంగా... 

శీర్షిక :నాన్నే దైవము 

రచన : గోగులపాటి కృష్ణమోహన్ 


నాన్నగారి యాదిలో


నాన్నే కద నాదైవము

నాన్నే కదనాకుదిక్కు నాన్నే నడకౌ 

నాన్నే మరిమా నేస్తము

నాన్నే సర్వస్వమెపుడు నాన్నయె గతియౌ


తండ్రేకదపోషకుడిల

తండ్రేకద రక్షకుండు తండ్రేహితు డౌ

తండ్రేకద సన్మిత్రుడు

తండ్రేకద మార్గదర్శి ధైర్యము కృష్ణా



అడుగు అడుగు లోన నతిజాగురూకతో 

పెంచి పెద్ద చేయు మంచి మనిషి 

నడత నేర్పి నన్ను నడిపించు మార్గాన  

ఘనుడు నాన్న త్యాగ ధనుడు నాన్న


✍🏼 గోగులపాటి కృష్ణమోహన్ 💐

చక్రమునకు

 మానవ దేహంలో నాడులు 72000 యని దీనికి శ్రీ చక్రమునకు పోలిక. 8 కోణములు, 8 దళములు, 8 మూర్తుల కలయిక గాయత్రీ/ లలితా రెండును వకే రూపం. యిది నవావరణ  యని కూడా కలదు. 8 కోణములుగల చక్రమునకు బిందువుతో గూడి నవావరణ. 1.బిందువు, 2.అధోకోణము,3.ఊర్ధ్వ కోణము, 4.వృత్తము, 5.చతురస్రము, 6.ఊర్ధ్వకోణ గత మైన చతురస్రము,7.వృత్తము, 8.చతురస్రము ,9 వ ఆవరణ పైన తెలిపిన 8 తో కూడినది.యివి కోణగతమైన 8 ఆవరణలు. దీనికి 8 దళములుగల పద్మం. దీనితో 16 కళలు. వీనికి 8 మూర్తులు, త్రిమూర్తులు,ముగ్గురు ఐదు గురు దేవతలు. సావిత్రి, గాయత్రీ, మహాదుర్గ మహాలక్ష్మి, మహాసరస్వతులతోగూడిన 24 పూర్ణమైన శ్రీచక్రం పూర్వక గాయత్రీ రూపంలో గల లలితా స్వరూపము. దీనిని 24 ×3 72 తో 72౦౦౦ నాడులకు అన్వయమై యున్నది దేహం. రూపమును యిట్లు భావన చేసి లలితా పారాయణ/గాయత్రీ మంత్ర పారాయణ చేయుట

 వక్కొక్క నామము పారాయణ వలన ప్రతీ నాడీ వేయి 1000 నాడుల శక్తితో గూడిన స్వభావము, అనగా అనేకత్వము సూచించుచూ అనంతమైన శక్తి దేహములో వుత్పన్నమగును. మూల స్వభావము యిదియే.యిదే మేరువుకూడా. 7 వ ఆవరణ వృత్తాకారంలో జలమయము మీన తత్వము. సృష్టికి మూలతత్వం. 8 వ ఆవరణ చతురస్రము కూర్మమని సాధనకు, అగ్నిచైతన్యమునకు కూర్మమే సాధనము.భూమిని కూర్మమే భరించుతత్వము. 24 అక్షరముల గాయత్రీ స్వరూపమే లలిత కూడా. లలితా పారాయణ గాయత్రీ మంత్రము వకే శక్తి. గాయత్రీ శక్తి తెలియదు. దాని ప్రకృతి లక్షణమే లలితా రూపము. ఎవరికి ఏది అవలంబించవచ్చునో దానిని సాధన చేసి తరించవచ్చును. గాయత్రి నిర్గుణస్వరూప శక్తి . లలిత గుణ స్వరూపము శక్తి. పరమేశ్వర పరమేశ్వరీ తత్వము రెండింటిదీ  దీని మూలము ప్రకృతి యని జీవమని తెలియును. వీటికి మంత్రములవలన ఆపాదించిన ఆయా  మూర్తులను భావన చేసి పారాయణ/ జపంగాని  చేయవలెను. అప్పుడు గాని మంత్ర/ పారాయణ శక్తిని తెలుసుకొనుట జరుగదు. మనలోయున్న అనంతమైన శక్తిని చైతన్య పరచుచయే ధ్యానమని సాధనయని తెలియుచున్నది. దీనికి ముందు లలితా పారాయణ మౌనంగా మూర్తిని ధ్యానించుచూ  చేయవలెను. సాధనవలననే సమస్తము తెలియును. తెలుసుకుంటూనే వుందాం.ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..


*కపాలమోక్షం..*


*(అరవై నాలుగవ రోజు).*


శ్రీ స్వామివారు దేహ త్యాగం చేశారు కనుక..ఇక జరగవలసిన ఏర్పాట్ల గురించి శ్రీధరరావు గారు, శ్రీ స్వామివారి సోదరులు చర్చించుకుంటున్నారు..శ్రీ స్వామివారి ఆఖరి సోదరుడు పద్మయ్యనాయుడుకు శ్రీ స్వామివారు చెప్పిన విధంగా చేద్దామని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు..


సమయం రాత్రి 11 గంటలు కావొచ్చింది..ఇంతలో ఎవ్వరూ ఊహించని విధంగా ఒక సంఘటన జరిగింది..


శ్రీ స్వామివారి శరీరం లోంచి..ఒక పెద్ద శబ్దం వినబడసాగింది..దూరం నుంచి ఒక మోటార్ సైకిల్ వస్తున్న శబ్దాన్ని పోలివుంది..ముందుగా ఎవ్వరూ ఆ శబ్దం శ్రీ స్వామివారి శరీరం నుంచి వస్తున్న సంగతిని పసిగట్టలేదు..ఎవరో మోటార్ సైకిల్ మీద వేస్తున్నారేమో అనే భ్రమ లో వున్నారు..కానీ రెండు నిమిషాల కాలం గడిచేసరికి..ఆ శబ్ద నాదం ఉధృతంగా మారింది..అప్పటికి అందరూ తేరుకొని..శ్రీ స్వామివారి దేహం వైపు చూసారు..నాభి ప్రాంతం నుంచి మొదలైన ఆ శబ్దం..క్రమంగా ఊర్ధ్వంగా శిరస్సు పై భాగానికి  ప్రాకిపోయింది..ఇలా దాదాపు 5నిమిషాల పాటు జరిగింది..అందరూ ఆశ్చర్యంగా స్థాణువుల్లా నిలబడిపోయారు..


ఎంత ఉధృతంగా శబ్దం వచ్చిందో..ఒక్కసారిగా ఆ శబ్దం ఆగిపోయింది..ఆ మరునిమిషంలోనే.. శ్రీ స్వామివారి శిరస్సు పై మధ్యభాగం నుంచి..రక్తం ధారగా కారసాగింది..అదే సమయానికి ఆశ్రమం బైట ఉన్న వ్యక్తులకు..ఆశ్రమం పై భాగం నుంచి ఒక నీలి రంగు జ్యోతి..పై కెగసి..ఆకాశం లో కలిసిపోవడం కనిపించింది..ఆ నీలి రంగు జ్యోతి మొగలిచెర్ల గ్రామం లో ఉన్న వ్యక్తులూ చూడగలిగారు.. ఆశ్రమం లోపల ఉన్న శ్రీధరరావు దంపతులకు..శ్రీ స్వామివారు కపాలమోక్షం పొందారు అని అర్ధం చేసుకున్నారు..అప్పటి దాకా శ్రీ స్వామివారు తన శరీరం లో తన ప్రాణాన్ని నిలిపివుంచారని వాళ్లకు అవగతం అయింది..


శ్రీధరరావు ప్రభావతి గార్లు అందరితో చర్చించి..శ్రీ స్వామివారి పార్థివ దేహాన్ని..శ్రీ స్వామివారు కోరుకున్న విధంగా..వారు ముందుగానే నిర్మించుకొని..తపస్సు ఆచరిస్తున్న నేలమాళిగ లోనే ఉంచి సమాధి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు..శ్రీ పద్మయ్యనాయుడు తో శ్రీ స్వామివారు ముందుగానే ఆ విధి విధానాలు తెలియచేసి వున్నారు కనుక..ఎవ్వరికీ ఆ విషయం లో ఎటువంటి సందేహమూ కలుగలేదు..తెల్లవారేవరకూ వేచి చూసి..సమాధి చేద్దామని నిర్ణయం తీసుకున్నారు..ఉదయానికి శ్రీ స్వామివారి దేహాన్ని..ఆ నేలమాళిగ లో..ఉత్తరాభిముఖంగా పద్మాసనం వేసుకున్న స్థితి లోనే ఉంచి..పై భాగాన్ని సిమెంట్ తో మూసివేశారు..


అతి చిన్న వయసు లోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని..కఠోర సాధన చేసి..అవధూత అంటే...ఇలా ఉండాలి..ఇలా ఆచరించాలి..అని మార్గదర్శనం చేసి..కేవలం ముప్పై రెండు సంవత్సరాల ప్రాయం లోనే..ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్రీ స్వామివారు..శ్రీ దత్తాత్రేయుడిని ఆరాధించి..తనను కూడా దత్తాత్రేయుడి గానే పిలువమని ఆదేశించి..దత్త తత్వానికి ఓ సంపూర్ణత తీసుకొచ్చారు..మాలకొండ పుణ్యక్షేత్రం లో తపస్సు ఆచరించినందునా...ఆ లక్ష్మీనృసింహుడి మీద ఉన్న అపార భక్తి ప్రపత్తుల కారణంగా..ఒక్క శనివారం నాడు మాత్రం..తన సమాధి దర్శనం వద్దనీ..మిగిలిన రోజుల్లో తనను దర్శించవచ్చనీ..తెలియచేసారు..ఈనాటికీ ఆ నియమం పాటించబడుతున్నది..


తమకు శ్రీ స్వామివారు పరిచయం అయిన నాటి నుంచీ..తమ జీవితాలను ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించి..తమకు అపారమైన జ్ఞాన బోధ చేసిన ఆ మహనీయుడిని దగ్గరుండి సమాధి చేయడం..శ్రీధరరావు ప్రభావతి గార్ల జీవితంలో మరచిపోలేని ఒక ముఖ్య ఘట్టం..ఇలా చేయవలసి వస్తుందని ఆ దంపతులు ఊహించని పరిణామం..


శ్రీ స్వామివారి ఆశ్రమం..దత్తక్షేత్రంగా రూపాంతరం చెందడం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

పరిషేచన ఏమిటి

 #ఈ పరిషేచన ఏమిటి? అన్నం తినే ముందు తినే పళ్ళెం చుట్టూ అలా మంత్రం చదివి నీళ్ళేందుకు చల్లి అలా మెతుకులు నోట్లో వేసుకుంటున్నారు? 


ఇలా కంచం చుట్టూ నీళ్ళు పొయ్యడం వలన చీమలు దోమలు మనం తినే ఆకు మీదకు రావు, కంచంలోకి రావు. 


ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.

ఇలా భోజనం ముందు పరిషేచన చెయ్యడంలో

ఒక పెద్ద రహస్యం దాగి వుంది. 

మనం తినే ప్రతీ మెతుకు మీదా మన పేరు రాసి ఉంది అంటారు పెద్దలు. అది మనకు ప్రాప్తం ఉండబట్టే అన్నం తినగలుగుతున్నావు, అరాయించుకోగలుగుతున్నావు.  ఒక బ్రాహ్మణుడు సాత్వికాహారం పరిశుద్ధంగా తీసుకుని తనలోని సాత్త్విక శక్తిని ఉద్దీపింపచేసుకోవాలి.

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినే మనం మన ప్రాణం నిలబెట్టుకోగలుగుతున్నాము. శక్తిని సంపాదించి పనులు చెయ్యగలుగుతున్నాము. ఇలా మనలోని అన్నం అరగాలన్నా, అన్నం శక్తిగా మారాలన్నా జఠరం సరిగ్గా పని చెయ్యాలి. ఇలా చేస్తున్న ఈ జీర్ణవ్యవస్థ మనకు దేవుడు పెట్టిన భిక్ష. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. 

“”అహం వైశ్వానరో భూత్వాప్రాణినాం దేహమాశ్రితః ! ప్రాణాపానస మాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ !! (5-14)””

అంటే: నేనే ప్రాణాపానసంయుక్తమైన వైశ్వానరుడు అనే అగ్ని రూపములో సర్వప్రాణుల శరీరములయందుండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును.

ఆయన మనలో ఉండి అగ్నిరూపంలో మన ఆహారాన్ని జీర్ణం చేసి మనకు శక్తిని ఇస్తున్నాడు.మనలో దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నవారికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏమి కావాలి. 


మడిగా వంట చెయ్యడం కూడా ఒక యజ్ఞం, ఇంటి ఇల్లాలు శుచి శుభ్రత పాటిస్తూ తనను, తన పరిసరాలను శుచిగా ఉంచుతూ ఆ అగ్నిభట్టారకుని సహాయంతో ధర్మంగా సంపాదించిన దినుసులతో, కూరగాయలతో వంట చేస్తుంది. మడిగా ఉంటూ కేవలం భగవదారాధన తన మనస్సంతా నింపుకుని చేసిన వంట ముందుగా ఆ భగవంతునికి నివేదించి వీరు తింటారు. వంట చేసేవారి మానసిక స్థితి ఆ తినే వారి మానసిక స్థితిమీద ప్రభావం చూపుతుంది అని నిన్న మొన్న ఒక గొప్ప university వారు కనుక్కున్నారు.  ఇది మనం ఎప్పటినుండో ఆచరిస్తున్న ఒక సదాచారం. 


మరి భోజనం చెయ్యడమో? అది కూడా ముమ్మాటికీ యజ్ఞమే. ఇక ఆ భోజనాన్ని భుజించేవారు కూడా తాను తింటున్న ఆహారాన్ని లోనున్న ఆత్మారాముని సంతృప్తి పరుస్తున్నానని, లోన అగ్ని రూపంలో ఉన్న వైశ్వానరుడికి (జఠరాగ్ని లో హవిస్సు వేసినట్టు మనం మన భోజనం అందిస్తే ) యజ్ఞంతో పరిషేచన చేసి భోంచేస్తారు.

మనం తింటున్న ఆహారం కూడా ఒక పూజ,

ఒక యోగం. మనలో ఉన్న దేవునికి మనం హవనం చేస్తున్నానని నమ్మి తింటే అది కూడా పూజే. అందుకే కంచం ముందు కూర్చున్నప్పుడు ఇతర విషయాలు మాట్లాడకుండా కేవలం భోజనం మీద మనస్సు లగ్నం చేసి తినమని ఆయుర్వేదం చెబుతుంది. మనం భోజనం

ఒక పూజలా చేస్తే మనలో ఉన్న ఆ వైశ్వానరుడు త్రుప్తి చెంది మనకు తగిన శక్తినిచ్చి ఆయుష్షుని అభివృద్ధి చేస్తాడు. 


మన తర్వాతి తరాలకు చెప్పవలసిన విషయం చెప్పేవిధంగా చెబితే తప్పక గౌరవించి పాటిస్తారు.

ఇది మనందరి కర్తవ్యం.

మహారాజ్ జై సింగ్ ప్రభాకర్

 మహారాజ్ జై సింగ్ ప్రభాకర్

1920 లో ఇంగ్లాండ్ పర్యటించారు.


ఒక మామూలు వ్యక్తిలా అక్కడ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఆయనను రోల్స్ రోయ్స్ షోరూంలోని కార్ ఆయనను ఆకర్షించింది 

కొనాలన్నా ఆశతో వివరాలు కనుక్కోవాలని షోరూంలొకి వెళ్లగా 

అక్కడ పనివారు ఇది ఒక సాధ సీదా పేద దేశస్థుడైనటువంటి భారతీయుడు కొనే అంత తక్కువ కాదు , అని మన భారతదేశం గురించి చాల చులకనగా మాట్లాడి ఈయనను అవమానించి అక్కడ నుండి తరిమేశారు

ఆ తరువాత ఆయన తాను బస చేసియున్న హోటల్ కు వెళ్లి రాజులా దుస్తులు ధరించి మళ్ళీ షోరూం చేరుకున్నారు 

ఇప్పుడు ఆయనకు ప్రభుత్వ లాంచనాలంతో ఎర్ర తివాచీతో స్వాగతం పలికి పుష్పగుచ్చని అందించారు అపుడే అవమనించినా అక్కడి పనివారు ముందు 

వాయిదాలు లేకుండా ఒకే మొత్తంలో అంతా డబ్బులు చెల్లించి 6 కార్లను కొనేశారు 

అవి మన భారతదేశానికి చేరుకోగానే వాటిని మన దేశంలో వీధులలోని చెత్తను శుభ్రపరిచే వాహనాలుగా ఉపయోగించాలని తన నాయకులకు ఆదేశాలు జారీచేశారు 


కాలగమనంలో ఆ మాట ఈ నోటా ఆ నోటా పాకి ప్రపంచం అంత తెలిసింది 

యూరోప్ అమెరికా వంటి దేశాల్లో ఎవరైనా ఈ రోల్స్ రోయ్స్ కార్ కొన్నానని గొప్పలకు పోతే 

ఆ కార్ ఆ అది భారతదేశంలో చెత్త బండి అని హేళన చేసే వరకు దిగజారిపోయింది 

దాంతో ఆ కార్ల కొనుగోలు తగ్గిపోవడం ఆ యాజమాన్యానికి కారణం తెలియడంతో 


ఆ యాజమాన్యం రాజా విజయసింగ్ గారికి ఒక లేఖను పంపారు 

మీరు మా కార్లతో చేత్త ను తీయడం ఆపేయండి 

అందుకు బహుమానంగా మరో 6 కార్లను మీకు మేము ఉచితంగా పంపిస్తాం అని 


అందుకు రాజు గారు ఇలా సమాధానం ఇచ్చారు 

అయ్యా నాకు మీ కార్లపైనా ఎటువంటి కోపం లేదు 

మీ పని వారు నా దేశాన్ని ఒక చెత్త లా మాట్లాడి తీసిపారేసారు ఆ కోపం తోనే మీ కార్లను నా దేశంలో చెత్తను తీయడానికి ఉపయోగించాను 


మొదటా మనిషిని మనిషిగా గౌరవించడం మీ పనివారికి నేర్పించండి అని సమాధానంగొ తిరిగి మరలా లేఖ పంపారు రాజు గారు..


తెల్లదొరలకు అప్పట్లోనే గడ్డిపెట్టిన గొప్పతనం కదా ఈగాధ 

మన భారతదేశ చరిత్ర లోనే.


జై భారత్🇮🇳 జై హింద్

Mathematical FACTs!

 *Mathematical FACTs!*


Did you know ???


👉a, b, c, d are not used in spelling from 1 to 99.

And.....

👉d is first used in ‘Hundred’.


👉 a, b, c are not used anywhere in spelling from 1 to 999.

And...

👉a is first used in ‘Thousand’.


👉 b, c is not used anywhere from 1 to 99,99,999.

And......

👉c is first used in ‘Crore’.


👉 b is not used anywhere from

1 to 999,999,999.

👉b is first used in ‘Billion’.


*Mathematical informative FACTs !*

గుండె జబ్బులు= ఆయుర్వేద - అర్జునరిష్ఠ

 గుండె జబ్బులు= ఆయుర్వేద మందు - అర్జునరిష్ఠ 

ఈ రోజుల్లో 50 సంవస్తరాలు దాటిన వారికి తరచూ చూస్తున్న ఆరోగ్య సమస్య గుండె జబ్బులు. విచిత్రం ఏమిటంటే స్త్రీలలో పురుషులకు లేని కొన్ని హార్మోనులు ఉంటాయి కాబట్టి వారికి గుండె జబ్బులు రాకుండా వారి శరీరమే వారిని కాపాడుతుంది. కానీ దురదృష్టం ఏమిటంటే ప్రస్తుతం మనం తీసుకునే కలుషిత ఆహరం వల్ల స్త్రీలు కూడా గుండె జబ్బుల బారిన తరచూ  పడటం చూస్తున్నాం. 

గుండె జబ్బు అనగానే మనం రోజు వేనేది .B,P,  రక్త పోటు నిజానికి ఇది గుండెకు సంబందించిన వ్యాధి  అని మనం అనుకుంటున్నాం కానీ రక్తపోటు ప్రతీ  వారికి ఉంటుంది. దాని విలువలు ఎక్కువ అయితే దానిని Hypertension అని అంటారు ఇక్కడ మనం కొద్దిగా రక్త పోటు అంటే ఏమిటో తెలుసుకుంటే మనకు ఈ విషయం బోధ పడుతుంది. మన శరీరం లోని అన్నిఅవయవాలు వాటి వాటి నిర్ణిత పనులు చేయాలి అంటే వాటికి శక్తి  కావలి. ఆ శక్తి రక్తం (మంచి రక్తం) ద్వారా వస్తుంది.  అంటే శరీరంలో ప్రతి అణువు అణువు ఉత్తేజితం కావాలంటే అక్కడకు రక్తం సరఫరా కావలి. రక్తం సరఫరా కావలి అంటే రక్తాన్ని పంపు చేసే పరికరంకావలి ఆ పరికరమే గుండె. (ఇంకా వివరంగా వేరొక వ్యాసంలో విశదీకరించ ప్రయత్నిస్తాను) గుండె కొట్టుకోవటం వలన శరీరంలో రక్త ప్రసరణ జరుగుతుంది. రక్త పోటుని మనం కొలిస్తే అది 120/80 Hg  అనే రీడింగ్ ఉంటే ఆ మనిషి పూర్తి ఆరోగ్య వంతుడు అని అనవచ్చు కాకుండా ఈ రీడింగ్ అంతకంటే తక్కువగా ఉంటే Low Blood pressure అని అదే ఈ రీడింగు చాలా ఎక్కువగా ఉంటే Hypertension అని అంటారు. ఇటువంటి అసామాన్య పరిస్థితుల్లో మనకు అనేక ఇబ్బందులు కలుగుతాయి తక్కువ pressure ఉంటే రక్తం శరీరానికి అందక ఇబ్బందులు వస్తాయి ఎక్కువ pressure  ఉంటే రక్తనాళాలు ఆ వత్తిడికి లోనయి ఆవేశము, అసహనం, మొదలగు వాటితో మొదలై, పక్షవాతము, గుండె పోటు వరకు దారితీస్తాయి. కాబట్టి మనం ఎల్లప్పుడూ మన రక్త పోటును స్థిరంగా ఉంచుకోవాలి. 

ఇతర గుండె సంబంధ వ్యాధులు: chest pain,cardiac problems  like congestive heart failure, heart blockage, angina pectoris, myocardial infarction, ischemic cardiac myopathy, mitral regurgitation (which is a backflow of blood caused by the failure of the heart's mitral valve to close tightly) and asthma.

ఈ రోగాల పేర్లు మనం తరచూ వింటున్నాము. వీటిలో ఏ ఒక్క రోగం సోకినా లక్షలలో డాక్టర్లకి హాస్పెటళ్ళకి ఖర్చు చేయవలసి వస్తున్నది అన్నది కాదని ఎవరైనా చెప్పగలరా. 

రక్తనాళాలలో కొవ్వు పేరుకొని పుడుకొని పొతే వారికి గుండె పోటు వస్తుందని గుండె పోటు వస్తే మనిషి అకస్మాత్తుగా చనిపోతాడని మనందరికీ తెలుసు. మన ఆధునిక వైద్యంలో రక్త నాళాలు పుడుకొని పోయిన వన్న విషయం నిర్ధారణ చేయటానికి Angiogram పరీక్ష చేస్తారు.  దాని గూర్చి చుడండి 

Angiograms are generally safe, complications occur less than 1% of the time. However, there are risks with any test. Bleeding, infection, and irregular heartbeat can occur. More serious complications, such as heart attack, stroke, and death can occur, but they are uncommon

అంటే Angiogram పరీక్షలో రోగికి పైన పేర్కొన్న రిస్కులు ఉంటాయి అన్నమాట. చూసారా సీరియస్ కంప్లైంట్ ఏమిటంటే heart attack, stroke, and death దీనిని బట్టి అది యెంత ప్రమాదకరమో తెలుస్తుంది. 

ఇటువంటి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవటం మనకు అవసరమా ఒక్కసారి ఆలోచించండి మనకు ఆంగ్లంలో ఒక సామెత వున్నది (A stitch in time saves nine) అదేమంటే సరైన సమయంలో తీసుకొనే నిర్ణయం భవిష్యత్తులో జరిగే పెను ఆపదను తొలగిస్తుంది. ఇవ్వన్నీ నేను చెప్పటానికి కారణం ఇప్పుడు మనం ఒక విపత్కర పరిస్థితిలో వున్నాము అదే కలుషిత ఆహరం. మనం తినే అన్ని ఆహార పదార్ధాలు కూడా కలుషితమే. గొంగళిలో తింటూ వెంట్రుకలు వస్తున్నాయి అన్నట్లుగా వుంది ప్రస్తుత పరిస్థితి. మనకు సులభంగా ఆరోగ్య సంరక్షణ చేసుకోవటానికి మన మహర్షులు మనకు అందించిన దివ్య జ్ఞ్యానం ఆయుర్వేదం. నేను మీకు ఇప్పుడు ఒక చక్కటి ఆయుర్వేద మందుని తెలుపుతున్నాను. దానిపేరే అర్జునరిష్ట  ఈ మందు మనకు సిరపు రూపంలో లభిస్తుంది. 

అర్జునరిష్ట  సిరపు 450 మిల్లి లీటర్ల పరిమాణము కలిగిం సీసాలలో లభిస్తుంది. అనేక ఆయుర్వేద కంపెనీలు ఈ మందుని తయారు చేస్తున్నాయి. మీకు పతంజలి మందు మిగిలిన వాటి కన్నా చవుకగా, నాణ్యంగా దొరుకుతుంది. ఏ కంపెనీ మందు వాడాలి అన్నది మీ నిర్ణయం. 

అర్జునరిష్ట  సిరపు ఎవరు యెట్లా వాడాలి: ఇది ద్రవ రూపంలో వున్న ఔషధము. దీనిని 50 సంవత్సరాలు నిండిన వారైనా లేక గుండె జబ్బుతో బాధ పడే వారు అందరు సురక్షితంగా ఉపయోగించ వచ్చు. దీని వాడకం వలన రక్త పోటు మొదలుకొని పైన పేర్కొన్న అన్నిరకాల రుగ్మతలతో బాధ పడే వారు వాడ వచ్చు.  ఈ మందుని భోజనం చేసిన తరువాత సీసా మీద పేర్కొన్న డోసు ప్రకారము మీ మీ సమస్య తీవ్రత అనుసరించి తీసుకోవచ్చు . రక్తపోటు వున్న ప్రతి వారు తప్పక ఈ మందు సేవనం చేయాలనీ నేను సూచిస్తాను. 

అర్జునరిష్ట  సిరపు సైడ్ అవేక్ట్లు::  ఈ ముందుకి తీవ్రమైన దుష్పరిణామాలు ఏవి లేవు చాలా మటుకు సురక్షితం. అయినా కూడా ఎప్పుడు మోతాదు మించి ఏ మందు వాడ రాదు. కొన్ని సామాన్యు మైన దుష్ ఫలితాలు ఉండవచ్చు కానీ అవి పెద్దగా అపకారం చేయవు. 

మిత్రులారా మీరు ఏ రకమైన గుండె జబ్బుతో బాధ పడుతున్నా  తక్షణమే ఈ మందుని వాడండి. మీకు Bi pass surgery (బైపాస్ సర్జరీ ) చేయాలి లేకపోతె చనిపోతారు అని డాక్టర్లు సూచించిన రోగులకు కూడా ఈ మందు బాగా పనిచేస్తుందని నేను చెప్పటం కాదు వాడి మేరె నిర్దనించుకోండి. లక్షల రూపాయలు వెచ్చించి ఆపరేషనులు చేయించుకోవటం ముఖ్యమా లేక అతి తక్కువ ఖర్చుతో మీ ఇంట్లో ఉండి ఆరోగ్యం చేకూర్చుకోవటం ముఖ్యమా అన్నది మీ నిర్ణయానికే వదిలి వేస్తున్నాను. 

గమనిక: తీవ్రమైన గుండె జబ్బులతో బాధ పడేవారు మంచి ఆయుర్వేద డాక్టరు సలహాతో ఔషధ సేవనం చేసి ఆరోగ్యవంతులు కాగలరు. 

మరో  ఔషధంతో మరల కలుద్దాము. 

మీ 

బుధజన విధేయుడు 

భార్గవ శర్మ